
తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా మార్చే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ లక్ష్య సాధనకు విద్యార్థుల మెరుగైన విద్యా, ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర విశ్వవిద్యాలయాలు విదేశీ ఉన్నత విద్యాసంస్థలతో వేగంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇటీవల వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్మనీకి చెందిన ప్రతిష్ఠాత్మక రూట్లింగెన్ యూనివర్సిటీతో కీలక ఒప్పందాలు చేసుకుంది.జర్మనీ యూనివర్సిటీతో కాకతీయ విశ్వవిద్యాలయం ఒప్పందం ఈ ఒప్పందాల ద్వారా 3+2 విద్యా నమూనా ప్రవేశపెట్టారు. విద్యార్థులు మొదటి మూడేళ్ల డిగ్రీని స్థానిక విశ్వవిద్యాలయాల్లో పూర్తి చేసి, తర్వాత రెండేళ్ల మాస్టర్స్ కోర్సును జర్మనీలో అభ్యసిస్తారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డిజిటల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ వంటి కోర్సుల్లో విద్యార్థులకు ఈ మేరకు అవకాశాలు ఉన్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత జర్మనీ విశ్వవిద్యాలయమే మాస్టర్స్ డిగ్రీ అందిస్తుంది.ఏటా 20మంది విద్యార్థులు రూట్లింగెన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఈ విధానంలో కాకతీయ యూనివర్సిటీ నుంచి ఏటా 20 మంది విద్యార్థులు ఎంపికవుతారు. ఇంతకు ముందు తెలంగాణ ఉన్నత విద్యా శాఖ బృందం జర్మనీలోని RWTH ఆచెన్‌, ఆస్ట్‌ఫాలియా, గొట్టింగెన్‌ విశ్వవిద్యాలయాలను సందర్శించి లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ మార్పిడి చేసుకుంది. విద్యార్థి-అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి పరిశోధనలు, డ్యూయల్‌ డిగ్రీలు తదితర అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకుని తదనుగుణంగా చేసిన ప్లాన్ కు ఓకే అన్నారు.పలు విదేశీ యూనివర్సిటీలు హైదరాబాద్ లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లుఅంతేకాదు బోస్టన్‌ లోని నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ , యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నాయి. హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, ఎంఐటీ, ఎల్‌ఎస్‌ఈ వంటి ప్రముఖ సంస్థలతో కూడా వివిధ యూనివర్సిటీలతో చర్చలు సాగుతున్నాయి. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ జపాన్‌లోని హిరోషిమా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.తెలంగాణ ఆర్టీసీ మరో కీలకనిర్ణయం.. మెట్రో రైళ్ళ తరహాలో బస్సుల్లో కూడా..!విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీలలో చదువుకునే సువర్ణావకాశం ఈ అంతర్జాతీయ సహకారాలు విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించి తెలంగాణను గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా నిలబెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులు మన యూనివర్సిటీల నుండే విదేశీ వర్సిటీలలో చదువుకోవటానికి సువర్ణావకాశం లభిస్తుంది.





