
రాష్ట్రప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధినిప్రసాదించాలి: టీ బీజేపీ చీఫ్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్, కేక్స్, క్యాండీలు, జెల్లీలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే ఈ షుగర్ ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు. కొంతమంది గాయాలు మానేందుకు పాలు లేదా టీలో బ్రెడ్ వేసుకుని తింటారు. కానీ వైట్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. అందుకే గాయాలు తగ్గాలంటే వైట్ బ్రెడ్ బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిది. కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచుతాయి. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. ప్రాసెస్ చేసిన బేకాన్, హాట్ డాగ్, సలామీ వంటివి తింటే గాయానికి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే చిప్స్ వంటి ప్యాకేజీ ఐటెమ్స్ తినడం వల్ల రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి గాయాలు మానడం ఆలస్యం చేస్తుంది. అందుకే గాయం మానాలంటే కెఫిన్ తక్కువగా తీసుకోవాలి. సాస్‌లో సోడియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును మరింత పెంచుతాయి. అందుకే గాయాలు మానాలంటే ఈ సాస్ లాంటి పదార్థాలు తినకూడదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే గాయాలు మానడం కోసం ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది

భార్యాభర్తల బంధం అంటే కలిసి జీవించడం మాత్రమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం కూడా. పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్లు, అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి ఎలా స్పందిస్తున్నారన్నదే ఆ బంధం ఎంత హెల్తీగా ఉందో చెప్పగలదు. సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ ఐదు లక్షణాలు ఉంటే.. మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు. కుటుంబ బాధ్యతలు కేవలం భార్యే చూసుకోవాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన ఇతర నిర్ణయాల్లో భర్త కూడా తన వంతు బాధ్యత తీసుకుంటే ఆ బంధం హెల్తీగా ఉంటుంది. భార్య అలసిపోయినప్పుడు పనిలో సహాయం చేయడం, అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవడం వంటి పనులు ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమను పెంచుతాయి. ప్రతి మనిషి తప్పులు చేయడం సహజం. అయితే తప్పు చేసిన తర్వాత దాన్ని అంగీకరించడం, అవసరమైతే క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యమైన లక్షణం. కొందరు తప్పును ఒప్పుకోవడం తమ గౌరవానికి భంగం అనుకుంటారు. కానీ హెల్తీ రిలేషన్ షిప్ లో తప్పు ఒప్పుకోవడం, సారీ చెప్పడం, బలహీనత కాదు.. మెచ్యూరిటీ. గొడవ జరిగినప్పుడు ఎవరు గెలిచారనే దానికంటే, సమస్య ఎలా పరిష్కరించారనేదే ముఖ్యం. ప్రేమ అంటే ఎప్పుడూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రేమను చూపించడం కాదు. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో కనిపించే శ్రద్ధ కూడా ప్రేమకు సంకేతమే. మీరు అలసిపోయారని గమనించడం, భోజనం చేశారా అని అడగడం, మీకు ఇష్టమైన విషయం గుర్తుపెట్టుకోవడం, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడేందుకు సమయం కేటాయించడం వంటి చిన్న పనులు మీపై అతనికి ఉన్న శ్రద్ధను చూపిస్తాయి. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఏ బంధంలోనైనా కోపం, నిరాశ, వాదనలు ఉండొచ్చు. అయితే కోపం
బాదం గింజల్లో విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. మెదడు ఆకారాన్ని పోలి ఉండే వాల్నట్స్ జ్ఞాపకశక్తిని పెంచేందుకు సహాయపడతాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ వాల్నట్స్ తింటే చదివింది బాగా గుర్తు ఉంటుంది. నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి నరాల పనితీరును బాగుచేస్తాయి. మెదడును చురుకుగా ఉంచి చదివింది బాగా గుర్తుండేందుకు సహాయపడతాయి. అయితే మితంగా తీసుకోవడం మంచిది. పల్లీల్లో నియాసిన్, రెస్వెరట్రాల్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బెల్లంలో ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండింటితో తయారుచేసే చిక్కీలు తినడం ద్వారా జ్ఞాపకశక్తి బాగుంటుంది. పాలకూర, తోటకూర, మునగాకు, మెంతి ఆకులు వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం, ఫోలేట్, విటమిన్ కె వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మఖానాలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. నెయ్యిలో తేలికగా వేయించిన ఈ మఖానా స్నాక్ రూపంలో తీసుకుంటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి మెదడు కణాలను రక్షిస్తుంది. అందుకే ఉసిరిని డైట్లో చేర్చుకోవడం ద్వారా జ్ఞాపశక్తి బాగుంటుంది. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరు చురుకుగా ఉంచేందుకు సహాయపడతాయి. తద్వారా చదివింది బాగా గుర్తుంటుంది. రాగాలు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, సామలు లాంటి చిరు ధాన్యాల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి మీ శక్తిని ఎక్కువసేపు తగ్గకుండా కాపాడి మెదడును చురుకుగా ఉంచుతాయి
30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడుతూ వస్తాయి. దీంతో తరచూ ఎముకల నొప్పి వేధిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా ఉండే గింజలు, విత్తనాలు డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో 30 ఏళ్లలోనూ ఎముకలను బలంగా ఉంచే ఆ గింజలు ఏంటో తెలుసుకుందాం. అన్ని గింజలతో పోలిస్తే బాదం గింజల్లో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వయసు పెరిగినా ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ నాలుగైదు బాదం గింజలు నానబెట్టి తినడం చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్ ఎక్కువగా లభిస్తాయి. రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తినడం ద్వారా ఎముకలు పెలుసుబారకుండా చూసుకోవచ్చు. నువ్వుల్లో ఎముకల బలానికి సహాయపడే కాల్షియం, జింక్ ఎక్కువగా లభిస్తాయి. అందుకే పిల్లలతో పాటు పెద్దలు ఎముకలు బలానికి నువ్వులతో చేసిన ఆహారాలు తినడం చాలా మంచిది. చియా సీడ్స్‌లో కాల్షియంతో పాటు ఫాస్పరస్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్‌లో హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతాయి. అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గించి ఎముకలను బలంగా ఉంచుతాయి. పిస్తా గింజల్లో విటమిన్ బి6, పొటాషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రోజూ గుప్పెడు పిస్తా గింజలు తింటే ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను హెల్తీగా ఉంచుతాయి

అరటి పండు రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకు వస్తుంది. ఈజీగా దొరుకుతుంది కాబట్టి చాలామంది అరటిపండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే అరటిపండ్లు కొనేటప్పుడు కనిపించిన వెంటనే పసుపురంగు గుత్తిని తీసుకోవడం కంటే కొన్ని విషయాలను గమనించడం మంచిది. చాలామంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల ఇంటికి తెచ్చిన అరటిపండ్లు త్వరగా పండిపోవడం, మెత్తబడటం లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం జరుగుతుంది. అందుకే అరటిపండ్లు కొనేటప్పుడు చేయకూడని తప్పులేంటో చూద్దాం. చాలామంది అరటి పండ్లు కొద్దిగా పచ్చగా ఉన్నా.. అవి పండలేదని భావించి పక్కన పెట్టేస్తారు. కానీ మీరు వెంటనే తినడానికి కాకుండా కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి అరటిపండ్లు కొనుగోలు చేస్తుంటే, కొద్దిగా పచ్చగా ఉన్నవి ఎంచుకోవడం మంచిది. పూర్తిగా పసుపు రంగులోకి మారిన అరటిపండ్లు ఇప్పటికే బాగా పండిన దశలో ఉంటాయి. కాబట్టి త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. పండిన అరటిపండ్ల తొక్కపై చిన్న చిన్న నల్ల మచ్చలు కనిపించడం సాధారణమే. అయితే మచ్చలు విస్తృతంగా ఉండటం, తొక్క పగిలిపోవడం, అరటిపండు నుంచి అసహజమైన వాసన రావడం లేదా లోపల భాగం అసాధారణంగా మారినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని కొనకపోవడం మంచిది. కానీ కేవలం ఒకటి రెండు చిన్న మచ్చలు ఉన్నాయని చాలామంది మంచి అరటిపండును పక్కనపెట్టేస్తుంటారు. పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించే అరటిపండే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ పరిమాణం ఒక్కటే నాణ్యతకు ప్రమాణం కాదు. అరటిపండు తాజాగా ఉందా, తొక్క బలంగా ఉందా, ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా, పండు ఎలా ఉంది అనే విషయాలను కూడా గమనించాలి. చిన్న పరిమాణంలో ఉన్న అరటిపండ్లు కూడా మంచి నాణ్యతతో ఉండవచ్చు. వెంటనే తినాలనుకునేవారు పూర్తిగా మెత్తగా ఉన్న పండ్లను ఎంచుకోవచ్చు. కానీ వాటిని ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఇది సరైన ఎంపికకాదు. అరటిపండు ఇప్పటికే ఎక్కువగా మెత్తబడి ఉంటే త్వరగా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Donald Trump New New Decisions: డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఒక్కో నిర్ణయం మనలాంటి వర్ధమాన దేశాలకు బాధ కలిగిస్తున్న ఆ దేశ పౌరులకు మాత్రం ఆయనలో ఓ దేవుడుని చూస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాలు పొలో మంటూ అమెరికాకు క్యూ కట్టకుండా కట్టడి చేస్తున్నాడని అనుకుంటున్నారు. మొత్తంగా అమెరికా ప్రపంచ దేశాల్లో సంపన్న దేశంగా విరాజిల్లుతుంది. ఆదేశానికి అధ్యక్షుడు కావడంతో అగ్రరాజ్యానికి అధినేతగా రాణిస్తున్నాడు ట్రంప్. చేతిలో అధికారం ఉందని ఆయన ఏంచేయాలనుకుంటే అదే చేస్తాడు. ఎవడిమాటా వినడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచ అగ్రరాజ్యధినేతకు ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు ఆయనను సపోర్ట్ చేసేవారు. H-1B వీసా ఫీజులు రికార్డు స్థాయికి.. అమెరికా అధ్యక్షుడిగా తొలిసారిగా ఎన్నికైనపుడు… కామెడీ పీస్ అనుకున్నారు. తొలిదశలో ఆయన ఇతర దేశాలను ఇబ్బంది పెట్టే చర్యలకు దూరంగా ఉన్నారు. 2017లో పదవిలోకి వచ్చిన వెంటనే కొన్ని ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాలోకి రాకుండా ప్రయాణ నిషేధాలు విధించారు. ఐటీ నిపుణులకు ముఖ్యంగా భారతీయులకు గట్టి షాక్ ఇస్తూ, H-1B వీసా ఫీజులను రికార్డు స్థాయికి పెంచాలని ప్రతిపాదించారు. అక్రమ వలసదారులను అమెరికానుంచి పంపించి వేయడానికి, సరిహద్దుల వద్ద కఠిన చర్యల కోసం భారీ నిధులను కేటాయించారు. రిపబ్లికన్ పార్టీ నేతగా ప్రజా మద్ధతుతో రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చరిత్రను సృష్టించారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ దేశాలకు పట్టపగలే చుక్కలు చూపించారు. వలస విధానంపై సంచలన నిర్ణయం

భార్యను కోల్పోయాక ఓట్టో జీవితంపై ఆసక్తి కోల్పోయి ఎప్పుడూ కోపంగా ఉంటాడు. అతని జీవితంలోకి ఒక కొత్త కుటుంబం వచ్చినప్పుడు, మొదట చిరాకుపడ్డా, తర్వాత ఆ కుటుంబంతో ఏర్పడిన స్నేహం అతని జీవితాన్నే మార్చేస్తుంది. ముఖ్యంగా, ఓట్టోకు, అతని కొత్త పొరుగువారికి మధ్య చిగురించే బంధం ఈ సినిమాకు బలం. ఒంటరిగా ఉన్న వ్యక్తి జీవితంలోకి మనుషుల ప్రేమ, స్నేహం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఈ సినిమా అందంగా చూపిస్తుంది. కథలో విషాదం ఉన్నా, కామెడీ, మానవత్వం, ప్రేమ కలగలిపి ఉండటంతో, చివరకు మనసును తేలికపరిచే అనుభూతినిస్తుంది. ప్రతిరోజూ ఒకేలాంటి జీవితం గడిపే బ్యాంక్ ఉద్యోగి 'గై', తాను ఒక వీడియో గేమ్‌లోని క్యారెక్టర్ అని తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతని జీవితం కొత్తగా కనిపిస్తుంది. తన నిర్ణయాలు తనే తీసుకోవడం మొదలుపెట్టాక, అతనికి ప్రేమ, స్నేహం దొరకడమే కాకుండా, తన జీవితాన్ని తానే నిర్మించుకోవాలనే స్పృహ కలుగుతుంది. కామెడీ, యాక్షన్, ప్రేమ అన్నీ ఉన్న ఈ సినిమా, మన రోజువారీ జీవితాన్ని మరో కోణంలో చూసేలా ప్రేరేపిస్తుంది. 'నేను ఇలాగే బతకాలని ఎవరు చెప్పారు?' అనే ఆలోచనను ఈ సినిమా రేకెత్తిస్తుంది. క్రిస్ గార్డనర్ జీవితంలోకి ఒకేసారి ఎన్నో సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, ఉండటానికి ఇల్లు లేకపోవడం, కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత... ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. కానీ, తన కొడుకు కోసం, భవిష్యత్తు కోసం అతను పోరాటం ఆపడు. ఒక కంపెనీలో దొరికిన ట్రైనింగ్ అవకాశాన్ని వాడుకుని, కఠోర శ్రమతో తన జీవితాన్ని మార్చుకుంటాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, జీవితంలో ఎంత కింద పడినా, ప్రయత్నం ఆపకపోతే పరిస్థితిని మార్చవచ్చనే భరోసా ఇస్తుంది. మనసు కుంగిపోయినప్పుడు చూడాల్సిన పర్ఫెక్ట్ సినిమా ఇది. మార్క్ అనే యువకుడు ఒకే రోజును పదే పదే జీవించే విచిత్రమైన టైమ్-లూప్‌లో చిక్కుకుపోతాడు. అదే పరిస్థితిలో ఉన్న మార్గరెట్‌ను
గిన్నె తీసుకుని అందులో నీళ్లు నింపండి. ఇందులో పుదీనా ఆకులు, నిమ్మ, నారింజ ముక్కలు, దాల్చినచెక్క వంటివి వేసి మరిగించండి. ఇలా చేస్తే ఆ సువాసన ఇల్లు అంతా వస్తుంది. దుర్వాసన తగ్గుతుంది. ఇంట్లోని దుర్వాసన పోగొట్టడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. దీనికోసం ఓపెన్ బౌల్లో కొద్దిగా బేకింగ్ సోడా వేసి, కొద్దిగా రోజ్మేరీ ఆయిల్ కలిపి ఇంట్లో ఓ మూలన ఉంచితే సరిపోతుంది. ఇంట్లో ఓ గిన్నెలో ఎండిన లేదా తాజా గులాబీ పూల రెమ్మలు నింపండి. ఇందులో కొద్దిగా లావెండర్ ఆయిల్ వేసి ఒక దగ్గర పెడితే సరిపోతుంది. ఇంటిని సువాసనభరితంగా మార్చడానికి కొన్ని మొక్కలు కూడా సహాయపడతాయి. దీనికోసం మల్లె, పు దీనా, లావెండర్, యూకలిప్టస్, రోజ్మేరీ లాంటి మొక్కలు సహాయపడతాయి. ఇంట్లోని దుర్వాసన పీల్చుకుని మంచి వాసన నింపడంలో కాఫీ గింజలు సహాయపడతాయి. దీనికోసం ఓపెన్ బౌల్లో కాఫీ గింజలు వేసి ఇంట్లో మూలకు పెడితే మంచిది. వైట్ వెనిగర్‌లో నిమ్మ లేదా నారింజ తొక్కలు రెండు వారాల పాటు నానబెట్టండి. తర్వాత వడబోసి ఈ మిశ్రమంతో ఇంటిని తుడిస్తే ఇల్లు సువాసన వస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ వాసన చాలా బాగుంటుంది. దీనిని ఇంట్లో స్ప్రే చేస్తే ఇంటిని సువాసనభరితంగా మార్చవచ్చు. లేదంటే ఆ మొక్కను ఇంట్లో పెంచినా సరిపోతుంది. లావెండర్ ఆయిల్ ఇంటిని సువాసనభరితంగా మారుస్తుంది. దీనికోసం నీళ్లలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ కలిపి ఇంట్లో అవసరం ఉన్నపుడు స్ప్రే చేస్తే సరిపోతుంది. వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇంటికి సువాసన అందించడంలో సహాయపడుతుంది. దీనికోసం వెనీలా ఎక్స్ట్రాక్ట్లో కాటన్ బాల్ ముంచి షెల్ఫ్‌లో ఎక్కడో ఓ చోట పెడితే సరిపోతుంది

హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, తిరిగి బాధితులకు అప్పగించారు. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లోని తుకారాంగేట్‌లో బధిర అన్నాచెల్లెళ్లు బంగారు నగలను పోగొట్టుకున్నారు. సుమారు రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌ను.. పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి, తిరిగి బాధితులకు అప్పగించారు. సికింద్రాబాద్‌లో ట్యూషన్ చెప్పి యాక్టివాపై ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో బధిర అన్నాచెల్లెళ్లు నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్నారు. వారి తల్లి బంగారు నగలను బ్యాగ్‌లో పెట్టి మర్చిపోయింది. బ్యాగ్‌లో నగలు ఉన్న విషయం తెలియకుండానే అన్నాచెల్లెళ్లు ఇంటికి వెళ్లారు. ఇదిలా ఉండగా, రోడ్డుపై బ్యాగ్ దొరకడంతో అంకిత్ అనే వ్యక్తి దానిని ట్రాఫిక్ ఏఎస్ఐ జాన్‌కు అప్పగించారు. బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులు అందులో సుమారు రెండున్నర తులాల బంగారు గొలుసుతో పాటు ఖరీదైన వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగ్ యజమానులను గుర్తించేందుకు దాదాపు 60కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా బాధితుల బైక్ నంబర్‌ను గుర్తించి, దాని ద్వారా వారి వివరాలను సేకరించారు. అయితే బాధితులు ఫోన్లో మాట్లాడలేకపోవడంతో పోలీసులు వాట్సాప్ ద్వారా వారిని సంప్రదించారు. ఈ క్రమంలో అన్నాచెల్లెళ్లతో పాటు వారి తల్లిదండ్రులు కూడా మాట్లాడలేరని పోలీసులు గుర్తించారు. అనంతరం బ్యాగ్‌లోని వస్తువులు, బాధితుల వివరాలను నిర్ధారించుకుని వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. తుకారాంగేట్ సీఐ బషీర్ అహ్మద్, క్రైమ్ ఇన్స్పెక్టర్ అహ్మద్ చేతుల మీదుగా బంగారు నగల బ్యాగ్‌ను బాధిత కుటుంబానికి తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడంతో పోలీసులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు బాధితులకు నగలను తిరిగి అందించడంలో పోలీసు చూపిన చొరవపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తుని

సండే వచ్చిందంటే చాలు నాన్-వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక మటన్ ప్రియుల విషయానికి వస్తే.. మార్కెట్లో దొరికే మేక మాంసం లేదా గొర్రె మాంసం రెండింటినీ 'మటన్' అని పిలుస్తూ లాగించేస్తుంటారు. రెండింట్లోనూ ప్రోటీన్, ఐరన్, బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొవ్వు, కేలరీల విషయంలో ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. మరి ఆరోగ్య దృష్ట్యా ఏది బెస్ట్? ఏది తింటే మన ఒంటికి మంచిది? అసలు నిజాలేంటో చూద్దాం! మేక మాంసంలో సంతృప్త కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ప్రోటీన్ & పోషకాలు: కండరాల బలానికి కావలసిన ఉత్తమ ప్రోటీన్‌తో పాటు ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ B12 ఇందులో పుష్కలంగా ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్: ఇతర రెడ్ మీట్స్‌తో పోలిస్తే మేక మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఇది మంచిదే. గొర్రె మాంసం( మటన్) లో కూడా ప్రోటీన్, ఐరన్ , విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో లభించే 'హీమ్ ఐరన్' రక్తహీనత ఉన్నవారికి త్వరగా ఐరన్‌ను అందిస్తుంది. అధిక కొవ్వు: గొర్రె మాంసంలో కొన్ని భాగాలలో సంతృప్త కొవ్వు , కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ గొర్రె మాంసంలో కొవ్వు శాతం ఎక్కువ కాబట్టి దీనిని పరిమితికి మించి తరచుగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటూనే.. అధిక ప్రోటీన్ అందించే విషయంలో మేక మాంసం ముందు ఉంటుంది. అయితే గొర్రె మాంసంలో పోషకాలు లేవని కాదు, అందులో కొవ్వు శాతం కొంచెం ఎక్కువ. అందుకే.. ఈ రెండింటిలో మేక మాంసమే ఆరోగ్యానికి మంచిది. అయితే.. మనం సరిగా వండినప్పుడు మాత్రమే పోషకాలు మనకు అందుతాయి.మీరు

భార్య చనిపోయాక, ఓటో జీవితంపై ఆసక్తి కోల్పోతాడు. ఎప్పుడూ కోపంగా, చిరాకుగా ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి ఓ కొత్త కుటుంబం వస్తుంది. మొదట్లో వాళ్లతో విసుగ్గా ప్రవర్తించినా, నెమ్మదిగా ఆ కుటుంబంతో ఏర్పడిన స్నేహం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ముఖ్యంగా, ఓటోకు, అతని కొత్త పక్కింటి వాళ్లకు మధ్య పుట్టే బంధం ఈ సినిమాకు ప్రాణం. ఒంటరిగా ఉన్నవారికి మనుషుల ప్రేమ, స్నేహం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఈ సినిమా చాలా అందంగా చూపిస్తుంది. కథలో విషాదం ఉన్నా, సినిమా మొత్తం మానవత్వం, కామెడీ, ప్రేమతో నిండి ఉంటుంది. అందుకే, సినిమా చివర్లో మనసుకు హాయిగా అనిపిస్తుంది. ప్రతిరోజూ ఒకేలాంటి రొటీన్ జీవితం గడిపే బ్యాంక్ ఉద్యోగి 'గై'. అయితే, తాను నిజానికి ఓ వీడియో గేమ్‌లోని క్యారెక్టర్ అని అతనికి తెలుస్తుంది. ఆ తర్వాత, అతను ఇప్పటివరకు జీవించిన జీవితం కొత్తగా కనిపిస్తుంది. తనకంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టిన 'గై' జీవితంలోకి ప్రేమ, స్నేహం వస్తాయి. అంతేకాదు, తన జీవితాన్ని తానే ఎంచుకోవాలనే ఆలోచన కూడా పుడుతుంది. కామెడీ, యాక్షన్, రొమాన్స్‌తో సరదాగా సాగే ఈ సినిమా, మన రోజువారీ జీవితాన్ని కూడా ఓ కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. ముఖ్యంగా, 'నేను ఇలాగే బతకాలని ఎవరు చెప్పారు?' అనే ప్రశ్నను మనలో రేకెత్తిస్తుంది. క్రిస్ గార్డనర్ జీవితంలోకి ఒకేసారి ఎన్నో సమస్యలు వస్తాయి. డబ్బు కష్టాలు, ఉండటానికి ఇల్లు లేకపోవడం, కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. కానీ, తన కొడుకు కోసం, తన భవిష్యత్తు కోసం అతను పట్టువదలకుండా పోరాడతాడు. ఓ కంపెనీలో దొరికిన ట్రైనింగ్ అవకాశాన్ని ఉపయోగించుకుని, తన జీవితాన్ని మార్చుకోవడానికి తీవ్రంగా కష్టపడతాడు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, జీవితంలో ఎంత కిందకు పడిపోయినా, ప్రయత్నం ఆపకపోతే పరిస్థితిని మార్చవచ్చనే నమ్మకాన్ని ఇస్తుంది. మనసు
Bonus Issue: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి రిస్క్‌కు లోబడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు చిన్న కారణాలతో పడిపోయే స్టాక్స్ ఉంటాయి. ఇదే సమయంలో భారీగా పెరిగే స్టాక్స్ కూడా ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో కేవలం స్టాక్ పెరుగుదలతోనే కాదు కంపెనీ ఆఫర్ చేసే ఇతర కారణాలతో కూడా లాభాలు అందుకోవచ్చు. ఇక్కడ బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్, డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్ ఇలా చాలానే ఉంటాయి. ఇటీవల ఇలానే ఒక కంపెనీ బోనస్ ఇష్యూ ఆఫర్ చేయగా, దానికి తాజాగా రికార్డ్ డేట్ ప్రకటించింది. అదే గుడ్‌లక్ ఇండియా లిమిటెడ్ స్టాక్.ఈ కంపెనీ కొద్ది రోజుల కిందట 2:1 రేషియోలో బోనస్ షేర్లను ఆఫర్ చేయగా ఆగస్ట్ 17న దీనికి సంబంధించి రికార్డు డేట్‌ను ప్రకటించింది. 2026, ఆగస్ట్ 21 ని రికార్డు తేదీగా బోనస్ కమిటీ ఖరారు చేసింది. అయితే ఇక్కడ సెబీ T+1 నిబంధనల ప్రకారం ఒక రోజు ముందే షేర్లు డీమ్యాట్ అకౌంట్లో ఉండాలి. కాబట్టి ముందురోజే షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బోనస్ ఇష్యూకు అర్హత సాధిస్తారు. అంటే 2:1 రేషియోలో బోనస్ షేర్లు పొందేందుకు ఆగస్ట్ 20 అంటే మరో 2 రోజులు మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట.ఇక్కడ 2:1 రేషియోలో బోనస్ ఇష్యూ అంటే ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఈక్విటీ షేరుకు అదనంగా మరో 2 షేర్లు వస్తాయి. అంటే ఒక్క షేరు కాస్తా 3 షేర్లుగా మారతాయి. 100 షేర్లు కలిగి ఉన్న వారికి 300 షేర్లు వస్తాయి. ఇక్కడ అదనపు షేర్ల కోసం ఇన్వెస్టర్లు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్ల షేర్ల సంఖ్య పెరుగుతుంది కానీ పెట్టుబడి విలువ ఏం మారదు. వారి షేర్ల సంఖ్య పెరిగిన దానికి అనుగుణంగా షేర్ ధర అడ్జస్ట్ అవుతుంది. షేర్ ధర తగ్గి కనిష్ఠ స్థాయిల్లో

హైదరాబాద్ మహానగరంలో పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. స్వచ్ఛ హైదరాబాద్ (Hyderabad) దిశగా అడుగులు వేసేందుకు నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు రవాణాశాఖ (Transport Department) కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఆటో రిక్షా (Auto Rickshaw) ఎలక్ట్రిక్ మార్పిడి పథకం -2026తో నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఓఆర్ఆర్ (ORR) లోపల తిరిగే ఆటోల నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది

అటెన్షన్ ప్లీజ్.. ఫ్లైట్ నం. వీటీజెడ్.. భోగాపురం ఈజ్ నౌ రెడీ ఫర్ టేకాఫ్.. అండ్ ల్యాండింగ్ ఎట్ భోగాపురం టుడే ఆన్వార్డ్స్. ఆల్ బుక్డ్ ప్యాసింజర్స్.. ఆర్ రిక్వెస్టెడ్ టూ కీప్ ఏంటి.. నా అనౌన్స్మెంట్ మారిందని ఆలోచిస్తున్నారా..? మీ ఊరి సరిహద్దు దాటి.. గగనవీధిలో దూరతీరాలకు ఎగరాలనుకున్నప్పుడు మీ పాదాలకు ప్రప్రథమంగా రెక్కలు తొడిగింది నేనే! తీపి జ్ఞాపకాలతో మహా నగరానికి వచ్చిన ప్రియమైన వారిని మీ ఒడికి చేర్చింది.. కొత్త ఆశల వైపు మిమ్మల్ని నడిపించింది నేనే.! ఇకపై.. నేను మీతో అనుబంధాన్ని పంచుకోలేనేమో.. ఎందుకంటే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవడంతో.. సుదీర్ఘ కాలం పాటు మీకు అందించిన పౌర విమాన సేవలకు స్వస్తి చెబుతూ ఈరోజుతో వీడ్కోలు పలుకుతున్నాను. ఇకపై సివిల్ సర్వీసులు నిలిపేసినట్లు గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చిందని మా డైరెక్టర్ (ఎయిర్పోర్ట్) పురుషోత్తం కూడా ప్రకటించేశారు. ఎనిమిది దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను చూసిన వెలుగు నీడలు, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న ఒడిదొడుకుల జ్ఞాపకాలను ఒక్కసారి మీతో పంచుకోవాలనిపించింది. నా జ్ఞాపకాలు మీ గుండెల్లో పదిలంగా ఉన్నాయని నాకు తెలుసు. నా సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్లు, ఎదుర్కొన్న ఒడిదొడుకులు, సాధించిన విజయాల జ్ఞాపకాలను ఒక్కసారి మీ ముందుంచుతున్నాను. నా పుట్టుకే ఓ ‘యుద్ధం’..! అమ్మ కడుపులోంచి మీరందరూ బయటకు రావడానికి ఓ యుద్ధమే జరుగుతుంది. అలానే నా రక్తసిక్తమైన యుద్ధ భూమిలో నా జననం జరిగింది. నా పుట్టుక ఏ సౌకర్యవంతమైన ప్రయాణాల కోసమో జరగలేదు. 1940 ప్రారంభంలో.. ద్వితీయ ప్రపంచ యుద్ధ మేఘాలు అలముకున్న వేళ.. రాయల్ ఎయిర్‌ఫోర్స్(రాఫ్).. తమ సైనిక అవసరాల కోసం మేఘదూతలా ఒక చిన్న ఎయిర్‌స్ట్రిప్‌గా నేను రూపుదిద్దు కున్నాను. యుద్ధం ముగిశాక కొంతకాలం ప్రశాంతంగా ఉన్నా.. 1972 నాటికి భారత నౌకాదళం నా పరిసరాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత 1986లో నా పూర్తి యాజమాన్యం

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇక తోటకూర చాలా మందికి ఇష్టం. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అయితే తోటకూర ఆరోగ్యానికి మంచిదే కదా అని అందరూ తినకూడదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఎస్. స్వాతి హెచ్చరిస్తున్నారు. కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తోటకూర తింటే అది శరీరానికి మేలు చేయడం కంటే ఎక్కువ హాని కలిగిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండడడం మంచిది. తోటకూరలో ఆక్సలేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్నవారు తోటకూరను తరచూ తీసుకుంటే ఆ రాళ్ల సైజు మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా తీవ్రమైన కడుపునొప్పి, మూత్ర విసర్జనలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లు తీవ్రమైన మూత్రపిండాల సమస్య ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారు తోటకూరకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇందులో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువ. బలహీనపడిన మూత్రపిండాలు రక్తంలోని అదనపు పొటాషియంను బయటకు పంపలేవు. రక్తంలో పొటాషియం అధికమైతే అది నేరుగా గుండెపై ప్రభావం చూపి, గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేవారు, గౌట్సమస్యతో బాధపడేవారు తోటకూరను తీసుకోకపోవడమే మంచిది. ఇందులో ఉండే ప్యూరిన్లు శరీరంలో యూరిక్ యాసిడ్‌గా మారి, కీళ్లలో స్పటికాలుగా పేరుకుపోతాయి. దీనివల్ల కీళ్లలో వాపు, భరించలేని నొప్పి వచ్చి నడవటం కూడా కష్టంగా మారుతుంది. గుండె జబ్బులు, బైపాస్ సర్జరీ అయినవారు, పక్షవాతం బారిన పడినవారు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు రోజూ బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటుంటారు. తోటకూరలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది సహజంగా రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. దీనివల్ల బ్లడ్ థిన్నర్

Nirmal: మినీ గూడ్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ! ఈ వార్తకు సంబంధించిన

శ్రావణ మాసం.. శివుడిని ఈ పూలతో పూజిస్తే లక్కే లక్కు!శ్రావణ మాసం.. శివుడిని ఈ పూలతో పూజిస్తే లక్కే లక్కు! Samatha 15 August 2026 అన్ని మాసాల్లోకెల్లా శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. చాలా పవిత్రమైన మాసాల్లో ఇది ముందుంటుంది. ఉపవాస దీక్ష చేస్తూ, నిత్యం శివుడిని ఆరాధిస్తారు. అయితే ఈ మాసంలో కొన్ని ప్రత్యేకమైన పూలతో శివయ్యను పూజించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. శివుడికి మారేడు దళాలు చాలా ఇష్టం. అందువలన శ్రావణ మాసంలో మారేడు దళాలతో పూజ చేయడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుందంట. అంతే కాకుండా ఉమ్మెత్త పూలు కూడా శివుడికి ప్రీతికరమైన పూలు. అందువలన వీటిని శివుడికి సమర్పించడం చాలా మంచిది. జిల్లేడు పూలు కూడా శివుడికి చాలా ఇష్టమైన పూలు. అందువలన వీటిని శివయ్యకు సమర్పించి పూజిస్తే అదృష్టం కలుగుతుం దంట. అలాగే గన్నేరు పూలు కూడా శివ పూజకు చాలా అద్భుతమైనవి వీటిని శివుడికి సమర్పించి పూజ చేయడం వలన అనారోగ్య సమస్యలు తొ లిగిపోతాయి. మోదుగు పూలు శివుడికి చాలా ఇష్టమైన పూలలో ఒకటి. ఈ పూలను శివుడికి సమర్పించడం వలన జీవితంలోని బాధలు తొలిగిపోతాయంట. మరిన్ని వెబ్ స్టోరీస్ మనుషుల్లా విడాకులు తీసుకునే పక్షులు.. వీటి ప్రేమ కథ తెలుసా! జీవితంలో ఒకసారే వికసించి, మరణించే అద్భతమైన మొక్కలివే ఇవే! చాణక్య నీతి : స్త్రీలు ఎవరికీ చెప్పకూడని రహస్యాలు ఇవే.. చెబితే ఖతమే

పిల్లల చిన్నచిన్న అలవాట్లను చాలామంది తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోరు. అయితే చిన్నతనంలో ఏర్పడిన కొన్ని అలవాట్లు భవిష్యత్తులో వారి ప్రవర్తన, వ్యక్తిత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడి ప్రకారం.. కుటుంబ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పిల్లల పెంపకం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. చిన్నతనంలో పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించకపోతే, అవే భవిష్యత్తులో వారి వ్యక్తిత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వారి ప్రవర్తన, అలవాట్లను గమనిస్తూ ఉండాలి. పిల్లలు చేసే కొన్ని తప్పులను చిన్నవిగా భావించి వదిలేయకుండా, చిన్నతనంలోనే వాటి గురించి వారికి అర్థమయ్యేలా చెప్పడం మంచిది. పిల్లలు మొదట చిన్న విషయాలకు అబద్ధాలు చెప్పడం ప్రారంభించవచ్చు. తిట్లు లేదా శిక్ష నుంచి తప్పించుకోవడానికి అబద్ధం చెప్పే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, తప్పించుకోవడానికి అబద్ధం చెప్పడం సరైనదేనని పిల్లలు భావించే ప్రమాదం ఉంది. క్రమంగా ఈ అలవాటు పెరిగితే అది వారి వ్యక్తిత్వంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వారు చెప్పే మాటలను ఇతరులు నమ్మడం కూడా కష్టమవుతుంది. అందుకే పిల్లలు అబద్ధం చెప్పినప్పుడు వెంటనే కోపంతో శిక్షించడం కంటే, నిజం చెప్పడం ఎందుకు ముఖ్యమో ప్రశాంతంగా వివరించడం మంచిది. పిల్లలు కొంత మొండిగా ప్రవర్తించడం, చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం సహజమే. అయితే అది అతిగా మారితే మాత్రం తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. తమకు కావాల్సిన వస్తువు దక్కకపోతే ఏడవడం, అరవడం, వస్తువులు విసరడం, పెద్దలతో వాదించడం వంటి ప్రవర్తనను ప్రతిసారీ సమర్థించడం మంచిది కాదు. పిల్లలు కోపం లేదా మొండితనంతో తమ కోరికలు నెరవేర్చుకోవచ్చని భావించే అవకాశం ఉంటుంది. అందుకే పిల్లలు కోపంగా ఉన్నప్పుడు వారి మాటను అర్థం చేసుకుంటూనే, ప్రతి విషయంలో మొండిగా ప్రవర్తించడం సరైనది కాదని వారికి చెప్పాలి. చిన్నతనం నుంచే కోపాన్ని నియంత్రించుకోవడం నేర్పించాలి. పిల్లలు పెద్దలతో, ఇంట్లో పనిచేసే

ఏయే లోన్లు బెటర్? ఎలాంటి లోన్లు తీసుకోవద్దు? అసలు గుడ్ లోన్.. బ్యాడ్ లోన్ అంటే ఏంటి? ఆదాయాన్ని పెంచేలా లోన్లు ఉండాలి బిజినెస్ లోన్, కారు లోన్ ఏది ఎవరికి బెస్ట్? Bad Loan vs Good Loan : లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? ఇంతకీ లోన్ ఎందుకు? మీ అవసరం ఏంటి? అన్ని అవసరాలకు లోన్ ముఖ్యమే.. మీరు ఏదైనా కొనాలనుకుంటే.. సమయానికి చేతిలో డబ్బు లేకుంటే ఏం చేస్తారు.. బ్యాంకులో లోన్ తీసుకుంటారు.. ఇది కామన్.. అందరూ చేసేదే.. అయితే, అన్ని లోన్లు మంచివా? కాదా? అంటే మీరు తీసుకునే అవసరం బట్టి అది మారుతుంది.. అందుకే తీసుకున్న ప్రతి లోన్ మంచిదేనా? అంటే.. కాదనే చెప్పాలి. మన ఆదాయాన్ని పెంచే లోన్ ఏదైనా అది ‘గుడ్ లోన్’ అయితే, మన ఖర్చులను పెంచే లోన్ మాత్రం ‘బ్యాడ్ లోన్’ అవుతుంది. మీ అప్పు ఏ కేటగిరీలో ఉందో ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతే అది మంచిదా? కాదా? అని నిర్ణయించుకోవచ్చు.. కారు రుణమే అద్భుతమైన ఎంగ్జాంపుల్.. ఒక వ్యక్తి రూ. 20 లక్షల లోన్ తీసుకుని కొత్త కారు కొన్నాడనుకుందాం.. 10 శాతం వడ్డీతో ఐదేళ్లకు ఈ రుణానికి నెలకు సుమారు రూ. 42,494 ఈఎంఐ చెల్లించాలి. కారును వ్యక్తిగత అవసరాలకే వాడితే.. ఈఎంఐతో పాటు ఇంధనం, నిర్వహణ ఖర్చులు కూడా అదనం. అంటే.. కారు ఆదాయం తీసుకురాదు.. పైగా భారీగా ఖర్చులను పెంచుతోంది. అందుకే ఇది బ్యాడ్ లోన్‌గా మారుతుంది. కారు టాక్సిగా మారితే ఆదాయం : అదే కారును టాక్సీగా నడిపి నెలకు రూ. 35వేలు సంపాదిస్తే.. రూ. 42,494 ఈఎంఐలో ఆ ఆదాయాన్ని తీసివేసిన తర్వాత నికర భారం రూ. 7,494కి తగ్గుతుంది. నెలకు రూ.50వేల కన్నా ఎక్కువ సంపాదిస్తే ఈఎంఐ కట్టిన తర్వాత కూడా డబ్బు మిగులుతుంది. అప్పుడు మీరు కొన్న కారు
అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించకూడదని చెబుతారు. ఎందుకంటే అమావాస్యను చీకటికి సంకేతంగా భావిస్తారు. ఈరోజున పనులు ప్రారంభిస్తే మంచి జరగదని ఆస్ట్రాలజీ చెబుతోంది. అమావాస్య రోజు హెయిర్ కట్ చేయడం, గడ్డం తీసుకోవడం, గోళ్లు కట్ చేయకూడదని చెబుతారు. ఈరోజు చంద్రుడు బలహీనపడటం వల్ల శరీరంపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని అంటారు. అమావాస్య రోజున ఉప్పు, నూనె, ఐరన్ వస్తువులు కొనకూడదని చెబుతారు. ఎందుకంటే వీటికి కూడా ఎంతో కొంత నెగిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతారు. అమావాస్య రోజున పాడైపోయిన బంగ్లాలు, స్మశానాలు, అడవి వంటి ప్రాంతాలకు వెళ్లకూడదని చెబుతారు. ఇలాంటి ప్రదేశాల్లోని నెగిటివ్ ఎనర్జీ మీపై పడుతుందని అలా అంటారు. అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అందుకే ఈరోజున నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండమని అంటారు. అలాగే గొడవలు పెట్టుకోవద్దని చెబుతారు. అమావాస్య రోజు ఉల్లిపాయ, వెల్లుల్లితో పాటు నాన్ వెజ్ తినకూడదని చెబుతారు. ఎందుకంటే పితృతర్పణం ఇచ్చే అమావాస్యను పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈరోజు నాన్ వెజ్ తినకూడదని అంటారు. అమావాస్య రోజున ఆల్కహాల్ లాంటి హానికర డ్రింక్స్ తాగకూడదని చెబుతారు. ఈరోజున నెగిటివ్ ఎనర్జీ పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయని అంటారు. పెద్దలు, ఇంట్లోకి వచ్చిన అతిథులను అమావాస్య రోజు అవమానించడం మంచిది కాదని చెబుతారు. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మరింత పెరుగుతుందట. అమావాస్య రోజున ఆహార పదార్థాలను వ్యర్థంగా పడేయకూడదని చెబుతారు. దీనివల్ల ఇంట్లో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Surya Grahanam 2026: ఆగష్టు 12న శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆషాఢ అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్‌లో ఎక్కడా కనిపించదు. ఈ గ్రహణం ఐరోపా ఖండంతో పాటు ఆసియా ఖండపు ఉత్తర భాగంతో పాటు ఆఫ్రికాలో ఉత్తర, పశ్చిమ భాగాల్లో ఉత్తర అమెరికా, పసిఫిక్ మహా సముద్రము, ఆర్కిటిక్, అంట్లాటిక్ ప్రాంతాల్లోకనిపించను. స్పెయిన్, ఐస్లాండ్, గ్రీన్లాండ్ దేశాల్లో సంపూర్ణ సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్యగా పిలుస్తారు. అటు డెన్మార్క్, పోలెండ్, నార్వే, స్వీడన్, కెనడా, నార్వే, గ్రీన్లాండ్లో కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్, ఇటలీ, ఇంగ్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, అల్జీరియా దేశాల్లో పాక్షిక సూర్య గ్రహణం కనిపిస్తుంది. ఓవరాల్‌గా 55 దేశాల్లో కనిపించనుంది. సాయంత్రం 7 గంటలకు పాక్షికంగా సూర్య గ్రహణం ప్రారంభం కానుంది. సంపూర్ణ గ్రహణ ప్రారంభం.. రాత్రి దాదాపు 9.15 గంటలకు ప్రారంభం అవుతుంది. రాత్రి 11.17 నిమిషాలకు గ్రహణం ఓ మోస్తరు వరకు ఉండబోతుంది. రాత్రి సుమారు (ఆగష్టు 13) 1.20 గంటకు వరకు ుంటుంది. తెల్లవారుఝాము 3.30 గంటల వరకు ఉండబోతుంది. ఈ గ్రహణ సమయంలో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు రెండు నిమిషాలు కనిపించకుండా పోతాడు. మొత్తంగా చీకటి అలముకుంటుంది. ఆ తర్వాత సూర్యుడి బాహ్యవలయమైన ‘కరోనా’ క్లియర్‌గా కనిపిస్తుంది. యూరప్ ఖండాల్లో పాక్షిక గ్రహణం కొనసాగుతున్న సమయంలోనే

చపాతీ, అన్నం.. రెండూ మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగాలు. అయితే వీటిని వేర్వేరుగా తినడానికి, ఒకే భోజనంలో కలిపి తినడానికి చాలా తేడా ఉంది. రోజువారీగా ఒక చపాతీ, ఆ తర్వాత మళ్లీ అన్నం తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీని వల్ల మీ జీర్ణక్రియ, రక్తంలో షుగర్ లెవల్స్ పై చాలా ఎక్కవ ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసలు, ఈ రెండూ కలిపి తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం... అన్నం, చపాతీ రెండూ కూడా కార్బోహైడ్రేట్లు (Carbohydrates) ఎక్కువగా ఉండే ఆహారాలే. రెండింటినీ ఒకే భోజనంలో కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి ఒకేసారి భారీగా పిండి పదార్థాలు అందుతాయి. ఇది రోజువారీ అవసరానికి కంటే ఎక్కువైతే, శరీరం ఆ అదనపు గ్లూకోజ్‌ను కొవ్వుగా మార్చి దాచిపెడుతుంది. అన్నానికి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువ. చపాతీలో ఫైబర్ ఉన్నప్పటికీ, రెండింటినీ కలిపి పెద్ద మొత్తంలో తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు (Blood Sugar Spikes) వేగంగా పెరుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. రెండు రకాల ధాన్యాలను ఒకేసారి తినడం వల్ల కేలరీల వినియోగం పెరుగుతుంది. కడుపు నిండిన భావన వచ్చినా, ఓవర్ ఈటింగ్ (ఎక్కువగా తినడం) జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి అనుకున్న ఫలితాలు రావు, పైగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అన్నం త్వరగా జీర్ణమవుతుంది, కానీ గోధుమలతో చేసే చపాతీ జీర్ణం కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటి జీర్ణక్రియ వేగం వేర్వేరుగా ఉండటం వల్ల కొందరిలో గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒకటే ఎంచుకోండి: ఒకే పూటలో అన్నం లేదా చపాతీ... ఏదో ఒక దాన్ని మాత్రమే ప్రధాన ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. కూరగాయలు, ప్రోటీన్‌కు ప్రాధాన్యం ఇవ్వండి: ప్లేట్లో సగం భాగం

భారతీయ వినియోగదారులపై మరోసారి ధరల భారం పడనుంది. రోజువారీ ఉపయోగించే సబ్బులు, బిస్కెట్లు, ఇతర నిత్యావసర వస్తువుల (ఎఫ్ఎంసీజీ) ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ముడిసరుకుల ధరలు పెరగడంతో, తమ లాభాల మార్జిన్లను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో ఈ ధరల పెంపు ఉండనుందని తెలుస్తోంది.ఇప్పటికే జూన్ త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు 2 నుంచి 5 శాతం వరకు ధరలు పెంచాయి. అయినప్పటికీ ముడిసరుకుల వ్యయం పూర్తిగా భర్తీ కాలేదని, అందుకే మరోసారి ధరలను సమీక్షించక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు ధరలు పెంచడానికి బదులుగా 'ష్రింక్‌ఫ్లేషన్' బాట పట్టనున్నాయి. అంటే, ప్యాకెట్ ధరను మార్చకుండా, లోపల ఉన్న సరుకు పరిమాణాన్ని తగ్గించడమే ఈ వ్యూహం.ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా, ప్రస్తుత త్రైమాసికంలో 1.5 నుంచి 2 శాతం వరకు ధరల ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ.5, రూ.10 ప్యాకెట్ల పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంది. పంచదార, పామాయిల్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఇదే బాటలో హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) కూడా రాబోయే త్రైమాసికంలో 2 నుంచి 5 శాతం ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ, వివిధ కేటగిరీలలో ధరలను పెంచనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. డాబర్, గోద్రెజ్ కన్స్యూమర్, టాటా కన్స్యూమర్ వంటి సంస్థలు కూడా ముడి వ్యయం తగ్గకపోతే ధరలు పెంచే అవకాశాన్ని తోసిపుచ్చలేదు.విచిత్రం: మద్యంపై మాత్రం పెరుగుతున్న ఖర్చుఒకవైపు నిత్యావసరాల ధరల

చాలామంది జీవితంలో ఎదుర్కొనే సాధారణ సమస్యలలో నిద్రలేమి ఒకటి. తినకముందు ఏ పనినైనా చేసే ఉత్సాహం, డిన్నర్ తర్వాత హఠాత్తుగా నిద్ర ముంచుకొచ్చే అనుభవం మనందరికీ తెలిసిందే.. ఆహారానికి నిద్రను కలిగించే తత్వం ఉంటుందని, సరైన ఆహారాలను ఎంచుకోవడం ద్వారా సుఖమైన, గాఢమైన నిద్ర పొందవచ్చని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్లో లేదా డిన్నర్ తర్వాత తీసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన ఆహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.. కఫ సంబంధిత సమస్యలు లేని వారికి ఈ ఆహారాలు అద్భుతమైన నిద్రకు సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండు: నిద్రకు సహాయపడే ఆహారాలలో అరటిపండు ముఖ్యమైనది. అరటిపండులో పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులు (మజిల్ క్రాంప్స్) తగ్గించడానికి తోడ్పడతాయి. అంతేకాకుండా, ఇది కడుపు నిండుగా ఉండి ఆకలి అనే భావన లేకుండా చేస్తుంది. దీని వల్ల హాయిగా, కమ్మగా నిద్రపడుతుంది. డిన్నర్ చేసిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలు ఆగి అరటిపండు తింటే సుఖమైన నిద్ర మీ సొంతమవుతుందని పేర్కొంటున్నారు. చెర్రీస్: మంచి నిద్ర కోసం చాలామందికి తెలియని, కానీ అత్యంత ప్రభావవంతమైన ఆహారం చెర్రీస్. చెర్రీస్‌లో మెలటోనిన్ ఉత్పత్తిని ప్రేరేపించే ప్రత్యేకమైన తత్వం ఉంటుంది. మెలటోనిన్ అనేది సహజమైన స్లీప్ హార్మోన్, ఇది నిద్రను ప్రేరేపించడానికి, నియంత్రించడానికి సహాయపడుతుంది. చెర్రీస్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.. ఇది గాఢమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. పెరుగు: అనాదిగా మనం ఉపయోగిస్తున్న, గాఢమైన నిద్రకు తోడ్పడే మరో ఆహారం పెరుగు. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పెరుగు “స్తోతస్సుల” పనితీరును ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతతను అందించే “మనోవహ స్తోతస్సుల”ను అడ్డగించడం ద్వారా చక్కటి నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. కాల్షియం కండరాల నొప్పులు రాకుండా చేస్తుంది. ఇది ప్రశాంతమైన నిద్రకు చాలా అవసరం. మంచి గడ్డపెరుగు రాత్రిపూట

కెమెరా ముందు, వెనుక పని చేయడం సవాల్‌తో కూడుకున్న పని అని హీరో విశాల్ అన్నారు. కెమెరా ముందు, వెనుక పని చేయడం సవాల్‌తో కూడుకున్న పని అని హీరో విశాల్ (vishal) అన్నారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మకుటం (makutam). ఈనెల 14న విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ (Super Good Films)పై నిర్మితమైన 99వ చిత్రం. విశాల్, అంజలి, దుషార విజయన్ జంటగా నటించిన ఈ చిత్రంలో జాన్ విజయ్, జయప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబు సలీం, ఆర్జే, వీజే ఝాన్సీ, పదమ్ కుమార్ తదితరులు నటించారు. దిగ్గజ నిర్మాత దివంగత ఆర్ బీ చౌదరి సమర్పణలో నిర్మాతలు బి.సురేష్, ఆర్బీ జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ స్వయంగా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు తొలిసారి దర్శకత్వం చేశారు. రిచర్డ్ ఎం.నాథన్, అభినందన్ రామానుజం ఛాయాగ్రహణం అందించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. 'ఒక వైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగా కెమెరా ముందు, వెనుక ద్విపాత్రా భినయం చేయడం చాలెంజ్‌తో కూడుకున్నపని. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతగానో సహకరించారు. నేను చెప్పింది చాలా ఓపిగ్గా విని, కెమెరా ముందు అద్భుతంగా నటించారు. అందుకే ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంతో దర్శకుడు కావాలన్న 35 యేళ్లనాటి కల ఫలించింది. నన్ను ప్రోత్సహించి, నా కలను నిజం చేసి నందుకు మా నాన్నకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయనకు రుణపడి ఉంటా. సండైకోళి (పందెం కోడి) తీయడానికి కారణం మా తల్లి. నాన్నతో పోట్లాడి ఆ సినిమాను నిర్మించారు. ఆర్బీ చౌదరి పరిచయం చేసిన

ఇప్పటి వరకూ కదులుతున్న బస్సు చక్రాలు ఊడిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఈ లిస్ట్‌లోకి రైలు కూడా చేరింది. మీరు విన్నది నిజమే. ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు చక్కాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస రోడ్ సమీపంలో రైల్వే ట్రాక్ పై పెను ప్రమాదం తప్పింది. ఒడిశా నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గూడ్స్ రైలు బోగీ చక్రాలు రెండు జాయింట్ గా ఊడిపోయాయి.రైలు కదులుతుండగానే ఈ ఘటన జరగటంతో ఊడిపోయిన చక్రాలు రెండు పట్టాలపై నుంచి బయటకు వచ్చేసాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు, సాంకేతిక బృందాలు యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన కారణంగా రైల్వే మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సమయానికి సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన రిటైరైనా తగ్గని క్రేజ్.. బ్రాండ్ రేసులో దూసుకెళ్తున్న మాస్టర్ బ్లాస్టర్ తన తండ్రి ఎలా మరణించారో వివరిస్తూ.. బోరున ఏడ్చిన కొడుకు Allu Arjun: బన్నీని కలవాలని ప్లాన్ చేస్తున్నారా? అప్డేట్ తెలుసుకోవాల్సిందే

హీరోగా, దర్శకుడిగా విశాల్ చేస్తున్నతొలి చిత్రం ‘మకుటం’పై ఏర్పడిన హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మూవీ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ స్వర్గీయ ఆర్ బీ చౌదరి నిర్మాణంలో రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఫుల్ యాక్షన్ మోడ్‌తో ట్రైలర్ ఓపెన్ చేయడం.. ఆ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్‌కి షిఫ్ట్ అవ్వడం.. మూడు డిఫరెంట్ గెటప్స్‌లో విశాల్ తన మాడ్యులేషన్‌ను చూపిస్తుండటం ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. మాస్‌కి కావాల్సిన యాక్షన్ సీక్వెన్స్, యూత్‌కి కావాల్సిన లవ్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కావాల్సిన ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ‘ఆ సరుకుని నేను దించను.. ఇంకెవ్వరినీ దించనివ్వను రా’ అనే డైలాగ్‌ను లింగా, కృపాకర్ పాత్రల్లో విశాల్ చెప్పిన తీరు అద్బుతంగా ఉంది. ట్రైలర్లో చివరి షాట్ మాత్రం హైలెట్ అయ్యేలా ఉంది. రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం కెమెరా వర్క్ అదిరిపోయింది. దిలీప్ సుబ్బరాయన్ కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ మాస్ ఆడియెన్స్‌కి కిక్కిచ్చేలా ఉన్నాయి. ఇక జీవీ ప్రకాష్ పాటలు, ఆర్ఆర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేట్టు ఉందని ఈ ట్రైలర్ చెబుతోంది. ఇక ఆగస్ట్ 14న ఈ మూవీని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు టీం సన్నాహాలు చేస్తోంది