
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తారకరత్న (Nandamuri Alekhya) తన భర్తతో దిగిన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో ఘనవిజయాలు అందించే కొన్ని సక్సెస్ ఫార్ములాలు ఉంటాయి. వాటిలో యమలోకం కాన్సెప్ట్ ఒకటి. ఈ కథాంశంతో వచ్చిన ఎక్కువ చిత్రాలు తెలుగులో కాసుల వర్షం కురిపించాయి. హీరోలు యమలోకానికి వెళ్లడం లేదా యముడే భూలోకానికి రావడం ఈ తరహా కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వరకు ఈ ఫార్ములాతో సక్సెస్ అందుకున్నారు. ఎన్టీఆర్ యమగోల, చిరంజీవి యముడికి మొగుడు, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రాలలో హీరోలు యమలోకానికి వెళ్లి తిరిగి భూమిపైకి వస్తారు. అల్లరి నరేష్ యముడికి మొగుడు మూవీ కూడా అదే కాన్సెప్ట్. అలీ యమలీల సినిమాలో యముడే భూలోకానికి వస్తాడు. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. నాగార్జున కూడా ఇదే తరహా కాన్సెప్ట్ తో సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు లాంటి హిట్స్ అందుకున్నారు. కానీ ఈ ఫార్ములా మాస్ మహారాజ రవితేజకి మాత్రం కలసి రాలేదు. యమలోకం కాన్సెప్ట్ తో రవితేజ నటించిన దరువు చిత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. వాస్తవానికి ఇది అంత బ్యాడ్ మూవీ కాదు. కనీసం యావరేజ్ సినిమాగా ఆడి ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికీ ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్లు యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకే ఒక్క తప్పు వల్ల ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి దూకుడు మీద ఉన్న టైంలో దరువు చిత్రాన్ని రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ హోరులో దరువు చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దరువు ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం ఇదే. సోలోగా రిలీజ్ అయి ఉంటే అబౌ యావరేజ్ లేదా హిట్ అయ్యే అవకాశాలు ఉండేవి. టీవీల్లో, యూట్యూబ్ లో ఈ సినిమాని ప్రేక్షకులు

వెంకటేష్, కీర్తి సురేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కృతి శెట్టిలతో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మల్టీస్టారర్ మూవీ తీస్తున్నారు. ఈ సినిమాకి “జనవరి 12 విడుదల” (January 12 Vidudala) అనే పేరుని ఖరారు చేశారు. పేరుతో పాటు విడుదల తేదీ కూడా అదే ఫిక్స్ చేశారు. రిలీజ్ డేట్ ముందే ఫిక్స్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టడం అనిల్ రావిపూడి స్టయిల్. అతని ప్లానింగ్ అంతా పక్కాగా ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పాట తీశారు. తాజాగా రెండో పాట మొత్తం నలుగురు హీరో, హీరోయిన్లతో చిత్రకరిస్తున్నారు. మైసూర్ దగ్గర్లోని మేల్కొటిలో ఒక సెలెబ్రేషన్ సాంగ్ తీస్తున్నారు. హీరోలు ఇద్దరూ బైక్ పై వెళ్తుంటే వారితో హీరోయిన్లు పాల్గొనే గ్రామీణ నేపథ్యపు పాటని అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో ఇప్పటికే 40 రోజులకి పైగా షూటింగ్ పూర్తి అవుతుంది. మరో నలభై రోజుల్లో మొత్తం షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారట. అంత స్పీడ్ అనిల్ రావిపూడిది. మరోవైపు, ఎప్పుడో మొదలుపెట్టిన “ఆదర్శ కుటుంబం” సినిమాని మాత్రం త్రివిక్రమ్ పూర్తి చెయ్యలేకపోయారు. మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ని వెంకటేష్ ఈ నెలలో పూర్తి చేస్తారట. ‘జనవరి 12 విడుదల’ పాట చిత్రీకరణ పూర్తికాగానే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కి వచ్చి అది కంప్లీట్ చేస్తారు

జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య, హరికృష్ణ పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ భార్య నందమూరి దీపిక రాజకీయాల్లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా ఆమె సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలతో మమేకమవుతూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా తన ఇంట్లో కాఫీ తాగుతూ సరదాగా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు నందమూరి దీపికా జానకిరామ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అభిమానులకు చిత్ర యూనిట్ ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న వర్కింగ్ టైటిల్ NBK111 సినిమాకి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా అధికారిక టైటిల్ తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ వార్త బయటకు రావడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ భారీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఆ గ్లింప్స్ కు లభించిన అనూహ్య స్పందనతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా అనౌన్స్మెంట్కు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ విషయమై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం దాదా లేదా గాడ్ అనే రెండు శక్తివంతమైన పేర్లలో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో సెప్టెంబర్ 6న ఏ టైటిల్ ప్రకటిస్తారో అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఫలితంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల వివరాలు కూడా సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన మరియు శక్తివంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలకృష్ణ గాయం కారణంగా కొద్దిరోజుల పాటు షూటింగ్‌కు విరామం లభించిన సంగతి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌కు టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సంచలన విజయం సాధించడంతో వీరి తాజా చిత్రం 'NBK111'పై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’తో ఇటీవల బ్లాక్‌బస్టర్ అందుకున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అదిరిపోయే ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్ట్ అధికారిక టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ని సెప్టెంబర్ 6న రివీల్ చేయనున్నారు. ఆ రోజు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు కావడంతో నందమూరి అభిమానులకు ఇది డబుల్ ధమాకాగా మారనుంది. ఇటీవల షూటింగ్లో బాలకృష్ణ కాలికి గాయమై శస్త్రచికిత్స జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారు. గాయం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చిత్రాన్ని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.* బాక్సాఫీస్ వద్ద బిగ్ క్లాష్.. దసరా రేసు నుంచి రజనీకాంత్ 'జైలర్ 2' ఔట్?గతంలో విడుదలైన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలయ్య ఎన్నడూ చూడని సరికొత్త, అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, విలక్షణ నటుడు మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండగా, అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా.. బాలయ్య కటౌట్‌కి తగినట్లుగా పదునైన సంభాషణలు రాస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, గోపీచంద్ మలినేని మాస్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా వెల్లడించనున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రానికి మేకర్స్ ‘GOD’ మరియు ‘DADA’ (దాదా) అనే రెండు మాస్ క్యాచీ టైటిల్స్ చిత్ర బృందం పరిశీలనలో ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. బాలయ్య ఇమేజ్‌కి, గోపీచంద్ మలినేని మార్క్ యాక్షన్ డ్రామాకి ఈ రెండు పేర్లు పర్ఫెక్ట్గా సరిపోతాయని భావిస్తున్నారు. అయితే దాదాపు ‘దాదా’ టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ముంబై నేపథ్యంలో జరిగే గ్యాంగ్ స్టార్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో బాలయ్య గాయపడడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు మేకర్స్. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సెప్టెంబర్ 6న వచ్చే అధికారిక ప్రకటనతో ఈ సినిమా టైటిల్ మరియు విడుదల తేదీపై పూర్తి స్పష్టత రానుంది

‘ఇరుముడి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ చేసే సినిమాకు సంబంధించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరనే విషయం పై రకరకాలుగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతోంది.. అదే మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ (Irumudi). శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుస ప్లాప్‌లతో కాస్త వీక్‌గా ఉన్న రవితేజకు ఈ సినిమా ఊపిరి పోయడమే కాదు, ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ మార్కును దాటేసింది. ఇక ఓవర్సీస్, ఇండియా వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే రూ. 180 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఉన్న హోల్డ్ చూస్తుంటే మరో నాలుగైదు రోజుల్లో ఈజీగా రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, ‘ఇరుముడి’ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఈ రేంజ్ బ్లాక్‌బస్టర్ హిట్ పడటంతో దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు చిత్రసీమలో ఒక డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో గ్రాండ్ హిట్ కొడితే చాలు.. నిర్మాతలు, హీరోల మేనేజర్లు వారి చుట్టూ తిరగడం సహజమే. ఇప్పుడు శివ నిర్వాణ విషయంలోనూ ఇదే జరుగుతోందట. పలువురు ప్రముఖ నిర్మాతలు ఆయనతో ఎలాగైనా సినిమా చేయాలని చెక్కులు పట్టుకుని తిరుగుతున్నారట. ఇప్పుడు కాకపోయినా పర్లేదు.. భవిష్యత్తులో మీతో సినిమా చేస్తాం, అడ్వాన్స్ తీసుకోండి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారనే పుకార్లు

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో రూపొందుతోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో, ఈ తాజా చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీపడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ ఫస్ట్ గ్లింప్స్‌లో బాలయ్య అల్ట్రా స్టైలిష్, పవర్ఫుల్ అవతార్‌లో కనిపించి మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో NBK111 నుంచి చిత్ర బృందం ఒక అదిరిపోయే బిగ్ అప్డేట్ను సిద్ధం చేసింది. ఈ సినిమా అధికారిక టైటిల్‌తో పాటు ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీని సెప్టెంబర్ 6వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ రోజు విశేషం ఏమిటంటే.. నటసింహం తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ (Nandamuri Mokshagna Teja) పుట్టినరోజు! తనయుడి బర్త్‌డే వేళ అభిమానులకు డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చేందుకు బాలయ్య ఈ క్రేజీ అప్డేట్ను లాక్ చేశారు. ఈ ప్రకటనతో అటు మోక్షజ్ఞ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పాటు ఇటు సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో నందమూరి ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణం నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత

తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధరవర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధరవర్మ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని శ్రీధర్ వర్మ తెలిపారు. శ్రీ రంగనాయకుల మండపంలో ఆశీర్వాదాలు అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు అనంతరం తిరుమల నుండి తిరుపతికి చేరి ఎస్విబిసి చైర్మన్ గా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, నందమూరి మోహన రూపా గారు, కామినేని సీమంతిని గారు, దగ్గుబాటి నివేదిత గారు హాజరై శ్రీధర్ వర్మ గారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నందమూరి మోహనకృష్ణ గారు మాట్లాడుతూ... "నా సోదర సమానుడు శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ చైర్మన్ గా ఎంపికైనందుకుగాను నా శుభాకాంక్షలు. రక్తం పంచుకుని పుట్టకపోయినా ఆప్యాయత అనురాగాలలో నాకు మా సోదరుడు ఎలాగో రాజు గారి పిల్లలు కూడా అంతే. నాడు రామారావు గారు తొలి పార్టీ టికెట్ రాజు గారికి ఇచ్చినప్పటికీ ఆయన తనకు టికెట్ వద్దు అని అనడంతో శ్రీవారి సేవలో ఉండాలంటూ నాన్నగారి కోరికను కాదనకుండా టిటిడి కోసం పనిచేశారు. అభివృద్ధి కోసం ఆయన స్వయంగా ముందుకు వచ్చి తన భూమిని దానం చేశారు. నాన్నగారి

తెలుగు చిత్ర పరిశ్రమలో 'మహానటి' సావిత్రి తర్వాత అంతటి గౌరవం, కీర్తి సంపాదించుకున్న నటి సౌందర్య. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రజనీకాంత్ వంటి అగ్ర హీరోలతో ఆమె నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగారు. గ్లామర్ కి దూరంగా ఉంటూ చీరకట్టుతో కనిపించి ఆ చీరకే అందాన్ని తీసుకొచ్చారు. 2004లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణం చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. సౌందర్య నటించిన చివరి సూపర్ హిట్ సినిమా వై.వి.ఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'సీతయ్య' (2003). ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ హీరోగా నటించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయ్యింది. దురదృష్టవశాత్తు, ఈ సినిమా విడుదలైన కొద్ది నెలలకే సౌందర్య ప్రమాదంలో మరణించారు. విధి విచిత్రమో ఏమో గానీ, 'సీతయ్య' చిత్ర హీరో నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు విడిచారు. 2018లో నెల్లూరు జిల్లాలో ఒక పెళ్లికి వెళ్తుండగా, నల్గొండ జిల్లా సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో హరికృష్ణ మరణించారు. ఒకే సినిమాలో జంటగా నటించిన హీరో, హీరోయిన్ ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో మరణించడం నిజంగా ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయం. సౌందర్య, హరికృష్ణ ఇద్దరూ ఈ రోజు మన మధ్య లేరు. హరికృష్ణ.. జూ ఎన్టీఆర్, కళ్యాణ్‌లకు తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ కొడుకు. అనే విషయం తెలిసిందే. భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారి నటన, చిరునవ్వు, మంచి మనసుతో కోట్లాది అభిమానుల గుండెల్లో సౌందర్య, హరికృష్ణ ఎప్పటికీ జీవించే ఉంటారు. సౌందర్య `సీతయ్య` తర్వాత రెండు మూడు సినిమాలు చేసింది. అందులో `స్వేతనాగు`, ` ప్రేమ దొంగ` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఆడలేదు. అదే సమయంలో మోహన్ బాబుతో `శివ శంకర్`, `నర్తనశాల` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ జరిగే సమయంలోనే ఆమె కన్నుమూయడం అత్యంత బాధాకరం
తిరుమల శ్రీవారిని మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ అభిమాని రామచంద్ర రాజు అలియాస్ ఎన్టీఆర్ కుమారుడు శ్రీధర్ వర్మ ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయనతో కలసి నందమూరి రామకృష్ణ , మోహనకృష్ణ కుటుంబంతో స్వామివారిని దర్శించుకున్నారు. రామచంద్రరాజుతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. శ్రీధర్ వర్మకు తన తండ్రి ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజు ఆశీస్సులు ఉండాలంటూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.ఎన్టీఆర్ రాజు రెండుసార్లు వరుసగా పాలకమండలిలో సభ్యుడిగా ఉన్నారని.. మూడోసారి పదవి ఇవ్వబోతే ఎన్టీఆర్ వద్దని చెప్పిన విషయాన్ని నందమూరి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అప్పుడే ఎన్టీఆర్ టీటీడీ పాలకమండలి సభ్యుల పదవీ కాలానికి సంబంధించి ఓ నిబంధనను తీసుకొచ్చారని.. టీటీడీ పాలకమండలిలో రెండుసార్లకు మించి ఎవరూ ఉండకూడదని ఎన్టీఆర్ జీవో తెచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రాజు సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.శ్రీధర్ వర్మకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిరావడం ఆనందంగా ఉందన్నారు నందమూరి మోహనకృష్ణ. శ్రీధర్ వర్మ తండ్రి ఎన్టీఆర్ రాజుతో తమ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్టీఆర్ రాజు పిల్లలు మాకు సోదరసమానులు.. అందరం అన్నదమ్ముల్లా ఉంటామన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఎన్టీఆర్ రాజును పోటీచేయమని కోరితే.. ఆయన నిరాకరించి 'మీకు సేవ చేసుకుంటాను' అని చెప్పిన మాటన గుర్తు చేశారు. ఎన్టీఆర్ కోరితేనే టీటీడీ పాలకమండలి సభ్యుడిగా నియమించారని.. ఆయన భూ దానం కూడా చేశారన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ రాజు గతేడాది కన్నుమూశారు.. ఆయన పాడెను మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారులు నందమూరి మోహనకృష్ణ, రామకృష్ణ మోశారు.టీడీపీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ టీటీడీకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు

మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆమె ‘షావుకారు జానకి’గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’లో కీలక పాత్ర ధరించారు. ‘పాండురంగ మహాత్మ్యం’ నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను ‘తాతమ్మకల’లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత “రామ్ – రహీమ్, వేములవాడ భీమకవి” చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకిగారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

భారతీయ సినీ రంగాన్ని ఏడు దశాబ్దాలకు పైగా తన అసాధారణమైన అభినయంతో ఏలిన మహానటి, పద్మశ్రీ షావుకారు జానకి తుదిశ్వాస విడిచారనే వార్త వినగానే మొత్తం చిత్రసీమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ చేదు వార్త తెలిసి నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానకి గారి మరణం పట్ల ఆయన భావోద్వేగంగా స్పందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. "మహానటి షావుకారు జానకిగారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాన్నగారు (ఎన్టీఆర్) హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. " అని గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, నందమూరి కుటుంబానికి చెందిన ఎన్.ఏ.టి. (N.A.T.) బ్యానర్ నిర్మాణంలో వచ్చిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కూడా జానకి కీలక పాత్ర పోషించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయాన్ని బాలయ్య బయటపెట్టారు. "పాండురంగ మహాత్మ్యం నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది." అని బాలకృష్ణ అన్నారు. మన దేశంలోనే 75 ఏళ్ల సుదీర్ఘమైన నటనా ప్రస్థానాన్ని చూసిన ఏకైక నటి బహుశా షావుకారు జానకి గారు మాత్రమే అయి ఉంటారని బాలయ్య అభిప్రాయపడ్డారు. అంతటి సుదీర్ఘ నటనా జీవితంలో ఎన్నెన్నో మర్చిపోలేని పాత్రలతో కోట్లాది మంది ప్రజల హృదయాలను మెప్పించారని కొనియాడారు. "ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు

షావుకారు జానకిగారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రత్యేకమని నందమూరి బాలకృష్ణ తెలిపారు. మహానటి షావుకారు జానకి (Sowcar Janaki) శుక్రవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షావుకారు జానకిగారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం ప్రత్యేకమని నందమూరి బాలకృష్ణ భావోద్వేగం చెందారు. జానకి గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మహానటి షావుకారు జానకి గారు తుదిశ్వాస విడిచారన్న వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాను. జానకిగారితో మా నందమూరి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. నాన్నగారు హీరోగా రిలీజైన తొలి చిత్రం 'షావుకారు'తోనే ఆమె 'షావుకారు జానకి'గా సుప్రసిద్ధులయ్యారు. అలా నాన్నగారికి జానకిగారు తొలి హీరోయిన్, అలాగే ఆమె తొలి కథానాయకుడు ఆయన. నాన్నగారితో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు జానకిగారు. మా యన్.ఏ.టి. బ్యానర్ లో రూపొందిన తొలి చిత్రం 'పిచ్చిపుల్లయ్య'లో కీలక పాత్ర ధరించారు. 'పాండురంగ మహాత్మ్యం' నుంచీ యన్.ఏ.టి. బ్యానర్ లోగోలో శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహానికి కుడివైపును జానకిగారు కూర్చుని తెరపై కనిపించడం విశేషం. నేను 'తాతమ్మకల'లో మహానటి భానుమతి మునిమనవడిగా నటిస్తూ పరిచయమయ్యాను. ఆ తరువాత "రామ్ - రహీమ్, వేములవాడ భీమకవి" చిత్రాల్లో షావుకారు జానకిగారితో నటించే అదృష్టం నాకు దక్కింది. మన దేశంలో 75 ఏళ్ళ సుదీర్ఘ నటనాప్రస్థానం చూసిన ఆర్టిస్ట్ షావుకారు జానకిగారు ఒక్కరే అనుకుంటాను. అంతటి సుదీర్ఘ నటనాజీవితంలో ఎన్నెన్నో మరపురాని పాత్రల్లో జనాన్ని మెప్పించారు జానకిగారు. ఆ మహానటి మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న మూవీలో హీరోయిన్గా సారా అర్జున్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ‘ఆర్సీ 17’ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. నాలుగేళ్ళుగా తమ కుటుంబంలో భాగమైన బఘీరాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. అంతేకాక పెట్ డాగ్‌ను ప్రేమగా హగ్ చేసుకున్న ఫోటోలను పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై మళ్ళీ ప్రచారం వేడెక్కింది. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడంతో దర్శకుడు వశిష్ఠ లైన్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. విజయదశమికి ఈ కాంబోలో రానున్న చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. మరోసారి అసూయ చాటుకున్న సిద్ధార్థ్ ఆనంద్! Nagarjuna: ఆ సినిమా చేయడమే నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం Sanjjanaa Galrani: విజయ్.. త్రిష.. సంజన గల్రానీ షాకింగ్ కామెంట్స్!

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి ఎన్టీఆర్ నుంచి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. రీసెంట్గా ‘నీ’ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే ‘బాబాయ్-అబ్బాయ్’ షూటింగ్ లో, ఆ తరువాత ‘భార్యాభర్తల బంధం’ చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై ‘విజయేంద్రవర్మ’ షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య తనకు బాగయిందని, నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ ‘పల్లెటూరి పిల్ల’ మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. ‘సర్దార్ పాపారాయుడు’ షూటింగ్ లో మరోమారు అదే చేయికి గాయమయింది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం వాటిల్లరాదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు

Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీ ఫిక్స్.. దసరాకు లాంచ్.! డైరెక్టర్ ఎవరంటే.? Mokshagna: నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం ఎట్టకేలకు ఖాయమైనట్లు తెలుస్తోంది. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి తాజా సమాచారం సినీ సర్కిల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ భారీ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే 'బింబిసార' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వశిష్ట ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తిగా ముగిశాయని, స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణకు ఇటీవల స్వల్పంగా గాయం కావడం, ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స జరగడం వల్ల ఈ ప్రకటన కొద్దిగా ఆలస్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్న తరుణంలో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట టేకింగ్ తో పాటు మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందనే అంశంపై టాలీవుడ్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. 2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో

నందమూరి మోక్షజ్ఞ(Nandamuri Mokshagna) సినీ ఎంట్రీపై చాలాకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ, ఏ ప్రాజెక్ట్ కూడా అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. అయితే తాజాగా విశ్వంభర(Vishwambhara) ఫేమ్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే సినిమాకు రంగం సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ కూడా సిద్ధమైనట్లు, ప్రస్తుతం అఫీషియల్ అనౌన్స్మెంట్ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ డెబ్యూ విషయంలో గతంలో ప్రశాంత్ వర్మ(Prasanth Varma)తో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అనంతరం క్రిష్(Krish) దర్శకత్వంలో సినిమా ఉంటుందనే ప్రచారం సాగింది. ఆదిత్య చోప్రా(Aditya Chopra) నిర్మించిన ఓ సినిమాను రీమేక్ చేసే ఆలోచనతో పాటు ఆదిత్య 999(Aditya999) ప్రాజెక్ట్ కూడా డిస్కషన్స్‌లోకి వచ్చింది. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వశిష్టతో ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు వస్తున్న సమాచారం ఆ ఆసక్తిని మరింత పెంచుతోంది. మోక్షజ్ఞను తెరపైకి తీసుకొచ్చే విషయంలో బాలకృష్ణ(Balakrishna) కథ, డైరెక్టర్ సెలెక్షన్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలయ్యకు ఇటీవల ఎదురైన ఆరోగ్య సమస్యలు, ఆయన ఇతర కమిట్మెంట్స్ కారణంగా అనౌన్స్మెంట్ లో ఆలస్యం జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే దసరా సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించి, మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం

నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా ఎలా ఎదురు చూస్తున్నారో తెలియంది కాదు. నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వారసుడు నందమూరి మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) వెండితెర అరంగేట్రం (Tollywood Debut) కోసం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రతీసారి ఎంట్రీకి అంతా సిద్ధమైంది అనుకున్న తరుణంలో అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. గతంలో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని, పూజా కార్యక్రమాలు కూడా ఖరారయ్యాయని ప్రచారం జరిగినా ఆ ప్రాజెక్ట్ అనూహ్యంగా నిలిచిపోయింది. ఆ తర్వాత స్వయంగా బాలయ్యే మెగాఫోన్ పట్టి ‘ఆదిత్య 999’తో కొడుకును లాంచ్ చేస్తారని వార్తలొచ్చాయి. అనంతరం క్రిష్ జాగర్లమూడి పేరు కూడా తెరపైకి వచ్చింది కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ డైరెక్టర్ల లిస్ట్‌లోకి ఇప్పుడు మరో క్రేజీ దర్శకుడి పేరు వచ్చి చేరింది. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ కొట్టి, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న యువ దర్శకుడు వశిష్ట (Vassishta Mallidi) పేరు ఫిలింనగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. వశిష్ట చెప్పిన ఒక సరికొత్త ఫాంటసీ కమ్ మాస్ కథకు బాలకృష్ణ, మోక్షజ్ఞ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, డెబ్యూ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్ నడుస్తోంది. నందమూరి నట వారసుడికి తగ్గట్టుగా భారీ కాన్వాస్‌పై ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఇటీవల షూటింగ్లో బాలయ్యకు స్వల్ప గాయం కావడం, చికిత్స నేపథ్యంలో ఈ అనౌన్స్‌మెంట్‌ను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే దసరా పండుగ శుభ సందర్భంగా

నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ తన 111వ సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం కావడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని కూడా సూచించారు. అయితే బాలయ్య మాత్రం సెప్టెంబర్ నుంచే షూటింగ్ కి రెడీ అంటున్నారట. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలకృష్ణ చూస్తున్నారు. అలా షూటింగ్ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' షూటింగ్ లో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆపై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకి గాయమైంది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మోకాలుకే గాయం కాగా, డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ 'పల్లెటూరి పిల్ల' మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ లో మళ్ళీ అదే చేయికి గాయమైంది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం రాకూడదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ అంకితభావమే బాలయ్యకూ వచ్చిందనేది ఇండస్ట్రీ మాట. ‘ఇరుముడి’కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ పొంగల్ బరిలో టాలీవుడ్ టాప్ స్టార్స్.. క్యూ కడుతున్న

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రంపై చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తూ వైరల్ అవుతోంది. దివంగత లెజెండరీ దర్శకుడు ఇవివి సత్యనారాయణ వింటేజ్ కామెడీ స్పూర్తితో ఈ టైటిల్ గ్లింప్స్‌ను డిజైన్ చేశారు. హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి కలిసి దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సినిమా టైటిల్ ఏంటి?’ అని అడగ్గా, ఆయన ‘జనవరి 12 విడుదల’ అని పదే పదే బదులిస్తారు. రిలీజ్ డేట్ కాదు సినిమా టైటిల్ అడుగుతున్నాం కదా అని వెంకీ అడగగా, అసలు ఆ సినిమా పేరే ‘జనవరి 12 విడుదల’ (January 12 Vidudala) అని రివీల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి ‘బావ బావమర్ది సౌజన్యంతో’ అనే సరదా ట్యాగ్‌లైన్ కూడా జోడించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తోన్న ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా పండగ వాతావరణంలో 12 జనవరి, 2027న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టైటిల్, రిలీజ్ డేట్ రెండూ ఒకటే అయ్యేలా డిజైన్ చేసిన ఈ వినూత్న టైటిల్‌తో సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ నిర్వహించే తీరు

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ సినిమా అంటే అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో మోకాలికి గాయం అవడంతో మోకాలుకి సర్జరీ చేసి బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ చేయాలనీ డైరెక్టర్ కు తెలిపాడట. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకోమని సూచించారట. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలయ్యకు డిసెంబర్ మాసం బాగానే కలసి వచ్చింది. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ భారీ ఓపెనింగ్స్ చూసిన ‘పట్టాభిషేకం’, అనూహ్య విజయం సాధించిన ‘లారీ డ్రైవర్’, ప్యాండమిక్ తరువాత జనాన్ని థియేటర్స్ కు రప్పించిన ‘అఖండ’ చిత్రాలు డిసెంబర్ లోనే రిలీజయ్యాయి. అందువల్లే తాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తోన్న రెండో సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు. కాసింత ఆలస్యం చేసి జనవరిలో పొంగల్ బరిలోనే దూకితే మంచిదని కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలవుతున్నాయి.. ఈ నేపథ్యంలో వారికి దారి ఇచ్చి తన సినిమాను ముందే రిలీజ్ చేస్తే మేలని బాలయ్య అనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనూ భారీ చిత్రాలే వస్తున్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ ‘ఫౌజీ’ వస్తోంది. ఇక డిసెంబర్ 18న హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ‘అవెంజర్స్ – డూమ్స్ డే, డ్యూన్-3’ వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ ‘కింగ్’ రిలీజ్ కానుంది. కాబట్టి సరైన తేదీని చూసుకొని

నందమూరి అభిమానులకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెరపడే రోజు రాబోతుంది. చాలా కాలంగా అదిగో ఇదిగో అంటూ వస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ‘బింబిసార’, ‘విశ్వంభర’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల దర్శకుడు వశిష్ట ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. వాస్తవంగా హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షు ఎంట్రీకి అన్ని ప్లాన్ చేసి చివరి నిమిషంలో ఆ సినిమాను క్యాన్సిల్ చేసారు. ఇక దాదాపు ఏడాది తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని ఎంట్రీకి రెడీ అవుతున్నాడు మోక్షు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం దర్శకుడు వశిష్ట ఒక వినూత్నమైన కథను సిద్ధం చేశారని, దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. రాబోయే దసరా పండగ పర్వదినాన ఈ చిత్రాన్ని లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రకటనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. నిజానికి, ఈ పాటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఇటీవల బాలకృష్ణ యాక్షన్ సీన్ షూటింగ్లో గాయపడటం, ఆ తర్వాత ఆయన మోకాలికి సర్జరీ జరగడం వంటి ఊహించని పరిణామాల వల్ల ఈ ప్రకటన కాస్త ఆలస్యమైంది. బాలయ్య కోలుకోవడానికి సమయం పట్టడంతో ఈ గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందట. ఇక ఇప్పుడు బాలయ్య కూడా రికవరీ అవడం, పరిస్థితులు అన్ని అనుకూలించడంతో దసరా సందర్భంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. దీంతో మోక్షజ్ఞ తొలి సినిమా ఎవరితో ఉంటుందనే ఆసక్తి మరింత పెరిగింది. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మోక్షజ్ఞ తొలి చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. కథ ఇప్పటికే సిద్ధమైనట్లు, ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. నందమూరి అభిమానుల్లో మోక్షజ్ఞ డెబ్యూపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే కథ, దర్శకుడి ఎంపిక విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోక్షజ్ఞను తొలి సినిమాతోనే గ్రాండ్‌గా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి బాలకృష్ణకు గాయం కావడం, ఆ తర్వాత ఆయనకు ఆపరేషన్ జరగడం వంటి కారణాలు లేకపోయి ఉంటే మోక్షజ్ఞ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం, ఇతర సినిమా కమిట్మెంట్లను బట్టి మోక్షజ్ఞ సినిమా విషయంలో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే మోక్షజ్ఞతో వశిష్ట సినిమా, దసరా లాంచ్ వంటి అంశాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. గతంలోనూ మోక్షజ్ఞ డెబ్యూపై పలు వార్తలు వచ్చిన నేపథ్యంలో

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటవారసుడు సెమి గాడ్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు పిలుచుకుంటున్న మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అభిమానులైతే సెల్యులాయిడ్ నందమూరి మూడో తరం వారసుడు నట విశ్వరూపాన్ని చూసే భాగ్యం కలిగించమని మొక్కని దేవుడు లేడంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి నందమూరి సినీ వారసత్వానికి ఉన్న చరిష్మాని అర్ధం చేసుకోవచ్చు. తాజా ఫిలింనగర్ బజ్ ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'ని తెరకెక్కిస్తున్న వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందనే పేరు పేరు వినిపిస్తోంది. బింబిసార లాంటి విజువల్ వండర్‌తో మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని 70 కోట్లకు పైగా వసూళ్లతో తన ప్రతిభను నిరూపించుకున్న వశిష్ట, నందమూరి వారసుడి ఎంట్రీ కోసం ఒక అద్భుతమైన ఫాంటసీ యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు సమాచారం. బాలకృష్ణ గారే స్వయంగా తన కుమారుడి డెబ్యూ గ్రాండ్ scale లో ఉండాలని, ఎలాంటి కంప్రమైజ్ కాకుండా రూ. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. గతంలో 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్స్' గురించి వార్తలు వచ్చినప్పటికీ, మోక్షజ్ఞను సరికొత్త మాస్ మరియు యూత్ ఫుల్ అవతార్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకే బాలయ్య నిర్ణయించుకున్నట్టుగా టాక్. త్వరలోనే ఈ మోస్ట్ అవేటెడ్ డెబ్యూ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో విశ్వంభర డైరెక్టర్ కూడా మంచి ఛాయస్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలతో జాగ్రత్తగా ఉండు.. చరణ్ కి చిరంజీవి సలహా! బఘీరా ఇకలేడు: కంటతడి పెట్టిస్తున్న ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.!

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య తనకు బాగయిందని, నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ 'పల్లెటూరి పిల్ల' మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ లో మరోమారు అదే చేయికి గాయమయింది

నందమూరి బాలకృష్ణకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినా నిర్మాత మేలు కోరి బాలకృష్ణ త్వరలోనే షూటింగ్ కు సిద్థమౌతున్నారట. పలు విషయాల్లో 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్న బాలకృష్ణ మరోమారు అదే తీరున సాగనున్నారు. మోకాలు ఆపరేషన్ జరిగినా త్వరలోనే షూటింగ్ కు రెడీ అంటున్నారు. అంతేకాదు సినిమాను అనుకున్న రీతిలో పూర్తి చేయాలనీ ఆశిస్తున్నారు. ఆ విశేషమేంటో చూద్దాం. నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ NBK112. ఇప్పటికే పూజ కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న సినిమాపై గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ కారణాల వల్ల నిలిచిపోయిందంటూ ప్రచారం జరుగుతుండటంతో నందమూరి అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో ఉన్న రూమర్లపై చిత్ర యూనిట్ “Team NBKKoratalaSiva” పేరుతో క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ గురించిన ప్రచారాలను, అసత్య వార్తలను ఎవరూ నమ్మవద్దు, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సెట్స్ పైకి వెళ్తుంది, నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న ‘NBK111’ చిత్రాన్ని పూర్తి చేసిన వెంటనే ఈ కొరటాల శివ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రాంభం అవుతుందని’స్పష్టం చేసారు. బాలయ్య ఇటీవల గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ లో గాయపడడంతో మొకాలుకి సర్జరీ చేయడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్స్ లో జాయిన్ అయ్యాక ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసేలా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తున్నాడు కొరటాల

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ అంటే తెలుగువారికి ఓ ఎమోషన్. ఆయన గురించి కొత్తగా ఏ విషయం తెలిసినా జనాలు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఎన్టీఆర్ తన సినిమా జీవితంలో కానీ, పర్సనల్ లైఫ్‌లో కానీ క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. తెరపై ఆయన పోషించిన పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలు అంతగా ఆకట్టుకోవడానికి ఆయన పాటించిన కఠినమైన రోజువారీ దినచర్య, వ్యాయామాలే ప్రధాన కారణం. సీనియర్ నటుడు మురళీ మోహన్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఫిట్నెస్ రహస్యాలు, శారీరక శ్రమ గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మురళీ మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ ప్రతిరోజూ తెల్లవారుజామున 3:00 గంటలకే నిద్రలేచేవారు. ఉదయమే నిద్రలేచిన తర్వాత వ్యాయామం చేయడం ఆయనకు అలవాటు కాగా, ఆయన వ్యాయామ పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉండేది. ప్రతిరోజూ ఆయన ఇంటి ముందు ఒక లారీ ఇసుక కుప్పగా పోసి ఉంచేవారు. ఒక పెద్ద పారను తీసుకుని వంగి, ఆ ఇసుక మొత్తాన్ని ఒక వైపు నుంచి మరొక వైపునకు పారతో ఎత్తి వేసేవారు. లారీడు ఇసుకను ఒక వైపు నుంచి వేరొక వైపునకు మార్చడమే ఆయన రోజువారీ వ్యాయామంగా ఉండేది. ఇది శరీరానికి తీవ్రమైన శారీరక శ్రమను అందించడమే కాకుండా కండరాల దృఢత్వానికి ఎంతో తోడ్పడేది. ఎన్టీఆర్ తీసుకునే ఆహారం గురించి ప్రచారంలో ఉన్న కథనాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఆయన క్రమశిక్షణ, శారీరక శ్రమ దానికి తగినట్లుగా ఉండేవి. రోజు ఉదయాన్నే రెండు డజన్ల ఇడ్లీలు, నాటుకోడి లాగించేవారు. యాపిల్ జ్యూస్, బాదం పాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే రామారావు ఫుడ్ మెనూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే రామారావు పౌరాణిక పాత్రలు (కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు మొదలైనవి) పోషించేటప్పుడు అత్యంత పవిత్రంగా, కఠిన నియమాలతో ఉండేవారు. ఆ సమయంలో

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో పట్టాలెక్కనున్న భారీ యాక్షన్ చిత్రం (NBK 112) నిలిచిపోయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర బృందం ఖండించింది. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన వదంతులేనని స్పష్టం చేసింది. అభిమానులు ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరింది.ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ‘NBK 111’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తన భాగాన్ని పూర్తి చేసిన వెంటనే, కొరటాల శివ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా ఆగిపోలేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే షూటింగ్ ప్రారంభమవుతుందని స్పష్టతనిచ్చింది.ఈ చిత్రాన్ని జూన్ 25న అమరావతిలో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సుమారు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న ఊహాగానాలకు తాజా వివరణతో తెరపడింది

నటసింహం నందమూరి బాలకృష్ణ.. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna).. వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్ తర్వాత ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK111’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ‘NBK112’ ప్రాజెక్ట్ లైన్లో ఉంది. అయితే, అనుకోకుండా ‘NBK111’ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడం, దానికి సర్జరీ జరగడంతో డాక్టర్లు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించారు. సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరో లేదా అగ్ర దర్శకుడి షెడ్యూల్ మారితే, దాని ఎఫెక్ట్ వరుసగా మిగతా ప్రాజెక్టులపై పడుతుంది. ప్రస్తుతం బాలయ్య - కొరటాల శివ కాంబినేషన్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ఆగస్టులోనే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ, బాలయ్య గాయం వల్ల ఈ సినిమా షూటింగ్ వచ్చే సమ్మర్‌కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొరటాల శివ ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, బాలయ్య తర్వాత చేయాల్సిన మరికొన్ని సినిమాల షెడ్యూల్స్ కూడా రీ-షెడ్యూల్ కాక తప్పడం లేదట. ఈ లైనప్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే... కొరటాల శివ సినిమా పూర్తయిన వెంటనే, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉందట. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. అయితే, బాలయ్య-కొరటాల సినిమా ఆలస్యం కానుండటంతో అనిల్ రావిపూడి తన తర్వాతి ప్రాజెక్ట్ ప్లానింగ్‌ను మార్చుకోవాలని చూస్తున్నట్లు ఫిలిం నగర్
విక్టరీ వెంకటేష్ , నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వినోదానికి సరికొత్త హంగులు అద్ది, పక్కా కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏమాత్రం విరామం లేకుండా నిరంతరాయంగా చిత్రీకరణ జరుపుతోంది.చిత్ర యూనిట్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు అనిల్ రావిపూడి ఆదివారాలు, పండుగ సెలవులు అనే తేడా లేకుండా ఏకధాటిగా షూటింగ్ పనులను ముందుకు నడిపిస్తున్నారు. సంక్రాంతి నాటికి విడుదల చేయాలన్న పక్కా ప్రణాళికతో టీమ్ మొత్తం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. వేగంతో పాటు అవుట్‌పుట్ విషయంలో కూడా రాజీపడకుండా ప్రతి సన్నివేశాన్ని ఎంతో గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటివరకు పూర్తి చేసుకున్న విజువల్స్ క్వాలిటీ అద్భుతంగా వచ్చిందని, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.* కావేరీ పాత్ర కోసం చాలా కష్టపడ్డా... ‘ఇరుముడి’లో సెంటిమెంట్‌తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది - ప్రియా భవానీకల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్ఈ సినిమాలో వెంకటేష్ పోషిస్తున్న పాత్ర కథకి ప్రధాన బలంగా నిలవనుంది. ఆర్మీలోని కౌంటర్-టెర్రరిజం, బందీల విముక్తి విభాగంలో పనిచేసే 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే మోస్ట్ పవర్ఫుల్ సైనిక అధికారి పాత్రలో ఆయన కనిపించనున్నారు. చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. మిలిటరీ గెటప్‌లో వెంకటేష్ చూపించిన గాంభీర్యం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్అనిల్ రావిపూడి అనగానే గుర్తొచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే హాస్యానికి ఈసారి భారీ యాక్షన్, ఆర్మీ నేపథ్యాన్ని జోడించి సినిమాను అత్యున్నత ప్రమాణాలతో మలుస్తున్నారు. ఇందులో వెంకటేష్‌కు

విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్టరీ వెంకటేష్(Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో షూటింగ్‌ను ఎలాంటి బ్రేక్ లేకుండా శరవేగంగా పూర్తి చేసే పనిలో చిత్రబృందం నిమగ్నమైంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ క్షణం తీరక లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారట. ఆదివారాలు, సెలవులు అనే తేడా లేకుండా టీమ్ షూటింగ్ చేస్తోందట. సంక్రాంతి విడుదలను టార్గెట్‌గా పెట్టుకుని వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేయాలని దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తయిన సన్నివేశాల అవుట్‌పుట్ కూడా అద్భుతంగా వస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రాజెక్ట్ విషయంలో నిర్మాణ సంస్థ, దర్శకుడు ఎక్కడా రాజీపడటం లేదని తెలుస్తోంది. భారీ స్కేల్‌తో పాటు అత్యున్నత నిర్మాణ విలువలను పాటిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందించేలా ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. (VenkyANIL5 - #NKRAR2) అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్కు ఈసారి మరింత భారీ స్కేల్‌ను జోడిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెంకటేష్–కళ్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో వెంకటేష్ ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి

ముందు బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్.. గాయాలు వేర్వేరైనా సర్జరీలు మాత్రం కామన్ అయిపోయాయి. బాలయ్య ఇంకా కోలుకోకముందే.. ఎన్టీఆర్ కూడా సర్జరీ చేయించుకున్నారు. అయితే వీళ్ల శస్త్రచికిత్సల కారణంగా సెట్స్ మీదున్న సినిమాల పరిస్థితి ఏంటి…? నందమూరి హీరోల గాయాల ప్రభావం రిలీజ్ డేట్స్‌పై పడబోతుందా..? NBK111, డ్రాగన్ డేట్స్‌లో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా..? జూనియర్ ఎన్టీఆర్ కూడా సర్జరీ వైపు వెళ్లడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆయనకేం కాలేదు బాగానే ఉన్నారు.. గాయం పెద్దది కాకుండా వైద్యుల సలహా మేరకే సర్జరీ చేయించుకుంటున్నారని ఎన్టీఆర్ టీం చెప్తున్న మాట. గాయం కారణంగా ఇప్పటికే మూడు వారాలుగా డ్రాగన్ షూట్ ఆగింది.. సర్జరీ కాబట్టి కనీసం మరో రెండు నెలలు తారక్ కెమెరా ముందుకొచ్చే అవకాశమే లేదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ షూట్ మొన్నటి వరకు నాన్ స్టాప్‌గా జరిగింది. ముందు 2026లోనే రిలీజ్ అనుకున్నా.. 2027, జూన్ 11కి వాయిదా వేసారు మేకర్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అప్పటికైనా సినిమా రెడీ అవుతుందా అనేది అనుమానమే. పైగా ఇది 2 పార్ట్స్ సినిమా అంటున్నారు. మరోవైపు బాలయ్య గాయం గోపీచంద్ మలినేని సినిమాపై తీవ్రప్రభావం చూపిస్తుంది. కాకినాడ పోర్టులో షూట్ చేస్తున్నపుడు బాలయ్య మోకాలికి పెద్ద గాయమే అయింది. ఆయనకు త్వరగా తగ్గాలని ప్రత్యేక పూజలు కూడా చేయించారు గోపీచంద్. ముందు 2026 దసరాకే NBK111 రిలీజ్ ప్లాన్ చేసినా పరిస్థితులు చూస్తుంటే 2027 సంక్రాంతికి కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. ఇక కొరటాల సినిమాపైనా బాలయ్య గాయం ఎఫెక్ట్ ఉంది. మొత్తానికి బాబాయ్-అబ్బాయిల గాయాలు రిలీజ్ డేట్స్‌ను మార్చేలా ఉన్నాయిప్పుడు. భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్ ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న ఆయన లుక్‌లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈ లుక్‌తో వెంకటేష్ ఓ రగ్గడ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది. పోస్టర్లో వెంకటేష్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించనున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఆర్మీ ఇన్సిగ్నియా, క్రాస్డ్ స్వోర్డ్స్ ఎంబ్లమ్ సినిమా మిలటరీ నేపథ్యాన్ని మరింత ఎఫెక్టివ్ గా వున్నాయి. మ్యూటెడ్ బ్లూ-గ్రీన్ స్కై, రాకీ టెర్రైన్, భారీ SUVతో పోస్టర్‌కు అడ్వెంచరస్, దేశభక్తి టచ్ వచ్చింది. ఎర్తీ క్యామోఫ్లేజ్ టోన్స్ కూడా ఈ రగ్గడ్ లుక్కు చక్కగా సరిపోయాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీ.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా

నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్. రాజు ఇటీవల తను రూపొందించిన ‘అగధ’ చిత్ర వేడుకలో నందమూరి తారకరామారావు పై చేసిన వ్యాఖ్యలు వివాదమవుతోన్న విషయం తెలిసిందే. నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్. రాజు (MS Raju) ఇటీవల తను రూపొందించిన ‘అగధ’ (Agadha) చిత్ర వేడుకలో నందమూరి తారకరామారావు (NT Ramarao)పై చేసిన వ్యాఖ్యలు వివాదమవుతోన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బ్రహ్మముహూర్తంలో లేచి, ఏం చేసేవారో తెలుపుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు ఆయన క్లారిటీ ఇచ్చారు. తానెప్పుడూ ఎన్టీఆర్‌కి డైహార్డ్ ఫ్యాన్ అని.. ఆయన విధానాలను, క్రమశిక్షణను ఎంతగానో గౌరవిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్.ఎస్. రాజు మాట్లాడుతూ.. ‘‘నేను సూపర్‌స్టార్ కృష్ణ కుమారుడైన మహేష్ బాబుతో ‘ఒక్కడు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసినప్పటికీ, నా చిన్నతనం నుంచి నేను సీనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిని. నా చిన్నతనంలో ఎన్టీఆర్‌ను ఎవరైనా ఒక్క మాట అన్నా తహతహలాడిపోయేవాడిని.. ఇంకా కోపంతో కొట్టేంత అభిమానం ఉండేది. ఇప్పటికైనా సరే.. ఎవరైనా ఎన్టీఆర్‌ని నా ముందు తక్కువ చేసి మాట్లాడితే నేనే కొడతా. నా నోట ఆయన పేరు తప్ప వేరే ఏదీ రాదు. ఎన్టీఆర్ సాధించిన విజయం, ఆయన వ్యక్తిత్వం నాకు ఎప్పుడూ ఒక ప్రేరణ’’ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కామెంట్లు, కథనాలపై స్పందిస్తూ... ఎన్టీఆర్‌ను అనుకరించడం లేదా ఆయన గురించి మాట్లాడటం ఆయనను అవమానించడం కాదని, ఆ మహానటుడిని స్ఫూర్తిగా తీసుకోవడమేనని క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం అంటే మాములు విషయం కాదని, ఇప్పుడెవరూ అలాంటి వారు లేరని, ఆయన చాలా గొప్పవారని అన్నారు. ఆయన వారసత్వం, విజయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఎన్టీఆర్‌పై తనకున్న ప్రేమాభిమానాలు ఎప్పటికీ తగ్గవని ఎమ్.ఎస్. రాజు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఎమ్.ఎస్. రాజు చేసిన

‘అగధ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్ రాజు చేసిన ‘చికెన్’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్స్ ఎం.ఎస్ రాజుని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ‘చికెన్’ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్‌పై అంతులేని అభిమానంతోనే ఆ మాటలు అన్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ ఎం.ఎస్ రాజు ఏమన్నారంటే.. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాడని చెప్పాడు. తను పడిన కష్టం గురించి చెబుతూ..‘ఏడాదిన్నర పాటు ఎన్టీ రామారావు గారిలాగే నేను కూడా ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. ఆయనలాగా చికెన్ తినలేదు కానీ.. నేనే పాలు కాచుకొని తాగుదాం అనుకుంటే నా భార్యలేచి కాఫీ పెట్టి ఇచ్చేది. అక్కడ నుంచి మొదలెడితే అర్థరాత్రి వరకు సినిమా గురించే ఏదో ఒక పని చేసేవాడిని’అని చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌లాగా చికెన్ తినలేదని వ్యంగ్యంగా అనడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపట్టారు. ఎం.ఎస్ రాజుని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేశారు. అభిమానంతోనే అలా.. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. రామారావుగారిపై ఉన్న అభిమానంతోనే అలా అన్నానని చెప్పాడు. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. పొద్దున లేవగానే
నట సింహం నందమూరి బాలకృష్ణ , యంగ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన ‘డాకు మహారాజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, వసూళ్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే రూ.56 కోట్ల గ్రాస్ రాబట్టి, బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమన్ అందించిన స్వరాలు, బీజీఎం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఊపేసిన ‘దబిడి దిబిడి’ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ పాటలోని ఓ డాన్స్ మూమెంట్ తీవ్ర విమర్శలకు, వివాదానికి దారితీసింది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించుకున్నారు. బాలయ్య లాంటి సీనియర్ హీరో ఇలాంటి స్టెప్ వేయడం ఏంటని కొందరు, మిగతా హీరోలు తక్కువేమీ కాదని మరికొందరు ఇలా ఎవరి వెర్షన్లో వారు వాదోపవాదాలు చేసుకుంటూ కొంతకాలం చర్చ కొనసాగించారు.* కొడుక్కి రామ్‌చరణ్’ పేరు... అభిమాని ప్రేమకు చలించి పోయిన చిరంజీవి, ఊహించని సర్ ప్రైజ్ఈ పాటలోని వివాదాస్పద స్టెప్ క్రియేట్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఏడాదిన్నర తర్వాత తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినందుకు తానెంతో పశ్చాత్తాపపడుతున్నానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మాస్ ట్యూన్‌కి తగ్గట్లుగానే ఆ సీక్వెన్స్ క్రియేట్ చేశానని, అయితే ప్రేక్షకులు దానిని వేరే ఉద్దేశంతో అర్థం చేసుకుని వివాదాస్పదం చేస్తారని తాను ఊహించలేదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ట్రెండ్ అయిన ఆ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది తానే అనే విషయం చాలామందికి తెలియదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.* మెగా ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి... చిరంజీవి ' మెగా 158 'లో కీలక పాత్ర ?ఈ పాటకు సంబంధించి రేగిన వివాదంపై హీరోయిన్ ఊర్వశీ రౌతేలా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ ఒక లెజెండ్ అని