
Thanuja Puttaswamy : సీరియల్ నటి తనూజ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి తనూజ (Thanuja Puttaswamy) వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి తనూజ (Thanuja Puttaswamy) వినాయక చవితి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

నటి నవ్యసామి (Navya Swamy) ఇంట్లో వినాయక చవితి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నరసరావుపేట సమీపంలోని కాకాని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించారు. అనంతరం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండను సందర్శించి శ్రీ త్రికోటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాకానిలోని జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించిన గౌతమి, కృష్ణవేణి, నాగార్జున హాస్టల్ భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. అనంతరం ఆయన కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు అందించి, తీర్థప్రసాదాలను అందజేశారు.తన పర్యటనలో భాగంగా స్వామివారిని దర్శించుకున్న విషయాన్ని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు
ఆ మధ్య ఓ ఈవెంట్లో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల , రన్నర్ తనూజ కనిపించినప్పుడు.. స్టేజ్‌పై తనూజ అసలు కళ్యాణ్ మొహం కూడా చూడలేదు. అందర్నీ నవ్విస్తూ పలకరించింది కానీ.. కళ్యాణ్ పడాలతో పడనట్టుగానే కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. నిజానికి ఆ కార్యక్రమానికి ముందు.. వాళ్లు ఒకర్నొకరు పలకరించుకున్నారు.. మాట్లాడుకున్నారు.. నవ్వుకున్నారు. కానీ స్టేజ్‌పై మాత్రం ఒక సందర్భంలో ఒకరికొకరు పడనట్టుగా కనిపించేసరికి వీళ్ల మధ్య ఏదో గొడవ అయ్యింది? తనూజ కళ్యాణ్‌ని దూరం పెట్టేసింది.. వాళ్లిద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ రకరకాల పుకార్లు షికారు చేశాయి.అయితే ఆ వీడియోపై స్పందించిన కళ్యాణ్ పడాల.. తనూజ పేరు కూడా ప్రస్తావించకుండానే తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ పడాల మాట్లాడుతూ.. ‘ఇవన్నీ ఎవరు పుట్టిస్తారంటే.. ఖాళీగా ఉండి.. మూడు పూటలా తిని.. ఏం చేయాలో తెలియక.. మాలా ఒకపూట తినేవాళ్లపై కామెంట్స్ చేస్తుంటారు. ఒక్కోసారి మాకు ఒక్కపూట కూడా తినడానికి టైమ్ ఉండదు. మా మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవు. బయట కలిసినప్పుడు ఏవేవో వాళ్లే కల్పించేసుకుని వైరల్ చేస్తుంటారు. అయినా మాకేం గొడవలు ఉంటాయి. నాతో ఎవరికీ గొడవలు ఉండవు.అప్పుడు వెళ్లిపోతా అనుకున్నా..ఆటలో గెలవడం కాదు.. ఎలా గెలిచాం అన్నదే ముఖ్యం. నేను గేమ్‌పైనే ఫోకస్ పెట్టా.. బయట వాళ్లు ఏం అనుకుంటున్నారా? అని ఆలోచిస్తే సరిగా ఫోకస్ పెట్టలేం. నేను ప్రియ హౌస్‌లో ఉన్నప్పుడు.. బయట ఏం జరుగుతుంది? నేనే వెళ్లిపోతానా? అనే డౌట్ వచ్చింది. కానీ నా మీద నాకు హోప్స్ వచ్చాయి.ఇది ఓపెన్ సీక్రెట్.. బిగ్ బాస్‌లో కనిపించనట్టే కనిపిస్తే జనం యాక్సెప్ట్ చేయరు..నాకు మంచి యాక్టర్ అవ్వాలని ఉంది అని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే చెప్పాను. నాకు అన్నీ హీరో లెవల్ స్టోరీలే వస్తున్నాయి. డిఫరెంట్స్ క్యారెక్టర్స్ చేయడానికి నేను సిద్ధమే. కానీ.. చాలామంది నేను

తిరుమల: ఇస్రో(ISRO) చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన బృందంతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా ఆనంద నిలయంలోకి వెళ్లిన నారాయణన్.. జీఎస్ఎల్వీ ఎఫ్-17, ఇఓఎస్- 05 నమూనా రాకెట్‌ను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇస్రో చేపడుతున్న జీఎస్ఎల్వీ-ఎఫ్17 సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 2:55 నిమిషాలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) రెండవ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వెళ్లనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Qutubullapur: 14 ఎకరాల ఆలయ భూమికి హద్దులు; రంగంలోకి రెవెన్యూ! Qutubullapur: జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరి రక్షణకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. మేడ్చల్ జిల్లా సర్వీ దేవాదాయ శాఖ కుత్బుల్లా పూర్ మండల రెవెన్యూ అధికారులు ఆలయ ప్రాంగ ణంలో స్థానిక నాయకులతో మంగళవారం సమా వేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆట యానికి కేటాయించిన Mఏకరాల 10 గుంటల స్థలం చుట్టూ పెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 318/1లో గల స్థలానికి సరిహద్దులను పరిశీలిస్తు న్నారు. కబ్జా అయిన ఆలయ స్థలాన్ని గుర్తించడా వికీ డిజిటల్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ ప్రాంగణంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహిస్తున్న అధికారులు వినాయక చవితి వండగలోపు డిజిటల్ సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేయాలని, కళ్ళా అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలని తీర్మానించారు. సర్వే దేవి ఆలయ భూములను రికార్డుల్లోకి ఎక్కిబడను వ్నట్లు అధికారులు. అదికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం 12 వారాల్లో సర్వేపూర్తి చేయాల్సి ఉన్నా స్థానిక రెవెన్యూ అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు వట్టాదారులతో ఉన్న మిబాబత్ వల్లనే ఇప్పటి వరకు సర్వే చేయకుండా తాత్సర్యం చేశారని నాయకులు ఆరోపించారు. కబ్జాదారుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్న రెవెన్యూ అది కబ్జాదారుల గుండెల్లో గుబులు జగద్గిరిగుట్ట వేంకటేశ్వరస్వామి ఆలయ భూముల పరిరక్షణకు అధికారులు శ్రీకారం ముట్టడంతో కబ్జాదారుల గుండెల్లో గుబులు మొదలైంది. కుల సంఘాల ముసుగులో ఆలయ స్థలాన్ని కబ్జాచేసి గదులు కట్టి లక్షల రూపాయ బంచారు. రెవెన్యూ అధికారులు డిజిటల్ సర్వే చేస్తే కబ్జాల బాగోతం బయేట పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తమపై కేసులు నమోదు అవుతాయని కంగారు పడుతున్నారు. దీంతో అధికారులు, నాయకుల మాటూ ప్రదక్షిణ చేయడం మొదలు పెట్టారు. కాదులు వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తు న్నారని

దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలిశాయని పురాణాల్లో తెలిపారు. ఎంతో చరిత్ర విశిష్టత కలిగిన ఆలయాల్లో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలసిన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుడిని వదించిన తర్వత.. ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవతలు, ప్రహ్లాదున్ని స్వామిని శాంత పరచడం నీవల్లే అవుతుందని చెప్తారు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ కద్రి ప్రదేశంలో స్వామిని శాంతపరచడంకోసం ప్రార్థనలు చేసాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామి వారు ప్రహ్లాదుని సమేతంగా ఉంటారు. స్వామిని పూజిస్తున్నట్టు ప్రహ్లాదుడు స్వామికి ఎడమవైపు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం మరియు స్వామిని పూజిస్తున్నట్టు ఉన్న ప్రహ్లదుని విగ్రహం ఖాద్రి వృక్షం క్రింద కొలువై ఉంటాయి. 10వ శతాబ్దంలో ఇక్కడ ఆలయం నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడ స్వామి వారి రూపంతో పాటు ఎవరికీ తెలియని ఒక దైవ రహస్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. అయితే ఆ స్వేదం ఎలా వస్తుందన్నది నేటికీ ఎవరూ చెప్పలేని పరిస్థితి. నేటికీ స్వామి వారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఇది ఒక సాక్షంగా భక్తులు నమ్ముతారు. అసలు కదిరి నరసింహాస్వామిని కాటమరాయునిగా ఎందుకు పిలుస్తారంటే. కదిరికి దగ్గరలో కొండకి అనుకోని కాటం అనే కుగ్రామం ఉండటం వలన కాటమరాయుడుగా స్వామికి పేరు వచ్చింది. అలాగే ఖాద్రి అని ఎందుకంటారంటే.. సంస్కృతంలో ఖా అనగా విష్ణు పాదం, అద్రి అనగా పర్వతం. విష్ణువు పాదాలు మోపడం వలన ఈ పర్వతానికి ఖాద్రి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఖాద్రి కాస్త కదిరిగా మారిందని ఇక్కడి ప్రజలు చెబుంటారు. అలాగే భారతదేశంలో ఎన్నో నరసింహస్వామి దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రహ్లాదునితో సహా

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, సినిమా ముచ్చట్లకు ఎంత క్రేజ్ ఉందో.. సెలబ్రిటీల జాతకాలపై వచ్చే వార్తలకు కూడా అంతే ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి చెప్పే జోస్యాలు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. గతంలో ఆయన చెప్పిన కొన్ని జాతకాలు నిజం కావడంతో, ఈయన చేసే వ్యాఖ్యలపై అందరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఈమధ్య సినిమావాళ్ల జాతకాల గురించి కామెంట్స్ మానేశాడు వేణు స్వామి. స్టార్స్ పర్సనల్ లైఫ్ పై వాఖ్యలు చేసి కేసలు ఫేస్ చేసిన ఆయన కామ్ అయ్యాడు. చాలా కాలం సైలెంట్ గా ఉన్న వేణు స్వామి.. ఈమధ్య కాలంలో మళ్లీ కాంట్రవర్సీలను కదిలిస్తున్నాడు. సినిమా వాళ్లకు.. ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా జాతకాలు చెపుతూ.. హోమాలు పూజలు చేయించే వేణుస్వామి.. సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇంత పేరున్న ఆయన జాతకం చెపితే ఎంత తీసుకుంటాడన్న అనుమానం చాలామందిలో ఉంది. కొంత మంది జనాల్లో వేణు స్వామి జాతకం చెప్పడానికి లక్షల రూపాయలు వసూలు చేస్తారనే ప్రచారం ఉంది. అయితే, ఈ అపోహను ఆయన పూర్తిగా ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద జ్యోతిష్యులు రూ. 50,000, రూ. 30,000 తక్కువలో తక్కువగా రూ. 16,000 వరకు వసూలు చేస్తుంటే, తాను మాత్రం కేవలం రూ. 6,000 మాత్రమే తీసుకుంటానని వేణుస్వామి స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా తన ఫీజులో ఎలాంటి మార్పు లేదని, కిందటి నుంచి చూస్తే అత్యంత తక్కువ ఫీజు తీసుకునే జ్యోతిష్యులలో తాను నాలుగో స్థానంలో ఉంటానని ఆయన చెప్పారు. పూజలు చేయడం విషయంలో తాను ఒక ప్రత్యేకమైన విధానాన్ని పాటిస్తానని వేణు స్వామి అన్నారు. వ్యక్తి ఆర్థిక స్థితిని బట్టి పూజల ఖర్చు నిర్ణయిస్తారు. రూ. 100 కోట్లు లేదా రూ. 10 కోట్లు ఉన్నవారికి రూ. 5 లక్షల పూజలు సూచిస్తే, ఆర్థికంగా అంత వెసులుబాటు

రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం నూతన శోభను సంతరించుకుంటోంది. ఈ ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుమల తరహాలో ఈ ఆలయం రూపుదిద్దుకుంటోంది. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులన్నీ ముగించాలని టీటీడీ నిర్ణయించింది. ఆలయ విస్తరణ, ఆధునీకరణ కోసం టీటీడీ ఇదివరకే 260 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.నిజానికి ఈ ఆలయ పనులు 2028 ఉగాది నాటికి పూర్తి చేయాలని మొదట్లో టీటీడీ భావించింది. అంతకంటే ముందే.. అంటే ఈ సెప్టెంబర్ లో తిరుమలలో నిర్వహించే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నాటికే ప్రధాన నిర్మాణాలన్నింటినీ పూర్తి చేయాలని ప్రతిపాదించింది. దీంతో విస్తరణ పనులు వేగం పుంజుకొన్నాయి. మూడు షిఫ్టుల్లో కొనసాగుతున్నాయి. రాత్రి వేళ కూడా పనులు చకచకా సాగుతున్నాయి. టీటీడీ జేఈఓ డాక్టర్ ఎ శరత్.. ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తోన్నారు.అర్ధరాత్రి వేళల్లో ఆలయ నిర్మాణ స్థలాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తూ, కాంట్రాక్ట్ సంస్థలను పరుగులు పెట్టిస్తున్నారు. ఆలయ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూసుకుంటోన్నారు. మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టినందున అదనపు కార్మికులను నియమించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి పూర్తిస్థాయిలో ఈ ఆలయాన్ని భక్తుల కోసం అందుబాటులోకి తీసుకుని రావాలనే పట్టుదలతో ఉంది టీటీడీ.దుబాయ్, సింగపూర్, దోహా.. ఇప్పుడిక ఏపీ రాజధాని అమరావతిలో.. !!ఈ నేపథ్యంలో వేంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులను సోమవారం ఆయన మరోసారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయం రెండో ప్రాకారం, నాలుగు గాలి గోపురాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని సూచించారు.హైదరాబాద్ లో నేటి నుంచి అందుబాటులోకి రానున్న భారీ హైలెవెల్ బ్రిడ్జి- ట్రాఫిక్ కు చెక్పనుల సందర్భంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటన్నింటిని
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేబోండా ఉమామహేశ్వరరావు, వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం.. ఏపీ రాజకీయాల్లో ఎంతలా కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఇద్దరూ కలిసి పాల్గొనటం, మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్ఠానం కూడా సీరియస్ అయ్యింది. బోండా ఉమాను పిలిచి వివరణ కూడాతీసుకుంది. ఇదే సమయంలోవైసీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దంటూ తమ నేతలకు కూడా టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ నేతలు ఒకే కార్యక్రమంలో పాల్గొనడం, ఒకే వేదికను పంచుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయివిజయవాడ చిట్టినగర్‌లో ఉన్న శ్రీ నగరాల సీతారామస్వామి, మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరిగింది. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడిగా బీజేపీ నేత పోతిన బేసు కంటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాలకమండలి సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని , విజయవాడ వెస్ట్ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి బుద్ధా వెంకన్న , జనసేన నేత సామినేని ఉదయభాను, వైసీపీ నేత పోతిన మహేష్ సహా.. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. ఆలయ అభివృద్ధికి పాలకమండలి కృషి చేయాలని కోరారు. నగరాల కులానికి చెందిన వారితో పాటుగా అన్నివర్గాల కోసం పనిచేయాలని సూచించారు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమేనని.. ఆ తర్వాత అందరం ఒక్కటేనన్నారు సుజనా చౌదరి. అయితే బోండా ఉమా, అంబటి రాంబాబు ఎపిసోడ్, వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని టీడీపీ అధిష్టానం సూచనల నేపథ్యంలో.. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధా వెంకన్న.. వైసీపీ నేత పోతిన మహేష్‌తో ఒకే వేదికపై కనిపించడం

Kothapeta: తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ 6వ వార్షికోత్సవం కొత్తపేట: బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 6వ వార్షికోత్సవాలకు కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ.. తన తండ్రి వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తనకు కార్మికుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులే కాకుండా.. ఎక్కడ పని చేసే కార్మికులకైనా కనీస వేతనాలు అమలు కావాలన్నది తమ ప్రభుత్వ అభిమతమన్నారు. కార్మిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని చేసి రక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. మధుయాష్కి గారు మాట్లాడుతూ... కార్మికుల పక్షపాతిగా మంత్రి వివేక్ గారు పనిచేస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు . రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. అమెరికాలోని భారత కాన్సులేట్ లో తాను పని చేస్తున్నప్పటి నుంచి వెంకటస్వామి గారితోపాటు వారి కుటుంబ సభ్యులతో తనకు అనుబంధం ఉందన్నారు. వెంకటస్వామి గారిని నాన్న అని పిలిచేవాడినని గుర్తు చేసుకున్నారు. మంత్రి వివేక్ గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని.. మంచి ఇండస్ట్రియలిస్ట్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా తమ కంపెనీ ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చేలా జీవో విడుదల చేసి అమలు చేయడం మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి పేద వర్గాల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం అన్నారు. ఈ

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఇందిరానగర్, నల్లకుంట 11 కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, నారాయణగూడ, ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 11.30 నుంచి 12.30 గంటల వరకు, రాఘవేంద్రస్వామి పరిధిలో 12 నుంచి 12.30 గంటల వరకు, కమలానగర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.45 గంటలవరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అలాగే 11కేవీ ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్.. లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, దోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. సాదత్‌నగర్ ఫీడర్.. పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఏఎస్రావు నగర్: చర్లపల్లి సాయినగర్ ఫీడర్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం ఆ ఫీడర్ పరిధిలోని ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఎంఆర్ఆర్ కాలనీ, కృష్ణారెడ్డినగర్, సుభా్‌షనగర్, రెడ్డికాలనీ, సాయినగర్, ఎన్ఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొత విధిస్తున్నట్లు ఏఈ టి.బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు. కాప్రా: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆర్టీసీ కాలనీ ఫీడర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జెడ్టీఎస్ తిరుమలనగర్, హనుమాన్‌నగర్, డాక్టర్ కృష్ణానగర్
మంత్రి కోమటిరెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకొని నిరసన తెలిపారు. దీంతో కోమటిరెడ్డి విద్యార్థులతో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేశారు. మరోవైపు ఈసెట్ (ECET) పరీక్షను రద్దు చేయబోమని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రతి నెలా రూ. 2,000 స్టైపెండ్ అందిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అలాగే మహబూబాబాద్‌లో విద్యార్థులపై దౌర్జన్యంగా వ్యవహరించిన టౌన్ సీఐ రఘుపతిరెడ్డిని విధులకు దూరం చేస్తూ ఎస్పీ శబరిష్ చర్యలు తీసుకున్నారు. ఈ వార్తకు సంబంధించిన

ఎట్టకేలకు రవితేజ హిట్ కొట్టాడు. చాలా కాలంగా మాస్ రాజా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరుముడి సినిమాతో థియేటర్లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తోనే ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా నేడు ( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ తో పాటు అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రేక్షకులు. శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు సినిమా చూసి అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కాగా సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ కు థియేటర్స్ పూనకాలతో ఊగిపోతున్నాయి.. ఆడియన్స్ ఈ పాటకు నెక్స్ట్ లెవల్ లో వైబ్ అవుతున్నారు. డాన్స్ లు చేస్తూ పాటను ఆలపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. స్క్రీన్ ముందు డాన్స్ చేస్తూ భజన చేస్తూ సందడి చేస్తున్నారు. అంతే కాదు కొన్ని థియేటర్స్ లో ఆడియన్స్ హారతులు కూడా పడుతున్నారు. Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్ ప్రస్తుతం ఇరుముడి సినిమాకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకదాంట్లో థియేటర్ లోపల స్క్రీన్ కు హారతి ఇస్తున్న వీడియో వైరల్ అవుతుంది. సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ ప్లే అవుతుండగా ఓ అభిమాని ఇలా స్క్రీన్ కు హారతి ఇస్తూ కనిపించాడు. ఈ వీడియోను రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఎట్టకేలకీ రవన్న హిట్ కొట్టేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్

'ఇరుముడి' .. ఫీల్ తో కూడిన టైటిల్. డివోషనల్ టచ్ ఇచ్చే టైటిల్. ఈ టైటిల్ ను చూడగానే ఈ సినిమా అయ్యప్పస్వామి నేపథ్యంలో నడుస్తునని అనుకుంటారు. అయ్యప్పస్వామి భక్తుడిగా రవితేజ .. ఆ స్వామి మహిమలను చూపిస్తారని అనుకోవడం సహజం. ప్రధానమైన కథ అదే అయితే ఈ సినిమాను కార్తీక మాసంలో రిలీజ్ చేసేవారు. అయ్యప్ప మాలతో ముడిపడిన ఈ కథలో కనిపించని మరో కోణం ఉంది. అదే ఈ సినిమాను కొత్తగా ప్రేక్షకుల ముంగిట నిలపనుంది. ఆ కోణం ఏమిటనేదే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా పోస్టర్స్ ను గమనిస్తే, రవితేజ .. అతని కూతురుగా ఒక పాపను ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చారు. నిజమే ఈ కథ అంతా హీరో ప్లస్ అతని కూతురు చుట్టూనే తిరుగుతుంది. హీరో ఎవరినీ లెక్కచేయడు .. ఎవరి మాటను వినిపించుకోడు .. తన కూతురు మాట తప్ప. అలాంటి హీరోను అతని కూతురు ఎలా ప్రభావితం చేస్తుంది? అతను అయ్యప్పమాల వేసుకోవడంలోని ఆంతర్యం ఏమిటి? ఆ మాల వేసుకున్న తరువాత అతని జీవితం ఎలా మారిపోతుంది? అనే కథతో ఈ సినిమాను రూపొందించారు. నిజానికి 2022లో వచ్చిన 'ధమాకా' తరువాత రవితేజకి పెద్ద హిట్ లేదు. ఏడెనిమిది సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించినస్థాయి విజయాలను అందించలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే 'ఇరుముడి' సిద్ధమైంది. ప్రియా భవాని శంకర్ .. బేబీ నక్షత్ర .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, రేపు ( ఆగస్టు 21) విడుదల

కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఎ1 నిందితురాలిగా బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో కస్టడీలో ఉన్న నటి పవిత్ర గౌడ జీవితంలో మరొక విషాదకర అధ్యాయం చోటుచేసుకుంది. ఆమె మొదటి భర్త సంజయ్ సింగ్ కన్నుమూసినట్లు సంచలన వార్త బయటకు వచ్చింది. అయితే, ఈ ఘోర విషాదం ఇటీవల జరిగింది కాదు. సుమారు 7 నుండి 8 నెలల క్రితమే రాజస్థాన్‌లో తుదిశ్వాస విడిచారనే వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చి పరిశ్రమ వర్గాలని, ప్రజలని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంజయ్ సింగ్, పవిత్ర గౌడల బంధం వెనుక పెద్ద కథే ఉంది. వీరిద్దరి ప్రయాణం 2007-2008 కాలంలో ఒకరినొకరు ప్రేమించుకోవడంతో ప్రారంభమైంది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి పీటల దాకా వెళ్లి ఇద్దరూ దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరికి ఖుషీ గౌడ అనే కుమార్తె కూడా జన్మించింది. అయితే, మనస్పర్థలు మరియు వ్యక్తిగత విబేధాల కారణంగా వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పరస్పర అంగీకారంతో 2013లో వీరు అధికారికంగా విడాకులు తీసుకుని వేర్వేరు మార్గాల్లో పయనించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత సంజయ్ సింగ్ తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారని సమాచారం. విడాకుల అనంతరం ఆయన మద్యపానానికి తీవ్రంగా బానిసయ్యారాని మీడియా వర్గాలు వెల్లడించాయి. విపరీతమైన ఆల్కహాల్ అలవాటు వల్ల ఆయన కాలేయ సంబంధిత వ్యాధులకు (లవర్ కాంప్లికేషన్స్) గురయ్యారు. బెంగళూరు వదిలి రాజస్థాన్‌కు వెళ్లిన ఆయన అక్కడ కొన్ని నెలల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. చికిత్స ఫలించక 7 నుంచి 8 నెలల కిందటే తన స్వస్థలంలో మరణించారు. రేణుకాస్వామి హత్య కేసు విచారణ సమయంలోనే సంజయ్ సింగ్ పేరు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చింది. ఆ సమయంలో పవిత్రతో తన గతాన్ని, 2013 నాటి విడాకుల వివరాలను ఆయన బహిరంగంగానే పంచుకున్నారు. ఆ తర్వాత సైలెంట్‌గా ఉండిపోయిన ఆయన మరణవార్త

అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి పంబ నుంచి శబరిమల కొండపైకి వెళ్లే భక్తులు తప్పనిసరిగా తలపై పవిత్రమైన మూటను ధరిస్తారు. దాన్నే ఇరుముడి లేదా ఇరుముడి కట్టు అంటారు. మలయాళంలో "ఇరు" అంటే రెండు, "ముడి" అంటే మూట లేదా కట్టు అని అర్థం. ఈ ఇరుముడి అనేది కేవలం పూజా సామగ్రిని తీసుకెళ్లే ఒక సంచి మాత్రమే కాదు. ఇది 41 రోజుల పాటు కఠినంగా ఉండే అయ్యప్ప స్వామి దీక్ష, నెయ్యాభిషేకం, పవిత్ర 18 మెట్లతో బలమైన సంబంధం కలిగిన అత్యంత ఆధ్యాత్మిక ప్రతీక. శబరిమల ఆలయ అధికారిక వివరాల ప్రకారం, ఇరుముడి సంప్రదాయం వెనుక మణికంఠుడు పులి పాలు తీసుకురావడానికి అడవికి వెళ్లిన కథ దాగి ఉంది. నాటి ప్రయాణాన్ని స్మరించుకుంటూ భక్తులు ఇరుముడిని తలపై మోస్తూ పంపా నదిలో స్నానం చేసి శరణఘోషతో కొండ ఎక్కుతారు. ఇరుముడి సంకల్పాన్ని ప్రధానంగా రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో మొదటిది దైవిక భాగం కాగా, రెండోది భక్తుని స్వంత అవసరాల కోసం ఉపయోగపడేది. ఇందులో స్వామివారికి సమర్పించే పవిత్ర వస్తువులు ఉంటాయి. పీచు తీసిన కొబ్బరికాయకు పైన రంధ్రం చేసి, అందులోని నీటిని పూర్తిగా తీసేసి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో నింపుతారు. దీనినే నెయ్య్ తేంగా (నెయ్యి కొబ్బరికాయ) అంటారు. ఇది శబరిమలలో అయ్యప్ప స్వామికి చేసే నెయ్యాభిసేకానికి చాలా ప్రధానమైనది. దీనితో పాటు పసుపు, కుంకుమ, గంధం, కర్పూరం, ధూప్‌స్టిక్స్, విభూతి, ఆవు నెయ్యి వంటి పూజా ద్రవ్యాలు ఉంటాయి. అలాగే నైవేద్యం కోసం బెల్లం, కండచక్కెర, జీడిపప్పు, ఎండుద్రాక్ష, పేలాలు, అటుకులు, తమలపాకులు, వక్కలు, నాణేలు సహా ఇతర కానుకలు ఉంచుతారు. ఈ భాగంలో భక్తుడు అంటే స్వామి యాత్రలో తన ఆహారం కోసం తీసుకెళ్లే బియ్యం, పప్పు ధాన్యాలు, ఇతర తినుబండారాలు, వ్యక్తిగత పూజా సామగ్రిని భద్రపరుచుకుంటారు. శబరిమలలో జరిగే నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి అత్యంత ముఖ్యమైన పూజా

Tondavada: తొండవాడ అగస్త్యేశ్వర ఆలయంలో గోశాల, అన్నదాన భవనాలకు భూమిపూజ! Tondavada: అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గోశాల, అన్నదాన భవనాలకు భూమిపూజ ఉదయం 3:30 గంటలకు గోశాల నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ కార్యక్రమాన్ని ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డి వేద పండితుల సమక్షంలో నిర్వహించారు. అనంతరం ఉదయం 9:30 గంటలకు అన్నదాన భవన నిర్మాణానికి వేద పండితుల ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి శ్రీ అగస్త్య మహాముని–లోపముద్ర దేవి ఆలయంలో మండల పూజా కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త మొగిలి ఇందుమౌళి రెడ్డితో పాటు తొండవాడ గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో గోశాల, అన్నదాన భవన నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడం పట్ల భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు

Krishna Temple: సంతాన భాగ్యం కోసం ఏళ్ల తరబడి నోములు, వ్రతాలు చేస్తూ అల్లాడిపోయే దంపతులకు ఆశల దీపంగా నిలుస్తోంది కర్ణాటకలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. సుమారు 1800 సంవత్సరాల సుదీర్ఘమైన ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెడితే చాలు, ఎలాంటి మాతృత్వ వేదనైనా తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. పూర్వం గంగరస మహారాజు యుద్ధం ముగించుకుని తిరిగి వస్తుండగా, ఆయన రథం చక్రం ఒక నిర్దిష్ట ప్రదేశంలో మట్టిలో కూరుకుపోయింది. అంతకుముందే ఆయనకు కలలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించి తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని సూచించాడు. తవ్వకాలు జరపగా స్వయంభూగా వేణుగోపాల స్వామి విగ్రహం లభ్యమైంది. ఆ విగ్రహాన్ని కౌండిన్య మహర్షి తన ఆశ్రమంలో ప్రతిష్ఠించడంతో ఈ క్షేత్రానికి 'కౌండిన్య మహర్షి క్షేత్రం' అని పేరు వచ్చింది. మూలవిరాట్టు త్రిభంగి ముద్రలో మురళి ఊదుతూ కంటికి ఇంపైన రూపంలో దర్శనమిస్తారు. ఈ స్వామిని స్థానికులు 'హుచ్చప్ప గోపాల్' అని పిలవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక చోళ రాజు సంతానం కోసం ఇక్కడ ప్రార్థించగా, రాణికి ఆడపిల్ల జన్మించింది. తీవ్ర నిరాశతో రాజు ఆత్మహత్యకు సిద్ధపడగా, ఆ పసిపాప అద్భుత రీతిలో మగపిల్లాడిగా మారిపోయింది. స్వామివారి ఈ విచిత్ర లీల వల్ల ఆయనను 'హుచ్చు గోపాల్' అని పిలవడం మొదలుపెట్టారు. మైసూర్ రాజు కాంతీరవ నరసింహ రాజ వడియార్కూడా ఇక్కడ పూజలు చేసి సంతాన ప్రాప్తి పొందినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో అత్యంత విశేషమైనది కౌండిన్య మహర్షి ఉపయోగించిన పవిత్రమైన 'దండం'. ఈ దండంలో మహర్షి తపోశక్తి నిక్షిప్తమై ఉందని నమ్ముతారు. ప్రతీ శనివారం, ఆదివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులకు ఈ దండ స్పర్శ భాగ్యం కల్పిస్తారు. ఈ దండాన్ని తాకడం వల్ల సంతాన లేమి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ధన

తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మెగా జంట వరుణ్ తేజ్(VarunTej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంట బుధవారం హైదరాబాద్‌లోని తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని (Shree Tadbund Veeranjaneya Swami Temple) సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ నరేందర్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలను సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ దంపతులు మాట్లాడుతూ.. ఎంతో మహిమగల వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని చూసేందుకు ఆలయం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరోహీరోయిన్లతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడంతో అక్కడ సందడి నెలకొంది

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచిఉన్నారు. సోమవారం హుండీ ఆదాయం: రూ.6.12 కోట్లు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 80,905 తలనీలాలు సమర్పించినవారు: 33,539 ఈ వార్తలు కూడా చదవండి: యూఎస్‌కు తగ్గని భారత్ ఎగుమతులు హోటల్లో అగ్ని ప్రమాదం.. 9మంది మృతి Read Latest AP News And Telangana News And International News And Telugu News

Nellore: నరసింహకొండలో శేషవాహన సేవ, గిరి ప్రదక్షిణ ఉత్సవం! ఈ వార్తకు సంబంధించిన
తిరుమలలో విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రజల తరఫున నిలబడి, వారి గొంతుకను అటు అసెంబ్లీతో పాటు ఇటు పార్లమెంట్‌లోనూ గట్టిగా వినిపించడమే తన ప్రధాన ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం లేకుండా రైతాంగం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. విజయవాడ వేదికగా నిర్వహించే మీడియా సమావేశంలో ఈ నెలలోనే భవిష్యత్ రాజకీయ ప్రణాళిక, పార్టీ కార్యాచరణను పూర్తి వివరాలతో వెల్లడిస్తానని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తకు సంబంధించిన

Venuswamy : విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర్నుంచి తమిళనాడు రాజకీయం అంతా త్రిష చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. త్రిష – విజయ్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని రూమర్స్ రావడం, అవి నిజమే అన్నట్టు త్రిష – విజయ్ చేష్టలు ఉండటంతో వీరిద్దరూ రోజూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వైరల్ అయిన వేణుస్వామి విజయ్, త్రిషలపై కూడా వ్యాఖ్యలు చేసారు. Also See : Patas Faima : తన భర్త, ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూ’కి వెకేషన్ వెళ్లిన జబర్దస్త్ ఫైమా.. ఫొటోలు.. వేణుస్వామి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రిషతో కలిస్తే విజయ్ కి కలిసిరాదు. ‘అతడు’ సినిమా సమయంలోనే నేను త్రిషకు జాతకం చెప్పాను. ఆమె రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు అని నేను అప్పుడే చెప్పాను. ఆమెకు పాలిటిక్స్ సెట్ అవ్వవు. త్రిష దగ్గరికొస్తే విజయ్ కే ప్రమాదం. త్రిషతో విజయ్ జాతకం సరిగ్గా లేదు. త్రిష కూడా రాజకీయాల్లోకి రావడం కరెక్ట్ కాదు. ఆమె ఉపముఖ్యమంత్రి అవ్వదు అని అన్నారు. దీంతో వేణుస్వామి వ్యాఖ్యలు ఈసారి తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడులో కూడా చర్చగా మారాయి

సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వేదికగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వివాదాస్పద జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీల జాతకాలపై ఆయన చేసే వ్యాఖ్యలు, నిర్వహించే పూజలు తరచూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వైరల్ అవుతుంటాయి. కొందరు ఆయన జోస్యాలను తీవ్రంగా విమర్శిస్తే, మరికొందరు ఆసక్తిగా గమనిస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాజకీయ భవిష్యత్తు, ఆయన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలపైనే దృష్టి సారించాడు. అయితే ఆయన మళ్లీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాడు? టీడీపీ బాధ్యతలు తీసుకుంటాడా లేదా? అనే అంశంపై నందమూరి అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఎల్లప్పుడూ ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలకు సంబంధించి వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వేణుస్వామి మాట్లాడుతూ.. 'జూనియర్ ఎన్టీఆర్ అసలైన పుట్టినరోజు వేరు, ఆయన బయట ప్రపంచానికి కనిపించేలా జరుపుకునే పుట్టినరోజు వేరు. ఆయన ఒరిజినల్ బర్త్‌డే డేట్ నా ఒక్కడికే తెలుసు. ఎన్టీఆర్ కచ్చితంగా భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తాడు, కానీ ఇప్పట్లో మాత్రం ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదు. 2030 సంవత్సరం వరకు రాజకీయాల్లోకి రావద్దని నేనే స్వయంగా ఆయనకు చెప్పాను' అంటూ బాంబు పేల్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అసలు పుట్టినరోజు, 2030 పొలిటికల్ ఎంట్రీపై వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో
తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో క్రికెటర్ తిలక్ వర్మ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన, స్వామివారి అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు. శ్రీవారి దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని తిలక్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వార్తకు సంబంధించిన

భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం దొరకడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ తిరుమలకు వచ్చిన విషయం తెలుసుకున్న తోటి భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కోసం పోటీ పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు) దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్ సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ -2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని తొమ్మిది షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం సర్కిల్ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు. శనివారం హుండీ ఆదాయం: రూ.3.93 కోట్లు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 97,014 తలనీలాలు సమర్పించినవారు: 37,108 ఈ వార్తలు కూడా చదవండి: బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. కూరగాయలు కాదు.. కాలకూట విషం Read Latest AP News And Telangana News And International News And Telugu News

దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్, ఆగస్టు 17: దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈరోజు(సోమవారం) జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వెయ్యి పరిశ్రమలు ఉన్నాయని.. స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం ఉందని అన్నారు. జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యజమానులు కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది అని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో, దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందన్నారు. టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. స్థానిక పరిశ్రమలకు కూడా ఉద్యోగులను, స్కిల్డ్ లేబర్‌ను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు కేవలం సాఫ్ట్వేర్ పైనే దృష్టి సారించకుండా... ఇంకా చాలా రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. సింగరేణి ప్రాంతం మందమర్రిలో జర్మన్ నేర్పిస్తున్నామని.. వారిలో బీ2 లెవల్ వచ్చిందన్నారు. వారి కోసం రూ.25 లక్షల జీతం ఎదురుచూస్తోందని తెలిపారు. వీసా ఖర్చులను కూడా సగం వరకూ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. విదేశాలకు వెళ్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

దక్షిణ భారతదేశం అద్భుతమైన దేవాలయ నిర్మాణ శైలికి, ఆధ్యాత్మిక వైభవానికి, సుదీర్ఘ సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ఇక్కడ ఉన్న ప్రాచీన ఆలయాలు కేవలం ప్రార్థనా మందిరాలు మాత్రమే కావు. ఇవి మన పురాతన సంస్కృతికి, విశిష్ట కళలకు, సమాజ పురోగతికి ప్రాథమిక మూలస్తంభాలుగా నిలిచాయి. చరిత్ర, భక్తి, అద్భుత శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా దక్షిణ భారతదేశంలో వెలసిన, ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పకుండా దర్శించాల్సిన టాప్ 5 దివ్య క్షేత్రాల వివరాలు ఇక్కడ చూద్దాం. తమిళనాడులోని పవిత్ర రామేశ్వరం ద్వీపంలో నెలకొని ఉన్న రామనాథస్వామి ఆలయం పరమశివుడు కోలువైన దేవాలయం.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అఖిల భారత చార్ ధామ్ యాత్రలో ఒక అత్యంత ముఖ్యమైన భాగంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. రామాయణ పురాణాల ప్రకారం, శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి లంకకు వెళ్లడానికి ముందు పరమశివుడిని పూజించడం కోసం స్వయంగా ఈ ఆలయ నిర్మాణాన్ని సూచించాడని, ఇక్కడి ప్రధాన లింగాన్ని ప్రతిష్ఠించాడని భక్తులు బలంగా నమ్ముతారు. తరువాతి కాలంలో పాండ్య రాజులు, జాఫ్నా రాజవంశ పాలకులు ఈ ఆలయాన్ని భారీ గోపురాలు, విశాలమైన ప్రాకారాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొడవైన వరండాలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. మధురై నగరంలోని వైగై నది ఒడ్డున వెలసిన శ్రీ మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయం దక్షిణ భారత దేవాలయ శిల్పకళా నైపుణ్యానికి ఒక నిలువుటద్దం లాంటిది. పార్వతీదేవి అవతారమైన మీనాక్షి అమ్మవారికి, శివుని రూపమైన సుందరేశ్వరునికి ఈ ప్రాచీన ఆలయం ఇది. క్రీస్తు శకం 6వ నుండి 9వ శతాబ్దాల మధ్య కాలం నాటి తమిళ సంగం సాహిత్యంలో కూడా ఈ దివ్య ఆలయ ప్రస్తావన స్పష్టంగా ఉంది. ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఏకంగా 33,000 కంటే ఎక్కువ రంగురంగుల శిల్పాలు, అద్భుతమైన ఆకృతులు ఉన్నాయి. భక్తులను

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలోని వ్రతాలు, పూజలు అన్నీ భక్తిభావంతోనే కాక సామాజిక క్షేమాన్ని కాంక్షిస్తూ కూడా జరుగు తుంటాయి. అలాంటి పూజలు, వ్రతాలకు శుభప్రదం... శ్రావణమాసం. చాంద్రమానం ప్రకారం వర్ష రుతువులో వచ్చే ఐదవ నెల ఇది. పౌర్ణమి ఏ నక్షత్రంతో కూడుకుని వేస్త ఆ మాసానికి ఆ పేరొస్తుంది. శ్రవణా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసం కనుక దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఈ మాసానికి భారతీయ జీవన విధానంలో ఎంతో విశిష్ట స్థానం ఉంది. లక్ష్మీదేవి, పరమశివుడు, మహా విష్ణువు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఆరాధనకే కాక కొందరు దైవాంశ స్వరూపులు, కారణజన్ములు జనించిన మాసమిది. వ్రతాచరణకు ఎంతో అనుకూలమైనది. గౌరీదేవి ఆరాధన... శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవి పూజలు, నోములు, వ్రతాలు గుర్తుకువస్తాయి. ఈ మాసంలో వచ్చే ప్రతీ మంగళవారం, శుక్ర వారం మహిళలకు ఎంతో ముఖ్యం. కొత్తగా పెళ్ళైన ముత్తైదువలు ఐదేళ్లపాటు ఈ మాసంలో ‘మంగళగౌరి వ్రతం’ ఆచరిస్తారు. తమ సౌభాగ్యం నిలిచి ఉండాలని, భర్త ఆయు రారోగ్యాలతో వర్థిల్లాలని గౌరీదేవిని భక్తితో ఆరాధిస్తారు. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన పండుగ ‘వరలక్ష్మీ వ్రతం’. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. ఒకవేళ ఆ రోజు వీలు కాకుంటే ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారమైనా వరలక్ష్మీ పూజ చేసుకో వచ్చు. ఇళ్లను తోరణాలతో, ముగ్గులతో అలంకరించి, కలశాన్ని స్థాపించి, లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. తొమ్మిది పోగుల తోరానికి పూజ చేసి చేతికి కట్టుకుంటారు. ముత్తైదు వులను పిలిచి తాంబూలాలు, వాయనాలు ఇవ్వడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. శ్రావణ మాసం కేవలం విష్ణు, లక్ష్మీ ఆరాధనకే కాదు... శివారాధనకు కూడా పరమ పవిత్రమైనది. ఉత్తర భారతదేశంలో ఈ మాసాన్ని ‘సావన్’ అని పిలుస్తూ పూర్తిగా శివునికి చేేస పూజలు, అభిషేకాలకు తమ సమయాన్ని అంకితం

వేములవాడ, ఆగస్టు 15: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలోని సంకల్ప మండపంలో భక్తుల సాక్షిగా ఇద్దరు సేవకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇద్దరు గొడవపడి.. తన్నుకున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల స్వామి వారి ఆలయంలో పరిచారకులుగా చేరిన ఉద్యోగులకు ఆలయ పరిపాలన కార్యాలయం స్థానాచార్యుల సూచనలతో విధులను కేటాయించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఇద్దరు పరిచారకులకు సంకల్ప మండపంలో విధులను కేటాయించారు. ఆగస్టు 15, శనివారం ఉదయం దాదాపు 10 గంటల సమయంలో ఇద్దరు కూడా విధులకు హాజరయ్యారు. ఇందులో ఒకరికి మరొకరు ఫోన్ చేసి.. ‘అక్కడ ఎవరెవరు విధుల్లో ఉన్నారు?’ అని అడిగి తెలుసుకున్నారు. అయితే.. అక్కడ విధుల్లో ఉన్న వారందరి పేర్లు చెప్పినప్పటికీ తోటి పరిచారకుడి పేరు మాత్రం అతడు చెప్పలేదు. దీంతో మరో పరిచారుకుడు అతడి దగ్గరికి వెళ్లి.. ‘ఎవరు ఫోన్ చేశారు?’ అని అడిగాడు. అందుకు అతడు ‘అది నా పర్సనల్’ అని చెప్పాడు. ‘మరి.. ఎందుకు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వారందరి పేర్లు చెప్పావు? అడిగిన వారికి నా పేరు ఎందుకు చెప్పలేదు?’ అని రెండో వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకున్నారు. భక్తులు ఉండే సంకల్ప మండపంలోనే ఒక్కసారిగా వారు గొడవకు దిగడంతో భక్తులు సైతం నివ్వర పోయారు. అప్రమత్తమైన అర్చకులు, విధుల్లో ఉన్న ఉద్యోగులు ఆ ఇద్దరిని పరిపాలన కార్యాలయంలోని అధికారి వద్దకు తీసుకెళ్లారు. గొడవను గురించి తెలుసుకున్న అక్కడి అధికారి మీకంటే వయసులో పెద్దవారితో ఎట్లా మాట్లాడుతారు? అంటూ మందలించడమే కాకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని కూడా వారిని హెచ్చరించారు. అయితే.. బయటకు వచ్చిన తర్వాత సదరు పరిచారకుడు నాకేంటి ఈయన చెప్పేది? అంటూ అధికారిపై ఉద్యోగుల ముందే నానా దుర్భాషలాడినట్లు తెలిసింది. ఇటీవలే వేములవాడ రాజన్న ఆలయంలో పరిచారకులుగా విధుల్లో చేరిన సదరు ఉద్యోగులు క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, పాపాలు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నివేదిక ద్వారా బట్టబయలయ్యాయని, వీటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు. గురువారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిట్ నివేదికలో వెలుగు చూసిన వాస్తవాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని అన్నారు.సిట్ నివేదిక ప్రకారం, వాల్యుయేషన్ ప్రక్రియలో పాల్గొన్న 158 మంది వాల్యుయేటర్లలో కేవలం 72 మందికి మాత్రమే అర్హత ఉందని, మిగిలిన వారంతా అనర్హులేనని మంత్రి స్పష్టం చేశారు. అధికారిక వ్యవస్థను కాదని, ప్రైవేట్ జీమెయిల్ ఖాతాలు, వ్యక్తిగత ఐడీలు, డ్రైవ్‌ల ద్వారా వాల్యుయేషన్ నిర్వహించడం దారుణమని అన్నారు. అంతేకాకుండా, అభ్యర్థుల ఆన్సర్ షీట్లను ఓ ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించి, సీసీ కెమెరాలు గానీ, యూనివర్సిటీ నిపుణుల పర్యవేక్షణ గానీ లేకుండా 86 రోజుల పాటు అక్కడే ఉంచి మూల్యాంకనం జరిపారని ఆరోపించారు.ఎంపికైన 165 మంది అభ్యర్థుల్లో 160 మంది (96.97 శాతం) ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు జరిగాయని, మొత్తం 736 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను పరిశీలిస్తే 97.55 శాతం షీట్లలో దిద్దుబాట్లు కనిపించాయని సిట్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో వైట్నర్ వాడకం, సంతకాలు సరిపోకపోవడం, ఒకే పేపర్లో రెండు రకాల ఇంక్ వాడటం, చీఫ్ ఎగ్జామినర్ సంతకాలలో తేడాలు వంటి అనేక అక్రమాలు తేలాయని వివరించారు. ఇవి

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై వైసీపీ తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అక్కడ జరుగుతున్న మైనింగ్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వారసత్వ సంపద నాశనమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభలో ఖనిజాల చట్ట సవరణ బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పంచదార్లలోని పురాతన ప్రదేశాలను, సహజ జలాశయాలను పరిరక్షించేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు పర్యటన వేళ జగన్ గో బ్యాక్ ఫ్లెక్సీలు.. పొలిటికల్ టెన్షన్!పురాతన వారసత్వ క్షేత్రాలకు తీవ్ర ముప్పు!పంచదార్లలో ఉన్న సంరక్షిత బౌద్ధ క్షేత్రం, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఆలయ సముదాయం గుండా ప్రవహించే ఐదు సహజ జలాశయాలతోనే పంచదార్లకు ఆ పేరు, గుర్తింపు ముడిపడి ఉన్నాయని వివరించారు.రక్షిత ప్రాంతాల వద్దకు మైనింగ్ పొంచి రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పర్యావరణానికి జరుగుతున్న హానిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని, నీటి కాల్వలపై హైడ్రోలాజికల్ అధ్యయనం జరిపించాలని కోరారు. ఆ అధ్యయనం పూర్తయ్యే వరకు అక్కడ ఎలాంటి మైనింగ్ జరగకుండా తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల వేళ జగన్ అనూహ్య నిర్ణయం, కీలక నియామకం- కొత్త లెక్కలు..!!రాష్ట్రాల ఆదాయాలు, పర్యావరణాన్ని పరిరక్షించాలి!ఖనిజాల చట్ట సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. ఖనిజ సంపద ప్రజల ఆస్తి అని, దాని నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి స్పష్టమైన మైనింగ్ విధానం అవసరమే అయినప్పటికీ, అది రాష్ట్రాల ఆదాయాలకు, స్థానిక ప్రజల జీవనోపాధికి లేదా పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించకూడదని హితవు పలికారు. మైనింగ్ వల్ల తలెత్తే పర్యావరణ, మౌలిక సదుపాయాల వ్యయ భారాన్ని రాష్ట్రాలే మోస్తాయని, అందుకే మైనింగ్

ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. అమరావతి, ఆగస్టు 13: ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగానే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. డీఎస్సీపై వచ్చిన వందల కేసులను చట్టపరంగా అధిగమించి నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో APPSC గ్రూప్ 1పై సిట్ నివేదిక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని మంత్రి తెలిపారు. ‘అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకనం చేయించారన్న ఆరోపణలపై సమాధానం ఏది? ప్రైవేట్ రిసార్టులో ఆన్సర్షీట్ల మూల్యాంకనం ఎందుకు జరిగింది? సీసీ కెమెరాలు, అధికారిక పర్యవేక్షణ లేకుండా మూల్యాంకనం ఎలా జరిగింది? APPSC ఆధీనంలో ఉండాల్సిన ఆన్సర్‌షీట్లు ప్రైవేట్ ప్రదేశానికి ఎలా చేరాయి? వ్యక్తిగత Gmail ఖాతాలు, Google Driveల ద్వారా మూల్యాంకనం జరిగిందన్న ఆరోపణలకు వివరణ ఏది?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మూల్యాంకన ప్యానల్ అర్హతలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ గుర్తించిన మార్కుల వ్యత్యాసాలపై పూర్తి వాస్తవాలు బయటపెట్టాలని మంత్రి అన్నారు. ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు, వైట్నర్ వినియోగంపై ఫోరెన్సిక్ నివేదిక ఏమి చెబుతోందని అడిగారు. సంతకాలు సరిపోని దిద్దుబాట్లు, వేర్వేరు ఇంకుల వినియోగంపై విచారణ అవసరమన్నారు. ఒకే ఆన్సర్‌షీట్‌లో వేర్వేరు ఇంకులు ఎందుకు? బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటం చేసే హక్కు ఎవరికీ

సాక్షి, ఢిల్లీ: అనకాపల్లిలో పంచదారల కొండలను పరిరక్షించాలి రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. పంచదారల వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలన్నారు. పంచదారల కొండలలో జరిగిన మైనింగ్‌పై వెంటనే విచారణ జరగాలని కేంద్రాన్ని ఆయన కోరారు. పవిత్ర, చారిత్రక, పర్యావరణ సున్నిత ప్రాంతాలను ‘నో మైనింగ్ జోన్’లుగా గుర్తించాలన్నారు. రాజ్యసభలో మైన్స్ అండ్ మినరల్స్ బిల్లు పై చర్చ జరిగింది. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘అనకాపల్లిలో పంచదారల కొండను పరిరక్షించాలి. పంచదారలను మైనింగ్-ఫ్రీ హెరిటేజ్ జోన్‌గా ప్రకటించాలి. పంచదారల వారసత్వ ప్రాంతాన్ని కాపాడాలి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రక్షిత ప్రాంతం ఇది. పంచదారల హిల్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఈ కొండపై ఏఎస్ఐ రక్షిత ధన దిబ్బలు బౌద్ధ సైట్, శ్రీ ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి 90-200 మీటర్ల దూరంలోనే క్వారీలు జరుగుతున్నాయి. 2024–2025 శాటిలైట్ చిత్రాలు వారసత్వ జోన్ వైపు క్వారీలు వేగంగా ముందుకు సాగుతున్నట్లు చూపిస్తున్నాయి. బ్లాస్టింగ్, తవ్వకాల వల్ల నీటి వనరులు, భూగర్భ జలాలు, కొండ స్థిరత్వం ప్రమాదంలో పడిపోయింది. వెంటనే సమగ్ర పర్యావరణ అంచనా, హైడ్రోజియోలాజికల్ స్టడీ, మైనింగ్ నిలిపివేత, ‘మైనింగ్-ఫ్రీ హెరిటేజ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. 2019–2024లో ఏపీఎండీసీ ద్వారా ఆన్లైన్ బుకింగ్, స్థిర ధరలతో సంవత్సరానికి సుమారు ₹765 కోట్లు (5 ఏళ్లలో ₹3,825 కోట్లు) రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ప్రస్తుత ‘ఫ్రీ ఇసుక’ విధానంతో రాష్ట్ర ఆదాయం పూర్తిగా కోల్పోయి, కృష్ణ, పెన్నా నదుల్లో అక్రమ తవ్వకాలు, చేతిరాత స్లిప్‌లు, క్యూఆర్ కోడ్లతో అనధికారిక వసూళ్లు, నదీతీరాలు, భూగర్భ జలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పవిత్ర, చారిత్రక, పర్యావరణ సున్నిత ప్రాంతాలను ‘నో మైనింగ్ జోన్’లు గుర్తించాలి. రాష్ట్రవ్యాప్త డిజిటల్ ట్రేసబిలిటీ అండ్ బుకింగ్ వ్యవస్థ రావాలి. మైనింగ్ అనుమతులను నీటి భద్రత, స్థానిక హైడ్రాలజీకి అనుసంధానం చేయాలి. ఫెడరల్ రక్షణలు, రాష్ట్ర ఆదాయాలు, పర్యావరణ

జగిత్యాల జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం హుండీలో డమ్మీ 500 నోట్లు కనబడడం సంచలనంగా మారింది. సుమారుగా రెండు లక్షల 50 వేల డమ్మీ నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు హుండీలో వేసినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. వెంటనే ఈ హుండీలో నుంచి ఆ డమ్మీ నోట్లోనే తీసి పక్కకు పెట్టారు. ఎవరో కావాలనే డమ్మీ నోట్లు హనుమాన్ హుండీలో వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా ఎందుకు వేసి ఉంటారనే కోణంలో విచారణ చేపడుతున్నారు. అంతేకాకుండా ఈ నాలుగు ఐదు రోజుల్లో సిసి ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఆ డమ్మీ నోట్లువేసిన వ్యక్తిని గుర్తుపట్టలేదు. అయితే హుండీ భద్రత పైన భక్తుల్లో కలవరం మొదలైంది. హుండీ సమీపంలో సీసీ కెమెరాలు ఉండడంతో, ఈ వ్యక్తిని గుర్తుపట్టే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ఆలయంలో కావాలనే డమ్మీ నోట్లు వేశారని తెలుస్తుంది. అయితే.. హుండీ ని పూర్తిస్థాయిలో లెక్కించిన తర్వాత.. ఈ డమ్మీ వ్యవహారం పైన పోలీసులకు ఫిర్యాదు చేస్తామని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. మొట్ట మొదటిసారిగా హుండీలో డమ్మీ 500 నోట్లు రావడం కలకలంగా మారింది. ఈ విధంగా హుండీలో 500 డమ్మీ నోట్లు వేసి. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అధికారులు తక్షణమే స్పందించి.. డమ్మీ నోట్లు వేసిన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు

తిరుపతి (తితిదే): తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డీ టోకెన్ల జారీని బుధవారం నిలిపేయనున్నట్లు తితిదే మంగళవారం ప్రకటించింది. గురువారం దర్శనానికి సంబంధించి బుధవారం జారీ చేయనున్న టోకెన్లు ఇవ్వరని.. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం టోకెన్లు జారీ చేస్తారని తెలిపింది. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. అయితే టోకెన్ల జారీ నిలిపివేతపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన వారికి వచ్చినట్లు సర్వదర్శనం చేయించే ఆలోచనతో తితిదే ఈ విధానాన్ని గత ఆరు నెలల్లో 7 వారాల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తోంది. టోకెన్ల జారీ చేయకపోవడంతో దూర ప్రాంత భక్తులకు అవస్థలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మంగళవారం ఉదయం ఆరు గంటలకే పది వేల ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేశారు. వీరికి బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనం కానుంది. అదేవిధంగా శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు 2 వేల టోకెన్లు జారీ చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. చచ్చిపోయిన కోళ్ల కోసం జనం ఎగబడిన ఘటన తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో చోటుచేసుకుంది. ఎప్పుడూ నీలిరంగులో కళకళలాడే కృష్ణమ్మ ప్రస్తుతం గోదావరి జలాలతో ఎరుపెక్కింది

దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ ప్రయోజనాల కోసం పేరడీలుగా మార్చి అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర నామాలను కించపరచడం దారుణమని ఆయన పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.నెల్లూరు నగరంలో చోటుచేసుకున్న ఓ ఘటనను ఆయన ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ రాజకీయ పార్టీ, తమ కార్యక్రమాల్లో పవిత్రమైన గోవింద నామాలను పేరడీగా వాడుకోవడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని అన్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారి తీరు ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం అపహాస్యం చేయడమే కాదని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రపూరిత ఆలోచన అని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ధార్మిక విశ్వాసాలతో ముడిపడిన అంశాలను చులకన చేసే ఇలాంటి చర్యలను సహించకూడదని స్పష్టం చేశారు.రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరూ కూడా దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలను అపహాస్యం చేసేందుకు వినియోగించవద్దని ఆయన హితవు పలికారు. భక్తికి సంబంధించిన పవిత్రమైన విషయాలను గౌరవించడం అందరి బాధ్యత అని ఆయన సూచించారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది
కుకింగ్ షో అయినా రియాల్టీ షో అయినా ఏ షో అయినా సరే దానికంటూ ఓ టీం ఉంటుంది. కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని షోల్లో కొన్ని సార్లు వీళ్లే ఎందుకు గెలిచారు? వీళ్లని ఎందుకు ఎలిమినేట్ చేశారు.. అనేది చెప్పడం కష్టమే అవుతుంది. ఆడియెన్స్ ఓటింగ్ అయినా, జడ్జ్‌ల జడ్జ్మెంట్ అయినా కూడా షోని నిర్వహించే టీం పక్కన పెట్టేయగలదు. అందుకే ఈ మధ్య ఏ షోలో ఎవరు గెలిచినా కూడా కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ విన్నర్ మీద చర్చ మొదలైంది. తనూజ దాదాపు విన్నర్ అని సీజన్ ఆరంభంలోనే అందరికీ అర్థమైంది. ఆషిక, డెమాన్ పవన్, నిఖిల్, రాకేష్ వంటి వారు కూడా అద్భుతంగా వంటలు వండేవారు. టాప్ 5లో వీరంతా ఉండటానికి అర్హులే. అయితే తనూజను విన్నర్‌ని చేయడంతో కొంత మంది స్టార్ మా ముద్దు బిడ్డ కదా.. విన్నర్‌ని చేస్తారులే అని కామెంట్లు చేశారు. కానీ తనూజ కూడా తన కుకింగ్‌తో ప్రతీ వారం టాప్‌లో నిలుస్తూ వచ్చింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్లో ఆషిక కూడా అదరగొట్టేసింది. కానీ చివరకు వచ్చిన రౌండ్లో తనూజ, డెమాన్ పవన్ టాప్ 2 ప్లేస్‌లోకి వచ్చారు.ఇక విన్నర్‌గా తనూజను ప్రకటించేశారు. అదంతా ముగిసింది. కానీ జడ్జ్‌ల్లో ఒకరైన ముచ్చర్ల అరుణ రియల్ విన్నర్ డెమాన్ పవన్ అని ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ఎంత వేగంగా డిలీట్ చేసినా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అయితే వైరల్ అవుతాయి. ముచ్చర్ల అరుణ అలా పోస్ట్ వేసి డిలీట్ చేయడంతో అందరికీ అనుమానం మొదలైంది. తనూజ రియల్ విన్నర్ కాదా? ఆమెను కావాలనే గెలిపించారా? అని అంతా అనుకోవడం ప్రారంభించారు. అయితే ముచ్చర్ల అరుణ మాత్రం డ్యామేజ్ కంట్రోల్‌కి

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ హీరో దర్శన్ స్నేహితుడు రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ప్రదోష్, తనను క్షమాభిక్ష సాక్షిగా పరిగణించాలని కోర్టులో ఒక దరఖాస్తు దాఖలు చేశాడు. ఈ కేసులో 14వ నిందితుడైన ప్రదోష్, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కోర్టుతో పంచుకుంటానని.. అందుకు తన క్షమాభిక్షను పరిగణించాలని దరఖాస్తు చేసుకున్నాు. ప్రదోష్ దాఖలు చేసిన దరఖాస్తులో కేసుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆరోజు జరిగిన ఘటన నుంచి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతి అంశాన్నీ అతడు పిటిషన్ లో పేర్కొన్నారు. పవిత్ర గౌడకు సందేశాలు పంపించాడని దర్శన్ రేణుకాస్వామిని నిలదీశాడని.. ఆ సమయంలో అతడిని దారుణంగా కొట్టడంతో అతడి తల నుంచి రక్తం రావడం తాను చూశానని అన్నారు. అంతేకాకుండా అతడిని కిడ్నాప్ చేసి బంధించిన ప్రాంతానికి పవిత్ర గౌడను పిలిచి ఆమె చెప్పుతో కొట్టేలా చేశారని.. ఆ తర్వాత అతడిపై విచక్షరణ రహితంగా దాడి చేసి లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్ కు వేలాడదీసి నైలాన్ తాడుతో కొట్టారని ప్రదోష్ తెలిపారు. అంతలా కొడితే అతడు చనిపోతాడని తాను చెప్పినప్పటికీ ఎవరు వినిపించుకోలేదని.. అతడికి ఆహారం, నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా దర్శన్ అతడి ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నారని.. దీంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడని తెలిపారు. వెంటనే దర్శన్ తన రెండు కాళ్లతో బాధితుడి ఛాతీపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించాడని.. తాను జోక్యం చేసుకుని అతడిని పక్కకు లాగానని తెలిపారు. అయితే రేణుకాస్వామి చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని సద్ధుమణిగేలా చేయకపోతే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ తను బెదిరించారని.. దీంతో అసలు విషయం చెప్పకుండా కల్పిత కథ చెప్పేందుకు చర్చలు జరిగాయని వెల్లడించారు. కేసులో సహకరించకపోతే కాల్చి చంపుతానని దర్శన్ బెదిరించడంతో, తాను దర్శన్‌కు సహాయం చేశానని ప్రదోష్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Renuka swamy murder case update: కన్నన హీరో దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఈ క్రమంలో అభిమాని రేణుకస్వామి హత్యకేసులో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో A-14గా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారాడు. ఇతగాడు పోలీసులకు దర్శన్ పైశాచికంపై అనేక విస్తుపోయే విషయాల్ని చెప్పాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుక స్వామి సోషల్ మీడియాలో అసభ్య కరమైన పోస్ట్ లు, కామెంట్స్ ల వ్యవహరంపై హీరో దర్శన్ అతనిపై దాడి చేశాడు. ఆ రోజు రేణుక స్వామిని బట్టలూడదీసి హీరో దర్శన్ దొస్తులతో కారుకు వేలాడదీసి దారుణంగా కొట్టాడని చెప్పాడు. ఆ తర్వాత అండర్వేర్ మీద టాటా ఏస్‌కు వేలాడదీసి నైలాన్ తాడుతో విచక్షణా రహితంగా దాడిచేశాడని చెప్పాడు. అన్నం, నీళ్లు ఇచ్చిన తర్వాత ఛాతీ, మెడపై కాలితో గట్టిగా దర్శన తన్నడంతో అతను స్పృహతప్పి పడిపోయాడని చెప్పాడు. ఆ తర్వాత రేణుకాస్వామి ఛాతీపై నిలబడి తొక్కేందుకు దర్శన్ ప్రయత్నించాడని చెప్పాడు. ఆ సమయంలో దర్శన్‌ను పక్కకు లాగి, రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించానని ప్రదోష్ చెప్పుకొచ్చాడు. హత్య విషయాన్ని సెటిల్ చేయకపోతే దర్శన్ గన్‌తో కాల్చుకొని చనిపోతానని అన్నాడని.. అందుకే కట్టుకథను అల్లడానికి చర్చలు జరిపామని ప్రదోష్ వాంగ్మూలం ఇచ్చాడు. తనకు తెలిసిన వివరాలు తెలిపానని.. తన రక్షణ కోసం దర్శన్ వాళ్లతో పాటు కాకుండా ప్రత్యేక సెల్లో ఉంచాలని పిటిషన్లోప్రదోష్ విజ్ఞప్తి చేశాడు. Read more: Shakeel Noorani: కూల్ డ్రింక్‌లో మత్తు కల్పి నటిపై అత్యాచారం.!. జోరుకా

రేణుకాస్వామి హత్య కేసులో ఏ4 నిందితుడు ప్రదోశ్ అప్రూవర్‌గా మారేందుకు పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్‌పై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి (Renukaswamy) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ప్రదోశ్ (Pradosh) అప్రూవర్‌గా మారేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్లో నటుడు దర్శన్ (Darshan) కు వ్యతిరేకంగా పలు తీవ్రమైన ఆరోపణలను పిటిషన్ ద్వారా కోర్టుకు సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు, తాను ఈ కేసులో ఇరుక్కోవడానికి దర్శన్ ఒత్తిడే కారణమని ఆయన ఇటీవల కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. హీరో దర్శన్ మొదట రేణుకాస్వామిని దూషించి ఆ తర్వాత కొట్టారని అంతేగాక చెప్పుతో కొట్టాలని పవిత్రగౌడకు దర్శన్ సూచించినట్లు ప్రదోశ్ ఆరోపించారు. అయితే రేణుకా స్వామిని హత్య చేయాలనే ఉద్దేశం తనకు లేదని, అక్కడ ఉన్న కొందరు రేణుకాస్వామిని చంపాలని నిర్ణయించుకున్నారని, దాడిని ఆపేందుకు తాను ప్రయత్నించినా ఎవరూ తన మాట వినలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సంఘటన సమయంలో రేణుకాస్వామికి భోజనం, నీరు ఇచ్చింది తానేనని.. అనంతరం రేణుకాస్వామి మొబైల్ ఫోన్‌ను తీసుకుని పరిశీలించగా మరిన్ని వివరాలు బయటపడ్డాయని ప్రదోశ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. ఈ కేసులో ప్రదోశ్తో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్లుగా మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే వీరి అభ్యర్థనలను కోర్టు అంగీకరించాల్సి ఉంది. కోర్టు అనుమతి లభిస్తే కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రదోశ్ పిటిషన్లో చేసిన ఆరోపణలు నిజమని కోర్టు ఇంకా నిర్ధారించలేదు. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం, పిటిషన్‌లోని అంశాలు కేసు దర్యాప్తు, తదుపరి న్యాయ ప్రక్రియలో ఎంతవరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది. తాజా

ఇంటర్నెట్ డెస్క్: రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ (Darshan) అనుచరుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారి సంచలన విషయాలు బయటపెట్టారు. ఘటన జరిగిన రోజు నుంచి సాక్ష్యాలను తారుమారు చేసే వరకు జరిగిన ప్రతీ అంశాన్నీ ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రదోష్ పిటిషన్ ప్రకారం.. ‘‘పవిత్ర గౌడకు సందేశాలు పంపిన విషయంలో రేణుకాస్వామిని దర్శన్ నిలదీశారు. ఆ సమయంలో ఆయన తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. దాడి తీవ్రతకు రేణుకాస్వామి తల నుంచి రక్తం కారడం నేను చూశాను. ఆ ప్రాంతానికి పవిత్ర గౌడను పిలిపించి ఆమె చెప్పుతో కొట్టేలా చేశారు. ఆ తర్వాత కూడా విచక్షణారహితంగా దాడి చేశారు. లోదుస్తులు మాత్రమే ఉంచి టాటా ఏస్‌కు వేలాడదీసి.. నైలాన్ తాడుతో కొట్టారు’’ అని ప్రదోష్ తెలిపారు (Renukaswamy murder case). ‘‘ఇంత దారుణంగా దాడి చేస్తే రేణుకాస్వామి చనిపోతాడని నేను వారించాను. అయినా నా మాటలు ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఆహారం, నీళ్లు ఇచ్చిన తర్వాత కూడా దర్శన్ అతడి ఛాతీ, మెడపై కాలితో గట్టిగా తన్నారు. దాంతో రేణుకాస్వామి స్పృహతప్పి కిందపడిపోయారు. ఆ వెంటనే దర్శన్ తన రెండు కాళ్లతో బాధితుడి ఛాతీపై నిలబడి తొక్కేందుకు యత్నించగా.. నేను జోక్యం చేసుకుని ఆయన్ను పక్కకు లాగాను. రేణుకాస్వామి చనిపోయినట్లు గుర్తించిన తర్వాత, ఈ విషయాన్ని సద్దుమణిగేలా చేయకపోతే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని దర్శన్ నన్ను బెదిరించారు. దాంతో అసలు విషయాన్ని దాచిపెట్టి కల్పిత కథను సృష్టించడానికి చర్చలు జరిగాయి’’ అని ప్రదోష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలు తెలిపానని.. తన రక్షణ కోసం జైలులో ఇతర నిందితులతో కాకుండా తనను ప్రత్యేక సెల్లో ఉంచాలని ప్రదోష్ విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణ జరిపి తుది తీర్పు

Beechupalli: ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు! బీచుపల్లి: జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్ కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆదివారం, వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని… పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ అనుకోని అతిథిలా.. ఓ మొసలి నదిలో నుంచి పుష్కర్ ఘాట్ కు వచ్చింది. అది చూసిన కొంతమంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం చేశాడు. మొసలి వరుణ దేవుడి వాహనమని అనిల్ శర్మ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు ఆయన తెలిపారు
కుకు విత్ జాతిరత్నాలు రెండో సీజన్ ముగిసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరిగింది. ఈ ఎపిసోడ్ సాయంత్రం టీవీల్లో ప్రసారం అవుతుంది. అయితే జియో హాట్ స్టార్‌లో మాత్రం ఆల్రెడీ వచ్చేసింది. ఇక దీంతో విన్నర్ ఎవరు అన్నది ముందే తెలిసిపోయింది. ఈ రెండో సీజన్ విన్నర్‌గా తనూజ నిలిచింది. ఫస్ట్ సీజన్లోనూ తనూజ కుక్‌గా వచ్చింది. అయితే చివరిలో మిస్ అయింది. ఫస్ట్ సీజన్ విన్నర్‌గా వదినమ్మ ఫేమ్ సుజిత నిలిచింది. ఈ రెండో సీజన్ విన్నర్‌గా తనూజ నిలిచింది. ఇక బిగ్ బాస్ షోలో రన్నర్‌గా, కుకు షో విన్నర్‌గా తనూజ మరింత క్రేజ్‌ను దక్కించుకున్నట్టు అయింది.ఈ ఫినాలే ఎపిసోడ్లో రాకేష్ పాన్ ఇండియా డిష్ చేశాడు. ప్రతీ ఒక్క స్టేట్ నుంచి స్పెషల్ వంటకాన్ని తీసుకు వచ్చి థాలిని ప్రజెంట్ చేశాడు. సమన్వయ థాలీ అని ధమ్ ఆలు, దావత్ మటన్, సుల్తాన్ దాల్, పంత్ పరోరాట, మకాన కీర్, నైచూర్లను చేసి పెట్టాడు. తక్కువ టైంలో ఇన్ని వెరైటీలు చేయడం గ్రేట్ అని మెచ్చుకున్నారు. ఇక నిఖిల్ చేసిన నల్లి బొక్కల మటన్ ధమ్ పలావ్ విత్ మలబార్ చికెన్, కొకొనట్ పలావ్, చాక్లెట్ విత్ ఫ్రూట్ అండ్ నట్స్‌ని బాగుందని అన్నారు. ప్రజెంటేషన్ కూడా బాగుందని మెచ్చుకున్నారు