
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

నేపాల్‌ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి ఆ దేశంలోని జల విద్యుత్ రంగం తీవ్రంగా దెబ్బతింది. చైనా సరిహద్దుకు సుమారు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్చీ ప్రాంతంలోని 'జెహ్రే' పవర్ సబ్‌స్టేషన్ పూర్తిగా నీట మునిగి బురదలో కూరుకుపోయింది.త్రిశూలి నదికి ఆనుకొని ఉన్న ఈ విద్యుత్ కేంద్రం మొత్తం బురదమయమైంది. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర యంత్ర పరికరాలు ధ్వంసమై బురదలో కూరుకుపోయాయి. ప్రస్తుతం నేపాల్ సైనిక దళాల సహాయక చర్యల్లో నిమగ్నమై, బురదలో కూరుకుపోయిన యంత్రాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నాయి.నదీ తీరం వెంబడి ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ తీగలు వరద ఉద్ధృతికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వరద సంభవించిన సమయంలో విధుల్లో ఉన్న రమేశ్ అనే ఎలక్ట్రీషియన్ ఆ భయానక పరిస్థితులను వివరించారు. "ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోందన్న హెచ్చరికలతో ప్రాణాలు కాపాడుకోవడానికి కొండపైకి పరుగులు తీశాం. చూస్తుండగానే నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి, సబ్‌స్టేషన్‌ను పూర్తిగా ముంచేసింది" అని ఆయన తెలిపారు. స్టేషన్ గోడలపై పైకప్పు వరకు కనిపిస్తున్న నీటి మరకలు వరద బీభత్సాన్ని చాటిచెబుతున్నాయి.ఈ విపత్తు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వివిధ జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మంది కార్మికులు, ఉద్యోగుల ఆచూకీ ఆగస్టు 26 నుంచి లభించడం లేదు. వీరిలో అధిక శాతం మంది సొరంగాల్లో చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యల్లో నేపాల్

చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్ కాలనీ, గ్రీన్‌పార్క్, అశోక్ కాలనీ, రామ్దాస్నగర్ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్, నయాక్రాంతినగర్, త్యాగరాయనగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్ పరిధిలోని జనప్రియ టౌన్‌షి్‌ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్‌పురి సెక్షన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 02: మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆర్థిక సాయం, ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 13 మందికి రూ. 60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లను సద్వినియోగం చేసుకొని మహిళలు, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ముస్లింల హజ్ ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 7 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. పాతబస్తీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కమ్యూనిటీ పెద్దలు యువతకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. చేపలు పట్టడం నేర్పించినట్లుగా యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించి వారికి తమకు తాముగా, ఇతరులకు అండగా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నిధుల డిమాండ్ల విషయమై స్పందిస్తూ.. తాను టెస్ట్ ప్లేయర్ లాంటివాడినని, పదవిలో ఉన్నంతకాలం ప్రజల సంక్షేమం కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తానని తేల్చిచెప్పారు. టీజీఎంఎఫ్‌సీ (TGMFC) చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ఎప్పటికీ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకమైన శైలిలో చూపించగా, ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓజీ యూనివర్స్‌ను మరింత విస్తరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ వీడియోలో దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో ఓజీ యూనివర్స్‌కు సంబంధించిన క్రియేటివ్ చర్చ జరుపుతున్నట్లు చూపించారు. ఓజీ సినిమాల భవిష్యత్తు ఎలా ఉండబోతుందనే అంశంపై ఈ ముగ్గురు చర్చించిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఓజీ సీక్వెల్‌కు సంబంధించిన ఆలోచనలపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీ సీక్వెల్ కథ భారతదేశంలో సాగుతుందని, అయితే ఆగ్నేయాసియా భావోద్వేగాలు, పాశ్చాత్య తరహా ప్రదర్శనతో ఈ చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని తమన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఓజీ యూనివర్స్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సుభాష్ చంద్రబోస్ అంశాన్ని ఇందులో చేర్చితే కథకు ఎంతో అవకాశాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఆలోచనకు సంబంధించిన అవకాశాలపై చర్చించిన అనంతరం మనం మన బెస్ట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వీడియోలో కనిపించింది. దీంతో ఓజీ యూనివర్స్‌లో భవిష్యత్తులో ఎలాంటి కథలు, పాత్రలు ఉండబోతున్నాయనే అంశంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. వీడియో చివర్లో రాబోయే ఓజీ సినిమాలకు సంబంధించిన కొన్ని యానిమేటెడ్ విజువల్స్‌ను కూడా చూపించారు. ముఖ్యంగా సమురాయ్ కోణానికి సంబంధించిన విజువల్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఓజీ యూనివర్స్‌లో సమురాయ్ అంశం కూడా భాగం కానుందనే సంకేతాలను ఈ విజువల్స్ ద్వారా ఇచ్చారు. మరోసారి పవర్ స్టార్‌పై తన అభిమానాన్ని తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ద్వారా ప్రదర్శించారు

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు

Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరిది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. సినీ అభిమానులకు 'పవర్ స్టార్' గా... రాజకీయ అభిమానులకు 'జనసేనాని' గా.. ఆడబిడ్డలకు 'పవనన్న' గా... మరికొందరికి 'కల్యాణ్ బాబు'గా సుపరిచితమే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యధికమంది అభిమానులకు కలిగిన హీరో పవన్ కల్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. పొలిటికల్ గా కూడా ఆయన ఎంత స్ట్రాంగో గత ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పలితమే తెలియజేసింది. మొత్తంగా పవన్ కల్యాణ్ అంటే ఓ పేరు కాదు ఓ బ్రాండ్ గా మారిపోయింది. ఈ పేరు వినిపిస్తే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి... అభిమానం కట్టలుతెంచుకుంటుంది. చాలామంది తమ పిల్లలకు పవన్ కల్యాణ్ అని పేరు పెట్టుకుంటున్నారంటేనే ఈ పేరులో మ్యాజిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అయితే నిజానికి పవన్ కల్యాణ్ అసలుపేరు ఇది కాదట.. తల్లిదండ్రులు వేరే పేరు పెట్టారట. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అసలు పేరు ఏంటి? పవన్ కల్యాణ్ గా ఎలా మారారు? వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. సెప్టెంబర్ 2, 1971 లో ఆంధ్ర ప్రదేశ్ లోని బాపట్లలో పవన్ కల్యాణ్ జన్మించారు. ఆయన తండ్రి కొణిదెల వెంకటరావు, తల్లి అంజనా దేవి... వీరికి చివరి సంతానంగా పుట్టారు. తమ బిడ్డకు ఈ దంపతులు కల్యాణ్ కుమార్ అని పేరు పెట్టారు. తండ్రి వెంకటరావు ఎక్సైజ్ పోలీస్ కావడంతో కొణిదెల ఫ్యామిలీ అనేక ప్రాంతాలు తిరగాల్సి వచ్చింది. ఇలా బాపట్లలో పుట్టిన కల్యాణ్ కుమార్ నెల్లూరులో విద్యాబ్యాసం చేశారు. తర్వాత అన్న చిరంజీవితో కలిసి చెన్నైలో ఉన్నారు... ఇక్కడే ఉన్నత విద్యాబ్యాసం చేశారు. సినిమా ఇండస్ట్రి చెన్నై నుండి హైదరాబాద్ కు మారినతర్వాత అన్నతోపాటే పవన్ కూడా

పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు, జనసేన శ్రేణులు పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం (AP Deputy CM)కు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ బర్త్‌డే అంటే అందరి కళ్లూ ఎదురుచూసేది ఒక్కరి ట్వీట్ కోసమే.. ఆయనే ప్రముఖ నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ (Bandla Ganesh)! గతంలో పవన్ కళ్యాణ్ మూవీ ఆడియో ఫంక్షన్లలో బండ్లన్న ఇచ్చిన స్పీచ్‌లు, డైలాగులు ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ పుట్టినరోజు సందర్భంగా బండ్ల గణేష్ పెట్టిన సుదీర్ఘమైన, ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన మార్క్ భక్తిని చాటుకుంటూ బండ్లన్న చేసిన పోస్ట్ చూసి ‘బండ్లన్న మళ్లీ పూనకాలతో పూనకేశ్వరుడిగా మారాడు’ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను ఆకాశానికెత్తుతూ బండ్ల గణేష్ రాసిన పదాలు అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘‘ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. మీ పేరు వింటే పూనకం… మీ పేరు వింటే పులకం… మీ రూపం చూస్తే పులకింత… మీ మాట వింటే ధైర్యం… మీ అడుగు పడితే సంచలనం! మీరు కేవలం ఒక హీరో మాత్రమే కాదు… కోట్లాది మందికి ఒక బలమైన భావోద్వేగం. మీరు ఒక స్టార్ కాదు… నడిచే ఒక అద్భుత శక్తి. మీరు ఒక సాధారణ పేరు కాదు… కోట్లాది హృదయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర. మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా పూర్వజన్మ సుకృతం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pawan Kalyan Flop Movies List: ఉస్తాద్ భగత్ సింగ్:‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతేడాది రిలీజైన ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్‌గా నిలిచింది. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా..అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘అజ్ఞాతవాసి’. వీళ్ల కలయికలో వచ్చిన మూడో సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్న నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తొలి ప్రేమ తర్వాత డైరెక్టర్ ఏ.కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై టాప్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జే.సూర్య కాంబినేషన్లో పవన్

Sonu Sood: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్వయంగా నేపాల్‌కు వెళ్లిన ఆయన, బాధితులకు అండగా నిలవడానికి పిలుపునిచ్చారు. అంతేకాదు అందరం కలిసి నేపాల్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సోనూ సూద్ అక్కడి పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను కోల్పోయిన ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించారు. బయట నుంచి చూస్తే విపత్తు తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమని, కానీ దగ్గర నుంచి చూస్తే జరిగిన నష్టం ఎంత భారీగా ఉందో తెలుస్తుందని అన్నారు. అందుకే ఈ సమయంలో నేపాల్ ప్రజలకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు జరిగిన ప్రాంతంలో నీటి ప్రవాహం ఎంత దూరం వరకు చేరిందో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని సోనూ సూద్ తెలిపారు. తాను నిలబడి ఉన్న ప్రాంతం కూడా అప్పట్లో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండొచ్చని అన్నారు. నీరు, శిథిలాలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోని శిథిలాల వద్దకు చేరుకోవాల్సి వచ్చిందని, వారం రోజులు దాటినా ఆ ప్రాంతంలో విధ్వంసపు ఆనవాళ్లు అలాగే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. బాధితులకు ఎలాంటి సహాయం అందించబోతున్నారనే ప్రశ్నకు కూడా సోనూ సూద్ స్పందించారు. తన స్నేహితులు, బృందంలోని సభ్యులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు అత్యవసరంగా ఏం అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమను సంప్రదిస్తున్న

Pawan Kalyan: టాలీవుడ్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనదైన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ప్రేమగా పవర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పవర్‌స్టార్ అనే పేరు ఆయనకు బలమైన గుర్తింపుగా మారింది. పవన్ సినిమా విడుదలైతే అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటేలో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ప్రత్యేకమైన శైలి వెనుక ఈ శిక్షణ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ నేర్పాయని పవన్ గతంలో చెప్పారు. సినిమా రంగంలో స్టార్‌గా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో తనదైన శైలితో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అవసరం లేని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేకత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. సదరు ఫ్యాన్ బేస్ యొక్క ప్రకంపనలు వరల్డ్ వైడ్ గా 'వైఫె' లా తిరుగుతూనే ఉంటాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేపు పవన్ స్టైలిస్ట్ మూవీలో ఒకటైన 'పంజా' 4K వెర్షన్లో భారీ స్థాయిలో రీ రిలీజ్ కాబోతుంది. ఎప్పడు లేని విధంగా ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా ఈ రోజు ప్రీమియర్ ప్రదర్శిస్తుండటం, టికెట్స్ అన్ని అయిపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. పూణేలోని ప్రధాన థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐటీ నిపుణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని థియేటర్లను హౌస్‌ఫుల్ చేస్తుండటంతో మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి రుజువవుతోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి సినిమా కూడా రీ-రిలీజ్ వేళ కొత్త సినిమాను తలపించేలా పూణే నగర వీధుల్లో మారుమోగిపోతుండటం పవర్ స్టార్‌కి ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌కి సజీవ నిదర్శనం తెలుగు స్టేట్స్ లాగానే రీ రిలీజ్ ఈ స్థాయిలో వేడుకలా మారడం కూడా నిజంగానే ఒక అరుదైన విషయం. మరి ఈ నేపథ్యంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. 2011 డిసెంబర్ 9న కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ మేకింగ్‌లో 33 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ లుక్‌తో అభిమానులను అలరించింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, దాదాపు 40 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లోనే 15.86 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్లు, ఓవర్సీస్లో 1.75

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా వెనుకబడ్డారంటూ 'ఎంపవర్డ్ ఇండియన్' సంస్థ విడుదల చేసిన నివేదిక సత్యదూరమని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను ఆయన గణాంకాలతో సహా మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తన నియోజకవర్గానికి రూ. 17.50 కోట్లు కేటాయించగా, అందులో ఏకంగా 94.1 శాతం నిధులకు (రూ. 16.47 కోట్లు) సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాళ్లు, బోర్‌వెల్స్, సీసీ రోడ్ల వంటి ప్రజావసరాల కోసం గత మూడేళ్లలో 627 ప్రతిపాదనలను కలెక్టర్లకు పంపగా, వాటిలో 82.29 శాతం పనులకు ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. అంతేకాకుండా, గతంలో 16వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బి. వినోద్ కుమార్ ఖర్చు చేయకుండా వదిలేసిన రూ. 2.5 కోట్ల నిధులను కూడా తానే ఉపయోగించినట్లు గుర్తుచేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇచ్చే నిధులు చాలడం లేదని, ప్రతి ఏటా ఎంపీ లాడ్స్ కోటాను పెంచాలని ఎంపీలంతా విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో ఇలాంటి ఏకపక్ష నివేదికలు ఇవ్వడం అన్యాయమని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు నుంచి కలెక్టర్ల ఆమోదం, పనుల అమలు వరకు అనేక దశలు ఉంటాయని... ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ నిధులన్నీ ప్రాసెస్ అయ్యాయని తెలిపారు. ప్రజల విజ్ఞప్తుల కోసం సీఎస్ఆర్ నిధులను కూడా సేకరిస్తున్నామని పేర్కొన్న ఆయన, ఇకనైనా వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని సదరు సంస్థకు హితవు పలికారు

ఏపీలో మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త' అనే నినాదాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మహిళలు తక్కువ పెట్టుబడితో గౌరవప్రదమైన ఆదాయం సంపాదించేందుకు 'చాయ్ రాస్తా' పేరుతో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. డీఆర్డీఏ-సెర్ప్ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు కానుండగా, తొలి దశలో అనంతపురం జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది.ఏమిటీ 'చాయ్ రాస్తా' పథకం?రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం డీఆర్డీఏ-సెర్ప్, 'చాయ్ రాస్తా' అనే బ్రాండ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం కింద ఎంపికైన మహిళలకు ఫ్రాంచైజ్ పద్ధతిలో ఆధునిక టీ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు. కేవలం టీ, కాఫీ అమ్మడమే కాకుండా బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ వంటి ఇతర చిరుతిళ్లను కూడా విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వారికి వ్యాపారం కోసం అవసరమైన కంటైనర్, ప్రాథమిక సరుకులు, ఇతర సామగ్రిని అందిస్తారు. అంతేగాక వ్యాపారానికి అత్యంత కీలకమైన లొకేషన్ సర్వే, అవసరమైన లైసెన్సులు, డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణలో శిక్షణ వంటి అన్ని విషయాల్లోనూ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది.ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతచాయ్ రాస్తా ఏర్పాటుకు ఆసక్తి చూపే మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. డీఆర్డీఏ ద్వారా స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు లింకేజీ వంటి పథకాల కింద

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్ డివిజన్ పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని సీబీడీ ఏడీఈ జి.నాగేశ్వరరావు తెలిపారు. ఇందిరానగర్, నల్లకుంట 11 కేవీ విద్యుత్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు, నారాయణగూడ, ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో 11.30 నుంచి 12.30 గంటల వరకు, రాఘవేంద్రస్వామి పరిధిలో 12 నుంచి 12.30 గంటల వరకు, కమలానగర్ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి 3.45 గంటలవరకు విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. సైదాబాద్: టీజీఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా ఉండదని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. అలాగే 11కేవీ ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్.. లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, దోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో 2 నుంచి 3 గంటల వరకు కరెంట్ ఉండదని పేర్కొన్నారు. సాదత్‌నగర్ ఫీడర్.. పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ఏఎస్రావు నగర్: చర్లపల్లి సాయినగర్ ఫీడర్లో సాంకేతిక మరమ్మతుల కారణంగా శనివారం ఆ ఫీడర్ పరిధిలోని ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు ఎంఆర్ఆర్ కాలనీ, కృష్ణారెడ్డినగర్, సుభా్‌షనగర్, రెడ్డికాలనీ, సాయినగర్, ఎన్ఎన్ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో కొత విధిస్తున్నట్లు ఏఈ టి.బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి తమతో సహకరించాలని ఆయన కోరారు. కాప్రా: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా ఆర్టీసీ కాలనీ ఫీడర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, జెడ్టీఎస్ తిరుమలనగర్, హనుమాన్‌నగర్, డాక్టర్ కృష్ణానగర్

ఈ సారి తెలుగు నేలను వరుణ దేవుడు కరుణించకపోయినా.. కృష్ణమ్మ మాత్రం అన్నదాతకు అండగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎగువను కురిసిన వర్షాలతో శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి రాక స్థిరంగా కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం 44,720 క్యూసెక్కుల ఇన్ ఫ్లో శ్రీశైల జలాశయానికి వచ్చి చేరుతోంది. దీనికి అనుగుణంగా డ్యామ్ అధికారులు దిగువ ప్రాంతాలకు 35,315 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో రూపంలో విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని బట్టి నీటి నిల్వ పరిమాణాన్ని, ఇన్ ఫ్లో వివరాలను జలవనరుల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 875.80 అడుగులకు చేరుకుంది. అదేవిధంగా, ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 167.4860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాబోయే గంటల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పోటెత్తుతున్న కృష్ణమ్మ- శ్రీశైలం డ్యామ్ కు వరద ప్రవాహం, గేట్లు ఎత్తివేత..!!ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి.. కుడి గట్టున తాత్కాలిక విరామంవరద నీటి రాక నేపథ్యంలో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. అయితే సాంకేతిక, పరిపాలనా కారణాల వల్ల కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితిని సరిచేసి త్వరలోనే అక్కడ కూడా ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు.అక్కడ అన్ని గేట్లు ఎత్తివేత- శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లుఅధికారులు అప్రమత్తంరాబోయే సమయంలో ఎగువ నుంచి ప్రవాహాలు మరింత పుంజుకునే సూచనలు ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. డ్యామ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, దిగువ ప్రాంత

Poco X8 Power Series Leaks: త్వరలోనే మార్కెట్లోకి పోకో X8 ప్రో పవర్ సిరీస్ మోడల్స్ విడుదల కాబోతున్నాయి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Poco X8 Power Series Leaks: మార్కెట్లోకి పోకో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదల చేసిన మంచి స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ కంపెనీ కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే పోకో నుంచి X సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ పోకో ఎక్స్8 పవర్ సిరీస్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్‌లో భాగంగా రెండు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో పోకో ఎక్స్ 8 పవర్ ప్రో 5Gతో పాటు పోకో ఎక్స్8 పవర్ ప్రో మాక్స్ 5G వంటి మోడల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఇందులో భాగంగా హై ఎండ్ మోడల్ మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. పోకో ఎక్స్8 పవర్ మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. టిప్‌స్టర్ సంజు చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.83-అంగుళాల 1.5K డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది AMOLED ప్యానెల్‌ను కలిగి రాబోతోంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇక ఈ పోకో ఎక్స్8 పవర్ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇది క్వాల్కామ్

పెద్ద సభలు.. భారీ ప్రసంగాలు.. రాజకీయ నినాదాలు. ఇలాంటి సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు యువతతో నేరుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జనరేషన్-జెడ్ (జెన్-జీ), యువతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారితో ముఖాముఖి చర్చిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ అదే తరహా సంభాషణకు ప్రాధాన్యం ఇస్తున్నారు.విద్యార్థుల సమస్యల నుంచి..యువతను చేరుకునే ఈ ప్రయత్నం ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంతో మరింత ఊపందుకుంది. పోటీ పరీక్షల ఒత్తిడి, పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో జాప్యం వంటి సమస్యలపై ఇందులో చర్చలు జరిగాయి. కోటా, డెహ్రాడూన్, ప్రయాగ్‌రాజ్ వంటి కేంద్రాల్లో మొదలైన ఈ కార్యక్రమం క్రమంగా విస్తరించింది.యువతులపై ప్రత్యేక దృష్టిఇటీవల పూణెలో జరిగిన కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ యువతుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కెరీర్లో ఎదురయ్యే అడ్డంకులు, భద్రత, ఉద్యోగ ప్రదేశాల్లో పరిస్థితులు, కుటుంబం, సమాజం విధించే ఆంక్షలపై వారితో మాట్లాడారు.సమాజం తమను ఎలా చూస్తోంది? భయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు? ఎలాంటి హింసను ఎదుర్కొంటున్నారు? అది ఎక్కడ జరుగుతోంది? వంటి అంశాలపై యువతులు తమ అనుభవాలను పంచుకోవాలని రాహుల్ కోరారు.వ్యక్తిగత అనుభవాలే చర్చకు బాటమహిళా సహచరులు పంచుకున్న వ్యక్తిగత అనుభవాలను కూడా రాహుల్ గాంధీ చర్చకు తీసుకొచ్చారు. శ్రద్ధ పేరుతో నియంత్రణ, చిన్న వయసులో పెళ్లి, పితృస్వామ్య భావజాలం, నైతిక పోలిసింగ్, భద్రత, వైద్య సదుపాయాల కొరత, వ్యక్తిగత నిర్ణయాలపై ఆంక్షల వంటి అంశాలు చర్చకు వచ్చాయి.సోషల్ మీడియాలో కొత్త పంథాడిజిటల్ వేదికల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నలు-సమాధానాలు, రీల్స్ వంటి సులభమైన ఫార్మాట్లతో యువతను

కీవ్: ఉక్రెయిన్‌లోని కీవ్‌పై గురువారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 12 ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. ఈ దాడులతో కీవ్‌లోని పలు చోట్ల మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 90,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని అంతటా రాత్రంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. దాడుల కారణంగా గిడ్డంగులు, పాఠశాల, చిన్నారుల వైద్యశాల దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భవనాల నుంచి సహాయక సిబ్బంది ప్రజలను తప్పిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం విడుదల చేసింది. డ్రోన్ విడిభాగాలను ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఒక సైనిక స్థావరం, ఒక లాజిస్టిక్స్ హబ్‌ను లక్ష్యంగా చేసుకుని కీవ్ సహా చుట్టుపక్కల ప్రాంతంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు) విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్లో విపరీతమైన రద్దీ (ఫొటోలు) రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది? ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.. రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్రాన్స్ కో అధికారులు తెలిపారు. చిక్కడపల్లి(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో విద్యుత్ ఫీడర్ల మరమ్మతు పనులు నిమిత్తం గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు సీబీడీ ఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. గోల్కొండ క్రాస్‌రోడ్ 11కేవీ విద్యుత్ ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, తాళ్లబస్తీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, పోస్టాఫీస్ పరిధిలో మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈలు కోరారు. కేపీహెచ్‌బీ కాలనీ: టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో జలమండలి పనుల నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కేపీహెచ్‌బీ లోధా అపార్ట్మెంట్స్, ఇందూ అపార్ట్మెంట్స్, బీఎస్ఎన్ఎల్ క్వార్టర్స్, ఫిష్ మార్కెట్, ఎన్ఎస్ఎల్ మాల్, డీమార్ట్ ఏరియా, ఐదోఫేజ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు

Singareni: దేశ ఇంధన భద్రతకు బొగ్గుతో పాటు పునరుత్పాదక విద్యుత్ లో కూడా సింగరేణి కృషి సింగరేణి: రాష్ట్ర దేశ ఇంధన భద్రతకు సింగరేణి సంస్థ తగినంత బొగ్గును అందించడంతో పాటు పునరుత్పాతక విద్యుత్తు రంగంలో కూడా తన వంతు కృషి చేస్తుందని సింగరేణి సంస్థ ఛైర్మన్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్ పో కార్యక్రమంలో భాగంగా బుధవారం జరిగిన భారత ఇంధన భద్రత విద్యుత్ ఉత్పత్తి అనే గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ దశాబ్దాల కాలంగా దేశ ఇంధన అవసరాలకు తనవంతుగా బొగ్గు అందిస్తూ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికి రాష్ట్ర జెన్ కో మరియు ట్రాన్స్ కో కలిసి సమష్టిగా కృషి చేస్తుందన్నారు. సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ మరియు క్రిటికల్ మినరల్ రంగంలోకి కూడా ప్రవేశించిందని, అయినప్పటికీ దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తికి మరో నాలుగు దశాబ్దాల పాటు డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు. కనుక సింగరేణి సంస్థ రానున్న కాలంలో బొగ్గు ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తుందని అలాగే పునరుత్పాతక ఇంధన రంగంలో కూడా తన వంతు బాధ్యత నిర్వహిస్తుందని తెలిపారు. ఈ చర్చ గోష్టికి ప్రొఫెసర్ పవన్ కుమార్ పరనంది సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ ఎనర్జీ సమ్మిట్ కు తెలంగాణ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్ హాజరుకాగా... ప్యానెల్ డిస్కషన్ లో సింగరేణి ఛైర్మన్ తో పాటు తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఎస్. హరీష్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన నిగం లిమిటెడ్ సీఎండీ శ్రీ దేవేంద్ర శృంగి, ఎన్టీపీసీ సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్
Yes Essence: దేశీయ ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సరైన ఆర్థిక పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా ప్రత్యేకమైన క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది యెస్ బ్యాంక్. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన ఈ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేకంగా వారి జీవనశైలికి తగినట్లుగా, విలువైన రివార్డులు, ప్రత్యేక సౌకర్యాలను అందించేలా యెస్ ఎసెన్స్ (Yes Essence) పేరుతో క్రెడిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. నేటితరం ఉద్యోగిణులు, యువ వృత్తి నిపుణులు, డిజిటల్ విధానాలను ఎక్కువగా ఉపయోగించే మహిళల ఆకాంక్షలు, వినియోగ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్డును రూపొందించినట్లు వెల్లడించింది.యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు వెల్కమ్ ఆఫర్లు: యెస్ ఎసెన్స్ క్రెడిట్ కార్డ్ పొందిన వెంటనే ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్, ఫిట్నెస్ బ్రాండ్లపై ప్రత్యేకమైన వెల్కమ్ వోచర్లు లభిస్తాయి. హెల్త్ బెనిఫిట్స్: ప్రతి సంవత్సరం ఉచితంగా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ (క్యాన్సర్ మార్కర్ స్క్రీనింగ్‌తో సహా) లభిస్తుంది. రోజువారీ ఖర్చులపైనా రివార్డులు: డైనింగ్, గ్రోసరీ, షాపింగ్, బ్యూటీ ఉత్పత్తులు, ట్రావెల్ బుకింగ్స్ పై అదనపు రివార్డు పాయింట్లు ఇస్తున్నారు. వినోదం, కాంప్లిమెంటరీ సర్వీసెస్: బై వన్ గెట్ వన్ (Buy One Get One) సినిమా టికెట్లు, ప్రముఖ మాల్స్‌లోని ఎంపిక చేసిన అవుట్ లెట్లలో కాంప్లిమెంటరీ కాఫీ సౌకర్యం లభిస్తాయి. బర్త్ డే స్పెషల్స్: పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక గిఫ్ట్ వోచర్ లభిస్తుంది. మైల్ స్టోన్ బోనస్: నిర్ణీత టార్గెట్ ఖర్చులపై ప్రతి సంవత్సరం 10 వేల వరకు యెస్ రివార్డ్స్ (YES Rewardz) పాయింట్లు పొందే అవకాశం ఉంది.'యెస్ బ్యాంకులో మా వినియోగదారుల మారుతున్న ఆశయాలను అర్థం చేసుకోవడంలోనే అర్థవంతమైన ఆవిష్కరణలు మొదలవుతాయని మేము నమ్ముతాము. ఆర్థిక వృద్ధి, సంపద సృష్టిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్న కొద్దీ వారికి తగిన ప్రత్యేక ఆర్థిక పరిష్కారాల అవసరం కూడా పెరుగుతోంది

Nirmal: కొండపేటలో రైతులతో అడిషనల్ కలెక్టర్ ప్రత్యేక అవగాహన సదస్సు! ఈ వార్తకు సంబంధించిన

పాకిస్థాన్ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులకు అక్కడి సైనిక నాయకత్వం సిద్ధమవుతున్నట్టు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో ప్రస్తుత పార్లమెంటరీ వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహా పాలనను తీసుకురావడంతో పాటు పాలనాపరమైన నిర్ణయాల్లో సైన్యానికి అధికారికంగా కీలకపాత్ర కల్పించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు అత్యంత సన్నిహిత వర్గాలు ఈ మేరకు పది సంవత్సరాల జాతీయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయని కథనాలు వస్తున్నాయి.ఈ ప్రతిపాదిత ప్రణాళిక కేవలం ఆర్థిక సంస్కరణలకే పరిమితం కాకుండా దేశ పాలనా స్వరూపాన్నే మార్చేలా ఉంది. ఇందులో భాగంగా, కొత్త ప్రావిన్సులు, పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీని సవరించడం వంటి అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా దేశ కీలక నిర్ణయాల్లో సైన్యాన్ని 'సమాన వాటాదారుగా' మార్చాలనేది ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ రాజకీయాలు, విదేశాంగ విధానంలో సైన్యం ప్రభావం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, ఈసారి రాజ్యాంగబద్ధంగానే ఆ పాత్రను శాశ్వతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.అధ్యక్ష తరహా పాలన కోసం తుర్కియే, ఈజిప్ట్ దేశాల నమూనాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వ్యవస్థ ద్వారా నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చని, విధానపరమైన స్థిరత్వం సాధ్యమవుతుందని సైనిక నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక విదేశీ అధినేతలతో నేరుగా చర్చలు జరపడానికి అధ్యక్ష పాలన మరింత అనుకూలంగా ఉంటుందని వారు వాదిస్తున్నారు. అయితే, ఈ మార్పులు చేయాలంటే రాజ్యాంగంలో భారీ సవరణలు అవసరం. దీనికి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర

ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే మహిళలు వివిధ రంగాల్లో పురోగతి సాధిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి కీలక నిర్ణయాలను చాలామంది సొంతంగానే తీసుకుంటున్నారు. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధిస్తున్నారు. కానీ అదే సమయంలో ఇంటి బాధ్యతల విషయంలో మాత్రం మహిళల పాత్ర మారడం లేదు. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి వస్తే.. ఇక్కడ మరో షిఫ్ట్‌లో ఉద్యోగం మొదలవుతుంటుంది. డిన్నర్‌కి ఏం చేయాలి? పిల్లలు హోంవర్క్ చేశారా? సరుకులు ఏం కొనాలి?.. వంటి పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటి ఫలితంగా ఆధునిక మహిళ సాధికారత సాధించినా పనిభారంతో తీవ్రంగా అలసిపోతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలుగా మనం అలసిపోకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘టైమ్ యూజ్ సర్వే’ ఫలితాల ప్రకారం మహిళలు సగటున రోజుకి 4.81 గంటల సమయాన్ని ఇంటి పనులకు కేటాయిస్తున్నారట. అదే సమయంలో మగవారు మాత్రం కేవలం 1.46 గంటలే అందుకు వెచ్చిస్తున్నారట. కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకోవడానికి స్త్రీలు 2.28 గంటల సమయం కేటాయిస్తే.. పురుషులు మాత్రం 1.25 గంటల సమయాన్ని మాత్రమే వెచ్చిస్తున్నారట. ఈ సమయమంతా ఆఫీసు పనిగంటలకు అదనంగా ఉండడంతో వారు మానసికంగా, శారీరకంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఫలితంగా ఉద్యోగం చేసినంత మాత్రాన మహిళలకు పూర్తి స్వేచ్ఛ లభించడం లేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్నేళ్ల పాటు మహిళలను కేవలం ఇంటి పనులకే పరిమితం చేసేవారు. కాలక్రమేణా అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. తద్వారా ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారు. అయితే చాలా కుటుంబాల్లో గతం తాలూకు సంప్రదాయాలు

జలాశయంలో ప్రస్తుతం 169 టీఎంసీలే 40 వేలకుపైగా క్యూసెక్కులతో తెలంగాణ విద్యుదుత్పాదన ఏపీ వాడుకున్నది 9,718 క్యూసెక్కులు సాగర్‌కు 50,673 క్యూసెక్కులు విడుదల శ్రీశైలం/విజయపురి సౌత్/అచ్చంపేట, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తరిగిపోతున్నాయి. డ్యాం నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఎగువ నుంచి వచ్చిన వరదతో వా రం క్రితం 879.50 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 876.20 అడుగులకు తగ్గింది. డ్యాం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 169 టీఎంసీలే ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కుడి, ఎడమగట్టు విద్యుత్కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. ఏపీ కుడిగట్టున 9,718 క్యూసెక్కుల నీటిని వినియోగించగా, ఎడమ గట్టున తెలంగాణ 40,955 క్యూసెక్కులు వాడింది. సోమవారం మొత్తంగా 50,673 క్యూసెక్కులను దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశా రు. ఎగువన ఆలమట్టి, నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం బాగా తగ్గిపోయింది. ఆలమట్టి నుంచి 23,325 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా.. నారాయణపూర్ నుంచి 20,783 క్యూసెక్కులు జూరాలకు వస్తోంది. జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి ద్వారా 37,313 క్యూసెక్కులను శ్రీశైలం రిజర్వాయర్‌కు విడుదల చేశారు. తుంగభద్రకు 16,923 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 7880 క్యూసెక్కులు వదులుతున్నారు. వార్తలు కూడా చదవండి... నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ Read Latest AP News And Telangana News And National News And Telugu News

దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్, ఆగస్టు 17: దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈరోజు(సోమవారం) జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వెయ్యి పరిశ్రమలు ఉన్నాయని.. స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం ఉందని అన్నారు. జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యజమానులు కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది అని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో, దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందన్నారు. టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. స్థానిక పరిశ్రమలకు కూడా ఉద్యోగులను, స్కిల్డ్ లేబర్‌ను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు కేవలం సాఫ్ట్వేర్ పైనే దృష్టి సారించకుండా... ఇంకా చాలా రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. సింగరేణి ప్రాంతం మందమర్రిలో జర్మన్ నేర్పిస్తున్నామని.. వారిలో బీ2 లెవల్ వచ్చిందన్నారు. వారి కోసం రూ.25 లక్షల జీతం ఎదురుచూస్తోందని తెలిపారు. వీసా ఖర్చులను కూడా సగం వరకూ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. విదేశాలకు వెళ్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

ప్రతి నెలా క్రమం తప్పకుండా చేసే చిన్న పొదుపు, దీర్ఘకాలంలో ఎంత పెద్ద సంపదను సృష్టిస్తుందో చాలామందికి అవగాహన ఉండదు. క్రమానుగత పెట్టుబడి విధానం (SIP)లో ఉన్న అద్భుతమైన శక్తి 'కాంపౌండింగ్'. దీనినే చక్రవడ్డీ ప్రభావం అని కూడా అంటారు. పెట్టుబడి ప్రయాణం ప్రారంభంలో నెమ్మదిగా కనిపించినా, కాలం గడిచేకొద్దీ సంపద సృష్టిలో దీని వేగం చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.ఫండ్స్ఇండియా రీసెర్చ్ అందించిన ఒక నివేదిక ప్రకారం, ఒక వ్యక్తి నెలకు రూ.70,000 చొప్పున ఒక SIPలో పెట్టుబడి పెడుతూ, దానికి వార్షికంగా సగటున 12 శాతం రాబడి వస్తుందని అనుకుందాం. ఈ లెక్కన అతని పోర్ట్‌ఫోలియో విలువ రూ.11 కోట్లకు చేరడానికి సుమారు 23 సంవత్సరాల 8 నెలల సమయం పడుతుంది. అయితే ఈ ప్రయాణంలో అసలు మ్యాజిక్ చివర్లోనే ఉంటుంది.మొదట్లో నెమ్మదిగా... ఆ తర్వాత వేగంగాఈ ఉదాహరణను విశ్లేషిస్తే, సంపద సృష్టిలో కాంపౌండింగ్ పాత్ర స్పష్టంగా అర్థమవుతుంది.మొదటి రూ.1.1 కోట్లు సమకూరడానికి దాదాపు 8 ఏళ్లు పట్టింది. ఈ మొత్తంలో 60 శాతం పెట్టుబడిదారుడి సొంత డబ్బే కాగా, 40 శాతం మాత్రమే రాబడి ద్వారా వచ్చింది.కానీ, పోర్ట్‌ఫోలియో విలువ రూ.9.9 కోట్ల నుంచి రూ.11 కోట్లకు చేరడానికి (అంటే చివరి రూ.1.1 కోట్లకు) కేవలం 10 నెలల సమయం మాత్రమే పట్టింది. ఈ పెరుగుదలలో 94 శాతం కేవలం రాబడి నుంచే రావడం విశేషం. పెట్టుబడిదారుడి సొంత డబ్బు కేవలం 6 శాతం మాత్రమే.దీనిని

చేనేత కార్మికులకు శుభవార్త. చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్రపరిశ్రమలోని అనుబంధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఒక ముఖ్యమైన బీమా పథకం అందిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. చేనేత, జౌళి శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం నేతన్న భద్రత పథకంలో చేరే కార్మికులు ఈ బీమా పొందే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా కార్మికుల కుటుంబాలకు ఆకస్మిక మరణాలు సంభవించినప్పుడు ఆర్థిక భద్రత కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.వీరికి ఈ బీమా పథకంలో అవకాశంచేనేత మగ్గాలు నడిపే కార్మికులు, పవర్‌లూమ్స్ నడిపే వారు ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా వస్త్రపరిశ్రమకు సంబంధించిన అనుబంధ రంగాల్లో పనిచేసే వారు కూడా ఇందులో చేరవచ్చని చేనేత మరియు జౌళి శాఖ పేర్కొంది. డయింగ్, డిజైనింగ్, వార్ఫింగ్, వైండింగ్, సైజింగ్, వైపింగ్, రోలింగ్ (గమ్మింగ్), డ్రాయింగ్, బ్లీచింగ్ వంటి పనులు చేసే కార్మికులు కూడా ఈ బీమా పథకంలో చేరే అవకాశం ఉంది.కార్మిక కుటుంబానికి రూ.5 లక్షల బీమాఈ రంగాలన్నీ చేనేత, వస్త్రపరిశ్రమకు అనుబంధంగా ఉండి, వేలాది మంది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్నాయి. ఈ పథకంలో చేరిన కార్మికులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రీమియం పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. ఏ కారణం చేతనైనా కార్మికుడు మరణిస్తే, అతని కుటుంబానికి రూ.5 లక్షల బీమా సదుపాయం అందుతుంది. ఇది ఆకస్మిక మరణాల్లో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, రక్షణ కల్పించే ముఖ్యమైన చర్యగా చెప్పవచ్చు.ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలిచేనేత, జౌళి శాఖ ఈ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అర్హులైన కార్మికులు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత చేనేత, జౌళి శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేయాలని కోరింది. దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు, గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. సమయం మించిపోతే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా

మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. తీసుకున్న ప్రతి రూపాయీ చెల్లిస్తున్నారు.. ‘స్త్రీ శక్తి’ మిగులుతో వ్యాపారాలు చేస్తున్నారు మహిళా సాధికారతకు నాడు డ్వాక్రా తెచ్చాం.. కుటుంబాల అభ్యున్నతికి మార్గం వేశాం పథకాలను సద్వినియోగం చేసుకోండి.. ఆర్థికంగా ఎదగండి రాజకీయ ముసుగులో ఉండే నేరగాళ్లను ఓ కంట కనిపెట్టండి.. సీఎం పిలుపు ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు మహిళలతో కలిసి బస్సు ప్రయాణం.. సీఎం క్యాంపు కార్యాలయంలో మాటామంతి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్న సంతృప్తితో ఆగిపోవద్దు. వాటిని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో మరింతగా రాణించాలి. గంజాయి నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు చొరవ తీసుకోవాలి. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని మహిళలు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతి సృష్టించే వారిని దూరంగా పెట్టే చైతన్యం ప్రతి ఒక్కరిలోనూ రావాలి. అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి) : మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని, బాగా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏడాది కాలంలో రూ.87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. రోజుకు సుమారు 27 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆదా చేసుకున్న డబ్బును కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు మహిళలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతోపాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం కూడా పెరిగాయన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘స్త్రీ శక్తికి సంవత్సరం.. రెట్టింపైన ఆత్మవిశ్వాసం’

చాలామంది మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాక... ఇంటికే పరిమితమవుతారు. కానీ అలా ఆలోచించలేదు విశాఖపట్నానికి చెందిన మాధవి సూరిభట్ల. చాలామంది మహిళలు కుటుంబం, ఉద్యోగ బాధ్యతలు తీరిపోయాక... ఇంటికే పరిమితమవుతారు. కానీ అలా ఆలోచించలేదు విశాఖపట్నానికి చెందిన మాధవి సూరిభట్ల. తనలోని కళా నైపుణ్యానికి పదును పెట్టి, దాన్ని మరో నలుగురికి నేర్పుతూ ... చివరకు అదే కళను సామాజిక సేవకు ముడిపెట్టి... ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నారు. తాజాగా 47 వేలకు పైగా జాతీయ పతాకాల ప్రదర్శనతో గిన్నిస్ రికార్డుని అందుకున్నారు. ఇందుకోసం ‘మహిళా మనోవికాసం’ పేరుతో ఓ ఆన్లైన్ గ్రూపుని నిర్వహిస్తున్నారు. దీనిద్వారా స్త్రీశక్తిని ప్రపంచానికి చాటాలనీ, వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా వాళ్లందరికీ చేతివృత్తులను నేర్పిస్తున్నారు. అలాగని అవి కేవలం అలంకరణ వస్తువులకే పరిమితం కాదు. నిత్య జీవితంలో ఉపయోగపడేలానూ వాటిని తీర్చిదిద్దుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. మాధవి బృందం ఇప్పటికే స్కార్ఫ్ల ప్రదర్శన, శిల్పాలు, క్రిస్మస్ అలంకరణలు, హనుమాన్ చాలీసా పారాయణం, టీచర్స్‌డే కార్యక్రమం వంటివెన్నో చేశారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జెండా ఉండాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు జాతీయ పతాకాల తయారీపై దృష్టి పెట్టారు. అలాగని ప్లాస్టిక్‌వి చేస్తే పర్యావరణ ఇబ్బందులు చాలానే. అందుకే, ఊలుతో జెండాలు అల్లి రికార్డు సాధించాలనుకున్నారామె. ఇందుకోసం కొందరికి అవసరమైన శిక్షణిచ్చారు. అలా 330 మంది మహిళలు... 18 నెలల పాటు 47,617 జాతీయ జెండాలను సిద్ధం చేసి ఈ నెల 7న విశాఖపట్నంలో ప్రదర్శించారు. గిన్నిస్ నిబంధనల ప్రకారం 12.18 కి.మీ. మేర జెండాల ప్రదర్శన నిర్వహించి, గతంలో నెదర్లాండ్స్ బృందం నెలకొల్పిన 11 కి.మీ. రికార్డును అధిగమించారు. దీంతో మాధవికి ఇది వ్యక్తిగతంగా తొమ్మిదో ప్రపంచ రికార్డుగా నిలిచింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ

వర్షపు నీరు చూడటానికి శుభ్రంగా కనిపించినా అందులో దుమ్ము, ధూళి, ఇతర సూక్ష్మ కణాలు ఉండవచ్చు. ఇవి నీటిలో విద్యుత్ ప్రవాహానికి కొంతవరకు మార్గం కల్పించగలవు. విద్యుత్ తీగల జాయింట్లు, మీటర్ బాక్సులు, స్విచ్ బోర్డులు, బయట ఉన్న విద్యుత్ కనెక్షన్లలోకి నీరు చేరితే సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో లీకేజీ కరెంట్, షార్ట్ సర్క్యూట్, ఫ్యూజ్ లేదా బ్రేకర్ ట్రిప్ కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా సరైన ఇన్సులేషన్ లేని లేదా ఎక్కువ కాలం వాడిన తీగల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు. అందుకే తేమ నుంచి విద్యుత్ కనెక్షన్లను రక్షించడం చాలా ముఖ్యం. మన ఇళ్లకు విద్యుత్ చేరడానికి ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది. దూర ప్రాంతాల నుంచి విద్యుత్‌ను తీసుకువచ్చే ట్రాన్స్మిషన్ లైన్లు, నగరాలు, గ్రామాలకు సరఫరా చేసే డిస్ట్రిబ్యూషన్ లైన్లు, భవనాల వైరింగ్, చివరగా ఇంట్లోని విద్యుత్ తీగలు ఇందులో భాగంగా ఉంటాయి. భారీ వర్షం, ఈదురుగాలులు వచ్చినప్పుడు చెట్లు లేదా కొమ్మలు విద్యుత్ తీగలపై పడవచ్చు. పిడుగులు విద్యుత్ నెట్‌వర్క్‌పై ప్రభావం చూపవచ్చు. నేల పూర్తిగా తడిసిపోవడం వల్ల ఎర్తింగ్ వ్యవస్థలో కూడా మార్పులు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సమస్య చిన్నదే అయినా, భద్రత కోసం సంబంధిత లైన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తారు. సమస్యను సరిచేసిన తర్వాత విద్యుత్ సరఫరాను తిరిగి ప్రారంభిస్తారు. వర్షం సమయంలో కరెంట్ పోతే చాలామంది పెద్ద ప్రమాదం జరిగిందని భావిస్తారు. కానీ ప్రతి విద్యుత్ అంతరాయం పెద్ద నష్టం వల్లే జరుగుతుందని చెప్పలేం. విద్యుత్ వ్యవస్థలో భద్రత కోసం ఏర్పాటు చేసిన పరికరాలు ప్రమాదాన్ని గుర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా సరఫరాను నిలిపివేస్తాయి. ఉదాహరణకు షార్ట్ సర్క్యూట్, అధిక కరెంట్, లీకేజీ లేదా లైన్లో మరో సమస్య గుర్తించినప్పుడు బ్రేకర్లు, ఫ్యూజులు, ఇతర రక్షణ పరికరాలు పనిచేస్తాయి. దీని వల్ల

తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఖమ్మం: తెలంగాణ ప్రజల అవసరాలే పరమావధిగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమం అందుతోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని భట్టి చెప్పుకొచ్చారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రైతు భరోసాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన

స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అమరావతి, ఆగస్టు 15: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం గతేడాది ఆగస్టు 15వ తేదీన ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ సందర్భంగా స్త్రీ శక్తికి సంవత్సరం- రెట్టింపైన ఆత్మగౌరవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. రాజధానిలోని పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో బస్సులో ప్రయాణం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి సీడ్ యాక్సిస్ రోడ్ మీదుగా సీఎం క్యాంప్ కార్యాలయం వరకు బస్సులో మహిళలతో కలిసి ముఖ్యమంత్రి ప్రయాణం చేశారు. స్త్రీ శక్తి పథకం అమలు తీరు తెన్నుల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళల కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. ఓ మహిళా రైతుతో సంభాషించిన ముఖ్యమంత్రి... ప్రభుత్వం ఇచ్చే పథకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. చేపలు అమ్ముకునే ఓ మహిళతో సీఎం మాట్లాడారు. స్త్రీ శక్తి పథకం ద్వారా తనకు నెలకు రూ. 4 వేలు ఆదా అవుతోందని మత్స్యకార మహిళ తెలిపింది. మత్స్యకార మహిళ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు సీఎం. తనకు చక్కెర వ్యాధి ఉందని... ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధితో మందులు కొనుగోలు చేస్తున్నట్టు సదరు మహిళ వెల్లడించింది. ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే అనారోగ్యం దరిచేరదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటే... సంపాదనను మందుల కొనుగోలు ఖర్చులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. స్త్రీ శక్తి పథకం వల్ల తనకు నెలకు రూ. 1500 ఆదా అవుతోందని నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం మహిళ తెలిపింది

ఈ ఏడాది వాతావరణ శాస్త్రవేత్తలు ఊహించినట్లే పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో (EL Nino)ప్రభావం మొదలైంది. అంతే కాదు ఇది క్రమంగా బలపడుతోంది. దీని వల్ల ప్రపంచ వాతావరణ పరిస్ధితుల్లో పెనుమార్పులు తప్పేలా లేవు. ముఖ్యంగా వివిధ దేశాల్లో రుతుపవనాలు, ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. ఆయా దేశాల్లో వాతావరణ పరిస్ధితుల ఆధారంగా కూడా ఉండబోతున్నాయి. దీంతో భారత్ సహా పలు దేశాలు ఎల్ నినో ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నాయి.పసిఫిక్ మహాసముద్రంలో తాజాగా ఎల్ నినో తీవ్రత వేగంగా పెరుగుతోంది. ఇది ఈ ఏడాది డిసెంబర్ నాటికి అత్యంత బలమైన వాతావరణ పరిణామంగా మారడానికి 90 శాతానికి పైగా అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటమే దీనికి ప్రధాన కారణమని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వాతావరణ పరిశోధనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 2 డిగ్రీల సెల్సియస్ అదనంగా నమోదవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల కేవలం సముద్ర ఉపరితలానికే పరిమితం కాకుండా, లోతైన పొరల్లోకి కూడా విస్తరిస్తోంది. Monsoon: బంగాళాఖాతంలో మొదలైన గర్జన ..! ఇక ఆగస్టు అంతా పండగే..! ఇది ఎల్ నినో మరింత తీవ్రరూపం దాల్చడానికి అవసరమైన అదనపు శక్తిని అందిస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్త వాతావరణ వ్యవస్థల్లో పెను మార్పులు తప్పేలా లేవు. ఈసారి ఏర్పడబోయే ఎల్ నినో అత్యంత శక్తివంతమైన చారిత్రక వాతావరణ పరిణామంగా మారేందుకు 69 శాతం అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. ఒకవేళ ఇదే జరిగితే, ఆధునిక వాతావరణ పరిశీలనలు ప్రారంభమైన 1950 సంవత్సరం రికార్డుల తర్వాత నమోదైన అత్యంత బలమైన

విమానవాహక యుద్ధనౌకల నుంచి యుద్ధవిమానాలను లాంచ్ చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్(ఈమాల్స్)’కు బదులుగా.. సంప్రదాయ స్టీమ్ పవర్డ్ కెటాపుల్ట్ను అమర్చాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. సంప్రదాయ ఆవిరి వ్యవస్థనే అమర్చండి.. నేవీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు వాషింగ్టన్: విమానవాహక యుద్ధనౌకల నుంచి యుద్ధవిమానాలను లాంచ్ చేయడానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న ‘ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్(ఈమాల్స్)’కు బదులుగా.. సంప్రదాయ స్టీమ్ పవర్డ్ కెటాపుల్ట్ను అమర్చాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. దీనికి సంబంధించిన ప్రణాళికను రెండునెలల్లోగా సమర్పించాలని నేవీకి, పెంటగాన్‌కు సూచించారు. ట్రంప్ ఆదేశాల ప్రభావం.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫోర్డ్ క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘డోరిస్ మిల్లర్’పై ప్రధానంగా పడనుంది. ఎందుకంటే ఆ నౌకలో ఈమాల్స్ సిస్టమ్ ఏర్పాటు ఇప్పటికే దాదాపు 50ు దాకా పూర్తయింది. ఇప్పుడు దాన్ని తొలగించి మళ్లీ పాతకాలపు ఆవిరి ఆధారిత వ్యవస్థను ఏర్పాటుచేయాలంటే ఖర్చు విపరీతంగా పెరిగిపోవడమే కాక, నౌక నిర్మాణం బాగా ఆలస్యమవుతుందని నిర్మాణ సంస్థ జనరల్ అటామిక్స్ ఆందోళన వ్యక్తం చేసింది. స్టీమ్ పవర్డ్ కెటాపుల్ట్ సిస్టమ్‌తో ఒక విమానాన్ని లాంచ్ చేయడానికి 12 మంది సిబ్బంది అవసరమైతే.. ‘ఈమాల్స్’ విధానంలో కేవలం ఇద్దరే అవసరమవుతారు. చైనా, ఫ్రాన్స్ దేశాలు తమకొత్త ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లలో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ కెటాపుల్ట్ వ్యవస్థలనే అమర్చుతుండగా.. మళ్లీ పాత విధానానికే వెళ్లాలంటూ తమ నేవీకి ట్రంప్ ఆదేశాలు జారీచేయడం చర్చనీయాంశమైంది. అమెరికన్ నేవీ సిబ్బంది కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో ఆయన ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్లో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పిపల్‌కోటిలోని టెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (THDC) ప్రాజెక్టు వద్ద నిర్మాణంలో ఉన్న టన్నెల్లోకి సాయంత్రం 6.30 నుంచి 6.45 గంటల మధ్య భారీగా వరద నీరు ప్రవేశించింది. ఆ సమయంలో HCC సిబ్బంది నిర్మాణ పనులు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 20 మందిని బయటకు తీసుకొచ్చారు. వారిలో ఏడుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో 13 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో శ్రీనగర్‌లోని బేస్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో NDRF, భారత సైన్యం, ITBP బృందాలను కూడా రంగంలోకి దించారు. టన్నెల్లో ఇంకా ఇద్దరు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ గౌరవ్ కుమార్, NDRF అధికారి అమృత్ లాల్ మీనా సంఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్లో భారీగా నీరు చేరడంతో రెస్క్యూ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ అత్యున్నత ప్రాధాన్యత అని, అన్ని సంబంధిత సంస్థలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్
.webp)
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..! రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షంచారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. పోలవరం వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుపై వచ్చిన ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి ఈ సూచన చేశారు. ఈ మేరకు అధ్యయనం చేయడంతోపాటు... ఎకనమిక్ ఫీజిబిలిటీపై స్టడీ చేయాలన్నారు. ఇక ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉన్నందున్న వివిధ రిజర్వాయర్లు.. ప్రాజెక్టుల్లో విద్యుత్ ఉత్పత్తి కష్టసాధ్యం కావచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ... విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకోవడంతో పాటు... ప్రతి ఆరేళ్లకూ విద్యుత్ వినియోగం రెట్టింపు అవుతుందని... దానికి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే సమయంలో విద్యుత్ పంపిణీ నష్టాలను మరింత తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పీఎం సూర్యఘర్ కింద 6 లక్షల సోలార్ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఇన్స్టాల్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్ సూర్య ఘర్ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు. ఇక కుసుమ్ పథకం కింద లక్ష్యాన్ని పూర్తిచేస్తూనే, అదనంగా 2,000 మెగావాట్ల సామర్థ్యం కోసం కేంద్రాన్ని కోరాలని సీఎం సూచించారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ

దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రక ఎర్రకోటపై 80వ స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఈ ఏడాది 'వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, వికసిత్ భారత్@2047 కోసం యువశక్తి' థీమ్‌లతో ఎర్రకోట ముస్తాబైంది. చరిత్రలో తొలిసారిగా ఎర్రకోట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించనున్నారు. అలాగే జాతీయ పతాకావిష్కరణ వేళ వాయుసేనకు చెందిన Mi-17 హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. జ్ఞానపథ్‌లో వందేమాతరం ఆకృతిలో 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు కూర్చోనున్నారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన దాదాపు 5 వేల మందికి అధికారులు ప్రత్యేక ఆహ్వానం పంపారు. వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ, భారతదేశంలోని ప్రముఖ సరస్సుల పేర్లతో సీటింగ్ ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు, పర్యాటకుల సౌకర్యార్థం ఉచిత మెట్రో ప్రయాణం, క్యూఆర్ కోడ్ ఈ-ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వేడుకలు ముగిసిన వెంటనే ఎర్రకోట పరిసరాల్లో చెత్త తొలగింపు కోసం 'స్వచ్ఛత ప్రచారం' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సుప్రీం కోర్టులో మరో రెండు కోర్టు హాల్స్ ప్రారంభం 60 రవాణా విమానాలు, 150 శిక్షణ విమానాలు.. భారత రక్షణ రంగం భారీ కొనుగోళ్లు

బంగ్లాదేశ్ (Bangladesh) ను కారు చీకట్లు కమ్మేస్తున్నాయి. దేశమంతా విద్యుత్ కోతలతో (Power Crisis) అల్లాడుతోంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ నిలిపేస్తున్నారు. విద్యుత్ ను ఆదా చేసేందుకు ప్రభుత్వం షాపులు, మాల్స్ ను రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ కోతలపై మండిపడుతున్న జనం.. విద్యుత్ కేంద్రాలపై దాడులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పొరుగున ఉన్న భారత్ సాయం కోరుతోంది.Sheikh Hasina: అరెస్టవుతా లేదా చచ్చిపోతా..! బంగ్లా రిటర్న్ ఎప్పుడో తేల్చేసిన షేక్ హసీనా..!బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చుట్టూ ఉన్న గ్రామాల్లో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ ఇక్కడ 8-10 గంటల పాటు విద్యుత్ కోతలు ఉంటున్నాయి. దేశంలో విద్యుత్ డిమాండ్ సుమారు 18వేల మెగావాట్లుగా ఉండగా, సరఫరా 13వేల మెగావాట్లకు కూడా చేరుకోలేకపోతోంది. దీనికి ఉక్కపోత, వేడిమి తోడై అల్లాడుతున్న జనం.. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని షాపింగ్ మాల్స్, మార్కెట్లు, దుకాణాలను రాత్రి 8 గంటలలోపు మూసివేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని వాణిజ్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 8 గంటలలోపు ముగించాలని కోరింది. అలంకరణ దీపాలను నిషేధించారు. అన్ని విద్యుత్ బిల్ బోర్డులను రాత్రి 7 గంటలలోపు ఆపేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆసుపత్రులు, ఫార్మసీలకు మాత్రం మినహాయింపు ఇట్చారు. భారత్-బంగ్లా మధ్య మళ్లీ హసీనా చిచ్చు..! ఢాకా ఫైర్-పాక్ తో పోల్చిన కుమారుడు..!ఈ పరిస్థితికి ప్రధాన కారణం ఇంధనం, గ్యాస్ కొరత. బంగ్లాదేశ్ తన చమురులో 90 శాతం పైగా, గ్యాస్‌లో 30 శాతం దిగుమతి చేసుకుంటుంది. గత నెలలో అమెరికా కంపెనీ ఎక్సెలరేట్ ఎనర్జీకి చెందిన ఒక టెర్మినల్‌లో అగ్నిప్రమాదం తర్వాత LNG సరఫరా సగానికి పడిపోయింది. జూలై 21 తర్వాత ఆ టెర్మినల్ మూసేసిన ఈ టెర్మినల్.. తిరిగి ఈ వారం ప్రారంభంలోనే పాక్షికంగా ప్రారంభమైంది. అలాగే

Moto G37 Power Price : మోటోరోలా ఫ్యాన్స్ పండగ చేస్కోండి.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ బడ్జెట్ రూ.20వేలు అయితే మోటో G37 పవర్ అద్భుతమైన ఆప్షన్. ఈ సేల్ సమయంలో మోటోరోలా జీ37 ధర తగ్గింపు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు పొందవచ్చు. ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. మోటో G37 పవర్‌పై ఆఫర్లు, డిస్కౌంట్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.. మోటో జీ37 పవర్ ధర, ఆఫర్లు : మోటో జీ37 పవర్ ఫోన్ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1,750 తగ్గింపు పొందవచ్చు. దాంతో ఈ మోటో ఫోన్ ధర రూ.14,249 అవుతుంది. అలాగే, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ.14,100 వరకు సేవ్ చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ టాప్ బెనిఫిట్, ఎక్స్చేంజ్ చేసే డివైజ్, ప్రస్తుత వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. Read Also : Realme 16x 5G Sale : 7000mAh బ్యాటరీతో రియల్‌మి రచ్చ! కొత్త 16x 5G సేల్ స్టార్ట్.. ధర చూస్తే షాక్! మోటో జీ37 పవర్లో 1604×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.7-అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంది. సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. ఏఆర్ఎమ్ మాలి-జీ57 ఎంసీ2 జీపీయూతో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 4GB/8GB LPDDR4X ర్యామ్, 64GB/128GB యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్

హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సైదాబాద్(హైదరాబాద్): హైదరాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. 11కేవీ జయనగర్ ఫీడర్ పరిధిలోని సైదాబాద్ కాలనీ, మెయిన్ రోడ్డు, రామాలయం, ఎస్బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ, లక్ష్మీనగర్, సాయిబాబా టెంపుల్ పరిసర ప్రాంతాలలో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ ఫీడర్ పరిధిలోని లక్ష్మీనగర్ ఎక్స్ రోడ్డు, రామాలయం, వాణినగర్, పటేలమ్మ మడిగలు, ఆనంద్ బిస్కెట్ ఫ్యాక్టరీ, ధోబీఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ తెలిపారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ సాంగ్స్‌కే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నేటితరం నటీమణులు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, యాక్షన్, మాస్ పెర్ఫార్మెన్స్‌లతో పాటు విలనిజంలోనూ దుమ్ము రేపుతూ, ఏకంగా హీరోలనే డామినేట్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్లో సంచలనం సృష్టించిన అనేక చిత్రాల్లోనూ ఈ హీరోయిన్స్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.దీనికి ఒక ఉదాహరణ వామికా గబ్బి. సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామికా, తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత హిందీ, పంజాబీ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు, వెబ్ సిరీస్‌లలోనూ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన డీసీ సినిమాతో వామికా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రంలో చంద్ర అనే శక్తివంతమైన పాత్రలో ఆమె అద్భుతంగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో లోకేష్ కనగరాజ్‌ను కూడా వామికా డామినేట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్ బై ఎలక్షన్స్: ఇప్పటివరకు ఓటేసింది 20 మందే.. అవతార్‌ను బీట్ చేస్తున్న రామాయణ.. ఏ విషయంలో?

వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి వ్యాఖ్యలు సర్వత్రా వైరల్ అవుతున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గ్రాడ్యుయేట్.. ఎక్కడ చవిరారో, ఎలా పాస్ అయ్యారో అనే అనుమానాలు కలిగేలా ఆయన మాటలు ఉన్నాయి. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే నగరంలో ఎక్కడా పైకి కరెంట్ వైర్లు, విద్యుత్ స్తంభాలు కనిపించకుండా, అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అంతర్జాతీయ నగరాల తరహాలో అమరావతి వీధుల కింద విద్యుత్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం డక్ట్ సిస్టమ్‌ను నిర్మించారు. ఈ సాంకేతిక అంశాలపై కనీస అవగాహన లేకుండా తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన పరువును నిండా తీయడమే కాకండా వైసీపీని నవ్వుల పాలు చేశాయి. అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు. మొత్తంగా వైసీపీయులు తమ అమరావతి వ్యతిరేకతను దాచుకోవడానికి ఇసుమంతైనా ప్రయత్నించకుండా ఇష్టారీతి వ్యాఖ్యలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ఆ క్రమంలోనే అమరావతి అండర్ గ్రౌండ్ పవర్ గ్రిడ్ నెట్వర్క్ అంటే ఏమిటో కూడా తెలియని అజ్ణానంతో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో తెగ ట్రోలింగ్ కు గురౌతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్ అమరావతిపై విమర్శలు గుప్పిస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు. తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులలో తప్పులను చూపడమే లక్ష్యంగా సాగిన ఆయన ప్రెస్ మీట్ లో దేశంలోనే ఫ్రీ పోల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో విద్యుత్ స్తంభాలను అండర్ గ్రౌండ్ లో పెడితే.. జనాలకు షాక్ కొట్టదా అంటూ ప్రశ్నించి, ఈ విధానాన్ని ఖండిస్తున్నానంటూ గంభీరమైన స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ఒకవేళ ఈ విషయం మీద అవగాహన

2012 ఫిబ్రవరి 24న ప్రతిష్ఠాత్మక అమెరికన్ శాస్త్రీయ పత్రిక సైన్స్ లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ, ఆ తర్వాతి కాలంలో దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన అమెరికా, స్కాండినేవియన్ దేశాల నుంచి నిధులు అందుకుంటున్న కొన్ని స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) భారత అభివృద్ధి సవాళ్లను పూర్తిగా అర్థం చేసుకోకుండా, కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టు వంటి కీలక పథకాలను అడ్డుకుంటున్నాయని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సాంకేతిక చర్చకే పరిమితం కాకుండా, దేశంలో విదేశీ నిధుల పాత్రపై, పౌర సమాజం పరిధిపై విస్తృత చర్చకు దారితీశాయి. 2012 ఫిబ్రవరి 24న ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూలో.. మన్మోహన్ సింగ్ కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు, బీటీ బ్రింజాల్ విడుదలపై విధించిన నిషేధం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధిలో అడ్డంకులు కల్పిస్తున్న ఎన్జీవోల గురించి బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో.. అమెరికా, స్కాండినేవియన్ దేశాల నుండి తరచుగా నిధులు పొందుతున్న కొన్నిఎన్జీవోలు, ఇండియా ఎదుర్కొంటున్న అభివృద్ధి సవాళ్లను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్న కూడంకుళం వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో వచ్చాయి. ఇవి ఆయా ఎన్జీవోల నిర్వాహకుడు ఎస్.పి.ఉదయకుమార్ నేతృత్వంలో సాగుతున్నాయి యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో (2009–2014) దేశంలో అణు విద్యుత్ ప్రాజెక్టులు, ముఖ్యంగా తమిళనాడులోని కూడంకుళం ప్లాంటు, స్థానిక మత్స్యకార సంఘాలు, పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాయి. ఫుకుషిమా అణు దుర్ఘటన (2011) తర్వాత ఈ నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మన్మోహన్ సింగ్ సైన్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ నిరసనల వెనుక విదేశీ నిధులు పొందిన కొన్ని సంస్థల పాత్ర ఉందని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా మిగలకుండా, తదనంతర కాలంలో నిఘా వర్గాల నివేదికలకు, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)

ఇండియా ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. సాంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, హరిత ఇంధనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. గత నాలుగేళ్లలో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ఏకంగా 138 శాతానికి పైగా వృద్ధి చెందింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు. దేశ వ్యూహాత్మక ఇంధన అవసరాల దిశలో వచ్చిన అసాధారణ పరిణామం. విద్యుత్ డిమాండ్ ఏటా వేగంగా పెరుగుతున్న తరుణంలో.. పునరుత్పాదక శక్తి వనరులను విస్తరించడం ఆవశ్యకంగా మారింది. సుమారు 60 బిలియన్ యూనిట్ల స్థాయిలో ఉన్న సౌర విద్యుత్ ఉత్పత్తి.. ప్రస్తుతం 143 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి కూడా 1,484 బిలియన్ యూనిట్ల నుండి 1,840 బిలియన్ యూనిట్లకు పైగా పెరిగింది. విస్తరిస్తున్న ఈ డిమాండ్‌ను తట్టుకోవడంలో సోలార్ ప్రాజెక్టులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా సౌర శక్తిని విస్తరిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో భారత్ అగ్రగామిగా నిలుస్తోంది. దశాబ్దాల ప్రయాణం.. 3 గిగావాట్ల నుండి 129 గిగావాట్లకు.. సౌర రంగంలో ఈ స్థాయి పురోగతి ఒక్క రోజులో సాధ్యమైనది కాదు. గత పన్నెండేళ్లలో ప్రభుత్వ విధానాలు, విదేశీ, ప్రైవేట్ పెట్టుబడులు, ప్యానెల్ల తయారీలో సాంకేతిక విప్లవం, పోటీ బిడ్డింగ్ విధానాలు ఈ రంగాన్ని పరుగులు పెట్టించాయి. 2014 నాటికి దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం కేవలం 3 గిగావాట్ల మేర మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ఆ సామర్థ్యం 129 గిగావాట్లకు చేరుకోవడం ఒక మైలురాయి. . గుర్తించాల్సిన అంశమేంటంటే.. స్థాపిత సామర్థ్యం (గిగావాట్లు) పెరిగినంత మాత్రాన, నిరంతర విద్యుత్ ఉత్పత్తి (బిలియన్ యూనిట్లు) జరగదు. వాతావరణ మార్పులు, మేఘావరణం, సూర్యకాంతి సమయం, గ్రిడ్ పరిమితులు వాస్తవ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం: గృహ వినియోగదారులకు సౌర కాంతి సాధారణ పౌరులను

షెడ్యూల్డ్ ప్రాంత గ్రామసభలకు అధికారాలు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమగ్రాభివృద్ధి అమరావతి, (ఆంధ్రజ్యోతి): స్వపరిపాలనను బలోపేతం చేయడం, గిరిజనుల హక్కులు, సంప్రదాయాలు, సం స్కృతి, సహజ వనరులను పరిరక్షించి, అభివృద్ధి కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం స్ట్రెంతనింగ్ హేబిటేట్ అండ్ ఆదివాసీ నాలెడ్జి సిస్టం త్రూ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్స్ (శక్తి) కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. పీసా చట్టం-1996, ఏపీ పంచాయతీరాజ్ (సవరణ)చట్టం-1998, ఏపీ పీసీ నిబంధనలు-2011 ప్రకారం గ్రామసభల సామర్థ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీనిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామసభలే కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు గ్రామసభలు తమ అవసరాలకు అనుగుణంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. అవగాహన హక్కుల కమిటీ, వనరుల ప్రణాళిక సమీకరణ కమిటీ, పండుగలు సాంస్కృతిక క్రీడల కమిటీ, సంక్షేమం విద్య కమిటీలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కమిటీలో 10-15 మంది సభ్యులు ఉండాలి. కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూసుకోవాలి. పీవీటీజీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. కమిటీ చైర్పర్సన్, కార్యదర్శిని గ్రామసభ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీ పదవీకాలం కనీసం రెండేళ్లు. గ్రామసభ దాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు. అవసరమైతే ఏ సభ్యుడినైనా మార్చే, కమిటీని పునర్యవస్థీకరించే అధికారం గ్రామసభకు ఉంటుంది. కమిటీలు నెలకు ఒకసారి సమావేశం కావాలి. మొత్తం సభ్యుల్లో సగం మంది హాజరైతే కోరం ఉన్నట్లుగా పరిగణిస్తారు. సమావేశాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. హక్కులపై అవగాహన... హక్కుల కమిటీ పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం, భూబదలాయింపు నిబంధనలు, గిరిజన సంక్షేమ చట్టాలపై గ్రామసభ ప్రజలకు అవగాహన కల్పించాలి. గ్రామసభ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలి. మినిట్స్‌ను డిజిటలైజ్ చేయాలి. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు గ్రామసభకు హాజరవ్వాలి. వనరుల ప్రణాళిక, సమీకరణ కమిటీ గ్రామంలోని

రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తూ... ఆక్వా, నాన్ ఆక్వా జోన్లు, 10 ఎకరాల పరిమితితో సంబంధం లేకుండా అమలు రీ సర్వేతో కొత్తగా నోటిఫై చేసిన ఆక్వా జోన్లలోని అన్ని ఫారాలకూ.. 2018లోనే ఆక్వా రంగానికి విద్యుత్తు రాయితీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ తర్వాత జగన్ సర్కార్ అనాలోచిత నిబంధనలతో రైతులకు దక్కని రాయితీ కూటమి ప్రభుత్వం చొరవతో అధిక శాతం రైతులకు మళ్లీ ఊరట గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిబంధనలతో ఆక్వా రైతులు పడిన ఇబ్బందులకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది! ‘ఆక్వా’ రంగానికి తిరిగి జవసత్వాలు నింపుతూ ఓ కీలక వరం ఇచ్చింది!! ఉత్పత్తి వ్యయం తగ్గించేలా.. అర్హులైన రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ.1.50కే అందించాలని నిర్ణయించింది. జగన్ సర్కార్ హయాంలో విధించిన ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల మెలిక, 10 ఎకరాల పరిమితి నిబంధనలను ఎత్తివేసింది. జూన్ 1 నుంచే విద్యుత్తు రాయితీ అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆక్వా సాగు ఆర్థికంగా భారం అవుతున్న సమయంలో వారికి ఊరట కల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఎత్తివేస్తూ.. యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ.1.50కే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యుత్తు శాఖ మంగళవారం జీవో-57 విడుదల చేసింది. గత జగన్ సర్కార్ ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అంటూ తీసుకొచ్చిన మెలిక, అలాగే 10 ఎకరాల పరిమితి నిబంధనతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వం అర్హులైన రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయనుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచే

సినిమా కోసం, తను పోషించే పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సినిమా కోసం, తను పోషించే పాత్ర కోసం ఎంతటి కష్టానికైనా వెనుకాడని హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). పాత్ర డిమాండ్ చేస్తే శారీరకంగా ఎంతో కష్టపడి, కఠినమైన శిక్షణ తీసుకుని, స్క్రీన్ మీద తన నటనతో మ్యాజిక్ చేయడం చరణ్‌కు అలవాటే. ఇటీవల బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టం ఏ స్థాయిలో ఉందో మనం చూశాం. దాదాపు 16 నెలల పాటు కఠినమైన డైట్, వర్కవుట్లతో ఒక పక్కా 'దేశీ పెహల్వాన్' లాంటి భారీ కండల శరీరంతో కుస్తీ యోధుడిగా థియేటర్లలో పూనకాలు తెప్పించారు. అయితే ఇప్పుడు 'పెద్ది' తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రం కోసం మరొక ఊహించని శారీరక మార్పుకు సిద్ధమవుతున్నారు. ఆ టాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన 'రంగస్థలం' చిత్రం తర్వాత డైరెక్టర్ సుకుమార్ (sukumar)తో రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్ RC17. ఈ కాంబో అనౌన్స్ అయినప్పటి నుంచే అటు అభిమానుల్లో, ఇటు సినీ వర్గాల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం రామ్ చరణ్ ఏకంగా 15 కిలోల బరువు తగ్గబోతున్నారట. 'పెద్ది'లో కనిపించిన భారీ కండల బాడీకి పూర్తి భిన్నంగా, చాలా సన్నగా, లీన్ లుక్‌లో చరణ్ కనిపిస్తారని తెలుస్తోంది. సుకుమార్ విజన్‌కు తగ్గట్టుగా చరణ్ తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకోబోతున్నారట. ఈ కొత్త లుక్ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీగా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌పై శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తయి

ఆక్వా రైతులకు శుభవార్త చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. జోన్, నాన్‌జోన్‌తో సంబంధం లేకుండా, పదెకరాల పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఆక్వా రైతుకూ యూనిట్ విద్యుత్‌ను రూ.1.50 కి అందించేందుకు జీవో నెం.57ను రైతుల సమక్షంలోనే విడుదల చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయంపాలకొల్లులో నిర్వహించిన భారీ సభలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం 26 నెలల్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేశామని అన్నారు. రైతాంగ సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు.ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా జోన్, నాన్‌జోన్, పదెకరాల పరిమితితో సంబంధం లేకుండా రూ.1.50 యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఈ రంగంపై సుమారు రూ.724 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో విద్యుత్ సబ్సిడీకి రూ.1,150 ఖర్చు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో జీవో తీసుకొచ్చి రైతుల ముందే విడుదల చేశామన్నారు.బ్లూ ఎకానమీ గురించి మంత్రి అచ్చెన్నాయుడు దేశం, ప్రపంచం ఇప్పుడు బ్లూ ఎకానమీ గురించి మాట్లాడుతోందని, ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న సుదీర్ఘ తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ఇచ్చిన వరమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే ఆక్వా, మత్స్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు తిరుగుండదన్నారు. ఆక్వా రంగం చంద్రబాబు నాయుడి మానస పుత్రిక. ఈ రంగాన్ని బతికించడమే కాదు.. దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటాను అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.ఆక్వా రంగంలో ప్రధాన సమస్యలు ఇవే విదేశాల్లో తీసుకునే