
Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!
Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!

Success Story: ఆ ఇద్దరే.. కేవలం రూ.4 లక్షల పెట్టుబడి.. 10 నెలల్లో రూ. 2 కోట్ల ఆదాయం..!

Success Story: అర ఎకరం నుండి 40 ఎకరాల వరకు.. రూ.80 లక్షల సంపాదన.. ఓ మహిళా రైతు సక్సెస్ స్టోరీ!

‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా. మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని లోకలే మేలు... ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69

రిటైర్ అయిన తరువాత ఏం చేయాలి? కాలక్షేపం ఎలా? మరీ ముఖ్యంగా డబ్బులు ఎలా మధనపడే వారికి కేరళకు చెందిన రిటైర్డ్ టీచర్ రేమాబాయి జీవితం స్ఫూర్తినిస్తుంది. ఇంతకీ ఆమె చేశారు? తెలుసుకుందాం ఈ కథనంలో. కేరళలోని కొల్లమ్‌కు చెందిన రేమాబాయి జువాలజీ టీచర్‌గా,హెడ్‌మిస్ట్రెస్‌గా 30 ఏళ్ల పాటు విద్యారంగంలో సేవలందించారు. 2022 మే 31న ఆమె పదవీ విరమణ చేశారు. ఆమె భర్త, ఒక రిటైర్డ్ సీనియర్ బ్యాంక్ మేనేజర్. అలాగే సర్జన్లైన ఆమె కుమారుడు, కోడలు ఢిల్లీలో పనిచేస్తున్నారు. అయితే అదే ఏడాది తల్లి మరణం, ఒంటరితనం వల్ల ఏర్పడిన మానసిక వేదనను జయించడానికి ఆమె తన ఇంటి పెరటి స్థలంలో మొక్కల పెంపకం ప్రారంభించారు. అలా డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టారు. దీని మీద బాగా పరిశోధించి 'మలేషియన్ కింగ్' (Malaysian King) రకానికి చెందిన రెడ్ డ్రాగన్ ఫ్రూట్‌ను ఎంచుకున్నారు. కేవలం 1,750 చదరపు అడుగుల పెరటి స్థలంలో 90 కాంక్రీట్ స్తంభాలు, పాత టైర్ల సాయంతో 360 మొక్కలతో సాగు ప్రారంభించారు. ప్రారంభంలో 360 మొక్కలు నెలకు రూ. 50వేలకు మించి ఆదాయాన్ని అందించగా,ఆ తరువాత ఆదాయం సుమారు రూ. 1.5 లక్షలకు పెరిగింది. ఈ ఫలితాలు, మరింత భూమి కొనకుండానే తన సాగును విస్తరించడానికి ఆమెను ప్రోత్సహించాయి. ఫలితంగా నెలకు రూ. 4 లక్షలు ఆర్జించేస్థాయికి చేరుకున్నారు. డ్రాగన్ ఫ్రూట్ -మిద్దెతోట మిద్దెపై మట్టిలేని సాగు (Soil-less Cultivation): పెరట్లోనే కాకుండా తన ఇంటి మిద్దెపై (Terrace) బరువు కాకుండా ఉండటానికి మట్టికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన కంపోస్ట్, ఆవు పేడను డ్రమ్ములు/బారెళ్లలో నింపి మొక్కలను పెంచడం ప్రారంభించారు. సేంద్రీయ పద్ధదితో ఆమె సక్సెస్‌ను అందుకోవడం విశేషం. పాత వంటగది వ్యర్థాలు, ఆకులు, కొబ్బరి/పనస వ్యర్థాలు మరియు చేపల వ్యర్థాలతో ఫ్రిష్ అమినో యాసిడ్స్ వంటి 15 రకాల ద్రవ ఎరువులను తయారు చేసి

Dakshinamurthy Worship : కేవలం అక్షర జ్ఞానమే కాదు, జీవితంలో ఏ రంగంలోనైనా పూర్ణ విజయాన్ని, ఉన్నత స్థాయిని సాధించాలన్నా దక్షిణామూర్తి ఆరాధన అత్యంత విశిష్టమైనది. పరమశివుని జ్ఞాన అవతారమైన దక్షిణామూర్తి సకల విద్యలకు, సమర్థతకు, సనాతన గురు పరంపరకు ఆద్యుడు. మౌన వ్యాఖ్యానంతోనే సనకాది మునుల సంశయాలను పటాపంచలు చేసి జ్ఞానోదయం కలిగించిన ఈ దివ్య స్వరూపం వెనుక ఉన్న నిగూఢ అంతరార్థం, మంత్రశాస్త్రం విశ్లేషించిన 16 దక్షిణామూర్తి స్వరూపాల ప్రాశస్త్యం నేటి సమాజానికి ఎంతో ఆవశ్యకం. మౌన వ్యాఖ్యానం... సనకాది ఋషుల బ్రహ్మజ్ఞానం బ్రహ్మదేవుని మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం కోసం ఎంతగానో తపస్సు చేశారు. తమ సందేహ నివృత్తికై పరమేశ్వరుని ఆశ్రయించగా, స్వామివారు ఒక మర్రిచెట్టు కింద యోగభంగిమలో ఆసీనులయ్యారు. ఎటువంటి శబ్దాలు, ప్రవచనాలు లేకుండా నిశ్శబ్దంగా 'మౌన వ్యాఖ్యానం' ద్వారానే ఆ నలుగురు మహర్షులకు పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించారు. అనుభవ పూర్వకమైన ఆ దివ్య జ్ఞానానికి దక్షిణామూర్తి ప్రతీకగా నిలిచారు. దక్షిణామూర్తి అనగా 'దక్షిణ' అనగా సర్వ సమర్థత కలిగినవాడు అని అర్థం. దుఃఖాలకు మూలకారణమైన అజ్ఞానాన్ని నాశనం చేసే పరమ దయా దాక్షిణ్యమూర్తి ఈయన. సాంబశివుడికి ఎడమవైపు పార్వతీదేవి లేని ఏకైక జ్ఞాన స్వరూపమిది. ఒక కాలుతో అపస్మార పురుషుడిని అంటే అజ్ఞాన రాక్షసుడిని తొక్కిపట్టి, మరో కాలును మడిచి, అక్షమాల, పుస్తకం, జ్ఞానముద్ర, వీణను ధరించి దర్శనమిస్తారు. తత్వదృష్టిలో దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి ఒక్కటే అయినప్పటికీ, ఉపాసనా, వ్యవహార దృష్టిలో విభిన్న రూపాలుగా భావిస్తారు. ఇదే 'భిన్నత్వంలో ఏకత్వం'. మంత్రశాస్త్రం ... 16 దక్షిణామూర్తి స్వరూపాలు మంత్రశాస్త్రం, ఆగమ ప్రమాణాల ప్రకారం దక్షిణామూర్తి స్వామివారు 16 దివ్య రూపాల్లో ఉపాసకులకు ఫలాన్ని అందిస్తారు. శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸ హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి

అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు. ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఆయనే మసయోషి సన్. సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు. జపాన్‌లో ఉంటున్న సన్‌కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్

సంఖ్యాశాస్త్రం ప్రకారం 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6గా పరిగణిస్తారు. వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సృజనాత్మకతతో పాటు మంచి సంపాదన సామర్థ్యం కలిగి ఉంటారని నమ్మకం. ఇంటర్నెట్ డెస్క్: సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 6, 15 లేదా 24 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 6గా పరిగణిస్తారు. ఈ సంఖ్యకు శుక్రుడు అధిపతిగా భావిస్తారు. ప్రేమ, అందం, కళలు, సౌకర్యాలు, సంపద వంటి అంశాలకు శుక్రుడిని ప్రతీకగా చెబుతారు. మూల సంఖ్య 6 ఉన్నవారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, ప్రశాంతమైన స్వభావం, స్నేహపూర్వక ప్రవర్తన కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కుటుంబం, స్నేహితులు, బంధాలకు వీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. తమకు ఇష్టమైన వారికి కష్టసమయంలో అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. అలాగే కళలు, అందం, సృజనాత్మకతపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెబుతారు. మూల సంఖ్య 6 ఉన్నవారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. బాధ్యతగా వ్యవహరించడంతో పాటు కొత్త ఆలోచనలను అమలు చేయడంలో ముందుంటారు. ఫ్యాషన్, కళలు, సంగీతం, సినిమా, హోటల్ రంగం, విద్య, ఇంటీరియర్ డిజైన్, వ్యాపారం, నిర్వహణ వంటి రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు. వీరికి సంపాదించే సామర్థ్యం బాగానే ఉంటుందని చెబుతారు. అయితే విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడటం వల్ల కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అందుకే బడ్జెట్‌ను పాటించడం, పొదుపుపై దృష్టి పెట్టడం వీరికి ముఖ్యమని సూచిస్తారు. ప్రేమ, వివాహం విషయంలో మూల సంఖ్య 6 ఉన్నవారు నిజాయతీగా, ప్రేమగా, అంకితభావంతో ఉంటారని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. తమ జీవిత భాగస్వామి సంతోషానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని నమ్మకం. బంధాలను నిలబెట్టుకోవడానికి శ్రద్ధ చూపడంతో పాటు.. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలంటే మూల సంఖ్య 6 ఉన్నవారు ఖర్చుల విషయంలో నియంత్రణ

అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుందన్నారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు తెరపైకి వస్తున్న వేళ డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2028 ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో పోటీచేసే అవకాశాలపై మాట్లాడిన అగ్రరాజ్య అధ్యక్షుడు.. ఆ విషయమై ఇప్పుడే చర్చ అక్కర్లేదని సమాధానాన్ని దాటవేశారు. 'హెగ్సెత్ అద్భుతంగా పనిచేస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు ఇది తొందరపాటు చర్య అవుతుంది. ముందుగా నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలను పూర్తి చేయాలి' అని ట్రంప్ అన్నారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా రెండు పర్యాయాలు మాత్రమే కొనసాగే అవకాశమున్న ట్రంప్.. 2029లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆయన 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' ఉద్యమాన్ని ముందుకు నడిపించే తదుపరి నేత ఎవరన్న దానిపై రిపబ్లికన్ పార్టీలో చర్చ జోరందుకుంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నా.. తాజాగా ఆ లిస్ట్‌లో హెగ్సెత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఐయోవా స్టేట్ ఫెయిర్‌లో రిపబ్లికన్ల తరఫున హెగ్సెత్ ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు బలం చేకూర్చినట్టైంది. అయితే ఈ వార్తలను హెగ్సెత్ ఖండించారు. అవి '100 శాతం అవాస్తవం' అని సోషల్ మీడియాలో పేర్కొన్నారాయన. హెగ్సెత్ గతంలో ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేశారు. అనంతరం ఫాక్స్ న్యూస్ ఛానల్లో టీవీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ భవితవ్యంపై ట్రంప్ మరింత ఆసక్తికరంగా స్పందించారు. 'ప్రస్తుతం ఆయనకు సైన్యం, సైనికుల సంక్షేమం తప్ప మరేదీ ముఖ్యం కాదు' అని వ్యాఖ్యానించారు. మరోవైపు 2028 అధ్యక్ష ఎన్నికల కోసం పలువురు నేతలు

భాగ్యశ్రీ బోర్స్ ని చూస్తే చాలు 'అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా అని పాడని వాళ్ళు ఉండరు. అలాంటిది అభిమానుల గుండెలో ఎంతటి కవిత్వం తన్నుకొస్తూ ఉంటుందో చెప్పక్కర్లేదు. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలం మొత్తాన్ని చెప్పేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా అఖిల్ అక్కినేని తో కలిసి 'లెనిన్' తో విజయాన్ని అందుకుంది. భాగ్యశ్రీకి తొలి విజయం కూడా.. లెనిన్ విజయం తర్వాత భాగ్యశ్రీ కి టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ ఆలస్యానికి వెనుక ప్రధాన కారణం భాగ్యశ్రీ స్క్రిప్ట్ ఎంపికలో చూపిస్తున్న జాగ్రత్తలేనని, తొందరపడి సినిమాలు ఒప్పుకోవడం కంటే, బలమైన క్యారెక్టర్స్ ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోందట. ఇండస్ట్రీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న ప్రకరాం రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త ప్రాజెక్ట్స్ లో చరణ్ కి జోడిగా భాగ్యశ్రీ కనిపించబోతుందనే సమాచారం అయితే వినిపిస్తూనే ఉంది. అదే జరిగితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పోస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఖాళీ లేనట్టే. విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం.. ఫిల్మ్ ఫెడరేషన్, రఘు వర్గానికి సుమలత వార్నింగ్.! సందీప్ సరోజ్, సాత్విక జంటగా ప్రారంభమైన ‘వేట’.!

నేడు.. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మదిన వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు అభిమానులు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ కాకా టైటిల్ పోస్టర్ కూడా విడుదల కావడం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. 2027 జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందీ మూవీ. బాబీ కొల్లి దర్శకుడు. కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ కింద వెంకట్ కే నారాయణ దీన్ని నిర్మిస్తోన్నారు. పాన్ ఇండియా మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.చిరంజీవి పుట్టినరోజు వేడుకలు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. మెగాస్టార్‌కు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడారు. టాలీవుడ్ కు చిరంజీవి ఓ దిక్సూచి లాంటివారని కొనియాడారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా తన ప్రతిభ, అంకితభావం, అకుంఠిత దీక్షతో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారని ప్రశంసించారు. తెలుగు సినీ రంగంలో రాణిస్తున్న ఎంతో మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు చిరంజీవిని చూసి స్ఫూర్తి పొందారని, ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు. మెగాస్టార్ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయమని కొడాలి నాని వ్యాఖ్యానించారు.పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ కు అల్టిమేట్ పవర్స్: సర్వశక్తిమంతుడు: భారత్ కు సవాళ్లుసినిమా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరానికి చిరంజీవి సినీ ప్రయాణం ఓ పాఠ్యపుస్తకం లాంటిదని కొడాలి నాని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో సినిమాలు చేయడం ఒక్క మెగాస్టార్‌కే సాధ్యమని, వెండితెరపైనే కాకుండా, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ బ్యాంక్ వంటి సామాజిక సేవా

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రవితేజ హీరోగా నటించి 'అమర్ అక్బర్ ఆంటోని' పరాజయం పాలైనా ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు అదే బ్యానర్ లో సోలో హీరోగా 'ఇరుముడి'తో రవితేజ గ్రాండ్ విక్టరీని అందుకున్నాడు. మాస్ మహరాజా రవితేజకు మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ సక్సెస్ ను అందించింది. అలానే మైత్రీ మూవీ మేకర్స్ కూ రవితేజ ఓ గ్రాండ్ విక్టరీని అందించాడు. ఎందుకంటే రవితేజ సినిమా సక్సెస్ సాధించి సంవత్సరాలు గడిచిపోయింది. అలానే 'పుష్ప -2' తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. మధ్యలో వచ్చి తమిళ చిత్రం 'డ్యూడ్' అక్కడ ఫర్వాలేదనిపించింది కానీ తెలుగులో పెద్దంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన 'ఆంధ్ర కింగ్ తాలూకా, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు రెండూ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో రవితేజతో చేసిన ద్విభాషా చిత్రం 'ఇరుముడి' హిట్ కావడం విశేషమే. ఆగస్ట్ 26న యశ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' వచ్చే వరకూ 'ఇరుముడి' స్వైర విహారం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి రోజే 'ఇరుముడి' రూ. 20 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన శని, ఆదివారాలతో ఈ సినిమా తేలికగా రూ. 50 కోట్ల నుంచి 60 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక సోమ, మంగళవారాల్లోనూ ఇదే జోరు కొనసాగితే... బుధవారానికి 'ఇరుముడి' తేలికగా వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. ఒక వేళ బుధవారం వచ్చే 'టాక్సిక్' అటూ ఇటూ అయితే... అది కూడా 'ఇరుముడి'కి కలిసొచ్చే అంశమే. 'టాక్సిక్'కు ఇప్పుడున్న ఇమేజ్ బట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ఆ సినిమాకు వెళ్ళడం కష్టమే. అప్పుడు వారందరికీ 'ఇరుముడి' బెటర్ ఆప్షన్ అవుతుంది. అదే జరిగే... 'ఇరుముడి' ఆ తర్వాత వారాంతానికి రూ. 200 కోట్ల గ్రాస్‌ను వసూలు

సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో రూ. 45 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో సక్సెస్ రన్ కొనసాగిస్తూ. ఇప్పుడు రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రెడీ అయ్యింది. ఒకప్పుడు థియేటర్లలో సినిమాను నిలబెట్టాలంటే బిగ్ స్టార్, భారీ బడ్జెట్, భారీ హైప్ తప్పనిసరి అన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ లెక్క కాస్త మారుతున్నట్టే కనిపిస్తోంది. ‘మా ఇంటి బంగారం’ రూ. 100 కోట్ల మార్క్ దాటగా అదే సమయంలో కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘డీసీ’ 14 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. అంటే స్టార్ పవర్ కంటే కంటెంట్, మౌత్ టాక్, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సంకేతం ఇది. మిడ్-బడ్జెట్ సినిమాలకు మళ్లీ థియేట్రికల్ మార్కెట్ పెరుగుతోందని ఈ సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి. కొరియన్ కనకరాజు’, చెన్నై లవ స్టోరీ ఎబోవ్ యావరేజ్ టాక్‌తో బాగానే రాబట్టింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు ఓటీటీకి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. వాళ్లకు నచ్చే సినిమా కనిపిస్తే ఇప్పటికీ టికెట్ కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి థియేట్రికల్ మార్కెట్లో మిడ్-బడ్జెట్ సినిమాలకు కూడా స్పేస్ ఉందనే నమ్మకం మేకర్స్‌లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్రెండ్‌ను చూసి “టాలీవుడ్లో ఇక ప్రతి సినిమా థియేటర్లలో ఆడుతుంది” అని చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమాల విజయానికి కంటెంట్‌తో పాటు మౌత్ టాక్, రిలీజ్ టైమింగ్, ప్రమోషన్, టికెట్ ప్రైసింగ్ కూడా కీలకం. బ్లాక్‌బస్టర్, డిజాస్టర్ అనే రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ‘డీసెంట్ సినిమా’ కూడా థియేటర్లో నిలబడగల మార్కెట్ మళ్లీ ఏర్పడుతోందా అంటే

వాస్తు శాస్త్రం ప్రకారం, మనం పడుకునే మంచం కేవలం విశ్రాంతి తీసుకునే ఫర్నిచర్ మాత్రమే కాదు, అది మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీకి కేంద్రం కూడా. మంచం చుట్టూ ఉండే వాతావరణం మన ఆరోగ్యం, నిద్రపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది స్థలం లేక మంచం కింద వస్తువులు పెడుతుంటారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మంచం కింద పెట్టడం వల్ల తీవ్రమైన నెగెటివ్ ప్రభావాలు పడతాయి. మరి ఆ వస్తువులేంటో తెలుసుకోండి. మంచం కింద మొబైల్ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ వైర్లు, పాత బ్యాటరీలు, పవర్ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అస్సలు పెట్టకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంచం కింద ఇలాంటి వస్తువులు ఉంచడం అశుభంగా భావిస్తారు. ముఖ్యంగా పనిచేయని లేదా ఉపయోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను మంచం కింద నిల్వ చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని నమ్మకం. అంతేకాకుండా, పాత బ్యాటరీలు లేదా దెబ్బతిన్న ఛార్జర్లు మంచం కింద ఉంచడం భద్రత పరంగా కూడా మంచిది కాదు. చాలామంది ఇంట్లో స్థలం సరిపోకపోవడం లేదా వెంటనే అవసరం లేదనే కారణంతో పాత న్యూస్‌పేపర్లు, పనికిరాని రశీదులు, పాత బిల్లులు, కాగితాలు, మ్యాగజైన్లు వంటి వాటిని మంచం కింద కుప్పగా పోస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం మంచం కింద ఇలాంటి అనవసరమైన కాగితాలను నిల్వ చేయడం మంచిది కాదు. మంచం అనేది విశ్రాంతి తీసుకునే ప్రదేశం కాబట్టి, దాని చుట్టూ శుభ్రత, క్రమబద్ధత ఉండటం ముఖ్యమని వాస్తు నమ్మకం. మంచం కింద పాత, చిరిగిన లేదా ఉపయోగించని బట్టలు దాచే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. వాస్తు ప్రకారం ఇలాంటి బట్టలు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, వాతావరణాన్ని భారంగా మారుస్తాయని నమ్మకం. ఇవి మనశ్శాంతిని తగ్గించడంతో పాటు, జీవితంలో అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడేలా చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట అవసరం వస్తుందని చాలామంది మందులను మంచం

చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి?చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి? Prasanna Yadla 19 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి గెలిచినప్పుడు మీరు ముందుగా మీ కష్టకాలంలో నిలిచిన వారిని గుర్తు చేసుకోవాలి. మీ కష్టకాలంలో నిలిచిన వారిని అలాగే మీ తల్లి దండ్రులు, ఇంకా గురువులు చేసిన సహాయాన్ని కూడా గురుచేసుకోవాలి తల్లి దండ్రులు మీ గెలుపు వెంటనే అసలు కోపం తెచ్చుకోకుండా మీ విజయానికి కారణమైన వారిని కలవాలి. అసలు కోపం తెచ్చుకోకుండా ఇంకా మీ కష్టాల్లో తోడు నిలిచిన స్నేహితులను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎన్నటికీ మర్చిపోకూడదు. ఇంకా మన తప్పులను మన ముందు చెప్పిన వారిని ఈ టైమ్ లో మీరు గౌరవించాలి ఈ టైమ్ లో మీరు గౌరవించాలి. నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

2026 ఆగస్టు 22వ తేదీన జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన సంఘటన కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. ఆగస్టు 22వ తేదీన రాత్రి 7 గంటల 32 నిమిషాలకు గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి సంచారం చేస్తాడు. సింహరాశిలోకి బుధ సంచారం జరిగే సమయానికే అప్పటికే అందులో ఉన్న సూర్యుడు బుధుడి తోటి సంయోగం జరిపి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు రానున్నాయి.బుధాదిత్య రాజయోగంఈ బుధాదిత్య రాజయోగం కారణంగా బుద్ధి, వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు, వ్యాపారం, ఉద్యోగం మరియు ఆర్థిక వృద్ధికి అనుకూలంగా పనిచేస్తుందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు అధికారాన్ని సూచిస్తే, బుధుడు తర్కం, కమ్యూనికేషన్ మరియు వ్యాపార నైపుణ్యాలకు ప్రతీకగా ఉన్నాడు. వీరి కలయిక వల్ల అనేక మందికి అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు.కుంభరాశిముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ కాలం చాలా శుభకరం. వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఆదాయ వృద్ధి మరియు సామాజిక గౌరవం పెరగవచ్చు. ఈ సమయంలో కుంభరాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. కుంభరాశి వారి సంపదలు పెరుగుతాయి. సామాజికంగా పురోగతి కనిపిస్తుంది.మేషరాశిమేష రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట సమయంగా ఉంటుంది. బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారి వర్తక వ్యాపారాలు లాభాల బాటలో ఉంటాయి. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.కర్కాటక రాశికర్కాటక రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అన్ని విధాల శుభయోగం. ఈ సమయంలో కర్కాటక రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు, వ్యాపార విస్తరణ సాధ్యమవుతుందితులారాశితులా రాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఆదాయం

అవకాశం ఇస్తే చాలు.. ఉచితంగానే పనిచేస్తానన్న ఓ భారతీయ యువకుడికి ఇప్పుడు అదే అవకాశం భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. అమెరికాకు చెందిన వ్యాపారవేత్త, సీఈఓ మిక్కీ హార్డీ తన సోషల్ మీడియా పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌కు చెందిన ఓ యువకుడు తొలుత ఎలాంటి జీతం వద్దని, తన సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు అవకాశం మాత్రమే కావాలని కోరాడని ఆయన తెలిపారు.హార్డీ ప్రకారం.. ఆ యువకుడికి ప్రస్తుతం కమిషన్ ఆధారంగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఔట్రీచ్, కంపెనీ మీడియా కార్యకలాపాల ద్వారా అతను తీసుకొచ్చే లాభంలో 20 శాతం అతనికి అందుతుంది. ఈ విధానంలో ప్రస్తుతం అతను నెలకు దాదాపు 5,000 డాలర్లు.. అంటే సుమారు రూ.4.7 లక్షలు సంపాదిస్తున్నట్లు హార్డీ వెల్లడించారు.యువకుడు తొలుత ఉచితంగా పనిచేయడానికి ముందుకు రావడాన్ని హార్డీ ప్రశంసించారు. తన సామర్థ్యంతో కంపెనీకి విలువను సృష్టిస్తానని నిరూపించుకోవాలన్నదే అతని ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం ఈ ఉద్యోగం తన జీవితాన్ని మార్చేసిందని, తన కుటుంబానికి కూడా ఎంతో సహాయపడుతోందని ఆ యువకుడు పలుసార్లు చెప్పినట్లు హార్డీ తెలిపారు.ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు కేవలం తాము కష్టపడి పనిచేస్తామని చెప్పడం కంటే.. ఏదైనా కంపెనీకి తమ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నిరూపించాలని హార్డీ సూచించారు. తమకు మెసేజ్ చేసి ఉద్యోగం అడిగేవారు కూడా ‘నేను హార్డ్ వర్కర్‌ను.. నాకు అవకాశం ఇవ్వండి’ అని మాత్రమే చెప్పకుండా, తాము ఏం చేయగలరో, కంపెనీకి అది ఎందుకు అవసరమో, అందుకు తమ వ్యూహం ఏమిటో వివరించాలని సూచించారు.అయితే ఈ

సాక్షి, ముంబై: బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న 'ఆవారాపన్ 2' మూవీతో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తున్న నటుడు సువిందర్ విక్కీ( Suvinder Vicky). బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఆవారాపన్ 2' లో అద్భుత నటనతో గుర్తింపు పొంది, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పదండి ఆయన బాలీవుడ్ జర్నీ ఎలాసాగింది, ఇంత సక్సెస్ ఎలా వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం. సినీ రంగంలో రాణించాలంటే నటన మీద ఆసక్తి ఉన్నంతనే సరిపోదు. ఎన్నో కష్ట నష్టాలు, అవమానాలు భరించాల్సి ఉంటుంది. అలా ఎంతోమంది నటులు ఏళ్ల తరబడి పోరాటం తరువాత రాణించినవారే. సువిందర్ విక్కీ సక్సెస్ స్టోరీ కూడా అలాంటిదే. ఆయన వెండితెర ఎంట్రీ అంత ఆషామాషీగా జరగలేదు. ఆరంభంలో పొట్టనింపుకోవడానికి చాలా కష్టపడ్డారు. ఇదీ చదవండి : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు బెంగాల్ కోర్టు షాక్ పంజాబ్‌కు చెందిన సువిందర్ విక్కీ సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన ప్పటికీ చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తి కలిగింది.పంజాబీ విశ్వవిద్యాలయం (పాటియాలా)నుంచి థియేటర్ మరియు టెలివిజన్‌లో ఎంఏ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కేవలం రూ.5,000 చేతిలో పెట్టుకుని ముంబైకి వచ్చారు. అయితే నెల రోజుల్లోనే ఆ డబ్బులు అయిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి పంజాబ్ వెళ్లాల్సి వచ్చింది. ముంబైలో ఉన్నప్పుడు కనీసం ఒక పూట భోజనానికి కూడా డబ్బు లేని క్లిష్ట పరిస్థితులను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో, పొట్టకూటి కోసం ఆయన కొంతకాలం ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా కూడా పాలసీలు విక్రయించారు. తిరిగి చాలాకాలానికి 50 ఏళ్ల వయసులో స్టార్‌డమ్‌ను సాధించారు. నటనలో అరంగేట్రం పంజాబ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, సువిందర్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడం ప్రారంభించారు. 2004లో 'దేస్ హోయా పర్దేస్' అనే పంజాబీ
Inspirational story: జీవితంలో ఎదురయ్యే కష్టాలు, పేదరికం ఎవరి భవిష్యత్తునూ నిర్ణయించలేవు అనేందుకు ప్రముఖ రియల్టర్ విజయ్ వర్మ (Vijay Varma) ప్రయాణమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రాజస్థాన్‌లోని ఒక చిన్న పల్లెటూరులో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, రోజుకు కేవలం రూ.3 కూలీకి వంట పాత్రలు తోమడం, రూ.8లకు ఇసుక తీసుకెళ్లడం వంటి పనులు చేశారు. కానీ, ఆయనలోని పట్టుదల, కృషి ఆయనను నేడు రూ.160 కోట్ల విలువైన కన్స్ట్రక్షన్ కంపెనీ అధినేతగా నిలబెట్టాయి. విజయ్ వర్మ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, వ్యాపారవేత్తగా ఆయన సాధించిన విజయం గురించిన ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.రోజుకు రూ.3 కూలీ నుంచి మొదలురాజస్థాన్లోని ఝుంఝుంను జిల్లా బిసావు గ్రామంలో అక్టోబర్ నెల 1978లో విజయ్ వర్మ జన్మించారు. 10 ఏళ్ల వయసులోనే తన తాతమ్మలు చనిపోయారు. ఆ మరుసటి ఏడాదిలోనే తన తండ్రిని సైతం కోల్పోయారు. దీంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. కుటుంబ భారం మొత్తం విజయ్ వర్మ తల్లిపై పడింది. ఆమె అడవి నుంచి ఎండుటాకులు, కట్టెలు సేకరించి కేవలం కొన్ని కిలోల పిండి కోసం వాటిని ఇచ్చేవారు.Read Also: ఛాయ్ బంక్: రూ. 50 వేలతో స్టార్ట్ చేసి.. 120 ఫ్రాంచైజీల స్థాయికి.. ఇద్దరు మిత్రుల సక్సెస్ స్టోరీకుటుంబ ఆర్థిక పరిస్థితిని చూసి 6వ తరగతిలోనే చదువును ఆపేసిన విజయ్ వర్మ పని కోసం తన అన్నతో కలిసి ముంబై, పుణే వంటి నగరాలకు వెళ్లారు. పుణే రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక వడాపావ్ బండి వద్ద గిన్నెలు తోముతూ రోజుకు రూ.3 సంపాదించేవారు. ఆ తర్వాత ఒక నిర్మాణ సంస్థలో ఇసుక రవాణా పని చేస్తూ రోజుకు రూ.8 దినసరి కూలీగా మారారు. ఆ తర్వాత థియోటర్లు, భవనాల నిర్మాణ పనుల్లో టైల్స్ వేయడం, ప్లాస్టరింగ్, ఆర్సీసీ పనులన్నింటినీ స్వయంగా నేర్చుకుని భవన నిర్మాణ
Babu Rao Success Story : జీవితంలో ఏమీ లేకుండా ఏదైనా సిటీకి రావడం, తినడానికి ఉండటానికి కూడా ఇబ్బందులు పడటం, తర్వాత ఏదైనా చిన్న పనితో ప్రారంభించి కోట్లకు కోట్లు సంపాదించడం ఇది సినిమాల్లో కనిపించే కథలా అనిపించినా హైదరాబాద్‌లో నిజంగానే జరిగిన ఒక వ్యక్తి ప్రయాణం. అవును హైదరాబాద్‌లో ప్రముఖ ఇరానీ చాయ్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన కేఫ్ నిలోఫర్ వెనుక ఉన్న ఏ. బాబు రావు ప్రయాణం ఇలాంటిదే. 1975 సంవత్సరంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన చేతిలో పెద్దగా డబ్బు లేదు. ఉద్యోగం కోసం టికెట్ లేకుండానే రైలులో హైదరాబాద్ చేరుకున్న ఆయనకు మొదట టెక్స్టైల్ షాపులో సేల్స్‌మెన్‌గా ఒక పని దొరికింది. ఇక ఉద్యోగం వచ్చిన వెంటనే ఉండటానికి ఇల్లు దొరకలేదు. దాదాపు 15 రోజుల పాటు ఫుట్‌పాత్‌పైనే నిద్రించిన ఆయన స్నానం చేసేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్‌ను ఉపయోగించేవారని తెలిసింది. అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రయాణం దాదాపు 5 దశాబ్దాల్లో కేఫ్ నిలోఫర్ అనే పెద్ద బ్రాండ్‌గా మారింది.టెక్స్టైల్ షాపు నుంచి రెస్టారెంట్ వరకుహైదరాబాద్ వచ్చిన తర్వాత బాబు రావు తొలుత టెక్స్టైల్స్ షాపులో సేల్స్‌మెన్‌గా చేరగా తర్వాత రెస్టారెంట్ ఉద్యోగంలో చేరారు. అక్కడే ఆయనకు సదరు వ్యాపారం ఎలా నడుస్తుంది. కస్టమర్లను ఎలా చూసుకోవాలి? రోజువారీగా నిర్వహణ ఎలా ఉంటుంది. ఇలా అన్ని విషయాలపై అవగాహన వచ్చింది. అదే సమయంలో ఒక కస్టమర్ ఆయన పనితీరును గమనించారు. కొత్తగా ప్రారంభమైన ఒక కేఫ్‌లో బాబు రావు బాగా పనిచేస్తారని భావించి అక్కడ ఉద్యోగం ఇప్పించారు. అదే కేఫ్ నిలోఫర్.ఇక బాబు రావు కేఫ్ నిలోఫర్‌లో తొలుత వెయిటర్‌గా చేరారు. అయితే ఆయన పని కేవలం కస్టమర్లకు చాయ్ ఇవ్వడంతోనే ముగియలేదు. అవసరమైనప్పుడు కేఫ్‌ను శుభ్రం చేయడం, పాత్రలు కడగటం వంటి పనులు కూడా చేసేవారు. పనేదైనా వెనుకాడకుండా చేయడం

నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా?నెమలి ఈక మహిమ నిజమా? పుస్తకంలో పెడితే మార్కులు ఎక్కువస్తాయా? Samatha 17 August 2026 Gen Z వారు ఎక్కువగా తమ పుస్తకంలో నెమలి ఈకలను పెట్టుకునేవారు. చాలా వరకు ప్రతి పిల్లల పుస్తకంలో ఈ నెమలి ఈకలు అనేవి ఉండేవి. అయితే చాలా మంది పుస్తకంలో నెమలి ఈకలు పెట్టుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మార్కులు ఎక్కువ వస్తాయి అనేవారు. మరి నిజంగానే పుస్తకంలో నెమలి ఈక పెడితే మార్కులు ఎక్కువ వస్తాయా? దీని గురించి పండుతులు ఏం చెబుతున్నారు అనేది ఇ ప్పుడు చూద్దాం. పుస్తకంలో నెమలి ఈక పెట్టడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు పండితులు. దీని వలన పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందంట. నెమలి ఈకలు కృష్ణుడికి, సరస్వతీ మాతకు చాలా ప్రీతికరం అంటారు. అందువలన ఈకలను పుస్తకంలో పెట్టడం చాలా మంచిదంట. దీని వలన జీవితంలోని అడ్డంకులు తొలిగిపోయి, చదువులో వెనకబడిన వారు కూడా మళ్లీ చదువులో రాణించే అవకాశం ఉన్నదం ట. పుస్తకంలో నెమలి ఈకను ఉంచడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగడంవలన అదృష్టం కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు పండ ితులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమన ించాలి. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

తెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవుతెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవు Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి మంచి చెడులను అర్థం చేసుకోలేని వాళ్ళకి సలహా ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీ మాటలను అసలు పట్టించుకోకపోవచ్చు ఇదే మిమ్మల్ని మరి ఇబ్బంది పెడుతుంది అసలు పట్టించుకోకపోవచ్చు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా ఏం చెప్పకండి. ఇంకా మీకు ఇబ్బందులు కూడా రావొచ్చు. మీకు ఇబ్బందులు కూడా మూర్ఖులకు సలహాలు ఇవ్వడం వలన సమయం వృథా అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు మూర్ఖులకు సలహాలు జీవిత భాగస్వామి చేసే తప్పు చేస్తే అది తన మీద కూడా పడుతుంది. జీవిత భాగస్వామి నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

కొత్త జంట ఆన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన మూవీ `షుషార్ పిట్టలు`. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఏసియన్ సురేష్ ఫిల్మ్స్ సంస్థలు విడుదల చేశాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు. ‘హుషారు పిట్టలు’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు) శ్రీహరి కొడుకు మేఘాంశ్ 'ఆస్మాన్' చిత్రం మోషన్ పోస్టర్ లాంచ్ (ఫొటోలు) హైదరాబాద్‌లో సందడి చేసిన నటుడు సోనూసూద్ (ఫొటోలు) ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం (ఫొటోలు) ‘విశ్వనాథ్ & సన్స్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) ట్వీట్ తో హార్మోజ్ ను స్వాధీనం చేసుకోలేరు.. ట్రంప్ కు ఇరాన్ కౌంటర్ ముద్రగడ కుటుంబ సభ్యులకు YSRCP నేతలు పరామర్శ చెన్నై లవ్ స్టోరీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? నల్లగొండ జిల్లా రూపా రెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్

తమిళ వర్సటైల్ నటుడు సూర్య వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇటీవల ‘వీరభద్రుడు’ (‘కరుప్పు’) చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. కరుప్పు ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ‘సింగమ్ 2’ బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం పట్టడం విశేషం. ‘కరుప్పు’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి అపూర్వ ఆదరణ పొందిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘కరుప్పు’ విజయం అందించిన జోష్‌లోనే తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కుటుంబ కథాంశంతో పాటు సూర్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఇలా కేవలం మూడు నెలల్లోనే రెండు భారీ హిట్లు కొట్టి తన పవర్ ఏంటో మరోసారి నిరూపించారు సూర్య. జస్ట్ రెండు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తుంది. తమిల్ కంటే కూడా తెలుగులో ఈ సినిమా అదరగోతుంది. శనివారం ఫస్ట్ షో, సెకండ్ షోస్ కు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఒకప్పడు వరుస ప్లాప్స్ చూసిన సూర్య ఇప్పుడు జస్ట్ 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసాడు
ఆచార్య చాణక్యుడి బోధనలు, సూత్రాలు నేటికీ ఆచరణీయంగా ఉండటానికి ప్రధాన కారణం.. నాటి కాలంలో మనుషులు ఎదుర్కొన్న పరిస్థితులే నేటి తరానికి కూడా ఏదో ఒక రూపంలో ఎదురవుతుండటమే. ముఖ్యంగా 'ఆత్మగౌరవం' (Self-Respect) విషయంలో చాణక్యుడు ఎంతో విలువైన సలహాలు ఇచ్చారు. ఆత్మగౌరవానికి , అహంకారానికి (Ego) మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. "నన్ను ఎవరూ తక్కువ చేయకూడదు" అనుకోవడం ఆత్మగౌరవం; "నేనే అందరికంటే గొప్ప, ఇతరుల్ని తక్కువ చేయొచ్చు" అనుకోవడం అహంకారం. చాణక్యుడి ఉద్దేశం ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడమే కానీ అహంకారంతో ప్రవర్తించడం కాదు. నేటి తరం తమ వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి చాణక్యుడు చెప్పిన 10 ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకుందాం.1. ఆత్మగౌరవం కోల్పోయి సాధించే విజయం వ్యర్థంసెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టి సాధించే ఎలాంటి విజయమైనా పూర్తిగా నిరుపయోగం. జీవితంలో ఏది సాధించినా, మన ఆత్మగౌరవం ఎల్లప్పుడూ అత్యున్నత స్థానంలోనే ఉండాలి.2. స్వాభిమానమే అతిపెద్ద బలంమనిషికి ఉన్న అన్ని శక్తుల్లోకి 'స్వాభిమానం' అత్యంత బలమైంది. ఏ రకమైన లాభం లేదా ప్రయోజనం కోసమైనా సరే దీనితో ఎప్పుడూ రాజీ పడకూడదు.3. అవమానం భరిస్తూ జీవించడం ఆత్మహత్యతో సమానంఅవమానాన్ని మౌనంగా భరిస్తూ జీవించడం వల్ల మనిషి అంతరాత్మ, మనోధైర్యం బలహీనపడతాయి. గౌరవానికి భంగం కలిగే చోట ఎప్పుడూ రాజీపడి బతకకూడదు.4. గౌరవం లేని చోట క్షణం కూడా నిలబడొద్దుఎక్కడైతే మీకు సరైన గుర్తింపు, గౌరవం లభించవో.. ఆ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అలాంటి చోట్ల ఉంటే మరింత న్యూనతాభావానికి గురికావాల్సి వస్తుంది.5. ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోండిఇతరుల్ని గౌరవించే ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి.ఎవరైతే తమను తాము ప్రేమించరో, గౌరవించుకోరో.. వారిని ఈ ప్రపంచం కూడా గౌరవించదు.6. కష్టాలనైనా భరించండి కానీ అవమానాన్ని కాదుజీవితంలో ఎన్ని కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు, కానీ అవమానపు గుటకలు మింగి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదు. కష్టం తాత్కాలికం, కానీ అవమానం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది.7

ఒక సినిమా విజయాన్ని కేవలం మొదటి వారాంతపు వసూళ్లు, అమ్ముడైన టికెట్ల సంఖ్యతోనే అంచనా వేయడం సరికాదని ప్రముఖ నటుడు సూర్య అభిప్రాయపడ్డాడు. తన తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన, సినిమా విజయానికి ఉండాల్సిన అసలైన నిర్వచనాన్ని వివరించాడు.ప్రస్తుత కాలంలో సినిమా విజయాన్ని కేవలం అంకెలతోనే కొలుస్తున్నారని, అయితే అది సంపూర్ణమైన కొలమానం కాదని సూర్య పేర్కొన్నాడు. "ఒక సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎంత లోతుగా నిలిచిపోయింది అనేదే ముఖ్యం. సినిమా వీక్షించిన తర్వాత ప్రేక్షకులు పొందే భావోద్వేగాలు, ఆ చిత్రంపై వారు జరిపే చర్చలే అసలైన విజయం" అని అన్నాడు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సినిమా తాలూకు ప్రభావం ప్రేక్షకుడితోనే కొనసాగాలని ఆయన ఆకాంక్షించాడు."ఒక సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత కూడా ప్రజలు దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే, ఆ కథకు, చిత్ర బృందం పడిన శ్రమకు దక్కిన నిజమైన గౌరవం అదే" అని సూర్య వివరించాడు.అదే సమయంలో, సినిమా వ్యాపార కోణాన్ని కూడా సూర్య ప్రస్తావించాడు. నిర్మాతలు, పంపిణీదారులు ఆర్థికంగా సురక్షితంగా ఉండాలంటే బాక్సాఫీస్ వసూళ్లు కూడా కీలకమేనని స్పష్టం చేశాడు. ప్రేక్షకుల ఆదరణ, వాణిజ్యపరమైన వసూళ్లు రెండూ సమపాళ్లలో లభించినప్పుడే ఏ సినిమా అయినా సంపూర్ణ విజయాన్ని అందుకున్నట్లు అవుతుందని పేర్కొన్నాడు

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రధాన తారాగణం అద్భుతమైన నటన, వెంకీ అట్లూరి రచనలోని బలం, సాంకేతిక నిపుణుల పనితీరు.. ఇలా అన్ని అంశాలు చక్కగా కుదిరి ‘విశ్వనాథ్ & సన్స్’ను గొప్ప చిత్రంగా మలిచాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తూ, వసూళ్ళ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం, హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం విశేషం. హీరో సూర్య మాట్లాడుతూ.. "మీరు చూపిస్తున్న ప్రేమకు కృతఙ్ఞతలు చెప్పడానికి మాటలు కూడా సరిపోవడం లేదు. త్రివిక్రమ్ గారు ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రాకతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. త్రివిక్రమ్ గారి ఆశీస్సులు, ప్రేమ, మద్దతు వల్లే ఈ సినిమా సాధ్యమైంది. సితార ఎంటర్టైన్మెంట్స్ తో నా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాగవంశీ గారితో మరిన్ని సినిమాలు చేయాలని, మరిన్ని ఙ్ఞాపకాలు మూట కట్టుకోవాలని కోరుకుంటున్నాను. వెంకీ, వంశీ గారు తెలుగువారు. నేను తమిళనాడు, మమితా కేరళ, రవీనా గారు మహారాష్ట్ర. మేమందరం వివిధ
తమిళ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధిక శరత్ కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. దీనికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ఫస్ట్ ఈ కథ విన్నప్పటి నుంచే ఈ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. ఇలాంటి టైంలో కస్టపడి ఒక కుటుంబ కథా చిత్రం చేసి, దానిని సక్సెస్ ఫుల్ చేసినందుకు టీమ్ మొత్తాన్ని అభినందిస్తున్నాను. నేను సూర్య గారితో ఒక సినిమా చేయాలి. ఆయనకు నచ్చే కథ ఇంకా చెప్పలేకపోయాను. త్వరలోనే మేమిద్దరం కలిసి పని చేస్తామని నమ్ముతున్నాను. నా భార్య సూర్యకి పెద్ద ఫ్యాన్. ఆమె సూర్యతో సినిమా చేయమని రిక్వెస్ట్ కాదు, డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా తను సినిమా షూటింగ్ లకు పెద్దగా వెళ్ళరు. అలాంటిది సూర్య మీద అభిమానంతో ఈ సినిమా సెట్ కి వెళ్ళి, కలిసి ఫోటో దిగారు. బేసిక్ గా ఆడవాళ్లు అంత గమ్మున ఇష్టపడరు. కానీ, ఇష్టపడితే మాత్రం జీవితాంతం వదిలిపెట్టరు. అలాంటి హీరోలు అతికొద్ది మంది ఉంటారు. అందులో సూర్య ఒకరు. నాకు తెలిసి ఇండియాలో ఇద్దరు హీరోలకు వయసు వెనక్కి వెళ్తుంది. ఒకరు సూర్య, ఇంకొకరు మహేష్ బాబు'' అని నవ్వుతూ అన్నారు.''గజినీ'లో సూర్య పోషించిన సంజయ్ రామస్వామి పాత్ర.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరైన పాత్ర. కొన్ని పాత్రలు మనతో పాటు

వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడిని బుద్ధి, వాక్కు, వ్యాపారం, తర్కం వంటి వాటికి కారకుడిగా చెప్తారు. అటువంటి బుధుడు సెప్టెంబర్ 7న కన్యా రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ ప్రవేశం భద్ర రాజయోగానికి కారణం అవుతుంది. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశులవారు సానుకూల ఫలితాలను చూస్తారు. ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు.బుధుడు స్వరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశులవారికి లబ్ది వ్యక్తిగత జాతకంలో బుధుని స్థానం, ఇతర గ్రహాల ప్రభావం, దశా-భుక్తులను పరిగణనలోకి తీసుకోవాలి. అయినప్పటికీ బుధుడు స్వరాశిలోకి ప్రవేశించడం చాలా మందికి బుద్ధి శక్తి, ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యం మరియు సానుకూల ఆలోచనలను పెంచుతుంది. ఈ కాలంలో కొత్త వ్యాపార వ్యూహాలు రూపొందించడం, ముఖ్యమైన చర్చల్లో పాల్గొనడం, వృత్తిపరమైన సామర్థ్యాన్ని చూపించడం, తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం వంటి అవకాశాలు లభించవచ్చు.కుంభ రాశిఈ సమయం కుంభ రాశి జాతకులకు ఆర్థిక ప్రణాళికలు, భవిష్యత్తు ఆలోచనలకు అనుకూలం. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నవారికి కొత్త అవకాశాలు, ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించవచ్చు. వ్యాపారులు కొత్త వ్యూహాలు అమలు చేస్తే మంచి ఫలితాలు రావచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా, పెద్ద పెట్టుబడులు లేదా అధిక రిస్క్ నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా అలోచించి తీసుకోవాలి. .మకర రాశికన్యా రాశిలో బుధుని సంచారం మకర రాశి వారికి అదృష్టం ఇస్తుంది, ఉన్నత విద్య విషయాల్లో మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం లభించవచ్చు. వ్యాపారులకు దూర ప్రయాణాలు లేదా కొత్త వృత్తి సంబంధాల ద్వారా లాభాలు రావచ్చు. వృత్తిలో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.మిథున రాశిబుధుడు మిథున రాశికి అధిపతి కావడంతో కన్యా రాశిలో అతని సంచారం మీకు

భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ సక్సెస్ మీట్లో ఆయన స్పీచ్ వైరల్ అవుతోంది. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరు ఉన్నారని అన్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). తాజాగా ఆయన సూర్య (Suriya) హీరోగా నటించిన ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons) సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 14న విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ థియేటర్లలో దూసుకెళుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆదివారం సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వెంకీ తనకు చెప్పినప్పటి నుంచి ఇది తన మనసుకు ఎంతో దగ్గరైన కథ అని త్రివిక్రమ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఇంత చక్కగా సినిమా తీసి విజయం సాధించినందుకు చిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. సూర్యతో కలిసి కచ్చితంగా ఒక సినిమా చేయాలనుకుంటున్నానని, ఆయనకు నచ్చే కథ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు. సూర్యతో సినిమా చేయాలని తన భార్య నుంచి ఒక డిమాండ్ ఉందని తెలిపారు. సాధారణంగా సితార బ్యానర్లో జరిగే షూటింగ్‌లకు రాని తన భార్య, సూర్యను కలవడానికి స్వయంగా సెట్‌కి వచ్చి ఫొటో తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో వయసు వెనక్కి వెళ్లే హీరోలు ఇద్దరే ఇద్దరని, ఒకరు సూర్య అయితే మరొకరు మహేష్ బాబు అని కొనియాడారు. ‘గజిని’ చిత్రంలోని సంజయ్ రామస్వామి క్యారెక్టర్ తెలుగు వారికి ఎంతో ఇష్టమైన పాత్ర అని, అలాంటి

చాలామంది మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాక... ఇంటికే పరిమితమవుతారు. కానీ అలా ఆలోచించలేదు విశాఖపట్నానికి చెందిన మాధవి సూరిభట్ల. చాలామంది మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాక... ఇంటికే పరిమితమవుతారు. కానీ అలా ఆలోచించలేదు విశాఖపట్నానికి చెందిన మాధవి సూరిభట్ల. తనలోని కళా నైపుణ్యానికి పదును పెట్టి, దాన్ని మరో నలుగురికి నేర్పుతూ ... చివరకు అదే కళను సామాజిక సేవకు ముడిపెట్టి... ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా 47 వేలకు పైగా జాతీయ పతాకాల ప్రదర్శనతో గిన్నిస్ రికార్డుని అందుకున్నారు. ఇందుకోసం ‘మహిళా మనోవికాసం’ పేరుతో ఓ ఆన్లైన్ గ్రూపుని నిర్వహిస్తున్నారు. దీనిద్వారా స్త్రీశక్తిని ప్రపంచానికి చాటాలనీ, వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా వాళ్లందరికీ చేతివృత్తులను నేర్పిస్తున్నారు. అలాగని అవి కేవలం అలంకరణ వస్తువులకే పరిమితం కాదు. నిత్య జీవితంలో ఉపయోగపడేలానూ వాటిని తీర్చిదిద్దుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. మాధవి బృందం ఇప్పటికే స్కార్ఫ్ల ప్రదర్శన, శిల్పాలు, క్రిస్మస్ అలంకరణలు, హనుమాన్ చాలీసా పారాయణం, టీచర్స్‌డే కార్యక్రమం వంటివెన్నో చేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జెండా ఉండాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు జాతీయ పతాకాల తయారీపై దృష్టి పెట్టారు. అలాగని ప్లాస్టిక్‌వి చేస్తే పర్యావరణ ఇబ్బందులు చాలానే. అందుకే, ఊలుతో జెండాలు అల్లి రికార్డు సాధించాలనుకున్నారామె. ఇందుకోసం కొందరికి అవసరమైన శిక్షణిచ్చారు. అలా 330 మంది మహిళలు... 18 నెలల పాటు 47,617 జాతీయ జెండాలను సిద్ధం చేసి ఈ నెల 7న విశాఖపట్నంలో ప్రదర్శించారు. గిన్నిస్ నిబంధనల ప్రకారం 12.18 కి.మీ. మేర జెండాల ప్రదర్శన నిర్వహించి, గతంలో నెదర్లాండ్స్ బృందం నెలకొల్పిన 11 కి.మీ. రికార్డును అధిగమించారు. దీంతో మాధవికి ఇది వ్యక్తిగతంగా తొమ్మిదో ప్రపంచ రికార్డుగా నిలిచింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ
ఉద్యోగంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయా? గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేదా? ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం, గుర్తింపు దక్కట్లేదా? పనిపై దృష్టి పెట్టలేక తరచూ గందరగోళానికి గురవుతున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో స్వామి వివేకానంద బోధించిన నాలుగు ముఖ్య సూత్రాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. ఆయన జీవన విధానం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం కెరీర్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అద్భుతమైన మార్గదర్శకాలు. స్వామి వివేకానంద చెప్పిన నాలుగు సూత్రాల(Motivational Quotes)పై ఓ లుక్కేద్దాం.1. ఫలితాల గురించి అతిగా ఆలోచించవద్దు (ఫలితం కన్నా పనిపైనే దృష్టి)చాలామంది పనిని ప్రారంభించకముందే లేదా చేస్తున్నప్పుడు దాని ఫలితం గురించే అతిగా ఆలోచిస్తూ ఉంటారు. "జాబ్ వస్తుందా లేదా?", "ఉన్న ఉద్యోగం నిలుస్తుందా?", "ప్రమోషన్ దక్కుతుందా?", "బిజినెస్ లాభాల్లోకి వెళ్తుందా?" వంటి ఆలోచనలు ఒత్తిడిని పెంచి, అసలైన పనిపై దృష్టిని దెబ్బతీస్తాయి. భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ఆపి, ప్రస్తుత పనిని పూర్తి నిబద్ధతతో, నిజాయితీగా చేయడమే విజయానికి తొలిమెట్టు.2. ఒక సమయంలో ఒకే పనిపై ఏకాగ్రత (సింగిల్ టాస్కింగ్)ఎక్కువ ఫలితాలు త్వరగా సాధించాలనే ఆత్రుతతో ఒకేసారి పలు పనులు చేయడం (మల్టీటాస్కింగ్) వల్ల ఏ పని కూడా సమర్థవంతంగా పూర్తి కాదు."ఒక ఆలోచనను ఎంచుకోండి, ఆ ఆలోచననే మీ జీవితంగా మార్చుకోండి, దాని గురించే ఆలోచించండి, కలలు కనండి, దానితోనే జీవించండి" అని వివేకానంద చెబుతారు.మీ ప్రధాన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని, ఒకే పనిపై పూర్తి దృష్టి పెట్టి రోజూ కొద్దికొద్దిగా ముందుకు సాగండి.3. మీపై మీరు సంపూర్ణ నమ్మకం ఉంచండి (ఆత్మవిశ్వాసం)విజయానికి అతిపెద్ద ఆయుధం ఆత్మవిశ్వాసం. "ఇది నా వల్ల కాదు", "ఈ పని చేయడం కష్టం" అని ముందే భావిస్తే ప్రయత్నం ప్రారంభించడం కూడా అసాధ్యమవుతుంది. ఇతరుల పురోగతి, ఎదుగుదలను చూసి మీ ప్రయాణాన్ని పోల్చుకోవద్దు. మీ ఆరంభం నిదానంగా ఉన్నా, మీపై మీకు నమ్మకం ఉన్నంత కాలం ఖచ్చితంగా

ఈ వ్యక్తులు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు!ఈ వ్యక్తులు ఎప్పటికీ ఆనందంగా ఉండలేరు! Prasanna Yadla 13 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి మీరెప్పుడు ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు అలా పోల్చుకుంటే మీ జీవితంలోని సంతోషాన్ని కోల్పోతుంటారు. సంతోషాన్ని కోల్పోతుంటారు అత్యాశ ఎక్కువగా ఉన్నవారు కూడా డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు అత్యాశ మీ లైఫ్ లో అంతకముందు జరిగిన విషయాలను వదిలేయండి ఎక్కువగా గుర్తుచేసుకోకండి ఎక్కువగా గుర్తుచేసుకోకండి ఇంకా ప్రతి విషయాన్నీ అనుమానించే విధంగా ఉండకూడదు ఇది ప్రశాంతతను దూరం చేస్తుంది. ప్రశాంతతను దూరం చేస్తుంది ఇంకా ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా హ్యాపీగా ఉండలేరు అసూయపడేవారు నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఆమె లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు. ఇదీ నిధి తివారీ ప్రయాణం. శాస్త్రవేత్తగా మొదలైన ఆమె కెరీర్.. విదేశాంగం, భద్రతా వ్యవహారాల్లో పనిచేసే స్థాయికి ఎలా చేరిందో చూస్తే ఆసక్తికరమే.నిధి తివారీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోకు చెందినవారు. అక్కడే పాఠశాల విద్య, డిగ్రీ పూర్తి చేశారు. బీఎస్సీ తర్వాత బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు. ఈ కోర్సులో గోల్డ్ మెడల్ సాధించారు.బార్క్‌లో శాస్త్రవేత్తగా..చదువు పూర్తయ్యాక బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. అయితే సివిల్స్ సర్వీసులోకి వెళ్లాలన్న పట్టుదలతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నారు. 2008లో బార్క్ నుంచి బయటకు వచ్చి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు.ఒక్కసారి కాదుసివిల్స్ ప్రయాణం ఆమెకు వెంటనే విజయాన్ని అందించలేదు. 2012లో జరిగిన పరీక్షలో ఆమె పేరు వెయిటింగ్ లిస్ట్‌లో వచ్చింది. అయినా ప్రయత్నం ఆపలేదు. 2013లో మళ్లీ పరీక్ష రాశారు. ఈసారి ఆల్ ఇండియా స్థాయిలో 96వ ర్యాంకు సాధించారు. దీంతో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికై 2014 బ్యాచ్‌లో చేరారు.విదేశాంగం నుంచి పీఎంవోకుఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేసే సమయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలపై పనిచేశారు. విదేశాంగ విధానం, అంతర్జాతీయ భద్రతపై ఆమెకు వచ్చిన అనుభవం తర్వాత పీఎంవోలో కీలకంగా ఉపయోగపడింది.2022 నవంబర్‌లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. ఆ తర్వాత

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Samantha:మా ఇంటి బంగారం సినిమా విజయంలో భాగమైన ప్రతి ఒక్కరిని అభినందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కనిపించింది. ఈ వేడుకకు సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్ర బృందంలోని పలువురు సభ్యులకు సమంత, రాజ్ కలిసి ప్రత్యేక షీల్డులను అందించారు. సినిమా కోసం కష్టపడి పనిచేసిన టీమ్‌ను ఈ సందర్భంగా వారు అభినందించారు. అంతేకాదు, చిత్ర బృందానికి మరిన్ని ప్రత్యేక బహుమతులను కూడా మేకర్స్ ప్రకటించారు. ఇందులో నగదు బహుమతులతో పాటు కార్లు, బంగారు నాణేలు వంటి రివార్డులు ఉన్నాయి. దీంతో సక్సెస్ సెలబ్రేషన్ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. మా ఇంటి బంగారం రూ.100 కోట్ల మార్క్‌ను అందుకోవడం చిత్ర బృందానికి పెద్ద విజయంగా చెప్పవచ్చు. మహిళా ప్రధాన పాత్రతో వచ్చిన తెలుగు సినిమాల్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది గుర్తింపు పొందుతున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమా విడుదలకు ముందు మహిళా లీడ్ ఉన్న సినిమాకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎంతవరకు స్పందన వస్తుందనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత వచ్చిన ప్రేక్షకుల స్పందన ఆ అనుమానాలకు సమాధానం ఇచ్చింది. థియేటర్లలో మంచి ఆదరణతో సినిమా విజయవంతంగా ముందుకు సాగింది. కథ, నటీనటుల నటన, సినిమా ప్రజెంటేషన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మా ఇంటి బంగారం కథను రాజ్ నిడిమోరు రూపొందించగా, నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్ నిడిమోరు, సమంత రూత్ ప్రభు, హిమాన్క్ రెడ్డి

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ తన బాల్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో, చిన్నప్పుడు తనను, తన సోదరిని చూసి చాలామంది జీవితంలో పైకిరారని అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇటీవల ఎం9 న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాధవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.జంషెడ్‌పూర్‌లో తన బాల్యం గడిచిందని మాధవన్ తెలిపారు. ఆయన తండ్రి రంగనాథన్ ఒక ప్రైవేట్ సంస్థలో, తల్లి సరోజ బ్యాంకులో పనిచేసేవారని చెప్పారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళ్లడంతో, పిల్లల బాగోగులు, హోంవర్క్ చూసేవారు ఎవరూ లేరని ఇరుగుపొరుగు వారు అనేవారని ఆయన పేర్కొన్నారు. "పిల్లల భవిష్యత్తు కంటే మీకు ఉద్యోగాలే ముఖ్యమా?" అంటూ చుట్టుపక్కల వారు తరచూ తమ తల్లిదండ్రులను నిందిస్తూ, వారిని బాధపెట్టే ప్రయత్నం చేసేవారని మాధవన్ వివరించారు.అయితే, తన తల్లిదండ్రులు ఇలాంటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. "చాలామంది అనుకున్నట్టు నేను ఇంజనీర్‌ను కాదు. కేవలం బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివి, అతికష్టం మీద పాసయ్యాను. చదువులో నేనేమీ గొప్పవాడిని కాదు," అని మాధవన్ నిజాయితీగా అంగీకరించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదించడం వల్లే తనకు ఎక్స్ఛేంజ్-స్టూడెంట్ ప్రోగ్రామ్స్, స్కాలర్షిప్స్ కింద విదేశాలకు వెళ్లే అవకాశాలు లభించాయని, అవే తన జీవితాన్ని మార్చేశాయని ఆయన తెలిపారు.తమ తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తనకు గర్వకారణమని, వారు తమకు ఒక మంచి ఉదాహరణగా నిలిచారని మాధవన్ అన్నారు. పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకపోయినా ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ఎవరైనా విజయం సాధించవచ్చనే తన

టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవీకాలం 2027 ఫిబ్రవరి 20 వరకూ ఉన్నప్పటికీ తక్షణ నిష్క్రమణకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక గురించి చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. ఆంధ్రజ్యోతి, ఆగస్టు 12: ఆగస్టు 18న జరగనున్న టాటా సన్స్ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ పదవికి ఎన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియాల్సి ఉంది. ఈ సందర్భంగా తన రాజీనామాకు గల కారణాలు, కొత్త నాయకత్వ ఎంపిక గురించి చంద్రశేఖరన్ స్పష్టతనిచ్చారు. మరో దఫా పొడిగింపునకు నిరాకరణ: ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత టాటా సన్స్ ఛైర్మన్‌గా తిరిగి కొనసాగేందుకు తాను సిద్ధంగా లేనని, ఈ విషయాన్ని బోర్డుకు స్పష్టం చేశానని చంద్రశేఖరన్ తెలిపారు. ఐకమత్యం కొరవడటమే కారణం: ఆయన పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయి. అయితే బోర్డులోని ఒక సభ్యుడు దీనిని వ్యతిరేకించడంతో ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవ మద్దతు లభించలేదని వివరించారు. ఆరు నెలలుగా పెండింగ్‌లోనే స్పష్టత: ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేశానని, అయితే గత ఆరు నెలలుగా ఈ విషయమై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేకపోయారని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తు వ్యూహాత్మక ప్రాజెక్టుల దృష్ట్యా: ప్రస్తుతం టాటా గ్రూప్ అనేక కీలక ప్రాజెక్టులను అమలు చేస్తోందని, ఇలాంటి కీలక సమయంలో సంస్థ పురోగతికి, ఉద్యోగులు, పెట్టుబడిదారుల నమ్మకానికి నాయకత్వంపై స్పష్టత ఉండటం చాలా అవసరమని స్పష్టం చేశారు. త్వరితగతిన కొత్త నాయకత్వ ఎంపిక: సంస్థలో నాయకత్వ మార్పిడి సునాయాసంగా జరిగేందుకు వీలుగా, వెంటనే తదుపరి ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని టాటా సన్స్ బోర్డును చంద్రశేఖరన్ కోరారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. గత వారం ఆయన `డ్రాగన్` చిత్ర షూటింగ్లో గాయపడ్డారు. భుజానికి బలమైన గాయమైంది. ఇన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఎన్టీఆర్‌కి నేడు బుధవారం సర్జరీ చేశారు. కిమ్స్ లో ఆయనకు ఈ సర్జరీ జరిగింది. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి సారథ్యంలోని స్పెషలిస్ట్ ల బృందం డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూధన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని.. తారక్‌కి ఆపరేషన్ చేసినట్టు తాజాగా కిమ్స్ ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. చాలా డిటెయిలింగ్ సర్జరీ ద్వారా పూర్తి స్థాయిలో రికవరీ కోసం ఈ స్పెషలిస్ట్ ల బృందం సర్జరీ చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం అయ్యిందని, ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి రావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ కోలుకోవడం, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటం అభిమానులకు ఆనందించే విషయమే, కానీ మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ అనేది కొంత కలవరానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ `డ్రాగన్` చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వామ్ అనేలా ఉంది. ఇందులో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఆసుపత్రి పాలవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయి

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాసిన "ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్స్" ఆత్మకథను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన నేటి యువతకు షార్ట్కట్ల పట్ల తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా రీల్స్ ప్రభావంతో యువత తక్కువ సమయంలో విజయం సాధించాలని ఆరాటపడుతున్నారని, ఇది ప్రమాదకరమని మోదీ స్పష్టం చేశారు. రామ్‌నాథ్ కోవింద్ తన బాల్యం నుండి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన ప్రయాణాన్ని ఈ పుస్తకంలో వివరించారు. పేదరికం, కష్టాలను అధిగమించి ఉన్నత స్థానానికి ఎలా చేరుకున్నారో కోవింద్ తన అనుభవాల ద్వారా ఈ పుస్తకంలో పొందుపరిచారు. గాంధీ, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే వంటి మహనీయుల ఆశయాలకు కోవింద్ జీవితం ఒక నిదర్శనమని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. రైల్వే స్టేషన్లలో ఉండే 'షార్ట్‌కట్ ప్రమాదకరం' అనే బోర్డులను మోదీ గుర్తు చేస్తూ, జీవితం కూడా అంతేనని హెచ్చరించారు. రీల్స్ మాయలో పడి యువత తప్పుడు మార్గాల్లో వెళ్లవద్దని ఆయన సూచించారు. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కంటే, ఆదర్శవంతుల ఆత్మకథలను చదవడం వల్ల వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. కోవింద్ చిన్నతనంలో తల్లిని కోల్పోయినా, పట్టుదలతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్న తీరు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో, కష్టపడే తత్వం ఉన్న యువత దేశానికి ఎంతో అవసరమని మోదీ నొక్కి చెప్పారు. లక్షలాది మంది కోవింద్ లాంటి యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. మరోవైపు, పదవీ విరమణ చేసినా కోవింద్ 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' వంటి కీలక అంశాలపై పని చేస్తున్నారని మోదీ ప్రశంసించారు. దీనిపై పరిష్కారం లభిస్తే భారత ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదని
N Chandrashekaran: ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి టెక్నాలజీ మీద ఆసక్తితో కార్పొరేట్ రంగంలో ఒక ఇంటర్న్‌గా అడిగుపెట్టారు నటరాజన్ చంద్రశేఖరన్ (Natarajan Chandrasekaran). ఒక సాధారణ ఉద్యోగిగా తన కెరీర్ మొదలు పెట్టి టాటా గ్రూప్‌లో దిగ్గజ నాయకుడిగా తనదైన ముద్రవేశారు. ఇప్పుడు అనూహ్య పరిణామాల మధ్య తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి చంద్రశేఖరన్ వైదొలుగుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్‌లో ఆయన ప్రస్థానాన్ని ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.తమిళనాడులోని మోహనూర్ అనే ఓ కుగ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో ఎన్ చంద్రశేఖరన్ 1963లో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేశి కోయంబత్తూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రోగ్రామింగ్, టెక్నాలజీపై ఇష్టంతో ఎంసీఏ పట్టా పొందారు. 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టారు. ఆ తర్వాత 40 ఏళ్ల పాటు ఒకే కంపెనీలో కొనసాగుతూ వచ్చారు.చిన్న వయసులోనే సీఈఓగాఅంచలంచెలుగా ఎదుగుతూ చిన్న వయసులోనే 2007లో టీసీఎస్ బోర్డు సభ్యుడిగా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చంద్రశేఖరన్ నియమితులయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకో 2009లో టీసీఎస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన వయసు 46 ఏళ్లు. టాటా గ్రూప్ లో సీఈఓ బాధ్యతుల చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు టీసీఎస్ కష్టకాలంలో కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం దెబ్బతో కుదేలైన సంస్థను విపత్తు నుంచి బయటపడేశారు.2 సార్లు టాటా సన్స్ ఛైర్మన్గాసైరస్ మిస్త్రీ వివాదం తర్వాత టాటా గ్రూప్ పలు సవాళ్లను ఎదుర్కొంది. ఆ సమయంలో టాటా సన్స్ ఛైర్మన్ పగ్గాలను ఎన్ చంద్రశేఖరన్ అందుకున్నారు. 2016 అక్టోబరులో టాటా సన్స్ బోర్డులో చేరారు. 2017లో ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. టాటా కుటుంబం నుంచి కాకుండా

కాలేజీలో మంచి మార్కులు లేకపోతే మంచి ఉద్యోగం దొరకదనే భయం చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. 6 సీజీపీఏతో చదువు పూర్తిచేసిన నమన్ బన్సల్‌కు ఈ భయం నిజంగానే అడ్డంకిగా మారింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు అర్హత లేకపోవడంతో పాటు, ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసినా వరుస తిరస్కరణలు ఎదురయ్యాయి. కానీ అక్కడితో ఆయన ప్రయాణం ఆగలేదు.అకడమిక్ స్కోర్ బలంగా లేకపోవడంతో తన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై నమన్ మరింత దృష్టి పెట్టారు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం పెంచుకుని కోడ్ఫోర్సెస్లో క్యాండిడేట్ మాస్టర్ స్థాయికి చేరుకున్నారు. రెజ్యూమేలో సీజీపీఏ కంటే తన టెక్నికల్ స్కిల్స్‌ను హైలైట్ చేశారు. చివరకు రిఫరల్ ద్వారా మేక్‌మైట్రిప్‌లో ఇంటర్న్‌షిప్ సాధించారు.మేక్‌మైట్రిప్‌లో అనుభవం నమన్ కెరీర్‌కు కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ ‘డీఈ షా’లో ఫుల్‌టైమ్ ఉద్యోగం దక్కింది. మరింత అనుభవం సంపాదించిన తర్వాత.. ఒకప్పుడు సీజీపీఏ కారణంగా ఇంటర్న్‌షిప్ ఇవ్వని అడోబ్లోనే ‘మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్’గా ఉద్యోగం సాధించారు. అక్కడ దాదాపు రెండేళ్లు పనిచేశారు.ఆ తర్వాత నమన్ బన్సల్ కెరీర్ మరో స్థాయికి చేరింది. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్‌లో SDE-2గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయన వార్షిక వేతనం సుమారు రూ.90 లక్షలుగా పేర్కొంటున్నారు. ఒకప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌కు కూడా అర్హత లేని విద్యార్థి.. ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీలో పనిచేస్తున్నారు.నమన్ కథ చెప్పే విషయం ఒక్కటే.. మార్కులు ఒక అవకాశాన్ని ఆపగలవు. కానీ, ప్రతిభను శాశ్వతంగా ఆపలేవు. ఎదురైన ప్రతి తిరస్కరణను తనను తాను మెరుగుపరుచుకునే అవకాశంగా మార్చుకున్నారు. చివరకు
మెగాస్టార్ చిరంజీవి అంటే అద్భుతమైన నటన, ఉర్రూతలూగించే డ్యాన్స్, అనితరసాధ్యమైన మాస్ ఇమేజ్‌తో పాటు అభిమానులకు ఇచ్చే అనుకోని సర్ప్రైజ్లు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా తన రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన అప్డేట్లను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించకముందే సరదాగా బయటపెట్టడం ఆయనకు అలవాటు. దీంతో సినీ వర్గాలు, అభిమానులు దీనికి ప్రేమగా ‘చిరు లీక్స్’ అని పేరు పెట్టారు. చిరంజీవి ఏ ఈవెంట్‌కి వెళ్లినా ఆయన ఏ విషయాన్ని లీక్ చేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో ‘చిరు లీక్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో తరుచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో చిరంజీవి తన 158వ చిత్రం టైటిల్‌ను అనుకోకుండా లీక్ చేసి వార్తల్లో నిలిచారు.* నన్ను పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ క్షమాపణకేఎస్ రవీంద్ర ( బాబీ కొల్లి ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీకి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయకపోవడంతో ప్రస్తుతానికి ‘ మెగా 158 ’ అనే వర్కింగ్ టైటిల్‌తోనే వార్తల్లో నిలుస్తోంది. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్ వేదికగా లీక్‌ల గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో సంభాషణ సమయంలో చిరంజీవి కాస్త తొందరపడ్డారు. ‘టీజర్ మ్యూజిక్ వర్క్ పూర్తయిందా? చివరిలో ‘కదిరి’ అని టైటిల్ కార్డ్ వేశారా?" అని చిరంజీవి సరదాగా ప్రశ్నించారు. చిరు మాటలకి తమన్ తల పట్టుకోవడంతో ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్ ‘కదిరి’ అని అయి ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చింది.దీంతో సోషల్ మీడియా వేదికగా ‘చిరు లీక్స్’ హ్యాష్‌ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అధికారిక

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి ఛైర్మన్‌గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బుధవారం టాటా సన్స్ బోర్డుకు తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20న ముగియనుంది. అంటే అప్పటివరకు ఛైర్మన్‌గా కొనసాగుతారు. ఆగస్టు 18న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది.ఏం జరిగింది?చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల పదవీకాలానికి కొనసాగింపుపై గతంలో ప్రతిపాదన వచ్చింది. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు ఏకగ్రీవంగా ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని సిఫార్సు చేశాయి. టాటా సన్స్ నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ, బోర్డు కూడా ఈ ప్రతిపాదనను సిఫార్సు చేశాయి.అయితే 2026 ఫిబ్రవరి 24న జరిగిన బోర్డు సమావేశంలో ఓ సభ్యుడు ఈ ప్రతిపాదనకు మద్దతు ఇవ్వలేదు. ఏకాభిప్రాయం లేకపోవడంతో తాను నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు చంద్రశేఖరన్ తెలిపారు. ఆ సమావేశానికి ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు దీనిపై నిర్ణయం రాలేదని చెప్పారు.నాయకత్వంపై స్పష్టత అవసరంటాటా సన్స్ చాలా పెద్ద సంస్థ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. పలు కీలక వ్యూహాత్మక ప్రాజెక్టులు ప్రస్తుతం కీలక దశలో ఉన్నాయని తెలిపారు. 2027 ఫిబ్రవరి తర్వాత గ్రూప్‌ను నడిపించే నాయకుడు ఎవరన్న దానిపై ముందుగానే స్పష్టత ఉండటం అవసరమన్నారు. ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర భాగస్వామ్య వర్గాలకు ఇది ముఖ్యమని చెప్పారు. అందుకే వారసుడి ఎంపికను త్వరగా పూర్తి చేయాలని బోర్డును కోరినట్లు వెల్లడించారు.‘టాటాలో 40 ఏళ్ల ప్రయాణం’తన

ఐడియా పెద్దదైనంత మాత్రాన ఎక్కువ పెట్టుబడి కావాల్సిన అవసరం లేదని నిరూపించిన కథ ఇది. చేతిలో భారీగా నిధులు లేవు. పెద్ద ఆఫీసు లేదు. మార్కెట్లో పేరు లేదు. అయినా ఆరుగురు యువకులు ఒక కలను నమ్మారు. చేతిలో ఉన్న పొదుపు, అప్పులతో కలిపి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. చివరకు ఆ ఆలోచనే భారత టెక్నాలజీ రంగాన్ని మార్చిన హెచ్సీఎల్గా ఎదిగింది.హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకుడు అజయ్ చౌదరి ఈ సంస్థ తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు చేశారు. హెచ్‌సీఎల్ 50వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి పరిస్థితులను ఆయన పంచుకున్నారు.చేతిలో రూ.1.87 లక్షలు1976లో కంప్యూటర్ అంటే భారత్‌లోనే కొత్త ఆలోచన. అలాంటి సమయంలో ఆరుగురు కలిసి సొంతంగా కంప్యూటర్ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. వారి దగ్గర భారీ పెట్టుబడిదారులు లేరు. వెంచర్ క్యాపిటల్ సంస్థల మద్దతు లేదు. ఆరుగురూ కలిసి రూ.1.87 లక్షలు సమకూర్చుకున్నారు. కొంత డబ్బు అప్పుగా తెచ్చారు. మరికొంత పొదుపు నుంచి పెట్టారు. ఓ సందర్భంలో కారును కూడా అమ్మేశారు.చిన్న గదిలో తొలి అడుగుఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్‌లో ఓ భవనంపై ఉన్న చిన్న గదే హెచ్‌సీఎల్ తొలి కార్యాలయమైంది. అప్పటికి వారు తయారు చేయాలనుకున్న కంప్యూటర్ పూర్తిగా సిద్ధం కాలేదు. బ్రోచర్ ఉంది. నమూనా ఉంది. యంత్రం మాత్రం ఇంకా రూపుదిద్దుకుంటోంది. అయినా ఆ ఆరుగురు వెనక్కి తగ్గలేదు. కంప్యూటర్ను విక్రయించేందుకు సంస్థలను కలవడం మొదలుపెట్టారు. తొలి ఆర్డర్లు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్ నుంచి వచ్చాయి.ఒక్క ఆర్డర్.. వరుసగా అవకాశాలువ్యాపార సంస్థలను

కొరియన్ కనకరాజు సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలో వరుణ్ తేజ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని, చిరంజీవి బాటలోనే నడుస్తానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం ఇప్పటికే 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి దూసుకుపోతోంది. ఈ సక్సెస్ వేడుకలో పాల్గొన్న వరుణ్ తేజ్, తన కెరీర్ ఎదుగుదలలో చిరంజీవి పాత్రను గుర్తు చేసుకున్నారు. నటనలో తనకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని, చిరంజీవి సూచనలను మాత్రమే పాటిస్తానని ఆయన పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఆశయాలను నిజం చేయాలన్న తన తపనను వరుణ్ తేజ్ వేదికపై వెల్లడించారు. పెదనాన్న చిరంజీవి పరువు తీయకుండా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కళ్ళలో ఆనందం చూడటమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను వరుణ్ తేజ్ ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. ఆగస్టు 22 అంటే తన చిన్నప్పటి నుంచి నేషనల్ హాలిడే లాంటిదని, ఆ రోజు స్కూల్‌కు వెళ్లనని నాన్నతో మొండికేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు వెంటనే తనను పెదనాన్న చిరంజీవి ఇంటికి పంపించేవారని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈసారి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను, తన సినిమా సక్సెస్‌తో కలిపి ఘనంగా జరుపుకుంటామని వరుణ్ తేజ్ ప్రకటించారు. చిరంజీవి స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతున్నానని, ఆయన ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. వరుణ్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన

Success Story: ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగం చేయడానికి బదులుగా సొంత వ్యాపారం ప్రారంభించాలని లేదా సొంతంగా పని చేసుకోవాలని కోరుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెంది రైతు మధుసూదన్ ధాకడ్ స్టోరీ కూడా అలాంటి వారికి స్ఫూర్తిదాయకం. రైతు మధుసూదన్ కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. కానీ వ్యవసాయంలో కొత్త పద్ధతులను అవలంభించి ఏటా కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.ప్రధాని మోదీ లేటెస్ట్ ఇన్ స్టా వీడియో: దేశ ప్రజలకు పిలుపుమధుసూదన్ రైతు కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచే వ్యవసాయంతో అనుబంధం కలిగి ఉన్నాడు. మొదట్లో ఆయన సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేశాడు. కానీ ఆశించినంత ఆదాయం రాలేదు. అనంతం ఆయన తన వ్యవసాయ పద్ధతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు . వ్యవసాయం, నర్సరీల ద్వారా ఆయన ఏటా సుమారు రూ. 5 కోట్లు సంపాదిస్తున్నాడు.మధుసూదన్ ధాకడ్ గోధుమ వంటి సాంప్రదాయ పంటలకు బదులుగా వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు, క్యాప్సికమ్, టమాటాలు, అల్లం వంటి అధిక విలువ గల పంటలపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు. ఆధునిక పద్ధతుల సహాయంతో ఆయన క్రమంగా తన వ్యవసాయాన్ని విస్తరించి నేడు సుమారు 200 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు.వ్యవసాయంతో పాటు నర్సరీ ప్రారంభం మధుసూదన్ కేవలం పంటలు పండించడానికే పరిమితం కాలేదు. ఆయన తన సొంత నర్సరీని కూడా ప్రారంభించారు. దీని ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. వ్యవసాయం, నర్సరీ ద్వారా ఆయన వార్షిక ఆదాయం సుమారు రూ.5 కోట్లకు చేరుకుంది. సరైన పంటను ఎంచుకోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం, మంచి యాజమాన్యం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చని ఆయన విజయం నిరూపిస్తుంది.ఏ పంట నుంచి ఎంత ఆదాయం వస్తుంది?*మధుసూదన్ 40 ఎకరాల భూమిలో పచ్చి మిరపకాయలు సాగు చేశాడు. దీనికి ఆయనకు ఎకరానికి సుమారు 70,000 రూపాయలు ఖర్చయింది. ఆయనకు ఎకరానికి సుమారు

మంచి కంటెంట్ మరియు హెల్దీ ఎంటర్టైన్మెంట్ అందిస్తే ప్రేక్షకులు కుటుంబసమేతంగా థియేటర్లకు ఖచ్చితంగా వస్తారని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు ఇంజనీర్ అయితే హీరో వరుణ్ తేజ్ ఐరన్ పిల్లర్ లాంటివాడని చిరంజీవి కొనియాడారు. కమెడియన్ సత్య నటన కాంక్రీట్ లాంటి ఉనికి అని వ్యాఖ్యానించారు. సత్య నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, కేవలం అతని కోసమే ఈ సినిమాను మళ్లీ చూడాలనిపిస్తుందని తెలిపారు. కథానాయిక రితికా నాయక్ గ్లామర్ మరియు మురళీధర్ గౌడ్ సహజ నటన సినిమాకు అదనపు బలంగా నిలిచాయని పేర్కొన్నారు. చిన్న మరియు మధ్యతరహా సినిమాలు థియేటర్లలో ఆడటం లేదనే వాదనలను చిరంజీవి పూర్తిగా తోసిపుచ్చారు. ఇటీవల కాలంలో చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం, లేనిన్ మరియు కొరియన్ కనకరాజు సినిమాలు వరుసగా విజయాలు సాధించాయని గుర్తు చేశారు. కొత్తతనంతో కూడిన కథలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని ఈ విజయాలు నిరూపించాయని చెప్పారు. దీంతో చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా దర్శకులకు ఒక కీలకమైన సలహా ఇచ్చారు. నిర్మాతలు వెచ్చించే ప్రతి రూపాయికి విలువ ఇస్తూ పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీయాలని సూచించారు. కథ బలంగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని స్పష్టం చేశారు. ఫలితంగా సినిమా విజయం సాధించి అనేక మంది సినీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం అనంతపురం నేపథ్యంతో కొరియన్ మూలాలు కలిసిన హారర్ కామెడీగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ విభిన్నమైన

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ బాబీ కొల్లి (కే.ఎస్.రవీంద్ర) డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. మెగా 158 (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మలయాళం హీరోయిన్ అనస్వరరాజన్ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ప్రియమణి, బండ్ల గణేష్ తదితరులు ఈ మూవీలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. జన నాయకుడు, టాక్సిక్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ సంస్థ మెగా 158 సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్టు 22) సందర్భంగా ఈ మెగా మూవీ టీజర్ తో పాటు టైటిల్ ను కూడా అనౌన్స్ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే అంతకు ముందే ఈ సినిమా టైటిల్ ను దాదాపు రివీల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సాధారణంగా చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను స్వయంగా ఆయనే అభిమానులకు అందిస్తుంటారు. చిరు లీక్స్ పేరుతో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్లు ఇవ్వడం ఆయనకు బాగా సరదా. తాజాగా మెగా158 మూవీ టైటిల్ కూడా అలాగే లీక్ చేశారు మెగాస్టార్. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ కు హాజరైన చిరంజీవిని మెగా158 అప్డేట్ ఇవ్వమని అడిగింది యాంకర్. దీంతో మైక్ అందుకున్న మెగాస్టార్ తమన్‌ను అడుగుతూ.. సేమ్ టైటిల్ కదిరిలాగా అంటూ సగంలోనే ఆపేశారు. దీంతో ఈ మూవీకి టైటిల్ కదిరి నరసింహుడు అనే పేరు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా గతంలో ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్లో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఆగస్టు 07న విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించింది. దీంతో మంగళవారం (ఆగస్టు 11) హైదరాబాద్ వేదికగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కొరియన్ కనకరాజు చిత్ర బృందం కూడా హాజరైంది. అయితే ఈ మెగా ఈవెంట్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సినిమాలో పొట్టి మామగా మెప్పించిన నటుడు రవీంద్ర కుమార్ మెగాస్టార్ చిరంజీవి కాళ్లపై పడబోయారు. ఇది గమనించిన చిరంజీవి అలా చేయవద్దని అతన్ని వారించారు. రవీంద్ర ను దగ్గరికి తీసుకుని ఓదార్చారు. చివరగా అతనిని పక్కన కూర్చుపెట్టుకుని ఫోటో దిగి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీంద్ర కుమార్ అలియాస్ పొట్టిమామ.. సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి ఇతను బాగా పరిచయం. ముఖ్యంగా యూట్యూబ్ లో పొట్టి మామకు మంచి క్రేజ్, పాపులారిటీ ఉంది. చిరంజీవి అభిమాని అయిన రవీంద్ర కుమార్ ఎక్కువగా మెగాస్టార్ పాటలకు డ్యాన్స్ లు చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. పొట్టి మామ డ్యాన్స్ వీడియోలకు భారీగా వ్యూస్ వస్తుంటాయి. ఇప్పటివరకు సోషల్ మీడియాలోనే కనిపించిన రవీంద్ర కుమార్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిశాడు. కొరియన్ కనకరాజు సినిమాలోని ఓ పాటలో తళుక్కున మెరిశాడు. ఈ క్రమంలోనే కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ కు హాజరయ్యాడు. అక్కడ చిరును స్టేజ్ ముందు చూసి ఎమోషనల్ అయిపోయి బాగా ఏడ్చేసాడు. ఇక ఇదే సక్సెస్ మీట్లో చిరంజీవి ఈ తరం
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారికి పొట్టి మామ గురించి తెలిసే ఉంటుంది. సినిమా పాటలకు కవర్ సాంగ్స్ చేస్తూ ఆయన యూట్యూబ్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పాటలకు అచ్చుగుద్దినట్టు ఆయన వేసే స్టెప్పులు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. చిరుకి వీరాభిమాని అయిన పొట్టి మామ.. ఎప్పటికైనా తన ఫేవరేట్ హీరోని కలవాలని కోరుకున్నారు. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరింది. ఆయన ఇప్పుడు చిరంజీవిని కలిశారు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో పొట్టి మామ నటించారు. మంగళవారం హైదరాబాద్ లో ఈ మూవీ మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ జరిగింది. దీనికి చిరంజీవి చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ వేడుకలో పాల్గొన్న పొట్టి మామ.. మెగాస్టార్ ని చూసి బోరున ఏడ్చేశారు. మోకాళ్ల మీద కూర్చొని తన అభిమాన నటుడుకి రెండు చేతులెత్తి నమష్కారం చేశారు. పొట్టి మామ కింద కూర్చోడానికి ప్రయత్నించగా.. చిరు ఆయన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని, ఓదార్చారు. తన పక్కన కూర్చోబెట్టుకుని ఫొటో దిగారు. దీంతో పొట్టిమామ ఎమోషనల్ అయ్యారు
టాప్ ర్యాంకర్లు ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని పూర్తి చేయడానికి క్రమపద్ధతిలో కృషి చేస్తారు. చదువుపై పూర్తి దృష్టి పెడతారు. ఒకేసారి పెద్ద సిలబస్‌ను పూర్తి చేయాలని ప్రయత్నించకుండా, చిన్న చిన్న భాగాలుగా విభజించి చదువుతారు. దీంతో ఒత్తిడి తగ్గి, నేర్చుకోవడం సులభమవుతుంది. చదువు కోసం ఒక స్థిరమైన షెడ్యూల్‌ను పాటిస్తారు. ప్రతిరోజూ ఒకే సమయానికి చదవడం వల్ల మెదడు కూడా ఏకాగ్రతతో పని చేస్తుంది. టాప్ ర్యాంకర్లు ఎప్పుడూ తమ నోట్స్‌ను తామే తయారు చేసుకుంటారు. షార్ట్ నోట్స్ పరీక్షల ముందు రివిజన్‌కు ఎంతో ఉపయోగపడతాయి. కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు, ఇప్పటికే చదివిన అంశాలను ప్రతిరోజూ రివిజన్ చేస్తారు. దీంతో అవి ఎక్కువ కాలం గుర్తుంటాయి. చదివేటప్పుడు ఫోన్ నోటిఫికేషన్లను ఆఫ్ చేసి, మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. దీంతో ఏకాగ్రతతో చదవగలుగుతారు. విజయం ఒక్కరోజులో రాదని గుర్తుంచుకుని, ఎప్పుడూ నిరుత్సాహపడరు. క్రమశిక్షణ, పట్టుదలే విజయానికి ముఖ్య కారణాలని నమ్ముతారు. టాప్ ర్యాంకర్లు ఎప్పుడూ ప్రశ్నలు అడగడానికి వెనుకాడరు. సందేహాలను వెంటనే నివృత్తి చేసుకుని, అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకుంటారు. టాప్ ర్యాంకర్లు తరచూ మాక్ టెస్టులు రాస్తారు. దీంతో పరీక్షా విధానంపై అవగాహన పెరుగుతుంది. మంచి మార్కులు సాధించగలుగుతారు