
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే సమగ్ర ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చేపట్టే ప్రతి జల సంరక్షణ పనిని ఒకే సమగ్ర ప్రణాళిక పరిధిలోకి తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన జల్ సంచయ్.. జన్ భాగీదారీ సదస్సులో ఆయన ప్రసంగించారు. నీటి సంరక్షణను కేవలం ఇంజినీరింగ్ కార్యక్రమంగా కాకుండా, ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. తాగునీరు, వ్యవసాయ స్థిరత్వం, గ్రామీణ జీవనోపాఽధి, పర్యావరణ పరిరక్షణకు జలభద్రతే అత్యంత కీలకమని పేర్కొన్నారు. వాన నీటి సంరక్షణకు ప్రతి ఇంట్లో సదుపాయం, ప్రతి గ్రామానికీ విశ్వసనీయమైన సామూహిక జలవనరు ఉండాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పథకాలతోపాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) నిధుల ద్వారా జలసంరక్షణ పనులు జరుగుతున్నాయని.. వీటి మధ్య సరైన సమన్వయం లేకపోతే ఆశించిన ఫలితాలు పొందలేమన్నారు. ప్రతి జలసంరక్షణ ఆస్తిని (చెక్‌డ్యామ్‌లు, చెరువులు తదితర) జియో ట్యాగింగ్ చేసి, ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించాలని ప్రతిపాదించారు. కల్యాణ లక్ష్మి దరఖాస్తులు వేగంగా పరిష్కరించండి ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

ఈ వంటకాన్ని మసాలా అన్నం, చపాతీ, రోటీ లేదా నీర్ దోసతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. అయితే ఖలేజా గట్టిపడకుండా వండటం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా అధిక మంటపై కొద్దిసేపు వేయించి, ఆ తర్వాత తక్కువ మంటపై మూత పెట్టి ఉడికించాలి. ఎక్కువసేపు ఉడికిస్తే ఖలేజా గట్టిగా మారుతుందని రెసిపీలో ప్రత్యేకంగా సూచించారు. ముందుగా చికెన్ ఖలేజాను బాగా శుభ్రం చేయాలి. అందులోని నీరు పూర్తిగా పోయేలా తుడిచి, మధ్యస్థ పరిమాణంలో ముక్కలుగా కోసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తర్వాత టమాటా, పసుపు, కారం, ధనియాల పొడి వేసి మసాలా బాగా ఉడికే వరకు కలుపుతూ ఉంచాలి. నూనె పైకి తేలినప్పుడు మసాలా సిద్ధమైనట్లు. ఇప్పుడు ఖలేజా ముక్కలు, ఉప్పు వేసి అధిక మంటపై 3–4 నిమిషాలు బాగా వేయించాలి. తర్వాత మంట తగ్గించి మూత పెట్టి 8–10 నిమిషాలు ఉడికించాలి. ఖలేజాను ఎక్కువసేపు ఉడికించకూడదు. అలా చేస్తే అది గట్టిగా మారుతుంది. ఖలేజా ఉడికిన తర్వాత గరం మసాలా వేసి మరో 2–3 నిమిషాలు వేయించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే.. నోరూరించే చికెన్ ఖలేజా మసాలా సిద్ధం. వేడి వేడి చికెన్ ఖలేజా మసాలాను నెయ్యి అన్నం, చపాతీ, రోటీ లేదా నీర్ దోసతో వడ్డించవచ్చు. చివర్లో కొద్దిగా కసూరి మెంతులు జోడిస్తే రుచి మరింత పెరుగుతుందని రెసిపీలో పేర్కొన్నారు

వైద్య రంగంలో, ముఖ్యంగా డ్రగ్ డెలివరీ (శరీరంలో నిర్దిష్ట భాగాలకు మందులను చేరవేయడం) ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు భారత శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. బిగుసుకుపోయి, ఘనరూపంలో ఉన్న పదార్థాలను సైతం తాత్కాలికంగా ద్రవరూపంలోకి మార్చే ఒక సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఆకస్మికంగా ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా పదార్థాల 'జ్ఞాపకశక్తి' (memory imprints) ముద్రలను చెరిపివేసి, వాటిని ప్రవహించేలా చేయవచ్చని నిరూపించారు. ఈ ఆవిష్కరణతో దుష్ప్రభావాలు తగ్గించి, మరింత సమర్థవంతంగా మందులను లక్షిత కణాలకు చేర్చవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI) పరిశోధకులు ఈ కీలక ముందడుగు వేశారు. గ్లాస్ వంటి కొన్ని పదార్థాలు నిర్మాణాత్మకంగా ద్రవాలను పోలి ఉన్నప్పటికీ, యాంత్రికంగా ఘన పదార్థాల వలె ప్రవర్తిస్తాయి. అంతేకాకుండా, అవి తమ గత స్థితులను గుర్తుంచుకోగలవు. ఇలా బిగుసుకుపోయిన వ్యవస్థలను (Jammed Systems) తిరిగి ప్రవహించేలా చేయడంపై పరిశోధకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా, మైక్రోజెల్ కణాలను ఉపయోగించి ప్రయోగాలు నిర్వహించారు. ఈ మైక్రోజెల్ కణాలను వేగంగా వేడి చేసినప్పుడు, వాటిలోని కణాల అమరికలో మార్పులు జరిగి, ఆ వ్యవస్థ తాత్కాలికంగా ద్రవరూపంలోకి మారడాన్ని గమనించారు. ఈ ప్రక్రియలో పదార్థం తన గత స్థితికి సంబంధించిన జ్ఞాపకాలను కోల్పోతుందని గుర్తించారు.ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'జర్నల్ ఆఫ్ కొలాయిడ్ అండ్ ఇంటర్ఫేస్ సైన్స్'లో ప్రచురితమయ్యాయి. RRIలో పీహెచ్డీ విద్యార్థిని, ఈ పరిశోధన పత్రం యొక్క మొదటి రచయిత సోనాలి కవాలే, ఈ ప్రయోగాల కోసం ప్రత్యేకమైన మైక్రోజెల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. కర్నూలు, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం గొడ్డలి పార్టీ ఆరాట పడుతోందని విమర్శించారు. వైసీపీ ఏ రోజు ప్రజల సమస్యలపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఈరోజు (బుధవారం) కర్నూలు జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ముందస్తు ఆలోచనతో ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారు.. జగన్ హయాంలోని ఐదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఏమి చేశారో చెప్పే దమ్ము ఉందా అని బీసీ జనార్దన్ రెడ్డి నిలదీశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో పట్టిసీమను పూర్తి చేసి ఆదుకున్నారని తెలిపారు. పులివెందులకు కూడా నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుదని చెప్పుకొచ్చారు. 36 నీటి ప్రాధాన్య ప్రాజెక్టులకు నీరు ఇస్తున్నామని వెల్లడించారు. ఏపీలో డ్రిప్ ఇరిగేషన్ లేకుండా చేసింది జగన్ మోహన్ రెడ్డినే అని విమర్శించారు. వైసీపీ దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మరు.. వైసీపీ నేతలు దొంగ దీక్షలు, ధర్నాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి అన్నారు. ప్రజలకు, రైతులకు ఏ విధంగా నీరు ఇవ్వాలో అధికారులతో తాము సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. తలకిందులు చేసిన కూడా గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీ కెనాల్‌కు నీరు ఎప్పుడు విడుదల

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Pawan Kalyan Flop Movies List: ఉస్తాద్ భగత్ సింగ్:‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్లో అత్యధిక బడ్జెట్ తో అత్యధిక రోజులు షూటింగ్ జరుపుకున్న చిత్రంగా రికార్డులకు ఎక్కింది. గతేడాది రిలీజైన ఈ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్‌గా నిలిచింది. ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మెగాఫోన్ పట్టుకొని తెరకెక్కించిన చిత్రం‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా..అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అజ్ఞాతవాసి.. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా ‘అజ్ఞాతవాసి’. వీళ్ల కలయికలో వచ్చిన మూడో సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అన్న నాగబాబు నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. వీర శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తొలి ప్రేమ తర్వాత డైరెక్టర్ ఏ.కరుణా కరణ్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘బాలు’. ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలై టాప్ డిజాస్టర్ మూవీగా నిలిచింది. ‘ఖుషీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్.జే.సూర్య కాంబినేషన్లో పవన్

పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన కొనసాగుతోంది. భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, పార్టీ నాయకులతో కూడా మాట్లాడారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకోవాలని అన్నారు. ఎక్కడా ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా ప్రతి స్థానంలో పోటీకి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి ‘‘వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలును ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలి. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసుకుని, గ్రామాలు, వార్డుల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షంపై ఒత్తిళ్లు తీసుకురావడం, పోలీసులను ఉపయోగించి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడే ప్రయత్నాలు జరిగితే వాటిని ధైర్యంగా, సంఘటితంగా ఎదుర్కోవాలి. కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, నాడు–నేడు, ఆరోగ్యశ్రీ విస్తరణ, విద్యా రంగంలో సంస్కరణలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్థాయి నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మధ్యే ఉండాలి... వారి సమస్యలపై పోరాడాలి... వైఎస్సార్సీపీ పాలనలో వారికి జరిగిన మంచిని గుర్తుచేయాలి. అలా చేస్తే స్థానిక

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Fake Currency: ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అన్న సామెత నిజం అవుతోంది. బ్యాంకింగ్ రంగంలో కూడా ఈ సామెత నిజం అవుతోందా…? అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే యూపీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో భారీ అక్రమం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత కలిగిన కరెన్సీ వాల్ట్ నుంచి రూ. 7.4 కోట్ల విలువైన అసలైన కరెన్సీని మాయం చేసి, వాటి స్థానంలో నకిలీ నోట్లను పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కరెన్సీ చెస్ట్‌లో ఈ భారీ అక్రమం చోటుచేసుకుంది. అత్యంత భద్రత కలిగిన వాల్ట్ నుంచి సుమారు రూ. 7.4 కోట్ల విలువైన నకిలీ నోట్లను గుర్తించడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. రూ. 4.36 లక్షల వ్యత్యాసంతో బయటపడ్డ కుంభకోణం… పీఎన్బీ చీఫ్ డిప్యూటీ మేనేజర్ నిషా సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 10న బ్యాంక్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిన నగదు రెమిటెన్స్‌లో రూ. 4.36 లక్షల కొరత కనిపించింది. ఈ తేడాపై అనుమానం వచ్చి బ్యాంక్ అధికారులు ఆడిట్ నిర్వహించగా, కరెన్సీ వాల్ట్‌లో భారీ ఎత్తున నకిలీ నోట్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నిషా సింగ్ మాట్లాడుతూ, విచారణ వేగవంతం చేశాం. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత వివరాలను వెల్లడిస్తాం. నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. 'సిట్' ఏర్పాటు పీఎన్బీ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదర్ పోలీస్ స్టేషన్లో

కర్నూలు జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. కర్నూలు, సెప్టెంబర్ 1: జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. 67 ఏళ్ల అశోక్‌కు లివర్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, అలాగే 26 ఏళ్ల షేక్ జబీ ఉల్లాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారని అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య బృందం సమన్వయంతో శస్త్రచికిత్సలు పూర్తైనట్లు వెల్లడించారు. దాదాపు 20 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు కర్నూలులో జరగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కర్నూలులో ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం వైద్య రంగంలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. రాయలసీమలో ఇలాంటి అత్యాధునిక, క్లిష్టమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా ఉన్నారని... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని టీజీ భరత్ అన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, నిపుణులైన వైద్య బృందం కృషి అభినందనీయమన్నారు. గౌరిగోపాల్ హాస్పిటల్, టీఎక్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అవయవాలు దానం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. అవయవ దానం ద్వారా మరికొందరికి కొత్త జీవితాన్ని అందించడం గొప్ప మానవతా సేవగా చెప్పుకొచ్చారు. కర్నూలులోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా మంత్రి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఆగస్టు 2026 నాటికి జట్లు ఫైనల్ బెర్త్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో టేబుల్ టాప్‌లో ఉండగా, సౌతాఫ్రికా 4 మ్యాచ్‌ల్లో 36 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకతో ఇటీవల ముగిసిన 2 టెస్టుల సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకున్నప్పటికీ, చివరి టెస్ట్ డ్రా కావడంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికే పరిమితమైంది. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో జట్ల ప్రస్తుత పరిస్థితి గమనిస్తే.. 2023 డబ్ల్యూటీసీ విజేత అయిన ఆస్ట్రేలియా ఈ సైకిల్‌ను కూడా అదిరిపోయేలా ప్రారంభించింది. కారికోడ్ గ్రౌండ్స్‌లో వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో యాషెస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో ఊహించని ఓటమి ఎదురైనప్పటికీ, మ్యాకేలో జరిగిన రెండో టెస్టులో గెలిచి 80 పాయింట్ల శాతంతో మొదటి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆసీస్ తరఫున ట్రావిస్ హెడ్ 914 రన్స్ తో, మిచెల్ స్టార్క్ 58 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. మరోవైపు సౌతాఫ్రికా 75.00 పిసిటితో రెండో స్థానంలో ఉంది. భారత్ గడ్డపై ఏకంగా 25 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. టెంబా బవుమా కెప్టెన్సీలోని సఫారీ జట్టు ఇప్పటికే రెండు కఠినమైన పర్యటనలను విజయవంతంగా ముగించింది. తొలి డబ్ల్యూటీసీ విజేత న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో (72.22 PCT) మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ను వారి స్వదేశంలోనే 2-1 తేడాతో ఓడించి రికార్డు కొట్టింది. న్యూజిలాండ్ తరఫున డెవాన్ కాన్వే 676 పరుగులు, జాకబ్ డఫీ 23 వికెట్లు తీశారు. ఇక బంగ్లాదేశ్ ఈ సైకిల్లో దుమ్మురేపుతోంది. 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 55.56 పిసిటి సాధించి 4వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించడమే కాకుండా, పాకిస్థాన్‌పై

ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, డేటా అనలటిక్స్‌ను విశ్లేషించడం ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌరసేవలను మరింత మెరుగుపరచాలని, అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ (ఆర్టీజీ)పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, అల్లూరి విమానాశ్రయం వంటి కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని, ఇదే స్ఫూర్తిని ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కొనసాగించి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు తాను 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో 20 సార్లు పాల్గొన్నానని గుర్తుచేశారు. ఇదే క్రమంలో సంక్షేమ హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టళ్లకు ఆహ్వానించి, అక్కడి పరిస్థితులు, భోజనం, తాగునీటి సౌకర్యాలపై వివరించాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నార్తులకు సాయం అందించే దాతలను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు.ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ సేవలను పూర్తిగా ఆన్లైన్లోనే అందించాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ సహా అన్ని విభాగాలు ధ్రువపత్రాలను ఆన్లైన్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీకృత సేవల విధానం ద్వారా ప్రజలకు వేగంగా నిర్ణయాలు అందేలా చూడాలని అన్నారు. పనితీరు ఆధారంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బాధ్యులకు ర్యాంకులు ఇవ్వాలని

Kothapeta: తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ 6వ వార్షికోత్సవం కొత్తపేట: బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ 6వ వార్షికోత్సవాలకు కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారితో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ.. తన తండ్రి వెంకటస్వామి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తనకు కార్మికుల సమస్యలపై అవగాహన ఉందన్నారు. కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులే కాకుండా.. ఎక్కడ పని చేసే కార్మికులకైనా కనీస వేతనాలు అమలు కావాలన్నది తమ ప్రభుత్వ అభిమతమన్నారు. కార్మిక శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని చేసి రక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు. మధుయాష్కి గారు మాట్లాడుతూ... కార్మికుల పక్షపాతిగా మంత్రి వివేక్ గారు పనిచేస్తూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు . రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు గిగ్ వర్కర్లకు కూడా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడం అభినందనీయమన్నారు. అమెరికాలోని భారత కాన్సులేట్ లో తాను పని చేస్తున్నప్పటి నుంచి వెంకటస్వామి గారితోపాటు వారి కుటుంబ సభ్యులతో తనకు అనుబంధం ఉందన్నారు. వెంకటస్వామి గారిని నాన్న అని పిలిచేవాడినని గుర్తు చేసుకున్నారు. మంత్రి వివేక్ గారు సమర్థవంతంగా పనిచేస్తున్నారని.. మంచి ఇండస్ట్రియలిస్ట్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఏటా తమ కంపెనీ ద్వారా కోట్ల రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చేలా జీవో విడుదల చేసి అమలు చేయడం మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి పేద వర్గాల పట్ల ఉన్న ప్రేమాభిమానాలకు నిదర్శనం అన్నారు. ఈ
కాఫీ తాగితే కాలేయంలో అసాధారణ ఎంజైమ్‌లు తగ్గుతాయి. క్రమం తప్పకుండా రోజూ ఒక కప్పు తాగడం వల్ల కాలేయంపై మచ్చలు, ఫైబ్రోసిస్ తగ్గుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ వాపు, కొవ్వును తగ్గిస్తాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తింటే ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గుతుంది. ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయం దగ్గర కొవ్వు ఏర్పడకుండా చూస్తాయి. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ తింటే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఓట్స్‌లో బీటా గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్మీల్ తింటే ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గుతాయి. ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అవకాడో తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అల్లిసిన్ కూడా లభిస్తుంది. వెల్లుల్లి తింటే కాలేయ కొవ్వు కరుగుతుంది. బ్లూ బెర్రీస్, రాస్ప్బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెర్రీస్ తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది

10 అంగుళాల పిజ్జాకు ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఇంటికి చేరింది మాత్రం 7 అంగుళాల పిజ్జా. సైజు మూడు అంగుళాలు తగ్గిందని వినియోగదారుడు వదిలిపెట్టలేదు. రిఫండ్ కోసం పోరాడాడు. చివరికి వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. ఇప్పుడు ఆ పిజ్జా ధర కంటే 20 రెట్లు ఎక్కువ పరిహారం పొందాడు.ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా రూ.505 విలువైన 10 అంగుళాల పిజ్జాను ఓ వినియోగదారుడు ఆర్డర్ చేశాడు. డెలివరీ వచ్చిన తర్వాత సైజు చూసి ఆశ్చర్యపోయాడు. అది కేవలం 7 అంగుళాల పిజ్జా అని తేలింది.దీనిపై వెంటనే ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించాడు. రిఫండ్ ఇవ్వాలని కోరాడు. కానీ అతడి అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్, సీపీజీఆర్ఏఎంఎస్ పోర్టల్‌ను ఆశ్రయించాడు. లీగల్ నోటీసు కూడా పంపించాడు. ఫలితం లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు.విచారణ జరిపిన కమిషన్.. వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే సైజు పిజ్జాను పంపడం సేవల్లో లోపమని తేల్చింది. ఇది అన్యాయ వాణిజ్య పద్ధతేనని పేర్కొంది.ఫుడ్ డెలివరీ సంస్థ, రెస్టారెంట్ కలిసి వినియోగదారుడికి రూ.10,520 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో పిజ్జా ధర రూ.505, డెలివరీ ఛార్జీలు రూ.15 ఉన్నాయి. మానసిక, శారీరక వేధింపులకు రూ.5,000 పరిహారం చెల్లించాలని చెప్పింది. కేసు ఖర్చుల కింద మరో రూ.5,000 ఇవ్వాలని ఆదేశించింది. 45 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.తాము కేవలం రెస్టారెంట్లు, వినియోగదారుల మధ్య మధ్యవర్తులమని ఫుడ్ డెలివరీ సంస్థ

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు చికిత్స కోసం బారీ భద్రత నడుమ ఆసుపత్రికి తరలింపు ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌కు తరలింపు సగయింగ్ రీజియన్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైన్యం వైమానిక దాడి ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్న 14 మంది మృతి, 20 మందికి గాయాలు

సినిమా పేరు: ఇరుముడి -నటీనటులు:రవితేజ, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర, శ్వాసిక విజయ్, అజయ్ ఘోష్ తదితరులు -సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ -ఎడిటింగ్: ప్రవీణ్ పూడి -మ్యూజిక్: జివి ప్రకాష్ కుమార్ -నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి -బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ -రచన,దర్శకత్వం: శివ నిర్వాణ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026 మాస్ మహారాజా రవితేజ ఈ రోజు ప్రియా భవాని శంకర్, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 'ఇరుముడి' తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న ఇరుముడి ఎలా ఉందో చూద్దాం. త్రినాధ్( రవితేజ) ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని పచ్చని అటవీ ప్రాంతంలో ఉండే పొల్లూరు అనే విలేజ్ కి చెందిన వ్యక్తి. ట్రాలీ ఆటోలో తన పొలంలోనే పండించిన అరటిగెలలని తన ఊరు పక్కన ఉండే టౌన్ లో అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నా మంచి వ్యక్తి. అయ్యప్పస్వామి దీక్ష తీసుకునే టైంలో మాత్రం ఆల్కహాల్ జోలికి వెళ్ళడు. ఆడవాళ్ళ అందర్నీ తన కూతురుగా భావించడంతో పాటు చెడుని అంతం చేయడం త్రినాధ్ నైజం. భార్య పేరు కావేరి. కూతురుపేరు మణికంఠ. తొమ్మిదేళ్ల వయసు ఉన్న మణికంఠ ఐదవ క్లాస్ చదువుతుంటుంది. ఏవైనా చెడు సంఘటనలు, అసాంఘిక కార్యక్రమాలు చూసినా తండ్రికి చెప్పడం అలవాటు. ఆ విధంగా చెప్పడం చిన్నప్పట్నుంచి తండ్రి, కూతురు మధ్య ఉన్న ఒప్పందం కూడా. మరి ఆ ఒప్పందం తండ్రి కూతుళ్ళ జీవితంలో ఏమైనా మార్పులు తీసుకొచ్చిందా? వస్తే ఆ మార్పులు ఏంటి? పరిచయమైన కొత్త క్యారెక్టర్స్ ఎవరు? సమాజానికి ఏమైనా మంచి జరిగిందా అనేదే ఇరుముడి సీలేరు లాంటి ఏరియాలో కంప్లీట్ లైవ్ లొకేషన్స్ లో ప్రశాంతమైన వాతావరణంలో మూవీ ఫస్ట్ నుంచి చివరి వరకు బోర్ కొట్టకుండా సాగింది

ఆదాయపరంగా మెరుగైన స్థితిలో గిగ్ వర్కర్లు నగరంలో కొన్ని ఉద్యోగాల కన్నా 1.8 రెట్లు అధిక ఆర్జన వెల్లడించిన రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ నివేదిక అనేక రకాల ఉత్పత్తులను మన ముంగిటకు తెస్తూ.. వ్యక్తుల్ని గమ్యాలకు చేరుస్తూ.. ఎన్నో రకాలుగా నగర జీవనంలో భాగమైన డెలివరీ బాయ్స్ సమూహం (గిగ్ వర్కర్స్) ఆదాయపరంగా చాలా మంది కంటే మెరుగైన స్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని గిగ్ ఇంటర్నెట్ వర్క్‌ఫోర్స్ ఇన్ ఇండియా’ పేరుతో రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ విడుదల చేసిన నివేదిక తాజా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం 2030 నాటికి దేశంలో ఏర్పడాల్సిన వ్యవసాయేతర ఉద్యోగాల లోటులో దాదాపు 70 శాతం వరకు గిగ్ ఇంటర్నెట్ వర్క్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది. గంటకు రూ.138.. ఉత్పత్తుల డెలివరీ, రైడ్‌హెయిలింగ్, హోమ్ సరీ్వసెస్ వంటి విభాగాల్లో పని చేస్తున్న గిగ్ వర్కర్లు గంటకు సగటున రూ.138 నికర ఆదాయం పొందుతున్నారని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో సమానమైన సంప్రదాయ ఫార్మల్, ఇన్ఫార్మల్ ఉద్యోగాల్లో గంటకు సగటు ఆదాయం సుమారు రూ.54 మాత్రమే. అంటే గిగ్ వర్కర్ల ఆదాయం దాదాపు 2.5 రెట్లు అధికం. మన నగరంలో కనీస వేతన సమానమైన గంటకు రూ.75తో పోలిస్తే గిగ్ వర్కర్లు సుమారు 1.8 రెట్లు అధికంగా సంపాదిస్తున్నారని తెలిపింది. స్వేచ్ఛగా.. నైపుణ్యాలు మెరుగ్గా.. గిగ్ వర్క్‌లో ఆదాయంతో పాటు పని వేళల విషయంలో లభించే స్వేచ్ఛ కూడా యువతను ఆకర్షిస్తోందని నివేదిక పేర్కొంది. యాక్టివ్‌గా ఉన్న గిగ్ వర్కర్లలో 90 శాతానికి పైగా పార్ట్‌టైమ్‌గా పనిచేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రెగ్యులర్ ఉద్యోగం, చదువు, కుటుంబ బాధ్యతలు లేదా ఇతర కార్యకలాపాలకు ఆటంకం లేకుండానే అదనపు ఆదాయం పొందే అవకాశం వారికి లభిస్తోంది. వారాంతాల్లో అదనపు ఆదాయం పొందడం, చదువులు కొనసాగిస్తూనే ఫీజులు సంపాదించుకోవడం, రెండు ఉద్యోగాల మధ్య ఖాళీ సమయంలో ఆదాయం పొందడం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీల కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోని కోకాపేట ఓపెన్ స్కైస్లో ఉన్న అవినాశ్ రెడ్డి విల్లాతోపాటు పులివెందుల నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కడప జిల్లా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో అవినాశ్ రెడ్డి ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు వివరాలు వెలువడ్డాయి. వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టింది. 2020లో కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ, 2021లో మొదటి అభియోగపత్రంతోపాటు తర్వాత అనుబంధ అభియోగపత్రాలు దాఖలు చేసింది. వాటి ఆధారంగా 2025 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ఈడీ సోదాలు కేసులోని ఆర్థిక కోణాన్ని మరోసారి ప్రధాన చర్చగా మార్చాయి. అవినాశ్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతోపాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, యెర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరికి సంబంధించిన ప్రాంతాల్లోనూ తనిఖీలు సాగినట్లు సమాచారం. దీంతో హత్యకు ముందు, తర్వాత జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలు దర్యాప్తులో కీలకంగా మారాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాల ప్రకారం, వివేకానంద రెడ్డి హత్య వెనుక కుట్ర ఉందని పేర్కొంటూ పలువురి పాత్రపై ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా, హత్యకు సంబంధించి జరిగినట్లు అనుమానిస్తున్న నగదు లావాదేవీల మూలాలను గుర్తించడంపైనే అవినాశ్ రెడ్డి ఈడీ సోదాల్లో ప్రధానంగా దృష్టి ఉన్నట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థ గతంలో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయగా, అవినాశ్ రెడ్డికి న్యాయస్థానాల నుంచి ముందస్తు బెయిల్ లభించింది. ఈ కేసులో

సినిమా పేరు: అమీర్ లోగ్ -నటీనటులు: వేద జలంధర్, హరి మున్నంగి, మనోజ్ ఆవుల, శశిధర్ కొచ్చర్ల కోట, రావణ్ నిట్టూరు, -విశ్వేందర్ రెడ్డి, పవన్ రమేష్ తదితరులు -సినిమాటోగ్రఫీ: సాలిగంటి విజయ్ కుమార్ -ఎడిటింగ్: రోహిత్ పెనుమత్స -మ్యూజిక్: స్మరన్ సాయి -నిర్మాత: మాధవి రెడ్డి సోమ -బ్యానర్ : అవాళ్ నెంబర్ ప్రొడక్షన్స్ -రచన,దర్శకత్వం: రమణా రెడ్డి సోమ -రిలీజ్ డేట్ : ఆగష్టు 21 ,2026 హైదరాబాద్ పోరగాళ్ల కథ అంటు 'అమీర్ లోగ్' థియేటర్స్ లోకి వచ్చేసింది. రిలీజ్ డేట్ ఇరవై ఒకటి అయినా, ప్రమోషన్స్ తో వచ్చిన క్రేజ్ తో ప్రీమియర్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. శ్రీను( హరి మున్నంగి), రఫీక్(మనోజ్ ఆవుల), మల్లేష్( శశిధర్ కొచ్చర్ల కోట) చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఒక బస్తీ వాళ్ళ అడ్డా. ముగ్గురు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. పెద్దగా చదువుకున్న వాళ్ళు కూడా కావడంతో పాటు పని పాట లేకుండా తిరుగుతుంటారు. కానీ అమాయకత్వం, మంచితనం ఆ ముగ్గురి సొంతం. సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసే గీత(వేద జలంధర్) ఆ ముగ్గురికి ఆత్మీయురాలు లాంటిది. తమ బస్తీలోనే ఉండే గీతని అక్క అని పిలుస్తుండటంతో పాటు తమ కష్ట సుఖాలని పంచుకుంటూ ఉంటారు. గీత తన ఆఫీస్ లోనే పని చేసే టీం లీడర్ రవి(రావణ్ నిట్టూరు) ని ప్రేమిస్తూ ఉంటుంది. రవి వల్ల శ్రీను, రఫీక్, మల్లేష్ కి అన్యాయం జరుగుతుంది. దీంతో రవికి గీత బ్రేక్ అప్ చెప్తుంది. జులాయిగా తిరిగే శ్రీను, రఫీక్, మల్లేష్ కి రవి అన్యాయం చేయడం ఏంటి? అసలు ఆ ముగ్గురి స్నేహితుల కథ మొత్తం ఏంటి? వాళ్ళ జీవితంలో ఎవరెవరు ఉన్నారన్నదే అమీర్ లోగ్. ఎనాలసిస్ కథలో గొప్పతనం లేకపోయినా ఎక్కడ ఎలాంటి హడావిడి లేకుండా మంచి

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. నేడు నిందితులను కస్టడీకి తీసుకోనున్న పోలీసులు మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టిన నిందితులు ప్రియాంక కేసులో నిందితులను ప్రశ్నించనున్న పోలీసులు హైదరాబాద్: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు నేడు రెండోరోజు పోలీసు కస్టడీకి ఉదయ్ కృష్ణారెడ్డి మహిళా IPSపై లైంగిక వేధింపుల కేసులో విచారణ నేడు నిజామాబాద్‌లో మహేష్‌గౌడ్, సీతక్క పర్యటన అనంతరం పార్టీ కేడర్‌తో మహేష్‌గౌడ్, సీతక్క మీట్ హనుమకొండ: నేడు కొండా సుస్మిత పటేల్ కీలక సమావేశం పరకాల నుంచి పోటీకి సిద్ధమైన సుస్మిత పటేల్ దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో భారత జట్టు గెలుపు రేపటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం లండన్ బిజినెస్ స్కూల్లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 23న లండన్ నుంచి అమెరికాకు సీఎం రేవంత్ హార్వర్డ్, MIT యూనివర్సిటీలను సందర్శించనున్న సీఎం వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో భేటీకానున్న రేవంత్ న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మీట్ & గ్రీట్ 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం 30న హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ: నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం CWCకి హాజరుకానున్న సోనియా, రాహుల్, ప్రియాంక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం CWC సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల ఆందోళన మీద కేంద్రంపై ఒత్తిడికి వ్యూహం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై CWC సమీక్ష ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ హైదరాబాద్: నేడు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ భేటీ 24 క్రాప్ట్స్ అనుబంధ సంఘాల బైలాస్ సవరణపై చర్చ డ్యాన్సర్స్ అసోసియేషన్‌పై చర్యల అంశంపైనా చర్చ వరంగల్: నేడు నర్సంపేట

టెక్నో నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. పొవా 8 ప్రో 5జీ పేరుతో మంగళవారం ఈ ఫోన్‌ను సంస్థ విడుదల చేసింది. 6,500mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్, అమోలెడ్ డిస్ప్లే, 50MP కెమెరా దీని ప్రత్యేకతలు. ఫోన్ వెనుక భాగంలో 177 మినీ ఎల్ఈడీలతో ‘అలైవ్ మ్యాట్రిక్స్’ డిస్ప్లేను కూడా అందించారు. ఇది వివిధ సందర్భాల్లో ప్రత్యేకమైన లైటింగ్ ఎఫెక్ట్‌ను చూపిస్తుంది.భారత్‌లో పొవా 8 ప్రో 5జీ ధర రూ.49,999గా నిర్ణయించారు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలపై రూ.3,000 వరకు ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆగస్టు 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆర్క్ వైట్, గ్రాఫైట్ బ్లాక్, టండ్రా గ్రీన్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది.ఈ ఫోన్లో 6.78 అంగుళాల హైపర్‌లక్స్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 1,208×2,644 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16తో పనిచేస్తుంది. రెండు ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లు, మూడేళ్ల సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని టెక్నో తెలిపింది.మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో ఫోన్ పనిచేస్తుంది. 4nm తయారీ ప్రక్రియతో రూపొందిన ఈ చిప్ 2.6GHz గరిష్ఠ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. వేడిని నియంత్రించడం కోసం 5,000 చదరపు మిల్లీమీటర్ల వేపర్ ఛాంబర్ కూలింగ్ వ్యవస్థ ఉంది. వెనుక 50MP ప్రధాన కెమెరాకు ఓఐఎస్, 8MP అల్ట్రావైడ్ కెమెరా జత చేశారు. ముందు 13MP సెల్ఫీ

స్టూడెంట్ ట్రైబ్ ఈవెంట్లో UPEL.. యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు హైదరాబాద్: ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ రంగంలో సేవలు అందిస్తున్న UPEL Private Limited యువతతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు స్టూడెంట్ ట్రైబ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయిన UPEL టీమ్.. యువతలోని ప్రతిభను గుర్తించి, వారికి పరిశ్రమకు సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందించేందుకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం Electronics, Electrical, ECE, EEE, Mechatronics, Automation వంటి టెక్నికల్ విభాగాలతో పాటు Digital Marketing, Content Creation, Video Production, Social Media, Business Development, Sales వంటి విభాగాల్లో కూడా ఇంటర్న్‌షిప్ అవకాశాలను UPEL అందించనుంది. టెక్నికల్ విభాగాల్లో ఎంపికయ్యే విద్యార్థులకు VFDs, PLCs, HMIs, Servo Drives, CNC Systems, PCB Repair, Control Panels, Industrial Automation, Troubleshooting వంటి అంశాలపై ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో క్రియేటివ్ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సోషల్ మీడియా కంటెంట్, రీల్స్, వీడియో ప్రొడక్షన్, డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్ మరియు B2B కంటెంట్ వంటి విభాగాల్లో పనిచేసే అవకాశం కల్పించనున్నారు. ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన క్లిష్టమైన అంశాలను యువతకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తూ, రోజువారీ టెక్నికల్ కంటెంట్‌ను రూపొందించే కార్యక్రమాన్ని కూడా UPEL చేపట్టనుంది. ఇందులో భాగంగా టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు కెమెరా ముందు కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలిగే యువ ప్రతిభకు ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు రియల్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ వర్క్ కల్చర్, కెరీర్‌పై అవగాహన కల్పించడమే ఈ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని UPEL Founder అజయ్ కుమార్ ఇనమడుగు మరియు CEO నరేష్ సిలివేరు తెలిపారు. స్టూడెంట్ ట్రైబ్ వంటి యువత వేదికలతో కలిసి పనిచేయడం ద్వారా విద్యార్థులు–పరిశ్రమల మధ్య వారధిగా

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా లైవ్ కామెంట్రీ బాక్స్ - స్టూడియో మధ్య చోటుచేసుకున్న సరదా సంభాషణ కాస్తా వాడివేడి వివాదంగా మారింది. భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్ ఆన్-ఎయిర్ లైవ్ షోలో ఒకరిపై ఒకరు చేసుకున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో, స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్ మైదానం వద్ద నుండి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. "మీరు పెట్టే ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి సరిగా అర్థం కావడం లేదు, అది కొంచెం తగ్గించండి" అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అసహనానికి గురైన సంజయ్ మంజ్రేకర్ వెంటనే స్పందిస్తూ.. "కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి, ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది, మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి" అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని ఎద్దేవా చేశారు. దానికి కార్తిక్ "నేను అద్దంలో చూసుకోను, అది మీ అలవాటే" అని రీకౌంటర్ ఇచ్చారు. వాతావరణం కాస్త సీరియస్‌గా మారుతుండటంతో, మంజ్రేకర్ "మనం హద్దులు దాటి మాట్లాడుకుంటే సోషల్ మీడియాకి మంచి కంటెంట్ దొరుకుతుంది" అని వ్యాఖ్యానించి నవ్వుతూ పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు

మన శరీరంలో పుట్టుకతోనే ప్రతి అవయవం ఏర్పుడుతుంది. ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకమైన పని ఉంటుంది. అందుకే ఏదైనా ఒక అవయవం లేకపోతే మనిషి బతకగలడా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. వైద్యశాస్త్రం ప్రకారం శరీరంలో కొన్ని అవయవాలు లేకపోయినా మనుషులు ఆరోగ్యంగా జీవించగలరు. ఆ అవయవాలేంటో తెలుసుకోండి. అపెండిక్స్ (Appendix) అనేది పెద్ద ప్రేగు మొదట్లో ఉండే ఒక చిన్న గొట్టం లాంటి అవయవం. దీన్ని చాలాకాలం 'పనికిరాని అవయవం'గా భావించారు. కానీ ఇప్పుడు ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేయడంలో, రోగనిరోధక వ్యవస్థలో పాత్ర పోషిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అపెండిక్స్ను తొలగించిన తర్వాత కూడా చాలామంది సాధారణ జీవితాన్ని గడపగలరు. ఎందుకంటే, శరీరంలోని మిగతా పేగులు, రోగనిరోధక వ్యవస్థ దాని లోటును భర్తీ చేస్తాయి. పిత్తాశయం (Gallbladder) అనేది కాలేయం తయారుచేసే పైత్యరసాన్ని నిల్వ చేసే చిన్న అవయవం. ముఖ్యంగా, కొవ్వు పదార్థాలున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఈ పైత్యరసం ఉపయోగపడుతుంది. అయితే, పిత్తాశయాన్ని తొలగించినా కాలేయం పైత్యరసాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. ఆ పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉండకుండా నేరుగా చిన్న ప్రేగులోకి వెళ్లి జీర్ణక్రియకు సహాయపడుతుంది. మొదట్లో కొందరికి జీర్ణక్రియలో చిన్న మార్పులు కనిపించినా, చాలామంది తర్వాత సాధారణ జీవితాన్ని గడుపుతారు. ప్లీహం (Spleen) మన రోగనిరోధక వ్యవస్థలో చాలా ముఖ్యమైనది. ఇది కొన్ని తెల్ల రక్త కణాల పనితీరుకు, పాత లేదా దెబ్బతిన్న రక్త కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ప్లీహాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించాల్సి రావచ్చు. ప్లీహం తొలగించిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవించగలడు. కానీ, ఇన్ఫెక్షన్ల నుండి తమను తాము రక్షించుకోవడానికి టీకాలు వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మన శరీరంలో రెండు కిడ్నీలు ఉన్నప్పటికీ, చాలామంది ఒక కిడ్నీతో చాలాకాలం ఆరోగ్యంగా జీవించగలరు. ఒక కిడ్నీని దానం చేసినా లేదా మరో కిడ్నీ పనిచేయకపోయినా, మిగిలిన కిడ్నీ

బస్సుల్లో ప్రయాణం అంటే ఉదయాన్నే రద్దీ, కండక్టర్ చిల్లర ఇవ్వండి అనడం, ఆపై జేబుల్లో కాయిన్స్ కోసం వెతుక్కోవడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. వీటితో పాటు మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం కూడా అమలువుతున్న నేపథ్యంలో పీక్ అవర్స్ లో ఆర్టీసీ బస్సులో విపరీతమైన రష్ ను మనం ఎదుర్కుంటున్నాం. చాలా సార్లు కండక్టర్ మన కాళ్లు తొక్కుకుంటూ టికెట్ ఇవ్వడానికి వెళ్తున్న ఇబ్బందికర పరిస్థితులను కూడా చూశాం.అయితే, ఈ రోజువారీ తిప్పలకు త్వరలోనే చెక్ పడనుంది. హైదరాబాద్ నగర రవాణాను సరికొత్త డిజిటల్ బాట పట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. మెట్రో రైలు తరహాలోనే.. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి ముందే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకునే సౌకర్యాన్ని మీ టికెట్ (Mee Ticket) యాప్ రూపంలో అందుబాటులోకి తెస్తోంది.ఈ కొత్త విధానంతో రద్దీ సమయాల్లో బస్సుల్లో నిలబడి, ఊపిరి ఆడని జనం మధ్య కండక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికులు తమ మొబైల్ యాప్‌లో ఎక్కే బస్ స్టాప్, దిగే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ముందే చెల్లింపులు చేయవచ్చు. టికెట్ బుక్ అవ్వడమే కాకుండా, బస్సు ప్రస్తుతం ఎక్కడుందో లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ సమయానికి డిజిటల్ ప్రయాణం చేయవచ్చు. అంతేకాకుండా ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ వంటి సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం.నైరుతి బైబై?.. పసిడి నేలను పలకరించకుండానే వీడ్కోలు..ఈ సదుపాయం రావడం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కండక్టర్లపై పనిభారం గణనీయంగా తగ్గుతుంది. ప్రతిరోజూ నగరంలో తిరిగే 3200కు పైగా బస్సుల్లో సుమారు 26 లక్షల మంది ప్రయాణిస్తుండగా, ఇప్పటికే 23 శాతం
రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన జీవీఎన్ అప్పారావు.. గత పదేళ్లుగా రాష్ట్రీయం, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కథనాలు, విశ్లేషణల రాస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ కోసం ఆయన పని చేశారు. సోషల్ మీడియా పోస్టులను జీవీఎన్ అప్పారావు ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. ఆధ్యాత్మికత, ఆస్ట్రాలజీకి సంబంధించిన కథనాలు రాసిన అనుభవం ఉంది. జీవీఎన్ అప్పారావు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ, ఈనాడు జర్నలిజం స్కూల్లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు సంస్థలో ఐదేళ్లకుపైగా పని చేశారు. ఆ సమయంలో ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, సినిమాలు, కొత్త ప్రదేశాలు చూసేందుకు ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Irumudi Pre Release Event Speech: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఇరుముడి' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన 'మల్లెపూల పల్లకి' పాట ఆ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ అయ్యప్ప భక్తుల్లో అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ 'మల్లెపూల పల్లకి' పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. 'ఇరుముడి' కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి మోడరన్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు. పవర్ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్‌తో పాటను చాలా ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. ఒరిజినల్ పాటకు తన వాయిస్‌తో ప్రాణం పోసిన డప్పు శ్రీను, ఈసారి కూడా తన గాత్రంతో రా, డివోషనల్ ఫీల్‌ను తీసుకువచ్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో రవితేజ వేసిన మాస్ డ్యాన్స్ మూవ్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖుల మాటలు.. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో రవితేజ మాట్లాడుతూ.. "ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్. ఇందులో నటించిన ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మైండ్‌లో ఉండిపోతుంది. ముఖ్యంగా సాయికుమార్ గారిని ఒక డిఫరెంట్ వేలో చూస్తారు. బల్లగుద్ది చెబుతున్నా.. ఈ సినిమా మీకు తెగ నచ్చేస్తుంది

శ్రీలంకలో జరుగుతున్న గాలే టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా, చివరకు సెంచరీ మిస్ అయ్యాడు. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్ 82 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మ్యాచ్ లో అంతా బాగానే నడిచినా, రాహుల్ అదృష్టం మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది. మరోసారి మూడంకెల స్కోరుని అందుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో కేఎల్ రాహుల్ 80s లేదా 90s లో అవుట్ అవ్వడం ఇది ఏడోసారి కావడం విశేషం. ప్రతిసారి నర్వస్ 90s లేదా 80s కి రాగానే ప్రెజర్ ఫీల్ అవుతున్న రాహుల్, చివరికి వికెట్ సమర్పించుకుంటున్నాడు. గాల్ టెస్టు తొలి రోజు కేఎల్ రాహుల్ 77 పరుగుల వద్ద కండరాల నొప్పులు రావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగిన సంగతి తెలిసిందే. గాలే టెస్టు రెండో రోజు ఆట వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైంది. మొదటి రోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించి, రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. రెండో రోజు రిషభ్ పంత్ అవుట్ అయిన తర్వాత రాహుల్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. కానీ, తన వ్యక్తిగత స్కోరుకు కేవలం ఐదు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్పిన్నర్ కేశర నువానిత బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 175 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేసిన రాహుల్, తన 13వ టెస్ట్ సెంచరీకి చేరువలో ఆగిపోయాడు. ఇది కేఎల్ రాహుల్ కెరీర్లో 21వ అర్ధశతకం. 80 దాటాక మైండ్ గేమ్ లో రాహుల్ కింగ్‌లా ఆడలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. కేఎల్ రాహుల్ టెస్ట్ క్రికెట్ లో 80s లేదా 90s మధ్యలో అవుట్ అవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఈ రేంజ్ లోనే పెవిలియన్ దారి పట్టాడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే అవకాశం కనిపిస్తున్న ఈ సభా సమరంలో సర్కార్‌ను కార్నర్ చేసేందుకు ప్రతిపక్షం, వైసీపీ దాడిని తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహప్రతివ్యూహాలు సిద్ధమయ్యాయి. మొదటిరోజే సభలో అసలైన రాజకీయం నడవనుంది. నిరుద్యోగులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న మెగా డీఎస్సీ-2025పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలిరోజే సభలో సంచలన ప్రకటన చేయనుండటంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు ఎల్-నినో ప్రభావంపై లఘు చర్చతో సభను మొదటిరోజే రసవత్తరంగా మార్చేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది.గైర్హాజరైతే జీతాలు కట్.. స్పీకర్ సంచలన అస్త్రం!సభకు రాకుండా జారుకునే ఎమ్మెల్యేలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపై సభలో దొంగ హాజరులకు ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు. సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో స్వయంగా కూర్చుంటేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ-కెమెరాలు ఆటోమేటిక్‌గా ఆన్ అయి హాజరును రికార్డు చేసేలా డిజిటల్ కెమెరా టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇంతటితో ఆగకుండా, ప్రజాధనాన్ని వృథా చేస్తూ సభకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధుల జీతభత్యాలను వెనక్కి తీసుకునేలా పార్లమెంట్ పరిధిలోనే కఠిన చట్టం తేవాలని కేంద్రానికి లేఖ రాసినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజలు గెలిపించింది సభలో కూర్చుని మాట్లాడటానికేనని, జగన్ బాధ్యతాయుతంగా అసెంబ్లీకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు.జగన్ సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్! అసెంబ్లీకి రాకపోతే జీతం కట్గత అక్రమాలపై అటాక్.. నాలుగు రోజుల పొలిటికల్ డ్రామా!నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం పాత సర్కార్ పాపాలను ఎండగట్టేందుకు పక్కా అజెండాతో వస్తోంది. ఆగస్టు 18న స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చ జరగనుండగా.. మూడో రోజు వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల స్కామ్‌ను బయటపెట్టేందుకు వ్యూహం రచించింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, నాలుగో రోజు పెట్టుబడులతో పాటు సూపర్-6 హామీల అమలుపై సుదీర్ఘంగా చర్చించనుంది. మొత్తం 6 కీలక

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత వైభవంగా జరుగుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం సూర్యతేజతో అత్యంత వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పాటు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చారు. ప్రముఖుల సందడితో వివాహ ప్రాంగణం అంతా తారాతోరణాన్ని తలపిస్తూ పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్‌కి చెందిన స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అతిథులందరినీ బండ్ల గణేష్ స్వయంగా దగ్గరుండి సాదరంగా ఆహ్వానిస్తూ సత్కరించారు. సంప్రదాయబద్ధంగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకలో సినీ తారల రాకతో ప్రత్యేక ఆకర్షణ నెలకొంది. నూతన దంపతులు జనని, సూర్యతేజ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న శుభవేళ వేదమంత్రోచ్ఛారణల మధ్య వివాహ క్రతువు ఘనంగా సాగుతోంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన విశేషాలు, ప్రముఖుల సందడిని వీక్షించేందుకు కింది లైవ్ వీడియో చూడండి. ఇండియాలో ఇద్దరు హీరోల వయసే వెనక్కి వెళుతోంది: త్రివిక్రమ్ పవన్, చరణ్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. ‘ది ఇండియన్ బార్డర్’ నుంచి ‘జిందా రహేన్ తో డ్యూటీ’ సాంగ్ విడుదల

ఐదు నిమిషాల ఆలస్యం.. కస్టమర్‌కు కోపం కట్టలు తెంచుకుంది! ఆర్డర్ లేట్‌గా వచ్చిందన్న ఆగ్రహంతో ఓ డెలివరీ బాయ్‌పై కస్టమర్ దాడికి దిగాడు. ఫోన్ లాక్కొని, చెంపదెబ్బలు కొట్టి, తన్నడమే కాకుండా ఇంట్లోకి తీసుకెళ్లి మరీ దాడి చేశాడనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మొత్తం ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు నిలిపివేస్తామని ప్రకటించి, నిరసనకు దిగారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకోగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గంగాసాగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందుకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. అక్కడ కస్టమర్ యమన్‌తో డెలివరీ ఆలస్యంపై వాగ్వాదం జరిగింది. అమిత్ ప్రకారం ఆర్డర్ సుమారు ఐదు నిమిషాలు ఆలస్యమైంది. కానీ యమన్ మాత్రం తాను 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చానంటూ ఆరోపించినట్లు అమిత్ తెలిపాడు. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సీసీటీవీ దృశ్యాల్లో యమన్.. అమిత్ ఫోన్ లాక్కొని, అతడిని కొట్టడం, తన్నడం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని ఇంట్లోకి తీసుకెళ్లి అక్కడ కూడా దాడి కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అమిత్ ఫిర్యాదు ప్రకారం.. యమన్ తనపై హత్య బెదిరింపులకు పాల్పడ్డాడని, డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు. అంతేకాదు, తన భార్యకు సంబంధించిన వేధింపుల కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు కూడా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తోటి డెలివరీ ఏజెంట్లు స్పందించారు. అమిత్‌ను గుర్తించి అతడిని సంప్రదించారు. అనంతరం అందరూ కలిసి భవన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డెలివరీ ఏజెంట్ల బంద్.. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన డెలివరీ ఏజెంట్లు పనులు నిలిపివేశారు. అమిత్‌కు కస్టమర్ బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు డెలివరీలు చేయబోమని ప్రకటించారు. “ఆర్డర్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.. ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యాన్ ప్రారంభం నేటినుంచి సెప్టెంబర్ 19 వరకు ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ ఓపెన్ నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నేడు ఉమెన్స్ హాకీ ప్రపంచకప్‌లో భారత్ Vs చైనా నెదర్లాండ్స్‌లో సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ నేడు కామారెడ్డి, ములుగు, హన్మకొండ జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన జుక్కల్ MLA కుమార్తె లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందులో పాల్గొననున్న సీఎం సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్న సీఎం రేవంత్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం విజయవాడ: నేడు DSC-2025 ద్వారా ఎంపికైన టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ ఉ.10:30కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ పాల్గొననున్న ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ప.గో. జిల్లాల టీచర్లు పశ్చిమ గోదావరి: ప్రమాదవశాస్తూ కాలువలోకి దూసుకుపోయిన కారు.. నలుగురి గల్లంతు పెరవలిలో పెళ్లికి వెళ్లివస్తుండగా ఇరగవరం మం. అయితంపూడి లాకుల వద్ద ఘటన 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,55,130 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.1,42,200

కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..!కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..! August 15 Jyothi Gadda జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే పచ్చి కరివేపాకులను బాగా నమలి తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర అదుపు: కరివేపాకులో ఉండే ప్రత్యేక పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయం: కరివేపాకులో ఉండే ఇథైల్ అసిటేట్, మహనింబిన్ వంటి రసాయనాలు శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కరివేపాకులో విటమిన్- బి, సి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణను అందించి జుట్టు రాలడాన్ని అరికడతాయి. క్రమంగా ఒత్తైన, నల్లని దృఢమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్- ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఉదయాన్నే కరివేపాకు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి కాలేయాని కి రక్షణగా నిలిచి దాని పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున నమలడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరిగి, అనిమియా లేదా రక్తహీనత సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు చేరకుండా కరివేపాకులోని భాగాలు నిరోధిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Allu Arjun Independence Flag Controversy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. వివాదానికి కారణం ఏమిటి? స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అయితే, ఆ జెండా మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం అందులో కనిపించలేదు. దీంతో బాధ్యత గల ప్రముఖ నటుడిగా జాతీయ పతాకాన్ని సరిచూసుకోకుండా పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలో చక్రం లేకపోయినా, అల్లు అర్జున్ తన సొంత లోగోను మాత్రం స్పష్టంగా వేసుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు పెరుగుతుండటంతో బన్నీ వెంటనే ఆ పోస్టును తొలగించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ లైనప్ ప్రాజెక్ట్స్ మరోవైపు, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 'రాకా' భారీ బడ్జెట్‌తో వస్తోంది. గిరిజన, పురాణ నేపథ్యం, సమకాలీన కాలం అనే రెండు విభిన్న ప్రపంచాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. 2027 సెకండాఫ్‌లో రిలీజ్ కానున్న ఈ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. IND Vs SL 1st Test Weather: భారత్, శ్రీలంక జట్ల మధ్య లాంగ్ ఫార్మాట్ పోరు ప్రారంభమైంది. శ్రీలంకలోని చారిత్రాత్మక గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనా, వరుణుడి రూపంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయినా మొదటి రోజు ఆటకు అంతరాయం ఏర్పడినా.. రేపటి నుంచి వర్షం మరింతగా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలే వేదికగా తొలి టెస్టు వాతావరణం.. భారత్ - శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాలే స్టేడియం వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వర్షం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. మ్యాచ్‌కు ముందు రోజు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తీవ్రంగా దెబ్బతింది. ఆటగాళ్లు మైదానంలో పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయారు. ఉదయం వర్షం తగ్గినప్పటికీ, రోజంతా అప్పుడప్పుడు కురిసిన చినుకులు ఆటకు అడ్డంకిగా మారాయి. వరుణుడి కరుణపైనే మ్యాచ్ భవితవ్యం ఐదు రోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు వర్షం పడే ఛాన్స్ ఉండటంతో, మ్యాచ్ ఫలితం కేవలం ఆటగాళ్ల ప్రదర్శనపైనే కాకుండా వాతావరణంపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. వరుణుడు శాంతిస్తేనే ఈ హోరాహోరీ పోరును పూర్తిస్థాయిలో చూసే అవకాశం లభిస్తుందని క్రికెట్

IND vs SL: టీమిండియా చాలా కాలం తర్వాత మళ్లీ టెస్టు సమరానికి సిద్ధమైంది. భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాళ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. అయితే అభిమానులకు ఈ మ్యాచ్ తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తోంది. ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడమే దీనికి కారణం. గాళ్ స్టేడియంలో జరగనున్న ఈ తొలి టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. ఇండియన్ ఓషన్ తీరంలో ఉన్న ఈ మైదానంలో వాతావరణం దారుణంగా మారింది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు గాళ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మొదటి రోజు ఉదయం 10 గంటల తర్వాత వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ రోజంతా మబ్బులు కమ్మే ఉండే అవకాశం ఉంది. మధ్యమధ్యలో పడే తేలికపాటి చినుకులు మ్యాచ్‌ను పదే పదే అడ్డుకోవచ్చు. మ్యాచ్‌కు ముందు రోజైన నిన్న కూడా సరిగ్గా ఇలాంటి వాతావరణమే ఉండటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆటగాళ్లు మైదానంలో సరైన ప్రాక్టీస్ చేయలేకపోయారు. ఈ తొలి టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగాల్సి ఉండగా వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అందులో నాలుగు రోజులు వర్షం పడే అవకాశం ఉంది. కేవలం ఒక రోజు మాత్రమే వాతావరణం పొడిగా, ప్రశాంతంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఆటగాళ్ల నైపుణ్యంపైనే కాకుండా వరుణుడి కరుణపైనే ఎక్కువగా ఆధారపడి ఉండనుంది. వాతావరణం సహకరిస్తేనే పూర్తి స్థాయిలో ఆట సాధ్యమవుతుంది. భారత్, శ్రీలంక జట్ల మధ్య తీవ్ర పోటీని చూడాలని ఆశిస్తున్న అభిమానులకు వాతావరణ సూచన ఆందోళన కలిగిస్తోంది. వరుణుడు

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Live Frog Milk Tea Viral Video: సోషల్ మీడియా అనేది ఒక మాయా ప్రపంచంగా మారిపోయింది.. ఇందులో ఎప్పుడు ఎలాంటి, దేనికి సంబంధించిన వీడియోలు, వార్తలు టెండర్ అవుతాయో ఊహించడం చాలా కష్టమని మనందరికీ తెలుసు.. అప్పుడప్పుడు ఇందులో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే నవ్వొస్తుంటుంది.. మరికొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు కూడా గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఒక వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది.. చైనాకు సంబంధించిన ఒక వ్యక్తి తాను తాగే మిల్క్ టీ గ్లాసులోని ఏకంగా బతికి ఉన్న ఒక పెద్ద కప్పని వేసుకొని.. స్ట్రాతో ఆ టీని తాగుతూ ఉన్నట్లు వీడియో వైరల్ అవుతుంది.. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు షాక్‌కు గురైనట్లు తెలుస్తోంది.. చైనా వాళ్లు జంతువులను ఇష్టమొచ్చినట్లు చంపుకొని ఆహారంగా తీసుకుంటారని.. వారి అలవాట్లపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ వీడియోను @lolong___ అనే x యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ వీడియో అప్పటినుంచి విపరీతంగా వైరల్ అవుతూ వచ్చింది. ఈ వీడియోని ఏకంగా 1.2 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చైనీలు బతికున్న కప్పను పాల టీలో వేసుకుని.. దాన్ని రసాన్ని తాగుతారు.. అని క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో వదలడంతో.. చాలామంది ఈ వీడియో పై ఆగ్రహం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Minister Anam Ramanarayana Reddy Ill Health: ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటన తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జరిగింది. జెండా ఆవిష్కరించిన తరువాత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగిస్తుండగా స్టేజీ పైన ఒక్కసారి కుప్పకూలిపోయారు. దీంతో ఉలిక్కిపడ్డ ఆనం భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో పెద్ద గండం తప్పింది. దీంతో వారు అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ఆనంకు ప్రాథమిక చికిత్స అందించారు. ఇక మంత్రి ఆనంను పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. గంటకు పైగా నిలబడి ప్రసంగించడంతో అస్వస్థత నెలకుందని చెప్పుకొచ్చారు. కొంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆనం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆ రోజు ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి. డాక్టర్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. మొత్తంగా రాబోయే రోజుల్లో ఆనం పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దు చేస్తారా లేదా కొనసాగుతాయా అనేది చూడాలి మరి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. CM Revanth Independence Day 2026 Speech: జై తెలంగాణ' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ అహింసా మార్గం, జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య పోరాటాలను, మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశంలో జరిగిన హరిత, శ్వేత, నీలి విప్లవాల అభివృద్ధిని ప్రస్తావించారు. గత 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేస్తూ సంక్షేమ పథకాలను విస్తరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే 91 శాతం ఉందనే సానుకూల అంశాన్ని వెల్లడించారు. వ్యవసాయ రంగం.. రైతుల సంక్షేమం.. రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. యాసంగిలో 8,500 కొనుగోలు కేంద్రాల ద్వారా 81,12,000 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వ్యవసాయంలో తెలంగాణ పంజాబ్‌ను మించిందని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత.. సంక్షేమ పథకాలు.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతిరోజూ 34 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీ, శిల్పారామం వేదికలుగా కల్పిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డులు.. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి స్మార్ట్ కార్డుల

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Independence Day 2026: వరుసగా 13 సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర భద్రత బలగాలు, పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తొలిసారి ఎర్రకోట వేడుకల్లో వందేమాతరం గేయం.. ఈ ఏడాది ఎర్రకోటలో జరగబోయే స్వాతంత్ర్య వేడుకల్లో రెండు ప్రత్యేక అంశాలు ఉన్నాయి. మొదటిది వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై తొలిసారిగా ఆ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. రెండవ ప్రధాన అంశం యువ శక్తి – వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో యువత ఆశలు, ఆకాంక్షలు, దేశ నిర్మాణంలో వారి పాత్రను హైలైట్ చేసే విధంగా వేడుకలను రూపొందించారు. జ్ఞాన్పథ్పై దాదాపు 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు వందే మాతరం ఆకారంలో నిలబడతారు. వీరిలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన బాలురు, బాలికలు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ మన జాతీయ గీతమైన జనగణమణను ఆలపిస్తుండగా.. దీని స్ధానంలో ఈసారి వందేమాతర గీతాన్ని ఆలపించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత శక్తి అందించే తోడ్పాటు ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తంగా ఉంటుందని కూడా కేంద్రం వెల్లడించింది. అయితే

ఎర్రకోట వద్ద పటిష్ఠ భధ్రత.. వందేమాతరం గీతాలాపన తర్వాత సభా ప్రాంగణంలో వాయు సేన విమానాలతో పూల వర్షం.. పంద్రాగస్టు వేడుకలు హాజరైన కేంద్ర మంత్రులు, విద్యార్ధులు, వివిధ రంగల ప్రముఖులు.. అలరిస్తున్న విద్యార్ధులు, సైనిక దళాల కవాతు.. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. జెండా వందనం ముందు వందేమాతరం గీతాలాపన..మరికాసేట్లో ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండాను ఎగరేయనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఢిల్లీ ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎర్రకోటకు వెళ్లేముందు రాజ్ ఘాట్‌ను సందర్శించిన ప్రధాని మోడీ.. కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Independence Day 2026 Live Updates: దేశ వ్యాప్తంగా ప్రజలు 80వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. 1947లో బ్రిటిష్ పాలనకు విముక్తిగా ప్రతి యేడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై మువ్వెన్నల జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. ఇక భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ వరుసగా 13వ సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వేళ భారత ప్రధాని ఎర్రకోట నుంచి ఎలాంటి సందేశం ఇస్తారనేది దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతినుద్దేశించి దేశ ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా

భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఒక ప్రత్యేకమైన భావోద్వేగ స్థానం ఉంది.బ్రిటిష్ సంకెళ్లను తెంచుకుని,స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఆ మధుర క్షణాలను తనివితీరా గుర్తుచేసుకునే పర్వదినం ఇది. దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది.ఆనాడు దేశ సార్వభౌమత్వాన్ని చాటుతూ ఎర్రకోటపై ఎగిరిన త్రివర్ణ పతాకం,నేడు కూడా కోట్లాది మంది భారతీయుల గుండెల్లో దేశభక్తిని,గర్వాన్ని రగిలిస్తోంది.ఈ మహోజ్వల సంబరాలకు ముందు రోజు,అంటే ఆగస్టు 14న దేశ విభజన నాటి దారుణాలను గుర్తుచేసుకునే విభజన భీభత్స స్మృతి దినంగా పాటిస్తాం.స్వాతంత్ర్య సంబరాల వెనుక ఎందరో అమాయక ప్రాణాల బలిదానాలు,కుటుంబాల విడిపోయిన వేదన దాగి ఉన్నాయి.ఆ చేదు జ్ఞాపకాలను స్మరిస్తూనే,సాధించుకున్న స్వేచ్ఛ విలువను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరి హృదయం ఆకాంక్షిస్తుంది.1947లో మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన ఈ పతాకావిష్కరణ సాంప్రదాయం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది.ఈ మహోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు,నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుతామని ప్రతి పౌరుడు శపథం పూనే పవిత్రమైన సమయం.భరతమాత స్వేచ్ఛా ప్రస్థానం తరతరాల త్యాగాల పునాదులపై నిర్మితమైందని మనకు నిరంతరం గుర్తుచేస్తుంది.ఈ నేపథ్యంలో ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసే ప్రసంగం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.అలాగే తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు రేవంత్ రెడ్డిలు కూడా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్డేట్స్ మీకోసం

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంటే, ఏపీలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఏపీ ప్రభుత్వం వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మరొక కొత్త కార్యక్రమానికి ఏపీ సర్కారు శ్రీకారం చుట్టింది.స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధికి కొత్త కార్యక్రమంపర్యావరణహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా గ్రామీణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించనుంది. గ్రామీణ ప్రాంతాలలో లభించే గుర్రపు డెక్క నుండి సేంద్రియ ఎరువు తయారీ ప్రక్రియను మహిళల ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా అమలవుతుంది.ఏపీ ఫర్ సేల్.. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్: మాజీమంత్రి సంచలనం!ఈ జిల్లాలో చెత్త నుండి సంపద కేంద్రాలలో సేంద్రీయ ఎరువుల తయారీఏపీలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలలో చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాల ద్వారా మహిళలు గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు. తొలి విడతగా తూర్పుగోదావరి జిల్లాలోని 10మండలాలలో 11గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారు. అనపర్తి, తోసిపూడి, సమిశ్రగూడెం, ద్వారపూడి, జేగురుపాడు, కోలమూరు, నుదుపల్లి, లొల్ల, పల్లంగి, కపిలేశ్వరపురం, ఉండ్రాజవరం వంటి గ్రామపంచాయతీలలో సంపద సృష్టి బాధ్యతలను ఎస్ హెచ్ జీ మహిళలకు అప్పగించారు.గుర్రపు డెక్క ద్వారా ఎరువుల తయారీపై శిక్షణజిల్లాలో ఉన్న 307 సంపద సృష్టి కేంద్రాలలో, 11 కేంద్రాలను మహిళలకు అప్పగించారు. వీరికి గుర్రపు డెక్క ద్వారా ఎరువుల తయారీపై శిక్షణ ఇచ్చారు. చాప్ కట్టర్స్ కొనుగోలుకు రుణాలను మంజూరు చేశారు. ఈ యంత్రాల సాయంతో గుర్రపు డెక్కను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి శాస్త్రీయ పద్దతిలో సేంద్రీయ ఎరువులు తయారు చేస్తున్నారు. ఒకే ఉద్యోగి.. రెండు చోట్ల జీతాలు - ప్రభుత్వ శాఖల్లో మాయాజాలం, గుట్టు

Tecno Pova 8 Pro 5g Price: భారత మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రొ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది Alive Matrix డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. Tecno Pova 8 Pro 5g Price: స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం కాలింగ్ కోసం మాత్రమే.. వినియోగించకుండా.. ఒక పవర్ ఫుల్ గ్యాడ్జెట్‌గా మారిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కంపెనీలు దిమ్మతిరిగే ఫీచర్స్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) కూడా మార్కెట్లోకి మంచి మొబైల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రొ 5G (Tecno Pova 8 Pro 5G) స్మార్ట్‌ఫోన్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నో రకాల పవర్ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన సెకండరీ డిస్ప్లే (Alive Matrix Display)ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. సాధారణంగా ఫోన్ ముందు భాగంలో మాత్రమే డిస్ప్లేను చూసే వినియోగదారులకు, బ్యాక్ ప్యానెల్‌పై నోటిఫికేషన్లు, కాల్స్‌తో పాటు మ్యూజిక్ యానిమేషన్లు, సైబర్ పంక్ వంటి అద్భుతమైన మెరిసిపోయే రెండో స్క్రీన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. అలాగే ఇది చాలా అద్భుతమైన డిజైన్ కూడా కలిగి ఉంటుంది. చూడడానికి ఎంతగానో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. ఈ Tecno Pova 8 Pro 5G స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్నిచాలా అద్భుతంగా అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ 5G చిప్సెట్తో మల్టీ టాస్కింగ్ అత్యంత అద్బుతంగా

భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ముంబై: భర్తను హత్య చేసేందుకు ఓ మహిళ సినిమా రేంజ్లో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, ఆపై ఇంటి వెనుక పాతిపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు నెట్టింట వైరల్‌గా మారాయి. భర్తలను హత్య చేసిన మహిళల ఉదంతాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న వేళ, తాజా ఘటన ప్రకంపనలు రేపుతోంది. కట్టుకున్న వాడిని హతమార్చేందుకు భార్య చేసిన ప్రయత్నాలు చూసి అంతా నివ్వెరపోతున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని బారామతిలో షర్మిలా ప్రవీణ్ జగ్తాప్ అనే మహిళ తన భర్త ప్రవీణ్ జగ్తాప్ను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. జులై 30న జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి భర్త, అత్తకు ఇచ్చింది. జ్యూస్ తాగిన వారిద్దరూ రెండు రోజుల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆగస్టు 1న బాధితుడికి కొంచెం మెలకువ వచ్చింది. అది గ్రహించిన షర్మిల.. అతడిని బ్యాట్‌తో దారుణంగా కొట్టింది. అనంతరం లాక్కెళ్లి, ఇంటి వెనుక అప్పటికే ఇటుకలతో కట్టించిన గుంతలో పడేసింది. భర్త కనిపించకుండా ఆ గుంతపై పెద్ద చెక్కను పెట్టింది. కూలీలను పిలిపించి ఆ గుంతను పూడ్చేందుకు ప్రయత్నించింది. కూలీలకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు, కుమారుడు ప్రవీణ్ జగ్తాప్ను బ్యాట్‌తో కొడుతున్న సమయంలోనే తల్లికీ స్పృహ వచ్చింది. వెంటనే తన పెద్ద కుమారుడికి ఫోన్ చేసింది. దీంతో బాధితుడి అన్న, పోలీసులు వచ్చి అతడిని రక్షించారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం షర్మిలను అరెస్టు చేశారు. అయితే, పూర్తి స్పృహలోకి వచ్చిన ప్రవీణ్ జగ్తాప్ కీలక విషయాలు వెల్లడించాడు. 'నా భార్య నాకు నిద్రమాత్రలు ఇచ్చింది. మూడో రోజు

కోట్లాది మంది భక్తుల నమ్మకం, వేల ఏళ్ల నాటి చారిత్రక ఘనత, కంటికి కనువిందు చేసే అద్భుత శిల్పకళ... జీవితకాలంలో ఒక్కసారైనా ఈ 7 పుణ్య క్షేత్రాలను సందర్శించకపోతే భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవించనట్లే అవుతుంది. దేశవ్యాప్తంగా వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ, కొన్ని క్షేత్రాలు తమ చారిత్రక నేపథ్యం, విశిష్ట ప్రాముఖ్యతతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో పయనించే ప్రతి భక్తుడూ, పర్యాటకుడూ తప్పక దర్శించాల్సిన ఆ 7 ప్రముఖ దేవాలయాల విశేషాల గురించి తెలుసుకుందాం.vastu tips: వాస్తు ప్రకారం తిన్న పళ్లెంలో చేతులు కడగకూడదు!కాశీ విశ్వనాథుడి నుంచి మొదలుఉత్తర భారతదేశంలో గంగా నది తీరాన వెలసిన కాశీ విశ్వనాథ ఆలయం పరమశివుని పవిత్ర నివాసంగా విలసిల్లుతోంది. ఆధ్యాత్మిక రాజధానిగా ప్రసిద్ధి చెందిన వారణాసిలోని ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల వేంకటేశ్వర ఆలయం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే దివ్య పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో ఎంతో ఓర్పుగా వేచి ఉండి తమ భక్తిని చాటుకుంటారు.హిమాలయాల్లో కేదార్ నాథ్హిమాలయ పర్వత సానువుల్లో కొలువై ఉన్న కేదార్నాథ్ ఆలయం పవిత్ర చార్ ధామ్ యాత్రా స్థలాలలో ఒకటి. శివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రాశస్త్యమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి చేసే కఠినమైన ప్రయాణం భక్తుల విశ్వాసానికి, శారీరక దృఢత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం ద్రవిడ వాస్తుశిల్ప శైలికి నిలువెత్తు సాక్ష్యం. మీనాక్షి దేవి, సుందరేశ్వర స్వామివార్లకు అంకితం చేయబడిన ఈ ఆలయంలో ఆకాశాన్ని తాకేలా ఉండే భారీ రాజగోపురాలు, వాటిపై చెక్కిన అద్భుత శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి.వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులుకులమతాలకు అతీతం

మనం ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తింటాడు. ఒక్క పూట భోజనం ఆలస్యమైతేనే నీరసంగా అనిపిస్తుంది. కొందరు వ్యక్తులు ఉపవాసాలు ఉంటారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం లభించని పరిస్థితులు వస్తే ఎన్ని రోజులు ఒక వ్యక్తి బతకగలడు? ఆ సమయంలో మానవ శరీరంలోని అవయవాలు శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయి? ఈ ప్రశ్నలకు వైద్యులు ఆసక్తికరమైన శాస్త్రీయ సమాధానాలను వెల్లడించారు. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఆహారం అందనప్పుడు అది ప్రత్యేక ఎమర్జెన్సీ మోడ్‌లోకి వెళ్లి శరీరానికి శక్తి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఆహారం అందడం ఆగిపోయిన మొదటి కొన్ని గంటల నుంచి కొద్ది రోజుల వరకు శరీరం శక్తిని పొందే ప్రక్రియ మొదలవుతుంది. సాధారణ రోజుల్లో మనం తినే ఆహారం ద్వారా లభించే 'గ్లూకోజ్' మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆహారం తీసుకోవడం ఆపేసిన మొదటి 12 నుంచి 24 గంటల్లో, కాలేయం, కండరాలలో ముందుగానే దాచిపెట్టిన 'గ్లైకోజెన్' నిల్వలను శరీరం విచ్ఛిన్నం చేయడం ప్రారంభిస్తుంది. ఈ గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చి మెదడుకు, ఇతర అవయవాలకు శక్తిని సరఫరా చేస్తుంది. కానీ, ఈ గ్లైకోజెన్ నిల్వలు కేవలం ఒక రోజు లేదా రెండు రోజులకు మాత్రమే సరిపోతాయి. రెండవ రోజు దాటిన తర్వాత శరీరంలో గ్లైకోజెన్ నిల్వలు ఖాళీ అయిపోతాయి. తరువాత శరీరం తన కణజాలాల్లోని కొవ్వు నిల్వలపై ఆధారపడుతుంది. ఈ దశను వైద్య పరిభాషలో 'కీటోసిస్' అంటారు. కాలేయం ఈ కొవ్వులను కరిగించి 'కీటోన్లు'గా మారుస్తుంది. ఈ కీటోన్లు రక్తం ద్వారా ప్రయాణించి మెదడుకు, గుండెకు గ్లూకోజ్‌కు ప్రత్యామ్నాయంగా శక్తిని అందిస్తాయి. శరీరంలో ఉన్న కొవ్వు నిల్వలను బట్టి ఒక మనిషి ఆహారం లేకుండా వారాల పాటూ జీవించగలడు. అయితే ఆహారం లేకుండా కొద్ది రోజులు బతగవచ్చు కానీ...'నీరు' లేకుండా మాత్రం 3 నుంచి 5 రోజుల కంటే ఎక్కువ కాలం బతకడం చాలా కష్టం

కర్ణాటకలో నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. కర్ణాటక జాయింట్ యాక్షన్ కమిటీ.. కన్నడ ఒక్కూట ఈ బంద్ కు పిలుపునిచ్చింది. బెంగళూరు సహా చాలాచోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కనిపించింది. మరి కొన్ని చోట్ల సంపూర్ణంగా కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు యథాతథంగా పని చేస్తోన్నాయి. బెంగళూరులో బీఎంటీసీ బస్సుల రాకపోకలపైనా పెద్దగా ప్రభావం పడలేదు.తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయడాన్ని నిరసిస్తూ కన్నడ హక్కుల పరిరక్షణ వేదిక నేత వాటాల్ నాగరాజ్ ఈ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కావేరీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కిందటి నెల 28వ తేదీ నుంచి కర్ణాటక ప్రభుత్వం రోజూ 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం పట్ల కర్ణాటక హక్కుల పరిరక్షణ వేదిక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.దీనికి నిరసనగా బంద్ కు పిలుపునిచ్చింది. ఈ తెల్లవారు జామున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగాల్సి ఉంది. కావేరి నదీ పరీవాహక ప్రాంత జిల్లాలు.. మండ్య, మైసూరు, చామరాజనగర, మడికెర్రి, హాసన్ లల్లో సానుకూల స్పందన లభించింది. బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పలుచోట్ల కేఎస్ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించాయి. బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. బస్సులు డిపోల నుంచి బయటికి రాకుండా ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించారు. తమిళనాడుకు కావేరీ నీటి విడుదలను వెంటనే నిలిపివేయాలంటూ నినదించారు.డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో బిగ్ వికెట్ డౌన్బెంగళూరులో బంద్ ప్రభావం అంతంత మాత్రమే. ఆటో, క్యాబ్ యూనియన్లు పెద్దగా స్పందించట్లేదు. ఫలితంగా ఆటోలు, క్యాబ్ లు రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వాటి సర్వీసులు అందుబాటులో ఉంటోన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎప్పట్లాగే పని చేస్తోన్నాయి. బంద్ ప్రారంభమైనప్పటికీ వాహనాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగలేదు.అమరావతిలో మొదటి

Australia vs Bangladesh, 1st Test: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో విరుచుకుపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలకు పసికూన బంగ్లాదేశ్ పేసర్లు గట్టి షాకే ఇచ్చారు. తొలి సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 61 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. వార్త రాసే సమయానికి అంటే లంచ్ బ్రేక్ వరకు ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా డార్విన్‌లోని మార్రారా క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి రోజే ఉత్కంఠగా మారింది. సొంతగడ్డపై భారీ స్కోరు సాధించాలనే పట్టుదలతో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. హసన్ మహమూద్ దాటికి పెవిలియన్ చేరిన ఓపెనర్లు.. ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు హెడ్, వెదర్‌ఆల్డ్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. బంగ్లాదేశ్ యంగ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుతమైన బౌలింగ్ స్పెల్‌తో చెలరేగిపోయాడు. తొలుత 22 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన హసన్, ఆ వెంటనే 23 పరుగులు చేసిన జేక్ వెదర్ఆల్డ్ను వికెట్ కీపర్ లిటన్ దాస్ చేతికి క్యాచ్ ఇచ్చేలా చేసి పెవిలియన్ బాట పట్టించాడు. దాంతో 50 పరుగుల లోపే ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయింది. Round the wicket, angling the ball onto the stumps, angled bat and back to the pavilion. Disappointing innings of 22 (39) v Bangladesh.#AUSvsBAN #SRH #IPL2027 — Varun Velamakanti 🦅 (@CricVarunSRH) August 13, 2026 రెండు వికెట్లు పడిపోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన స్టార్

ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా, మరొక మానవునికి జీవన దానాన్ని అందించగల ఒక నిర్ణయం అపారమైన శక్తిని ఇస్తోందనే విషయాన్ని మనం గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. అవయవ దానంపై మరింత అవగాహనను కల్పిద్దామని పేర్కొన్నారు. దాతలుగా మారడానికి అవగాహనతో కూడిన నిబద్ధతను కనబరిచేలా ఎక్కువ మంది పౌరులను ప్రేరేపిద్దామని తెలిపారు. ఒకరి జీవితాన్ని పొడిగించలేనప్పుడు, మరొకరికి జీవితాన్ని ఇవ్వడం ద్వారా దానికి కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి దానం ఒక ఆశకు వాగ్దానంగా మారేలా, ప్రతి దాత చిరకాలం నిలిచిపోయే వారసత్వాన్ని వదిలి వెళ్లేలా మనం ఉదారత సంస్కృతిని నిర్మిద్దామని తెలిపారు. జీవితాన్ని దానం చేయాలని.. ఆశను ఇవ్వండి, ప్రాణాలను కాపాడండి అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం