
గట్టు: జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో గట్టు ఎస్సై శేఖర్ గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్ నాగార్జున విశిష్ట సేవా పురస్కారాలు అందుకున్నారు. విధి నిర్వహణలో చూపిన అంకితభావం, ఉత్తమ ప్రతిభకు గుర్తింపుగా జిల్లా ఉన్నతాధికారులు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రజా రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్సై అందించిన సేవలు, ఆరోగ్య విభాగంలో నాగార్జున చేసిన సేవలను అధికారులు ప్రత్యేకంగా కొనియాడారు. పురస్కారాలు పొందిన వీరిని స్థానిక ప్రముఖులు, తోటి సిబ్బంది అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





