
ఆన్‌లైన్ షాపింగ్, రీఛార్జ్‌లు, సబ్‌స్క్రిప్షన్ల హవా నడుస్తున్న నేటి డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు సైతం వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. మన వ్యాలెట్‌లో ఉండే ప్లాస్టిక్ డెబిట్ కార్డుల స్థానంలో ఇప్పుడు బ్యాంకింగ్ యాప్‌లలోనే వర్చువల్ డెబిట్ కార్డ్ ప్రత్యక్షమవుతోంది. కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సివీవీ వంటి అన్ని వివరాలు మీ ఫోన్‌లోని బ్యాంకింగ్ యాప్‌లోనే కనిపిస్తాయి. ఫిజికల్ కార్డు పొగొట్టుకుంటామనే భయం లేకుండా, అవసరమైనప్పుడు క్షణాల్లో వీటి ద్వారా డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. అయితే, ఎంత సౌకర్యంగా ఉన్నప్పటికీ వీటి వినియోగంలోనూ కొన్ని భద్రతాపరమైన ప్రమాదాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.సౌకర్యంతో పాటు లభించే అదనపు నియంత్రణసాధారణంగా ఏదైనా కొత్త వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసేటప్పుడు మన ప్రధాన బ్యాంక్ ఖాతాకు సంబంధించిన అసలు డెబిట్ కార్డ్ వివరాలను ఇవ్వడానికి చాలామంది భయపడతారు. అలాంటి సమయాల్లో ఈ వర్చువల్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.అనేక బ్యాంకులు తమ మొబైల్ యాప్‌ల ద్వారా ఈ కార్డుల ఖర్చుల పరిమితిని స్వయంగా నిర్ణయించుకునే సదుపాయాన్ని ఇస్తున్నాయి. అంతేకాకుండా, అవసరం లేనప్పుడు కార్డును టెంపరరీ ఆఫ్ లేదా డిసేబుల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. దీనివల్ల కార్డు వివరాలు బయటకు పొక్కే అవకాశం చాలావరకు తగ్గుతుంది.రూపాయి ఛార్జ్ పడదు! మా కస్టమర్లకు ఫ్రీగానే... ఫోన్‌పే సంచలన గ్యారెంటీభ్రమల్లో ఉండొద్దు... మోసాలకు ఇవీ మినహాయింపు కాదు!వర్చువల్ కార్డ్ వాడటం వల్ల సైబర్ మోసాలు అస్సలు జరగవు అనుకోవడం అపోహ మాత్రమే. ఇది మీ బ్యాంక్ ఖాతాకే నేరుగా లింకై ఉంటుంది కాబట్టి, ఇందులో చేసే ప్రతి చెల్లింపు మీ ఖాతా నుంచే కట్ అవుతుంది. ఫేక్ వెబ్‌సైట్లు, సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ లింకులు లేదా ఓటీపీ మోసాల్లో పడి మనమే స్వయంగా సమాచారాన్ని అందిస్తే వర్చువల్ కార్డు కూడా రక్షణ ఇవ్వలేదు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఎంతటి కట్టుదిట్టమైన సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ, వినియోగదారుల అప్రమత్తత మాత్రమే సైబర్ దాటవేతలకు నిజమైన పరిష్కారం.e-PAN Card: కేంద్రం సీరియస్ అలర్ట్! డౌన్‌లోడ్ లింక్స్ క్లిక్ చేస్తున్నారా? అన్ని చోట్లా పనిచేయకపోవచ్చు... ఈ పరిమితులు గుర్తుంచుకోండివర్చువల్ డెబిట్ కార్డులను కేవలం డిజిటల్, ఆన్‌లైన్ లావాదేవీలకు మాత్రమే ఉపయోగించగలము. వీటి ద్వారా ఏటీఎంలో నేరుగా నగదు ఉపసంహరించుకోవడం లేదా దుకాణాల్లోని స్వైపింగ్ మెషిన్లలో వాడటం కుదరదు. అలాగే కొన్ని అంతర్జాతీయ చెల్లింపులు, ఆటోమేటిక్ మంత్లీ బిల్లుల చెల్లింపులలో కొన్ని బ్యాంకుల వర్చువల్ కార్డులు పనిచేయకపోవచ్చు. అందుకే, ఆన్‌లైన్ లో కొనుగోళ్లు చేసేటప్పుడు అదనపు రక్షణ కోసం వీటిని వాడుతూనే, ఎప్పటికప్పుడు బ్యాంక్ మెసేజ్‌లను, ఖాతా స్టేట్‌మెంట్‌ను పరిశీలించుకోవడం ఉత్తమమైన మార్గం.




