Shop News
19 కథనాలుLatest Stories
19 కథనాలు
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 4న అన్ని చికెన్, మటన్ షాపులు బంద్.!. జీహెచ్ఎంసీ కీలక
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Meat shops closed in Hyderabad city on September 4: ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం. ఈనెలలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. అయితే.. సెప్టెంబర్ 4న మనం జన్మాష్టమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తారు. పలు చోట్ల దహి హండీ ఉట్టి కొట్టే వేడుకను నిర్వహిస్తారు. తమ పిల్లలకు చిన్నారి శ్రీకృష్ణుడు, రాధలా కాస్ట్యూమ్ లు వేసి పొంగిపోతారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసంతో రాత్రి వేళ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు అష్టమి, రోహిణి తిథి ఉండేలా చూసుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న చికెన్, మటన్ అమ్మకాలపై ఒక రోజు నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Read more: Konda Surekha: నన్ను ఎవరు పిలువలేదు.. నేనే వచ్చా... ఉత్కంఠ వేళ కొండంత ట్విస్ట్ ఇచ్చిన మంత్రి సురేఖ..! ఈ మేరకు రిటైల్, చికెన్, మటన్ షాపులు, పశువధ శాలలన్ని మూసి వేసి ఉంచాలని అధికారులు తెల్చి చెప్పారు. ఎవరైన రహస్యంగా మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ వాసులు

భారత్ లో టెస్లా 20 సూపర్ ఛార్జర్లు ఏర్పాటు
ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో తన మౌలిక వసతులను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు విక్రయానంతర సేవలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 ‘సూపర్ ఛార్జర్ల’ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొత్తగా 'టెస్లా-అప్రూవ్డ్ బాడీ షాప్' (టీఏబీ), సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. అహ్మదాబాద్‌లో కొత్త సదుపాయం ప్రారంభోత్సవం సందర్భంగా టెస్లా ఇండియా కంట్రీ హెడ్ శరద్ అగర్వాల్ మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో తెరిచిన ఈ సెంటర్ భారత్‌లో కంపెనీకి చెందిన 7వ బాడీ షాప్, సర్వీస్ సెంటర్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే గురుగ్రామ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణె, ముంబై నగరాల్లో టెస్లా తమ సర్వీస్ సెంటర్లను నిర్వహిస్తోంది. గుజరాత్ పరిధిలోని వినియోగదారులకు ఒరిజినల్ స్పేర్ పార్ట్స్, శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులతో బాడీ రిపేర్, కొలిజన్ రిపేర్ సేవలను ఇది అందిస్తుంది. టెస్లా వాహనాలకు షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ అవసరం చాలా స్వల్పమని అగర్వాల్ పేర్కొన్నారు. సింహభాగం సాంకేతిక సమస్యలను ‘రిమోట్ డయాగ్నోసిస్’ (సాఫ్ట్వేర్ ఆధారిత తనిఖీ) ద్వారానే పరిష్కరించవచ్చని, 24/7 సర్వీస్ అసిస్టెన్స్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో మోడల్ Y రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచారు. మోడల్ వై ఆర్డబ్ల్యూడీ ధర సుమారుగా రూ.51.89 లక్షలు, మోడల్ వైఎల్ రూ.61.99 లక్షలుగా ఉంది. ఇదీ చదవండి: సెప్టెంబర్‌లో విడుదలయ్యే టాప్ స్మార్ట్ఫోన్లు ఇవే.. ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల

చేశారా? సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ పేమెంట్లు బంద్? ఆర్ బీఐ కొత్త రూల్ ఇదే
దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే లక్షలాది మంది చిన్న వ్యాపారులకు త్వరలోనే పెద్ద సమస్య వచ్చిపడేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రీ-కేవైసీ (Re-KYC) గడువు సెప్టెంబర్ 15తో ముగియనుండటమే దీనికి కారణం. నిర్ణీత సమయంలోగా కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే క్యూఆర్ కోడ్స్ , సౌండ్‌బాక్స్‌ల ద్వారా జరిగే పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందనే వార్తలు పేమెంట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పేమెంట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. వీధుల్లో, చిన్న చిన్న షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు వాడే ఆఫ్‌లైన్ చిన్న వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా, ఆన్లైన్లో చిన్న వ్యాపారాలు చేసుకునే మరో పది లక్షల మంది కూడా తమ అకౌంట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడంలో వెనుకబడి ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఆన్లైన్, ఆఫ్‌లైన్, విదేశీ పేమెంట్ సేవలు అందించే అన్ని కంపెనీలు సెప్టెంబర్ 15, 2026 నాటికి తమ వ్యాపారుల అందరి రీ-కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చిల్లర కొట్టు యజమానులకే అసలు కష్టం!ఈ కేవైసీ నిబంధనల వల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టు యజమానులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్బీఐ అడిగే డాక్యుమెంట్స్ వీరిలో చాలామంది దగ్గర లేకపోవడం, అలాగే ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సౌండ్‌బాక్స్ వాడుతున్న వారిలో 85-90 శాతం మంది కేవైసీ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం క్యూఆర్ కోడ్ బోర్డులు మాత్రమే వాడే చిన్న వ్యాపారులే దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేలా ఉన్నారు.RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు

పొగాకు, మద్యం, షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు
జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ 2016లోని నిబంధనల ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరంగా పేర్కొంటూ షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. హైకోర్టులో పిల్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): జువైనల్ జస్టిస్ మోడల్ రూల్స్ 2016లోని నిబంధనల ప్రకారం పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరంగా పేర్కొంటూ షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర మహిళ, శిశు అభివృద్ధిశాఖ, కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, స్త్రీ శిశు సంక్షేమశాఖ, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, హోం, రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, పాఠశాల విద్యశాఖల ముఖ్యకార్యదర్శులు, జువైనల్ వెల్ఫేర్ డైరెక్టర్, రాష్ట్ర డీజీపీ, ఆరోగ్యశాఖ కమిషనర్, తదితరులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్/ మేనేజింగ్ ట్రస్టీ కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిల్లలకు మద్యం, పొగాకు ఉత్పత్తులు విక్రయించేవారికి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించబడుతుందని బోర్డులపై స్పష్టంగా పేర్కొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫున న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 ప్రకారం విద్యా సంస్థలకు 100గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులు విక్రయించడానికి వీల్లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపినందుకు 2025-26లో 35,449 కేసులు నమోదయ్యాయని వివరించారు. చట్టం అమలు

శ్రావణంలో దానం చేయదగ్గ వస్తువులు.. ఓ దోసెడు పోసినా చాలు
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు పూజలు, కఠిన ఉపవాసాలు, అభిషేకాలను ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో జపతాపాలు, నిత్య పూజా కార్యక్రమాలు మాత్రమే కాకుండా, దానధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యమైన విధిగా పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో చేసే దానాలు అనంత పుణ్యఫలాలతో పాటు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.వైదిక శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసంలో చేసే దానాల వల్ల కష్టాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. పేదలకు వారి అవసరాన్ని బట్టి తోచిన సహాయం చేయడం వల్ల సత్కర్మల ప్రభావం గణనీయంగా పెరుగుతుంది. మన శక్తి కొద్దీ ఇతరులకు దానధర్మాలు చేయడం ద్వారా ఆ భోళాశంకరుని అనుగ్రహం నేరుగా భక్తులపై ప్రసరిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర మాసంలో ఎటువంటి వస్తువులను దానం చేయాలో స్పష్టంగా తెలుసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది.గాజులు, పసుపు, కుంకుమ ఇవ్వడం ఆనవాయితీ. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఈ మాసంలో దానం చేయాల్సిన వస్తువులలో మొదటిగా చెప్పుకోవాల్సింది.. ఆహార ధాన్యాలు, అన్నదానం. పేదలకు అన్నం పెట్టడం లేదా అవసరమైనన్ని వారికి బియ్యం, పప్పులు వంటి నిత్యావసర ఆహార ధాన్యాలను దానంగా సమర్పించడం చాలా శ్రేయస్కరం. ఈ విధమైన దానం చేయడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు ఎన్నడూ కొరత రాదని, లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట కొలువై ఉంటుందని విశ్వసిస్తారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.పూలు, పండ్ల రేట్లు స్కైరాకెట్: ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్కగ్రహ పీడల నివారణ కోసం నల్ల నువ్వులు, కొంత నగదును దానం చేయడం ఎంతో మంచిది. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను దానం చేయడం వల్ల.. ముఖ్యంగా శని దేవుని ఆగ్రహం, జాతకంలోని శని మహాదశ ప్రభావాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని పురాణాలు చెబుతున్నాయి. జీవితంలో ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, కోర్టు/ఆస్తి

ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క
వరలక్ష్మి వ్రతం వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. పూలు, పండ్లు, ఇతర పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివస్తున్నారు. పెరిగిన డిమాండ్ కారణంగా పూలు, పండ్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాలు, పూజా ద్రవ్యాల ధరలు భారీగా పెరిగినప్పటికీ, సాంప్రదాయ పండుగ కావడంతో భక్తులు కొనుగోళ్లకు ఏమాత్రం వెనకాడటం లేదు.పండుగ నేపథ్యంలో కనకాంబరం ధర కిలో ఏకంగా 3,000 రూపాయల దరకు పెరిగింది. పండుగ రోజు నాటికి 4,500 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తోన్నారు. మల్లెపూలు కిలో 500 నుండి 800 రూపాయల వరకు పలుకుతున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించే తామర పూల ధర కూడా అసాధారణంగా పెరిగింది. సాధారణ రోజుల్లో 15 నుండి 25 రూపాయలు పలికే తామర కాడ.. పండుగ రోజుల్లో 50 నుండి 100 రూపాయల వరకు అమ్ముడవుతోంది.గన్నేరు వంటి సాధారణ పూల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇదివరకు కిలో 100 రూపాయలు ఉన్న గన్నేరు పూలు ప్రస్తుతం 500 రూపాయలకు చేరాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు వల్ల పూల దిగుబడి గణనీయంగా తగ్గడం కూడా ఈ అసాధారణ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైందని చెబుతున్నారు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!ఈ ధరల పెరుగుదల పూలకే పరిమితం కావట్లేదు. పండ్ల రేట్లు కూడా కొనుగోలుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఆపిల్, దానిమ్మ, అరటి, బత్తాయి ధరలు కిలోపై 100 రూపాయల వరకు పెరిగాయి. కిందటి వారం వరకూ కిలో 200 రూపాయలు ఉన్న ఆపిల్ ధర ఇప్పుడు 300 రూపాయలకు చేరింది. దేశీ ఆపిల్ ధర కిలో 200 రూపాయలను దాటేసింది. దానిమ్మ పండ్లను కిలో 150 నుండి 250 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అరటి కిలో 80 నుండి 120 రూపాయల మధ్య ఉంటోంది.వాస్తు ప్రకారం మెట్ల

బిర్యాని బిజినెస్ చేస్తూ నెలకు రూ.1.35 లక్షల ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే
బిర్యానీకి లవర్స్ ఎక్కువ. ప్రతిరోజూ బిర్యానీ తినేవారు కూడా ఎక్కువే. అందుకే బిర్యానీ బిజినెస్ బాగా నడుస్తుంది. దీనికి పెట్టే పెట్టుబడి కూడా తక్కువే. అందుకే చిన్నగా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. రోడ్డు పక్కన చిన్న బండిపై కూడా బిర్యానీ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఒక ప్లేట్ బిర్యానీ రూ.90 ధర నిర్ణయించి.. రోజూ 50 ప్లేట్లు అమ్మితే నెలకు రూ.1.35 లక్షల ఆదాయం వస్తుంది. సరుకులు, అద్దె, సిబ్బంది జీతాలు, గ్యాస్, ఇతర ఖర్చులు తీసేస్తేనే అసలు లాభం తెలుస్తుంది. ఏ వ్యాపారంలోనైనా అమ్మకాలు మాత్రమే సరిపోవు. ఫుడ్ క్వాలిటీ, ధర, లొకేషన్, కస్టమర్లు, సరుకుల ఖర్చు, రోజువారీ నిర్వహణ వంటివి లాభాన్ని నిర్ణయించే కీలకమైన అంశాలు. ఉదాహరణకు, ఒక ప్లేట్ బిర్యానీని రూ.90కి అమ్ముతున్నారని అనుకుందాం. రోజూ 50 ప్లేట్లు అమ్మితే, ఒక రోజు మొత్తం అమ్మకం రూ.4,500 అవుతుంది. బిర్యానీ బిజినెస్ 30 రోజుల పాటూ అమ్మకాలు జరిగితే, నెల మొత్తం ఆదాయం రూ.1.35 లక్షలు అవుతుంది. కానీ ఈ రూ.1.35 లక్షలు మొత్తం లాభం అనుకుంటే పొరపాటే. అసలు లాభం తెలియాలంటే అన్ని ఖర్చులనూ తీసేయాలి. బిర్యానీ తయారీకి అవసరమైన బియ్యం, మాంసం, నూనె, మసాలాలు, కూరగాయల వంటి సరుకులకు నిరంతరం ఖర్చు అవుతుంది. వీటితో పాటు షాప్ లేదా కిచెన్ అద్దె, సిబ్బంది జీతాలు, కరెంట్, గ్యాస్, నీళ్లు, ప్యాకింగ్, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. ఇలాంటి ఖర్చులన్నీ కలిపి నెలకు సుమారు రూ.80,000 వరకు కావచ్చని అంచనా. ఆ స్థాయిలో ఖర్చులు పోగా, రూ.1.35 లక్షల ఆదాయంలో సుమారు రూ.55,000 మిగలవచ్చు. అమ్మకాలు ఇంకా పెరిగితే లాభాలు భాగా కనిపిస్తాయి. దగ్గర్లోని ఆఫీసులు, కంపెనీలు, చిన్న చిన్న ఫంక్షన్లు, కుటుంబ వేడుకలకు బల్క్ ఆర్డర్లు తీసుకోవచ్చు. చివరగా, రోజుకు 50 ప్లేట్లు అమ్మడం అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అసలు

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి
బంగారం ధరలు అమాంతం పెరిగిపోవడంతో దొంగల దృష్టి ఇప్పుడు బంగారు షాపులపై పడింది. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇళ్లు, దుకాణాలు అని తేడా లేకుండా రకరకాల చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ విస్మయకరమైన బంగారం చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. బురఖాలు ధరించి వచ్చిన కొందరు మహిళలు ఏకంగా పది లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించారు. జహీరాబాద్‌లోని ఒక జువెలరీ షాపులో ఈ భారీ చోరీ జరిగింది. ఇటీవల సాయంత్రం నాలుగు గంటల సమయంలో నలుగురు మహిళలు, వారి వెంట ఒక యువకుడు బురఖాలు ధరించి షాపులోకి ప్రవేశించారు. ముక్కుపుడకలు కావాలని చెప్పి సేల్స్‌మెన్, షాపు యజమానిని మాటల్లో పెట్టారు. వారికి రకరకాల డిజైన్లు చూపించడంలో సిబ్బంది నిమగ్నమైనప్పుడు, ఆ ముఠాలోని ఒక మహిళ దృష్టి మరల్చగా, మరో మహిళ అత్యంత చాకచక్యంగా కౌంటర్లో ఉన్న బంగారు నగల పెట్టెను కాజేసింది. నగల పెట్టె చేతికి చిక్కగానే, ముక్కుపుడకలు తమకు నచ్చలేదని చెప్పి ఆ బృందం షాపు నుండి బయటపడింది. గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్ ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్, మోహన్‌లాల్

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్ డీఏపై హైకోర్టు గుస్సా
మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ సంస్థపై బాంబే హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి స్వీట్ షాపు లైసెన్స్‌ను పునరుద్ధరించడంలో జాప్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. షాపు మూసి ఉండటంతో జరిగిన నష్టానికి గాను వారికి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర ఎఫ్‌డీఏ అధికారులు ఇటీవల పుణెలోని గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాపులో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో పరిశుభ్రతకు సంబంధించి లోపాలు బయటపడ్డాయి. ఆ తరువాత షాపు వారు జులై 9న ఎఫ్‌డీఏ అధికారులను మరోసారి తనిఖీ చేయాలని కోరారు. నిబంధనలన్నిటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ తరువాత నాలుగు రోజులకు ఎఫ్‌డీఏ అధికారులు మరోసారి తనిఖీ నిర్వహించారు. షాపు వారు నిబంధనల అమలు విషయంలో 98 శాతం పక్కాగా ఉన్నట్టు తేల్చారు. 36 మార్కులకు గాను 35 ఇచ్చారు. అయితే, మునుపు రద్దు చేసిన లైసెన్స్‌ను మాత్రం పునరుద్ధరించలేదు. దీంతో, షాపు వారు హైకోర్టును ఆశ్రయించారు. 34 రోజులుగా షాపు మూసి ఉండటంతో రూ.8.74 లక్షల నష్టం వచ్చిందని చెప్పారు. కస్టమర్లకు ఎలాంటి అనారోగ్యం కలిగిందనే విషయాన్ని లైసెన్స్ రద్దు ఆదేశాల్లో అధికారులు పేర్కొనలేదని అన్నారు. అయితే, షాపు యజమాన్యం అభ్యర్థనను పరిశీలించామని, నిర్ణయాన్ని ఆగస్టు 11కు వాయిదా వేశామని ఎఫ్‌డీఏ తరఫు లాయర్ పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎఫ్‌డీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌డీఏ తీరు వింతగా ఉందని అభిప్రాయపడింది. కల్తీని కట్టడి చేయాలన్న ఎఫ్‌డీఏ తీరు అభినందనీయమే అయినా డిపార్ట్మెంట్ అతి చేస్తోందని కోర్టు అభిప్రాయపడింది. 98 శాతం కంప్లెయన్స్ ఉన్నప్పుడు వెంటనే లైసెన్స్‌ను పునరుద్ధరించి ఉండాల్సిందని

మహారాష్ట్రలో విషాదం.. డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఆర్టీసీ ఉద్యోగి బలి
ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్‌షాప్‌లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: చిన్న క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) వర్క్‌షాప్‌లో బస్సు చక్రం కింద పడి ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్ మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా చవాన్‌కు వర్క్‌షాప్ విధులు కేటాయించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. చవాన్ ర్యాంప్ సమీపంలో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మరో డ్రైవర్ సికందర్ మనేర్ మరమ్మతుల కోసం బస్సును ముందుకు నడిపించాడు. బస్సు ర్యాంప్‌పై వెళ్తున్న సమయంలో చవాన్ దాని ముందు చక్రం కింద పడిపోయారు. బస్సు చక్రం ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తోటి ఉద్యోగులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. సమాచారం అందుకున్న షాహుపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సును చూసుకోకుండా సడన్‌గా కదిలించారని చవాన్ సహోద్యోగులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్ ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే

స్వాతంత్య్ర దినోత్సవం రోజూ నిరాటంకంగా మద్యం అమ్మకాలు
కోవెలకుంట్లలో వైన్‌షాపు వెనుకవైపు నుంచి మద్యం బాటిళ్లు అమ్ముతున్న దృశ్యం బాటిల్‌పై రూ.50 నుంచి రూ.100 అధికం.. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి నియోజకవర్గంలో జోరుగా విక్రయాలు సాక్షి టాస్క్ ఫోర్స్: జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయించకూడదనే నిబంధన చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక అమలు కావడంలేదు. ఆయా తేదీల్లోను మద్యం, మాంసం విక్రయాలు నిరాటంకంగా సాగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రోజు శనివారం నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం, మాంసం విక్రయాలు జోరుగా జరిగాయి. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి సొంత నియోజకవర్గం బనగానపల్లెలో మద్యం ఏరులై పారింది. ఎక్సైజ్‌శాఖ అధికారులు మద్యం షాపులకు లక్క అతికించి మూసివేశారు. వైన్‌షాపుల యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ముందురోజే మద్యం బాటిళ్లను బయటకు తరలించి విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఒక్కో బాటిల్‌పై ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలతోపాటు బనగానపల్లె, కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల తదితర మండలాల్లో శనివారం మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగినట్లు తెలిసింది. కోవెలకుంట్లలోని గుంజలపాడు రహదారి పక్కన ఉన్న వైన్‌షాపులో రెండోవైపు డోర్ నుంచి మద్యం విక్రయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో

ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ ఫొటోలు
ఆదిలాబాద్ పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హెబ్బా పటేల్ (Hebah Patel) ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు. ఐశ్వర్య రాజేష్, హెబ్బా పటేల్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ ఉత్సాహపరిచారు. తమిళ సాంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫొటోలు : చింతల అరుణ్ రెడ్డి, సాక్షి స్టాప్ ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా ప్రోటోకాల్ ఉల్లంఘించిన బాలకృష్ణ భార్య వసుంధర ఎందుకు చంపినవారిని కాపాడుతున్నారు? ప్రియాంక ఆత్మకు శాంతి చేకూర్చాలంటే

రైల్వేప్లాట్ ఫామ్ పై షాప్ పెట్టాలనుకుంటున్నారా? ఎలా ఓపెన్ చేయాలి? కావాల్సిన డాక్యుమెంట్ల వివరాలు
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. How To Start Railway Station Business: సొంత బిజినెస్ ప్రారంభించాలని ఈ కాలంలో చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు జాబ్‌లు ఎప్పుడు ఉంటాయో? ఎప్పుడు ఊడతాయో కూడా తెలీదు. అయితే, మీరు కూడా బిజినెస్ రైల్వేస్టేషన్లో ప్రారంభించాలనుకుంటున్నారా? ప్రక్రియ ఏంటో తెలీదా? రైల్వే ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది తెలుసా? రైల్వేస్టేషన్లో వ్యాపారం ప్రారంభించడం.. రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై చిన్న షాపు సులభంగా ఓపెప్ చేయడం సులభమే. దీనికి టెండర్ ప్రక్రియ ఉంటుంది. ముందుగా రైల్వేస్టేషన్ అధికారుల పర్మిషన్ కూడా అవసరం. ఈ టెండర్ ప్రక్రియ అనేది ఐఆర్సీటీసీ ఆధారంగా జరుగుతుంది. విజయవంతంగా టెండర్ పూర్తి చేసిన వారికి లైసెన్స్ ఇస్తారు. రైల్వే రూల్స్ ప్రకారం వ్యాపారం ప్రారంభించవచ్చు. రైల్వేస్టేషన్ సంబంధిత అధికారులు టెండర్ విధానం ద్వారా ఈ దుకాణాలు ప్రారంభించవచ్చు. ఐఆర్సీటీసీ నిర్ణీత సమయాల్లో టెండర్లకు ఆహ్వానిస్తుంది. ఎప్పటికప్పుడు టెండర్స్ ఉన్నాయా? లేదా? చెక్ చేసుకోవాలి. ఆ స్టేషన్, మీకు ఆ టెండర్ సెట్ అవుతుందా? చెక్ చేసుకుని ఆ తర్వాత అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు. టెండర్ లిస్ట్.. రైల్వే స్టేషన్లో షాప్ సరైన ప్రదేశంలో ఉందా? లేదా? లొకేషన్ చెక్ చేయండి. దీంతోపాటు దుకాణం సైజు, బిజినెస్ యాక్టివిటీకి పర్మిషన్, లైసెన్స్ గడువు, సెక్యూరిటీ డిపాజిట్, బిడ్డింగ్ డెడ్‌లైన్ కూడా చెక్ చేసుకోండి. మీ వద్ద ఈ టెండర్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఉండాలి. సాధారణంగా రైల్వేకు సంబంధించిన టెండర్స్ ఇండియన్ రైల్వేస్ ఇప్రోక్యూర్మెంట్ సిస్టమ్ (IREPS) పోర్టల్ ద్వారానే జరుగుతాయి. ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ప్రక్రియకు డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్

దోసకాయ కొనేటప్పుడు ఈ తప్పులు చేయకండి
దోసకాయ చేదుగా ఉందో లేదో కొనేటప్పుడే పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకోవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: దోసకాయను సలాడ్, రైతా వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కొన్ని దోసకాయలు చేదుగా ఉండటం చాలాసార్లు ఇబ్బందిగా మారుతుంది. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సహజ సమ్మేళనం వల్ల చేదు రుచి వస్తుంది. ఇది దోసకాయ రకం, వాతావరణం, సాగు పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దోసకాయను కోసి రుచి చూడకుండా అది చేదుగా ఉంటుందో లేదో వంద శాతం కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే కొనేటప్పుడు కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దోసకాయలు కొనేటప్పుడు చాలా పెద్దగా లేదా లావుగా ఉన్న వాటి కంటే మధ్యస్థ పరిమాణంలో ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది. కేవలం పరిమాణాన్ని బట్టి దోసకాయ చేదుగా ఉందని చెప్పలేం. అయితే మరీ పెద్దగా ఉన్న దోసకాయలు ఎక్కువగా పండిపోయి ఉండొచ్చు. వాటిలో గింజలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే సలాడ్ కోసం మధ్యస్థ పరిమాణంలో ఉన్న దోసకాయలను ఎంచుకోవడం మంచిది. తాజా దోసకాయ సాధారణంగా మంచి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రంగు వెలిసిపోయినట్లు లేదా పసుపు రంగులోకి మారినట్లు కనిపిస్తే అది పాతదై ఉండవచ్చు. కాబట్టి సహజమైన ఆకుపచ్చ రంగులో, తాజాగా కనిపించే దోసకాయలను ఎంచుకోండి. దోసకాయను కొనేటప్పుడు చేతితో మెల్లగా నొక్కి చూడండి. తాజా దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటుంది. నొక్కినప్పుడు చాలా మెత్తగా అనిపిస్తే లేదా సులభంగా లోపలికి వంగిపోతే అది పాతదై ఉండవచ్చు. అలాంటి దోసకాయలను కొనకపోవడం మంచిది. దోసకాయ తొక్కపై నల్లటి మచ్చలు, కోతలు, ముడతలు లేదా ఎక్కువగా ఎండిపోయినట్లు కనిపిస్తే దానిని కొనకపోవడం మంచిది. తాజా

ఎఫ్ సీఆర్ ఏ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గుతోందా
వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు కొద్ది రోజులే సమయం ఉండడంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో చర్చలు జరిపారు. ప్రతిపక్ష నేతలతో వరుస భేటీలు జరగడంతో ఈ బిల్లుపై కేంద్రం వెనక్కి తగ్గుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును మార్చి 25న లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటి వరకు సభలో చర్చకు రాలేదు. ప్రతిపక్షాలు మరియు అనేక సివిల్ సొసైటీ వర్గాలు ఈ బిల్లును మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్వహించిన సమావేశంలో కూడా ఈ వివాదాస్పద బిల్లు ప్రస్తావన రాకపోవడం విశేషం. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి కష్టంగా మారింది. ఈ నూతన సవరణ చట్టం ప్రకారం విదేశీ విరాళాల రద్దు లేదా పునరుద్ధరణ జరగని సంస్థల ఆస్తులను ప్రత్యేక నియంత్రణ పరిధిలోకి తెస్తారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిగ్నేటెడ్ అథారిటీకి ఆయా సంస్థల నిధులు మరియు ఆస్తులను నిర్వహించే పూర్తి అధికారాలు లభిస్తాయి. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని పూర్తిగా అరికట్టడం మరియు పారదర్శకత పెంచడమే తమ ప్రధాన లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ చట్టం పూర్వకాలానికి వర్తించదని హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారు. పాఠశాలలు మరియు ఆసుపత్రులు వంటి దాతృత్వ సంస్థల ఆస్తులపై ప్రభుత్వ పెత్తనం పెరుగుతుందని ప్రతిపక్షాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫలితంగా మిజోరం మరియు నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని క్రైస్తవ సంస్థలు ఈ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. వాచ్ టైమ్ రెట్టింపు
కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ప్లాట్ఫామ్లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసింది. షార్ట్స్, ప్రకటనలు, ప్రీమియం ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. యూట్యూబ్ నుంచి ఆదాయం పొందే అర్హత సాధించాలంటే కొత్త కంటెంట్ క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల వాచ్‌టైమ్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల ప్రకారం.. క్రియేటర్లు తమ ఛానెల్లో మానిటైజేషన్ పొందేందుకు గడిచిన ఏడాది వ్యవధిలో 8,000 గంటల వాచ్ టైమ్ లేదా గత 90 రోజుల్లో కనీసం 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1,000 సబ్స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉంటే మానిటైజేషన్‌కు అర్హత లభించేది. అయితే ఇప్పటికే YPPలో భాగమై ఆదాయం పొందుతున్న క్రియేటర్లకు ఈ నిబంధనలు వర్తించవు. 2027 ఫిబ్రవరి 1 నుంచి షార్ట్స్ ద్వారా నిరంతరం ప్రకటనలు, సబ్స్క్రిప్షన్ ఆదాయాన్ని పొందాలంటే.. గత 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ సాధించాలి. ఈ పరిమితిని చేరుకోలేని ఛానళ్లు YPPలో కొనసాగుతాయి. అయితే షార్ట్స్ రెవెన్యూ షేరింగ్ నిలిచిపోతుంది. మళ్లీ 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ సాధిస్తే యూట్యూబ్ నుంచి ఆదాయం పొందొచ్చు. క్రియేటర్ల ఆదాయ అవకాశాలను పెంచేందుకు యూట్యూబ్ కొత్త ఇన్సెంటివ్ ప్రొగ్రామ్‌లను కూడా తీసుకురానుంది. యూట్యూబ్ షాపింగ్‌లో

ఫోన్ లోనే డెబిట్ కార్డ్. డిజిటల్ కార్డుల వెనుక ఉన్న నిజాలు
ఆన్లైన్ షాపింగ్, రీఛార్జ్‌లు, సబ్స్క్రిప్షన్ల హవా నడుస్తున్న నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు సైతం వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. మన వ్యాలెట్‌లో ఉండే ప్లాస్టిక్ డెబిట్ కార్డుల స్థానంలో ఇప్పుడు బ్యాంకింగ్ యాప్‌లలోనే వర్చువల్ డెబిట్ కార్డ్ ప్రత్యక్షమవుతోంది. కార్డు నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివీవీ వంటి అన్ని వివరాలు మీ ఫోన్లోని బ్యాంకింగ్ యాప్‌లోనే కనిపిస్తాయి. ఫిజికల్ కార్డు పొగొట్టుకుంటామనే భయం లేకుండా, అవసరమైనప్పుడు క్షణాల్లో వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. అయితే, ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ వీటి వినియోగంలోనూ కొన్ని భద్రతాపరమైన ప్రమాదాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.సౌకర్యంతో పాటు లభించే అదనపు నియంత్రణసాధారణంగా ఏదైనా కొత్త వెబ్సైట్లో కొనుగోలు చేసేటప్పుడు మన ప్రధాన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అసలు డెబిట్ కార్డ్ వివరాలను ఇవ్వడానికి చాలామంది భయపడతారు. అలాంటి సమయాల్లో ఈ వర్చువల్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.అనేక బ్యాంకులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా ఈ కార్డుల ఖర్చుల పరిమితిని స్వయంగా నిర్ణయించుకునే సదుపాయాన్ని ఇస్తున్నాయి. అంతేకాకుండా, అవసరం లేనప్పుడు కార్డును టెంపరరీ ఆఫ్ లేదా డిసేబుల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దీనివల్ల కార్డు వివరాలు బయటకు పొక్కే అవకాశం చాలావరకు తగ్గుతుంది.రూపాయి ఛార్జ్ పడదు! మా కస్టమర్లకు ఫ్రీగానే... ఫోన్‌పే సంచలన గ్యారెంటీభ్రమల్లో ఉండొద్దు... మోసాలకు ఇవీ మినహాయింపు కాదు!వర్చువల్ కార్డ్ వాడటం వల్ల సైబర్ మోసాలు అస్సలు జరగవు అనుకోవడం అపోహ మాత్రమే. ఇది మీ బ్యాంక్ ఖాతాకే నేరుగా లింకై ఉంటుంది కాబట్టి, ఇందులో చేసే ప్రతి చెల్లింపు మీ ఖాతా నుంచే కట్ అవుతుంది. ఫేక్ వెబ్సైట్లు, సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ లింకులు లేదా ఓటీపీ మోసాల్లో పడి మనమే స్వయంగా సమాచారాన్ని అందిస్తే వర్చువల్ కార్డు కూడా రక్షణ ఇవ్వలేదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఎంతటి కట్టుదిట్టమైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, వినియోగదారుల

అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు..వైన్స్ బంద్, ఆ రూట్లలోట్రాఫిక్ ఆంక్షలు
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Lal Darwaza Bonalu 2026: హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు నేడు అనగా ఆగస్టు 9న అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ 118వ వార్షిక జాతరకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో పాటు వైన్ షాపులు బంద్, ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఉత్సవాల వేడుకలు ఇలా: నేడు (ఆగస్టు 9): అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి. రేపు (ఆగస్టు 10): ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే 'రంగం' కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, పత్తర్‌గట్టి మీదుగా మూసీ నది సమీపంలోని నయాపూల్ ఆలయం వరకు సాగుతుంది. మద్యం దుకాణాల మూసివేత.. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లలో ఆగస్టు 9 ఉదయం 10:00 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10:00 గంటల వరకు వైన్స్, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసి ఉంటాయి. అదే విధంగా చార్మినార్ జోన్లో ఉత్సవాలు ప్రధానంగా జరిగే ఈ ప్రాంతంలో రెండు రోజుల
