
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Lal Darwaza Bonalu 2026: హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు నేడు అనగా ఆగస్టు 9న అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి.
ఈ 118వ వార్షిక జాతరకు నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీ, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో పాటు వైన్ షాపులు బంద్, ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు.
ఉత్సవాల వేడుకలు ఇలా: నేడు (ఆగస్టు 9): అమ్మవారికి బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
రేపు (ఆగస్టు 10): ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే 'రంగం' కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాలిబండ, చార్మినార్, పత్తర్‌గట్టి మీదుగా మూసీ నది సమీపంలోని నయాపూల్ ఆలయం వరకు సాగుతుంది.
మద్యం దుకాణాల మూసివేత.. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటానికి హైదరాబాద్ పోలీసు కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లలో ఆగస్టు 9 ఉదయం 10:00 గంటల నుంచి ఆగస్టు 10 ఉదయం 10:00 గంటల వరకు వైన్స్, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసి ఉంటాయి.
అదే విధంగా చార్మినార్ జోన్లో ఉత్సవాలు ప్రధానంగా జరిగే ఈ ప్రాంతంలో రెండు రోజుల పాటు అనగా ఆగస్టు 9 ఉదయం 10:00 గంటల నుంచి ఆగస్టు 11 ఉదయం 10:00 గంటల వరకు వైన్స్ బంద్ కొనసాగుతుంది. అయితే ఇందులో స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. లాల్ దర్వాజా, కార్వాన్, అంబర్పేట్ ప్రాంతాల్లో బోనాల ఊరేగింపుల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. మదీనా చౌరస్తా నుంచి గుల్జార్ హౌస్, చార్మినార్, హిమ్మత్‌పురా, నాగుల్ చింతా, ఆలియాబాద్ మీదుగా ఇంజిన్ బౌలి వరకు వెళ్లే ప్రధాన రహదారిని సాధారణ వాహనాలకు పూర్తిగా మూసివేస్తారు.
వాహనాల మళ్లింపు కోసం ఫలక్‌నుమా, ఇంజిన్ బౌలి వైపు నుంచి వచ్చే వాహనాలను శంషేర్‌గంజ్, తాడ్బన్ వైపు మళ్లిస్తారు. ఆర్టీసీ బస్సులను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపిస్తారు. అలాగే అంబర్పేట్ మహంకాళి ఆలయ ఉత్సవాల కారణంగా ఆగస్టు 9 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 10 మధ్యాహ్నం 12 గంటల వరకు ఉప్పల్ - చాదర్‌ఘాట్ మార్గంలో వెళ్లే బస్సులు, భారీ వాహనాలను అంబర్పేట్ ఫ్లైఓవర్ మీదుగా అనుమతిస్తారు.
భక్తుల సౌలభ్యం కోసం శాలిబండ వద్ద గల అల్కా థియేటర్, దేవి ప్లైవుడ్ ఓపెన్ గ్రౌండ్, ఆర్య వైశ్య మందిర్ ప్రాంతాలను ప్రత్యేక పార్కింగ్ స్థలాలుగా కేటాయించారు. నగరవాసులు ఈ ఆంక్షలను గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





