
Tecno Pova 8 Pro 5g Price: భారత మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రొ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది Alive Matrix డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Tecno Pova 8 Pro 5g Price: స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం కాలింగ్ కోసం మాత్రమే.. వినియోగించకుండా.. ఒక పవర్ ఫుల్ గ్యాడ్జెట్‌గా మారిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కంపెనీలు దిమ్మతిరిగే ఫీచర్స్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) కూడా మార్కెట్లోకి మంచి మొబైల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రొ 5G (Tecno Pova 8 Pro 5G) స్మార్ట్‌ఫోన్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నో రకాల పవర్ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన సెకండరీ డిస్ప్లే (Alive Matrix Display)ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
సాధారణంగా ఫోన్ ముందు భాగంలో మాత్రమే డిస్ప్లేను చూసే వినియోగదారులకు, బ్యాక్ ప్యానెల్‌పై నోటిఫికేషన్లు, కాల్స్‌తో పాటు మ్యూజిక్ యానిమేషన్లు, సైబర్ పంక్ వంటి అద్భుతమైన మెరిసిపోయే రెండో స్క్రీన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. అలాగే ఇది చాలా అద్భుతమైన డిజైన్ కూడా కలిగి ఉంటుంది. చూడడానికి ఎంతగానో ఆకర్శనీయంగా కనిపిస్తుంది.
ఈ Tecno Pova 8 Pro 5G స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్నిచాలా అద్భుతంగా అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ 5G చిప్సెట్తో మల్టీ టాస్కింగ్ అత్యంత అద్బుతంగా ఉంటుంది..
ఇందులో పవర్ఫుల్ 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.. ఇది చీకటిలోనూ అద్భుతమైన ఫోటోలను అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తూ వస్తోంది. గేమింగ్స్‌ను తట్టుకునేలా భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. అయితే, అతి త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధరలతో పాటు స్పెషిఫికేషన్స్, ఫీచర్స్‌ను కంపెనీ త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గతంలో విడుదల చేసిన మోడల్స్ కంటే కాస్త ఎక్కువగానే దీని ధర ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కంపెనీ అధికారికంగా ప్రటించాల్సి ఉంది.




