
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
ఫిట్నెస్ ప్రపంచంలో కండరాలు పెరగాలంటే 'అమైనో యాసిడ్ సప్లిమెంట్లు' తప్పనిసరి అనే ఒక పెద్ద అపోహ ఉంది. సాధారణంగా రోజూ సరిపడా ప్రొటీన్ (మాంసకృత్తులు) తీసుకునే ఆరోగ్యవంతులకు ఈ సప్లిమెంట్ల వల్ల పెద్దగా అదనపు ప్రయోజనం ఉండదు. కండరాల పెరుగుదల ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. క్రమం తప్పకుండా చేసే రెసిస్టెన్స్ ట్రైనింగ్ (వెయిట్ లిఫ్టింగ్/వ్యాయామం), శరీరానికి అవసరమైన మొత్తం ప్రొటీన్ సరిగ్గా అందడం, కండరాలు కోలుకోవడానికి తగినంత విశ్రాంతి, నిద్ర అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మూడు సరిగ్గా లేకపోతే ఎలాంటి సప్లిమెంట్లు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు. అమైనో యాసిడ్ సప్లిమెంట్స్ vs సహజ ఆహారం.. కండరాల దృఢత్వానికి ఏది మేలు? దీనిపై పూర్తి సమాచారాన్ని మిస్ వీణ వి (చీఫ్ క్లినికల్ డైటీషియన్ & హెచ్ఓడి, ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం.అమైనో ఆమ్లాలు అంటే ఏంటి? ప్రొటీన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే నిర్మాణ భాగాలే అమైనో ఆమ్లాలు. శరీరానికి 20 రకాల అమైనో ఆమ్లాలు అవసరం కాగా, అందులో 9 'ఎసెన్షియల్ అమైనో ఆమ్లాల్ని' శరీరం సొంతంగా తయారుచేసుకోలేదు. వీటిని మనం రోజూ తినే ఆహారం ద్వారానే పొందాలి. శరీరానికి అవసరమైన మొత్తం 20 అమైనో ఆమ్లాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరిస్తారు. ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు (9): వీటిని శరీరం సొంతంగా తయారుచేసుకోలేదు. ఆహారం ద్వారా మాత్రమే పొందాలి (ల్యూసిన్, ఐసోల్యూసిన్, వాలైన్ వంటివి). నాన్-ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు (11): వీటిని శరీరం అవసరమైనప్పుడు స్వయంగా ఉత్పత్తి చేసుకోగలదు. కండిషనల్ అమైనో ఆమ్లాలు (Conditional Amino Acids): సాధారణ సమయంలో శరీరం తయారుచేసినప్పటికీ, తీవ్రమైన అనారోగ్యం, గాయాలు లేదా అధిక శారీరక ఒత్తిడి ఉన్నప్పుడు ఆహారం ద్వారా అదనంగా అందించాల్సి ఉంటుంది.సహజ ఆహారమే ఎందుకు శ్రేష్టం? గుడ్లు, పాలు-పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులు, చేపలు, చికెన్, సోయా, పప్పులు, బీన్స్, డ్రై ఫ్రూట్స్