
హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు (Yadagirigutta Temple Trust Board) ఏర్పాటైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా ఎంఎస్ఎన్ గ్రూప్ ఛైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డిని నియమించింది. సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, సి. విజయ రాజం, తూళ్ల విజయేందర్, పి.ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమనేని, ఎం. రాఘవేంద్రరావు, డి.లక్ష్మినారాయణ నాయక్ ఉన్నారు.
ట్రస్ట్ బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, వైటీడీఏ వైస్ ఛైర్మన్, ఆలయ ఈవో, ప్రధాన అర్చకుడు ఉంటారని ప్రభుత్వం పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్ రామ్‌నగర్‌కు చెందిన విష్ణు ప్రసాద్ వృత్తిపరంగా చిన్నపిల్లల వైద్యుడు.