
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

upasana They said she wasnt the right match for Charan... Upasanas reaction to body-shaming and trolls!చరణ్ కు తగిన జోడీ కాదన్నారు.. బాడీ షేమింగ్, ట్రోల్స్ పై ఉపాసన రియాక్షన్..!

అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ఆటోమేటిక్ పౌరసత్వం విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో సంచలన నిర్ణయానికి తెరదీస్తోంది. అమెరికాలో జన్మించిన చిన్నారులకు పాస్‌పోర్ట్ కావాలంటే ఇకపై కేవలం వారి బర్త్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. దరఖాస్తు చేసుకునే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పౌరసత్వాన్ని లేదా అధికారిక ఇమ్మిగ్రేషన్ హోదాను కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుందనే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తోంది.బర్త్ టూరిజంకు చెక్ పెట్టడమే లక్ష్యం!కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం సంపాదించడం కోసమే చాలామంది విదేశీయులు గర్భవతిగా ఉన్న సమయంలో పర్యాటక వీసాలపై యూఎస్ వస్తుంటారు. దీనిని అరికట్టడానికే ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 6న ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసింది. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో భాగంగానే స్టేట్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ రూపకల్పన చేస్తోంది. అమెరికన్ పౌరసత్వానికి ఉన్న విలువను కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు. Passport అక్కర్లేదు.. ఐడీ కార్డుతోనే భారత్‌లోకి ఎంట్రీ? కొత్త ప్రపోజల్..ఏయే ఆధారాలు చూపించాలి?ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. పిల్లలకు పాస్‌పోర్ట్ అప్లై చేసేటప్పుడు తల్లిదండ్రులు తాము అమెరికన్ పౌరులమని నిరూపించుకోవడానికి చెల్లుబాటు అయ్యే యూఎస్ పాస్‌పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు విదేశీయులైతే తమ ఇమ్మిగ్రేషన్ హోదాను స్పష్టం చేసే ఐ-94 (I-94) ఫారం లేదా గ్రీన్ కార్డ్ వంటి కీలక పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఫోటో ఐడీ మాత్రమే అడుగుతున్నారు తప్ప, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక ఆధారాలు అడగడం లేదు.Passport, Visa సేవలు బంద్! ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..కోర్టు వివాదాలు.. న్యాయపోరాటాలు!పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ గతంలో తెచ్చిన ఆదేశాలను అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

ప్రతి వారం కొత్త సినిమాల కోసం సినీ ఫ్యాన్స్ అమితాసక్తితో ఉంటారు.. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో అలాంటి వారికి ఆనందం పంచేందుకు ఐదు స్ట్రెయిట్ మూవీస్- మూడు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి.. వాటి తీరేంటో చూద్దాం. యూత్ టార్గెట్ గా.. తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే అదరహో అనేలా యూత్ ను ఆకట్టుకున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. తరువాత 'యానిమల్'తో ఆల్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' తెరకెక్కిస్తున్నారు సందీప్. ఇంత క్రేజ్ ఉన్న సందీప్ ఇప్పుడు 'రోమాంచకంస (Romanchakam) అనే యూత్ ఫుల్ మూవీకి సమర్పకునిగా వ్యవహరించారు. ప్రణయ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు వేణు గోపాల్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 3వ తేదీన 'రోమాంచకం' వెలుగు చూస్తోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే యువతను ఆకట్టుకుంటూ సాగుతోంది. అదే రోజున దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన 'ఐ యామ్ గేమ్స (I'm Game) కూడా రిలీజ్ అవుతోంది. మళయాళం నుండి అనువాదమైన ఈ చిత్రంలో కయాదు లోహార్ కథానాయిక. ఈ సినిమాకు నహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాలతో ఈ వారం మూవీ సందడి ముందుగా సాగనుంది. ఆల్రెడీ అలరించినవే... ఈ వారం మరో నాలుగు స్ట్రెయిట్ మూవీస్, రెండు డబ్బింగ్ సినిమాలు సెప్టెంబర్ 4న విడుదల కానున్నాయి. పంకజ్ త్రిపాఠి, ఫజల్, దివ్వేందు, రసికా దుగల్ ప్రధాన పాత్రల్లో 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఓటీటీలో భలేగా అలరించింది. ఇప్పుడు అదే చిత్రంగా రాబోతోంది. హిందీ నుండి అనువాదమైన 'మీర్జాపూర్' కు గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహించారు. బిగ్ స్క్రీన్ పై 'మీర్జాపూర్స (Mirzapur: The Movie) ఎలా ఉంటుందో అన్న ఆసక్తితో ఈ సిరీస్ చూసినవారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మళయాళంలో ఆగస్టు 21న విడుదలై విజయఢంకా

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్‌ఫుల్స్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదని సీఆర్పీఎఫ్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద టీఎంసీ నేత సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సీఆర్పీఎఫ్ ఈమేరకు సమాధానమిచ్చింది. ఈ విషయాన్ని తాను సుప్రీంకోర్టు ముందుంచుతానని గోఖలే చెప్పారు. జూలై 20వ తేదీన సీజేపీ పిలుపు మేరకు పార్లమెంట్ వైపు వెళ్తున్న నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్లు పెల్లెట్ గన్లను వాడారంటూ వచి్చన ఆరోపణలపై సహచట్టం కింద సీఆర్పీఎఫ్కి పంపిన దరఖాస్తును గోఖలే సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘నిరసనకారులపై పెల్లెట్ గన్లు ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘన కాదంటూ సీఆర్పీఎఫ్ సమాచారాన్ని నిరాకరించింది. దీనిపై అప్పిలేట్ అథారిటీ కూడా సమాచారాన్ని అందించేందుకు నిరాకరించింది’అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం నిరసనకారులపై పెల్లెట్ గన్లను ఉపయోగించలేదంటూ మొదట్లో బుకాయించిందని గోఖలే గుర్తు చేశారు. హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) జీ న్యూస్ అధినేత సుభాష్ చంద్రకు NCLT షాక్ Viral : 20 సెకన్లలో ఇద్దరిపై కత్తులతో దాడి.. న్యూయార్క్ లో టెన్షన్! పరారీలో బాసింగ బాసింగ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ! 🎬📺 ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞) Manorama Max Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐 Jio Hotstar Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐 The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒 Paramount+ Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑 Sunnxt DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒 Zee5 Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒 Sony Liv Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒 Apple Tv May Day (English) 𝐒𝐞𝐩𝟒 HBO Max Fuze (English) 𝐒𝐞𝐩𝟒 MUBI Erupcja (English) 𝐒𝐞𝐩𝟒 MGM Plus A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6 Shudder Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒 Hulu Signal One (English) 𝐒𝐞𝐩𝟒 Prime Video Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏 I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏 Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Runner (English) 𝐒𝐞𝐩 𝟐 Dark Hollow

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. మదర్సా విస్తరణ కోసం మత ఛాందసవాదులు ఈ ఆలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారని హక్కుల సంఘాలు, మైనారిటీ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆలయాన్ని పునర్నిర్మించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను స్థానిక అధికారులు ఖండిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే పాత నిర్మాణం కూలిపోయిందని చెబుతున్నారు.పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. లాహోర్‌కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాదాపు 125 ఏళ్ల నాటి ఈ ఆలయాన్ని ఆగస్టు 21న నిషేధిత తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్పీ) పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ భూమిని, దానికి ఆనుకుని ఉన్న మదర్సాలో కలిపేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మైనారిటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఈ ఘటనపై పాకిస్థాన్ మసిహా మిల్లత్ పార్టీ (పీఎంఎంపీ) తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాన్ని తిరిగి నిర్మించాలని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యం నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పీఎంఎంపీ ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత్రా మాట్లాడుతూ.. కూల్చివేసిన ఆలయానికి చెందిన ఇటుకలు, శిఖరానికి ఉన్న లోహపు సామాగ్రిని కూడా దుండగులు అమ్ముకున్నారని ఆరోపించారు. గతంలో ఆలయానికి ఆనుకుని ఉన్న భూమిని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్

రాజమౌళి (SS Rajamouli) మన దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్. ఆయన సినిమాల మార్కెట్ ఇండియా దాటి అనేక దేశాలకు పాకింది. ఆస్కార్ రేంజ్ కి వెళ్లారు. ఇప్పుడు గ్లోబల్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఆయన పారితోషికం ఉంటుంది కదా. ఐతే “వారణాసి” (Varanasi) సినిమాకి పారితోషికం బదులు ఓటిటి రైట్స్ తీసుకున్నారట. ఓటిటి రైట్స్ ఎంత వస్తే అంత ఆయన పారితోషికం అన్నమాట. అంటే నిర్మాత ఆయనకి ఇచ్చేది ఏమి లేదు. ఓటిటి కంపెనీలు సినిమాకి ఇచ్చే రైట్స్ మొత్తం తానే తీసుకొని నిర్మాత పెట్టుబడిని తగ్గిద్దామనుకున్నారు. తానూ భారీగా తన ఎకౌంట్ లో వేసుకుందామని భావించారు ఈ రైట్స్ తో. ఐతే పాపం, రాజమౌళి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు వేసుకున్న లెక్కలు వేరు, అప్పటి మార్కెట్ పరిస్థితులు వేరు. ‘వారణాసి’ సినిమా మొదలు కాకముందు, ఓటిటి కంపెనీలు భారీ పాన్ ఇండియా చిత్రాలను ఎగబడి వందల కోట్ల రూపాయలు చెల్లించి కొన్నాయి. ‘పుష్ప 2’ సినిమాని 270 కోట్లు పెట్టి కొనుక్కోంది Netflix సంస్థ. ‘పుష్ప 2’కే అంత వస్తే తన సినిమాకి ఈజీగా నాలుగు వందల కోట్లు వస్తాయని రాజమౌళి భావించారు. ఆ లెక్కలతోనే ఈ సినిమా ఓటిటి రైట్స్ (Varanasi OTT Rights) తనకి రాయించుకున్నారు. ఐతే ఈ రెండేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. ఓటిటి సంస్థలు సినిమాలు కొనడం తగ్గించాయి. అలాగే ఇచ్చే రేట్స్ లో కూడా భారీగా కోత వేశాయి. ‘వారణాసి’ సినిమా ఒటిటి రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదు. అమెజాన్, జియో హాట్ స్టార్ రాజమౌళి అడుగుతున్నా రేట్స్ ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జీ5 కూడా 175 కోట్లకుమించి ఇవ్వలేమని చెప్పిందట. మిగిలింది నెట్ ఫ్లిక్స్ మాత్రమే. ఈ సంస్థ 200 వద్ద బేరం ఆడుతోంది. ఫైనల్ గా 225 విత్ జీఎస్టీ వచ్చేలా ఉంది. అంటే మొత్తంగా 200 నుంచి 225 కోట్లు

మన సంస్కృతిలో వంటగదికి విశిష్ట స్థానం ఉంది. దీనిని వంట చేసుకునే స్థలంగానే చూడరు. సాక్షాత్ అన్నపూర్ణా దేవి కొలువై ఉండే ప్రదేశంగా భావిస్తారు. అందుకే ఇళ్లలో లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉండటానికి వంటగది రూపకల్పన, అక్కడ ఉపయోగించే వస్తువుల అమరికలోనూ కొన్ని ప్రత్యేకమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఆగ్నేయ దిశలోనే వంటగదిని ఏర్పాటు చేసుకోవడానికీ అనేక కారణాలు ఉన్నాయి.ప్రస్తుత ఆధునిక కాలంలో జీవనశైలి వేగంగా మారిపోతోంది. ప్రజల అవసరాలు, సమయాభావానికి అనుగుణంగా వంటగది రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే గృహిణుల సౌకర్యార్థం రకరకాల డిజైన్లు, ఎక్కువ బర్నర్లు కలిగిన గ్యాస్ స్టవ్‌లు అందుబాటులోకి వచ్చాయి. చాలా ఇళ్ళలో వేగంగా వంట పూర్తి చేయడానికి రెండు బర్నర్ల కంటే 3-బర్నర్ లేదా 4-బర్నర్ గ్యాస్ పొయ్యిలను కొనుగోలు చేస్తోన్నారు గృహిణులు.ఇక్కడే చాలా మందికి ఓ సందేహం ఎదురవుతోంది. సాధారణంగా మూడు అనే అంకెను కొన్ని సందర్భాల్లో అశుభంగా భావిస్తుంటారు. వంటగదిలో 3- బర్నర్ల గ్యాస్ స్టవ్ వాడటం వల్ల వాస్తు దోషాలు కలుగుతాయా అనే భయాందోళనలు వ్యక్తమవుతుంటాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్యాస్ స్టవ్‌కు ఇన్ని బర్నర్లు మాత్రమే ఉండాలనే కచ్చితమైన నియమం అంటూ ప్రత్యేకంగా ఏదీ శాస్త్రంలో ఎక్కడా లేదు.వాస్తు ప్రకారం తులసి వద్ద ఉంచకూడని వస్తువులు..!!కుటుంబ అవసరాలు, సౌకర్యాన్ని బట్టి మూడు లేదా అంతకంటే ఎక్కువ బర్నర్లు ఉన్న స్టవ్ ను నిశ్చింతగా కొనుగోలు చేయవచ్చని, దీనివల్ల ఎలాంటి వాస్తు దోషాలు కలగవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. నిజానికి మన సనాతన సంస్కృతిలో మూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంది. సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులుగా కొలుస్తారు.అటు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం మూడు సంఖ్యకు అధిపతి దేవగురువు బృహస్పతి. జ్ఞానానికి, శ్రేయస్సుకు కారకుడైన గురు గ్రహ ప్రభావం ఈ సంఖ్యపై ఉండటం వల్ల దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో మూడు బర్నర్ల గ్యాస్ పొయ్యిని కలిగి
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ ఫాంటసీ డివైన్ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి 2’). బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం అప్పుడే డిజిటల్ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మైండ్ బ్లాకింగ్ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) ఈ చిత్రానికి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. అమౌంట్ ఎంత అనేది అధికారికంగా వెల్లడించకపోయినా, ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇది రికార్డు స్థాయి బిజినెస్ అని టాక్. 2020లో వచ్చిన 'మూకుత్తి అమ్మన్' (అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద, ఓటీటీలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని సుందర్.సి దర్శకత్వంలో డాక్టర్ ఐసరి కె. గణేష్ తమ వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో నయనతార మరోసారి అమ్మవారిగా పవర్ఫుల్ అండ్ డివైన్ రోల్లో మెరవనుండగా, విలక్షణ నటి రెజీనా కాసాండ్రా నెగెటివ్ షేడ్స్ ఉన్న ముఖ్య పాత్రలో నటించనుంది. వీరితో పాటు దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితర సీనియర్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో ప్రాజెక్ట్ గ్లామర్ అండ్ కామెడీ డోస్ మరింత పెరిగింది. ప్రస్తుతం గ్రాండ్ సెట్లలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ సౌత్ లాంగ్వేజెస్ సహా హిందీలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. థియేట్రికల్ రిలీజ్‌కు

ఈ LED లైట్ పుస్తకంపై నేరుగా వెలుతురు అందించేలా రూపొందించారు. పేజీ మొత్తం సమానంగా వెలుతురు పడేలా ఫ్లాట్ ప్యానెల్ డిజైన్ ఉంటుంది. దీంతో పేజీపై నీడలు, ఎక్కువ గ్లేర్ తగ్గి చదవడానికి సౌకర్యంగా ఉంటుంది. కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రాత్రివేళ ఎక్కువసేపు చదివే విద్యార్థులు, పుస్తకాలు చదివే వారికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లైట్లో అడ్జస్టబుల్ బ్రైట్నెస్ సదుపాయం ఉంటుంది. అవసరాన్ని బట్టి వెలుతురు స్థాయిని మార్చుకోవచ్చు. రాత్రివేళ మృదువైన వెలుతురుతో చదవాలన్నా, చదువు లేదా పని కోసం కాస్త ఎక్కువ వెలుతురు కావాలన్నా సర్దుబాటు చేసుకోవచ్చు. పక్కన నిద్రిస్తున్న వారికి ఇబ్బంది కలగకుండా పుస్తకంపై మాత్రమే వెలుతురు కేంద్రీకరించుకోవడం కూడా దీని ప్రత్యేకత. ఈ LED రీడింగ్ లైట్ పరిమాణం సుమారు 15 x 10 x 5 సెంటీమీటర్లు. బరువు కేవలం 80 గ్రాములు ఉండటంతో సులభంగా తీసుకెళ్లవచ్చు. బ్యాగ్, స్కూల్ బ్యాగ్, లగేజీ లేదా ట్రావెల్ కిట్‌లో పెట్టుకోవచ్చు. ఇంట్లో చదువుకునేటప్పుడు మాత్రమే కాకుండా ప్రయాణాలు, క్యాంపింగ్, ఆఫీస్ లేదా తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. పుస్తకాలు చదవడానికి మాత్రమే కాకుండా మ్యాగజైన్లు, నోట్స్, డాక్యుమెంట్లు, స్టడీ మెటీరియల్, నోట్‌బుక్స్ వంటి వాటిని చదివేటప్పుడు కూడా ఉపయోగించవచ్చు. విద్యార్థులకు చదువుకునే సమయంలో, పుస్తక ప్రియులకు రాత్రివేళ రీడింగ్ సమయంలో ఇది ఉపయోగపడుతుంది. తక్కువ వెలుతురులో చిన్న చిన్న పనులు చేసుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు. LED టెక్నాలజీ కారణంగా తక్కువ విద్యుత్ వినియోగంతో వెలుతురు అందించడానికి ఈ లైట్ రూపొందించారు. ఆధునిక, స్లిమ్ డిజైన్ ఉండటంతో పుస్తకం లేదా ఫోల్డర్‌తో పాటు సులభంగా ఉంచుకోవచ్చు. పిల్లలు, విద్యార్థులు, పుస్తకాలు చదివే పెద్దలు, తరచుగా ప్రయాణించే వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు. రాత్రివేళ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చదువుకోవాలనుకునే వారికి ఇది ఒక సౌకర్యవంతమైన ఎంపికగా చెప్పొచ్చు. ధర విషయానికొస్తే అమెజాన్‌లో ఈ

తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థులు మరియు యువతపై విధించిన వివాదాస్పద నిషేధ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎడమపక్ష పార్టీలు మరియు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకూడదంటూ జారీ చేసిన ఆదేశాలను ఆగస్టు 19న రద్దు చేసింది. జెన్ జీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం చివరికి దిగిరాక తప్పలేదు. ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆగస్టు 14న స్కూల్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. ప్రతిపక్షాలు మరియు విపక్ష విద్యార్థి సంఘాల నిరసనలకు యువత లొంగకుండా విద్యా శాఖలు, పోలీసులు, జిల్లా పరిపాలన యంత్రాంగం నిరోధించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా ఆగస్టు 17న కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రిన్సిపాల్స్‌కు లేఖ రాస్తూ ఆగస్టు 20లోగా నివేదిక సమర్పించాలని కోరింది. అత్యవసరంగా పంపిన ఈ కమ్యూనికేషన్ బయటకు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దీంతో విద్యాసంస్థలు మరియు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమై వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉండగా జూలై 28న జరిగిన లా అండ్ ఆర్డర్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సూచనల మేరకే విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేకంగా కొన్ని రాజకీయ సంస్థలను లక్ష్యంగా చేసుకుని నిరోధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని విద్యార్థి లోకం భగ్గుమంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో జెన్ జీ మద్దతుతోనే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని యువత గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసనలు తెలిపింది. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగి రాజకీయంగా రచ్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న

సూపర్ స్టార్ కృష్ణ మనువడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన చిత్రం శ్రీనివాస మంగాపురం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) మనువడు ఘట్టమనేని జయకృష్ణ (Jai Krishna) హీరోగా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). గత నెలాఖరున థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం అశించినంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేక పోయింది. ఇప్పుడు ఈ చిత్రం సడన్‌గా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా కేవలం మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ భామ రషా తడాని (Raasha Thadani) కథానాయుకగా తెలుగు తెరక పరిచయం అవగా మోహన్ బాబు, నరేశ్, కిక్ శ్యామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. కథ విషయానికి వస్తే.. కాలేజీ గొడవల వళ్ల ఊరొదిలి తిరుపతికి వచ్చిన శ్రీను అక్కడ పెద్దమనిషిగా, డాన్‌గా చెలామణి అవుతున్న పెద్ది రెడ్డి కూతురు మంగతో ప్రేమలో పడతాడు. అయితే శీను తన ప్రేమను మంగకు చెప్పే సమయంలో తన ఎంగేజ్మెంట్ కార్డును ఇవ్వడంతో షాక్ అవుతాడు. అయినా ఎట్టి పరిస్థితుల్లో మంగనే పెళ్లి చేసుకుని తీరుతానని శపథం చేస్తాడు. అలా చేయడానికి శ్రీనుకు ఉన్న ధీమా ఏమిటీ? ఇంతకు శీను ఎందుకు వచ్చాడు? తనను చంపాలనుకున్న పెద్దిరెడ్డి తమ్ముడి ప్రాణాలను శ్రీను ఎందుకు కాపాడాడు? శ్రీను వెనకున్న అసలు వ్యక్తులు ఎవరు? నిశ్చితార్థం జరుపుకున్న మంగను శ్రీను వివాహం చేసుకోగలిగాడా? లేదా? అనేది మిగతా కథ. మాములుగా ఇప్పటివరకు మనం చూసిన అనేక సినిమాలలోని కథలానే ఈ చిత్ర నేపథ్యం సాగినా ఎక్కడా బోర్ అనే ఫీల్ రానివ్వకుండా దర్శకుడు అజయ్ భూపతి చకచకా సినిమాను నడిపించాడు. అయితే చాలా సన్నివేశాలు రొటీన్ అనిపించక మానదు. ఎన్నో

బంగాళదుంపను స్లైస్‌గా కట్ చేసి. దానిపై కొన్ని నీళ్లు లేదా రోజ్ వాటర్ చల్లాలి. మచ్చలు ఉన్న చోట 5-7 నిమిషాలు నెమ్మదిగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. 2 చెంచాల బంగాళదుంప రసంలో 1 చెంచా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని దూదితో నల్ల మచ్చలపై అప్లై చేయాలి. నిమ్మలో ఉండే సహజ బ్లీచింగ్ గుణాలు ముఖానికి మెరుపును అందిస్తాయి. 2 చెంచాల బంగాళదుంప రసంలో 1 చెంచా తేనె కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. 1 చెంచా బంగాళదుంప పేస్ట్‌కు 1 చెంచా తాజా పెరుగు కలిపి మాస్క్ రెడీ చేసుకోవాలి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ మృత కణాలను తొలగిస్తుంది. బంగాళదుంప ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు నిమ్మరసం వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ఉత్తమ ఫలితాల కోసం ఈ చిట్కాలను వారానికి రెండుసార్లు ట్రై చేయవచ్చు. Gold Rings: 5 గ్రాముల్లో వచ్చే అందమైన బంగారు ఉంగరాలు.. చూసేయండి! Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్ Ajwain Water: ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలు! Gold Bracelet: 10 గ్రాముల్లోపు వచ్చే బంగారు బ్రేస్లెట్స్.. ట్రై చేయండి

CM Revanth Reddy: తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైన సీఎం.. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రైవేట్ భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారి భూమి 22-ఏ జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా ఆ భూమిని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా 22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్నంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. నిషేధిత భూముల కొత్త జాబితాలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూముల వడపోత, తప్పుల సవరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్తుల్లో ఒక్క అంగుళం భూమికి కూడా సమస్య రానివ్వబోమని స్పష్టం చేశారు. భూ యజమానుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 22-ఏ భూముల విషయంలో ప్రజలు దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సీఎం సూచించారు. ఎలాంటి పుకార్లు, కట్టుకథలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అధికారిక ప్రక్రియ ద్వారానే భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలు, నిరసనలపై జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు, యువత వివిధ నిరసన కార్యక్రమాలు, ఆందోళనలలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను రద్దు చేస్తున్నట్లు విజయ్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో, ఈ వివాదం తీవ్ర రూపం దాల్చక ముందే స్పందించిన ప్రభుత్వం.. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ యు-టర్న్ తీసుకుంది

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం ఇటీవల జరిపిన వైమానిక దాడుల ఘటన తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ దాడుల్లో 30 మందికి పైగా పౌరులు మరణించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తారా చంద్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని, వాస్తవాలను నిగ్గు తేల్చాలని ఆయన కోరారు. పాకిస్థాన్ దుశ్చర్యలపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఆగస్టు 12వ తేదీ తెల్లవారుజామున సురబ్ జిల్లాలోని గిదర్ ప్రాంతంలో నివాస గృహాలపై పాకిస్థాన్ వైమానిక దళం విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపించిందని, ఈ ఘటనలో మహిళలు, చిన్నారులతో సహా అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని బలోచ్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తారా చంద్ రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. "ఈ తీవ్రమైన ఆరోపణలపై మీ ప్రభుత్వం విచారణ జరపాలి. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన విమానాలు, ఆయుధాలు, డ్రోన్లు, టెక్నాలజీ లేదా ఇతర సైనిక పరికరాలు ఏమైనా ఉపయోగించారా? అనే విషయాన్ని నిర్ధారించాలి. ఒకవేళ అమెరికా సరఫరా చేసిన ఆయుధాలను దుర్వినియోగం చేసినట్లు ఆధారాలు లభిస్తే, పాకిస్థాన్‌కు అందిస్తున్న సైనిక సహాయంపై సమీక్ష జరపాలి" అని ఆయన కోరారు.అంతేకాకుండా అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిన ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు అమెరికా మద్దతు ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూడాలని తారా చంద్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. "అధ్యక్షా.. ప్రపంచంలో ఏ చిన్నారి ప్రాణమైనా

థియేటర్లు, ఓటీటీల్లో దివ్యాంగులకు ఆడియో డిస్క్రిప్షన్, సబ్‌టైటిల్స్, క్యాప్షనింగ్, సైగ భాష వంటి సౌకర్యాలు కల్పించేలా ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. థియేటర్లలో దివ్యాంగులకు సౌకర్యాలు కల్పించేలా. చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT Platforms) లలో విడుదలయ్యే సినిమాల్లో ఈ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేలా, రెండు వారాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు), మైత్రి మూవీ మేకర్స్ సహా ఇతర భాగస్వామ్యులంతా చర్చించి, అమలు చేయదగ్గ నిర్ణయాన్ని తీసుకోవడం కోసం వారంలోగా ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయాలని జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు. థియేటర్లలో, ఓటీటీల్లో.. ఆడియో డిస్క్రిప్షన్, సబ్ టైటిల్స్, క్యాప్షనింగ్, సైగ భాష వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని కోరుతూ పుష్ప 2 (Pushpa 2) సినిమా విడుదల సమయంలో దివ్యాంగ హక్కుల కార్యకర్త, న్యాయవాది రాహుల్ బజాజ్ (Rahul Bajaj) ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది కేవలం 'పుష్ప 2' సినిమాకి మాత్రమే పరిమితం కాదని, దివ్యాంగుల సినిమా వీక్షణ సౌలభ్యానికి సంబంధించిందని పేర్కొన్నారు

ఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే వారి డైట్ లిస్ట్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ పక్కాగా కనిపిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తాగాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? లేక సలాడ్లలో కలుపుకోవాలా? అనే విషయంలో చాలా మందికి డౌట్లు ఉంటాయి. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే కాదని, దీనివల్ల కొన్ని వాస్తవ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దానిని ఏ సమయంలో, ఏ పరిమాణంలో, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. యాపిల్స్ పులియబెట్టే ప్రక్రియలో ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ కాంపౌండే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలకారణమని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. న్యూట్రిషన్ పరిశోధకురాలు కరోల్ జాన్స్టన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. భోజనంతో పాటు వెనిగర్ తీసుకోవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా అదుపులో ఉంటాయి. 2017లో జరిగిన మరో మెటా-ఎనాలసిస్ సైతం ఆహారం తర్వాత రక్తంలో ఇన్సులిన్, గ్లూకోజ్ స్పందనలను తగ్గించడంలో వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారించింది. బరువు తగ్గడంలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే కొవ్వు కరిగిపోతుందని, బెల్లీ ఫ్యాట్ మాయమవుతుందని ప్రచారాలు ఉన్నప్పటికీ, అది వాస్తవం కాదు. 2009లో జపనీస్ పరిశోధకుడు టోమూ కొండో నేతృత్వంలో 175 మందిపై జరిగిన 12 వారాల అధ్యయనంలో.. ప్రతిరోజూ వెనిగర్ తీసుకున్న వారిలో శరీర బరువు, బీఎంఐ, శరీర కొవ్వులో స్వల్ప మార్పులు కనిపించాయి. అంటే సరైన ఆహార నియమాలతో పాటు దీన్ని తీసుకుంటే బరువు నియంత్రణకు కొంతవరకు మద్దతు ఇస్తుందే తప్ప, అద్భుతాలు ఏమీ చేయదని అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో చెప్పుకునేలా యాపిల్ సైడర్ వెనిగర్ గట్ హెల్త్‌ను పూర్తిగా బాగు చేస్తుందా అంటే ఇంకా పూర్తి ఆధారాలు లేవు. జంతువులపై చేసిన ప్రాథమిక

అఫ్గానిస్థాన్‌లో 2021 ఆగస్టు 15న తాలిబాన్ అధికారాన్ని పూర్తిగా చేజిక్కించుకుంది. అమెరికా, నాటో దళాల ఉపసంహరణ తర్వాత కాబూల్ తాలిబాన్ అధీనంలోకి వెళ్లింది. తాలిబాన్ అధికారంలోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తాలిబాన్ కాబూల్‌లో భారీ స్థాయిలో విజయోత్సవాలు నిర్వహించింది. అంతర్జాతీయా మీడియా కథనాల ప్రకారం.. తాలిబాన్ తన పాలనలో యుద్ధం, అస్థిరత తగ్గి దేశంలో భద్రత పెరిగిందని చెబుతోంది. ప్రస్తుతం తాలిబాన్ అఫ్గానిస్థాన్ మొత్తం భూభాగంపై నియంత్రణ కలిగి ఉంది. ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్ వంటి సాయుధ ముప్పులను తాలిబాన్ బాగా బలహీనపరిచింది. ఐదేళ్లలో ఏం సాధించింది? ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ, 2021లో విదేశీ సహాయం భారీగా తగ్గిన తర్వాత కూడా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా తాలిబాన్ నిలబెట్టింది. పన్నులు, సుంకాల వసూళ్లు పెరగడం, విదేశాల్లో ఉన్న అఫ్గాన్ల నుంచి వచ్చే డబ్బు, పొరుగు దేశాలతో వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు కొంత ఊతమిచ్చాయి. ఖోష్ తేపా కాలువ, టీఏపీఐ గ్యాస్ పైప్‌లైన్, విద్యుత్ ప్రసార మార్గాలు, రహదారులు వంటి మౌలిక వసతుల ప్రాజెక్టులపై తాలిబాన్ దృష్టి పెట్టింది. అయితే ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించింది. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయడంలో తాలిబాన్ విఫలమైంది. మహిళలను మనుషుల్లా చూడట్లేదు.. తాలిబాన్ పాలనలో అతిపెద్ద వైఫల్యం మహిళలు, బాలికలపై విధించిన ఆంక్షలు. బాలికలు 6వ తరగతి తర్వాత అధికారిక విద్య కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. యునెస్కో ప్రకారం ప్రస్తుతం సుమారు 2.4 మిలియన్ అఫ్గాన్ బాలికలు మాధ్యమిక విద్యకు దూరమయ్యారు. మహిళలకు విశ్వవిద్యాలయ విద్య కూడా నిషేధించారు. దీంతో అఫ్గానిస్థాన్ మహిళల ఉన్నత విద్యపై అధికారిక నిషేధం ఉన్న ప్రపంచంలోని ఏకైక దేశంగా నిలిచింది. తాలిబాన్ అధికారంలోకి రాకముందు 2021 నాటికి దాదాపు 10 లక్షల బాలికలు మాధ్యమిక పాఠశాలల్లో చదువుతున్నారు. ఆ విద్యా పురోగతి ఇప్పుడు తీవ్రంగా వెనక్కి వెళ్లింది. మహిళలపై విద్యా ఆంక్షల ప్రభావంతో మహిళా

సొంత ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ కాగితాలు) పొరపాటున పోగొట్టుకోవడం లేదా ప్రమాదవశాత్తు పాడైపోవడం ఆస్తిదారులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించే అంశమే. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చేజారినంత మాత్రాన ఆస్తిపై యాజమాన్య హక్కులు కోల్పోతారని భావించడం పూర్తిగా అపోహ మాత్రమే. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం సరైన న్యాయపరమైన ప్రక్రియను పాటించడం ద్వారా మీ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దస్తావేజులు పోయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. భవిష్యత్తులో ఈ పత్రాలు దుర్వినియోగం కాకుండా, ఫోర్జరీకి గురికాకుండా ఇది ప్రాథమిక చట్టపరమైన రక్షణగా పనిచేస్తుంది. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో పాటు స్థానిక ప్రాంతీయ (తెలుగు) దినపత్రికలో ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, పోయిన పత్రాల సమాచారాన్ని పేర్కొంటూ పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. 15-21 రోజుల గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఆ పత్రికా నోటీసు కాపీ స్పష్టమైన ఆధారంగా ఉపయోగపడుతుంది. పత్రాలు పోయిన తీరును వివరిస్తూ నోటరీ సమక్షంలో అఫిడవిట్ రాయించుకోవాలి. భవిష్యత్తులో ఆస్తి అమ్మకం సమయంలో కొనుగోలుదారులు లేదా బ్యాంకుల సందేహాలను నివృత్తి చేయడానికి ఇండెమ్నిటీ బాండ్ ఎంతో దోహదపడుతుంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సర్టిఫైడ్ కాపీ రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం ప్రభుత్వ రికార్డులలో ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రతి శాశ్వతంగా భద్రపరుస్తారు. కాబట్టి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధమైన సర్టిఫైడ్ కాపీ (ధ్రువీకృత నకలు) పొందవచ్చు. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన విలువను కలిగి ఉంటుంది. బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే పరిహారం తప్పనిసరి ఒకవేళ హోమ్ లోన్ కోసం బ్యాంకులో కుదువబెట్టిన ఒరిజినల్ పత్రాలను బ్యాంకే పోగొడితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం సదరు బ్యాంకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు సొంత ఖర్చులతో

మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాజధాని అమరావతి (Amaravati)లోని రాయపూడి (Rayapudi) పరేడ్ మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర వేడుకలకు సీఎం హాజరై జాతీయజెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు నేల కూడా స్వాతంత్య్ర సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాట ఫలితమే మన స్వాతంత్య్రమని అన్నారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు. దేశం మనకు హక్కులు (Rights), గుర్తింపు, గౌరవం తీసుకొచ్చింది. నా దేశం, నా బాధ్యత అని ముందుకుసాగాలి. దేశం నాకు ఏం చేసిందని కాదు, దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్ (India) స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 100 ఏళ్ల స్వాతంత్ర వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్య్రం నుంచి సమృద్ధి వైపు, వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు

రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్లకు కూడా.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్రం ప్రభుత్వం నిర్మాణ అనుమతులకు 50శాతం టీడీఆర్ ఇచ్చినా చాలు.. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు ఊతమిచ్చిన ప్రభుత్వం హైదరాబాద్ సిటీ: ట్రాన్స్ఫరబుల్ డెవల్‌పమెంట్ రైట్స్ (టీడీఆర్)పై చిక్కుముడులు వీడాయి. హెచ్ఎండీఏ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు టీడీఆర్ తీసుకోవడంపై భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులన్నింటికీ టీడీఆర్‌లను జారీ చేసే అధికారం ఆ సంస్థకే కల్పిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్లకు భూసేకరణ ప్రక్రియలో టీడీఆర్‌లను ఎవరు జారీ చేయాలనే దానిపై ఇప్పటివరకు సందిగ్ధత నెలకొని ఉండేది. ఏ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ/ఎంఎంసీ)పరిధిలో భూ సేకరణ చేస్తే సంబంధిత కార్పొరేషనే ఇప్పటివరకు టీడీఆర్ జారీ చేసేది. అయితే, రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న రతన్‌టాటా రేడియల్ రోడ్డుకు పరిహారంగా టీడీఆర్ కావాల్సినవారు ఎంఎంసీని సంప్రదించాలా? హెచ్ఎండీఏను సంప్రదించాలా? లేదా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ని సంప్రదించాలా అనే సందేహం ఉండేది. ఈ నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీనే (హెచ్ఎండీఏ) టీడీఆర్ జారీ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఈ టీడీఆర్‌లను హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. తాజా నిర్ణయంతో హెచ్ఎండీఏ పరిధిలో భూసేకరణ, అభివృద్ధి పనులకు ఇక మరింత ఊతం లభించనుంది. బిల్డ్నౌలోనే సింగిల్ బ్యాంకు టీడీఆర్ పొందిన నిర్వాసితులు క్రయ, విక్రయాలు చేసుకోవడానికి ఇప్పటివరకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు ప్రత్యేకంగా వెబ్సైట్లోనే టీడీఆర్ బ్యాంకును ఏర్పాటు చేశాయి. అయితే, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఎంఎంసీ, సీఎంసీలు, పెరీ అర్బన్ రీజియన్ పరిధిలో ఎఫ్సీడీఏలు వచ్చాయి. దీంతో రాష్ట్రం మొత్తానికి ఒకే టీడీఆర్ బ్యాంకును బిల్డ్ నౌలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక టీడీఆర్‌ను పలు నిర్మాణ అనుమతులకు వినియోగిస్తూ తప్పదోవ

గత నెలలో థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం వదలా సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. గత నెలలో థియేటర్లకు వచ్చి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం వదలా (Vadala). జగపతి బాబు (JagapathiBabu), లయ (Laya), హృతిక శ్రీనివాస్ (Hrithika), శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించగా ఆకెళ్ల కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. కథవిషయానికి వస్తే.. డాక్టర్ అయిన యోగి సిద్ధార్థ్ మధ్య ప్రదేశ్‌లో తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంటాడు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఓ ప్రమాదం నుంచి బయటపడ్డ అముద వారి కుటంబానికి చేరువ అవుతుంది. కానీ అప్పటి నుంచి వారి ఫ్యామిలీలో ప్రశాంతత కరువవుతుంది. అనుకోని ఘటనలు జరుగుతూ కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంతకు ఆ ఫ్యామిలీలో ఉన్నట్టుండి ఏమి జరిగింది, అముద నేపథ్యం ఏమిటి, ఆ కుటుంబంలోకి ఎందుకు వచ్చింది చివరకు ఆ ఫ్యామిలీ ఏమైందనే ఆసక్తికరమైన కథ కథనాలతో సినిమా సాగుతుంది. చదవడానికి, చూడడానికి మనం ఇప్పటికూ చూసిన వందల కొద్ది సినిమాల మాదిరిగానే ఈ మూవీ సాగినప్పటికీ ఓ విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo) ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో మిస్సయిన వారు, జగపతి బాబు ఫ్యాన్స్, డిఫరెంట్ సినిమాలు ఇష్టపడేవారు ఒకమారు ఈ సినిమా చూసేయవచ్చు

హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని బీసీఐని ఆయన గట్టిగా హెచ్చరించారు. సీజేఐ జోక్యంతో పాటు ఇతర వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు ప్రచారం చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బీసీఐ, విచారణ పూర్తయ్యే వరకు 2026 బ్యాచ్‌కు చెందిన నల్సార్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రచారానికి ఎవరు సూత్రధారులో తేల్చేందుకు నివేదిక ఇవ్వాలని యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్‌ను కోరింది.బీసీఐ చర్యపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇది అస్సలు ఆమోదయోగ్యం కాదు. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఇది నాకు, విద్యార్థులకు మధ్య జరగాల్సిన సంభాషణ. ఇందులో జోక్యం చేసుకోవడానికి వాళ్లెవరు?" అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. ఈ వివాదంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు బీసీఐని ఆదేశించింది. నల్సార్ విద్యార్థులు లేదా అధ్యాపకులపై ఎలాంటి శిక్షాత్మక చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.అంతకుముందు బీసీఐ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొంటూ బీసీఐ ఛైర్మన్ మనన్ కుమార్

పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. పంజాబ్‌లోని కాపుర్తలాలోని ప్రసిద్ధ మాతా శ్రీ భద్రకాళి ఆలయ ద్వారం వెలుపల బిక్షాటన చేస్తున్న మహిళపై జరగిన ఈ దాడి.. స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఆ మహిళతో ఉన్న పసిబిడ్డ అక్కడ నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను తాకడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన బైకు యజమాని.. ఆ పిల్లాడి తల్లిని కిందకు తోసి తన చెప్పుతో విచక్షణారహితంగా కొట్టాడు. అటుగా వెళ్తున్న భక్తులు జోక్యం చేసుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. నిందితుడు మళ్లీ వచ్చి ఆమెను కాలితో తన్నాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై మొదట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే, వీడియో వైరల్ కావడంతో మహిళా కమిషన్, మానవ హక్కుల కమిటీలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహం, మానవ హక్కుల సంఘాల జోక్యంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని వికాస్ శర్మగా అధికారులు గుర్తించారు. అతనిపై బీఎన్ఎస్ నిబంధనల కింద సంబంధిత సెక్షన్లతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

తెలుగమ్మాయి శాన్వీ మేఘన కథానాయికగా, ఎలాన్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ తెరకెక్కిచ్చిన తమిళ చిత్రం ప్యార్ ప్రేమ కళ్యాణం. తెలుగమ్మాయి శాన్వీ మేఘన (Saanve Megghana) కథానాయికగా, ఎలాన్ (Elan) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ తెరకెక్కిచ్చిన తమిళ చిత్రం ప్యార్ ప్రేమ కళ్యాణం (Pyaar Prema Kalyanam). డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రం తమిళంతో పాటు ఏక కాలంలో తెలుగు ఇతర భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిట్రైలర్ చూస్తే.. ఔట్ అండ్ ఔట్ ఫన్, ఫ్యామిలీ కథతో రూపొందించనట్లు అర్థమవుతోంది. అయితే.. ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయం కాదని కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలో అమ్మాయి అత్తగారింటికి వెళ్లే బదులు అబ్బాయే అత్తగారింటికి ఇల్లరికం వెళ్లడం అక్కడ అతను ఎదుర్కొన్న అనుభవాల నేపత్యంలో ఈ సినిమా సాగనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మీరూ ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Kamindu Mendis Two Hands Bowling: శ్రీలంక ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌లో ఉన్న అరుదైన టాలెంట్ గురించి అందరికీ తెలిసిన విషయమే. రెండు చేతులతోనూ స్పిన్ బౌలింగ్ చేస్తూ.. బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. కుడిచేత్తో 'ఆఫ్ స్పిన్' అలాగే ఎడమచేత్తో 'లెఫ్ట్ ఆర్మ్ స్పిన్' వేయగలడు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ అద్భుతమైన రికార్డులు కల్గిన ఈ ఆల్‌రౌండర్.. భారత్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో శ్రీలంక టీమ్‌కు కీలక ఆటగాడిగా మారనున్నాడు. గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక వైస్ కెప్టెన్‌గా కమిందు మెండిస్ ఉన్నాడు. ధనంజయ డి సిల్వా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఒకే ఓవర్లలో రెండు వేర్వేరు చేతులతో బౌలింగ్ చేయడం పూర్తి లీగల్. అయితే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏ చేతితో బౌలింగ్ చేయబోతున్నాడు..? వికెట్‌కు ఏ వైపు నుంచి వేస్తున్నాడు..? అనే విషయాన్ని ముందుగా అంపైర్‌కు చెప్పాలి. ఈ విషయాన్ని స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు అంపైర్ తెలియజేస్తారు. ఒకవేళ బౌలర్ అంపైర్‌కు చెప్పకుండా హఠాత్తుగా హ్యాండ్ ఛేంజ్ చేసి బౌలింగ్ చేస్తే.. అంపైర్ దానిని 'నో బాల్'గా ప్రకటిస్తారు. ఒక ఓవర్లో బౌలర్ ఎన్నిసార్లయినా చెయ్యి మార్చి బౌలింగ్ చేయవచ్చు. హ్యాండ్ మార్చిన ప్రతిసారీ అంపైర్‌కు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. గతంలో జరిగిన అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లలో రెండు చేతులతో స్పిన్ బౌలింగ్ చేశాడు కమిందు మెండిస్. పిచ్ పరిస్థితులను బట్టి బౌలింగ్ కోణాన్ని మార్చుకోవచ్చు. పిచ్‌పై ఉండే రఫ్ ప్యాచెస్‌ను ఉపయోగించుకుని వికెట్లు తీయవచ్చు. హఠాత్తుగా బౌలింగ్ స్టైల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) ప్రశ్నించారు. స్వలాభం కోసం, ఎంపీ సీట్ల కోసం తెలంగాణ నీటిని, ప్రజలను ఏపీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వతంగా తెలంగాణకు కేసీఆర్ నష్టం చేశారని ఆగ్రహించారు. ఈరోజు (గురువారం) సీఎల్పీ మీడియా పాయింట్లో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఢిల్లీలో గద్దె ఎక్కడానికి చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావని ప్రస్తావించారు. కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తాననే విషయాన్ని బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి మర్చిపోయినట్లుగా ఉన్నారని విమర్శించారు. జగదీశ్వర్ రెడ్డి రాజకీయాల కోసం రైతులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసిన, ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్వర్ రెడ్డి రోజుకో కొత్త డ్రామాకి తెర లేపుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ హయాంలో అదనంగా తరలించుకొని పోయిన నీటి గురించి వైసీపీ నేతలే ప్రెస్ మీట్లు పెట్టి మరి చెబుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి సీఎం హోదాలో అసెంబ్లీ వేదికగా శ్రీశైలం నుంచి తీసుకెళ్తున్న నీటిని ప్రస్తవించ లేదా అని నిలదీశారు. కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులను పెంచుతున్నట్లు జగన్ అసెంబ్లీలో చెప్పారని అన్నారు. జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు జగదీష్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? అని శ్రీనివాస్

'మిస్టర్ పర్ఫెక్ట్' చిత్రానికి సంబంధించిన కాపీరైట్ వివాదంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఈ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై విచారణ ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచిపోయింది.ప్రభాస్ కథానాయకుడిగా 2011లో విడుదలైన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్ర కథను, తన నవల ‘నా మనసు కోరింది నిన్నే’ నుంచి కాపీ చేశారని రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ట్రయల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని శ్యామలారాణి తరఫు న్యాయవాది ఇటీవల కోరారు. తన క్లయింట్ వయసు (71 ఏళ్లు) దృష్ట్యా విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. అయితే, ఈ అభ్యర్థనను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్టే విధించామని స్పష్టం చేస్తూ విచారణను ముగించింది.2010లో ప్రచురితమైన తన నవల ఆధారంగానే ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాను తెరకెక్కించారని ఆరోపిస్తూ శ్యామలారాణి 2017లో దిల్ రాజుపై ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైదరాబాద్‌లోని ట్రయల్ కోర్టు.. ఐపీసీ సెక్షన్ 420, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ దిల్ రాజు హైకోర్టును ఆశ్రయించగా.. సెక్షన్ 420ని కొట్టివేసిన న్యాయస్థానం, కాపీరైట్ చట్టం కింద విచారణను కొనసాగించవచ్చని 2024 డిసెంబర్లో తీర్పునిచ్చింది.హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై

టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజుకు (Dil Raju) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజుకు (Dil Raju) ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ ట్రయల్ కోర్టులో కొనసాగుతున్న విచారణపై గతంలో విధించిన స్టేను ఎత్తివేయాలని రచయిత్రి ముమ్మిడి శ్యామలరాణి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ట్రయల్ కోర్టు విచారణపై ఉన్న స్టే కొనసాగనుంది. ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ (Mr Perfect) సినిమా 2011లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా కథ తన ‘నా మనసు కోరింది నిన్నే’ నవల నుంచి కాపీ చేశారని రచయిత్రి ముమ్మిడి శ్యామలరాణి ఆరోపించారు. 2010 ఆగస్టులో సాహితీ పబ్లిషర్స్ ఈ నవలను ప్రచురించిందని పేర్కొంటూ, 2017 జులై 12న దిల్‌రాజుపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ ట్రయల్ కోర్టు 2018 అక్టోబర్ 27న ఐపీసీ సెక్షన్ 420, కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద నోటీసులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ దిల్‌రాజు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు ఐపీసీ సెక్షన్ 420 కింద ఉన్న ఫిర్యాదును కొట్టివేసింది. అయితే కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63 కింద విచారణ కొనసాగించేందుకు ట్రయల్ కోర్టుకు అనుమతించింది. 2024 డిసెంబరులో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను దిల్‌రాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 2025 ఫిబ్రవరి 24న సుప్రీంకోర్టు విచారణ జరిపి, కేసు విచారణకు సంబంధించిన కాలపరిమితి అంశంపై ప్రతివాదుల అభిప్రాయాలను కోరుతూ నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించింది. తాజాగా ఆ స్టేను ఎత్తివేసి విచారణ కొనసాగించాలని శ్యామలరాణి తరఫు న్యాయవాది కోరారు. ఆమె వయసు 71 ఏళ్లు కావడంతో కేసును త్వరగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని

పాత పెన్షన్ (ఓపీఎస్) విధానంతోనే సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) పేర్కొంది. విజయవాడ: పాత పెన్షన్ (ఓపీఎస్) విధానంతోనే సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీఏ) పేర్కొంది. పెన్షన్ ప్రభుత్వ దానం కాదని ఉద్యోగి జీవిత కాల ప్రజాసేవకు లభించే చట్టబద్దమైన హక్కు అని ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొందని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ అనేది నిర్దిష్ట విరాళాల విధానమని, ఉద్యోగికి భవిష్యత్తులో ఎంత పెన్షన్ లభిస్తుందో ముందుగానే నిర్ధారించలేమని వెల్లడించారు. సీపీఎస్ ఉద్యోగుల ఆందోళనకు ప్రధాన కారణం ఇదేనని స్పష్టంచేశారు. కేవలం నియామక తేదీ ఆధారంగా ఒకరికి ఓపీఎస్, మరొకరికి సీపీఎస్ వర్తించడం.. సమాన పనికి సమాన సామాజిక భద్రత అనే సూత్రానికి అనుగుణంగా లేదన్నారు. దీనివల్ల నిర్దారిత పెన్షన్, డియర్ నెస్ రిలీఫ్, కుటుంబ పెన్షన్ వంటి ప్రయోజనాలు ఉండవని ఆవేదన వ్యక్తంచేశారు

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ల పాలన మొదలై ఐదేళ్లు గడుస్తున్నా.. అక్కడి మహిళలకు, బాలికలకు అంధకార స్థితి మారలేదు. ఆధునిక ప్రపంచం సాంకేతికతతో దూసుకుపోతుంటే, ఒక పూర్తి తరానికి చెందిన ఆడపిల్లలను బడికి రాకుండా నిరోధించిన ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్థాన్ మిగిలిపోయింది.హైస్కూల్, పైచదువుల గుమ్మం తొక్కకుండా తాలిబాన్లు విధించిన ఆంక్షల వల్ల దాదాపు 24 లక్షల మంది బాలికలు చదువుకు దూరమయ్యారని ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిబంధనల పేరుతో ఓ తరం బాలికల జీవితాలను సర్వనాశనం చేయడం ప్రాథమిక మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘన కిందకే వస్తుందని తెగేసి చెప్పింది.ఒక్క నిర్ణయంతో 20 ఏళ్ల కష్టం బూడిదపాలు..2021 ఆగస్టులో అమెరికా, నాటో దళాలు దేశాన్ని వీడటంతో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు, మొదట హైస్కూల్ స్థాయి బాలికలపై నిషేధం విధించారు. ఆ తర్వాత క్రమంగా యూనివర్సిటీలు, ఉద్యోగాలు , పబ్లిక్ లైఫ్ నుంచి మహిళలను పూర్తిగా పక్కనబెట్టేశారు. 2001 నుంచి 2021 మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళా విద్య ఎంతో మెరుగైంది. అప్పట్లో దాదాపు 10 లక్షల మంది వరకు బాలికలు బడులకు వెళ్లే స్థాయికి వ్యవస్థ మారింది. కానీ, తాలిబాన్ల కొత్త ఆంక్షలతో గత రెండు దశాబ్దాలుగా సాధించిన పురోగతి అంతా ఒక్కసారిగా కొట్టుకుపోయిందని యునెస్కో ప్రతినిధి హోదా జబేరియన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచదేశాల ఒత్తిళ్లను త్రోసిపుచ్చిన తాలిబన్లు..ఐక్యరాజ్యసమితితో పాటు మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ సమాజం , పలు ఇస్లామిక్ దేశాలు ఎంత మొరపెట్టుకున్నా తాలిబాన్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బాలికల చదువు తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో విదేశీ ప్రమేయం అవసరం లేదని సమర్థించుకుంటోంది.బాలికలకు విద్యకు పూర్తిగా దూరం చేసిన ఏకైక దేశంఅయితే, ఐదేళ్ల కాలమనేది పిల్లల విద్యా జీవితంలో చాలా పెద్దదని, ఇది ఏదో తాత్కాలిక విరామం కాదని, ఒక పూర్తి విద్యా సంత్సరాల చక్రాన్నే నాశనం చేయడమని యునెస్కో స్పష్టం చేసింది. బాలికలకు

బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ నటి, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన పేరు, ఇమేజ్, వ్యక్తిగత గుర్తింపును ఆన్లైన్లో దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన గుర్తింపును ఉపయోగిస్తూ సృష్టించిన అశ్లీల కంటెంట్, ఏఐ ద్వారా రూపొందించిన ఫోటోలు, వీడియోలు, నకిలీ ఖాతాలు, ఇంకా అనుమతి లేని ఇతర వినియోగాలపై నిషేధం విధించాలని ఆమె తన పిటిషన్లో పేర్కన్నారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) జాన్వీ కపూర్ కోరిన ఈ ఆంక్షలపై, ముఖ్యంగా ఫ్యాన్ పేజీలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణ సమయంలో జస్టిస్ అనూప్ జైరామ్ భంబానీ (Justice Anup Jairam Bhambhani) స్పందిస్తూ... “మీకు అభిమానులు వద్దు అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఇక ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. ఫ్యాన్ పేజీలను కేవలం అక్రమమైనవిగా లేదా చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అభిమానులు నటీనటుల పనిని అభినందించడానికి, వారి చిత్రాలను పంచుకోవడానికి, చివరికి వారిని విమర్శించడానికి కూడా ఫ్యాన్ పేజీలను నిర్వహిస్తుంటారని పేర్కొంది. అయితే, జాన్వీ కపూర్ ఇమేజ్ను దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన అశ్లీల కంటెంట్‌పై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు తెలిపింది. జాన్వీ కపూర్ వేసిన ఈ పిటిషన్లో దాదాపు 5,000 కంటే ఎక్కువ వెబ్ పేజీలు, సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. వీటిలో ఏఐ-జెనరేటెడ్ అశ్లీల కంటెంట్, నకిలీ ప్రొఫైళ్లు ప్రధానంగా ఉన్నాయి. సెలబ్రిటీల పర్సనాలిటీ రైట్స్ పేరుతో సాధారణ ఫ్యాన్ యాక్టివిటీని, ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా నియంత్రించలేమని ఈ విచారణ ద్వారా కోర్టు స్పష్టమైన సందేశాన్ని

వయసుకొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదని, వారు తమ జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉన్న స్వతంత్రులని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో జీవించేందుకు వెళ్లిన కుమార్తెను తమకు అప్పగించాలంటూ ఓ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మేజర్ అయిన యువతి తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కోర్టు సమర్థించింది.నాగ్‌పుర్‌కు చెందిన ఓ యువతి 17 ఏళ్ల వయసులో ట్యూషన్‌కు అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి, ఓ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను గుర్తించి తల్లికి అప్పగించారు. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె మళ్లీ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తన కుమార్తెను ఆ యువకుడు అక్రమంగా నిర్బంధించాడంటూ తల్లి హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.విచారణ సందర్భంగా కోర్టు నేరుగా ఆ యువతితో మాట్లాడింది. తాను తన ఇష్టప్రకారమే ఆ యువకుడితో కలిసి ఉంటున్నానని, అతనితోనే జీవించాలనుకుంటున్నానని ఆమె స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె మేజర్ అని నిర్ధారించుకున్న న్యాయస్థానం, ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని తెలిపింది. అక్రమ నిర్బంధం రుజువు కాని పక్షంలో హెబియస్ కార్పస్ పిటిషన్ చెల్లదని స్పష్టం చేస్తూ తల్లి పిటిషన్‌ను నాగ్‌పూర్ ధర్మాసనం కొట్టివేసింది

తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. హైదరాబాద్, ఆగస్టు 12: తెలంగాణ నీటి వాటా విషయంలో ఎక్కడా రాజీపడబోమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నీటి వాటాల్లో తెలంగాణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్లో ఆయన మాట్లాడుతూ.. జీఆర్ఎంబీ సమావేశానికి హాజరవుతామని తెలిపారు. నీటీ వాటాపై బలంగా కొట్లాడుతామని పేర్కొన్నారు. అసత్యాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ ఫాం హౌస్‌లో పండిన వరికి వచ్చిన ధర ఎంతో చెప్పాలంటూ కేటీఆర్‌ను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. తాము కోటిన్నర రూపాయిలకు ఇచ్చిన భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 90 లక్షలకే ఇచ్చిందని గుర్తు చేశారు. నిబంధనల మేరకే భూ కేటాయింపులు జరిగాయని ఆయన వివరించారు. 5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చామని చెప్పారు. కేటీఆర్ చెబుతున్న రూ. 200 కోట్లు ఎక్కడివో చెప్పాలని నిలదీశారు. హిల్ట్ పాలసీ వల్ల హైదరాబాద్ ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పారిశ్రామిక వేత్తలను భయపెట్టడం కేటీఆర్‌కు మంచిది కాదని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం సరైనది కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడికి హితవు పలికారు. తమపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపవద్దని ఆయనకు సూచించారు. బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేద పేర్కొన్నారు. అందుకే ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించారని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తూ రూపొందిస్తున్న అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ మేరకు న్యాయమూర్తి అనూప్ జైరాం భంభానీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ పలువురు క్రీడాకారులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత హక్కుల కోసం ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జాన్వీ కపూర్ తరపున వాదించిన న్యాయవాదులు, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మెటా సంస్థ న్యాయస్థానానికి వివరణ ఇస్తూ, ఇప్పటికే పిటిషనర్ 4,000కు పైగా యూఆర్ఎల్స్ను సమర్పించారని వెల్లడించింది. అయితే, అందులో ఉన్న ప్రతి కంటెంట్ అభ్యంతరకరంగా లేదని మెటా తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, పిటిషన్లలో పేర్కొన్న కంటెంట్‌ను స్పష్టంగా వర్గీకరించి సమర్పించాలని కోర్టు పిటిషనర్ వైపు ఉన్న వారికి సూచించింది. మరోవైపు ఫ్యాన్ పేజీల విషయంలో కోర్టు ఒక సమతుల్య వైఖరిని ప్రదర్శించింది. ప్రతి ఫ్యాన్ పేజీని క్రిమినల్‌గా పరిగణించలేమని, కొన్ని పోస్ట్‌లు వ్యంగ్యంగా లేదా విమర్శనాత్మకంగా ఉండే అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఫలితంగా అన్ని ఫ్యాన్ పేజీలపై ఒకేసారి నిషేధం విధించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా వాణిజ్యపరంగా ఆమె పేరును వాడుకునే పేజీలపై మాత్రమే కఠిన చర్యలు ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. ముగింపుగా, అశ్లీల కంటెంట్‌ను తొలగించేలా కోర్టు ఇచ్చిన ఆదేశాలు జాన్వీ కపూర్‌కు భారీ

ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ కన్నతండ్రి వారిని ఇంట్లో నిర్బంధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా ఆ ఇద్దరికి కలిపి రూ.25లక్షలు ఇవ్వాలని బాధిత యువతుల తండ్రిని, యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అక్కాచెల్లెళ్లను తండ్రి నిర్బంధించడాన్ని తప్పుబట్టిన అలహాబాద్‌కోర్టు ప్రయాగ్‌రాజ్: ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇస్లాంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ కన్నతండ్రి వారిని ఇంట్లో నిర్బంధించడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. ఇందుకు పరిహారంగా ఆ ఇద్దరికి కలిపి రూ.25లక్షలు ఇవ్వాలని బాధిత యువతుల తండ్రిని, యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. యూపీకి చెందిన దియా భాటియా అలియాస్ జోయా (20), అన్షు భాటియా అలియాస్ అమీనా (35) 2021లో ఇస్లాం స్వీకరించారు. ఇది ఇష్టంలేని తండ్రి, ఆ ఇద్దరినీ ఇంట్లోని గదిలో పెట్టి తాళం వేశాడు. అయితే ఆ అక్కాచెల్లెళ్ల తరఫున ఓ వ్యక్తి ఈ ఘటనపై అలహాబాద్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. అటు.. ఆ సోదరీమణుల తండ్రి కూడా తన కూతుళ్లను హిందూమతం నుంచి బలవంతంగా, మోసపూరితంగా ఇస్లాంలోకి మార్చారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ సందీప్ జైన్ విచారించారు. తాము ఎవరి ఒత్తిడితోనో కాకుండా పూర్తి ఇష్టపూర్వకంగానే మానసిక ప్రశాంతత కోసం ఇస్లాం స్వీకరించామని ఆ సోదరీమణులు కోర్టు ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కాగా ఈ అక్కాచెల్లెళ్లు మతం మారడం వెనుక పెద్ద కుట్ర ఉందంటూ కోర్టులో యూపీ ప్రభుత్వం వాదించింది. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కూడా మేజర్లు అని, తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకునేందుకు న్యాయపరమైన స్వేచ్ఛ వారికి ఉందని కోర్టు స్పష్టం చేసింది. అక్కాచెల్లెళ్లకు కోరుకున్న చోట, కోరుకున్న వ్యక్తులతో కలిసి జీవించే హక్కు ఉందని తీర్పు వెలువరించింది

షెడ్యూల్డ్ ప్రాంత గ్రామసభలకు అధికారాలు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్రాభివృద్ధి అమరావతి, (ఆంధ్రజ్యోతి): స్వపరిపాలనను బలోపేతం చేయడం, గిరిజనుల హక్కులు, సంప్రదాయాలు, సం స్కృతి, సహజ వనరులను పరిరక్షించి, అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం స్ట్రెంతనింగ్ హేబిటేట్ అండ్ ఆదివాసీ నాలెడ్జి సిస్టం త్రూ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ (శక్తి) కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పీసా చట్టం-1996, ఏపీ పంచాయతీరాజ్ (సవరణ)చట్టం-1998, ఏపీ పీసీ నిబంధనలు-2011 ప్రకారం గ్రామసభల సామర్థ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామసభలే కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామసభలు తమ అవసరాలకు అనుగుణంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. అవగాహన హక్కుల కమిటీ, వనరుల ప్రణాళిక సమీకరణ కమిటీ, పండుగలు సాంస్కృతిక క్రీడల కమిటీ, సంక్షేమం విద్య కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కమిటీలో 10-15 మంది సభ్యులు ఉండాలి. కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూసుకోవాలి. పీవీటీజీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. కమిటీ చైర్పర్సన్, కార్యదర్శిని గ్రామసభ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీ పదవీకాలం కనీసం రెండేళ్లు. గ్రామసభ దాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. అవసరమైతే ఏ సభ్యుడినైనా మార్చే, కమిటీని పునర్యవస్థీకరించే అధికారం గ్రామసభకు ఉంటుంది. కమిటీలు నెలకు ఒకసారి సమావేశం కావాలి. మొత్తం సభ్యుల్లో సగం మంది హాజరైతే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. సమావేశాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. హక్కులపై అవగాహన... హక్కుల కమిటీ పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం, భూబదలాయింపు నిబంధనలు, గిరిజన సంక్షేమ చట్టాలపై గ్రామసభ ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామసభ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. మినిట్స్‌ను డిజిటలైజ్ చేయాలి. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు గ్రామసభకు హాజరవ్వాలి. వనరుల ప్రణాళిక, సమీకరణ కమిటీ గ్రామంలోని
Allahabad High Court Religion Verdict : వయోజనులైన పౌరులకు తమకు నచ్చిన మతాన్ని ఎంచుకునే పరిపూర్ణ హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇస్లాం మతాన్ని స్వీకరిస్తున్నారనే నెపంతో మేజర్లు అయిన ఇద్దరు కుమార్తెలను ఇంట్లోనే అక్రమంగా బంధించిన ఒక తండ్రి చర్యను న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ప్రవర్తించిన సదరు తండ్రితో పాటు బాధితుల హక్కులను కాపాడటంలో విఫలమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు భారీ జరిమానా విధించింది. బాధితులైన ఇద్దరు యువతులకు కలిపి రూ. 25 లక్షల భారీ పరిహారాన్ని తండ్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చెల్లించాలని ఆదేశిస్తూ జస్టిస్ సందీప్ జైన్ సంచలన తీర్పు వెలువరించారు.అసలేం జరిగిందంటే..?తన కుమార్తెలైన దియా భాటియా అలియాస్ జోయా దియా భాటియా (20), అన్షు భాటియా అలియాస్ అమీనా అన్షు భాటియా (35)లను ప్రలోభాలకు గురిచేసి.. బెదిరించి మతం మార్చారంటూ వారి తండ్రి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నెపంతోనే ఆయన వారిని ఇంట్లోనే నిర్బంధించారు. అయితే తమను అక్రమ నిర్బంధం నుంచి విడిపించాలని కోరుతూ బాధిత యువతులు ఇద్దరూ అలహాబాద్ హైకోర్టులో 'హెబియస్ కార్పస్' పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ సందీప్ జైన్ నేరుగా బాధిత యువతులతో మాట్లాడారు. వారు ఎవరి ఒత్తిడికీ లొంగలేదని, స్వచ్ఛందంగానే మతం మారాలని నిర్ణయించుకున్నారని నిర్ధారించుకున్నారు. దీంతో తండ్రి చేసిన బెదిరింపులు, ప్రలోభాల ఆరోపణలను న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది.ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహంఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుల వాదనను పట్టించుకోకుండా కేవలం తండ్రి చేసిన ఆరోపణలనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆక్షేపించింది. చట్టబద్ధంగా మేజర్లు అయిన యువతులను అక్రమ నిర్బంధం నుంచి విడిపించడంలోనూ.. వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటంలోనూ ప్రభుత్వం పూర్తిగా

గత నెలలో థియేటర్లకు వచ్చిన అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన ‘లెనిన్’ (Lenin,) సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అదే జోరు చూపిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి జీ5 ఓటీటీ (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘లెనిన్’.. కేవలం రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటినట్లు మేకర్స్ తెలిపారు. థియేటర్లలో బ్లాక్‌బస్టర్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అఖిల్ నటనకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జీ5లో ‘లెనిన్’కు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఓటీటీలోనూ అదే జోరు.. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి వచ్చింది. జీ5లో స్ట్రీమింగ్ మొదలైన రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను అందుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనమని మేకర్స్ చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగితే రాబోయే రోజుల్లో ‘లెనిన్’ ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో కథ.. చిత్తూరు జిల్లా రామచంద్రపురం గ్రామంలో జరిగే ద్రౌపదమ్మ తిరునాళ్ల నేపథ్యంలో ‘లెనిన్’ కథ సాగుతుంది. స్నేహం, ద్రోహం, కోపం, పగ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ కథను తెరకెక్కించారు. లెనిన్‌కు ప్రాణ స్నేహితుడే ఎందుకు ద్రోహం చేశాడు? ఆ ద్రోహం వల్ల లెనిన్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్లాడు? రామచంద్రపురంలో జరిగిన కురుక్షేత్రంలో చివరికి ఎవరు గెలిచారు? అనేది సినిమా

ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాల మాదిరే ఓటీటీలోనూ ఆసక్తికరమైన కంటెంట్ ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ వారం కూడా ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్, లయన్స్‌గేట్ ప్లే, యాపిల్ టీవీ+ సహా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫాంలపై స్ట్రీమింగ్కు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘కాక్టెయిల్ 2’, ‘రీచర్’ సీజన్ 4 సహా పలు క్రేజీ చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. ఆగస్టు 10 నుంచి 16 వరకు ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ఏయే ఓటీటీ వేదికలపై అందుబాటులోకి రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం

ఇటీవల జరిగిన అబార్షన్ వ్యతిరేక ర్యాలీలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరిగిన అబార్షన్ వ్యతిరేక ర్యాలీలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. స్పీకర్ తీరు మహిళా హక్కులకు వ్యతిరేకమంటూ రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. చెన్నైలో ఆగస్టు 8,9 తేదీల్లో మార్చ్ ఫర్ లైఫ్ పేరిట ఈ ర్యాలీ జరిగింది. మద్రాస్-మైలాపోర్ ఆర్చిడయోసీస్ ఆధ్వర్యంలో స్టెల్లా మేరీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పసి ప్రాణాలను మొగ్గులోనే చిదిమేసే అబార్షన్లను సభలో అనేక మంది వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఎమ్‌టీపీ యాక్ట్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా గర్భధారణతోనే ఓ కొత్త జీవి ప్రాణం పోసుకుంటుందన్న అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. ‘గర్భస్థ శిశుకు కూడా గౌరవం ఉంటుంది. ఈ భావాన్ని వ్యక్తీకరించే వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పిల్లలు అందరూ దేవుడి దీవెనలే. ఈ దీవెనను వ్యతిరేకించే ఆలోచన ఎవరి మనసుల్లోనూ ఉండకూడదు’ అని స్పీకర్ అన్నారు. ఈ కామెంట్స్‌పై రాష్ట్రంలో పలువురు మహిళా హక్కుల కార్యకర్తల విమర్శలు గుప్పించారు. గర్భధారణకు సంబంధించి మహిళల హక్కులకు ప్రాధాన్యమిస్తూ 2021లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనేక మంది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 21 ప్రకారం సేఫ్ అబార్షన్ కూడా ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఈ ర్యాలీ అసెంబ్లీ స్పీకర్ ఎలా పాల్గొంటారని, స్పీకర్ వాదనతో సీఎం కూడా ఏకీభవిస్తున్నారా? అని షాలిన్ మారియా లారెన్స్ అనే మహిళా హక్కుల కార్యకర్త ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆ తీర్మానానికి ఆమోదం.. సీఎం విజయ్‌పై కమల్ ప్రశంసలు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర మరువదు: సోనియా గాంధీ
.webp)
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..! ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇవాళ ఒక విచిత్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. వీధుల్లో రాజకీయం వేడిగా, రచ్చరచ్చగా కనిపిస్తున్నప్పటికీ... అది ప్రజల కడుపు నింపేది కాదు, వారి సమస్యలను తీర్చేది అంతకన్నా కాదు. ఒకప్పుడు అభ్యుదయ భావాలకు, పోరాటాలకు, చైతన్యవంతమైన మేధో చర్చలకు నిలయమైన ఆంధ్ర నేలలో... ఈరోజు భయం, నిస్తేజత, ఒకరకమైన అచేతన నిశ్శబ్దం ఆవహించాయి. ఊళ్లలో, నగరాల్లో సగటు సామాన్యుడి మనస్సులో మెదులుతున్న అతి పెద్ద ఆందోళన.. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టివి తెరలు తెరుచుకుంటే చాలు... ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రాజకీయ సర్కస్, రాత్రికి ఛానళ్లలో వేడివేడి చర్చలు. ప్రజలకు వినోదం పంచే రంగుల వెలుగుల వెనుక దాగిన చేదు నిజం ఏమిటంటే... అధికారం, ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ప్రధాన శక్తులు పైకి కొట్టుకుంటున్నట్టు నటిస్తూ, తెర వెనుక మాత్రం ఎంతో కలిసిమెలిసి పనిచేసుకుంటున్నాయి. నాటకీయ విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లిస్తూ, తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి. ఇటు యువతకు ఉద్యోగాలు లేక, రైతులకు గిట్టుబాటు ధర దొరక్క, సామాన్యుడిపై ధరల భారం పడుతుంటే... ఈ నిత్య నాటకాలు ప్రజల అసలు సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పాత్రే మాయమైపోతే, సామాన్యుడు తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? మరోవైపు భయానకమైన పత్రికా స్వేచ్ఛా హరణం జరుగుతోంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించే స్వతంత్ర జర్నలిస్టులు, యూట్యూబర్లు ఇవాళ తీవ్ర భయాందోళనల మధ్య బతుకుతున్నారు. ఏదైనా నిజం చెబితే ఎక్కడ తప్పుడు కేసులు పెడతారో, ఎప్పుడు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతారో అనే భయంతో వణికిపోతున్నారు. బహిరంగంగా నడిచే అక్రమాలు, సహకార సంస్థల నాయకులపై జరిగే రాజకీయ ఒత్తిళ్లు, బలవంతపు రాజీనామాల వార్తలను కూడా ప్రధాన పత్రికలు నిర్భయంగా ప్రచురించలేకపోతున్నాయి. సత్యాన్ని నిలబెట్టాల్సిన పత్రికలు, ఛానళ్లు

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అరాచకాలకు, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు శాశ్వతంగా చరమగీతం పాడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తుంటే, ప్రతిపక్ష వైసీపీ మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తోందని ఆయన మండిపడ్డారు. సోమవారం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండిలో నిర్వహించిన భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు.భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంప్రతి నెల 9వ తేదీన భూ సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించి, నేరుగా ప్రజల వద్దకే వచ్చి పట్టాలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఇప్పటివరకు 7,450 గ్రామాల్లో 32 లక్షల మందికి పైగా రైతులకు అత్యాధునిక భద్రతా ఫీచర్లతో, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వం తమకు ఇష్టం లేని వారి భూములను 22-ఏ జాబితాలో చేర్చి, వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 41 వేల ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి చేసి 25 వేల మంది రైతులకు న్యాయం చేసిందని తెలిపారు. కైకలూరులోనే సుమారు 2,838 ఎకరాలను 1,848 మంది రైతులకు అప్పగించామని చెప్పారు. "మీ భూమిపై మీకే హక్కు ఉండాలి. వేరేవాళ్ల పెత్తనం గానీ, వారి ఫొటోలు గానీ ఉండటానికి వీల్లేదు. ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను నిద్రపోను," అని చంద్రబాబు స్పష్టం

ముఖ్యమంత్రి విజయ్ తమిళనాడు శాసనసభలో ఓ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే అధికారిక కార్యక్రమాల ప్రారంభంలోనే విధిగా తమిళ్ తాయ్ వాళ్తు (తమిళ తల్లికి వందనం) గీతాన్ని ఆలపించడానికి ఉద్దేశించిన తీర్మానం ఇది. ఈ మధ్యకాలంలో రాష్ట్ర గీతాలాపన ప్రొటోకాల్ చుట్టూ చోటు చేసుకుంటోన్న వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు విజయ్ స్వయంగా ఈ ప్రతిపాదనను సభ ముందుకు తెచ్చారు.టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతోందనే విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. టీవీకే ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో వందేమాతరం గీతానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి దీనికి కారణమైంది. తమిళ తాయ్ వాళ్తును ఏకంగా మూడో స్థానానికి పరిమితం చేయడం.. దీనికి ఆజ్యం పోసింది. మంత్రుల ప్రమాణ స్వీకార వేడుకల్లో కూడా ఇదే విధానం పునరావృతం కావడంతో ప్రతిపక్షాల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.ఇటీవల మనోన్మణీయం సుందరనార్ యూనివర్శిటీ ఉత్సవాల్లో కూడా రాష్ట్ర గీతాన్ని మూడో స్థానంలో ఆలపించడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ గీతాన్ని పక్కనబెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే తాము ఇలా చేయాల్సి వచ్చిందంటూ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు అప్పట్లో. ఇది దుమారం రేపింది.100 రోజుల పాలన నాడు సీఎం విజయ్ బిగ్ ప్లాన్: ట్రెండ్ సెట్ ఈ నేపథ్యంలో.. విజయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగంగా మాట్లాడారు. తమిళం అనేది ఓ భాష మాత్రమే కాదని, అది తమ రాష్ట్ర అస్తిత్వానికి, ఊపిరికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రాంతీయ భాష తమిళం అని, తమ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనదని గుర్తు చేశారు. తమిళం అంటే ప్రేమ, తమిళం అంటే పవర్, తమిళం

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా సెంట్రల్ బలూచిస్థాన్‌లోని సురబ్ జిల్లాలో అధికారులు కర్ఫ్యూ విధించారు.అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు సురబ్ జిల్లాలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు. భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే తలెత్తే పరిణామాలకు సంబంధిత వ్యక్తులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఇదే సమయంలో, పొరుగున ఉన్న ఖుజ్దార్ జిల్లాలోనూ కఠిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మార్కెట్లు, దుకాణాలు, హోటళ్లు సహా అన్ని వాణిజ్య సముదాయాలను మూసివేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది.గత నెలలో సురబ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల కూలీ సయీద్ అహ్మద్‌ను ఐఎస్ఐ, ఫ్రాంటియర్ కార్ప్స్ సిబ్బంది బలవంతంగా తీసుకెళ్లారని బలూచ్ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే, ఆగస్టు 4న ఖుజ్దార్లో ఇనాయతుల్లా జట్టక్ అనే పౌరుడిని దుండగులు కాల్చి చంపారు. స్థానిక డెత్ స్క్వాడ్ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఆయన కుమార్తె బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే ఈ హత్య జరగడం గమనార్హం. ఈ వరుస పరిణామాల నేపథ్యంలోనే అధికారులు తాజా ఆంక్షలు విధించారని బలూచ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ..రేవంత్ రెడ్డి ప్రకృతిని దైవంగా, అడవిని తల్లిగా, తమ సంస్కృతి సంప్రదాయాలను తరతరాలుగా కాపాడుకుంటున్న ఆదివాసీ సోదర సోదరీమణులకు “ప్రపంచ ఆదివాసీ దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రపంచ నాగరికతకు మూలం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం – ఆదివాసీ సంస్కృతి. తరతరాలుగా ప్రకృతి పరిరక్షణను తమ జీవన విధానంగా మలుచుకున్న ఆదివాసీ సమాజాల జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, సమిష్టి జీవన విధానం, సాంస్కృతిక పరిరక్షణ… యావత్ మానవాళికి మార్గదర్శకం. వారి హక్కులను, అస్తిత్వాన్ని, సంస్కృతిని గౌరవిస్తూ… వారి సంక్షేమం, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం మనమంతా కలిసి నిలబడాలి.” అని పేర్కొన్నారు