
నిమజ్జనం చేశాక.. ఒక్క రోజులోనే కరిగిపోయే బొజ్జ గణపయ్య
పర్యావరణహిత మట్టి గణపయ్యను పూజిద్దామంటూ ప్రకృతి ప్రేమికులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.

పర్యావరణహిత మట్టి గణపయ్యను పూజిద్దామంటూ ప్రకృతి ప్రేమికులు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.

రాజోలి: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొనే క్రీడాకారుల ఎంపికలో భాగంగా జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 3న గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి రామలింగేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆసక్తి, అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 3న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయి ఐడీ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ప్రోత్సహించడమే ఈ ఎంపికల ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా యువజన క్రీడల అధికారి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: భాజపా రాజోలి: కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, దాడి చేసిన వారిని వదిలేసి, పరామర్శకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం హేయమైన చర్య అని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రా రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్ట్ నేపథ్యంలో ఐజ పట్టణంలో రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతుంటే, బాధితుల ఇళ్లకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం శాఖ వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధితులకు కఠిన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐజ పట్టణ, మండల అధ్యక్షులు ముదిరాజ్ నర్సింహ, గోపాలకృష్ణ, లక్ష్మణ్ గౌడ్, శ్రీకాంత్, వీరేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే

జోగులాంబ గద్వాల : జోగులాంబ డ రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కవిత, ప్రకాష్ దంపతుల రెండో కుమార్తె శ్రావ్య (8) ఇంట్లో నిద్రిస్తుండగా పాము కాటుకు గురైంది. పాప ఏడవడంతో గమనించిన తండ్రి, అప్పటికే శ్రావ్య వేలు పాము నోట్లో ఉండటాన్ని గుర్తించి చేతులతో పామును పట్టుకుని వేలును బయటకు తీశారు. అనంతరం పామును చంపినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే శ్రావ్య మృతి చెందినట్లు తెలిపారు. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి
గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న యువకుడు.. 24 గంటలు గడవకముందే అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. గద్వాల మండలం చెనుగొనిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చెనుగొనిపల్లికి చెందిన జహంగీర్ భాషా అనే 28 ఏళ్ల యువకుడు 108 అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఉత్తమ పనితీరు కనబరచటంతో ఆగస్ట్ 15వ తేదీ జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగిగా జహంగీర్ భాషా అవార్డు అందుకున్నారు. అయితే అవార్డు అందుకుని 24 గంటలు కూడా గడవకముందేగుండెపోటుతో జహంగీర్ భాషా చనిపోయాడు. చేతికి అందివచ్చిన తనయుడు అనుకోకుండా చనిపోవటంతో.. జహంగీర్ భాషా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అతని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని 108 సిబ్బంది కోరుతున్నారు.రోడ్డు ప్రమాదం.. నిండు ప్రాణం బలి..రోడ్డు ప్రమాదంలో ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. గడిమున్పల్లి సమీపంలో శనివారం రోజు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉశంతమ్మ అనే 55 ఏళ్ల మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ సిమెంట్ బస్తా లారీ రోడ్డుపై వస్తోంది. ఈ సిమెంట్ లారీ మహిళను ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో మహిళ మృతదేహం రెండు భాగాలుగా విడిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో సహా ఘటనాస్థలి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి కారణమైన లారీని నారాయణపేటలో కొంతమంది గుర్తించారు.మరోవైపు మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్థానికులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాజకీయ నేతలు అక్కడకు చేరుకుని వారికి సర్దిచెప్పారు. లారీ యజమానితో మహిళ కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వటంతో స్థానికులు నిరసన విరమించారు. అనంతరం

గట్టు: జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో గట్టు ఎస్సై శేఖర్ గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్ నాగార్జున విశిష్ట సేవా పురస్కారాలు అందుకున్నారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా జిల్లా ఉన్నతాధికారులు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్సై అందించిన సేవలు, ఆరోగ్య విభాగంలో నాగార్జున చేసిన సేవలను అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. పురస్కారాలు పొందిన వీరిని స్థానిక ప్రముఖులు, తోటి సిబ్బంది అభినందించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Gadwal: చేనేత కళాకారులు డాకే రాజ్‌కుమార్ దామర్ల శారదలకు ఎమ్మెల్యే సత్కారం ఈ వార్తకు సంబంధించిన

Jogulamba: ఏకరూప దుస్తుల తయారీ వేగవంతం చేయాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా! ఈ వార్తకు సంబంధించిన

Panchyat Secretaries | జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశాల మేరకు జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1;00 గంట వరకు మాత్రమే విధులలో ఉంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కావున విధి నిర్వహణ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం గద్వాల మండలంలోని ఈడిగోని పల్లి గ్రామ పంచాయతీని, ధరూర్ మండలంలోని ఎల్మలోని పల్లి గ్రామ పంచాయతీలను మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పంచాయతీ కార్యదర్శులు కార్యాలయంలో అందుబాటులో లేనట్లు నిర్ధారించారు. గద్వాల, ధరూర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శుల ముందస్తు అనుమతి తీసుకుని విధుల నుంచి వెళ్లారా..? అని వివరణ కోరగా, ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న గ్రామపంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. Chalivagu project | చలివాగు ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగు నీరందించాలని బీఆర్ఎస్ ధర్నా High Alert | ఢిల్లీలో ఉగ్రదాడులు జరుగవచ్చన్న ఇంటెలిజెన్స్.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం Dhanush Fans | కోయంబత్తూరులో భారీ ప్లాన్.. ధనుష్ రాజకీయ అరంగేట్రంపై మళ్లీ మొదలైన చర్చ!

Gadwal: గద్వాలలో పంద్రాగస్టు వేడుకలు కలెక్టర్ రిజ్వాన్ దిశానిర్దేశం! ఈ వార్తకు సంబంధించిన

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వానలు పడాలని కోరుకుంటూ ప్రభుత్వం మహావరుణయాగం నిర్వహించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. అయితే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఓ పురోహితుడు మొసలికి పూజలు నిర్వహించాడు. ఈ ఆసక్తికరమైన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద జరిగింది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారంతా మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందంటే..?వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మొసలి నదిలోంచి పుష్కర్ ఘాట్ వైపునకు దూసుకొచ్చింది. మొసలిని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.అలా ఆ మొసలి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. ఆ విషయం పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మకు తెలియడంతో ఆయన అక్కడకు వచ్చారు. మొసలి ముందు కూర్చుని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. అలా కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం నిర్వహించాడు. వరుణ దేవుడి వాహనమైన మొసలికి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు ఆ తర్వాత పురోహితుడు అనిల్ శర్మ తెలిపాడు. రాష్ట్రంలోని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజలు చేసినట్లు స్పష్టం చేశారు.ఇక పురోహితుడు పూజలు చేసినంత సేపూ మొసలి ఎక్కడికీ వెళ్లకుండా.. దాడి చేయకుండా అలానే ఉండిపోయింది. మొసలి అలా మౌనంగా, ప్రశాంతంగా కదలకుండా ఉండటాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలను మొత్తం కొందరు వీడియో తీశారు. అనంతరం స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే పుష్కర ఘాట్ కు చేరుకున్న పోలీసులు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బుర్ధపేట కాలనీకి చెందిన తన్విక (9) అమ్మవారిపై భక్తిని.. తన స్కేటింగ్ నైపుణ్యంతో చాటుకుంది. వీర, ప్రశాంతి దంపతుల కుమార్తె తన్విక ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. సోమవారం బోనాల పండగ సందర్భంగా పట్టణంలోని కృష్ణానది నుంచి స్కేటింగ్ చేస్తూ తలపై బోనం పెట్టుకొని సుంకులమ్మ ఆలయానికి చేరుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించింది. ఆలయం వద్ద చిన్నారి నైపుణ్యం చూసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆమెను అభినందించారు. ఈ వార్త చదివారా: సాగర్ తీరంలో మహా వరుణయాగం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Priest performs puja rituals to crocodile in jogulamba gadwal: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమయ్యాయి. కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా మరికొన్నిచోట్ల వానలు ముఖం చాటేశాయి. ఇప్పటికి పలుచోట్ల వానలు కురవక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వర్షాలు కురవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజలు, వరుణ యాగాలు నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయ మంత్రి కొండా సురేఖ సూచించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి సైతం వరుణయాగాలు నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లిలో ఒక భారీ మొసలి కృష్ణానది నుంచి ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దీంతో జాలర్లు దాన్ని పట్టుకుని బంధించారు. ఆ తర్వాత అక్కడి పండితుడికి సమాచారం ఇచ్చారు. అనంతరం మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి పండితులు గుడికి తీసుకొని రమ్మని చెప్పాడు. అందరు చూస్తుండగానే పండితుడు అనిల్ శర్మ వర్షాలు బాగా కురవాలని నిజమైన మొసలికి గుడిలోనే పసుపు, కుంకుమ, మొదలైన ద్రవ్యాలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించాడు. Read more: Video Viral: ఇదేక్కడి మాస్ రా మావా.. ఏకంగా కొబ్బరి చెట్లును పీకి తీసుకెళ్తున్న ఏనుగు.. వీడియో వైరల్.. అనిత్ శర్మ దానికి పూజలు చేస్తున్న అది కొంచెం కూడా కదల్లేదు. దాన్ని తాకుతూ వర్షాలు పడాలని పండితులు పూజలు నిర్వహించాడు. పూజలు ముగిసిన తర్వాత ఆ మొసలిని జాలర్లు తిరిగి నదిలో వదిలేశారు. ఈ ఘటనకు చెందిన

Beechupalli: ఏం గుండె సామీ నీది.. ఏకంగా మొసలి ముందు కూర్చొని పూజారి పూజలు! బీచుపల్లి: జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన మొసలి ఏకంగా పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్ కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆదివారం, వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని… పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ అనుకోని అతిథిలా.. ఓ మొసలి నదిలో నుంచి పుష్కర్ ఘాట్ కు వచ్చింది. అది చూసిన కొంతమంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. కుంకుమ, పసుపు, పుష్పాలతో అభిషేకం చేశాడు. మొసలి వరుణ దేవుడి వాహనమని అనిల్ శర్మ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు ఆయన తెలిపారు

గట్టు: జోగులాంబ గద్వాల జిల్లా మాచర్ల గ్రామంలో భారత యువ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ మహబూబ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బెందల రాజేష్, గద్వాల యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు కురువ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎండీ మహబూబ్ మాట్లాడుతూ.. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన భారత యువ కాంగ్రెస్, దేశ యువతను నాయకులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు