
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు.
Jun 30 2026 6:02 PM | Updated on Jun 30 2026 6:31 PM
కోలీవుడ్ నటి ఖుష్బు సుందర్ కుమార్తె అవంతిక పెళ్లి ఇటీవలే గ్రాండ్‌గా జరిగింది. గోవాలో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, త్రిష, తమన్నా, రాధికా , సుహాసిని, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఈ పెళ్లికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తన కూతురి మెడలో వరుడు తాళి కడుతున్న సమయంలో ఖుష్బు సుందర్ ఫుల్ ఎమోషనల్‌గా కనిపించింది. ఈ వీడియోలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై ఏడ్చేసింది. వారి చిన్న కుమార్తె ఆనందిత కూడా అక్క పెళ్లిని చూసి ఎమోషనలైంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా.. ఖుష్బు- సుందర్‌ల పెద్ద కూతురు అవంతిక సుందర్.. శ్రవణ్ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుక జూన్ 25న గ్రాండ్‌గా జరిగింది.
‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)
గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)
రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)
నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!
2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!
YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్
కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!