
రాష్ట్రానికి చెందిన ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సత్యయేసుబాబు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెంది
న ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి సత్యయేసుబాబు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. 2010 బ్యాచ్‌కు చెందిన యేసుబాబు రైల్వే డీఐజీ విధులతోపాటు, పోలీసు శిక్షణ కేంద్రం అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఆయన కేంద్ర సర్వీస్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు అనుమతి కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఇకపై సీఆర్పీఎఫ్ డీఐజీగా ఆయన దేశానికి సేవలందించనున్నారు.