
అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరో ఫిల్మ్ బ్యానర్ల మీద బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో విహాన్ తెరకెక్కించిన చిత్రం ‘హ్యాంగ్మెన్’. వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్.
రావు నిర్మించిన ఈ మూవీకి కమ్రాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకి ఉదయ్ గుర్రాల కెమెరామెన్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు. ఈ మూవీ జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈక్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి పద్మశ్రీ డా. బ్రహ్మానందం, నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్మెన్’ అనే టైటిల్ చూసి ఈ ఈవెంట్‌కు రావాలని నిర్ణయించుకున్నాను. దీన్ని ఎలాంటి ఉద్యోగం అనాలో కూడా నాకు తెలీడం లేదు. ఉరి తీసే వ్యక్తి జీవన విధానం ఎలా ఉంటుంది? అని అనుకుంటూ ఉంటాను. అతని మానసిక వ్యథ ఎలా ఉంటుంది? అనే దాన్ని విహాన్ చక్కగా పట్టుకున్నాడు. అసలు ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం. బ్రహ్మాజీ మంచి విషయం ఉన్న నటుడు. ఎలాంటి పాత్రనైనా పండించగల సత్తా ఉన్న నటుడు. అతనికి ఇంత వరకు సరైన కారెక్టర్ పడలేదే అని నేను అనుకుంటూ ఉంటాను. ‘హ్యాంగ్మెన్’ ట్రైలర్లో బ్రహ్మాజీ అద్భుతంగా కనిపించారు. ఈ చిత్రంతో బ్రహ్మాజీ అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. సన్నీ పాత్ర కూడా బాగుంది. ఇలాంటి కథను చెప్పిన విహానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘హ్యాంగ్మెన్’ గొప్ప చిత్రం అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్మెన్’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నేను తీసిన ‘ఇండియా ఫైల్స్’ ఐదు భాషల్లో రాబోతోంది. సినిమా అంటే ఏంటి? నటన అంటే ఏంటి? అనేది నాకు నా సినిమా ప్రయాణంలో తెలిసింది. ‘హ్యాంగ్మెన్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సక్సెస్ మీట్‌కి మళ్లీ వస్తాను’ అని అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్మెన్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. అందుకే ఈ రోజు ఇక్కడకు ఇలా వచ్చాను. ఇలాంటి సబ్జెక్ట్‌ని ఒప్పుకున్న నిర్మాత అజయ్‌కి హ్యాట్సాఫ్. విహాన్ గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకోబోతోన్నారు. ఇలాంటి యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న బ్రహ్మాజీ గారికి థాంక్స్. బ్రహ్మాజీ గారు ఎన్నెన్నో గొప్ప పాత్రలను పోషించారు. ఈ సినిమాతో ఆయన అద్భుతం చేయబోతోన్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ .. ‘‘మా కోసం వచ్చిన బ్రహ్మానందం గారికి, నందినీ రెడ్డి గారికి థాంక్స్. ఇలాంటి కథకు నన్ను అనుకున్న విహాన్‌కి ఎప్పుడూ రుణ పడి ఉంటాను. మేం కష్టాలు పడుతున్న టైంలో అజయ్ గారు మాకోసం వచ్చారు. సినిమా పట్ల ఆయనకున్న అభిరుచికి హ్యాట్సాఫ్. జూలై 3న సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇలాంటి కంటెంటె్ను ఎంకరేజ్ చేస్తున్న సన్ నెక్ట్స్ ప్రతినిధి మా ఎమ్మెస్ నారాయణ కూతురు శశి గారికి థాంక్స్’ అని అన్నారు.
అజయ్ మైసూర్ మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్మెన్’ కథ నాకు చాలా నచ్చింది. గంటగంటకి మన దేశంలో క్రైమ్ పెరుగుతూనే ఉంటోంది. విహాన్ మేకింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆర్టిస్టుల పర్ఫామెన్స్ గొప్పగా ఉంటుంది. ఇందులో ఎంతో మంచి సామాజిక సందేశం ఉంటుంది. జూలై 3న సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
విహాన్ మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్మెన్’లోని ఎలిమెంట్స్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. మనం చేసే ఉద్యోగాల్లా ‘హ్యాంగ్మెన్’ జాబ్ ఉండదు. కొత్త సబ్జెక్ట్, కంటెంట్ వచ్చినప్పుడల్లా ఆడియెన్స్ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. అందుకే ‘హ్యాంగ్మెన్’ కథను రాసుకున్నాను. నా టీం (ఫ్రెండ్స్) వల్లే సినిమా ఎలా చేయాలి, ఎలా తీయాలి అన్నది నేర్చుకున్నాను. వీళ్ల దగ్గరే నేను అంతా నేర్చుకున్నాను.. వీళ్లే నా గురువులు. కథ చెప్పిన తర్వాత బ్రహ్మాజీ గారు నన్నెంతో ఎంకరేజ్ చేశారు. ఆయనెంతో పాజిటివ్‌గా ఉంటారు. నా మొదటి హీరోగా ఆయనెప్పుడూ నాకు గుర్తుంటారు.
ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ .. ‘నందినీ రెడ్డి గారి వల్లే ‘మెయిల్’ సినిమా వచ్చింది. శ్రీకాంత్, రూపక్ ఇలా మేమంతా ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులం. విహాన్ ఆఫీసులోనే మేం పని చేసుకునే వాళ్లం. విహాన్‌కి సమాజంపై చాలా అవగాహన ఉంటుంది. చిన్న ఆలోచనతో ఈ ‘హ్యాంగ్మెన్’ పుట్టింది. బ్రహ్మాజీ గారు లేకపోతే ఈ ‘హ్యాంగ్మెన్’ లేదు. మాకు సహకరించిన బ్రహ్మాజీ గారికి థాంక్స్. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
పరేషాన్ డైరెక్టర్ రూపక్ మాట్లాడుతూ .. ‘బ్రహ్మాజీ గారి సపోర్ట్ లేకపోతే ‘హ్యాంగ్మెన్’ వచ్చేది కాదు. సినిమా తీయడం కంటే.. నచ్చిన సినిమా తీయడం ఇంకా కష్టం.. మంచి మూవీ తీయడం ఇంకా కష్టం. విహాన్ ఇవన్నీ దాటేశాడు. ఉదయ్ మంచి టెక్నీషియన్. సన్నీకి మంచి సక్సెస్ రాబోతోంది. మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
రియల్ హ్యాంగ్మెన్ పవన్ మాట్లాడుతూ .. ‘విహాన్ చాలా మంచి వ్యక్తి. ఐదేళ్ల క్రితం వచ్చి ఓ సినిమా చేయాలని అన్నారు. అందుకే నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన బ్రహ్మానందం గారు, నందినీ రెడ్డి గారికి థాంక్స్. విహాన్ నాకు ఓ సారి ‘హ్యాంగ్మెన్’ లైన్ చెప్పారు. నాకు చాలా నచ్చింది. ఇలాంటి ప్రాజెక్ట్‌ని సపోర్ట్ చేసిన బ్రహ్మాజీ గారికి, అజయ్ గారికి, సన్ నెక్ట్స్‌కి థాంక్స్’ అని అన్నారు.
ఎడిటర్ కార్తిక్ మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్మెన్’ను షార్ట్ ఫిల్మ్‌గా తీస్తానని విహాన్ ముందుగా చెప్పాడు. ఆ తరువాత అది సినిమాగా మారింది. ఈ మూవీ ద్వారా నాకెన్నో ఆఫర్లు వస్తున్నాయి’ అని అన్నారు.
శశికిరణ్ నారాయణ్ మాట్లాడుతూ .. ‘‘హ్యాంగ్మెన్’ మూవీని సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగుంది. మాకోసం బ్రహ్మానందం గారు, నందినీ గారు రావడం ఆనందంగా ఉంది. సన్ నెక్ట్స్‌లో మున్ముందు మరింత మంచి, కొత్త కంటెంట్‌ను తీసుకు రాబోతోన్నామ’ని అన్నారు.
నటుడు సన్నీ మాట్లాడుతూ .. ‘మేమంతా కలిసి ‘హ్యాంగ్మెన్’ అనే మంచి సినిమాని చేశాం. జూలై 3 నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.