
Poco X8 Power Series Leaks: త్వరలోనే మార్కెట్లోకి పోకో X8 ప్రో పవర్ సిరీస్ మోడల్స్ విడుదల కాబోతున్నాయి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Poco X8 Power Series Leaks: మార్కెట్లోకి పోకో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదల చేసిన మంచి స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అద్భుతమైన స్పందన లభించింది. దీంతో ఈ కంపెనీ కొత్త కొత్త మొబైల్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే పోకో నుంచి X సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ పోకో ఎక్స్8 పవర్ సిరీస్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
ఈ సిరీస్‌లో భాగంగా రెండు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో పోకో ఎక్స్ 8 పవర్ ప్రో 5Gతో పాటు పోకో ఎక్స్8 పవర్ ప్రో మాక్స్ 5G వంటి మోడల్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇవి మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. ఇందులో భాగంగా హై ఎండ్ మోడల్ మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
పోకో ఎక్స్8 పవర్ మోడల్‌కు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. టిప్‌స్టర్ సంజు చౌదరి లీక్ చేసిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.83-అంగుళాల 1.5K డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది AMOLED ప్యానెల్‌ను కలిగి రాబోతోంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సపోర్ట్ కూడా లభిస్తోంది. ఇక ఈ పోకో ఎక్స్8 పవర్ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్సెట్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఇది అద్భుతమైన స్టోరేజ్ ఆప్షన్‌తో లాంచ్ కాబోతోంది..
పోకో ఎక్స్8 పవర్లో అద్భుతమైన కెమెరా మాడ్యుల్‌ని కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కెమెరాను కూడా అందిస్తోంది. ఇది అల్ట్రావైడ్ కెమెరాతో పాటు ఫ్రంట్ భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది..
ఇక ఇందులో 10,000mAh బ్యాటరీ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుందని లీక్ అయిన వివరాల్లో పేర్కొన్నారు.. అలాగే ఈ ఫోన్ నాలుగు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్లతో పాటు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లతో వస్తుందని టిప్‌స్టర్ వెల్లడించారు.
పోకో X8 ప్రో పవర్ మాక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది దాదాపు అవే స్పెసిఫికేషన్లను కలిగి ఉందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.. ఈ ఫోన్లోని ప్రధాన లెన్స్, OIS సపోర్ట్‌తో పాటు 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన 50-మెగాపిక్సెల్ సెన్సార్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ముందువైపు, వీడియో కాలింగ్ కోసం కంపెనీ 20-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది.



