
Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?
Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?

Shubman Gill: 27వ ఏట అడుగుపెట్టిన గిల్.. వరల్డ్ రికార్డులు, డబుల్ సెంచరీల రారాజు గురించి ఈ నిజాలు తెలుసా?
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.
Bhagavanth Kesari బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి.

విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టులపై విపక్ష వైఎస్ఆర్సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డేటా సెంటర్ల నిర్మాణం వల్ల విశాఖ నగరం తీవ్ర నీటి, విద్యుత్ కొరతను ఎదుర్కొంటుందని సోషల్ మీడియా వేదికగా విపక్షాలు భయాలను రేకెత్తిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకముందే నీటి కొరత వస్తుందనడం అసత్యమని సీఎం తేల్చి చెప్పారు. విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే విపక్షం ఉద్దేశపూర్వకంగానే విషం కక్కుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ మరియు అనకాపల్లి ప్రాంతాల్లో గూగుల్, అదానీ, ఎయిర్టెల్ భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ హబ్ నిర్మాణం వేగంగా సాగుతోంది. 2026 ఏప్రిల్ నెలలో గూగుల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా, కొన్ని నిర్దేశిత ప్రాంతాలలో ఇప్పటికే భూమి పనులు కూడా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 6.5 గిగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకోగా, రిలయన్స్ సహా పలు దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. 2029-30 నాటికి 50 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుల నిర్వహణకు సంవత్సరానికి 3 నుంచి 3.5 టీఎంసీల నీరు అవసరమని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలవరం పారిశ్రామిక కేటాయింపుల నుంచి ప్రత్యేక పైప్లైన్ల ద్వారా నీటిని అందిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సాధారణ 1 గిగావాట్ థర్మల్ ప్లాంట్ దీనికంటే పది రెట్లు ఎక్కువ నీటిని వినియోగిస్తుందని ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వివరించారు. మరోవైపు డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తమ స్థానాలను కోల్పోయారు. మరోవైపు, యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శనతో ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాన్ని సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించిన శుభ్‌మన్ గిల్.. తాజాగా ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ ఏడో స్థానంతో భారత్ తరఫున బ్యాటర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల్లో కలిపి రెండు శతకాలతో బాదిన దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానానికి చేరుకున్నాడు. లంక గడ్డపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానాన్ని కోల్పోయి.. మూడో స్థానానికి పడిపోయాడు. మోకాలి గాయం కారణంగా బుమ్రా జూలై మధ్య నుంచి ఆటకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ బౌలర్ మ్యాట్ హెన్రీ రెండో స్థానంలో నిలిచాడు. సెప్టెంబర్ మధ్యలో అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు బుమ్రా ఎంపికైనప్పటికీ, అతడి ఫిట్నెస్ ఆధారంగానే తుది జట్టులో ఆడటం ఆధారపడి ఉంటుంది. ఇది భవిష్యత్ లో రిలీజ్ అయ్యే అతడి ఐసీసీ

ICC Test Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానాలు దిగజారడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ బౌలర్ ఆలీ రాబిన్సన్ అనూహ్యంగా టాప్-5లోకి దూసుకొచ్చాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వరుసగా రెండో వారం కూడా ఒక స్థానాన్ని కోల్పోయాడు. గత మూడు టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ.. బుమ్రాను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. మైదానంలోకి దిగకపోవడం వల్ల పాయింట్లు కోల్పోయి బుమ్రా ఈ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ర్యాంకింగ్స్‌లో ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు. సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 74 పరుగులు మాత్రమే సాధించడంతో గిల్ రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. ప్రస్తుతం టెస్టు బ్యాటింగ్ విభాగంలో ఏడో స్థానంలో ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రమే భారత్ నుంచి అత్యుత్తమ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ ఆలీ రాబిన్సన్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సుదీర్ఘ దూకుడు ప్రదర్శిస్తూ ఐసీసీ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నేరుగా ఐదో స్థానానికి చేరుకున్నాడు. భారత్‌పై టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక ఆటగాడు సోనాల్ దినుషా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 29 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. భారత్‌పై 140 సగటుతో 420 పరుగులు చేసి అతడు ఈ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున

కడపలో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఈ స్టార్టప్ హబ్‌ను నిర్మించారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 నమూనాలో రూపొందించిన ఈ భవనంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ స్టార్టప్ హబ్ ప్రారంభం కానుంది. జిల్లా యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించింది. రాయలసీమలో సాంకేతిక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపునిచ్చే కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హై-స్పీడ్ ఇంటర్నెట్, ఆధునిక వర్క్ స్పేస్‌లు, ప్రొటోటైపింగ్ ల్యాబ్‌లు, సాంకేతిక సాఫ్ట్వేర్ టూల్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిష్కారాలను రూపొందించే యువతకు ప్రయోగాత్మక వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం కేవలం ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించడం కాదు. యువతను స్వయం ఉపాధి, స్టార్టప్‌ల వైపు మళ్లించి భవిష్యత్‌లో ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త వ్యాపార ఆలోచన ఉన్న విద్యార్థి లేదా యువకుడు ప్రారంభ దశలో ఎదుర్కొనే అనేక సమస్యలకు ఇక్కడ మార్గదర్శకత్వం లభించే అవకాశం ఉంది. ఆలోచనను ఎలా అభివృద్ధి చేయాలి, వ్యాపార ప్రణాళికను ఎలా సిద్ధం చేయాలి, మార్కెట్ అవసరాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అంశాలపై నిపుణుల సహకారం అందించనున్నారు. ముఖ్యంగా చిన్న ఆలోచనతో ప్రారంభమైన ప్రాజెక్టును వాణిజ్యపరంగా విజయవంతమైన సంస్థగా మార్చేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. స్టార్టప్ ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం ఎంతో కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో మెంటార్షిప్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఐఐఎంలకు చెందిన నిపుణులతో పాటు గ్లోబల్ టెక్నాలజీ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. విజయవంతమైన వ్యాపార నమూనాలు

తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ లక్ష్య సాధనకు విద్యార్థుల మెరుగైన విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు విదేశీ ఉన్నత విద్యాసంస్థలతో వేగంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక రూట్లింగెన్ యూనివర్సిటీతో కీలక ఒప్పందాలు చేసుకుంది.జర్మనీ యూనివర్సిటీతో కాకతీయ విశ్వవిద్యాలయం ఒప్పందం ఈ ఒప్పందాల ద్వారా 3+2 విద్యా నమూనా ప్రవేశపెట్టారు. విద్యార్థులు మొదటి మూడేళ్ల డిగ్రీని స్థానిక విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేసి, తర్వాత రెండేళ్ల మాస్టర్స్ కోర్సును జర్మనీలో అభ్యసిస్తారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ వంటి కోర్సుల్లో విద్యార్థులకు ఈ మేరకు అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత జర్మనీ విశ్వవిద్యాలయమే మాస్టర్స్ డిగ్రీ అందిస్తుంది.ఏటా 20మంది విద్యార్థులు రూట్లింగెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఈ విధానంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏటా 20 మంది విద్యార్థులు ఎంపికవుతారు. ఇంతకు ముందు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ బృందం జర్మనీలోని RWTH ఆచెన్, ఆస్ట్ఫాలియా, గొట్టింగెన్ విశ్వవిద్యాలయాలను సందర్శించి లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ మార్పిడి చేసుకుంది. విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు, డ్యూయల్ డిగ్రీలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుని తదనుగుణంగా చేసిన ప్లాన్ కు ఓకే అన్నారు.పలు విదేశీ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్‌షోర్ క్యాంపస్లుఅంతేకాదు బోస్టన్ లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ, ఎల్ఎస్ఈ వంటి ప్రముఖ సంస్థలతో కూడా వివిధ యూనివర్సిటీలతో చర్చలు సాగుతున్నాయి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ జపాన్‌లోని హిరోషిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.తెలంగాణ ఆర్టీసీ మరో కీలకనిర్ణయం.. మెట్రో రైళ్ళ తరహాలో బస్సుల్లో కూడా..!

Navapanchama Rajayoga: గ్రహ మండలంలో దేవు గురువు బృహస్పతి రాక్షస గురువు అయిన శుక్రులు తమ కదలికతో నవ పంచమ రాజ యోగం ఏర్పడింది. దీంతో ఈ 5 రాశుల దశ, దిశ విధి రాత మారబోతుంది. అంతేకాదు ఆకస్మిక సంపదతో పాటు లాభాలను తీసుకురాబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గోచారం ఘోషిస్తుంది. Navapanchama Rajayoga Effect 2026: అసుర గురువు శుక్రుడు ఫిబ్రవరి 6న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారము తరువాత, శుక్రుడు బృహస్పతితో కలిసి నవపంచమ యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. ఈ యోగం వల్ల ఏ రాశులకు ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.. రాక్షస గురువు శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు... మిథునరాశిలో ఉన్న దేవ గురువు బృహస్పతితో కలిసి నవపంచమ రాజ యోగాన్ని ఏర్పరుస్తారు. ఈ రెండు గ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఐదవ ఇల్లు జ్ఞానం, ప్రేమ, అనురాగం, భావోద్వేగాలకు ప్రతీక. తొమ్మిదవ ఇల్లు అదృష్టం, మతంతో పాటు ఆధ్యాత్మికతను సూచిస్తుంది. అందువల్ల, నవ పంచమ యోగం ఏర్పడటం కొన్ని రాశుల వారికి మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆ అదృష్ట రాశుల గురించి తెలుసుకోండి... సింహ రాశి: సింహ రాశి వారికి సమాజంలో గౌరవంతో పాటు వారి ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. శుక్రుడు, బృహస్పతి కలయికతో ఏర్పడిన నవ పంచమ కలయిక సమయంలో గత ప్రయత్నాలతో గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. నిలిచిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు కోరుకున్న ఒప్పందాలను చేసుకుంటారు. మిథున రాశి: మిథున రాశి వారి తెలివితేటలు, జ్ఞానంలో పెరుగుదలను అనుభవిస్తుంటారు. ఇది వారి విద్యలో ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన ఏదైనా డబ్బు తిరిగి పొందవచ్చు. అదృష్టం కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. కుంభ రాశి: కుంభ రాశి వారికి శుక్రుడు, బృహస్పతి నవ పంచమ కలయిక వలన కుంభ రాశి వారికి

తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించాలని తలపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలను తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించే క్రమంలో డిసెంబర్ నెలలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనుంది. పారిశ్రామిక ప్రగతి సాధిస్తే రాష్ట్ర పురోగతి సాధ్యం అవుతుందని తెలంగాణా సర్కార్ భావిస్తోంది.ప్రజాభవన్‌లో వార్‌రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతి సమీక్షఈ క్రమంలో ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో డిసెంబరు 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్‌లో వార్‌రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ పురోగతిని సమీక్షించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం సాధించాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సీనియర్ అధికారులను బాధ్యులుగా నియమించాలని చెప్పారు.తెలంగాణా రాష్ట్రానికి మేఘ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు!తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు ప్రపంచానికి చెప్పేలా ప్లాన్ఈమేరకు ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎస్ సంజయ్ జాజు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. గ్లోబల్ సమ్మిట్ -2026కు లోగో రూపొందించాలని, అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు.బ్రాండ్ తెలంగాణా.. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్!విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులకు ఆహ్వానంఅంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ప్రచారం కోసం అక్టోబరు మొదటి లేదా రెండో వారంలో ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, ప్రముఖులను ఆహ్వానించాలని, హైదరాబాద్ ప్రధాన కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే సమయంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణను గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దాలని అన్నారు.గ్రీన్ టెక్నాలజీలో అగ్రస్థానంరాష్ట్రాన్ని దక్షిణ కొరియా, జపాన్ స్థాయికి తీసుకెళ్లాలని, సుస్థిర గ్రీన్

హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇటీవల బ్రిటన్, అమెరికా దేశాల్లో చేపట్టిన సుదీర్ఘ పర్యటన విజయవంతమైంది. ఈ విదేశీ పర్యటనలో సాధించిన చారిత్రాత్మక పురోగతి, ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కుదిరిన కీలక ఒప్పందాలు, అవగాహనా ఒప్పందాలు (MoUs), లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ల సమగ్ర వివరాలతో కూడిన ప్రత్యేక నివేదికను ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసింది. ఐటీ, పరిశ్రమలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, పరిశోధన, డిఫెన్స్ రంగాల్లో ఇప్పటికే ప్రపంచ పటంలో ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్ నగరాన్ని, ఇప్పుడు అంతర్జాతీయ విద్యా, నైపుణ్య రంగానికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. కమిటీ నివేదిక ప్రకారం అమెరికాలోని అత్యుత్తమ ‘నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ’తో పాటు బ్రిటన్‌లోని 17 స్వతంత్ర విద్యాసంస్థల సమాఖ్య అయిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’ భారత్‌లోనే తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన అంగీకారం తెలిపాయి. ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ వర్సిటీ తమ క్యాంపస్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను ముమ్మరంగా పరిశీలిస్తోంది. దీనికితోడు ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే ‘హార్వర్డ్ యూనివర్సిటీ’ హైదరాబాద్‌లోని డాక్టర్ MCR HRD ఇన్స్టిట్యూట్ వేదికగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ రంగ ప్రతినిధుల కోసం ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ అంతర్జాతీయ కోర్సులు రాబోయే నవంబర్ నెల నుంచే నగరంలో ప్రత్యక్షంగా ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రతినిధి బృందం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS), ఆక్స్ఫర్డ్

రాజధాని హైదరాబాద్‌ను భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల యూకే, అమెరికా పర్యటనల్లో సాధించిన పురోగతిపై ఉన్నతస్థాయి కమిటీ సోమవారం సీఎంకు నివేదిక సమర్పించింది. ఈ పర్యటనల ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థలతో కీలక ఒప్పందాలు కుదిరినట్లు కమిటీ వెల్లడించింది.అమెరికాకు చెందిన నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లండన్ భారత్‌లో తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. ముఖ్యంగా, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ తన క్యాంపస్‌ను ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రభుత్వ, కార్పొరేట్ అధికారుల కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీలో స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను ప్రారంభించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ కూడా అంగీకరించింది. ఈ కోర్సులు వచ్చే నవంబర్ నుంచే ప్రారంభం కానున్నాయి.సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆగస్టు 19 నుంచి 29 వరకు యూకే, యూఎస్‌లలో పర్యటించి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎంఐటీ వంటి దిగ్గజ సంస్థలతో చర్చలు జరిపింది. ఈ చర్చల ఫలితంగా, ఆయా సంస్థల ప్రతినిధుల బృందాలు త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి ఇక్కడి వసతులను పరిశీలించనున్నాయి. ఐటీ, ఫార్మా రంగాల్లో ఇప్పటికే ప్రత్యేక ముద్ర వేసిన హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, నైపుణ్య కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియర్ హెల్త్‌కేర్ సేవలను విస్తరించే దిశగా విశాఖపట్నంలో ఏఐజీ హాస్పిటల్స్ భారీ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 2,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఏఐజీ హాస్పిటల్స్ క్యాంపస్‌కు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్ స్థాయి ఉచిత, సంక్లిష్ట వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్, అకడమిక్ మరియు రీసెర్చ్ క్యాంపస్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును ఐదేళ్ల కాలవ్యవధిలో దశలవారీగా అభివృద్ధి చేయడానికి ఏఐజీ హాస్పిటల్స్ యజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 9 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆసుపత్రి భవనం, మరో 2.5 ఎకరాల్లో నర్సింగ్ కాలేజీ మరియు అనుబంధ సౌకర్యాలను నిర్మిస్తారు. మొదటి దశలో 650 పడకల సామర్థ్యంతో టవర్ A, B లను 2028 అక్టోబర్ నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత రెండేళ్ల వ్యవధిలో రెండవ దశ కింద మరో 350 పడకల టవర్ C నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏఐజీ హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ పనులు పూర్తయితే రోజువారీ ప్రాతిపదికన దాదాపు 5,000 మంది రోగులకు బాహ్య వైద్య సేవలు అందించవచ్చని ప్రతినిధులు వెల్లడించారు. దీంతో సంక్లిష్టమైన గ్యాస్ట్రో, లివర్, ట్రాన్స్‌ప్లాంట్, ఆంకాలజీ వంటి వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉత్తరాంధ్ర ప్రజలకు తప్పుతుంది. ఇదిలా ఉండగా ఈ క్యాంపస్ ద్వారా దాదాపు 9,000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆసుపత్రిలో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఫెసిలిటీతో పాటు 50కి పైగా స్పెషాలిటీ రంగాలు కూడా అందుబాటులో ఉంటాయి. దక్షిణ భారతదేశంలో విశాఖపట్నాన్ని ప్రధాన హెల్త్‌కేర్ హబ్‌గా తీర్చిదిద్దే వ్యూహంలో ఈ ఏఐజీ హాస్పిటల్స్ ప్రాజెక్ట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IND vs SL 2nd Test Predicted Playing 11: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా రెడీ అవుతోంది. తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కొలంబోలోని ఎస్ఎస్సీ స్టేడియం వేదికగా రేపటి (ఆగస్టు 23) నుంచి రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలని గిల్ సేన చూస్తోంది. మరోవైపు సిరీస్ సమం చేయాలంటే ఆతిథ్య శ్రీలంక తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ (167), కేఎల్ రాహుల్ (82) అద్భుతంగా రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత రాణించి భారత్ 193 పరుగులకు పరిమితమైంది. 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో భారత బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలంతో లంకను దెబ్బకొట్టగా.. కుల్దీప్ యాదవ్ మాత్రం లయ అందుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం ఒకే వికెట్ తీశాడు. కుల్దీప్ను గిల్ కేవలం మూడో స్పిన్నర్‌గా చూస్తున్నట్లు అర్థమవుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుల్దీప్కు సపోర్ట్‌గా ఉన్నా.. ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యం ఉండటంతో అతనికి విశ్రాంతినిచ్చి ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు 31వ తేదీన ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మూడో విడత పరిహారంగా రూ.250 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.48 రోజుల్లోనే రూ.768 కోట్ల పరిహారంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 48 రోజుల్లోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించింది. మూడు విడతల్లో మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. తొలి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు అందించగా, శుక్రవారం మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు సీఎం చేతుల మీదుగా అందజేశారు. నిర్వాసితులకు ఇంకా రూ.132 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తయితే 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది.గత ప్రభుత్వ డ్రామాలతోనే ఆలస్యం: సీఎంఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "1996లో నేనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేశాను. ఇప్పుడు 2026లో నా చేతుల మీదుగానే ప్రారంభించడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250

తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించి, ప్రొఫెసర్ మాయా ట్యూడర్, ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో పాలన, విద్య, ప్రజా విధానాలపై విస్తృతంగా చర్చించారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చదువుకున్న ఈ విశ్వవిద్యాలయంతో భారత్‌కు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.హైదరాబాద్ కు ఆక్స్ఫర్డ్ బృందంతెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్‌జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న పలు అవకాశాలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రతినిధి బృందాన్ని పంపాలని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులను తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్విల్ కాలేజీని సందర్శించారు. ఈ కాలేజీలో విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిత్రపటాన్ని సందర్శించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి అందుకే ఇవ్వలేదు- రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!అనంతరం ముఖ్యమంత్రి, అక్కడే జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంగణంలో గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, హోటల్ ఉన్నాయి. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా

ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను పూర్తిగా నమ్మడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. తొలి టెస్టులో కుల్దీప్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న గాలే పిచ్‌పై కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే కుల్దీప్కు తగినంత బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడమే అతడి వైఫల్యానికి కారణమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘జడేజా ఒక వైపు, సుతార్ మరోవైపు వికెట్లు తీస్తున్నారని అందరూ ప్రశ్నిస్తారు. కానీ కుల్దీప్ మూడో స్పిన్నర్. నేను, జడేజా ఆడుతున్నప్పుడు కూడా అతడు మూడో స్పిన్నర్‌గానే ఉండేవాడు. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు. 11 మంది ఉన్న జట్టులో మూడో లేదా నాలుగో స్పిన్నర్‌గా ఉండటం అంత సులభం కాదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. ‘కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు కుల్దీప్ యాదవ్ ప్రాధాన్యత కలిగిన బౌలర్ కాకపోవచ్చు. కుల్దీప్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు తన నైపుణ్యాన్ని కోల్పోయాడా? అంటే అస్సలు కాదు. చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా అతడిని సరిగ్గా ఉపయోగించలేదు. ఇది ఆటగాడి తప్పు కాదు. ఇది ప్లేయర్‌పై మేనేజ్మెంట్కు నమ్మకం లేదనడానికి ఒక సంకేతం. అతడికి

శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టుకు ముందు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ముఖ్యంగా లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిల్.. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అదే అంశంపై సుదీర్ఘంగా సాధన చేశాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో గిల్ రెండుసార్లు ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో ప్రారంభం కానుంది. ఎడమచేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కొనే సమయంలో బంతి లైన్‌ను పూర్తిగా కవర్ చేయడంలో గిల్ ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు 42 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ను లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఏకంగా 11 సార్లు ఔట్ చేశారు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ నెట్స్‌లో గిల్ ప్రత్యేకంగా లెఫ్టార్మ్ స్పిన్‌ను ఎదుర్కొన్నాడు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజాతో పాటు స్థానిక బౌలర్ల బంతులను కూడా చాలాసేపు ఆడాడు. గిల్ సాధనపై టీమిండియా స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే స్పందిస్తూ.. పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునేందుకు గిల్ ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. ‘అతని ఆటలో సహజంగానే పరుగుల ప్రవాహం ఉంటుంది. పిచ్ పరిస్థితులు, బంతి వేగం, ఎలాంటి షాట్లు ఆడాలి, ఎలా డిఫెన్స్ చేయాలనే విషయాలను గమనిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా మారుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లోనూ తన సహజ ఆటతీరునే

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్ ఫైనల్ రేస్ ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. మొత్తం 27 టెస్ట్ సిరీస్‌లలో ఇంకా 15 సిరీస్‌లు మిగిలి ఉన్నాయి. 2027 జూన్ 9 నుంచి 13 వరకు లండన్‌లోని 'ద ఓవల్' లో జరగనున్న టైటిల్ పోరుపైనే అన్ని జట్లు కన్నేశాయి. గత రెండు సైకిళ్ల లెక్కలు చూస్తే, ఏ జట్టు అయినా ఫైనల్ చేరాలంటే కనీసం 60% నుంచి 65% పాయింట్ల శాతం సాధించాల్సి ఉంటుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. గాలేలో జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ పాయింట్ల శాతంలో కాస్త మెరుగైంది. గత ఏడాది సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోవడంతో భారత్ అవకాశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ నుంచి భారత్ దాదాపు అవుట్ అయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మళ్లీ అవకాశం దక్కింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత జట్టు ప్రస్తుతం 5వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత భారత్ పీసీటీలు పెగిగింది. ఇప్పటివరకు భారత్ మొత్తం 10 టెస్టులు ఆడింది. అందులో 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా చేతిలో రెండు, ఇంగ్లాండ్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. భారత్‌కు ప్రస్తుతం శ్రీలంకతో ఆడాల్సిన రెండో టెస్టుతో కలిపి మొత్తం 8 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భారత్ 2 టెస్టులు ఆడుతుంది. అనంతరం ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల భారీ సిరీస్ ఆడాల్సి ఉంది. భారత్‌కు ఇప్పుడు ప్రతి మ్యాచ్ చాలా కీలకం. ఫైనల్ చేరేందుకు కావాల్సిన 60% PCT

Shubman Gill Comments on India Test Victory: తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ 462 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు బిగించింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేశాడు. అనంతరం బౌలింగ్‌లో స్పిన్నర్ మానవ్ సుతార్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని 284 పరుగులకే కట్టడి చేశాడు. దీంతో లభించిన 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైనా శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో లంక జట్టు 206 పరుగులకే కుప్పకూలడంతో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. పడిక్కల్ క్లాస్.. మానవ్ సుతార్ స్పిన్ మ్యాజిక్.. మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ గిల్ మాట్లాడుతూ జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్ మానవ్ సుతార్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థిని దెబ్బతీశాడని, అతనికి భారత జట్టులో గొప్ప భవిష్యత్తు ఉందని కొనియాడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రత్యర్థి స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చలాయించిన పడిక్కల్ ఆటతీరు అమోఘమని గిల్ పేర్కొన్నాడు. పడిక్కల్ ఇలాంటి స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తే జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం సులువవుతుందని వివరించాడు. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? రెండో ఇన్నింగ్స్ వికెట్ల పతనంపై క్లారిటీ.. 600వ టెస్టు సంబరం.. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంపై గిల్ వ్యూహాత్మక వివరణ ఇచ్చాడు. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని కారణంగా ప్రత్యర్థి ముందు వీలైనంత వేగంగా 400 పైచిలుకు లక్ష్యం ఉంచాలనే ఆలోచనతోనే బ్యాటర్లు దూకుడుగా ఆడారని స్పష్టం చేశాడు. అప్పటికే మ్యాచ్ భారత్ నియంత్రణలోనే

SL vs IND 2nd Test: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత తుది జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. గాలే టెస్టులో భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించి విజయాన్ని అందించడంతో టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు మరో అవకాశం దక్కనుంది. అలాగే మిడిలార్డర్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ తమ స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంది. మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ సొంతమవుతుంది కాబట్టి అదే జట్టుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు ఆటగాళ్లు.. విన్నింగ్ టీమ్‌ను యథాతథంగా కొనసాగిస్తే జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు రెండో టెస్టులోనూ రిజర్వ్‌గా మిగిలిపోనున్నారు. బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్, పేసర్లు ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. జట్టులోని ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో వీరికి తుది జట్టులో అవకాశం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..? తొలి టెస్టులో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తమ స్పిన్ మ్యాజిక్‌తో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. పేస్ విభాగంలో మహ్మద్ సిరాజ్ తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ వేగంతో రాణించనున్నారు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

హీరో తేజ సజ్జా నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘మిరాయ్’ జపాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం జపాన్‌లో అత్యంత వైభవంగా విడుదల కానుంది. రిలీజ్‌కు ముందే అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. గతంలో ఇండియన్ సినిమాలకు సంబంధించి జపాన్ మార్కెట్లో ట్రెండ్ సెట్ చేసిన బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి భారీ చిత్రాల రికార్డులను ‘మిరాయ్’ దాటేసింది. భారతీయ చిత్ర పరిశ్రమ దృష్టిని ఈ బుకింగ్స్ ఒక్కసారిగా ఆకర్షించాయి. దీంతో జపాన్‌లో అత్యధిక డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన భారతీయ సినిమాల టాప్ 10 జాబితాలో ‘మిరాయ్’ 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, యంగ్ హీరో తేజ సజ్జా మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోందని ఈ అడ్వాన్స్ బుకింగ్స్ నిరూపిస్తున్నాయి. ఫలితంగా జపాన్‌లో ఇప్పటికే విజయం సాధించిన ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ వంటి విజువల్ వండర్స్ సరసన ఈ సినిమా చేరింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకులతో పాటు స్థానిక మూవీ లవర్స్ కూడా ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో జపాన్ మార్కెట్లో ‘మిరాయ్’ మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో తెలుగు చిత్రాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 143 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ‘మిరాయ్’, 2025లో అత్యధిక రెవెన్యూ సాధించిన టాప్ టాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జపాన్ విడుదలతో ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది

వన్డే వరల్డ్‌కప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే చర్చలు మొదలయ్యయి. తాజాగా ఈ మెగా టోర్నీ కోసం సీఎస్కే మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించాడు. ఉతప్ప అందరిని ఆశ్చర్యపరుస్తూ తన వరల్డ్ కప్ జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటిచ్చాడు. ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మకు బ్యాకప్‌గా ఉన్న యశస్వి జైశ్వాల్‌ను కాదని వైభవ్‌కు రాబిన్ ఛాన్స్ ఇచ్చాడు. 15 ఏళ్ల వైభవ్ ఇటీవల భారత సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో విఫలమైనప్పటికి తర్వాత జింబాబ్వే పర్యనటలో మాత్రం వైభవ్ ఇరగదీశాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు వచ్చే నెలలో జరగనున్న ఏషియన్ క్రీడలకు సన్నదమవుతున్నాడు. అయితే సూర్యవంశీ ఇప్పుడే వన్డే జట్టులోకి సూచనలు కనిపించడం లేదు. ఎందుకంటే ఓపెనింగ్ స్లాట్ కోసం ఇప్పటికే జైశ్వాల్, రుతురాజ్ వంటి యువ ఆటగాళ్లు పోటీలో ఉన్నారు. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత వీరిలో ఎవరో ఒకరు ఆ స్దానాన్ని భర్తీ చేయనున్నారు. ఇక రాబిన్ ఉతప్ప తను ఎంపిక చేసిన జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్లగా కేఎల్ రాహుల్‌తో పాటు సంజూ శాంసన్‌లకు అవకాశమిచ్చాడు. ఇషాన్ కిషన్‌కు బదలుగా సంజూను ఉతప్ప ఎంపిక చేశాడు. సంజూ చివరగా భారత్ తరపున మూడేళ్ల కిందట వన్డే మ్యాచ్ ఆడాడు. ఈ జట్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఆల్రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను ఉతప్ప ఎంపిక చేశాడు. అదేవిధంగా అందరి మాజీ క్రికెటర్లలానే రాబిన్ కూడా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సూచించాడు. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో భువనేశ్వర్ అద్భుతంగా

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తీరు మారలేదు. తెలుగు సినిమాపై మరోసారి తన అక్కసును సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తెలుగు సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జయకేతనం ఎగరవేస్తుంటే... ఉత్తరాది దర్శకులకు కంటగింపుగా ఉంది. ఏదోరకంగా తెలుగు సినిమాలను చిన్న చూపు చూసే భావన ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. 'బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్.' వంటి సినిమాలు జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించడం వారికి నచ్చడం లేదు. దాంతో ఏదో ఒంకను తెలుగు సినిమాను చులకన చేయడానికి పరోక్షంగా ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్య రణబీర్ కపూర్ 'యానిమల్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగినప్పుడు ఎడ్యుకేషనలిస్ట్, పొలిటీషియన్ మల్లారెడ్డి తెలుగు సినిమా ఖ్యాతిని గురించి చెబుతూ, భవిష్యత్తులో రణబీర్ కపూర్ సైతం హైదరాబాద్‌లో స్థిరపడాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలను మరీ ఇబ్బంది పెడుతున్నట్టు అనిపిస్తోంది. సమయంకోసం వేచిచూసి, ఏదో రకంగా తెలుగు సినిమాను తగ్గించే పనికి వారు పూనుకుంటున్నారు. తాజాగా గతంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తెలుగు సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోందని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరో నెటిజన్ స్పందిస్తూ, 'మరి దేవర, ఓజీ, రాజా సాబ్ చిత్రాల పరిస్థితి ఏమిటీ?' అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ 'ఊఫ్స్' అంటూ రియాక్షన్ ఇచ్చారు. అంటే పరోక్షంగా అయ్యో అంటూ తన సానుభూతిని ఈ చిత్రాలకు ఆయన తెలియచేశాడని భావించాలి. దీనిని తెలుగు సినిమా రంగంలోని వారు కాస్తంత సీరియస్ గా తీసుకుంటున్నారు. పేరున్న బాలీవుడ్ దర్శకుడు ఇలా బాధ్యతను మార్చి స్పందించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు. ఇలా తెలుగు సినిమా మీద వ్యతిరేక భావన పెంచుకుంటూ పోతే నష్టపోయేది ఉత్తరాది వారే అని అంటున్నారు. గతంలో దక్షిణాది ఫిల్మ్

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకుని మంత్రి చర్చకు రావాలని ఏలేటి డిమాండ్ చేశారు. హైదరాబాద్: తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి శ్రీనివాస రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న (బుధవారం) సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు. తన సవాల్‌ను స్వీకరించి చర్చకు రావాలని మంత్రిని ఏలేటి మరోసారి డిమాండ్ చేశారు. తాను మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడే ఉంటానని, శ్రీనివాస రెడ్డి రావాలని డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా భూభారతి, 22ఏలో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఫీనిక్స్, రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థలకు భూ బదలాయింపులు జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రజల భూములను లాక్కున్నారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పొంగులేటి వచ్చి వివరణ ఇచ్చే వరకు తాను కదిలేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ ఇస్తారా? లేక పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఎవరొచ్చినా సరే తన వద్ద ఉన్న ఆధారాలను అందిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో షహజాద్ భట్టీ నెట్వర్క్ జాడలు క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. అయితే, ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పటికీ, జట్టు కూర్పుపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్.. కొలంబోలో జరగబోయే రెండో టెస్టుకు జట్టులో ఒక మార్పు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు. 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ వంటి ఇతర లెఫ్టార్మ్ స్పిన్నర్లు అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో, కుల్దీప్ను పక్కనపెట్టి, అతడి స్థానంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు సమాచారం.తొలి టెస్టులో భారత్ ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లతో (జడేజా, సుతార్, కుల్దీప్) బరిలోకి దిగింది. అయితే శ్రీలంక జట్టులో ఉన్న ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కోవడానికి ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఉంటే జట్టుకు వైవిధ్యం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే సరాన్ష్ జైన్‌ను సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇప్పుడు అతడిని తుది జట్టులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు.అయితే, ఈ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ దీనిపై స్పందిస్తూ

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకోలేకపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీలో పట్టికలో భారత్ పరిస్థితి ఏమిటంటే... స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు 165 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి రోజు ఆటలో 206 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6/55తో చెలరేగిన సుతార్, మ్యాచ్ మొత్తంలో 10/131 వికెట్లు పడగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ భారీ విజయం సాధించినప్పటికీ, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరచుకోలేకపోయింది. గత వారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ విజయం సాధించడంతో, వారు నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇంకా 8 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా జరిగే రెండో టెస్టుతో పాటు, నవంబర్‌లో న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, తదుపరి స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆడిన 10 టెస్టుల్లో నాలుగింటిలో ఓటమి చవిచూసిన టీమిండియాకు ఇకపై ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిదే. ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లేకుంటే, భారత్ తన మిగిలిన 8 టెస్టుల్లో 7 గెలిస్తే 68.52 శాతంతో (PCT) మెరుగవుతుంది. ఒకవేళ 6 విజయాలు, 2 ఓటములు నమోదైతే ఆ శాతం 62.96కి పడిపోతుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూకట్పల్లి రైతుబజార్లో నేటి ధరల వివరాలివే.. ఇరాన్‌కి సహాయం చేస్తే.. ఆర్థిక మూల్యం తప్పదు: ట్రంప్

తేజ సజ్జ ‘మిరాయ్’ సినిమాకు జపాన్‌లో భారీ స్పందన లభిస్తోంది. డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో ధురంధర్ 2, బాహుబలి 2, టైగర్ జిందా హై వంటి సినిమాలను దాటేసింది. హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ (Mirai) సినిమాకు జపాన్ (Japan)లో భారీ స్పందన లభిస్తోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. జపాన్‌లో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఇప్పటికే ‘ధురంధర్ 2’ (Dhurandhar2), ‘టైగర్ జిందా హై’, బాహుబలి 2 (Baahubali2) వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం జపాన్‌లో అత్యధిక డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన టాప్-10 భారతీయ చిత్రాల జాబితాలో ‘మిరాయ్’ ఏడో స్థానంలో కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో ఈ ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తేజ సజ్జ గతంలో ‘హనుమాన్’ (HanuMan) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా విజయంతో ఆయనకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ‘మిరాయ్’తో అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన పరిధిని మరింతగా విస్తరిస్తున్నారు. విభిన్నమైన కథలు, భారీ స్థాయి జానర్ సినిమాలను ఎంచుకుంటూ తేజ సజ్జ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకుంటున్నారు. జపాన్‌లో ‘మిరాయ్’కు వస్తున్న స్పందన చూస్తుంటే ఈ సినిమా అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి


India vs Sri Lanka: భారత్ గాలే టెస్టులో 372 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. చివరి రోజు ఆతిథ్య జట్టు బ్యాటర్లు వికెట్లు కాపాడుకుంటూ భారత బౌలర్లకు గట్టి పరీక్ష పెట్టారు. దినుషా 84, ధనంజయ డి సిల్వా 59 పరుగులతో పోరాడారు. వీరిద్దరి మధ్య 95 పరుగుల భాగస్వామ్యం శ్రీలంకకు ఆశలు రేపింది. మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో గాలే పిచ్‌పై బ్యాటింగ్ అంత సులువు కాకపోవడంతో ప్రతి వికెట్ కోసం భారత్ శ్రమించాల్సి వచ్చింది. చివరికి భారత బౌలింగ్ లోతు ఫలించింది. మానవ్ సుతార్ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. సుతార్ ప్రదర్శన ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ తరఫున శ్రీలంకపై టెస్టులో 10 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అతడు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాల సరసన చేరాడు. శ్రీలంకలో భారత బౌలర్ అత్యుత్తమ మ్యాచ్ బౌలింగ్ గణాంకాల్లో సుతార్ 10/131తో అగ్రస్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ ఈ ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని, భారత్ తరఫున చాలా కాలం ఆడగల సామర్థ్యం అతడిలో కనిపిస్తోందని గిల్ పేర్కొన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. దేవదత్ పాదిక్కల్ 167 పరుగులు చేయడం ఆ స్కోరుకు ప్రధాన బలంగా నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 193 పరుగులకే పరిమితమైనా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా శ్రీలంక ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్‌లో పిచ్ ఐదో రోజు వరకు ఆటకు అనుకూలంగానే ఉన్నా, మూడో రోజు నుంచి స్పిన్‌కు ఎక్కువగా సహకరించింది. పాదిక్కల్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఎడమచేతి వాటం బ్యాటర్లకు ఎడమచేతి స్పిన్నర్లను ఎదుర్కోవడం కొంత సులభంగా అనిపించిందని చెప్పాడు. ఈ విజయంతో భారత్
గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలింది. మానవ్ సుతార్ ఐదు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. దీంతో రెండు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను భారత బౌలర్లు మొదటి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకే పరిమితం చేశారు. దీంతో 178 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. చివరి వరకూ అదే జోరు కొనసాగించింది.రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 193 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన లీడ్‌తో కలిసి శ్రీలంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య శ్రీలంక.. 206 పరుగులకు కుప్పకూలింది. నాలుగో రోజే కీలక వికెట్లు కోల్పోయి భారీ ఓటమి దిశగా పయనించిన శ్రీలంక, ఆఖరి రోజున మిగిలిన వికెట్లను కూడా చకచకా సమర్పించుకుంది. దీంతో 165 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా స్పిన్నర్ మానవ్ సుతార్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచులో అతడు 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.తన 600వ టెస్ట్ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించి.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో భారత్‌కు కీలకమైన 12 పాయింట్లు దక్కాయి. ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది
శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ రికార్డుల వేట కొనసాగించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఇదే సమయంలో ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 69 బంతుల్లో 66 పరుగులు సాధించి సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను పంత్ దాటేశాడు.మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు చేసిన పంత్, రెండో ఇన్నింగ్స్ 66 పరుగులతో కలిపి డబ్ల్యూటీసీలో తన మొత్తం పరుగుల సంఖ్యను 2,885కి చేర్చుకున్నాడు. గిల్ (2,867 పరుగులు) కంటే పంత్ ప్రస్తుతం 18 పరుగులు ముందంజలో ఉన్నాడు. గాలే టెస్టులో గిల్ కేవలం 16, 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇద్దరూ 41 డబ్ల్యూటీసీ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, పంత్ 73 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డు సాధించాడు. గిల్ మాత్రం ఇందుకు 75 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (2,716), రవీంద్ర జడేజా (2,632), విరాట్ కోహ్లీ (2,617) తదుపరి స్థానాల్లో ఉన్నారు.ఈ మ్యాచ్‌లోనే పంత్ మరొక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో లహిరు కుమార బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన కేవలం నాలుగో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.డబ్ల్యూటీసీలో పంత్ ఇప్పటివరకు 6 సెంచరీలు, 17 అర్ధసెంచరీలు బాదాడు. ఇందులో అతడు అత్యుత్తమ స్కోరు 146 పరుగులు కాగా, సగటు 41.81గా ఉంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యూటీసీ అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లాండ్ స్టార్ జో రూట్ (77 మ్యాచ్‌ల్లో 6,651 పరుగులు) పేరిట ఉంది. దీంతో ఎవరికీ అందనంత

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం నీటిపాలు కాక తప్పదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్ట్ క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ ఐదో రోజు వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా లేదా ఆట పూర్తి కాకుండా ఆగిపోతే, ఆ మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తారు. భారత్ గెలుపునకు ఎంత దగ్గరగా ఉన్నప్పటికీ, లేదా తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సాధించినప్పటికీ అది పరిగణనలోకి తీసుకోరు. వికెట్లు లేదా పరుగులు మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆట పూర్తవ్వకపోతే విజేతను ప్రకటించే అవకాశం ఐసీసీ నిబంధనల్లో లేదు. ఫలితంగా టీమిండియా విజయం సాధించే అవకాశాలు పూర్తిగా నీరుగారిపోతాయి. ఇది కూడా చదవండి: Watch: గాలే టెస్ట్‌లో తీవ్ర వివాదం.. ధ్రువ్ జురెల్ క్యాచ్‌పై సోషల్ మీడియాలో రచ్చ.. అసలు నిజమేంటి? చరిత్రలో లేని రికార్డును శ్రీలంక అందుకుంటుందా? గాలే మైదానంలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా 342 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజ్ చేయలేదు. ఆ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉంది. సొంత మైదానంలో శ్రీలంక ఇప్పటివరకు 300 పరుగుల మార్కును కూడా విజయవంతంగా ఛేజ్ చేయలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం లంకకు అసాధ్యమనే చెప్పాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక, గెలువడానికి ఇంకా 288 పరుగులు చేయాల్సి ఉంది. ఇది

దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు. అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల్లో ఏపీ కేవలం 24 నెలల్లోనే 9వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబాకిందని మంత్రి లోకేశ్ ప్రకటించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని వెల్లడించారు. ‘‘విజనరీ నాయకుడు సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం పారిశ్రామిక శక్తిగా అత్యంత వేగంగా ఎదగడం గర్వకారణం. స్పష్టమైన విజన్, పారదర్శక పాలన, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్ర ప్రగతికి మూల స్తంభాలు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది.’’ అని లోకేశ్ పేర్కొన్నారు. 55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్
రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కర్నూలును డ్రోన్ సిటీగా అభివృద్ధి చేసేందుకు సన్నాహకాలు చేస్తోంది. కర్నూలు సమీనంలోని ఓర్వకల్లు మండలంలో 600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని.. రాబోయే కాలంలో రూ. 5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. డ్రోన్ల పరిశోధన, ఆవిష్కరణ, తయారీ, పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ తదితర అన్ని విభాగాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు.డ్రోన్ సిటీలో వివిధ డ్రోన్ల కంపెనీల సీఈఓలతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. దేశంలోనే ఈ డ్రోన్ సిటీ మొదటిదన్నారు. సీఈఓలు చేసిన సూచనల అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామని ఆయన చెప్పారు. డ్రోన్ సంస్థలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. READ ALSO వెలుగొండ ప్రాజెక్టు కోసం ఊళ్లే వదిలేసి వెళ్తున్నారు.. నల్లమల సాగర్‌తో 11 గ్రామాలు మునకఅమరావతిలో రెండేళ్ల కిందట డ్రోన్ సమ్మిట్ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. దానికి అనుగుణంగానే కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటయిందన్నారు. రాళ్లతో నిండిన ఈ ప్రాంతం రేపు డ్రోన్ల తయారీ కేంద్రంగా నిలుస్తుందన్నారు. టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రోన్ సిటీ అభివృద్ధిని సమీక్షిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.తొలి దశలో 120 ఎకరాల్లో అభివృద్ధి చేశామని, రెండో దశలో 480 ఎకరాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ ఈడీ యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. డ్రోన్ల రంగాన్ని రూ. 500 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ గీతాంజలి శర్మ చెప్పారు. డ్రోన్ల తయారీ సంస్థల ప్రతినిధులు ప్రదర్శించిన డ్రోన్లను రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా అభ్యంతరం వ్యక్తం చేశాడు. సుతార్ ఒక పరుగు కోసం పరిగెత్తే సమయంలో పిచ్ మధ్య భాగంలో అడుగులు వేశాడని ధనంజయ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన గాలే టెస్టులో కొత్త చర్చకు దారితీసింది. క్రికెట్లో బ్యాటర్లు సాధారణంగా హాఫ్ స్పైక్స్ ధరిస్తారు. పిచ్ మధ్యలో పరుగెత్తడం వల్ల వారి బూట్ల ముద్రలతో ఆ ప్రాంతం దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాంతో తర్వాత బ్యాటింగ్ చేసే ఆటగాళ్లకు పరిస్థితులు మరింత కఠినంగా మారవచ్చు. ఎక్కువమంది చదివినది: 59 ఫోర్లు, 1 సిక్స్.. ఒకే ఇన్నింగ్స్‌లో 451 పరుగులతో బీభత్సం.. ప్రపంచ రికార్డ్‌నే షేక్ చేసిన దిగ్గజాలు..! శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్ ఆడాల్సి ఉండటంతోనే ధనంజయ ఈ విషయంపై అంపైర్ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మ్యాచ్‌లో పిచ్‌ను కావాలనే దెబ్బతీసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని అంపైర్లు పరిశీలిస్తారు. పిచ్‌ను దెబ్బతీసేలా బ్యాటర్ ప్రవర్తిస్తే అంపైర్ తొలుత హెచ్చరిక ఇస్తాడు. ఆ హెచ్చరిక మొత్తం ఇన్నింగ్స్‌కు వర్తిస్తుంది. ఆ తర్వాత అదే చర్య మళ్లీ జరిగితే, ఆ బంతికి వచ్చిన పరుగులను రద్దు చేసి ఫీల్డింగ్ జట్టుకు 5 అదనపు పరుగులు ఇచ్చే నిబంధన కూడా ఉంది. మ్యాచ్ పరిస్థితులు మాత్రం భారత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గాలేలో శ్రీలంక ఇప్పటివరకు నాలుగో ఇన్నింగ్స్‌లో 300 పరుగులు కూడా చేయలేదు

సీనియర్ నటి ఆమని తన సినీ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచిన 'శుభలగ్నం', 'మావిచిగురు' సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా, నటిగా తనకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టాయని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పాత్రల లోతును అర్థం చేసుకుని నటించడం వల్లే ఈ సినిమాలు ప్రేక్షకులకు అంతగా దగ్గరయ్యాయని ఆమని అభిప్రాయపడ్డారు. శుభలగ్నం సినిమా ఆమని కెరీర్లో ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే హిట్ చిత్రంగా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన గయ్యాళి పాత్ర నిజ జీవితంలో తన స్వభావానికి పూర్తిగా భిన్నమైనదని ఆమె తెలిపారు. అయితే నటిగా ఆ పాత్రలోని సవాలును స్వీకరించి అద్భుతంగా నటించానని, దర్శకుడు కృష్ణారెడ్డి కూడా ఇటీవల తన నటనను ప్రత్యేకంగా ప్రశంసించారని ఆమని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో పాత్రల కోసం ఆమని ఎంతో శ్రమించారు, ఇది ప్రేక్షకులపై పెను ప్రభావం చూపింది. దీంతో నేటికీ ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు ఆ పాత్రను గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా, మావిచిగురు సినిమాలో నటించడం తన కెరీర్లోనే అత్యంత కష్టతరమైన అనుభవం అని ఆమె వెల్లడించారు. ఆ పాత్రలో లోతైన భావోద్వేగాలను పండించడానికి గ్లిసరిన్ లేకుండానే సహజంగా కన్నీళ్లు పెట్టాల్సి వచ్చేదని ఆమని వివరించారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల తర్వాత తాను తీవ్రమైన తలనొప్పి, మానసిక అలసటకు గురయ్యేదానని ఆమె చెప్పుకొచ్చారు. ఫలితంగా ఆ పాత్రలు ప్రేక్షకులను కదిలించేలా చేశాయి, ముఖ్యంగా కుటుంబ బాధ్యతలను గుర్తు చేసే సన్నివేశాలు ఎంతో మందిని భావోద్వేగానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో నటులు తమ సొంత పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడం ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ రెండు సినిమాలకు సీనియర్ నటి సరిత డబ్బింగ్ చెప్పడం తన అదృష్టమని ఆమని కొనియాడారు. సరిత పాత్రలోని భావాలను, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను కూడా అర్థం చేసుకుని అద్భుతంగా డబ్బింగ్ చెప్పారని ఆమె ప్రశంసించారు

Shubman Gill:భారత టెస్ట్ జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శుభ్‌మన్ గిల్ ఆటగాడిగా నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం తరచుగా విఫలమవుతున్నాడు. ప్రధానంగా డీఆర్ఎస్ (డిసిషన్ రివ్యూ సిస్టమ్) కోరే విషయంలో గిల్ నిర్ణయాలు జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. మైదానంలో ఆవేశానికి లోనై లేదా బౌలర్ల ఒత్తిడికి తలొగ్గి రివ్యూలు కోరడం వల్ల విలువైన అవకాశాలు చేజారిపోతున్నాయి. గిల్ తన నాయకత్వ ప్రస్థానంలో ఇప్పటివరకు మొత్తం 41 సార్లు డీఆర్ఎస్ తీసుకున్నాడు. అందులో కేవలం 5 రివ్యూలు మాత్రమే అనుకూలంగా రావడం గమనార్హం. మిగిలిన 36 రివ్యూలు పూర్తిగా వ్యర్థమయ్యాయి. అంటే అతని డీఆర్ఎస్ సక్సెస్ రేటు అత్యంత ఘోరంగా ఉంది. శ్రీలంకతో జరుగుతున్న గాల్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా 30వ ఓవర్, 35వ ఓవర్లలో గిల్ తీసుకున్న నిర్ణయాలు నిరాశనే మిగిల్చాయి. చెరొక సమీక్షను వృథా చేయడంతో మూడింట్లో రెండు రివ్యూలు చేజారాయి. బౌలర్లు, కీపర్ సలహాలు రివర్స్ అవుతున్నాయా? డీఆర్ఎస్ కోరే సమయంలో గిల్ ఒక్కడే నిర్ణయం తీసుకోడు. బౌలర్, వికెట్ కీపర్, స్లిప్ ఫీల్డర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాడు. అయినా సరే ఫలితం మాత్రం ప్రతికూలంగానే వస్తోంది. మైదానంలో బౌలర్ల ఆత్రుతను అదుపు చేసి, కీపర్ ఇచ్చే స్పష్టమైన సమాచారాన్ని విశ్లేషించడంలో కెప్టెన్‌గా గిల్ విఫలమవుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆవేశంతో కాకుండా స్పష్టత ఉన్నప్పుడు మాత్రమే రివ్యూలు కోరడం అలవాటు చేసుకోవాలి. మాజీ కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు డీఆర్ఎస్ కోరడంలో సిద్దహస్తులుగా పేరుగాంచారు. ధోని రివ్యూ తీసుకుంటే వికెట్ ఖాయం అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు గిల్ కూడా వారి నుంచి ఆ వ్యూహాత్మక ఆలోచనలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కీలక సమయాల్లో రివ్యూలు మిగిలి ఉంటేనే మ్యాచ్ మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. రాబోయే మ్యాచ్‌ల్లో గిల్ ఈ

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. నవ పంచమ రాజయోగం ఎఫెక్ట్: నవ పంచమ రాజయోగం వలన సమయం కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. అయితే, ఈ నవ పంచమి రాజయోగం వల్ల ఏ రాశుల వారు ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. ఎక్కువగా ప్రయోజనం పొందే రాశుల వారి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుంభ రాశి.. పంచమి రాజయోగం ఏర్పడటం వల్ల కుంభ రాశి వారు సానుకూల మార్పులు తీసుకురాబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుంభ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఈ సమయంలో వారికి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. దీనితో పాటు, కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఈ శక్తివంతమైన రజో యోగం వృషభ రాశి వారికి చాలా శుభప్రదం. అంతే కాకుండా, ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన వారి డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఉద్యోగ పరంగా వారికి అద్భుతమైన పదోన్నతులు లభిస్తాయి. అదనంగా, వ్యాపారం చేసేవారు పెట్టుబడులు కూడా పెడతారు. వైవాహిక జీవితం కూడా చాలా వరకు మెరుగుపడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. నవ పంచమి రాజయోగం ప్రభావం వల్ల ధనుస్సు రాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. అంతే కాకుండా, కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా, భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ప్రయోజనం లభించబోతుంది. అలాగే, ఈ

Cheteshwar Pujara Test Batters: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెస్టు క్రికెట్ సీజన్ ఉత్సాహంగా సాగుతోంది. ఒకపక్క శ్రీలంక పర్యటనలో భారత జట్టు తమ సత్తా చాటుతుండగా.. మరో ఎండ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు నడుస్తోంది. త్వరలో ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ తమ సిరీస్‌ను ప్రారంభించనుంది. సరిగ్గా ఇలాంటి బిజీ షెడ్యూల్ సమయంలో ప్రముఖ క్రీడా వెబ్సైట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో క్రికెట్ పండితుడిగా మారిన ఛెతేశ్వర్ పుజారా పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న టాప్-6 టెస్టు బ్యాటర్లకు బ్లైండ్ ర్యాంకింగ్ పద్ధతిలో ర్యాంకులు ఇవ్వాలని పుజారాను కోరారు. టీమిండియా తరపున వందకుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారాకు టెస్టు క్రికెట్ పట్ల ఉన్న అవగాహన అపారం. బ్లైండ్ ర్యాంకింగ్ విధానంలో ముందుగా ఆటగాళ్ల పేర్లు పూర్తిగా చెప్పరు. ఒక పేరు వచ్చినప్పుడు ఆరు స్థానాల్లో ఏదో ఒక ర్యాంక్ కేటాయించాలి. అలా తన వద్దకు వచ్చిన ఆరుగురు బ్యాటర్ల జాబితాలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ దేశాల నుంచి ఒక్కో ఆటగాడిని ఎంచుకున్నాడు. సొంత దేశం నుంచి కేవలం ఇద్దరికే తన జాబితాలో అవకాశం కల్పించాడు. స్టార్ ఆటగాళ్లకు షాక్.. రాహుల్, స్మిత్ ఔట్ పుజారా ముందుకు వచ్చిన ఆరుగురు ఆటగాళ్ల పేర్లు చూస్తే ఎవరికైనా కాస్త ఆశ్చర్యం కలగక మానదు. విదేశీ పిచ్‌లపై సైతం ఎంతో టెక్నికల్‌గా ఆడుతూ శతకాలు సాధించిన భారత స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు ఈ జాబితాలో స్థానం లభించలేదు. సుదీర్ఘ ఫార్మాట్లో 4153 పరుగులు సాధించిన రాహుల్ పేరును పుజారా పరిగణనలోకి తీసుకోకపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. అదే విధంగా ఆధునిక క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్‌కు కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. యాక్టివ్ క్రికెటర్లలో జో రూట్ తర్వాత అత్యధిక పరుగుల (10878 పరుగులు) రికార్డు స్మిత్ పేరిటే ఉన్నప్పటికీ అతనికి జాబితాలో చోటు

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Director Marriage: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. తనకంటే వయసులో చిన్నదైన శుభ్రా శెట్టితో ఆయన చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్ తమ బంధం, పెళ్లి ఆలోచనలు, వయసు తేడా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు కాగా, శుభ్రా శెట్టి వయసు 30 సంవత్సరాలు. వీరిద్దరి మధ్య సుమారు 23 ఏళ్ల వయసు తేడా ఉంది. ఈ కారణంగా గతంలో సోషల్ మీడియాలో వీరిపై విమర్శలు, ట్రోలింగ్ కూడా జరిగాయి. అయితే ఇప్పుడు అలాంటి కామెంట్లను తాము పెద్దగా పట్టించుకోవడం లేదని అనురాగ్ తెలిపారు. శుభ్రాకు పెళ్లిపై అంతగా నమ్మకం లేదని అనురాగ్ చెప్పారు. అయితే తమ బంధానికి ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. తనకు శుభ్రాతో కలిసి ఉండటమే ముఖ్యమని, ఆమె కోసం అవసరమైన ఏ నిర్ణయమైనా తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. తమ మధ్య వయసు తేడా కారణంగా మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించేదని కూడా అనురాగ్ వెల్లడించారు. తన పక్కన శుభ్రా చాలా చిన్న వయసులో కనిపించడంతో తాను పెద్దవాడిలా కనిపిస్తున్నాననే భావన వచ్చేదని అన్నారు. కానీ కాలం గడిచేకొద్దీ ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశామని చెప్పారు. శుభ్రా శెట్టి గతంలో అనురాగ్ కశ్యప్ నిర్మాణ సంస్థ ఫాంటమ్ ఫిల్మ్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ

Shubman Gill stunning catch : టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అతడు తన అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్‌గా మారింది. మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 17వ ఓవర్లో గిల్ సూపర్ ఫీల్డింగ్ చేశాడు. ఈ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేయాడు. తొలి బంతిని లంక బ్యాటర్ కమిందు మెండీస్ షాట్ ఆడాడు. షార్ట్ ఎక్స్ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మన్ గిల్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో చక్కని క్యాచ్ అందుకున్నాడు. Left hand, full stretch, absolute stunner from Shubman Gill! 🥵 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket — Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026 గిల్ స్టన్నింగ్ క్యాచ్ చూసి తోటి ప్లేయర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. కెప్టెనా.. మజాకానా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. గిల్ క్యాచ్ అందుకోవడంతో మెండీస్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో లంక జట్టు 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (167) భారీ శతకంతో చెలరేగాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచరీలు చేశారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య నాలుగు వికెట్లు తీశాడు. కేశర నువాంత మూడు వికెట్లు సాధించాడు. అసిథ ఫెర్నాండో రెండు వికెట్లు పడగొట్టాడు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Devdutt Padikkal Century: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. తొలి రోజు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 288/2తో ఆటను ముగించింది. రీఎంట్రీతో పడిక్కల్ అద్భుతంగా ఆడి 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ భారీగా దంచికొట్టినా రిటైర్డ్ ఔటవగా.. కెప్టెన్ శుభమన్ గిల్ తక్కువ స్కోర్ ఔటయి నిరాశపర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రత్యర్థి గడ్డపై ఆడిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. 73 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. వర్షం అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు వర్షం అంతరాయంతో మ్యాచ్‌కు బ్రేక్ ఇచ్చి మళ్లీ కొనసాగించారు. టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తొలి రోజు ఆటను రెండు వికెట్లకు 288 పరుగులతో ముగించింది. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 134 బంతుల్లో అద్భుత సెంచరీతో తన మొదటి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 178 బంతులు ఆడిన దేవదత్ 131 పరుగులు చేయగా.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టాడు. సాయిసుదర్శన్ గాయం కారణంగా లంకతో సిరీస్‌కు పడిక్కల్‌కు జట్టులో స్థానం లభించింది. చాలాకాలం తర్వాత తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్ సద్వినియోగం చేసుకున్నాడు. ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 32 పరుగులు చేయగా.. వాటిలో ఐదు ఫోర్లు ఉన్నాయి. స్టార్
