
Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు పండగే పండగ.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రైతన్నలకు సీఎం రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులు విడుదల అయ్యాయి.
వానాకాలం సాగు కోసం ఎదురుచూసే రైతులకు పెట్టుబడి సాయంగా ఈ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ఆయన బటన్ నొక్కి తొలి విడత ఫండ్స్ విడుదల చేశారు.
ఈసారి 3 విడతల్లో మొత్తం రూ.9వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి విడతగా 2 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.2,482.02 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.
మొత్తంగా 41.37 లక్షల మంది రైతులు ఈ విడతలో లబ్ధిపొందారు. వీరిలో ఒక ఎకరం లోపు భూమి ఉంటే 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు, అలాగే ఒకటి నుంచి 2 ఎకరాల లోపు భూమి ఉంటే 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు జమ అయ్యాయి.
Read Also : Duvvada Srinivas : దువ్వాడ మిస్సింగ్ మిస్టరీకి తెర.. ఒడిశాలో లొకేషన్..? 3 వారాల గడువు కోరిన లాయర్!
అయితే, మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో ముందే చెక్ చేసుకోండి. వెంటనే మీ బ్యాంక్ అకౌంట్, మొబైల్కు వచ్చిన SMS లేదా బ్యాంకింగ్ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.
రైతు భరోసా జాబితాలో ఇంకా పేరు నమోదు కాని వారికి కూడా ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జూన్ 15లోపు కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందిన రైతులు లేదా ఇప్పటివరకు పథకంలో రిజిస్టర్ చేసుకోని అర్హులైన రైతులు జూలై 5లోపు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)కి అవసరమైన సర్టిఫికేట్లను సమర్పించి అప్లయ్ చేసుకోవచ్చు.
అర్హత ఉన్న ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఈ చర్యలు చేపడుతోంది. మీకు డబ్బులు జమ అయ్యాయో లేదో ఇప్పుడే చెక్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మీకు ఇంకా రైతు భరోసా డబ్బులు పడకపోతే ఆందోళన అవసరం లేదు. మీ స్థానిక ఏఈవోను సంప్రదించి వివరాలు తెలుసుకోండి. అవసరమైతే గడువులోపు మళ్లీ మీ అప్లికేషన్ పూర్తి చేయండి.