
విదుర నీతి: ఈ 8 అలవాట్లు మీలో ఉంటే.. సన్నిహితులు కూడా దూరమవుతారట!
విదుర నీతి: ఈ 8 అలవాట్లు మీలో ఉంటే.. సన్నిహితులు కూడా దూరమవుతారట!.- మితిమీరిన కోపం ఇతరుల్లో మీపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. Vidura Life Lessons.

విదుర నీతి: ఈ 8 అలవాట్లు మీలో ఉంటే.. సన్నిహితులు కూడా దూరమవుతారట!.- మితిమీరిన కోపం ఇతరుల్లో మీపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. Vidura Life Lessons.
Tata Sons IPO Expected Value: టాటా గ్రూప్‌లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు టాటా సన్స్‌కు ఛైర్మన్ చంద్రశేఖరన్ ఇటీవల రాజీనామా ప్రకటించగా ఇప్పుడు ఐపీఓకు రావొద్దనుకుంటే ఆర్బీఐ అందుకు ఒప్పకోవట్లేదు. లిస్టింగ్ కావాల్సిందేనని చెబుతోంది. దీంతో ఈ టాటా గ్రూప్ ఐపీఓపై ఇన్వెస్టర్ల దృష్టి నెలకొంది. ఐపీఓకు వస్తే కంపెనీ మార్కెట్ విలువ రూ. 9 లక్షల కోట్ల నుంచి రూ. 12.5 లక్షల కోట్ల మధ్య ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Vishwanath And Sons Closing collections: విశ్వనాథ్ అండ్ సన్స్ క్లోజింగ్ కలెక్షన్లు..సూర్య మూవీకి లాభమా? న

Vishwanath and Sons OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Vishwanath and Sons OTT: ఓటీటీలోకి రూ.260 కోట్ల సినిమా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vishwanath And Sons Collections: సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ కలెక్షన్స్.. 25 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్‌కు సొంత యూనిఫామ్ ఉంటుంది… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి. యూనిఫామ్ డిజైన్‌ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది. స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది. ప్రతి స్కూల్‌కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్‌పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్‌నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి. యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్‌ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి

వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. వీటిలో మరీ అంతగా అనే పాట ఒకటి. శ్రీరామచంద్ర ఆలపించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే. మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ పాట కేవలం వినడానికి ఆహ్లాదంగా ఉండడమే కాకుండా. జీవితంపై మన ఆలోచనా విధానాన్ని మార్చేంత గొప్ప సందేశం ఇందులో ఉంది. కష్టం వచ్చిన ప్రతిసారీ కుంగిపోవడం కంటే దాన్ని ఎదుర్కొని ముందుకు సాగాలని చెబుతుంది. అందుకే ఈ పాటను ఒక్కసారి శ్రద్ధగా వింటే చాలు.. మనసులోని భారాన్ని కొంతైనా దించుకున్న అనుభూతి కలుగుతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మొదట మనసులో కలిగేది బాధ. ఆ బాధ క్రమంగా ఆందోళనగా మారుతుంది. ఆ తర్వాత అదే సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మనల్ని మనమే మరింత బాధ పెట్టుకుంటాం. కానీ సమస్య గురించి ఆలోచిస్తూ ఏడవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. జరిగింది జరిగిపోయింది. దాన్ని మార్చలేం. అయితే దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇక ముందు అదే పరిస్థితి రాకుండా ఏం చేయాలి? అనే దానిపై దృష్టి పెట్టగలం. ఈ పాట మొదటి నుంచే ఇదే విషయాన్ని గుర్తుచేస్తుంది. బాధను అతిగా పెంచుకోవద్దని, మనసును అనవసరంగా కలవరపెట్టుకోవద్దని చెబుతుంది. కష్టం మన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే.. అదే మన జీవితమంతా కాదు. ఈ ఒక్క ఆలోచన మనలో బలాన్ని నింపుతుంది. మనకు ఎదురైన సమస్యను చూసి భయపడటం సహజం. కానీ ఆ భయంతోనే ఆగిపోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోయిందనుకోండి. మొదట బాధ కలుగుతుంది. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. కానీ అదే విషయాన్ని రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటే కొత్త ఉద్యోగం రాదు. దాని బదులు కొత్త అవకాశాలను వెతకడం ప్రారంభిస్తే పరిస్థితి మారే అవకాశం ఉంటుంది. అలాగే
Gold Price Fall : గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమవుతున్నాయి. బులియన్ మార్కెట్లో వరుసగా 4 రోజుల్లో తులం బంగారం (24 క్యారెట్లు) ధర ఏకంగా రూ.9110 మేర పడిపోయింది. ఆగస్టు 29వ తేదీన దాదాపు రూ.3 వేలు దిగొచ్చిన బంగారం ధర ఆ తర్వాత వరుస సెషన్లలో భారీగా పడిపోతూ వస్తోంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న తరుణంలో బంగారం ధరలు ఇలా భారీగా తగ్గుతుండడం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. వెండి రేటు రూ.10 వేలు తగ్గి రూ.2.50 లక్షల స్థాయికి మళ్లీ దిగివచ్చింది. అయితే, బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు గల కారణాలేంటి? ఇంకా తగ్గుతాయా? బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.నేటి బంగారం ధరలు ఇలాదేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా నాలుగో రోజూ తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.2070 మేర తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తులం బంగారం ధర రూ.1,52,020 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు ఈరోజు రూ.1900 మేర పడిపోయింది. దీంతో తులం రేటు రూ.1,39,350 వద్దకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.10 వేలు తగ్గడంతో రూ.2,50,000 వద్ద ట్రేడవుతోంది.ఆ ఒక్క కారణంతోనే భారీ పతనంఇరాన్పై అమెరికా భీకర దాడులు చేపడుతుండడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో మార్కెట్లు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక వైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతోంది. దీంతో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, పశ్చిమాసియా యుద్ధం విషయంలో క్రూడ్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషించడంతో రివర్స్ జరుగుతోంది. బంగారం, వెండి వండి విలువైన ఖనిజాల ధరలు

ఆగస్ట్ (August 2026) మొదటివారంలో కొరియన్ కనకరాజు, డీసీ, జీడీ నాయుడు, కేజేక్యూ, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “కొరియన్ కనకరాజు” క్లీన్ హిట్ అనిపించుకుంది. పరిమిత బడ్జెట్ లో తీయడం, మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వరుణ్ తేజ్ ఈ మూవీతో గట్టెక్కాడు. మిగతా సినిమాల్లో “డీసీ”కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తక్కువ రేటుకు అమ్మకాలు సాగడంతో బయ్యర్లకు బాగానే డబ్బులొచ్చాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రెండో వారంలో “విశ్వనాధ్ అండ్ సన్స్,” పళ్ల బురుసు, పాంచాలి పంచ భర్తృక, అగథ, మకుటం, హుషార్ పిట్టలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “విశ్వనాధ్ అండ్ సన్స్” సినిమా సూపర్ హిట్టయింది. తమిళ్ లో కంటే తెలుగులో మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పళ్ల బురుసుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎమ్మెస్ రాజు తీసిన అగధ చిత్రం కూడా ఆడకపోగా.. విశాల్ చేసిన మకుటం కూడా ఫ్లాప్ అయింది. సురేశ్ బాబు రిలీజ్ చేసిన హుషార్ పిట్టలు సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడో వారంలో ఇరుముడి, ఖలీఫా, సర్దార్ సర్వాయి పాపన్న, అమీర్ లోగ్, రెడ్ బ్యాగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. రవితేజ నటించిన “ఇరుముడి” బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలో టాక్సిక్, కికు చిరంజీవి, హాయ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. యశ్ నటించిన “టాక్సిక్” సినిమా డిజాస్టర్ అయింది. మొదటి వారం 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ, సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఆగస్ట్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, 2 సినిమాలు హిట్

‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇరుముడి’(Irumudi)చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మాస్ మహారాజా రవితేజ. ఆయన హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే మంచి అంచనాలు ఉన్న ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద జోరు కనిపిస్తోంది. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన రావడం చిత్రానికి కలిసొచ్చే అంశంగా మారింది. ‘ఇరుముడి’ తొలి రోజే సుమారు రూ.23–25 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మౌత్ టాక్ తో వీకెండ్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవితేజకు ఉన్న మాస్ ఫాలోయింగ్, పాజిటివ్ రెస్పాన్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ‘ఇరుముడి’ దూకుడు ఇప్పుడు ఇప్పటికే థియేటర్లలో ఉన్న ‘విశ్వనాథ్ & సన్స్’కు (Vishwanath and sons) కొంత పోటీగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సూర్య నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. విడుదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా డీసెంట్ బిజినెస్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లాభాల జోన్లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో వీకెండ్లోకి అడుగుపెడుతున్న సమయంలో ‘ఇరుముడి’ రావడం సూర్య సినిమాకు సవాల్‌గా మారింది. ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకర్షిస్తుండటంతో థియేటర్లలో ప్రేక్షకులు డివైడ్ అయ్యే అవకాశం ఉంది. ‘విశ్వనాథ్ & సన్స్’కు కొన్ని కేంద్రాల్లో ఆక్యుపెన్సీ తగ్గే అవకాశాలు లేకపోలేదు. అలాగని పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉందని చెప్పలేం. ఇప్పటికే సినిమాకు వచ్చిన టాక్, తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వసూళ్లు దానికి బలంగా మారాయి. సినిమా లాభాల దిశగా

సూర్య లేటెస్ట్ గా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీతో విజయాన్ని అందుకున్నారు. గత వారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. దీంతో వారు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ 8 రోజులు పూర్తి చేసుకుంది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చాయి. అయినా ఈ మూవీ కలెక్షన్లు తగ్గలేదు సరికదా, శుక్రవారం పెరగడం విశేషం. `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీకి ఎనిమిదో రోజు రూ.4.50కోట్లు వచ్చాయి. గురువారం రూ.4.20కోట్లు రాగా, ముప్పై లక్షలు పెరగడం విశేషం. వీకెండ్స్ లో ఈ మూవీ పుంజుకుంటుందనేదానికిది నిదర్శనం. ఇక 8 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.149.77కోట్లు రాబట్టింది. ఆల్మోస్ట్ 150కోట్ల క్లబ్లో చేరింది. ఇండియాలో దీనికి రూ.99.52కోట్ల గ్రాస్ రాగా, రూ.86.10కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఎనిమిదో రోజు ఓవర్సీస్లో కోటిన్నర రాబట్టింది. మొత్తంగా అక్కడ రూ.50.26కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ సినిమాకి తమిళంలో కంటే తెలుగులోనే కలెక్షన్లు ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. 8వ రోజు కూడా తమిళంలో రూ.1.85కోట్లు వస్తే, తెలుగులో రూ.2.40కోట్లు రావడం విశేషం. ఓవరాల్ కలెక్షన్లలో కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువగా ఉండటం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి రూ.130కోట్ల బడ్జెట్ అయ్యింది. సుమారు రూ.90కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందట. ఈ లెక్కన సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్ రావాలి. ఇప్పటికే రూ.150కోట్లు దాటింది. ఈ వచ్చే వారంలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన `విశ్వనాథ్ అండ్ సన్స్` చిత్రంలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటించింది. రాధికా శరత్ కుమార్, రవీనా టండన్, వైవా హర్ష

ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు. అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని. – యామిజాల జగదీశ్ బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర

తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే..? తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆనందం- ఆవేదన ఒకేసారి దరి చేరాయి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ తరువాత సూర్య సినిమా ఓ రికార్డ్ సాధించింది. అదే సమయంలో మరో సినిమా ఫ్యాన్స్ నీరుకారి పోయేలా చేసింది. ఎందుకో చూద్దాం? మొన్నటి దాకా విజయ్ సినిమా ఎలా ఉన్నా ఇట్టే రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసేది. అలాంటిది విజయ్ (Vijay) తాజా చిత్రం జననాయగన్ (Jana Nayagan) ఆ ఫీట్ సాధించలేక పోయింది. అందునా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత వచ్చిన 'జననాయగన్' బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో 'జననాయగన్' కంటే ముందు విడుదలైన సూర్య (Suriya) కరుప్పు (Karuppu) విజయ్ సినిమా కంటే ఎక్కువ వసూలు చేయడం విశేషంగా మారింది. సూర్య 'కరుప్పు' సినిమా మే 15వ తేదీన విడుదలయింది. ఈ చిత్రం విడుదలైన రెండు నెలల తరువాత జూలై 23న 'జననాయగన్' జనం ముందు నిలచింది. తమిళనాడులో 'కరుప్పు' ఫినిషింగ్ బాక్సాఫీస్ నంబర్ 170 కోట్లు దాటింది. 'జననాయగన్' నెలలోపే ఇక ముందుకు సాగే పరిస్థితి లేదని తేలింది. ఈ సినిమా చివరకు తమిళనాట 160 కోట్ల వద్ద ఆగిపోయింది. చిత్రమేంటంటే ఈ మధ్యే విడుదలైన సూర్య సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్స (Vishwanath & Sons) మాత్రం తమిళనాడులో ముందు సినిమా 'కరుప్పు'లా హల్ చల్ చేయలేకపోతోంది. ఈ మూవీ ఆరు రోజులకు 38 కోట్లు మాత్రమే పోగేసింది. అంటే తమిళనాడులో 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు ఎదురుగాలి వీస్తోందన్న మాట. అదే ఇప్పుడు సూర్య అభిమానులకు ఆవేదన కలిగిస్తోన్న అంశం. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం తెలుగునాట విశేషాదరణ చూరగొంది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా ఇప్పటికే 20 కోట్లకు పైగా వసూలు

సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ సాధించింది. ఓవర్సీస్ లో రూ. 45 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ మంచి కలెక్షన్స్ తో సక్సెస్ రన్ కొనసాగిస్తూ. ఇప్పుడు రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరడానికి రెడీ అయ్యింది. ఒకప్పుడు థియేటర్లలో సినిమాను నిలబెట్టాలంటే బిగ్ స్టార్, భారీ బడ్జెట్, భారీ హైప్ తప్పనిసరి అన్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ లెక్క కాస్త మారుతున్నట్టే కనిపిస్తోంది. ‘మా ఇంటి బంగారం’ రూ. 100 కోట్ల మార్క్ దాటగా అదే సమయంలో కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘డీసీ’ 14 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌కు చేరువైంది. అంటే స్టార్ పవర్ కంటే కంటెంట్, మౌత్ టాక్, ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే సంకేతం ఇది. మిడ్-బడ్జెట్ సినిమాలకు మళ్లీ థియేట్రికల్ మార్కెట్ పెరుగుతోందని ఈ సినిమాలే ప్రూవ్ చేస్తున్నాయి. కొరియన్ కనకరాజు’, చెన్నై లవ స్టోరీ ఎబోవ్ యావరేజ్ టాక్‌తో బాగానే రాబట్టింది. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ప్రేక్షకులు ఓటీటీకి పూర్తిగా షిఫ్ట్ కాలేదు. వాళ్లకు నచ్చే సినిమా కనిపిస్తే ఇప్పటికీ టికెట్ కొనడానికి సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి థియేట్రికల్ మార్కెట్లో మిడ్-బడ్జెట్ సినిమాలకు కూడా స్పేస్ ఉందనే నమ్మకం మేకర్స్‌లో పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ ట్రెండ్‌ను చూసి “టాలీవుడ్లో ఇక ప్రతి సినిమా థియేటర్లలో ఆడుతుంది” అని చెప్పలేరు. ఎందుకంటే ఈ సినిమాల విజయానికి కంటెంట్‌తో పాటు మౌత్ టాక్, రిలీజ్ టైమింగ్, ప్రమోషన్, టికెట్ ప్రైసింగ్ కూడా కీలకం. బ్లాక్‌బస్టర్, డిజాస్టర్ అనే రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య ‘డీసెంట్ సినిమా’ కూడా థియేటర్లో నిలబడగల మార్కెట్ మళ్లీ ఏర్పడుతోందా అంటే

దర్శకుడు వెంకీ అట్లూరి సితార ఎంటర్టైన్మెంట్స్తో తనకున్న ప్రత్యేక అనుబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్య కథానాయకుడిగా నాగవంశీ నిర్మించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సితార సంస్థతో తనకున్న సంబంధం డబ్బులు, అగ్రిమెంట్లకు అతీతమైనదని ఆయన స్పష్టం చేశారు. తన్ను నమ్మి వరుసగా అవకాశాలు ఇచ్చినందుకు ఆ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితమే సిద్ధమైన కథఈ సినిమా వెనుక ఉన్న నిర్మాణ ప్రయాణాన్ని వెంకీ అట్లూరి వివరంగా పంచుకున్నారు. ఈ కథను 2022 లోనే రాసుకున్నానని, సూర్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కొన్ని మార్పులు చేశానని తెలిపారు. సూర్య కూడా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్న సమయంలో ఈ కథ వినగానే ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. అనవసరమైన కామెడీ లేకుండా కథను ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా చెప్పాలని సూర్య సూచించడంతో దానికి అనుగుణంగా చిత్రీకరించినట్లు వెల్లడించారు. పాత్రల ఎంపిక మరియు వసూళ్ల తీరుకథాంశం మరియు నటీనటుల ఎంపిక గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. 'ప్రేమలు' సినిమా చూసిన తర్వాత మమితా బైజును ఈ చిత్రంలో కథానాయికగా ఎంపిక చేశామని, తమిళంపై ఆమెకున్న పట్టు సినిమాకు ప్లస్ అయిందని తెలిపారు. దీంతో తమిళ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ చిత్రాన్ని ప్రధానంగా తమిళంలో రూపొందించినట్లు చెప్పారు. అక్కడ థియేటర్లు, టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వల్ల ప్రారంభ వసూళ్లు తక్కువగా కనిపిస్తాయి, అయితే లాంగ్ రన్ బలమైన ప్రభావం చూపిస్తుందని ఆయన విశ్లేషించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయంసినిమా వసూళ్ల వివరాలను చూస్తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మొదటి వారం ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ₹155 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో నికరంగా ₹81.63 కోట్లు వసూలు

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, ‘విశ్వనాథ్ & సన్స్’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు. త్రివిక్రమ్ గారి రచనలో ఉండే బలం, మీ రచనలో కనిపిస్తుంది అనే ప్రశంసలు రావడం ఎలా ఉంది? నేను సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి నింపినది మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు. అలాంటిది త్రివిక్రమ్ గారితో నన్ను పోల్చడం అనేది గౌరవంగా భావిస్తున్నాను. దానిని

చాణక్యుడి ప్రకారం మనిషి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయాన్ని మన దగ్గరే ఉంచుకోవాలి అనే వివేకం కూడా జీవితంలో విజయంలో ఒక భాగమే. మనిషి ఎంత తెలివైనవాడైనా, ఒకసారి చెప్పిన మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే తెలివైన వ్యక్తి తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరి ముందు పెట్టడు. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో గోప్యత పాటిస్తాడు. అవేంటో చూద్దాం. ప్రతి మనిషికీ కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి మన మంచిని కోరుకునేవాడు కాకపోవచ్చు. అందుకే మన భయాలు, లోపాలు, మనం ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను అందరికీ చెప్పడం మంచిది కాదు. ఒకసారి మన బలహీనత మరొకరికి తెలిసిన తర్వాత, దాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నారు, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ ఆస్తులు ఉన్నాయి వంటి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు విషయంలో ఎక్కువగా మాట్లాడటం కొన్నిసార్లు అనవసరమైన సమస్యలకు కారణమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న కొందరు అవసరం లేని అంచనాలు పెట్టుకోవచ్చు. మరికొందరు మీ దగ్గర సహాయం కోసం పదేపదే రావచ్చు. ఇంకొందరు మీ సంపాదనను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. మనం ఏం చేయబోతున్నాం, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాం, ఏ వ్యాపారం ప్రారంభించబోతున్నాం వంటి విషయాలను పని పూర్తయ్యేలోపు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రణాళికను పదిమందితో చర్చిస్తే పదిమంది అభిప్రాయాలు వస్తాయి. కొన్నిసార్లు అవి మనలో అనవసరమైన సందేహాలను కూడా కలిగిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో మన ప్రణాళికలను ఇతరులు ముందుగానే తెలుసుకుని అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి కుటుంబంలోనూ చిన్నచిన్న విభేదాలు, సమస్యలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి

సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్‌ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్‌కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్‌కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్‌తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్‌ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్‌లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్‌ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్‌ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్‌లో లేరు. సరిగ్గా అదే టైమ్‌లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో శ్రీను వైట్ల స్టైల్‌ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్‌తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్! యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు! వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు

మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ & సన్స్’లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది మమిత. నివిన్ పౌలి హీరోగా, మమిత కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’(Bethlehem Kudumba Unit). ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏ.డి. దర్శకత్వం వహించారు. ఈ నెల 21 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఏ నేపథ్యంలో విడుదల చేసిన చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వేగవంతంగా సాగుతున్నాయి. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో నటనలో తన మార్క్ చూపించిన మమితా బైజు ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మమితా బైజు మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా? ఆమెకున్న క్రేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇటీవల వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించిన మమితా బైజు.. ఈ సినిమాతో కూడా అదే జోరు కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు నివిన్ పౌలీ కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి

చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి?చాణక్య నీతి: గెలిచిన తర్వాత ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాలి? Prasanna Yadla 19 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి గెలిచినప్పుడు మీరు ముందుగా మీ కష్టకాలంలో నిలిచిన వారిని గుర్తు చేసుకోవాలి. మీ కష్టకాలంలో నిలిచిన వారిని అలాగే మీ తల్లి దండ్రులు, ఇంకా గురువులు చేసిన సహాయాన్ని కూడా గురుచేసుకోవాలి తల్లి దండ్రులు మీ గెలుపు వెంటనే అసలు కోపం తెచ్చుకోకుండా మీ విజయానికి కారణమైన వారిని కలవాలి. అసలు కోపం తెచ్చుకోకుండా ఇంకా మీ కష్టాల్లో తోడు నిలిచిన స్నేహితులను ఎన్నటికీ మర్చిపోకూడదు. ఎన్నటికీ మర్చిపోకూడదు. ఇంకా మన తప్పులను మన ముందు చెప్పిన వారిని ఈ టైమ్ లో మీరు గౌరవించాలి ఈ టైమ్ లో మీరు గౌరవించాలి. నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

Pargi: పరిగి సబ్‌జైలులో వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మిక తనిఖీ! PARGI: వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS బుధవారం పరిగి సబ్‌జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌జైలులోని భద్రతా ఏర్పాట్లు, ఖైదీల భద్రత, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జైలులోకి అనధికారిక వస్తువులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, జైలు సిబ్బంది సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా జైలు అధికారులు భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధులు, అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలపై ఎస్పీకి వివరాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, IPS, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, పరిగి సీఐ కొండల్ రెడ్డి, పరిగి సబ్‌జైల్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, పరిగి ఎస్ఐ మోహన కృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు

ఏపీలో కీలకమైన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్ పర్సన్లను ప్రత్యక్షంగా ప్రజలే ఎన్నుకునేందుకు మార్గం సుగమం అయింది. గతంలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని 2005లో రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి సర్కార్ దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు నిన్న కేబినెట్లో ఆమోదించిన బిల్లును ఇవాళ అసెంబ్లీలో (AP Assembly)ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆమోద ముద్ర వేయించుకుంది. దీంతో మున్సిపల్ చట్టంలో సవరణలు రానున్నాయి.మండలిలో వైసీపీకి హ్యాట్రిక్..! కూటమి మళ్లీ చేతులెత్తేసిందా ?1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని మంత్రి నారాయణ ఈ బిల్లుపై మాట్లాడుతూ వెల్లడించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలే నేరుగా మేయర్ లేదా మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని, ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి ఎన్నికైన మేయర్, చైర్మన్‌కు బలమైన ప్రజామోదం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ద్వారా కాకుండా ప్రజలే నేరుగా ఎన్నుకోవడం వల్ల మేయర్ లేదా చైర్మన్‌పై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. తొలి రోజే మండలి డిప్యూటీ ఛైర్మన్ కు కూటమి షాక్..! బొత్స ఫైర్..!ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లు వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, నగరాలు, పట్టణాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేసేందుకు ఇది పనికొస్తుందని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాల్లో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంటుందన్నారు. అభివృద్ధి పనుల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలతో మెరుగైన సమన్వయం చేసుకుంటూ పనులను

నిర్మాత నాగవంశీకి ఈ ఏడాది గోల్డెన్ ఇయర్‌గా మారింది. వరుస విజయాలతో గతేడాది ఎదురైన నష్టాలు, విమర్శలకు బాక్సాఫీస్ కలెక్షన్లతో గట్టి సమాధానం ఇచ్చారు. టాలీవుడ్లో నిర్మాతలు చాలామంది ఉంటారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్, క్రేజ్ క్రియేట్ చేసుకున్న నిర్మాతలు మాత్రం కొందరే కనిపిస్తారు. అందులో ముందు వరుసలో వినిపించే పేరు సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ చింటూ. సినిమా మేకింగ్‌లోనే కాదు, ప్రమోషన్లలో కూడా ఆయన స్టైలే వేరు. మైక్ పట్టుకుంటే మనసులో ఏముందో ఓపెన్‌గా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం నాగవంశీ నైజం. ఎవరి కోసమో మాట మార్చకుండా, డేరింగ్ అండ్ డాషింగ్‌గా స్టేట్మెంట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. అందుకే ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రేమమ్ సినిమాతో నిర్మాతగా తన జర్నీ మొదలుపెట్టిన నాగవంశీ, సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌ను టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టారు. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ ఏటా కనీసం మూడు నాలుగు రిలీజ్‌లతో థియేటర్లను కళకళలాడేలా చేస్తుంటారు. అయితే సినిమా పరిశ్రమలో గెలుపోటములు సహజం. ఎంతటి టాప్ ప్రొడ్యూసర్‌కైనా ఒక్కోసారి లెక్కలు తప్పుతుంటాయి. గతేడాది నాగవంశీకి కూడా కొన్ని ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. గతేడాది నాగవంశీ ఏకంగా నాలుగు సినిమాలకు నిర్మాతగా, మూడు క్రేజీ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. ఇందులో డాకు మహారాజ్ (Daaku Maharaaj), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే కింగ్డమ్ (Kingdom), మాస్ జాతర (Mass Jathara) చిత్రాలు యావరేజ్ టాక్‌తో నెట్టుకొచ్చాయి. అయితే ఆయన భారీ ఆశలు పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేసిన వార్-2 (War 2), రెట్రో (Retro) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. ఈ

సూర్య హీరోగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` మూవీ బాక్సాఫీసు వద్ద నెమ్మదిగా స్లో డౌన్ అవుతుంది. వీకెండ్స్ తో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గింది. కానీ వీక్ డేస్‌లోనూ ఫర్వాలేదనిపించేలా ఉన్నాయి. స్ట్రాంగ్‌గానే ఉండటం విశేషం. చాలా వరకు సినిమాలు వీక్ డేస్‌లో భారీగా పడిపోతాయి. ఈ చిత్రం మాత్రం డీసెంట్ గా వసూళ్లని రాబట్టడం విశేషం. ఇది సినిమా విజయానికి కారణమవుతుందని చెప్పొచ్చు. సూర్య, మమితా బైజు జంటగా నటించిన `విశ్వనాథ్ అండ్ సన్స్` కలెక్షన్లు చూస్తే, ఐదో రోజు ఇండియాలో రూ.7.33కోట్లు రాబట్టింది(సాక్నిల్క్ లెక్కల ప్రకారం). ఓవర్సీస్లో మరో రెండు కోట్లు వచ్చాయి. సోమవారంతో పోల్చితే కోటి వరకు తగ్గాయి. కానీ అది పెద్ద మార్పుగా చెప్పలేం. సాధారణంగా బుధ, గురువారం వరకు కలెక్షన్లు తక్కువగానే ఉంటాయి. మళ్లీ శుక్రవారం నుంచి పుంజుకుంటాయి. ఈ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందా అనేది చూడాలి. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.128.60కోట్లు రాబట్టడం విశేషం. ఇండియాలో రూ.83.60కోట్ల గ్రాస్, రూ.72.30కోట్ల నెట్ వచ్చింది. ఓవర్సీస్లో సుమారు రూ.45కోట్లు రావడం విశేషం. ఇది ఓవర్సీస్లో దుమ్ములేపుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే కలెక్షన్లని రాబడుతుంది. తెలుగులో ఐదో రోజు రూ.3.50కోట్లు రాగా, తమిళంలో రూ.2.35కోట్లు మాత్రమే రావడం గమనార్హం. `విశ్వనాథ్ అండ్ సన్స్` సినిమాకి అయిన థియేట్రికల్ బిజినెస్ రూ.90కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.22కోట్లుగా నిర్ణయించారు. ఇక్కడ ఈ వీక్‌తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇక నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకి ఓటీటీ రూపంలో రూ.85కోట్లు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. శాటిలైట్ రూపంలో మరో రూ.28కోట్లు వచ్చాయి. ఆడియో రూపంలో రూ.12కోట్లు వచ్చాయి. మొత్తంగా బిజినెస్ రూ.215కోట్లు అని సమాచారం. సినిమాకి అయిన బడ్జెట్ రూ.130కోట్లు. దీంతో మేకర్స్ ఇప్పటికే రూ.85కోట్ల లాభాల్లో ఉన్నారు. థియేట్రికల్ గా సినిమా హిట్ కావాలంటే రూ.180కోట్ల గ్రాస్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళం బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతోంది. మరీ బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ డీసెంట్ టాక్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ఎప్పటిలాగే సూర్య తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. ఇక మమితా బైజు తన క్యూట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక ఇదే సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో సంజయ్ విశ్వనాథ్ కొడుకు అభయ్ ఒకటి. సినిమాలో ఈ పిల్లాడు తన క్యూట్ నెస్, న్యాచురల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అభయ్ అసలు పేరు చార్విక్. చాలా మంది ఈ అబ్బాయిని సెలబ్రిటీల పిల్లాడని అనుకుంటున్నారు. కానీ అదేమీ కాదు. ఈ బాబు కామన్ మ్యాన్ వాళ్ల అబ్బాయి అని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో చార్విక్ ను తీసుకోవడం వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉందని వాళ్ల తల్లిదండ్రులు తెలిపారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కోసం 6 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు కావాలని మేకర్స్ క్యాస్టింగ్ కాల్ ప్రకటించారు. దీంతో చార్విక్ ను ఆడిషన్ కు తీసుకెళ్లాం. అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తుండగా చార్విక్ మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. దీంతో అతని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, నవ్వు చూసి మేకర్స్ వెంటనే సెలెక్ట్ చేశారు

భారత కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ 108 ఏళ్ల చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) తొలిసారిగా వాయిదా పడింది. మంగళవారం మధ్యాహ్నం జరగాల్సిన ఈ సమావేశానికి అవసరమైన 'కోరం' లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అనూహ్య పరిణామం కార్పొరేట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.టాటా సన్స్ నిబంధనల ప్రకారం, సంస్థలో సుమారు 51.5 శాతం మెజారిటీ వాటా కలిగిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు సంయుక్తంగా ఒక అధీకృత ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే సమావేశానికి అవసరమైన కోరం పూర్తవుతుంది. అయితే, సర్ రతన్ టాటా ట్రస్ట్ కార్యకలాపాలు, ప్రధాన నిర్ణయాలపై మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ ఆంక్షలు విధించడంతో, ఉమ్మడి ప్రతినిధిని నామినేట్ చేయడంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఫలితంగా కోరం కొరత ఏర్పడి సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం 'బాంబే హౌస్'లో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, బోర్డు సభ్యులు సౌరభ్ అగర్వాల్, అనితా మరొంగోలీ జార్జ్ ప్రత్యక్షంగా హాజరుకాగా, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, హరీశ్ మన్వానీ, వేణు శ్రీనివాసన్, మెహ్లీ మిస్త్రీ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు, డివిడెండ్ సహా ఇతర కీలక అంశాలకు ఈ ఏజీఎంలో ఆమోదం తెలపాల్సి ఉంది. 2027 ఫిబ్రవరి తర్వాత తాను పదవిలో కొనసాగబోనని చంద్రశేఖరన్ ఇప్పటికే సంకేతాలిచ్చిన

టాటా సన్స్ కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ వాయిదా పడింది. మీటింగ్ జరపటానికి అవసరమైన సభ్యుల సంఖ్య (క్వోరమ్) లేకపోవటంతో మంగళవారం జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. కంపెనీ చరిత్రలో ఏజీఎమ్ వాయిదా పడటం ఇదే మొదటిసారి. ఇంటర్నెట్ డెస్క్: టాటా సన్స్ కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ వాయిదా పడింది. మీటింగ్ జరపటానికి అవసరమైన సభ్యుల సంఖ్య (క్వోరమ్) లేకపోవటంతో మంగళవారం జరగాల్సిన మీటింగ్ వాయిదా పడింది. కంపెనీ చరిత్రలో ఏజీఎమ్ వాయిదా పడటం ఇదే మొదటిసారి. ఓ జాతీయ మీడియా కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 108వ యాన్యువల్ జనరల్ మీటింగ్ ప్రారంభం అయింది. అయితే, జాయింట్ రిప్రెసెంటేటివ్ ఆఫ్ ది సర్ దొరాబ్జి టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ మీటింగ్‌లో లేకపోవటంతో క్వోరమ్ రిక్వైర్మెంట్ను మీటింగ్ అందుకోలేకపోయింది. దీంతో అరగంట తర్వాత మీటింగ్ వాయిదా పడింది. సర్ దొరాబ్జి టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు.. టాటా సన్స్‌లో ఏకంగా 51.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రెండు ట్రస్ట్‌లు సంయుక్తంగా ప్రతినిధిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. మహారాష్ట్ర చారిటీ కమిషనర్ .. సర్ రతన్ టాటా ట్రస్ట్ మీటింగ్స్పై ఆంక్షలు విధించారు. సర్ రతన్ టాటా ట్రస్ట్‌పై ఆంక్షలు ఉండటం వల్ల సంయుక్త నామినేషన్ సాధ్యం కాలేదు. దీంతో రెండు ట్రస్ట్‌లకు సంబంధించిన ప్రతినిధి మీటింగ్‌లో లేకుండా పోయారు. మీటింగ్ వాయిదా పడింది. యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎప్పుడు జరపాలనే దానిపై కంపెనీ బోర్డ్ త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం. యూట్యూబ్ వ్యూస్‌లో భారీ మార్పు.. ఇక వీడియో ప్లే అయిన వెంటనే వ్యూగా లెక్కింపు.. డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్.. సిడ్నీ కోర్టు కీలక తీర్పు

సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కొన్నిసార్లు జీవిత సత్యాలను, మనుషుల మధ్య ఉన్న అనుబంధాలను గుండెలకు హత్తుకునేలా చూపుతాయి. రీసెంట్గా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎమోషనల్‌గా కట్టిపడేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాలోని ఒక సీన్ వెనుక ఉన్న రియల్ ఇన్సిడెంట్ గురించి డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. మనం స్క్రీన్ మీద చూసి భావోద్వేగానికి గురయ్యే సీన్స్ వెనుక దర్శకులు తమ నిజ జీవితంలో చూసిన, అనుభవించిన ఘటనలు ఉంటాయి. వెంకీ అట్లూరి రాసిన ఒక డ్రైవర్ ఇంటర్వ్యూ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఏడిపించేసింది. అయితే అసలు ఆ సీన్ రాయడానికి ఇన్స్పిరేషన్ దిల్ రాజు అని వెంకీ తెలిపారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. 2012-2013 ప్రాంతంలో తాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దగ్గర పనిచేస్తున్నప్పటి ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో SVC బ్యానర్ కాస్త క్లిష్టమైన పరిస్థితులలో ఉంది. అదే సమయంలో సెట్స్‌లో పనిచేసే ఒక లైట్‌మ్యాన్, తన కొడుకుకి యూఎస్‌లోని కాలేజీలో సీటు వచ్చిందని, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆర్థిక సాయం కావాలని కోరాడు. ఆ రోజుల్లో ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్ ధర దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఉండేది. అప్పుడున్న పరిస్థితుల్లో దిల్ రాజుకి అది చాలా పెద్ద మొత్తమే అయినప్పటికీ, ఇచ్చినా మాట ప్రకారం ఆ పిల్లాడి ట్రావెల్ కు అయ్యే డబ్బులు తక్షణమే చెల్లించి సహాయం చేశారు. ఒక సాధారణ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం పడే తపన, ఆయనకు అండగా నిలిచిన మనుషుల మంచితనం.. ఈ ఘటనే వెంకీ అట్లూరి మనసులో బలంగా నాటుకుపోయింది. అదే ఆ ఎమోషనల్ సీన్ రాయడానికి ప్రధాన ఇన్స్పిరేషన్గా మారింది. అంతేకాదు, సినిమాలో ప్రతీ ఎమోషనల్ కన్వర్జేషన్ తర్వాత వాతావరణాన్ని తేలికపరచడానికి చిన్న జోక్

ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో, అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకటే చర్చ.. విశ్వనాధ్ అండ్ సన్స్ మూవీ చాలా బాగుంది, సూర్య, మమితా భైజు, రాధికా శరత్ కుమార్ ఒక రేంజ్ లో నటించారు అని. రోజు వారి ఫ్యామిలీ డిస్కర్షన్ లో ఒకటిగా కూడా మారిందంటే విశ్వనాధ్ అండ్ సన్స్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ చిత్ర కథని దర్శకుడు వెంకీ అట్లూరి మొదట ధనుష్, దుల్కర్ సల్మాన్ కి వినిపించాడు. ఆ తర్వాత టీం సలహాతో సూర్యకి వినిపించడం జరిగింది. ఆ విధంగా సూర్య వద్దకి చేరి ఇప్పుడు అభిమానులని, సినీ ప్రియులని విశేషంగా ఆకర్షిస్తుంది. మాస్ మహారాజా రవితేజతో పాటు పలువురు స్టార్ తెలుగు హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ అవన్నీ ఒట్టి రూమర్స్. దుల్కర్, ధనుష్ మాత్రం నిజం. ఇక బాక్సాఫీస్ వద్ద విశ్వనాధ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో జోరు చూపిస్తూ కేవలం రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 121 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచింది. లాంగ్ రన్ లో పలు చిత్రాల రికార్డ్స్ బద్దలవ్వడం ఖాయం. దిల్ రాజు రియల్ లైఫ్ సీన్: 'విశ్వనాథ్ & సన్స్'కి ఇన్స్పిరేషన్ ఏంటో చెప్పిన వెంకీ అట్లూరి.! లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే?

వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక్క విజయం మనిషి జాతకాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. విజయం మీ వైపు ఉంటే ఆటోమేటిక్‌గా డిమాండ్ మీ తలుపు తడుతుంది. సరిగ్గా ఇప్పుడు ఇదే ఫార్ములా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి విషయంలో నిజమవుతోంది.ధనుష్‌తో చేసిన 'సార్', దుల్కర్ సల్మాన్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' చిత్రాలతో వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టిన వెంకీ(Venky atluri), తాజాగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించారు. కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తోంది. వరుసగా మూడు భారీ విజయాలు సాధించడంతో ఇప్పుడు వెంకీ అట్లూరితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే వెంకీ మాత్రం తన తరువాతి చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన అక్కినేని హీరోతో చేసే ప్లానింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు... అక్కినేని నాగ చైతన్య. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, నాగ చైతన్య కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 25వ మైల్స్టోన్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారట. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న వెంకీతో తన 25వ సినిమాను పట్టాలెక్కించేందుకు నాగ చైతన్య కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అసలు వీరిద్దరి కాంబినేషన్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నాగ చైతన్య, వెంకీ అట్లూరి మధ్య కేవలం ప్రొఫెషనల్ సంబంధమే కాకుండా మంచి స్నేహం, అనుబంధం ఉన్నాయి. వెంకీ అట్లూరి దర్శకుడిగా మారినప్పటి నుంచి తాను

నటుడు సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' థియేటర్లలో దుమ్మురేపుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సూర్య, మమితా బైజు నటనకు మంచి మార్కులు పడ్డాయి. వారి కెమిస్ట్రీనే సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. 'కరుప్పు' తర్వాత సూర్యకు ఇది మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'విశ్వనాథ్ అండ్ సన్స్' సోమవారం ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.50 కోట్లు వసూలు చేసింది. ఇందులో కేవలం భారతదేశంలోనే రూ.7.50 కోట్లు రాబట్టగా, ఓవర్సీస్లో రూ.2 కోట్ల కలెక్షన్లు సాధించింది. నిన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా రూ.3.85 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత తమిళనాడులో రూ.3.65 కోట్లు వసూలు చేసింది. అయితే, షోల పరంగా చూస్తే తెలుగులో 1924 షోలు, తమిళంలో 3038 షోలు ప్రదర్శించారు. ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే విశేష ఆదరణ పొందుతోంది
Defective Notice ITR: 2025-26 ఆర్థిక సంవత్సరం లేదా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్ ఫైల్ చేసిన టాక్స్ పేయర్స్ తమ రిజిస్టర్డ్ మెయిల్, ఇన్‌కంటాక్స్ ఇ- ఫైలింగ్ పోర్టల్‌ను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. రిటర్న్స్‌లో సరైన వివరాలు లేకపోయినా, ఇంకా మీరు ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉన్నా ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు రావొచ్చు. అయితే ఈ నోటీసులు వచ్చినప్పుడు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండకుండా, దాంట్లో పేర్కొన్న లోపాన్ని గుర్తించి నిర్ణీత సమయంలోగా సరిచేయడం ముఖ్యం.ఐటీఆర్‌లో అవసరమైన సమాచారం పూర్తిగా ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరాల మధ్య తేడాలు ఉన్నా లేదా ఐటీ రిటర్న్స్ ఫారాలకు సంబంధించిన నిబంధనల్ని సరిగ్గా పాటించకపోయినా దాన్ని డిఫెక్టివ్ రిటర్న్‌గా పరిగణించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక టాక్స్ పేయర్ టీడీఎస్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసి, దానికి సంబంధించిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో చూపించకపోతే సమస్య రావొచ్చు. అలాగే బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా ఆదాయం ఉన్న అవసరమైన ఆర్థిక వివరాల్ని పూర్తిగా ఇవ్వకపోయినా నోటీసులు వస్తాయి.ఇన్‌కంటాక్స్ విభాగం ప్రధానంగా 3 మార్గాల్లో డిఫెక్టివ్ రిటర్న్ గురించి సమాచారం ఇవ్వొచ్చు. ముందుగా రిజిస్టర్డ్ ఇ- మెయిల్‌కు నోటీసు పంపుతుంది. ఎక్కువ శాతం ఇదే చేస్తుంది. లేదా పోస్ట్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది. లేదా ఇ- ఫైలింగ్ పోర్టల్‌లో నోటీసును అందుబాటులో ఉంచొచ్చు. అందుకే వీటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఆ నోటీసులో సాధారణంగా ఐటీఆర్‌లో ఏ లోపం ఉంది? దాన్ని ఎలా సరిచేయాలో వివరాలు ఉంటాయి.Read Also: అసలు యూపీఐ లావాదేవీలు ఉచితమా.. ఛార్జీలు పడతాయా? ఆర్థిక మంత్రి నిర్మలమ్మ కీలక ప్రకటన15 రోజుల్లోగా స్పందించాలిసెక్షన్ 139(9) కింద డిఫెక్టివ్ ఐటీఆర్ నోటీసులు అందుకున్నప్పుడు సాధారణంగా నోటీసు అందుకున్న తేదీ నుంచి 15 రోజుల్లో అందులో ఉన్న లోపాన్ని లేదా తప్పుల్ని సరిచేసి పంపించాల్సి ఉంటుంది. నోటీసులో ప్రత్యేకంగా

విశ్వనాధ్ అండ్ సన్స్ లో అభిమానులు సెల్యులాయిడ్ పై 'సూర్య' ని విశ్వనాధ్ గా చూసుకొని మురుసిపోతున్నారు. ఇది కదా సూర్య అంటే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ శ్రావణ మాస శోభకి మరింత కాంతులు వెదజల్లుతున్నారు. ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ బాట పట్టడానికి శ్రావణ మాస శోభనే ఒక కారణం కావచ్చు. నిజానికి సంజయ్ విశ్వనాధ్ గా సూర్య నటన అంత ఆషామాషి తో కూడుకున్న వ్యవహారం కాదు. క్యారక్టర్ కి తగ్గట్టుగా పిన్ టూ పిన్ బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాలంటే ఎంతో శ్రమ తప్పని సరి. ఇక ఈ సినిమా నైజాం ఏరియాలో కలెక్షన్స్ తుపాన్ సృష్టిస్తుంది. ఆదివారం ఒక్క రోజే 5.2 కోట్ల గ్రాస్ ని రాబట్టి తన అర్హత ఉన్న రేంజ్ ని చాటి చెప్పింది. దీంతో మొదటి మూడు రోజులకి కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు 14 కోట్ల మార్కుని తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా కూడా నిలవడం గమనార్హం. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు దక్కే వీలుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం, మాటలకి, మాగి గా మమితా బైజు నాచురల్ పెర్ ఫార్మెన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ విలువలు, జి.వి. ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిమిష్ రవి ఫొటోగ్రఫీ పోటాపోటీగా విశ్వనాధ్ అండ్ సన్స్ కి కుదిరాయి. వరల్డ్ వైడ్ గా మూడు రోజులకి సుమారు 120 కోట్ల వరకు గ్రాస్ ని రాబట్టింది. ఎన్టీఆర్ 'డ్రాగన్' అప్డేట్: బిగ్ షాక్ ఇవ్వబోతున్న ప్రశాంత్ నీల్.! 'ది ప్యారడైజ్'

ఆచార్య చాణక్యుడి బోధనలు ఇప్పటికీ మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి ప్రశాంతమైన జీవితం గడపాలన్నా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా కొన్ని విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పారు. ముఖ్యంగా, మన ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, కుటుంబంలోని సమస్యల గురించి బయట ఎక్కడా మాట్లాడకూడదు. ఎందుకంటే, మన కష్టాన్ని లేదా మంచి సంపాదనను తెలుసుకుని, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకునే వాళ్లు ఈ సమాజంలో చాలామంది ఉంటారని చాణక్యుడు చెప్పాడు. మరి చాణక్యుడి ప్రకారం ఎలాంటి వ్యక్తులతో మన సీక్రెట్స్ పంచుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం. చాణక్యుడి ప్రకారం మూర్ఖంగా, అమాయకంగా ఉండే వ్యక్తులతో మీ రహస్యాలను పంచుకోవద్దు. మీ కుటుంబ విషయం లేదా సమస్యలను ఒక మూర్ఖుడితో లేదా లోకజ్ఞానం లేని వ్యక్తితో చెప్పడం అంటే, మీ కాలిపై మీరే గొడ్డలి వేటు వేసుకోవడం లాంటిదని చాణక్యుడు చెప్పాడు. ఇలాంటి వాళ్లకు ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియదు. మీరు వారిని నమ్మి మీ కష్టాన్ని చెప్పొచ్చు, కానీ వాళ్లు దాన్ని సరదాకోసమో లేదా వేరేవాళ్లతో మాట్లాడేటప్పుడో బయటపెట్టేస్తారు. దీనివల్ల సమాజంలో మీ గౌరవానికి భంగం కలగవచ్చు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేవారు, ఎప్పటికీ మీ నిజమైన శ్రేయోభిలాషి కాలేరు. ఇలాంటి స్వార్థపరులతో మీ బలహీనతను గానీ, ఆర్థిక కష్టాలను గానీ ఎప్పుడూ చెప్పకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటి వాళ్లు, తమ పనిని చక్కబెట్టుకోవడానికి మీ నిస్సహాయతను వాడుకుంటారు. అలాగే మీకు నిజంగా ఒక సమస్య వచ్చినప్పుడు, మొదట మిమ్మల్ని వదిలి పారిపోయేది కూడా వీళ్లేనని చాణక్యుడి బోధనలు చెబుతున్నాయి. కొంతమందికి ఇతరులలో తప్పులు వెతకడం, వాళ్ల వెనుక చాడీలు చెప్పడమే పని. ఇలాంటి వాళ్లకు మీ సమస్యలు, వైఫల్యాలు తెలిస్తే, సహాయం చేయడానికి బదులుగా దాన్ని నలుగురికీ చెప్పి ప్రచారం చేస్తారు. మీ సమస్యలను గోరంతను కొండంత చేసి, మీకు మానసిక ఒత్తిడిని పెంచుతారు. అందుకే, మీ

సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద నిలకడైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, తొలి వీకెండ్లో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఆదివారం నాడు నైజాం వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్లలో ప్రేక్షకుల సందడి భారీగా కనిపించింది. ఆదివారం ఒక్క రోజే నైజాం ఏరియాలో ఈ చిత్రం ₹5.2 కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో మొదటి మూడు రోజులకు కలిపి నైజాంలో మొత్తం గ్రాస్ కలెక్షన్లు ₹14 కోట్ల మార్కును తాకాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రానికి నైజాం అత్యుత్తమ వసూళ్లు నమోదు చేసిన ప్రాంతంగా (Best Performing Area) నిలిచింది. తొలి మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు రావడంతో, ఈ సినిమా నేటితో (సోమవారం) జీఎస్టీ మినహాయించి బ్రేక్ ఈవెన్ స్థాయిని చేరుకోనుంది. వీకెండ్ తర్వాత పనిదినాల్లో కూడా ఇదే జోరు కొనసాగితే, నైజాం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు దక్కే వీలుంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా సినిమా విజయానికి మంచి బలాన్ని చేకూర్చింది

స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, తొలి వీకెండ్లో బలమైన పట్టు కనబరిచింది. ముఖ్యంగా ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని థియేటర్లలో భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’లో ఈ సినిమా భారీ స్థాయిలో టికెట్ సేల్స్ నమోదు చేసింది. ఆదివారం ఒక్క రోజే (గడిచిన 24 గంటల్లో) ఏకంగా 3.11 లక్షలకు పైగా (311.33K) టికెట్లు బుక్ అయినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభించడంతో ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో మంచి సంఖ్యలో హౌస్‌ఫుల్ షోలు కనిపించాయి. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, తల్లీ కొడుకుల అనుబంధం చుట్టూ తిరిగే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మొదటి వీకెండ్లో అత్యుత్తమ వసూళ్లు నమోదు చేయడంతో, ఈ వారం వర్కింగ్ డేస్‌లో కూడా సినిమా నిలకడైన రన్ కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి

భారతీయులు ఎక్కువగా కొత్త ఫోన్ ఏ కారణంతో కొంటున్నారో తెలుసా? ఈ వార్తకు సంబంధించిన

సూర్య, మమితా బైజు జంటగా నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 'సర్', 'లక్కీ భాస్కర్' వంటి చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఇదే రోజు విశాల్ నటించిన `మకుటం`(మగుడం) మూవీ కూడా విడుదలైంది. కానీ దీనికి నెగటివ్ టాక్ వచ్చింది. సూర్య గత చిత్రాల్లోని యాక్షన్, మాస్ అంశాలకు భిన్నంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మంచి కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో నడేస్తుంది. మమితా బైజు నటన కూడా యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది. దీని ఫలితంగా, సినిమా విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లను దాటినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా రూ.100 కోట్లు వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే, 'విశ్వనాథ్ అండ్ సన్స్'కు పోటీగా ఆగస్టు 14న విడుదలైన విశాల్ 'మకుటం' సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ తేలిపోయింది. 'ఈట్టి', 'ఐంగరన్' చిత్రాల దర్శకుడు రవి అరసు మొదట ఈ ప్రాజెక్టుకు దర్శకుడిగా పనిచేశారు. కథ, స్క్రీన్‌ప్లే పనుల్లో కూడా ఆయన పాలుపంచుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత నటుడు విశాల్ స్క్రీన్‌ప్లేలో మార్పులు చేసి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విడుదలైనప్పటి నుంచి 'మకుటం' సినిమాకు ఎక్కువగా నెగటివ్ టాక్ వచ్చింది. ఆ ప్రభావం బాక్సాఫీస్ వసూళ్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సాక్నిల్క్ డేటా ప్రకారం, ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.2.10 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. ఒకవైపు 'విశ్వనాథ్ అండ్ సన్స్' రోజూ రూ.20 కోట్లకు పైగా వసూలు చేస్తూ రూ.110 కోట్ల
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ కుటుంబం గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అయితే, ఈ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు గోదావరిలో దూకగా.. స్థానికంగా ఉండే మత్స్యకారులు ఒక్కర్ని మాత్రమే కాపడగా, మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పిఠాపురానికి చెందిన పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సభ్యులు రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకారు. నూకరాలు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కలిసి గోదావరిలో దూకినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో 60 ఏళ్ల నూకరాజు, 58 సంవత్సరాల ఆయన భార్య మీనా, 34 సంవత్సరాల కుమార్తె సౌజన్య గోదావరిలో గల్లంతయ్యారు. నూకరాజు మనవడిని స్థానికంగా ఉండే మత్స్యకారులు గుర్తించి ప్రాణాలతో కాపాడారు.READ ALSO టాస్క్‌లు పూర్తి చేసి రోజుకు రూ.వేలల్లో సంపాదిస్తున్నారా? అయితే మీరు సైబర్ స్కామ్‌లో చిక్కుకున్నట్లే! బీ అలెర్ట్.. అస్సలు నమ్మొద్దురిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న పంచాయతీ రాజ్ ఏఈ నూకరాజు 60 సంవత్సరాల వయస్సులో కుటుంబంతో సహా ఇలా చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గల్లంతయిన ఈ ముగ్గురి కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. పెళ్లికి వెళ్లొస్తూ నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు..పెళ్లి వేడుకకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థులు తిరుగు ప్రయాణంలో గోదావరిలో గల్లంతయ్యారు. ఆచంట మండలం వల్లూరుతోటకు చెందిన మట్టా సంతోష్, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, శృంగవరప్పాడుకు చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్ (18), నాగిరెడ్డి దుస్వంత్ సాయి (18), నాగబత్తుల తేజసాయి సూర్య (19), చెరుకూరి రాజా రాంచరణ్ (16), వీరమల్లు సాయి వెంకట కిరణ్ (18), మట్టా సంతోష్ శనివారం రాత్రి పెరవలిలో జరిగిన స్నేహితుడి

ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్‌ను రహస్యంగా వివాహం చేసుకోవడం తెలిసిందే. పదేళ్ల సహజీవనం అనంతరం ఇటీవలే పోర్చుగల్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఈ జంటకు ఐదుగురు పిల్లలు. అయితే, ఈ పెళ్లి కన్నా ఎక్కువగా ఇప్పుడు వారి మధ్య కుదిరిన ఆర్థిక ఒప్పందం (ప్రీనప్షియల్ అగ్రిమెంట్) చర్చనీయాంశంగా మారింది. వివాహ బంధంలో ఆర్థిక స్పష్టత ఎంత అవసరమో ఈ ఒప్పందం తెలియజేస్తోంది.నివేదికల ప్రకారం, రొనాల్డో-జార్జినా "సెపరేషన్ ఆఫ్ అసెట్స్" అనే ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం, వివాహానికి ముందు గానీ, వివాహ సమయంలో గానీ ఎవరికి వారు సంపాదించుకున్న ఆస్తులు, సంపద పూర్తిగా వారికే చెందుతాయి. అయితే, ఇద్దరూ కలిసి సంపాదించిన ఆస్తులను మాత్రం పంచుకోవచ్చు. అంతేకాదు, భవిష్యత్తులో ఒకవేళ వారు విడిపోవాల్సి వస్తే, జార్జినాకు ప్రతినెలా కొంత భరణం అందేలా, అలాగే కొన్ని ఆస్తులపై హక్కులు లభించేలా ఈ ఒప్పందంలో నిబంధనలు పొందుపరిచారు. ఇది సంపదను కాపాడుకుంటూనే, భాగస్వామికి ఆర్థిక భద్రత కల్పించే ఒక సమతుల్య విధానం.భారతీయ జంటలకు పాఠాలుసాధారణంగా పెళ్లికి ముందు ఇలాంటి ఆర్థిక ఒప్పందాలను ప్రేమ, నమ్మకానికి వ్యతిరేకంగా చూస్తుంటారు. కానీ, వాస్తవానికి ఇవి వివాహ బంధంలో ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన కీలక సాధనాలు. భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.పాశ్చాత్య దేశాల్లో ప్రీనప్ ఒప్పందాలకు చట్టబద్ధత ఉన్నప్పటికీ, భారత చట్టాలు వీటిని అధికారికంగా గుర్తించవు. అయినప్పటికీ, రొనాల్డో ఒప్పందం నుంచి భారతీయ జంటలు నేర్చుకోవాల్సిన ఆర్థిక

తెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవుతెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవు Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి మంచి చెడులను అర్థం చేసుకోలేని వాళ్ళకి సలహా ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీ మాటలను అసలు పట్టించుకోకపోవచ్చు ఇదే మిమ్మల్ని మరి ఇబ్బంది పెడుతుంది అసలు పట్టించుకోకపోవచ్చు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా ఏం చెప్పకండి. ఇంకా మీకు ఇబ్బందులు కూడా రావొచ్చు. మీకు ఇబ్బందులు కూడా మూర్ఖులకు సలహాలు ఇవ్వడం వలన సమయం వృథా అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు మూర్ఖులకు సలహాలు జీవిత భాగస్వామి చేసే తప్పు చేస్తే అది తన మీద కూడా పడుతుంది. జీవిత భాగస్వామి నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

పై ఫొటోలో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోంది. ఎంతలా అంటే ఇప్పుడీ హీరోయిన్ సినిమా చేస్తే సూపర్ హిట్ అన్న విధంగా మారిపోయింది. ఆ హిట్ అవుతోన్న సినిమాలు కూడా వందల కోట్ల కలెక్షన్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం దక్షిణాదిలోనే ది మోస్ట్ లక్కీ ఛార్మ్ గా మారిపోయిందీ క్రేజీ హీరోయిన్. కేరళ రాష్ట్రం ,కొట్టాయం సమీపంలోని కిడంగూర్ అని గ్రామానికి చెందిన ఈ చిన్నది ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. అయితే డిగ్రీ పూర్తి చేయకుండానే హీరోయిన్ గా మళ్లీ సినిమాల్లో అడుగు పెట్టింది. 2017 నుంచే సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల క్రితమే తెలుగుతెరకు పరిచయమైంది. కేవలం డబ్బింగ్ చిత్రాలు మాత్రమే చేస్తున్నా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార. ముఖ్యంగా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొడుతోందీ అందాల తార. అలాగే తన అభినయంతో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడీ హీరోయిన్ పేరు మళ్లీ మార్మోగుతోంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. ఆమె మరెవరో కాదు ప్రేమలు సినిమతో పలకరించి ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో తన అల్లరితో ఆకట్టుకున్న మమితా బైజు. ప్రేమలు తర్వాత జీవీ ప్రకాశ్ కుమార్ తో రెబెల్ సినిమాలో చేసింది మమితా బైజు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా మమితా యాక్టింగ్ కు అందరూ ఫిదా అయ్యారు. దీని తర్వాత ప్రదీప్ రంగనాథన్ తో కలిసి డ్యూడ్, ధనుష్ తో కలిసి కర అనే సినిమాల్లో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ఈ సినిమాలన్నీ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాక్సాఫీస్ వద్ద తన స్టామినా మరోసారి నిరూపించుకున్నారు. ఈ ఏడాది ‘కరుప్పు’తో రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆయన తాజాగా ‘ విశ్వనాథ్ అండ్ సన్స్ ’తో మరో బిగ్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. టాలెంటెడ్ తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి ఆట నుంచే యునానిమస్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని సరికొత్త సంచలనాన్ని నమోదు చేసింది.రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని అధిగమించింది. మాస్ ఎలిమెంట్స్ లేకుండా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం ఇంత తక్కువ టైమ్‌లోనే వంద కోట్ల క్లబ్లో చేరడం సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధి మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని నింపింది.* మెగాస్టార్ vs సూపర్ స్టార్... బాక్సాఫీస్ వద్ద చిరంజీవి - రజనీకాంత్ మధ్య ‘డబుల్ క్లాష్’!ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రభంజనంక్లీన్ ఎంటర్టైన్మెంట్, హృదయాలను హత్తుకునే బలమైన ఫ్యామిలీ ఎమోషన్ష్తో తెరకెక్కిన చిత్రం కావడంతో ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు పోటెత్తుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్ అంతటా దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పంపిణీదారులు అనేక ప్రాంతాల్లో అదనపు స్క్రీన్లను, ప్రత్యేక షోలను కేటాయిస్తున్నారు. ఆదివారం కూడా ఇదే

తమిళ వర్సటైల్ నటుడు సూర్య వరుస ప్లాప్స్ ఎదుర్కొన్నాడు. 2013లో వచ్చిన ‘సింగమ్ 2’ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేకపోయాయి. అయితే ఇటీవల ‘వీరభద్రుడు’ (‘కరుప్పు’) చిత్రంతో ఆ రికార్డులను సూర్య బ్రేక్ చేశారు. కరుప్పు ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ‘సింగమ్ 2’ బాక్సాఫీస్ నెంబర్లను దాటడానికి సూర్యకు ఏకంగా 13 ఏళ్ల సమయం పట్టడం విశేషం. ‘కరుప్పు’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుండి అపూర్వ ఆదరణ పొందిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘కరుప్పు’ విజయం అందించిన జోష్‌లోనే తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కుటుంబ కథాంశంతో పాటు సూర్య నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ దిశగా వేగంగా దూసుకుపోతోంది. ఇలా కేవలం మూడు నెలల్లోనే రెండు భారీ హిట్లు కొట్టి తన పవర్ ఏంటో మరోసారి నిరూపించారు సూర్య. జస్ట్ రెండు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్లకు అటు ఇటుగా వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్తుంది. తమిల్ కంటే కూడా తెలుగులో ఈ సినిమా అదరగోతుంది. శనివారం ఫస్ట్ షో, సెకండ్ షోస్ కు హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. ఒకప్పడు వరుస ప్లాప్స్ చూసిన సూర్య ఇప్పుడు జస్ట్ 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేసాడు

టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో చేయాల్సిన సినిమా గురించి మాట్లాడారు. టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri). ‘తొలిప్రేమ’, ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి, తాజాగా వచ్చిన సూర్య (Suriya) ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ (Vishwanath and Sons)తో కూడా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌తో సంతోషంగా వెంకీ అట్లూరి పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ, చిత్ర విశేషాలను తెలుపుతున్నారు. ఇలాంటి ఓ ఇంటర్వ్యూలో రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేయాలనుకున్న ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చిరంజీవితో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ఎందుకు పట్టాలెక్కలేదో వివరించారు. మెగాస్టార్‌తో అనుకున్న ప్రాజెక్ట్ గురించి వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘మెగాస్టార్‌తో ఓ సినిమా చేయాలని అనుకున్న మాట నిజమే. 80స్ కాలంలో పెరిగిన వ్యక్తిగా చెబుతున్నాను.. మెగాస్టార్ మాకు చిన్ననాటి ఆరాధ్య దైవం. అయితే ఆయన లాంటి పెద్ద స్టార్‌ను డైరెక్ట్ చేయాలంటే సరైన సబ్జెక్ట్‌తో పాటు పూర్తిగా సంసిద్ధమై ఉండాలి. ఆ స్థాయి స్టార్‌ను, ఆ భారీ బడ్జెట్‌ను హ్యాండిల్ చేయడానికి దర్శకుడిగా నాకు ఇంకాస్త మెచ్యూరిటీ అవసరమనిపించింది. ఆ సబ్జెక్ట్, ఆయన ఇమేజ్ రెండింటికీ న్యాయం చేయగలమా అనే ఆలోచన వచ్చింది’’ అని తెలిపారు. కెరీర్లో అంచెలంచెలుగా ఎదగడంపైనే తనకు నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక్కసారిగా పెద్ద జంప్ తీసుకుంటే అనుభవలేమితో బడ్జెట్ వృధా అయ్యే ప్రమాదం ఉంటుందని, అందుకే మొదటి మూడు సినిమాల బడ్జెట్లను నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చానని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కోసం

Vishwanath & Sons Collections : సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన సినిమా ‘విశ్వనాథ్ & సన్స్’ ఇటీవల ఆగస్టు 14న రిలీజయి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చాన్నాళ్ల తర్వాత సూర్య ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో రావడం, మమిత తన కామెడీ టైమింగ్ తో నవ్వించడం, మదర్ ఎమోషన్ తో ఏడిపించడంతో ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. విశ్వనాథ్ & సన్స్ సినిమా రెండు రోజుల్లోనే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. అమెరికాలో ఆల్మోస్ట్ 1 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. Also See : Trisha : చీరకట్టులో త్రిష.. ఎంత అందంగా ముస్తాబయిందో.. దీంతో సూర్య ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథ్ & సన్స్ సినిమా దాదాపు 300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక సూర్య కరప్పు, విశ్వనాథ్ & సన్స్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు
సౌతిండియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ వర్సలైట్ యాక్టర్ సూర్య నటించిన బైలింగ్వల్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ దూసుకుపోతోంది. తెలుగులో వరుస హిట్లతో జోరుమీదున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మమితా బైజు కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, రవీనా టండన్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. వినోదం, సున్నితమైన కుటుంబ భావోద్వేగాల కలయికతో రూపొందిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. చాలాకాలం తర్వాత సూర్య ఒక ఆహ్లాదకరమైన ఫ్యామిలీ డ్రామాలో కనిపించడం, వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడంతో చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.* సంక్రాంతి బ్లాక్‌బస్టర్ లోడింగ్... లీవ్స్, హాలిడేస్ లేకుండా ర్యాంప్ ఆడేస్తున్న అనిల్ రావిపూడిబాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లలో అనూహ్యమైన వృద్ధి కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ. 74.47 కోట్ల గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. ఇండియాలో మొదటి రోజు రూ. 17.74 కోట్లు వసూలు చేయగా, రెండో రోజు మరింత పుంజుకుని ఏకంగా రూ. 25 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మొత్తంగా ఇండియా వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 43.47 కోట్ల గ్రాస్ (సుమారు రూ. 37.60 కోట్ల నెట్) నమోదు చేసింది. ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ, తెలంగాణ) రూ. 17 కోట్లు, తమిళనాడులో రూ. 18 కోట్లు, కర్ణాటకలో రూ. 5 కోట్లు, కేరళలో రూ. 3.50 కోట్లు సాధించి సాలిడ్ హోల్డ్ కనబరిచింది.* లక్షలాది మంది ఆకలి తీర్చిన ‘ఎన్టీఆర్ మీల్’ సర్వీస్ బంద్ఓవర్సీస్లో

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ & సన్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది.'విశ్వనాథ్ & సన్స్' కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 74.47 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు 'సాక్నిల్క్' వెల్లడించింది. విశేషమేమిటంటే.. తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం స్వదేశంలోనే కాకుండా, ఓవర్సీస్లోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. ముఖ్యంగా అమెరికా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అరుదైన మైలురాయిని చేరుకుంది.యూఎస్‌లో ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల మార్కును దాటినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సూర్య కెరీర్లో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన చిత్రంగా 'విశ్వనాథ్ & సన్స్' సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు, ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే 5,05,710 టికెట్లు అమ్ముడవడం సినిమాకున్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు ఒక్కరోజులో అమ్ముడవడం అసాధారణ స్పందనగా ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.ఈ చిత్రంలో సూర్య సరసన మామితా బైజు హీరోయిన్గా నటించగా, సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్