
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tata Sierra EV: భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్ యూవీలలో టాటా సియెర్రా ఒకటి. ఇప్పుడు ఈ ఎస్ యూవీ తన ఎలక్ట్రిక్ అవతార్ లో భారత మార్కెట్లోకి అరంగేట్రం చేసింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ కారు.. ఇప్పుడు రూడ్లపై రయ్ రయ్ అంటూ దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. పవర్ ఫుల్ ఇంజన్, అత్యాధునిక సాంకేతికత, ఆకట్టుకునే డిజైన్, లాంగ్ డ్రైవింగ్ రేంజ్, మల్టిపుల్ బ్యాటరీ ఆప్షన్స్ తో టాటా సియోర్రా ఈవీ కేవలం ఒక కొత్త ఎలక్ట్రిక్ ఎస్ యూవీ మాత్రమే కాదు.. ఇదొక ఐకానిక్ పేరు తన ఎలక్ట్రిక్ అవతార్ లో అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక ధర విషయానికి వస్తే.. కొత్త టాటా సియోర్రా ఈవీ రూ. 18.79లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఈ ఎస్ యూవీ కోసం కంపెనీ జూన్ 30వ తేదీ నుంచి అధికారికంగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా డెలివరీలు జులై 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త టాటా సియోర్రా ఈవీ ఫీచర్లు ఈవీ కొనుగోలుదారుల అంచనాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూద్దాం. టాటా సియారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ తో లభిస్తుంది. 75 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జీంగ్ చేస్తే 665 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. రియల్ టైమ్ లో 500 కిలోమీటర్లు పైనే ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 63కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ లో సింగిల్ ఛార్జీతో 565 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. 120 కిలోవాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించి కేవలం 15 నిమిషాల్లోనే 250కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా ఛార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. సియారా ఈవీ క్వాడ్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మోటార్ 175 కిలోవాట్స్ పవర్, 240ఎన్ఎం టార్క్, ఫ్రంట్ మోటార్ 103 కిలోవాట్ పవర్, 164ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తంగా 504 ఎన్ఎం పీక్ టార్క్ లభిస్తుందని కంపెనీ తెలిపింది.
ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, పవర్డ్ బూట్ లిడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు అనేక ఇతర ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. బేస్ వేరియంట్లో 18-అంగుళాల వీల్స్ ఉంటాయని, అయితే ఉన్నత శ్రేణి వేరియంట్లలో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ లభిస్తాయని కంపెనీ పేర్కొంది.
ఈ ఎస్యూవీ సేఫ్టీ విషయంలో కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. దీని ఆవిష్కరణ కార్యక్రమంలో, కంపెనీ ఈ ఎస్యూవీ యొక్క క్రాష్ టెస్ట్ వీడియోను ప్రదర్శించింది. ఒక ట్రక్కును ఢీకొట్టి, ఆ తర్వాత వెనుక నుండి వేగంగా వస్తున్న మరో ట్రక్కును ఢీకొంటుంది. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలోని డమ్మీ ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, కారు బ్యాటరీకి ఎలాంటి నష్టం జరగలేదు డోర్లు సులభంగా తెరుచుకున్నాయి. దీనికి 5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ లభిస్తుందని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.