
Rohit Sharma: వన్డేప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలుక్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..
Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలు క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..

Rohit Sharma: వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా..? అసలు క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..

Rohit Sharma | వరల్డ్‌కప్ చాలా దూరంలో ఉంది.. అప్పుడు చూసుకుందాంలే..!

Rohit Sharma: క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన హిట్ మ్యాన్.. టీ20ల్లో 9 ఏళ్లుగా చెక్కుచెదరని రోహిత్ శర్మ రికార్డు

హీరోయిన్ అదాశర్మ (Adah Sharma) కృష్ణాష్టమి సందర్భంగా రాధగా ముస్తాబయి స్పెషల్ ఫోటోషూట్ చేసి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Rohit Sharma: టీవీలోకి 'హిట్‌మ్యాన్' ఎంట్రీ.. ఇక క్రికెట్‌కు పూర్తిగా దూరమైనట్లేనా?

BCCI Meeting: భారత క్రికెట్ బోర్డు ముంబైలోని ప్రధాన కార్యాలయంలో గురువారం అత్యంత కీలకమైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తోంది. భారత జట్టు ఇటీవలి ప్రదర్శనలతో పాటు రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలా వద్దా అనే అంశంపై తీవ్ర చర్చ జరగనుంది. కోచ్ గంభీర్, సెలెక్టర్ అగార్కర్ హాజరవుతున్న ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ముఖ్యమైన భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌లతో పాటు బోర్డు అగ్రశ్రేణి అధికారులు హాజరుకానున్నారు. అందరూ బుధవారం రాత్రికే ముంబై చేరుకున్నారు. ఆయా పర్యటనల్లో జట్టు ప్రదర్శించిన వైఫల్యాలు, భవిష్యత్తు ప్రణాళికలపై బోర్డు పెద్దలు పూర్తి స్థాయి విశ్లేషణ చేయనున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై తేలనున్న నిర్ణయం ఈ సమావేశంలో అందరి దృష్టి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పైనే ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరు లేదంటూ ప్రచారంలో ఉన్న కథనాలపై బోర్డు ఒక స్పష్టతకు రానుంది. రోహిత్‌ను జట్టులో కొనసాగించాలా లేక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాడిని తీర్చిదిద్దాలా అనే కోణంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా రోహిత్ భవిష్యత్తు పై ఒక కీలక రోడ్‌మ్యాప్ రూపుదిద్దుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో టీ20 సిరీస్ ఓటములతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ పరాజయంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. వాస్తవానికి ఈ సమావేశం ముందే జరగాల్సి ఉన్నప్పటికీ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల కారణంగా వాయిదా పడింది. ఆ రెండు సిరీస్‌లు గెలిచినప్పటికీ విదేశీ గడ్డపై ఎదురైన ప్రతికూల ఫలితాలకు గల కారణాలను గంభీర్, అగార్కర్ వివరించాల్సి ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ లోపాలను ఎత్తిచూపుతూ బోర్డు గట్టి నిలదీతలకు

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులోకి వచ్చాడు. అటు యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా చోటు దక్కించుకున్నాడు. దీంతో ఓపెనింగ్ జోడీపై ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల ఈ యువ సంచలనం బ్యాటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోవు. భారీ షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించే వైభవ్.. అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్ 13 నుంచి టీమిండియా.. అఫ్గానిస్థాన్‌లో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించిన జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అటు వైభవ్ సూర్యవంశీ కూడా జట్టులో ఉన్నాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో భారత ఓపెనింగ్ జోడీ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన సంజును జట్టు నుంచి తప్పించి వైభవ్‌కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు అభిషేక్ శర్మ-వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. ఇంగ్లండ్‌పై నిరాశపరిచిన వైభవ్.. జింబాబ్వేపై చెలరేగాడు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో సంజు రాకతో వైభవ్ సూర్యవంశీకి షాక్ తగిలే అవకాశం ఉంది. ఎప్పటిలాగే సీనియర్ ప్లేయర్లు సంజు శాంసన్-అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తే.. వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది. అక్కడ సంజు లేదా అభిషేక్ విఫలమైతేనే వైభవ్‌కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు, దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 6 నుంచి ఫైనల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. ఆ వెంటనే అఫ్గానిస్తాన్ సిరీస్ ప్రారంభం కానుంది. ఇషాన్ కిషన్ ఈస్ట్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మరి ఈ ఇద్దరూ అఫ్గాన్ సిరీస్ కల్లా సిద్ధంగా ఉంటారా? లేదా? అనేది

భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన సెలబ్రిటీ జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఒకరు. పబ్లిక్ అటెన్షన్ నుండి దూరంగా ఉండాలని ఈ జంట భావించింది. తమ పిల్లలతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వారు లండన్ నగరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గతంలో 2025లో డాక్టర్ శ్రీరామ్ నేనే, అనుష్కా శర్మతో జరిగిన ఒక సంభాషణను గుర్తు చేసుకున్నారు. ఆమె తన విజయాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించడానికి ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఆ సమయంలో పంచుకున్నారు. ఈ పాత సంభాషణ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఎప్పుడూ తమ వ్యక్తిగత జీవితాన్ని సాధ్యమైనంత వరకు రహస్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం వీరు తమ పిల్లలు వామికా, అకాయ్‌లతో కలిసి లండన్‌లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అనుష్క శర్మతో జరిగిన ఆసక్తికరమైన సంభాషణను మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే 2025లో యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియాతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. విరాట్ కోహ్లీని ఎంతో వినయంతో ఉండే వ్యక్తిగా ఆయన ప్రశంసించారు. అనుష్కతో జరిగిన మాటలను గుర్తుచేసుకుంటూ, విపరీతమైన ప్రజాదరణ వల్ల సాధారణ జీవితం గడపడం ఎంతో కష్టంగా మారిందని ఆమె భావించినట్లు డాక్టర్ నేనే వివరించారు. వారు సాధించిన విజయం వల్ల వచ్చే నిరంతర దృష్టి వారి స్వేచ్ఛకు అడ్డంకిగా మారింది. విరాట్, అనుష్క ఇద్దరి కెరీర్లు అపారమైన విజయాన్ని చూశాయి. అయితే దానితో పాటే వారి వ్యక్తిగత జీవితం కూడా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. పెళ్లి, ప్రయాణాలు, పిల్లల జననం వంటి ప్రతి చిన్న విషయం అభిమానులు, మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటువంటి వాతావరణం నుండి దూరంగా ఉండి, పిల్bబాల్యం అందించడమే ఈ జంట లండన్ జీవితాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వారి పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్నది. 2017లో ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్

Ishant Sharma: భారత మాజీ పేసర్ ఇశాంత్ శర్మ 1988 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించాడు. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ కుడిచేతి ఫాస్ట్ బౌలర్ 2007లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ టెస్టులో అతని బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఆ ప్రదర్శనతో భవిష్యత్తులో జహీర్ ఖాన్ వారసుడిగా ఎదుగుతాడనే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తర్వాత వేగం తగ్గడంతో ఫామ్ కోల్పోయాడు. సెలెక్టర్లు అతని పనిభారాన్ని తగ్గించినా ఇబ్బందులు కొనసాగాయి. 2013లో 50 టెస్టులు పూర్తి చేసే సమయానికి అతని గణాంకాలు ఆశించిన స్థాయిలో లేవు. అయినా తర్వాత రీఎంట్రీ చేసి కీలక మ్యాచ్‌ల్లో ప్రభావం చూపించాడు. ముఖ్యంగా 2014 లార్డ్స్ టెస్టులో కెరీర్లోనే అత్యుత్తమంగా 7/74 నమోదు చేసి భారత్ విజయానికి ప్రధాన కారణమయ్యాడు. లార్డ్స్‌లో మరపురాని ప్రదర్శన..: ఇశాంత్ కెరీర్లో 2014 లార్డ్స్ టెస్టు ప్రత్యేక అధ్యాయం. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో అతను 7 వికెట్లు పడగొట్టి భారత్‌కు 95 పరుగుల విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. కెరీర్లో అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే. ఆ తర్వాత 2015 శ్రీలంక పర్యటనలోనూ ఇశాంత్ కీలకంగా నిలిచాడు. కొలంబోలోని ఎస్ఎస్సీ వేదికగా జరిగిన టెస్టులో 8 వికెట్లు సాధించి, టెస్టు క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో మరో మంచి దశ..: 2018లో ఇంగ్లాండ్ పర్యటన ఇశాంత్‌కు మరో ముఖ్యమైన దశగా నిలిచింది. ఆ 5 టెస్టుల సిరీస్‌లో అతను 18 వికెట్లు తీసి భారత బౌలింగ్ విభాగంలో అత్యధిక ప్రభావం చూపిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో భారత బౌలర్‌గా 43 టెస్టు వికెట్లతో కపిల్‌దేవ్ రికార్డును సమం చేశాడు. పేస్ తగ్గిన దశను దాటి, మళ్లీ తన అనుభవం, లైన్-లెంగ్త్‌తో ప్రభావం చూపడం ఇశాంత్ కెరీర్లో చెప్పుకోదగ్గ అంశం. 2008లో పెర్త్‌లో

Mumbai Indians : ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. హార్డిక్ పాండ్య సారథ్యంలో ఆ జట్టు ఘోరంగా వైఫల్యం చెందింది. అయితే, వచ్చే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు సత్తాచాటేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తిలక్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కెప్టెన్ గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబయి కసరత్తు చేస్తోందని సమాచారం. ఆ బాధ్యతలను రోహిత్ శర్మ తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ కీలక పాత్ర పోషిస్తున్నారని.. ఈ క్రమంలో అతను రెండు పేర్లను జట్టు యాజమాన్యంకు సూచించినట్లు సమాచారం. అందులో సీనియర్ ప్లేయర్ జస్ర్పీత్ బుమ్రా, యువ ఆటగాడు తిలక్ వర్మ. అయితే, బుమ్రా కంటే తిలక్ వర్మవైపు జట్టుయాజమాన్యం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిలక్ వర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందని రోహిత్ శర్మతోపాటు జట్టు యాజమాన్యం సైతం భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో రాబోయే ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ విషయంలో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ చర్చల్లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను డీల్‌లో భాగంగా తీసుకునే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే గ్రీన్ వర్క్లోడ్పై ఆందోళనల కారణంగా ముంబై ఆ ప్రతిపాదనపై ఆసక్తి చూపలేదని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో హార్దిక్‌ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబయి భావిస్తోందట

ఇంటర్నెట్ డెస్క్: భారత వైమానిక దళంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సాయుధ దళాల్లో ఎయిర్ వైస్ మార్షల్ లేదా దానికి సమానమైన హోదాను పొందిన మొట్టమొదటి మహిళా అధికారిగా (వైద్యేతర విభాగంలో) ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ నిలిచారు. వాయుసేన ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేసింది. మంగళవారం ఆమె దిల్లీలోని ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (విద్య)గా బాధ్యతలు స్వీకరించారని తెలిపింది. గతంలో ఆమె ఎయిర్ కమోడోర్ హోదాలో ఉండేవారని పేర్కొంది. ‘నైసర్’ నిద్రపోలేదు.. ముందే సిగ్నల్స్ పంపింది..! శక్తి శర్మ 1994లో ఐఏఎఫ్ విద్యావిభాగంలో నియమితులయ్యారు. వైమానిక దళ శిక్షణ సంస్థలు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్ క్వార్టర్స్, ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌లలో విభిన్న బాధ్యతలు నిర్వర్తించారు. ఐఐటీ కాన్పుర్, పుణె విశ్వవిద్యాలయంలో ‘ఐఏఎఫ్ చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. త్రివిధ దళాల నుంచి సైనిక పాఠశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన మొదటి మహిళా అధికారిగానూ గతంలో చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాలకుపైగా విశిష్ట సేవలతో ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని వాయుసేన తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (Vijay) ఓ రైతు ఇంటికి వెళ్లి సందడి చేశారు. తమిళనాడులోని కొడైకెనాల్లో సోమవారం రాత్రి ‘గోల్డెన్ మూన్’ (Golden Moon) దర్శనమిచ్చాడు

భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఆమె ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. IAFలో చేరిక: జూన్ 18, 1994న భారత వైమానిక దళానికి చెందిన ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆమె అధికారిణిగా విధుల్లో చేరారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె ట్రైనింగ్ సెంటర్లు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా రంగానికి ప్రాధాన్యం: ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో డిఫెన్స్ సహకారాన్ని పెంచేలా 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడంలో శక్తి శర్మ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు, సైనిక దళాల (Tri-services) చరిత్రలోనే ఒక సైనిక స్కూల్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా (కపూర్తలా సైనిక స్కూల్ ప్రిన్సిపాల్‌గా) వ్యవహరించిన తొలి మహిళా అధికారిణిగా కూడా ఆమె రికార్డు సాధించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంతో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన ఈ ఘనత సాయుధ దళాల్లోని భావి మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకం. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ట్రేడింగ్‌పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. అతడిని ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించాలని ముంబై భావిస్తోందట. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ట్రేడింగ్‌పై కొత్త అంశం ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు హార్ధిక్‌ను ముంబై ట్రేడింగ్‌లోకి రిలీజ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా హార్దిక్‌ను ట్రేడ్ చేయకుండా ఆటగాడిగా జట్టులో కొనసాగించి, కెప్టెన్సీ మరొకరికి అప్పగించాలని ముంబై భావిస్తోందని సమాచారం. పాండ్యను భర్తీ చేసే సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా కొత్తవారిని ఎంపిక చేసేందుకు ముంబై ఫ్రాంఛైజీ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. కొత్త కెప్టెన్ ఎంపికలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కీలకపాత్ర పోషిస్తున్నాడని, ఇప్పటికే మెనేజ్మెంట్తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ పోటీలో సీనియర్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ పేరు పరిశీలనలో ఉందని సమాచారం. అయితే, జట్టు దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిలక్ వర్మ వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హార్దిక్‌ను అసలు ట్రేడ్ చేయకపోయినా ఆశ్చర్యంలేదని ఫ్రాంఛైజీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ట్రేడ్ విషయమై ఆటగాడితో చర్చలు కూడా జరిగాయని, ఒక ట్రేడ్ జరగాలంటే చాలా విషయాలు ఒక కొలిక్కి రావాలని, ఇది అంత తేలికైన విషయం కాదని ఎంఐ ఫ్రాంఛైజీలోని ఓ సభ్యుడు వెల్లడించారు. అలానే మహేల జయవర్ధనెను కోచ్ పదవి నుంచి తప్పిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వచ్చే సీజన్‌కు అతనే కోచ్‌గా ఉండే అవకాశముందని టాక్. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు లేకపోతే వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గతేడాది మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ అతడిని

Team India: భారత టెస్టు క్రికెట్లో నంబర్-3 స్థానానికి సుదీర్ఘకాలం పాటు వెన్నెముకగా నిలిచిన ఛతేశ్వర్ పుజారా తన డ్రీమ్ 11 సహచర ఆటగాళ్ల జట్టును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనతో కలిసి ఆడిన దిగ్గజాల్లో అత్యుత్తమ 11 మందిని ఎంచుకున్న ఆయన, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ కుమార్‌లకు స్థానం కల్పించకపోవడం క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా తరఫున దాదాపు 13 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా టెస్టు క్రికెట్ ఆడిన పుజారా అనేక మంది దిగ్గజ ఆటగాళ్లతో మైదానాన్ని పంచుకున్నారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ వంటి ప్రఖ్యాత ఆటగాళ్ల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలసి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల సారథ్యంలో మ్యాచ్‌లు ఆడినప్పటికీ, తన ఆల్ టైమ్ బెస్ట్ 11 తోటి ప్లేయర్ల జాబితాలో మాత్రం కేవలం విరాట్ కోహ్లీకి మాత్రమే చోటు కల్పించారు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ప్లాట్‌ఫారమ్ వేదికగా ఈ ఆసక్తికరమైన వివరాలను ఆయన వెల్లడించారు. టెస్టుల్లో ద్రవిడ్ వదిలివెళ్లిన డిఫెన్సివ్ బ్యాటింగ్ వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన పుజారా, తన జట్టులో ద్రవిడ్‌ను చేర్చుకోవడం మరచిపోలేదు. ఆయన ఎంచుకున్న 11 మంది సభ్యులలో ఆరుగురు రిటైర్ అయిన మాజీలు ఉండగా, ఐదుగురు ప్రస్తుత యాక్టివ్ క్రికెటర్లు ఉన్నారు. రిటైర్డ్ జాబితా నుంచి వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, వీవీఎస్ లక్ష్మణ్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంపిక చేసుకున్నారు. వీరందరిలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కరే వన్డే ఫార్మాట్లో కొనసాగుతున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో ఎవరెవరికి చోటు దక్కిందంటే? ప్రస్తుతం ఆడుతున్న అంతర్జాతీయ క్రికెటర్లలో నుంచి రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాలను పుజారా తన తుది జట్టులోకి తీసుకున్నారు. అదనంగా 12వ ఆటగాడిగా ఫాస్టెస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను సెలక్ట్ చేయడం విశేషం. పిచ్ పరిస్థితులను బట్టి

చిరుత(Chirutha) సినిమాతో రామ్ చరణ్(Ram charan) సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ(Neha Sharma) మొదటి సినిమాతోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత తెలుగు లో పెద్దగా సినిమాలు చేయని నేహా, బాలీవుడ్ లో మాత్రం అడపా దడపా సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. అయితే నేహా సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారానే ఎక్కువ క్రేజ్ ను సంపాదించింది. ఎప్పటికప్పుడు తన ఫోటోషూట్లను నెట్టింట షేర్ చేస్తూ ఉండే నేహా తాజాగా వెకేషన్ కు వెళ్లి స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకున్న సెల్ఫీలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నేహా గ్రీన్, ఐవరీ కలర్ చెక్స్ ఉన్న మినీ షాట్ ధరించి అందులో తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్‌తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది. అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్‌లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు. సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు అధికారికంగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చింది. సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఏకంగా ఐదు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చెన్నై లవ్ స్టోరీకి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. కథను బేబీ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ అందించారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా, త్రిగుణ్, దేవి ప్రసాద్, సిరి హనుమంతు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. సినిమాకు సంబంధించిన కథ, పాత్రలు, రొమాంటిక్ అంశాలు థియేటర్లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు అదే చిత్రాన్ని ఇంటి నుంచే చూసే అవకాశం ఓటీటీ ప్రేక్షకులకు లభించింది. చెన్నై లవ్ స్టోరీకి సంబంధించిన మరో ప్రత్యేకత ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కావడం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సోనీ లివ్‌లో సినిమా అందుబాటులో ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతోపాటు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ రొమాంటిక్ డ్రామాను చూసే అవకాశం ఏర్పడింది. థియేటర్లలో ఒక స్థాయి ప్రేక్షకాదరణ పొందిన సినిమా ఇప్పుడు డిజిటల్ స్టీజీపై ఎలాంటి స్పందనను అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వివిధ భాషల్లో స్ట్రీమింగ్ కావడం వల్ల సినిమాకు థియేట్రికల్ రిలీజ్‌తో పోలిస్తే మరింత విస్తృతమైన ప్రేక్షక వర్గం చేరువ కానుంది. ఈ సినిమాను ఎస్కేఎన్, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మించారు. సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అందించారు. సినిమాలో ప్రధాన నటీనటులతోపాటు సహాయ పాత్రల్లో నటించిన నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా కథకు కీలకంగా నిలిచింది. రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సాయి

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు చేరింది. ఆగస్టు 21 నుంచి సోనీలివ్‌లో ఈ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తెలుగు అసలు వెర్షన్‌తో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు ఓటీటీ విడుదలతో ఇంటి నుంచే చూసే అవకాశం దక్కింది. ‘చెన్నై లవ్ స్టోరీ’ జూలై 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాణిజ్యపరంగా మంచి ఫలితం అందుకోవడంతో కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్ ప్రయాణం పూర్తయిన తర్వాత దాదాపు నెల వ్యవధిలోనే ఈ సినిమా సోనీలివ్ ప్రేక్షకులకు చేరడం విశేషం. దర్శకుడు రవి నంబురి తెరకెక్కించిన ‘చెన్నై లవ్ స్టోరీ’కి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. చెన్నై నేపథ్యంలో యువత ప్రేమ, భావోద్వేగాలు, జీవితంలో రెండో అవకాశాల చుట్టూ కథను రూపొందించారు. దీంతో యువ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రేమకథగా ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం స్టీవెన్ శంకర్ పాత్రలో కనిపించగా, శ్రీ గౌరీ ప్రియ నివేదిత పాత్రలో నటించారు. త్రిగుణ్, దేవి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. మణి శర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ పతాకాలపై ఎస్కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణపై కిరణ్ అబ్బవరం కూడా సంతోషం వ్యక్తం చేశారు. మొదటి ప్రేమలోని నిష్కళంకత్వం, ఉత్సాహం, భావోద్వేగాలను చూపించే ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ఫలితంగా థియేటర్ విజయానంతరం ఓటీటీ ప్రయాణంపై కూడా ఆసక్తి

వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా

ముంబైలో జరిగిన జెన్ జీ ఆందోళనల్లో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన మోడల్ రియా అహిర్, ఇప్పుడు పోలీసులను ఒక విజ్ఞప్తి చేసి వార్తల్లో నిలిచింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులు, నీచమైన కామెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ముంబై పోలీసులను కోరింది. జూలై 22న దాదర్‌లోని శివాజీ పార్క్‌లో వర్షంలో జరిగిన నిరసన మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఆ సమయంలో అరెస్ట్ చేసిన నిరసనకారులను తీసుకెళ్తున్న పోలీస్ వ్యాన్ ముందుకు వచ్చి, గ్రే కలర్ హూడీతో గట్టిగా నిలబడిన రియా అహిర్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఆమె ఒక్కసారిగా ఈ జెన్ జీ ప్రొటెస్ట్‌కు ముఖచిత్రంగా మారింది. ఈ వివాదంపై ముంబై యూత్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) మనోజ్ శర్మను కలిసి మాట్లాడింది. రియా అహిర్‌పై వేసిన ఎఫ్ఐఆర్, ఆమె ఎదుర్కొంటున్న ఆన్లైన్ వేధింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రతినిధి బృందంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి హర్గున్ సింగ్, ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు జీనత్ శబ్రీన్ ఉన్నారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారని, మరి ఈ ఎఫ్ఐఆర్ల ఉపసంహరణలో ఎందుకు ఆలస్యం జరుగుతోందని హర్గున్ సింగ్ ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం, రియాపై ఉన్న ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని జాయింట్ సీపీ మనోజ్ శర్మ వారికి హామీ ఇచ్చారు. అలాగే, రియాకు సోషల్ మీడియా లో బెదిరింపు మెసేజ్‌లు పంపుతున్న అకౌంట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. జాయింట్ సీపీతో సమావేశం తర్వాత రియా అహిర్ మాట్లాడుతూ.. తన నిరసన వీడియో వైరల్ అయినప్పటి నుండి ఆన్లైన్ వేధింపులు

ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. రీసెంట్గా సమంత ‘మా ఇంటి బంగారం’ అంటూ వచ్చి రూ. 100 కోట్లు పట్టుకెళ్లింది. ఇప్పుడు బాలీవుడ్ భామ యామీ గౌతమ్ (Yami Gautam) కూడా దసరాకు సెన్సేషన్‌ను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘నయ్యి నవెల్లి’ (Nayyi Navelli). ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథను అందించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ దసరా పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఒక అద్భుతమైన ఫాంటసీ కామెడీ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రాన్ని 16 అక్టోబర్ 2026న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనతో ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరట్ నగరంలోని ఒక చలాకి కుటుంబంలోకి పెళ్లై కొత్తగా కోడలు అడుగుపెడుతుంది. ఆమె రాకతో ఆ ఇంటిలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మంచి వాతావరణ నెలకొంటుంది. అయితే ఎంతో పర్ఫెక్ట్ గా, ఆదర్శంగా కనిపిస్తున్న తన వదిన నిజానికి ఒక మాంత్రికురాలు ఏమో అని.. ఆమె మరిదికి అనుమానం మొదలవుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఎలాంటి వింతలు జరిగాయి? ఎంతటి నవ్వుల హంగామా సృష్టించబడింది? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని, సినిమా చూసిన వారంతా దసరాకు సరైన చిత్రమని అనుకుంటారని, ఫ్యామిలీ

సాంప్రదాయ దుస్తులులో మెరిసిన ముద్దుగుమ్మ అదా శర్మ..(ఫోటోలు) కేబీఆర్ ట్రాఫిక్ ‘ట్రాప్’.. ఎటు వెళ్లాలో తెలియక జనం పరేషాన్!(చిత్రాలు) చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు) అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు) జైలు నుంచి హాస్పిటల్.. ఇమ్రాన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే

Mumbai Indians Retention List: 2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఆ తర్వాతి ఆరు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 2026 సీజన్లో ముంబై తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో వచ్చే సీజన్‌కు ముందు జట్టును పునర్నిర్మించే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉండొచ్చనే అంచనాలు పెరిగాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్ జాబితా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినా కోర్ ఆటగాళ్లలో కొందరిని కొనసాగించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మతో పాటు రియాన్ రికెల్టన్, విల్ జాక్స్, నామన్ ధీర్, కార్బిన్ బోష్, మిచెల్ సాంట్నర్, అల్లా గజన్ఫర్ పేర్లు రిటెన్షన్ రేసులో ఉన్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. 2024 నుంచి ముంబై కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ వచ్చే సీజన్లో మరో ఫ్రాంచైజీకి వెళ్లే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఆయనను ట్రేడ్ చేయడం లేదా నేరుగా విడుదల చేయడం జరిగే అవకాశాలను ప్రస్తావిస్తున్నారు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! హార్దిక్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ముందంజలో ఉండొచ్చని సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఆసక్తి చూపే జట్లుగా పేర్కొంటున్నారు. అయితే తుది నిర్ణయం ఫ్రాంచైజీల అధికారిక ప్రకటనల తర్వాతే స్పష్టమవుతుంది. హార్దిక్‌తో పాటు క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రాబిన్ మింజ్, దానిష్ మాలేవార్ పేర్లు కూడా విడుదలయ్యే ఆటగాళ్ల జాబితాలో వినిపిస్తున్నాయి. ఎక్కువమంది చదివినది: SL vs IND: రిషబ్ పంత్ @ 100.. ప్రపంచ క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని రికార్డులో మనోడు..! ఈ మార్పులతో వేలానికి ముందు ముంబై పర్స్ విలువ పెంచుకోవాలని

క్రికెట్లో ఆటగాడి టాలెంటే ముఖ్యం. కానీ కొంతమంది ప్లేయర్లకు వాళ్ల హైట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లు పొడవుగా ఉంటే, పిచ్‌పై బంతిని అదనంగా బౌన్స్ చేయగలరు. భారత క్రికెట్ చరిత్రలో ఆరడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న ప్లేయర్లు చాలామంది ఉన్నారు. వారిలో టాప్ 7 ఎవరో ఇప్పుడు చూద్దాం. భారత టెస్ట్ క్రికెట్లోని సక్సెస్ఫుల్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ఒకడు. ఇతని ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు. తన సుదీర్ఘ కెరీర్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి పిచ్‌లపై ఈ హైట్‌తోనే బ్యాటర్లను వణికించాడు. ఈ లిస్ట్‌లో బౌలర్లే కాదు ఆల్-రౌండర్లు కూడా ఉన్నారు. ప్రస్తుత భారత జట్టు పవర్ హిట్టర్ శివమ్ దూబే, వెంకటేశ్ అయ్యర్ ఇద్దరూ 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉంటారు. భారీ సిక్సర్లు కొట్టడానికి వీళ్ల హైట్ బాగా ఉపయోగపడుతుంది. అబే కురువిల్లా, పంకజ్ సింగ్ (6 అడుగుల 6 అంగుళాలు) భారత అత్యంత పొడవైన క్రికెటర్ల జాబితాలో అబే కురువిల్లా, పంకజ్ సింగ్ టాప్‌లో ఉన్నారు. వీరిద్దరి ఎత్తు సుమారు 6 అడుగుల 6 అంగుళాలు. ఫాస్ట్ బౌలర్లయిన వీళ్లు, తమ హైట్‌తో బంతిని బాగా బౌన్స్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. కర్ణాటకకు చెందిన ఫాస్ట్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ ఎత్తు సుమారు 6 అడుగుల 3 అంగుళాలు. ప్రస్తుత జట్టులో ఉన్న ఇతను, తన హైట్‌తో బంతికి ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టి వికెట్లు తీయడంలో స్పెషలిస్ట్. మాజీ ఫాస్ట్ బౌలర్ సుదీప్ త్యాగి కూడా 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉంటాడు. భారత జట్టు తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడిన ఇతను, తన హైట్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు

Indian Cricket: క్రికెట్ మ్యాచ్‌లో వికెట్ పడినప్పుడు ఆటగాళ్లు ప్రదర్శించే భావోద్వేగాలు కామనే. కొన్నిసార్లు ఆ అగ్రెసివ్ సెలబ్రేషన్లు తీవ్ర వివాదాలకు దారితీస్తాయి. బ్యాటర్లను రెచ్చగొట్టేలా వేడుకలు చేసుకొని ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి, భారీ జరిమానాలు, మ్యాచ్ నిషేధాలు ఎదుర్కొన్న ఐదుగురు భారత క్రికెటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా తన అగ్రెసివ్ సెండ్‌ఆఫ్‌లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ వికెట్ తీసిన తర్వాత అతనికి ఇచ్చిన ఆగ్రహపూరిత సెండ్ఆఫ్ కారణంగా ఐసిసి ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. అంతకుముందు ఐపిఎల్‌లో మయాంక్ అగర్వాల్‌కు ఫ్లయింగ్ కిస్ సెలబ్రేషన్ ఇచ్చి ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ తన ప్రముఖ నోట్‌బుక్ సెలబ్రేషన్‌తో తీవ్ర చిక్కులు కొనితెచ్చుకున్నాడు. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మను అవుట్ చేసిన తర్వాత ఈ రీతిలో ప్రవర్తించి 50 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోవడంతో పాటు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అలాగే ఢిల్లీ ప్రిమియర్ లీగ్‌లో ప్రియాన్ష్ ఆర్యను అవుట్ చేసిన సమయంలో కూడా ఇదే సెలబ్రేషన్ పునరావృతం చేసి 30 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాడు. జాతీయ జట్టు కీలక పేసర్ మహమ్మద్ సిరాజ్ మైదానంలో చూపించే తీవ్ర ఆవేశం వల్ల పలుమార్లు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నాడు. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను అవుట్ చేసిన అనంతరం అతని ముఖానికి అత్యంత సమీపంలోకి వెళ్లి ఆవేశంగా వేడుక చేసుకున్నందుకు గాను ఐసిసి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో సైతం ఒక డీమెరిట్ పాయింట్ పొందాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్లో వేడివేడి సెండ్ఆఫ్ల వల్ల పలుమార్లు ఐసిసి శిక్షలకు గురయ్యాడు. శ్రీలంక పర్యటనలో దినేష్ చండీమాల్, లాహిరు తిరిమాన్నేల

సాక్షి, ముంబై: మాజీ మిస్ పుణే త్విషా శర్మ (33) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త, మాజీ మహిళా న్యాయమూర్తి గిరిబాల సింగ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివాహమైన ఐదు నెలలకే ఈ ఏడాది మే 12న, త్విషా శర్మ భోపాల్‌లోని తన భర్త ఇంట్లో అనుమానాస్పదంగా కన్నుమూయడం సంచలన రేపింది. సీబీఐ దాఖలు చేసిన 636 పేజీల ఛార్జ్‌షీట్‌లో కట్న వేధింపులు, గృహహింస, ఆత్మహత్యకు ప్రేరేపించడం (అబెట్మెంట్ టు సూసైడ్), ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో పనిచేయడం వంటి చట్టపరమైన సెక్షన్లను చేర్చారు. నోయిడాకు చెందిన త్విషాకు, భూపాల్‌కు చెందిన న్యాయవది సమర్థ్ సింగ్‌తో 2025 డిసెంబర్లో పెళ్లి జరిగింది. ఎంబీఏ చదువుకున్న ఆమె పెళ్లికి ముందు ఆమె మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో పనిచేసింది. అలాగే మిస్ పూణె టైటిల్ కూడా గెలుచుకున్నది. కార్పొరేట్ కెరీర్‌తో పాటు తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా ఆమె నటించింది. ఆమె యోగా శిక్షకురాలు కూడా. మే 12వ తేదీన అత్తారింట్లో ఆత్మహత్యు పాల్పడింది. అయితే త్విషాశర్మ కుటుంబ సభ్యులు ఆమెపై మానసిక,శారీరక వేధింపులు జరిగాయని, అధికారాన్ని ఉపయోగించి ఆధారాలను తుడిచిపెట్టేందుకు అత్తగారి కుటుంబం ప్రయత్నించిందని ఆరోపించారు. దీంతో కేసులు నమోదు చేసిన పోలీసులు తొలుత పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్‌ను మే 22న జబల్పూర్లో అరెస్టు చేశారు. త్విషా అత్త రిటైర్డ్ జడ్జ్ గిరిబాలా సింగ్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కూడా కేసు పెట్టారు. ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం మరణానికి కారణం ఉరివేసుకోవడమే అయినప్పటికీ, బాధితురాలి శరీరంపై ఆరు గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం నివేదిక స్పష్టం చేసింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించారు. సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా జోక్యం

Ruhani Sharma Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జోడీ గురించి సినీ క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ యాడ్ షూటింగ్ ద్వారా ఏర్పడిన వారిద్దరి పరిచయం ఆ తర్వాత ప్రణయంగా మారింది. అయితే ఈ పెళ్లి తర్వాత విరాట్ కోహ్లీకి ఓ టాలీవుడ్ హీరోయిన్ మరదలిగా మారిందట. ఆ యంగ్ హీరోయిన్ ఎవరంటూ సోషల్ మీడియాలో అప్పట్లో తెగ చర్చ నడిచింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. 'చిలసౌ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రుహానీ శర్మ. 'చి.ల.సౌ..' సినిమాతో హీరోయిన్గా తెరగేట్రం చేసింది నటి రుహానీ శర్మ. ఆ తర్వాత 'హిట్', 'డర్టీ హరి', 'సైంధవ్' వంటి చిత్రాలతో రుహానీ శర్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బ్యూటీ రుహానీ శర్మ.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు స్వయానా కజిన్ (చెల్లెలు వరుస) అవుతుందట. ఈ కారణంగా అనుష్క శర్మను పెళ్లాడని తర్వాత విరాట్ కోహ్లీకి హీరోయిన్ రుహానీ శర్మ మరదలిగా మారింది. అయితే ఇదే విషయాన్ని హీరోయిన్ రుహానీ శర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న హీరోయిన్ రుహానీ శర్మ.. టీమ్ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తనకు బావ వరుస అవుతాడని చెప్పింది. తెలుగు చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ, ప్రస్తుతం టాలీవుడ్లో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. సినిమాలలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామరస్ ఫోటోలతో కుర్రకారును ఆకట్టుకుంటూ నిత్యం ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విరాట్. వీరికి పాప, బాబు ఉన్నారు. ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్, అనుష్క ఒకటి. యాడ్స్ షూటింగ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యింది. విరాట్ తో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది అనుష్క. ప్రస్తుతం తన కుటుంబానికి టైమ్ కేటాయించింది. అయితే అనుష్క కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఓ క్రేజీ హీరోయిన్ విరాట్ కోహ్లీ మరదలు అంట. అవును.. అనుష్క చెల్లెలు సైతం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అంతేకాదు.. హిందీలో కాకుండా ఆమె తెలుగులో క్రేజీ బ్యూటీ. ఆమె మరెవరో కాదండి.. టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ. తెలుగు సినిమాతోనే సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్ అడియన్స్ ఫేవరెట్ హీరోయిన్. చిలసౌ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఆమె.. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు వంటి చిత్రాల్లో నటించింది. ఇక వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. అయితే రుహానీ నటించిన సినిమాలన్నీ హిట్టయ్యాయి. కానీ ఆశించిన స్థాయిలో ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం రాలేదు. దీంతో కొన్నాళ్లు ఇండస్ట్రీలో సైలెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. అయితే తాను విరాట్ కోహ్లీకి మరదలు..అనుష్కకు చెల్లెలు అవుతానని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. అసలు విషయం చెప్పుకొచ్చింది. తాను అనుష్కకు కజిన్ అని.. విరాట్ తనకు బావ అవుతాడని అసలు విషయాన్ని

Rohit Sharma: ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించారు. ఆ ఇన్నింగ్స్ తర్వాత కూడా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆయన ఆడతారా లేదా అనే చర్చలు ఆగడం లేదు. హిట్ మ్యాన్ మళ్లీ మైదానంలో ఆడుతూ కనిపిస్తారా అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే సెప్టెంబర్ 2026లో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రోహిత్ శర్మ భవిష్యత్తుపై చీఫ్ సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆయనను జట్టు నుంచి తప్పించే కంటే తన సత్తా నిరూపించుకోవడానికి మరో అవకాశం ఇవ్వడమే సరైనదని నిర్ణయించారు. 2027 వరల్డ్ కప్ దృష్ట్యా వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన అత్యంత కీలకం కానుంది. ఆయన అనుభవం, ఆక్రమణ శైలి బ్యాటింగ్ జట్టు విజయాలకు ఎంతగానో ఉపయోగపడతాయని యాజమాన్యం భావిస్తోంది. రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టిన సెంచరీ ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ వన్డేలకు వీడ్కోలు చెప్తారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం ఆయనను పక్కన పెడతారని, లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్ ఆయనకు చివరి వన్డే కావచ్చునని ప్రచారం జరిగింది. అలాంటి ప్రచారాలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చిన రోహిత్, క్లిష్ట సమయంలో సంచలన సెంచరీ సాధించి పెద్ద మ్యాచ్‌లలో తన ప్రాధాన్యత ఏంటో స్పష్టం చేశారు. సెలెక్టర్ల ఆలోచనలు ఎలా ఉన్నా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్‌కు సపోర్టుగా నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ భవిష్యత్తు ప్రణాళికల్లో ఉన్నంతవరకు జట్టులోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ప్రతి సిరీస్‌లో రోహిత్ ఫామ్‌ను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరగబోయే వన్డే సిరీస్ హిట్ మ్యాన్ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైనదిగా మారనుంది. మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Rohit Sharma West Indies Series: భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇంగ్లండ్ పర్యటనలోని చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీతో మెరిసిన 'హిట్‌మ్యాన్', తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే గట్టి సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చే సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ సిరీస్‌తో కీలక అడుగు బీసీసీఐ, సెలెక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్‌లోపు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సిరీస్ రోహిత్‌కు అత్యంత కీలకం కానుంది. ఊహాగానాలకు కారణాలేంటి? ఇంగ్లండ్ పర్యటన సమయంలో రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఆడించాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేనే రోహిత్‌కు ఆఖరి మ్యాచ్ కావచ్చని ప్రచారం జరిగింది. అయితే, అదే మ్యాచ్‌లో రోహిత్ అబాధ్యతాయుతమైన శతకంతో చెలరేగి, రిటైర్మెంట్పై ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. సిరీస్వారీగా ప్రదర్శనల సమీక్ష తన వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన రోహిత్‌కు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి. ఇకపై ఆయన ప్రదర్శనను సిరీస్వారీగా సమీక్షించనున్నారు. దీంతో వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన ఎలా ఉండబోతుందనే దానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అజిత్ అగార్కర్ భవిష్యత్తు.. మరోవైపు బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్

భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు అగార్కర్‌తో సమావేశం కానున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబరుతో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అగార్కర్ మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. దీంతో మరో ఏడాది పొడిగింపు ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.అగార్కర్ భవిష్యత్తుపై చర్చకు మరో అంశం కూడా కారణమవుతున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్‌ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లాండ్‌తో చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుత శతకంతో తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులతో చెలరేగాడు. లార్డ్స్‌లో వన్డే

పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. పంజాబ్‌లోని కాపుర్తలాలోని ప్రసిద్ధ మాతా శ్రీ భద్రకాళి ఆలయ ద్వారం వెలుపల బిక్షాటన చేస్తున్న మహిళపై జరగిన ఈ దాడి.. స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఆ మహిళతో ఉన్న పసిబిడ్డ అక్కడ నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను తాకడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన బైకు యజమాని.. ఆ పిల్లాడి తల్లిని కిందకు తోసి తన చెప్పుతో విచక్షణారహితంగా కొట్టాడు. అటుగా వెళ్తున్న భక్తులు జోక్యం చేసుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. నిందితుడు మళ్లీ వచ్చి ఆమెను కాలితో తన్నాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై మొదట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే, వీడియో వైరల్ కావడంతో మహిళా కమిషన్, మానవ హక్కుల కమిటీలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహం, మానవ హక్కుల సంఘాల జోక్యంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని వికాస్ శర్మగా అధికారులు గుర్తించారు. అతనిపై బీఎన్ఎస్ నిబంధనల కింద సంబంధిత సెక్షన్లతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం
భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వన్డే భవిష్యత్తు, 2027 వన్డే ప్రపంచకప్‌లో వారి భాగస్వామ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వయసు ప్రభావం దృష్ట్యా వారు ఈ మెగా టోర్నీలో ఆడతారా.. లేదా అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ తరుణంలో భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ వారికి మద్దతుగా నిలిచాడు. ఓ ఇంటర్వ్యూలో భజ్జీ మాట్లాడుతూ.. ఆటగాళ్ల వయసును బట్టి కాకుండా వారి ఫిట్నెస్, మైదానంలో ఇచ్చే ప్రదర్శన ఆధారంగానే ఎంపిక జరగాలని స్పష్టం చేశాడు.ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని ఉదాహరణగా పేర్కొన్నాడు. మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును నడిపించగా లేనిది, 38 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) విరాట్, 40 ఏళ్ల (వరల్డ్ కప్ నాటికి) రోహిత్ శర్మలు 2027 ప్రపంచకప్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ మైదానంలో 20 ఏళ్ల కుర్రాళ్లతో పోటీపడుతూ ఫిట్‌నెస్‌లో ముందంజలో ఉన్నాడని, అలాంటప్పుడు వయసుతో పనేముందని వ్యాఖ్యానించాడు.టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకోవాలని హర్భజన్ సూచించాడు. కొత్తగా వచ్చిన వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు వేగంగా ఆడుతున్నా.. 300కి పైగా మ్యాచ్‌లు ఆడిన రోహిత్, కోహ్లీల అనుభవం ఒత్తిడి సమయంలో జట్టుకు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్ లాంటి ఆటగాళ్లకు సమానంగా రోహిత్, విరాట్లు ఫిట్నెస్ కాపాడుకుని పరుగులు సాధిస్తే మిగతా విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.అలాగే భారత క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్ మార్పునకు, ఓటమిని అంగీకరించని పట్టుదలకు విరాట్ కోహ్లీనే మూలకారకుడని హర్భజన్ ప్రశంసించాడు. శరీరం సహకరించడం లేదని, ఇతర ఆటగాళ్లతో పోటీ పడలేమని అనిపించినప్పుడు ఏ ఆటగాడైనా స్వయంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు. అప్పటివరకు రోహిత్, విరాట్లకు మేనేజ్మెంట్ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. భారత

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Jitesh Sharma Trade 2027 IPL: ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టైటిల్ చేజారడంతో వచ్చే ఏడాది మరింత బలంగా బరిలోకి దిగాలని చూస్తోంది. కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ జట్టులోని లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో నమ్మకమైన ఇండియన్ ఫినిషర్‌ను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆర్సీబీతో ట్రేడ్ చర్చలు.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫినిషర్ జితేష్ శర్మను తమ జట్టులోకి మార్చుకునేందుకు (ట్రేడ్ డీల్) సన్‌రైజర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రేడ్‌లో ఆర్సీబీ పెట్టిన షరతు ఎస్ఆర్హెచ్ను ఆశ్చర్యపరిచింది. జితేష్‌కు బదులుగా తమ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని ఆర్సీబీ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇషాన్ కిషన్‌ను వదులుకునే ప్రసక్తే లేదు! ఫామ్‌లో లేని జితేష్ శర్మ కోసం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్‌ను వదులుకునే సాహసం ఎస్ఆర్హెచ్ చేయలేకపోతోంది. ప్రస్తుతం కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ జట్టును అద్భుతంగా నడిపించాడు. 2027 సీజన్లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉండటంతో, ఇషానే జట్టు భవిష్యత్ సారథిగా ఎదుగుతున్నాడు. అలాగే 2026 సీజన్లో ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు సాధించి అదరగొట్టాడు. మరోవైపు, జితేష్ శర్మ 2026 సీజన్లో 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫామ్‌లో లేని ఒక ఆటగాడి కోసం జట్టులో కీలకమైన మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం

IPL Trade Deal: ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి ఐపీఎల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే రాబోయే సీజన్లో ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా జట్టులో లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించే సరైన భారతీయ ఫినిషర్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ బలహీనతను అధిగమించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై సన్‌రైజర్స్ కన్నేసింది. అతడిని ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జితేష్ శర్మను ఇచ్చేందుకు సిద్ధమేనని సూచనలు ఇచ్చిన ఆర్సీబీ, ప్రతిగా ఎస్ఆర్హెచ్ నుంచి స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హైదరాబాద్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ట్రేడ్ చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఒక తుది నిర్ణయానికి రానున్నారని సమాచారం. అయితే ఇషాన్ కిషన్ లాంటి ఫామ్‌లో ఉన్న మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం అంటే సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపించిన ఇషాన్ కిషన్‌ను ఎస్ఆర్హెచ్ భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోంది. రాబోయే సీజన్లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో ఇషాన్‌ను వదులుకునే సాహసం హైదరాబాద్ అసలు చేయకపోవచ్చు. గత సీజన్ ప్రదర్శనను పరిశీలిస్తే ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ఆర్సీబీ బ్యాటర్ జితేష్ శర్మ 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఫామ్‌లో లేని ఒక ఫినిషర్ కోసం, ఆరెంజ్ ఆర్మీ తరఫున అత్యధిక పరుగులు చేసిన నిలకడైన ఓపెనర్‌ను ఎలా వదులుకుంటారని సన్‌రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్

షిర్డీ సాయిబాబా మరియు ఆయన సంస్థాన్ ట్రస్ట్‌పై ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న అప్రతిష్ఠకర, విద్వేషపూరిత ప్రచారంపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ఆగస్టు 11న ఈ పిటిషన్‌ను విచారించి, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని గ్రివెన్స్ అపెలేట్ కమిటీ 7 రోజుల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్‌తో పాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో బాబాపై అసభ్యకరమైన పదజాలంతో వీడియోలు ప్రచారం చేయడం మత సామరస్యానికి తీవ్ర ముప్పుగా మారిందని కోర్టు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో భక్తుల మత భావాలను పరిరక్షించేందుకు కేంద్రం తక్షణమే చర్యలు వేగవంతం చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గతంలోనే యూట్యూబ్ సంస్థకు ఫిర్యాదులు చేసినప్పటికీ, జూలై 17, 18, 19, 24, 26 తేదీల్లో గూగుల్ నుంచి తిరస్కరణ సమాధానాలు వచ్చాయి. దీంతో ట్రస్ట్ నిర్వాహకులు కేంద్ర ప్రభుత్వం మరియు గ్రివెన్స్ అపెలేట్ కమిటీని ఆశ్రయించినా ఆ క్రూరమైన కంటెంట్ తొలగింపునకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే ట్రస్ట్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే, కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టు ముందుకు వచ్చి తమ వాదనలను బలంగా వినిపించారు. సామాజిక అశాంతికి దారితీసేలా ఉన్న ఈ ప్రచారాన్ని అడ్డుకోవడానికి న్యాయపోరాటం తప్పలేదని పిటిషనర్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న ఈ అసభ్యకర కంటెంట్ వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, భక్తుల మత భావాలు మరింతగా గాయపడకుండా ఉండేందుకు సదరు అభ్యంతరకర వీడియోలలోని విద్వేషపూరిత పదాలను తన అధికారిక ఉత్తర్వుల్లో కూడా ప్రస్తావించకూడదని కోర్టు చాలా జాగ్రత్త వహించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద పౌరులకు లభించిన మత స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందనే అంశాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రధానంగా గుర్తించింది. దీంతో
(1).webp)
భారత రథసారథి, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో ఊహాగానాలు తీవ్రంగా జోరందుకున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ మైదానంలో కనిపిస్తాడా లేదా అనే ఆసక్తికరమైన చర్చ అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్ల మధ్య నడుస్తోంది. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ కెరీర్ ప్రణాళికపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ ఓపెనర్ మ్యాథ్యూ హేడెన్ అత్యంత కీలకమైన విశ్లేషణను పంచుకున్నాడు. 39 ఏళ్ల వయసులో కూడా రోహిత్ శర్మ ప్రదర్శిస్తున్న ఫిట్నెస్, అతనిలో ఇంకా మిగిలి ఉన్న ఎనర్జీ, ఆట పట్ల ఉన్న తీవ్రమైన కసిపైనే అతని 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పూర్తిగా ఆధారపడి ఉంటుందని హేడెన్ స్పష్టం చేశాడు. ఒక వయసు వచ్చాక ప్రతి అంతర్జాతీయ ప్లేయర్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవ్వడం సహజమని, అంతిమంగా రిటైర్మెంట్ నిర్ణయం రోహిత్ పర్సనల్ ఛాయిస్ మాత్రమేనని హేడెన్ పేర్కొన్నాడు. గతంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి భారతీయ దిగ్గజాలు కూడా తమ కెరీర్ ముగింపు దశలో ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నారని హేడెన్ గుర్తుచేశాడు. ప్రతిరోజూ యంగ్ ఏజ్ ఎనర్జీతో మైదానంలోకి దిగి అత్యుత్తమ ప్రదర్శన చేయడం ఏ ఆటగాడికైనా పెద్ద సవాలేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే సుదీర్ఘమైన టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్నప్పటికీ, ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) కాంట్రాక్ట్‌తో పాటు బిజీగా ఉండే అంతర్జాతీయ వన్డే షెడ్యూల్‌ను హ్యాండిల్ చేయడం రోహిత్‌కు ఫిజికల్ మరియు మెంటల్ ఛాలెంజ్‌గా మారిందని తెలిపాడు. అయినప్పటికీ, మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించడం హిట్‌మ్యాన్‌కు మొదటి నుంచీ అలవాటేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మలోని బ్యాటింగ్ పవర్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించడానికి ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన వన్డే సిరీస్ ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఆ జూలై వన్డే

తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రేమదేశం చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో సందడి చేస్తోంది. ఆగస్టు 13 నుండి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ చిత్రాన్ని, ఇప్పుడు ఈటీవీ విన్ కూడా ప్రసారం చేస్తోంది. దీంతో ఈ ప్రేమకథా చిత్రాన్ని చూసేందుకు సినీ ప్రియులకు మరో అవకాశం లభించింది. శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, 2023 ఫిబ్రవరి 3న థియేటర్లలో విడుదలైంది. త్రిగుణ్ మరియు మేఘా ఆకాశ్ జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకుంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఇప్పుడు ఈటీవీ విన్ వేదికగా మరోసారి డిజిటల్ ప్రేక్షకులను పలకరిస్తోంది. సిరి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై శిరీష్ సిద్ధం ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి మధుబాల కీలక పాత్రలో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమర్దీప్ చౌదరి, మాయ, తనికెళ్ల భరణి, వైష్ణవి చైతన్య, వివా హర్ష వంటి నటీనటులు తమ నటనతో అలరించారు. దీంతో చిత్రంలోని పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఈ సినిమా కథాంశం ఇద్దరు జంటల మధ్య సాగే ఎమోషనల్ ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. ఒక జంట తమ మనసులోని ప్రేమని వ్యక్తపరచలేక ఇబ్బంది పడుతుంటే, మరొక జంట అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ నేపథ్యంలో జరిగిన ఒక చిన్న ప్రమాదం వారి జీవితాలను పూర్తిగా మార్చివేస్తుంది. కథలోని ఈ మలుపు ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రస్తుతం వారాంతపు వినోదం కోసం చూసే ప్రేక్షకులకు ప్రేమదేశం ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం, ఫ్యామిలీతో

Indian Players Debut Last Test Match: భారత టెస్టు క్రికెట్లో ప్రతిష్టాత్మకమైన క్యాప్ అందుకోవడం ప్రతీ క్రీడాకారుడి కల. అయితే కొందరు ఆటగాళ్లకు ఆ కల నెరవేరిన మరుక్షణమే చేజారిపోయింది. అరంగేట్రం చేసిన ఏకైక టెస్టు మ్యాచ్ చివరి మ్యాచ్‌గా మారి, మళ్లీ ఎప్పటికీ రెడ్ బాల్ క్రికెట్లో అవకాశం రాని ఐదుగురు క్రికెటర్ల చేదు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత క్రికెట్ జట్టు 1932 నుంచి ఇప్పటివరకు వందలాది టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఎంతో మంది దిగ్గజాలు టీమిండియా వైపు నుంచి కొన్ని వందల మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 12 మంది ఆటగాళ్లు వందకు పైగా టెస్టులు ఆడి రికార్డు సృష్టించారు. కొందరికి మాత్రం కాలం సహకరించలేదు. తొలి మ్యాచ్‌లోనే పొరపాట్లు జరగడం, అనుకోకుండా గాయాల బారిన పడటం వల్ల ఒకే ఒక్క మ్యాచ్‌తో అంతర్జాతీయ రెడ్ బాల్ కెరీర్‌కు మంగళం పాడాల్సి వచ్చింది. యోగ్రాజ్ సింగ్ నుంచి సబా కరీమ్ వరకు..: యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ 1981లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా వెల్లింగ్టన్లో టెస్టు అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసిన తర్వాత ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేకపోయిన ఆయన, ఆ తర్వాత తీవ్రమైన గాయాలు, ఫామ్ లేమి వల్ల మళ్లీ కనీసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వికెట్ కీపర్ బ్యాటర్ సబా కరీమ్ కథ మరింత దారుణమైనది. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌పై వికెట్ కీపింగ్ చేస్తూ కంటికి తీవ్రమైన దెబ్బ తగలడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అదే ఏడాది టెస్టు డెబ్యూ చేసినప్పటికీ, కంటి చూపు సమస్యలు తగ్గకపోవడంతో ఒకే ఒక్క టెస్టులో 15 పరుగులు చేసి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. గబ్బా హీరో నటరాజన్, లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ..: 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక గబ్బా టెస్టులో అరంగేట్రం చేసిన

సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా రాబోయే పండగ సీజన్ కోసం అత్యంత వినోదాత్మక కంటెంట్ లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ సారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడానికి క్రీడా రంగం, సినీ రంగానికి చెందిన అగ్ర నటులను బుల్లితెరపైకి తీసుకొస్తోంది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెలివిజన్ రంగంలోకి తొలిసారిగా అడుగుపెడుతుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 10న సోనీ యాజమాన్యం ఈ కొత్త వినోద ప్రణాళికను వెల్లడించింది. హిందీతో పాటు తమిళం, మరాఠీ వంటి ప్రాంతీయ భాషల్లో భారీ రియాలిటీ, క్రైమ్ మరియు స్పోర్ట్స్ షోలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ కొత్త లైనప్‌లో భాగంగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి 18వ సీజన్ ప్రసారం ప్రారంభమైంది. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ మరియు సోనీ లివ్‌లో ఆలోచింపజేసే థీమ్‌తో ఈ షో విజయవంతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ తన స్వంత షోతో సెప్టెంబర్ నెలలో ప్రేక్షకు ముందుకు రానున్నారు. సోనీ ఎండీ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ, రోహిత్ శర్మ సెట్ మరియు సోనీ లివ్‌లలో యాంకర్‌గా మరియు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. సోనీ నెట్వర్క్ క్రైమ్ కథనాలను ప్రతిష్ఠాత్మకంగా రీలాంచ్ చేస్తూ క్రైమ్ పెట్రోల్ కొత్త సీజన్‌ను సిద్ధం చేసింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఈ సిరీస్‌కు హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టి ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తి చేశారు. దీంతో ఈ షో ఆగస్టు 31న రాత్రి 10:30 గంటలకు సోనీ టీవీ మరియు సోనీ లివ్‌లలో ప్రసారం కానుంది. భార్తి సింగ్, హర్ష్ లింబాచియా నిర్వహిస్తున్న ఇండియన్ గేమ్ షో కూడా ఈ ప్రత్యేక వినోద ప్యాకేజీలో భాగంగా నిలిచింది. ప్రాంతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో సమంత రుత్ ప్రభు మాస్టర్‌చెఫ్ తమిళ్లో కీలక పాత్ర పోషిస్తున్నారు

Ravindra Jadeja : భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు గాలే ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 8 నెలల తరువాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైన టీమ్ఇండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ఈ సిరీస్‌కు ముందు పలు రికార్డులు ఊరిస్తున్నాయి. నాలుగు వికెట్లు తీస్తే.. టెస్టుల్లో శ్రీలంక జట్టు పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరుకుంటాడు. లంక పై ఇప్పటివరకు ఏడు టెస్టులు ఆడిన జడేజా 33 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ సగటు 23.72గా ఉండగా, రెండు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ఇషాంత్ శర్మ 36 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో అనిల్ కుంబ్లే 74 వికెట్లతో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ 62, హర్భజన్ సింగ్ 53, కపిల్ దేవ్ 45 వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. West Indies : వన్డే ప్రపంచకప్ 2027కి నేరుగా అర్హత సాధించడంలో విఫలమైన వెస్టిండీస్.. అయినా గానీ.. ఇక భారత్-శ్రీలంక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. అతడు ఏకంగా 105 వికెట్లు సాధించాడు. జడేజా మరో కీలక మైలురాయికి కూడా అత్యంత చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో 350 వికెట్లు పూర్తి చేసేందుకు అతడికి కేవలం రెండు వికెట్లు మాత్రమే కావాలి. ఆ ఘనత సాధిస్తే టెస్టు క్రికెట్లో 350 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జడేజా ఐదో ప్లేయర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 348 వికెట్లు ఉన్నాయి. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ జడేజా మరో మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో

శారీరక, మానసిక సమస్యలు కొంతమంది జీవితానికి సవాలు విసురుతుంటాయి.. తమ లక్ష్యాల్ని చేరుకోకుండా అడ్డుపడాలని చూస్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని మరీ తమను తాము నిరూపించుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. హిమాన్షికా శర్మ ఇదే కోవకు చెందుతుంది.... శారీరక, మానసిక సమస్యలు కొంతమంది జీవితానికి సవాలు విసురుతుంటాయి.. తమ లక్ష్యాల్ని చేరుకోకుండా అడ్డుపడాలని చూస్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని మరీ తమను తాము నిరూపించుకుంటున్నారు కొందరు అమ్మాయిలు. హిమాన్షికా శర్మ ఇదే కోవకు చెందుతుంది. అరుదైన ఎముక సమస్య కారణంగా టీనేజ్లోనే చక్రాల కుర్చీకి పరిమితమైన ఆమె.. తన శారీరక స్థితిని చూసుకొని అధైర్యపడలేదు. తానెలా ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది. ఈ పట్టుదలే నేడు ఆమెను ఫ్రీలాన్స్ రైటర్‌గా, కంటెంట్ స్ట్రాటజిస్ట్‌గా ఎదిగేలా చేసింది. ‘కోల్పోయిన వాటి గురించి బాధపడకుండా.. అందివచ్చిన అవకాశాల్ని అందుకున్నప్పుడే కెరీర్‌ని నిర్మించుకోగలం..’ అంటోన్న హిమాన్షిక సక్సెస్ స్టోరీ ఇది! అవి చేదు జ్ఞాపకాలు! చండీగఢ్‌లో పుట్టి పెరిగింది హిమాన్షిక. ఎనిమిదేళ్ల వరకు అందరు పిల్లల్లా ఆరోగ్యంగా, ఆడుతూపాడుతూ పెరిగింది. అయితే ఈ సమయంలోనే ఆమె శరీరంలో మార్పులు మొదలయ్యాయి. కీళ్లు వంగిపోవడం, వంకరపోవడం గుర్తించింది. ఇదంతా ‘జువెనైల్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్’ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి వల్లే అని వైద్యులు తేల్చారు. ‘నా చిన్నతనంలో నేను ఆనందంగా గడిపిన రోజులు నాకు గుర్తులేవు. తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగడం, ఇంజెక్షన్లు, చికిత్సలు.. వీటితోనే నా బాల్యం గడిచిపోయింది. నన్ను తిరిగి మామూలు మనిషిని చేయాలని అమ్మానాన్నలు చేయని ప్రయత్నమంటూ లేదు. కానీ అది జరగలేదు. మోకాళ్లు, మణికట్టు, చేతి వేళ్లు, మెడ, నడుము.. ఇలా ఒక్కో శరీర భాగాన్నీ డ్యామేజ్ చేసిన ఈ వ్యాధి కారణంగా అందమైన స్కూల్ డేస్‌ని మిస్సయ్యా.. ఏళ్ల తరబడి నాలుగ్గోడలకే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఓ రోజు మెట్లు దిగలేక ఏడుస్తుంటే నాన్నే నన్ను కిందికి మోసుకొచ్చిన సందర్భాన్ని

భారత్ తన 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు సిద్ధమవుతున్న వేళ నింగి నుంచి ఒక అరుదైన, అద్భుతమైన శుభాకాంక్షల సందేశం అందింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యా వ్యోమగాములు మన జాతీయ జెండాను చేతిలో పట్టుకుని భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న బలమైన స్నేహ బంధానికి, అంతరిక్ష పరిశోధనల్లో భాగస్వామ్యానికి ఈ ప్రత్యేక సందేశం నిదర్శనంగా నిలిచింది.గగనతలంలో మువ్వన్నెల మెరుపులుఅంతరిక్ష కేంద్రంలో ఉన్న రష్యన్ కాస్మోనాట్ ప్యోటర్ ద్యూబ్రోవ్, తోటి వ్యోమగాములతో కలిసి ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. భారత త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ప్రదర్శిస్తూ, ప్రియమైన భారతీయ మిత్రులారా.. మీకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మన దేశ ప్రజలు ఎల్లప్పుడూ శాంతి, సౌభాగ్యాలతో వికసించాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన పిలుపా! ఆగస్టు 15 ఎట్ హోమ్ కార్డు చూస్తే షాక్ అవ్వాల్సిందే..యూరీ గగారిన్ జ్ఞాపకాలు.. ఆర్యభట్ట నుండి రాకేష్ శర్మ వరకుమానవుడు తొలిసారి అంతరిక్షంలోకి అడుగుపెట్టి 65 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. 1961లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడు యూరీ గగారిన్, ఆ తర్వాత భారత్‌లో పర్యటించినప్పుడు అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎంత అందంగా ఉందో, భూమిపై ఇక్కడి ప్రజల మైత్రి అంతకంటే అద్భుతంగా ఉంది అని కొనియాడిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1975లో భారత్ పంపిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగానికి సోవియట్ యూనియన్ అందించిన సహకారం, 1984లో రష్యన్ నౌక ద్వారా రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లిన చారిత్రక ఘట్టాలను వ్యోమగాములు గుర్తుచేసుకున్నారు.మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు రోజు 1947 ఆగస్టు 14న ఏం జరిగింది?గగన్‌యాన్ దిశగా కొత్త అధ్యాయంభారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా ఇరు దేశాల బంధం మరో కొత్త మైలురాయిని చేరుకుందని వ్యోమగామి

Virat Kohli Records: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఆల్ టైమ్ వరల్డ్ రికార్డు ఉంది. సచిన్ తన వన్డే కెరీర్లో 51, టెస్టుల్లో 49 సెంచరీలు సాధించారు. అయితే జట్టు విజయంలో భాగమైన సెంచరీల విషయానికి వస్తే మాత్రం సచిన్ టెండూల్కర్ కాకుండా మరో భారత దిగ్గజ బ్యాటర్ అగ్రస్థానంలో నిలిచాడు. జట్టు విజయాల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-5 బ్యాటర్ల జాబితాలో ముగ్గురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోవడం విశేషం. సచిన్ టెండూల్కర్ సాధించిన మొత్తం 100 సెంచరీలలో 53 సెంచరీలు భారత్ గెలిచిన మ్యాచ్‌లలో రాగా, మిగిలిన 47 సెంచరీలు టీమిండియా ఓడిపోయిన లేదా డ్రా అయిన మ్యాచ్‌లలో వచ్చాయి. దీంతో సచిన్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు. కాగా రికార్డుల వేటగాడు విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 85 సెంచరీలు బాదగా, అందులో ఏకంగా 59 సెంచరీలు భారత జట్టు విజయాల్లోనే రావడం గమనార్హం. ఈ అద్భుత గణాంకాలతో విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్ విన్నింగ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నంబర్-1 స్థానంలో నిలిచాడు. ఈ ప్రపంచ రికార్డుల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నారు. పాంటింగ్ తన కెరీర్లో ఆస్ట్రేలియా జట్టు గెలిచిన మ్యాచ్‌లలో మొత్తం 55 సెంచరీలు సాధించారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మూడో భారతీయ బ్యాటర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. తన అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 51 సెంచరీలు చేసిన రోహిత్, అందులో 41 సెంచరీలను భారత జట్టు గెలిచిన మ్యాచ్‌లలో సాధించి టాప్-4లో నిలిచాడు. రోహిత్ సాధించిన సెంచరీలలో కేవలం 10 మాత్రమే జట్టు ఓటమి చెందిన మ్యాచ్‌లలో వచ్చాయి. ఇక సౌతాఫ్రికా మాజీ దిగ్గజ ఆటగాడు హషీమ్ ఆమ్లా తన కెరీర్‌లోని 55 సెంచరీలలో 40

టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ షేర్- ఈ- పంజాబ్ టీ20 కప్ 2026 టోర్నీలో భాగం కానున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌కు సంబంధించి ఆదివారం ఆటగాళ్ల వేలం జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా అభిషేక్ శర్మ ఇందులో టీమిండియా టీ20 సూపర్‌స్టార్ అభిషేక్ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అమృత్సర్ సుర్మాస్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఆ ఫ్రాంఛైజీ అధికారులతో కలిసి వేలంలో పాల్గొన్నాడు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆరు ఫ్రాంఛైజీలు కాగా ఈ లీగ్‌లో ఆరు ఫ్రాంఛైజీలు ఫజిల్క ఫాల్కన్స్, అమృత్సర్ సుర్మాస్, లుథియానా లయన్స్, భటిండా రాయల్స్, జలంధర్ వారియర్స్, మొహాలీ కింగ్స్ టైటిల్ కోసం రంగంలోకి దిగనున్నాయి. అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ప్లేయర్ ఇతడే ఇదిలా ఉంటే.. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ లీగ్ 2026 సీజన్లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా సన్వీర్ సింగ్ నిలిచాడు. ఫజిల్క ఫాల్కన్స్ రూ. 13.02 లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ గతంలో ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2023, 2024)కు ఆడాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరు మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల సన్వీర్ 25 పరుగులు చేశాడు. టీమిండియా ప్లేయర్ల ధర ఎంతంటే? టీమిండియా స్టార్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఫజిల్క ఫాల్కన్స్, అభిషేక్ శర్మను అమృత్సర్ సుర్మాస్, అర్ష్‌దీప్ సింగ్‌ను లుథియానా లయన్స్, గుర్నూర్ బ్రార్‌ను భటిండా రాయల్స్ సొంతం చేసుకున్నాయి.ఇక ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను జలంధర్ వారియర్స్, రమణ్‌దీప్ సింగ్‌ను మొహాలీ కింగ్స్ కొనుక్కున్నాయి. వీరందరిని ఆయా ఫ్రాంఛైజీలు రూ. 10 లక్షల ధరకు రిజర్వు చేసుకున్నాయి. షేర్-ఈ-పంజాబ్ టీ20 కప్ వేలం-2026లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు వీరే 1. సన్వీర్ సింగ్ (ఫజిల్క ఫాల్కన్స్)- రూ. 13.02 లక్షలు 2

మెగాస్టార్ చిరంజీవి, మాస్ అండ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘మెగా 158’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాస్ అండ్ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘మెగా 158’ (Mega158). కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో చిరంజీవి-బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రకటన వచ్చినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో విలక్షణ నటుడు మురళీ శర్మ (Murali Sharma) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘మెగా 158’ బృందం ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. తెల్ల చొక్కా, వైట్ పంచె ధరించి, కళ్లజోడుతో రఫ్ అండ్ సీరియస్ లుక్‌లో మురళీ శర్మ కనిపిస్తున్న ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘‘ఆయనలోని వైవిధ్యభరితమైన నటనను అత్యుత్తమంగా ఆవిష్కరించేలా తీర్చిదిద్దిన పాత్ర కోసం మురళీ శర్మకు సాదర స్వాగతం పలుకుతున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. తెరపై తనదైన వైవిధ్యమైన నటనతో ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే మురళీ శర్మ, ఈ చిత్రంలో ఓ బలమైన క్యారెక్టర్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ డ్రామాలో ఆయన పాత్ర సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ స్పెషల్ బర్త్‌డే పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా

Beechupalli: ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు! బీచుపల్లి: జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్ కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆదివారం, వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని… పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ అనుకోని అతిథిలా.. ఓ మొసలి నదిలో నుంచి పుష్కర్ ఘాట్ కు వచ్చింది. అది చూసిన కొంతమంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం చేశాడు. మొసలి వరుణ దేవుడి వాహనమని అనిల్ శర్మ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు ఆయన తెలిపారు

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్ క్రికెట్ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌కు స్టార్ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యువ సంచలనం అభిషేక్ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు. దీంతో తొలి సీజన్లోనే ఈ లీగ్‌కు భారీ క్రేజ్ లభించింది. గిల్ ఫజిల్కా ఫాల్కన్స్ తరఫున బరిలోకి దిగనుండగా.. అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మాస్కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. వీరితో పాటు స్టార్ ప్లేయర్లు అర్ష్‌దీప్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లు కూడా మార్కీ ప్లేయర్లుగా వివిధ జట్లకు ఎంపికయ్యారు. మార్కీ ప్లేయర్లు.. జట్లు ఇవే శుభ్‌మన్ గిల్ – ఫజిల్కా ఫాల్కన్స్ అభిషేక్ శర్మ – అమృత్సర్ సూర్మాస్ అర్ష్‌దీప్ సింగ్ – లూధియానా లయన్స్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ – జలంధర్ వారియర్స్ రమణ్‌దీప్ సింగ్ – మొహాలీ కింగ్స్ గుర్నూర్ బ్రార్ – భటిండా రాయల్స్ ఆరు జట్లతో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 27 మ్యాచ్‌లు ఉంటాయి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. న్యూ చండీగఢ్‌లోని పీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో లీగ్‌ను అధికారికంగా ప్రారంభించారు. పంజాబ్ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని పీసీఏ పేర్కొంది. తన స్వస్థలం ఫజిల్కాకు చెందిన గిల్ కూడా ఈ టోర్నీపై ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘పంజాబ్ ఎప్పటినుంచో గొప్ప క్రికెటర్లను భారత జట్టుకు అందిస్తోంది. ఈ లీగ్ ద్వారా మరింత మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని నమ్ముతున్నా’ అని గిల్ తెలిపాడు. అదే లక్ష్యం.. షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో రౌండ్ రాబిన్ విధానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో ఫ్రాంచైజీకి ఒక మార్కీ ప్లేయర్‌తో పాటు కనీసం ఇద్దరు ఐకాన్ ప్లేయర్లను తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి జట్టుకు రూ.45 లక్షల బడ్జెట్ కేటాయించగా.. గరిష్ఠంగా