
నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ తన 111వ సినిమాలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం కావడంతో డాక్టర్లు సర్జరీ చేశారు. రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని కూడా సూచించారు. అయితే బాలయ్య మాత్రం సెప్టెంబర్ నుంచే షూటింగ్ కి రెడీ అంటున్నారట.
సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలకృష్ణ చూస్తున్నారు. అలా షూటింగ్ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను రిలీజ్ చేయాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.
బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' షూటింగ్ లో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆపై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకి గాయమైంది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మోకాలుకే గాయం కాగా, డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లోనూ 'పల్లెటూరి పిల్ల' మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో ఎన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ లో మళ్ళీ అదే చేయికి గాయమైంది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం రాకూడదని ఎన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ అంకితభావమే బాలయ్యకూ వచ్చిందనేది ఇండస్ట్రీ మాట.
Nandamuri Balakrishna, NBK111 Movie, Balayya, NBK
‘ఇరుముడి’కి చాలా నేషనల్ అవార్డ్స్ వస్తాయి: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్
పొంగల్ బరిలో టాలీవుడ్ టాప్ స్టార్స్.. క్యూ కడుతున్న క్రేజీ టైటిల్స్!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.





