
రాష్ట్రప్రభుత్వానికి గణనాథుడు సద్బుద్ధినిప్రసాదించాలి: టీ బీజేపీ చీఫ్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేష్ మండపాలకు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు.

అనకాపల్లికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాల్ని ఇవాళ సీఎం చంద్రబాబు (Chandrababu) విడుదల చేశారు. మొన్ననే వెలిగొండతో కృష్ణమ్మను తరలించి కరువుపీడిత మార్కాపురంనకు నీళ్లిచ్చామన్నారు. తూర్పు కనుమలను, అడవులను, నదుల్ని, వాగులు, వంకలు, హైవేలను దాటుకుని అన్నవరం సత్యదేవుని ఆశీస్సులతో గోదారమ్మ ఈ ప్రాంతానికి వచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది సింహాద్రి అప్పన్న చెంతకు గోదారమ్మను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్‌లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వద్దకు తరలించి వంశధార నదికి అనుసంధానం చేస్తామన్నారు. శంకరంబాడి సుందరాచారీ చెప్పినట్లుగా గలగలా గోదారి...బిరబిరా కృష్ణ్మమ్మ పరుగులతో రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.ఉత్తరాంధ్ర చరిత్రలో అపురూప ఘట్టం.. పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదారమ్మ!నాటి గొడ్డలి పార్టీ చీకలి పాలనలో ఉత్తరాంధ్ర వణికిపోయిందని, ఎక్కడ చూసినా అరాచకాలు, కబ్జాలు, భయానక వాతావరణం ఉండేదన్నారు. ఉత్తరాంధ్రలోని ప్రాజెక్టులకు రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టని ఆ పార్టీ... ఆ నాయకుడి నివాసానికి, విలాసాల కోసం రూ.500 కోట్లు ఖర్చుచేసి రుషికొండపై ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఆ రూ.500 కోట్లతో నాలుగైదు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు. విపక్షంలోనూ గొడ్డలిపార్టీ విషం చిమ్ముతోందన్నారు. విశాఖకు డేటా సెంటర్ వస్తే నీరు, విద్యుత్ కొరత వస్తుందని పేటియం బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారన్నారు. Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు కట్టిందెవరు ? జగన్- లోకేష్ క్రెడిట్ వార్..!పోలవరం ఎడమ కాలువ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో సాగు తాగునీరు అందుతుందిని, అలాగే 9 లక్షల మందికి తాగునీరు కూడా అందుతుందని చంద్రబాబు తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు 23.44 టీఎంసీల నీరు పారిశ్రామిక, తాగు,సాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను మరింత విస్తరించి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి అనుసంధానిస్తామని తెలిపారు. 12 ప్రధాన ప్రాజెక్టులను రూ.

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ అంశంపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ అంశంపై సుదీర్ఘంగా చర్చించామని తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై అధిష్ఠానానికి తగిన సమాచారం ఇచ్చామన్నాము. ఇక ఆ వ్యవహారంలో అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అధిష్ఠానందేనని పీసీసీ చీఫ్ అన్నారు. కాగా నిన్న తెలంగాణ కాంగ్రెస్‌లో సంస్థాగత వ్యవహారాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ వ్యవహారంతో పాటు పార్టీ సంస్థాగత అంశాలు, కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన తదితర అంశాలపై చర్చించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కూడా అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చర్యలు తీసుకోనుందా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. పని.. ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు) 'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు) నాన్న జ్ఞాపకాల్లో వైఎస్ జగన్.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి (ఫొటోలు) పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి! Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే. 'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది. అంతర్జాతీయ సినిమా వేదికగా జమ్మూకశ్మీర్.. రూ. 96 లక్షల ప్రైజ్ మనీతో వైభవంగా వేడుకలు.!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

మెగాస్టార్ చిరంజీవి పెళ్లి జరిగిన టైమ్ కు పవన్ కళ్యాణ్ చాలా చిన్నవాడు. దాంతో పవన్ ను కూడా చిరంజీవితో కలిసి చెన్నైలోనే ఉండేవాడు. చిరంజీవి భార్య సురేఖ పవన్ కళ్యాణ్ ను కన్న కోడుకులా చూసుకుంది. పిల్లలు పుట్టిన తరువాత కూడా తన పిల్లలో సమానంగా పవర్ స్టార్ ను ఆమె ప్రేమించేది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా సురేఖను తల్లితో సమానంగా చూసుకుంటాడు. అసలు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం కూడా సురేఖ తీసుకున్న నిర్ణయమే. ఆమే పవన్ కళ్యాణ్ ను హీరోను చేయాలని చిరంజీవితో చెప్పి పట్టుబట్టి ఒప్పించిందట. వదిన సురేఖ తనకు ద్రోహం చేసిందని పవన్ కళ్యాణ్ గతంలో జరిగిన ఓ ఈవెంట్ లో వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మూవీలో పవన్ కూడా నటించారు.ఈ సినిమా ఈవెంట్ లో పవర్ స్టార్ ఈ కామెంట్స్ చేశారు. తనకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తాను ఎప్పుడూ అనుకోలేదని, ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ, పొలం పనులు చేసుకోవాలనుకున్నా. అన్నయ చిరంజీవి మెగాస్టార్‌గా ఇమేజ్ పొంది పీక్‌లో ఉన్నప్పుడు హీరో అవుతావా? అని అడినప్పుడు భయమేసింది. తాను చేయగలనా అనిపించింది. కానీ మనల్ని నమ్మేవ్యక్తులు ఇంపార్టెంట్. వదిన సురేఖ నన్ను నమ్మింది. ఆమె సినిమాలు చేయమని ప్రోత్సహించింది. ఓ సారి జగదాంబ థియేటర్ వద్ద బస్ ఎక్కి డాన్సు చేయమన్నారు. ఆ రోజు డాన్సు చేయడానికి నేను చచ్చిపోయాను. ఆ రోజు ఫోన్ చేసి మా వదినని అడిగాను. నన్ను ఎందుకు ఇలా చేశావని నిలదీశాను. ఆమె ఆ రోజు చేసిన తప్పు కారణంగానే ఇప్పుడు నేను ఇలా మీ ముందు నిల్చున్నాను. దీనంతటికి కారణం వదిన చేసిన ద్రోహమే అని కామెంట్స్ చేశారు. తన ఎదుగుదలకు వదిన తీసుకున్న నిర్ణయమే కారణం అని పవన్ కళ్యాణ్ ఫన్నీ వేలో

Pawan Kalyan: టాలీవుడ్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో తనదైన స్టైల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఐదు విషయాలను ఒకసారి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ప్రేమగా పవర్‌స్టార్ అని పిలుస్తుంటారు. ఆయన సినిమాల్లో కనిపించే ప్రత్యేకమైన స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో పవర్‌స్టార్ అనే పేరు ఆయనకు బలమైన గుర్తింపుగా మారింది. పవన్ సినిమా విడుదలైతే అభిమానులు పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం సాధారణంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆయన కరాటేలో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది. సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించే ప్రత్యేకమైన శైలి వెనుక ఈ శిక్షణ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్ తనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మ నియంత్రణ నేర్పాయని పవన్ గతంలో చెప్పారు. సినిమా రంగంలో స్టార్‌గా కొనసాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. సామాన్య ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు చిరంజీవికి తమ్ముడు. మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాల్లో తనదైన శైలితో ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడతారని ఆయనను దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు. అవసరం లేని ఆర్భాటాలకు దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వంలో కనిపించే ప్రత్యేకత

భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఆమె ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. IAFలో చేరిక: జూన్ 18, 1994న భారత వైమానిక దళానికి చెందిన ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆమె అధికారిణిగా విధుల్లో చేరారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె ట్రైనింగ్ సెంటర్లు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా రంగానికి ప్రాధాన్యం: ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో డిఫెన్స్ సహకారాన్ని పెంచేలా 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడంలో శక్తి శర్మ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు, సైనిక దళాల (Tri-services) చరిత్రలోనే ఒక సైనిక స్కూల్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా (కపూర్తలా సైనిక స్కూల్ ప్రిన్సిపాల్‌గా) వ్యవహరించిన తొలి మహిళా అధికారిణిగా కూడా ఆమె రికార్డు సాధించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంతో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన ఈ ఘనత సాయుధ దళాల్లోని భావి మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకం. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

BCCI Chief Selector: భారత జట్టు ఆప్ఘాన్ టీంతో సిరీస్ కోసం బిజీగా మారింది. ఈ క్రమంలో టీం స్వ్కాడ్ 3వ తేదీన ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగుస్తుండడంతో.. ఆయన భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ఇప్పటికే మొదలవ్వడంతో.. అగార్కర్‌ను మరో ఏడాది పాటు సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డులోని ఓ వర్గం ఆయనను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు వార్తలు వినిపస్తున్నాయి. టీమిండియా మాజీ ప్లేయర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుత కాంట్రాక్ట్ 2026 సెప్టెంబర్‌లో ముగియనుంది. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనను కొనసాగించడంపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. అగార్కర్‌కు మరో ఏడాది గడువు ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖంగా ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం సమావేశం అనంతరం తీసుకోనున్నారు. అంతేకాదు.. ఈ బాధ్యతను కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అగార్కర్ అభిప్రాయం కూడా కీలకం కానుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎక్కువమంది చదివినది: వన్డే ప్రపంచకప్ 2027 కోసం దూసుకొస్తోన్న తెలుగోడు.. డేంజర్ జోన్లో సర్పంచ్ సాబ్ ప్లేస్..! 2023లో చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి కొన్ని అద్భుత విజయాలు సాధించింది. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ సాధించింది. దీంతో వైట్‌బాల్ క్రికెట్లో జట్టు విజయాల్లో సెలక్షన్ కమిటీ పాత్రపై ప్రశంసలు వచ్చాయి. 2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి ఏడాది మాత్రమే సమయం ఉండటంతో సెలక్షన్ కమిటీలో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana bjp chief ramchander rao fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న జరిగిన దాడితో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు ప్రయత్నించారు. దీంతో పోలీసులు తార్నాకాకు భారీగా చేరుకున్నారు. బీజేపీ నేతలు సైతం అక్కడకు చేరుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ చీఫ్ రాంచందర్ రావును అడ్డుకుని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో అక్కడ బీజేపీ కార్యర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు రామ చందర్ రావు ముందుకు వెళ్లగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రామచందర్ రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపు పాలనసాగుతుందని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే దాడులు, అడ్డుకొవడాలు ఏంటని మండిపడ్డారు. 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హమీలు ఇచ్చి ప్రజలను తీవ్రంగా దగా చేసిందన్నారు. Read more: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇవే! మరోవైపు రానున్న రోజులలో కాంగ్రెస్ కు పతనం తప్పదన్నారు. ఈ ఘటనలో బీజేపీ నేత వర్షిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో తెలంగాణ

వాషింగ్టన్: ఎలాంటి వివక్ష లేకుండా ఇతరులకు సాయపడటమే భారతదేశ నాగరికతా సంప్రదాయాల ముఖ్య సారమని, భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా సేవలు అందించిందే తప్ప అగ్రరాజ్యంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. కెనడాలోని టొరంటోలో ‘కెనడియన్ హిందూస్ ఫర్ అవుట్‌రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్’ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందూ ప్రపంచ దృక్పథం సార్వత్రికమైందని, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని చెప్పారు. సేవాభావం భారతీయ నాగరికతా స్వభావానికి ప్రధాన నిర్వచనమని భాగవత్ ఉద్ఘాటించారు. ‘ప్రపంచంలో ఎవరు సాయం కోరినా భారత్ ఎన్నడూ నిరాకరించలేదు, అడగకున్నా ఆపన్నహస్తాన్ని అందిస్తుంది. ఇది మన సంప్రదాయం, భారత డీఎన్ఏ. అందుకే హిందువులు మేల్కొంటే, ప్రపంచమే మేల్కొంటుంది అనే సామెత వచ్చిందని భాగవత్ పేర్కొన్నారు. ప్రేమ అనే సందేశాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఒక వ్యక్తి సంపాదించిన జ్ఞానమంతా అర్థరహితమేనని చెప్పడానికి ఆయన సంత్ కబీర్ దోహాలను ఉదహరించారు. కబీర్ మహారాజ్ చెప్పినట్లు... మీరు ఎన్నో పుస్తకాలు చదివి గొప్ప విద్వాంసులు కావచ్చు, కానీ ప్రేమ అనే ఆ రెండక్షరాలను అర్థం చేసుకోకపోతే ఆ జ్ఞానానికి ఏ అర్థమూ లేదు’అని భాగవత్ వివరించారు. మానవాళిలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని గుర్తిస్తూనే, వైవిధ్యాన్ని కూడా స్వీకరించాలని ఆయన ఉద్బోధించారు. ‘వైవిధ్యం ఏకత్వానికి ప్రతీక. అది ఏకత్వానికి అందాన్ని, అలంకారాన్ని ఇస్తుంది. అందుకే మనం వైవిధ్యాన్ని నిష్పాక్షికంగా అంగీకరించాలి, గౌరవించాలి. ఇందుకు మనం గరి్వంచాలి. సంతోషించాలి’అని ఆయన అన్నారు. ‘మన ప్రాచీన సంస్కృతి వైవిధ్యాన్ని సహ జమైనదిగా గుర్తిస్తుంది. అయితే ఏకత్వమే అసలైన నిజం. అదే మన పురాతన జీవన విధానం’అని ఆయన పేర్కొన్నారు. కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు) ‘కూర్మావతార్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు 'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు) AP: దారుణంగా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pcc chief Mahesh kumar goud reacts on Konda Sushmitha Comments: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ, కొండా సుష్మిత వివాదం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ సైతం సీరియస్ అయ్యింది. ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మాట్లాడుతూ..కొండా సురేఖ ఇచ్చిన రీప్లై చూశామన్నారు. కొండాసుష్మిత సీఎం రేవంత్ రెడ్డిని మాములు వ్యక్తి గా అనుచిత వాఖ్యలు చేశారన్నారు. దీనిపై అందరూ ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎవరైన పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్నారు. కొండా సుస్మిత పార్టీ లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని పీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. అనిరుధ్, రాజగోపాల్ డైరెక్ట్‌గా విమర్శలు చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో మాట్లాడారు. మంత్రి కొండా సురేఖను గతంలో కాపాడామని.. ఇప్పుడు అవకాశం లేదన్నారు. Read more: Naveen Kumar Yadav: సీఎం పట్ల అగౌరవంగా మాట్లాడితే సహించం.!. కొండా సురేఖ వివాదంపై రంగంలోకి నవీన్ కుమార్ యాదవ్..! కొండా సురేఖపై అధిష్టానం సీరియస్‌గా ఉందన్నారు. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత లైన్ దాటి ఆరోపణలు చేశారని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి లైన్ దాటలేదన్నారు. పార్టీ లైన్ ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని చిట్ చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్
స్వదేశీ తయారీ యుద్ధ విమాన ప్రాజెక్ట్ తేజస్ ఎంకే-2పై వైమానికదళ మాజీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లోనే రూపొందుతున్న ఈ విమానాలు 2030ల మధ్య నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటికీ, అప్పటి యుద్ధ అవసరాలకు అవి ఏమాత్రం సరిపోకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే చైనా 6జీ ఫైటర్ జెట్లను (J-36, J-50) అభివృద్ధి చేస్తూ.. 2030 నాటికి దాదాపు 500 5జీ J-20 విమానాలను మోహరించేందుకు సిద్ధమవుతోందని అన్నారు. పాకిస్థాన్ కూడా 5జీ జెట్లను సమకూర్చుకునే పనిలో ఉందని, ఇలాంటి సమయంలో 2035 నాటికి భారత్ 4జీ విమానాలపై ఆధారపడటం వ్యూహాత్మకంగా ప్రయోజనం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. పదవీవిరమణ చేసిన కొద్ది రోజుల్లోనే ఆయన ఇటువంటి విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ యుద్ధ విమానాల తయారీలో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ జాప్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘ఏళ్ల కిందట మొదలుపెట్టిన విమానాలను ఏదో ఒక నెపంతో ఆలస్యం చేయడం సరికాదు. ఐఏఎఫ్ అత్యవసర ప్రాధాన్యతలకు, హెచ్ఏఎల్ పనితీరుకు పొంతన లేదు’’ అని ఆయన విమర్శించారు. ‘‘ఎన్నో ఏళ్ల కిందట ఒక నిర్దిష్ట సామర్థ్యంతో మనకు అందజేస్తామని ఇచ్చిన హామీని ఏదో ఒక నెపంతో మనకు ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎవరైనా తమ వాగ్దానాలను నిలబెట్టుకోకపోవడం వల్ల మనం ఎందుకు నష్టపోవాలి? స్వదేశీ సాంకేతికత మంచిదే, కానీ మనం ఎంతకాలం వేచి ఉండాలి?’’ అని ఆయన ప్రశ్నించారు.HAL అత్యంత అత్యవసరంగా పని చేయడం లేదని, ఐఏఎఫ్ సమయపాలనతో వారి వైఖరి సరిపోలడం లేదని అన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 2021లో రూ. 46,000 కోట్లతో ఆర్డర్ చేసిన 83 తేజస్ Mk-1A విమానాల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా డెలివరీ కాలేదు. సెప్టెంబరు 2025లో రూ. 62,370 కోట్లతో మరో 97 ఎంకే 1A జెట్లకు ఆర్డర్ ఇచ్చారు. తేజస్ Mk-2 మొదటి ప్రయోగం

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అమెరికా వెళ్లేందుకు కేంద్రం రాజకీయ క్లియరెన్స్ నిరాకరించింది. దీనిపై పెద్ద పొలిటికల్ చర్చే నడుస్తోంది. అయితే, విదేశీ పర్యటనకు కేంద్రం నుంచి అనుమతి రాకపోవడం రేవంత్‌కు మాత్రమే ఎదురైన పరిణామం కాదు. గతంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా పలువురు సీఎంల విదేశీ పర్యటనలకు కూడా కేంద్రం అనుమతి నిరాకరించిన సందర్భాలున్నాయి. దీంతో ఇప్పుడు రేవంత్ టూర్ వ్యవహారంతో పాటు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు రాజకీయ క్లియరెన్స్ ఎందుకు అవసరం? కేంద్రం ఎప్పుడు నో చెబుతుంది? గతంలో ఎవరెవరి పర్యటనలు ఆగిపోయాయి? అనే చర్చ మొదలైంది. తాజాగా రేవంత్‌రెడ్డి బ్రిటన్, అమెరికా పర్యటన కోసం బయలుదేరారు. ‘తెలంగాణ రైజింగ్’ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడులు, విద్యా సంస్థల భాగస్వామ్యాలు, తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి విద్యా అవకాశాలను తీసుకురావడమే పర్యటన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇచ్చినప్పటికీ.. అమెరికా పర్యటనకు మాత్రం రాజకీయ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 23న ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ దీనిపై వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలను రాజకీయ క్లియరెన్స్ ఇచ్చే ముందు MEA పరిశీలిస్తుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. పర్యటనలో ప్రతిపాదించిన కార్యక్రమాలు సీఎం పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినవిగా ఉండాలి అని చెప్పారు. రేవంత్ అమెరికా పర్యటనకు సంబంధించిన ప్రతిపాదిత కార్యక్రమం ఆ ప్రమాణాలకు సరిపోలలేదని, అందుకే క్లియరెన్స్ నిరాకరించినట్లు వెల్లడించారు. రేవంత్‌రెడ్డి మాత్రం ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, దేశ నిర్మాణం వంటి అంశాలను రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా చూడాలని ఆయన అన్నారు. అమెరికా పర్యటనలో జరగాల్సిన కార్యక్రమాలను తన బృందం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన

భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్‌కు భవిష్యత్తులో చైనాతోనే ప్రధాన పోటీ ఉంటుందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. భారత్‌పై పాక్ ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్నందున దాయాదిపై దృష్టిపెట్టాల్సి వస్తోందని చెప్పారు. పలు రంగాల్లో చైనా భారత్‌కు ప్రధాన పోటీగా మారుతోందని అన్నారు. తాను రచించిన నూతన పుస్తకం ‘ది క్యూరియస్ అంది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ విడుదల సందర్భంగా జనరల్ నరవణే ఈ వ్యాఖ్యలు చేశారు. 2019-22 మద్య నరవణే భారత ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. పాక్, చైనాలతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవని జనరల్ నవరణే అన్నారు. ‘రెండు దేశాలతోనూ మనం యుద్ధాలు చేశాము. వాళ్లతో ఎప్పటికీ ముప్పు ఉంటూనే ఉంటుంది. పాక్‌తో నాలుగు యుద్ధాలు జరిగాయి. ఉగ్రవాదం ఎగదోస్తున్న పాక్‌పై దృష్టి పెట్టాల్సి వస్తోంది. కానీ నా అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంలో చైనాతోనే భారత్‌కు ప్రధాన పోటీ ఉంటుంది. నేను చైనాను శత్రువుగా కాకుండా పోటీదారుగా పేర్కొనడానికి కారణం కూడా ఉంది. కేవలం యుద్ధరంగంలోనే కాకుండా రాజకీయాలు, ఆర్థికరంగం, వాణిజ్య రంగాల్లో కూడా చైనాతో పోటీ ఉంటోంది’ ‘పోటీ ఉన్న చోట ఎంతో కొంత ఘర్షణ ఉంటూనే ఉంటుంది. అయితే, ఈ పొరపొచ్చాలను దౌత్యం, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. మరో మార్గం లేనప్పుడే బలప్రయోగానికి దిగాలి. ఒక్కోసారి ఈ పరిస్థితి ఎదురు కావొచ్చు. అలాంటి సమయాల్లో ప్రత్యర్థి ఒకింత వెనకడుగు వేసేలా మిలిటరీ సామర్థ్యాలను అందిపుచ్చుకోవాలి. భౌగోళిక రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా మన ఇరుగుపొరుగుగా ఎవరు ఉంటారనేది చెప్పలేము. కాబట్టి, అందుబాటులో ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’ అని జనరల్ నరవణే అన్నారు. దేశాభివృద్ధికి దక్షిణ రాష్ట్రాలే మూలస్తంభాలు మహారాష్ట్ర

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలయ్యారు. ఇస్లామాబాద్‌లోని షిఫా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను మళ్లీ పోలీసులు జైలుకు తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పీటీఐ సభ్యులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇమ్రాన్ ఆరోగ్యం దృష్ట్యా ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఇటీవల పాక్ సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ దాదాపు మూడేళ్లుగా జైల్లో ఉంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అనంతరం మళ్లీ రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించింది. ఆరోగ్యం చక్కబడే వరకూ ఇమ్రాన్ ఖాన్‌ను ప్రైవేటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు త్వరలో తన ఇంట్లో ఉండి చికిత్స తీసుకునే అవకాశం కూడా రావొచ్చని అక్కడి విశ్లేషకులు కామెంట్ చేశారు. రాజకీయాల్లోకి ఇమ్రాన్ రీఎంట్రీకి ఇది తొలి అడుగు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇమ్రాన్ విడుదల వెనుక ఏదో డీల్ జరిగే ఉంటుందని కొందరు అన్నారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుకెళ్లడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది

భారత్‌కు ప్రస్తుతం పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద ముప్పు ఎక్కువగా ఉందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె అన్నారు. అయితే రాబోయే రోజుల్లో భారత్‌కు చైనానే ప్రధాన పోటీదారుగా మారుతుందని చెప్పారు. రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, సైనిక రంగాల్లో చైనాతో పోటీ పెరుగుతుందని అంచనా వేశారు.తన కొత్త పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్’ ఆవిష్కరణ కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడారు. పాకిస్థాన్, చైనాలతో భారత్ గతంలో యుద్ధాలు చేసిందని గుర్తు చేశారు. రెండు దేశాలతోనూ సరిహద్దు సమస్యలు ఇంకా ఉన్నాయని తెలిపారు.ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతు కొనసాగుతుండటంతో ప్రస్తుతం పశ్చిమ సరిహద్దుపైనే భారత్ ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోందన్నారు. అందుకే పాకిస్థాన్ తక్షణ భద్రతా సవాలుగా ఉందని చెప్పారు.అయితే దీర్ఘకాలంలో చైనాతో పోటీ మరింత పెరుగుతుందని నరవణె అన్నారు. చైనాను తాను ‘శత్రువు’గా కాకుండా ‘పోటీదారు’గా చూస్తున్నట్లు చెప్పారు. పోటీ ఉన్నచోట విభేదాలు రావడం సహజమేనన్నారు.చైనాతో ఉన్న సమస్యలను చర్చలు, సంభాషణల ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. బలప్రయోగం చివరి మార్గంగా ఉండాలని చెప్పారు. అదే సమయంలో దేశ భద్రత కోసం బలమైన సైనిక శక్తి అవసరమని స్పష్టం చేశారు. ఎలాంటి దుస్సాహసాన్నైనా అడ్డుకునే స్థాయిలో సైన్యం సిద్ధంగా ఉండాలని అన్నారు.నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్ వంటి పొరుగు దేశాల్లో స్థిరత్వం ఉండేలా భారత్ సహకరించాలని నరవణె పేర్కొన్నారు. పొరుగు దేశంలో అశాంతి పెరిగితే శరణార్థులు, అక్రమ రవాణా, మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల సమస్యలు భారత్‌పైనా ప్రభావం చూపుతాయని హెచ్చరించారు.శాంతే భారత్ ప్రధాన

సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డికి నోటీసులు ఇచ్చాం.. 22-ఏపై బీఆర్ఎస్ది అనవసర రాద్ధాంతం: మహేశ్ గౌడ్ నిజామాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సీనియర్లు, జూనియర్లు ఎవరు పార్టీ లైన్ దాటి మాట్లాడినా చర్యలు తప్పవని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వాఖ్యలు బాధాకరమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. సుస్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఆమె వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సైతం అలా మాట్లాడి ఉండకూడదని.. ఎలాంటి పరిస్థితిలో అలా మాట్లాడారో వివరణ కోరామన్నారు. అభ్యర్థులం తామేనని ఎవరు ప్రకటించుకున్నా చెల్లదని, అభ్యర్థుల ఎంపికకు పార్టీలో ఓ విధానం ఉంటుందని.. ఎన్నికల కమిటీ, సీడబ్ల్యూసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. 22-ఏ విషయంలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు

దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏళ్లుగా నలుగుతున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చెన్నై నగరం వేదికగా వ్యూహాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కోవళంలోన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉన్నత స్థాయి సదస్సు జరుగుతుండటంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భద్రతా కారణ దృష్ట్యా చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు మార్గమంతటా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.ఈ ప్రతిష్టాత్మక వేదికపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు ఆసీనులయ్యారు. ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ.. రాష్ట్రాల మధ్య నిప్పు రాజేస్తున్న సరిహద్దు తగవులు, నదీ జలాల పంపిణీ పీటముడులు, అంతర్గత భద్రత వంటి కీలక అంశాలపైనే ప్రధానంగా మంతనాలు సాగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారం అందించుకోవాలనే ప్రతిపాదనలతో సమావేశం రసవత్తరంగా మారింది. క్షమాపణలు కోరిన సీఎం.. అసెంబ్లీ సాక్షిగా ఊహించని పరిణామంఅమిత్ షాతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భేటీ.. కావేరి రగడ!సదస్సు ప్రారంభానికి ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కర్ణాటకతో వైరం రేపుతున్న కావేరి జలాల రగడను, మేకేదాటు ఆనకట్ట నిర్మాణంపై తమ వైఖరిని ఆయన అమిత్ షా ముందర గట్టిగా వినిపించారు. అంతేకాకుండా, ఇటీవల పొరుగు రాష్ట్రంలో ముగ్గురు తమిళులపై జరిగిన కాల్పుల కలకలం, నీటి విడుదల పై జరుగుతున్న ఆందోళనల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణ జోక్యాన్ని కోరినట్లు సమాచారం. విజయ్‌పై విరుచుకుపడిన పత్రిక.. సమస్యల సుడిగుండంలో పరిష్కారం దిశగా

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. బీజేపీ..ఆరెస్సెస్ అగ్ర నేతలు విశాఖలో మకాం వేసారు. కీలక మంత్రాంగం కొనసాగుతోంది. అటు పార్టీ.. ఇటు సంఘ్ సంస్థల మేధో మధనం మొదలైంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న ఈ సమావేశాల పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది. దక్షిణాదిలో పట్టు పెంచుకునే దిశగా కొంత కాలంగా సాగుతున్న ప్రణాళికల్లో భాగంగా.. ఇప్పుడు జరుగుతున్న ఈ భేటీలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.మిషన్ 2029. అందులో భాగంగా ఢిల్లీ కొత్త కార్యచరణ అమలు చేస్తోంది. ఈ సారి అధికారం దక్కా లంటే దక్షిణాది లో పట్టు పెంచుకోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ముందస్తు వ్యూహా లను అమలు చేస్తోంది. బీజేపీ, ఆరెస్సెస్ అగ్ర నాయకత్వం విశాఖలో మకాం వేసింది. ఇప్పటికే బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ విశాఖలో పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా.. ఇప్పుడు తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత సమన్వయ బైఠక్ విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలోని విజ్ఞాన విహార్ పాఠశాలలో జరుగుతున్నాయి. చీఫ్ డాక్టర్ మోహన్ భాగవత్, గౌరవ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబాళే తో పాటుగా సంఘ్ ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పంచ పరివర్తన్ అమలుపై కీలకంగా చర్చిస్తారు. సామాజిక, జాతీయ భద్రతా అంశాలపై సమీక్షించనున్నారు.డీలిమిటేషన్ పై కాంగ్రెస్ కొత్త మెలిక, ఇలా చేయాల్సిందే- బిగిస్తున్న పట్టు..!!దక్షిణాది రాష్ట్రాల పై స్పెషల్ ఫోకస్ఇక, విశాఖ కేంద్రంగా బీజేపీ చీఫ్ నితీన్ నబీన్ కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. ఆయన ఆరెస్సెస్ సమావేశాలకు హాజరు కానున్నారు. దక్షిణాదిలో.. ఏపీలోనూ పార్టీ బలోపేతం పైన పార్టీ నేతలకు కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు. పొత్తులు.. కూటమిలో కొనసాగుతూనే పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయంగా సూచించారు. స్థానిక సంస్థల్లో అవకాశం సద్వినియోగం చేసుకోవాలని.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ సొంతంగా

ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నైరోబీ: ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం అధిపతి మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి కూడా ఉన్నారు. కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్గిరో ప్రాంతం వైపు హెలికాప్టర్ వెళ్తోంది. హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ఆరుగురు ప్రయాణికులు, మరొకరు పైలట్. అయితే, బుధవారం ఉదయం 9:13 గంటల సమయంలో సంబూరు కౌంటీలోని మౌంట్ ఒలోలోక్వే వద్దకు హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు, ఘటనాస్థలిలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారినట్లు కెన్యా రెడ్‌క్రాస్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అమెరికా పౌరులు మృతిచెందినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతుల్లో టెలిముండో సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ జోస్ అల్బెర్టో సువారెజ్, ఈక్వెడార్ జాతీయ నిఘా కేంద్రం డైరెక్టర్ జనరల్ మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి ఉన్నారు. హెలికాప్టర్‌ను లేడీ లోరీ హెలికాప్టర్స్ సంస్థ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై కెన్యా విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, హెలికాప్టర్ ప్రయాణ వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ బరిలో సరితా కోమటిరెడ్డి
ఆ అమృతం రుచి భట్టి గారికి తెలుసు.. మహేష్‌కుమార్ గౌడ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభ జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుజనులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న రేవంత్‌రెడ్డి మరో ఐదు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ‘‘"ముఖ్యమంత్రి గారు.. మీరు బ్రాందీ, విస్కీ తాగరు. ఒకసారి కల్లు తాగి దాని రుచి చూడండి. కల్లు ఒక అమృతం, ఆ అమృతం గురించి భట్టి గారికి తెలుసు. ఇవాళ కల్లు వృత్తి ఇబ్బందుల్లో ఉంది." అని మహేష్ గౌడ్ అన్నారు. ఈ వార్తకు సంబంధించిన

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది. ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీసిన నిషేధిత భూముల జాబితా 22A వ్యవహారంపై ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యాలయం రంగంలోకి దిగింది. గత ఏడాది డిసెంబర్లో ఈ జాబితాను రూపొందిస్తే తర్వాత ఏడు నెలలకు ఇంత వివాదం నెలకొనడానికి కారణం ఏంటని సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు. కొంతమంది రెవెన్యూ అధికారులను వివిధ వర్గాలకు చెందిన వారిని పిలిపించుకుని ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి, సమస్యపై ఇంత చర్చ జరగాడానికి, ఇంతకాలం తర్వాత తెరమీదకు రావడానికి గల కారణాలు ఎంటని అధికారులు తెలుసుకుంటున్నారు. నిషేధిత జాబితాలో పెట్టేందుకు పాత రెవెన్యూ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు ఎవరెవరు చెప్పారు, ఏ ఉద్దేశంతో చెప్పారనే కోణంలో సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్ కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

రేవంత్‌పై అత్యధికంగా 89, సువేందుపై 29.. చంద్రబాబు, డీకే శివకుమార్‌పై 19 చొప్పున కేసులు లోక్‌సభలో 251, రాజ్యసభలో 75 మంది పైనా.. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 కేసులు పెండింగ్ సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సారియా నివేదిక న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలోని 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మందిపై తీవ్ర ఆరోపణలతో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్, సువేందు అధికారి కూడా ఉన్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డిపై అత్యధికంగా 89 కేసులు ఉన్నాయి. 29 కేసులతో సువేందు రెండో స్థానంలో ఉన్నారు. చంద్రబాబు, డీకేలపై చెరో 19 కేసులు, కేరళ సీఎం వీడీ సతీశన్‌పై 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో నివేదిక సమర్పించారు. బీజేపీ నేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణకు హన్సారియా సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,192 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తన అఫిడివిట్లో తెలిపారు. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేయడానికి తక్షణమే ప్రత్యేక కోర్టులు నెలకొల్పాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ ట్రయల్స్‌ను క్రియాశీలంగా పర్యవేక్షించాలని సంబంధిత హైకోర్టులను కూడా ఆదేశించాలని కోరారు. ‘543 మంది ఎంపీల లోక్‌సభలో 251 మంది, వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యుల్లో 75 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో 519 కేసులు పదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. 700 కేసుల్లో పోలీసులు అసలు దర్యాప్తే ప్రారంభించలేదు. చార్జిషీటు కూడా దాఖలు కాకుండా 360 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళకు చెందిన 95ు మంది ఎంపీలు తీవ్ర క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో 82ు మంది ఎంపీలపై.. ఒడిసాలో 76ు మంది పార్లమెంటు సభ్యులపై కేసులు

2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. హైదరాబాద్, ఆగస్టు18: 2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తాము ప్రతి ఓటు హక్కు కాపాడాలని చూస్తున్నామని అన్నారు. ఎన్నికల సంఘం గైడ్‌లైన్స్‌తో చాలా నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ఉదాసీనంగా చూడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఎఎస్బీడీల పేరుతో 22 శాతం ఓట్లు తొలగించారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అన్నారు. పేద ప్రజల ఓట్లు తొలగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలను 35 వేల మందిని నియమించిందని తెలిపారు. కానీ ఈసీ మాత్రం13,100 మందిని ఇచ్చినట్లు చూపిస్తుందని చెప్పారు. సామాన్యుడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈసీపై నిప్పులు చెరిగారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్‌తో చాలా మంది ఎనుమరేషన్ పామ్స్ ఇవ్వలేక పోయారని చెప్పుకొచ్చారు. దీంతో వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు. అన్ మ్యాపుడ్ ఓట్లు 32,37000 ఉన్నాయని అన్నారు. అలాగే 60,50,000 ఓట్లు సందేహంగా ఉన్నాయని చూపిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్ధకంగా మారాయని ఆవేదనతో అన్నారు. 1.60 కోట్ల ఓట్లు ఎందుకు క్వచ్చన్ మార్క్ పెట్టారో చెప్పాలంటూ ఈసీని తెలంగాణ పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. దేశంలో ఓటు హక్కును తొలగించే

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్ ప్రక్షాళనకు (Union Cabinet Reshuffle) సిద్దమైన ప్రధాని మోడీకి ఆ అవకాశం లభించలేదు. దీనికి బిజీ షెడ్యూల్ తో పాటు మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దీంతో పార్లమెంట్ సమావేశాల తర్వాత కేబినెట్ ప్రక్షాళన వాయిదా పడింది. అయితే ఊహించిన విధంగానే ఇప్పుడు కేబినెట్ మార్పులకు పావులు కదులుతున్నాయి. కానీ పార్లమెంట్ సమావేశాలకు ముందు అనుకున్న మార్పులే కాదు, అనుకోని మార్పులు కూడా ఇందులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాక్రోచ్ దెబ్బకు బీజేపీలో రెండో వికెట్..! కొత్త టీమ్ లో కీలక నేతపై వేటు..!కాక్రోచ్ ఉద్యమం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, పీయూష్ గోయల్ కు బీజేపీలో కోశాధికారి పదవి, అంతకు ముందే మరో ఇద్దరు కేంద్రమంత్రులు రవ్ నీత్ బిట్టూ, జార్జి కురియన్ ల రాజీనామాలు.. ఇలా ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యవర్గం ఏర్పాటు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులకు రాష్ట్రాల ఇన్ చార్జ్ బాధ్యతలు కూడా దక్కాయి. దీంతో ఇప్పుడు కేబినెట్ ప్రక్షాళన మరింత ఉత్కంఠ భరింతంగా మారింది. Cabinet Reshuffle: మోడీ కేబినెట్ విస్తరణ ఖరారు..! కేంద్రమంత్రి హింట్..! గోయల్ అవుట్?ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు కూడా అవకాశం దక్కబోతోందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. దీంతో ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఈ ప్రచారాన్ని మరోమారు ముమ్మరం చేశారు. దీంతో ఫడ్నవీస్ స్పందించక తప్పలేదు. తాను ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ఇలాంటి ఊహాగానాలు మొదలవుతాయని, కానీ వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యత మేరకు మహారాష్ట్రలోనే ఉన్నానని, ఇకపైనా ఇక్కడే ఉంటానని ఫడ్నవీస్ తేల్చేశారు.మరోవైపు కేంద్రమంత్రి వర్గంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు స్ధాన చలనం తప్పదని

దేశంలో ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన అందించాల్సిన ప్రజాప్రతినిధులపై కేసులు ఏ స్థాయిలో పేరుకుపోయాయో తెలిపే ఒక సంచలన నివేదిక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరపూరిత కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ గత దశాబ్దకాలంగా సాగుతున్న కేసు విచారణలో భాగంగా.. సీనియర్ న్యాయవాది, అమిస్క్యూరీ విజయ్ హన్సారియా ఆందోళనకరమైన గణాంకాలను న్యాయస్థానానికి సమర్పించారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఏకంగా 14 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారనే నిజం ఈ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏకంగా 89 కేసులతో జాబితాలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.రాష్ట్రాల్లో పాలకుల కేసుల చిట్టా!ఈ నివేదిక ప్రకారం టాప్ ప్లేస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 89 కేసులతో అగ్రస్థానంలో ఉండగా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సువేందు అధికారిపై 29 కేసులతో రెండో స్థానంలో ఉన్నారు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చెరో 19 కేసులు నమోదు కాగా, కేరళకు చెందిన వీడీ సతీశన్‌పై 18 కేసులు ఉన్నాయి. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మహారాష్ట్ర నేత దేవేంద్ర ఫడ్నవీస్, హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, బీహార్ సీఎం సమ్రాట్ చౌదరిలతో పాటు సిక్కిం, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్ ముఖ్యమంత్రులు కూడా కేసుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీ ప్రజాప్రతినిధుల పరంగా చూస్తే బెంగాల్లో అత్యధికంగా 58 శాతం మంది సభ్యులపై తీవ్రమైన కేసులు ఉండగా.. కేరళలో 57 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 56 శాతం, తెలంగాణలో 49 శాతం మంది శాసనసభ్యులు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. 22 ఏళ్ల నరకం.. సుప్రీం కోర్టు తీర్పు చూసి కన్నీళ్లు..పార్లమెంట్‌లోనూ అదే తీరు!కేవలం శాసనసభలకే పరిమితం కాకుండా పార్లమెంట్ సభ్యులపై కూడా భారీ స్థాయిలో కేసులు పెండింగ్‌లో

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరంగా అత్యధిక కాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సేవలందిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత ఆర్థిక ప్రస్థానం మరింత బలోపేతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.. నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో నాల్గో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. నారీ శక్తికి ప్రతీకగా నిర్మలా సీతారామన్ ప్రస్థానం కొనసాగుతోందని కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆర్థిక ప్రగతికి ఆమె సకాల సహకారం అందిస్తున్నారని కొనియాడారు. నిర్మలా సీతారామన్‌కు అమ్మ దుర్గ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యం, శక్తి, దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షించారు. దేశ సేవలో నిర్మలా సీతారామన్ మరిన్ని సంవత్సరాలు కొనసాగాలని పవన్ కల్యాణ్ అభిలాషించారు. నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ జూమ్ మీటింగ్‌కు 44 మంది సభ్యులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా టీడీపీని బలోపేతం చేయడం, సంస్థాగత విస్తరణ, ఎన్ఆర్ఐ నెట్వర్క్ బలోపేతమే లక్ష్యంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజాను ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం తెర వెనుక విశేష కృషి చేసిన డాక్టర్ రాజా సేవలను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించి ఆయనకు ఈ పదవి అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలను సమన్వయం చేసి బలమైన గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మించే దిశగా ఆయన తొలి అడుగు వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాల సెంట్రల్ కమిటీ మీటింగ్‌ను నేడు జరిగింది. డాక్టర్ రాజా నిర్వహించిన ఈ తొలి జూమ్ మీటింగ్‌కు 44 మంది సభ్యులు హాజరయ్యారు. తమను తాము పరిచయం చేసుకున్న తర్వాత మీటింగ్ అజెండా ప్రకారం వారు మాట్లాడారు. గ్లోబల్ కమిటీ ఏర్పాటు ఆవశ్యకతను డాక్టర్ రాజా వివరించారు. 2029 ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా ఎన్ఆర్ఐలు ఏవిధంగా పని చేయాలి అన్న విషయంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీని మరింత బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సభ్యుల నుంచి సలహాలు స్వీకరించిన రాజా పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ, ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ విజన్ వంటి అంశాల గురించి ఆయన దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఎన్నారై టీడీపీ విధివిధానాలు, ఎవరి పాత్ర ఏమిటి, ఎవరెవరి బాధ్యతలు ఎలా ఉంటాయి అన్న విషయాలను కూలంకషంగా తెలిపారు. తొలి త్రైమాసికంలో కార్యచరణ, ప్రాధాన్యాల గురించి ఆయన మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో పర్యటించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి

ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందు లో భాగంగా ఏపీలో పార్టీ పటిష్ఠత పైన కొత్త టాస్క్ ఫిక్స్ చేస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీలో అయిదు రోజులు మకాం వేయనున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసి.. ఏపీలో పార్టీ భవిష్యత్ లక్ష్యాల పైనా స్పష్టత ఇవ్వనున్నారు.పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీకి వస్తున్నారు. అయిదు రోజుల పర్యటన ఫిక్స్ అయింది. పార్టీ ముఖ్య నేతలతో పాటుగా.. పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాగా, ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి సాగుతూనే.. పార్టీ బలోపేతం పైన మేధో మథనం చేస్తున్నారు. ఇందు కోసం నేరుగా పార్టీ చీఫ్ రంగంలోకి దిగుతున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్ కి బీజేపీ నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం పలుకుతారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరో హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సిద్దం, ముహూర్తం ఫిక్స్..!!విశాఖ కేంద్రంగా బీజేపీ చీఫ్ మంత్రాంగంఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తోంది. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం తమకు దక్కాల్సిన సీట్ల పైన ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణాలో అధికారం దిశగా ఆశలు పెంచుకుంటున్న బీజేపీ ఏపీలో నిర్ణయాత్మకమైన శక్తిగా అవతరించాలని భావిస్తోంది. పొత్తుల్లో

ప్రభుత్వ ఆర్థిక విధాన నిర్ణయాలు, నిధులు కేటాయించడంలో ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో న్యాయసమీక్షకు అవకాశం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. హైదరాబాద్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆర్థిక విధాన నిర్ణయాలు, నిధులు కేటాయించడంలో ప్రభుత్వ ప్రాధాన్యాల విషయంలో న్యాయసమీక్షకు అవకాశం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ పేర్కొంది. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం నిలిపేసిన 2019 యాసంగి, వానాకాలం రైతుబంధు డబ్బులు పిటిషనర్లకు విడుదల చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. కొవిడ్ ఇబ్బందుల వల్ల ప్రభుత్వం 2019 వానాకాలంలో పది ఎకరాల వరకు, యాసంగిలో ఆరు ఎకరాల వరకు ఉన్న రైతులకే రైతుబంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే, తమకు రైతు బంధు అందకపోవడంపై ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కిష్టాపురానికి చెందిన తూము వెంకట నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. తగిన నిర్ణయం తీసుకోవాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. కానీ నిధులు ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొనగా.. పిటిషనర్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఎనిమిది వారాల్లోగా పిటిషనర్లకు 2019 రైతుబంధు నిధులు ఇచ్చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై వ్యవసాయశాఖ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం 2019కి సంబంధించి నిలిపేసిన రైతుబంధు డబ్బు ఇవ్వాలా ? వద్దా ? అనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంటూ సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Pawan Kalyan Chandrababu News: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో చీలికలు మొదలయ్యయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే గత నెల రోజులుగా ఏపీలోని కూటమి పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. అందుకు రుజువుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటమే అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నివాసంలో జరిగిన 'ఎట్ హోమ్' విందుకు కూడా ఆయన హాజరుకాలేదు. 'ఎట్ హోమ్' కార్యక్రమానికి గైర్హాజరు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో సంప్రదాయంగా నిర్వహించే 'ఎట్ హోమ్' విందు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల తర్వాత, రాజమహేంద్రవరంలో అటవీశాఖకు చెందిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించే సమయంలో పవన్‌కు తీవ్ర జ్వరం వచ్చిందని, అందుకే కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చిందని జనసేన తెలిపింది. రాజమహేంద్రవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వైద్యులు పరీక్షించి తగిన విశ్రాంతి సూచించడంతో, ఆయన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఇటీవల కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించి ఫిజియోథెరపీపై వైద్యుల సూచనలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఇటీవల కాలంలో అమరావతిలో జరిగిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం వంటి పలు అధికారిక కార్యక్రమాలకు చంద్రబాబుతో పాటు పవన్ హాజరుకాకపోవడం, విశాఖపట్నంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా, గతంలో

నేటి యువతను ‘జెన్-జీ’ (Gen Z) లేదా ‘జెన్-ఆల్ఫా’ (Gen Alpha) అంటూ విదేశీ పదాలతో సంబోధించడంపై అసోం ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బశ్వ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌహతి మాట్లాడిన ఆయన, ఇలాంటి వర్గీకరణలు యూరోపియన్ సంస్కృతి నుంచి వచ్చినవని తెలిపారు. మన సమాజంలో పిల్లలను ప్రేమగా ‘కొడుకులు, కూతుళ్లు’ అని పిలుచుకోవడమే మన భారతీయ సంస్కృతికి, గుర్తింపునకు నిజమైన ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్రంలో యువత సంక్షేమం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం ఒక ప్రత్యేక ‘యువజన అభివృద్ధి, సాధికారత శాఖ’ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. మన యువత పాశ్చాత్య భావనల ప్రభావంలో పడకుండా, అసోం సొంత సంస్కృతి, గొప్ప చరిత్ర నుంచి ప్రేరణ పొందుతూ స్వయంసమృద్ధి కలిగిన రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ ప్రసంగంలో సీఎం హిమంత బిశ్వ శర్మ మరికొన్ని సంచలన ప్రకటనలు కూడా చేశారు. రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు నవంబర్ 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ చేపడతారని స్పష్టం చేశారు. అలాగే 2026 నుంచి 2031 మధ్య కాలంలో అసోం మౌలిక వసతుల రంగాన్ని భారీగా ఆధునికీకరించేందుకు రూ. 1.5 లక్షల కోట్ల నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. పాలనా సౌలభ్యం కోసం 8 కొత్త సబ్-డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగి తన మొదటి భార్యకు న్యాయబద్ధంగా విడాకులు ఇవ్వకుండా వదిలేస్తే, అతని నెలవారీ జీతంలో 50 శాతం మొత్తాన్ని నేరుగా ఆ భార్యకే అందజేసేలా చట్టపరమైన నిబంధనలు తీసురానున్నట్లు వెల్లడించారు

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఈ మధ్య వరుసగా తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న ఇక్కడి ప్రజలు బలూచిస్తూనే తరహాలో స్వాతంత్రం కావాలంటున్నారు. భారత్ అనుమతిస్తే విలీనం అయిపోయేందుకు కూడా సిధ్దమంటున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఇవాళ సంచలన విషయం బయటపెట్టారు.NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!కేంద్రం 2019లో జమ్ము కాశ్మీర్ కు రాష్ట్ర హోదా రద్దు చేయడంతో పాటు మూడు ముక్కలు చేసి , రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం గతంలో కల్పించిన ప్రత్యేక హోదాను సైతం రద్దు చేసింది. దీంతో కాశ్మీర్ లో ఉగ్రవాదం ఉండదని చెప్పుకుంది. కానీ ఇప్పటికీ అక్కడ పహల్గాం వంటి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయలో పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 2019లో ఆ నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే ఇప్పటికే వారు కాశ్మీర్ లో విలీనం అయిపోయేవారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ పేర్కొన్నారు. నల్సార్ కు బార్ కౌన్సిల్ సారీ చెప్పాల్సిందే..! సీజేఐకి మరో లా యూనివర్శిటీ షాక్..!కేంద్రం ఆ నిర్ణయాలు తీసుకోకపోతే.. ఇప్పటికి వారంతా తిరిగి జమ్మూ కాశ్మీర్ లో విలీనం కోసం ఉద్యమాలు చేసేవారని ఒమర్ తెలిపారు. ప్రస్తుతం పీఓకేలో నెలకొన్న పరిస్థితులు, 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన గిరిజన దండయాత్రలను ఎదుర్కొని, భారత్‌లో విలీనానికి జమ్మూ కశ్మీర్ ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం, అరెస్టులకు గురవడం తనను బాధించిందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తన తాత, జమ్మూ కశ్మీర్ తొలి ప్రధానమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లాను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన శత్రువుల్ని ఎదుర్కొని, భారత సైన్యం కశ్మీర్‌కు చేరుకునే ముందే ప్రజలను సమీకరించి

భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బీసీసీఐ పెద్దలు అగార్కర్‌తో సమావేశం కానున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సెప్టెంబరుతో సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అగార్కర్ మూడేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. దీంతో మరో ఏడాది పొడిగింపు ఇవ్వాలా? వద్దా? అన్నదానిపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.అగార్కర్ భవిష్యత్తుపై చర్చకు మరో అంశం కూడా కారణమవుతున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ భవిష్యత్తుపై సెలెక్టర్లు, బీసీసీఐ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్‌ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లాండ్‌తో చివరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుత శతకంతో తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులతో చెలరేగాడు. లార్డ్స్‌లో వన్డే

పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి, ఆగస్టు15: పంద్రాగస్టు నేపథ్యంలో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే. అందుకు ‘అనే నేను..’ సంకల్పంతో దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలి’. ‘మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి. 2047 నాటికి వికసిత్ భారత్.. స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు.. వికాసం నుంచి వైభవం వైపు ముందుకు సాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దాం. జై తెలుగుతల్లి! జై హింద్!’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ

సుబేదారి (వరంగల్) ఆగస్టు 14 : హనుమకొండ హంటర్ రోడ్డులోని 'జూలో ఏం జరుగుతోంది?' అంటూ నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. కాకతీయ జూ పార్క్ ఇంజార్జి మయూరి డిప్యూటేషన్‌ను చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్ రద్దు చేశారు. ఆమెను యథావిధిగా మహబూబాబాద్ జిల్లా గంగారం పాత పోస్టులోనే కొనసాగించాలని ఆయన ఆదేశించారు. "జూ పార్క్‌కు పూర్తి స్థాయి అధికారి లేక.. పర్యవేక్షణ కరువు .. హనుమకొండ కాకతీయ జూ పార్కు లో ఏం జరుగుతుంది..? అనే కథనాన్ని గురువారం నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించారు. మంత్రి ఇలాకాలో వరుసగా వన్య ప్రాణులు, పెద్ద పులి, కుక్కల వేటలో కృష్ణ జింకలు, మూషిక జింకలు, ఇటీవల కరెంట్ షాక్ తో ఎలుగుబంటి మరణాలను ప్రస్తావించిన నమస్తే కథనంపై అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించారు. [caption id="attachment_2483485" align="alignnone" width="656"] [/caption] హనుమకొండ కాకతీయ జూ పార్క్‌కు డిప్యూటేషన్ పద్దతి ఇంఛార్జిగా పనిచేస్తున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మయూరితో పాటు భద్రాద్రి జోన్ లోని మరో నలుగురి ఫారెస్ట్ ఉద్యోగుల డిప్యూటేషన్లు రద్దు చేస్తూ , పాత రెగ్యులర్ పోస్టుల్లో కొనసాగిస్తూ శుక్రవారం చీఫ్ కన్జర్వేటర్ వినయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు

సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు. ఇంటర్నెట్ డెస్క్: సుప్రీం కోర్టులో నూతన కోర్టు హాల్స్, రిజిస్ట్రార్ కోర్టు హాల్స్ ప్రారంభమయ్యాయి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ వీటిని ప్రారంభించారు. మరో రెండు రిజిస్ట్రార్ హాల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మెయిన్ క్యాంపస్‌లోని వెస్ట్ వింగ్ మొదటి అంతస్తులో వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు డిప్యూటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటన జారీ చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ సహా మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచుతూ పార్లమెంట్ చట్ట సవరణ తీసుకొచ్చింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. బ్యాక్ లాగ్ కేసులు తగ్గించేందుకు వీలుగా పార్లమెంటు ఈ మేరకు చట్ట సవరణ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయసేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా రెండు కొత్త కోర్టు హాళ్లను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు. షాకింగ్ వీడియో వైరల్.. బెంగళూరులో ఓ మహిళ మెడలో బంగారం చోరీ.. మావోయిస్టు క్యాంప్ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు
అకాలీ దళ్ అధినేత, పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురువారం దాడి జరిగింది. గురుద్వారాలో ఆయనపై నిహంగ్ సిక్కు కిర్పాన్‌తో దాడిచేసినట్టు వర్గాలు తెలిపాయి. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు.. బాదల్‌ను చికిత్స కోసం నాందేడ్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సుఖ్బీర్ సింగ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. నాందేడ్‌లోని తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్ గురుద్వారాకు తన కుటుంబంతో కలిసి వచ్చిన బాదల్.. ప్రార్థనలు ముగించుకుని మెట్లు దిగుతుండగా ఈ దాడి జరిగింది. దాడి సమయంలో బాదల్ భార్య, అకాలీ దళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ ఆయనతోనే ఉన్నారు.దాడి చేసిన వ్యక్తిని నిహంగ్ సిక్కు అయిన జస్పాల్ సింగ్‌గా గుర్తించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి గత రెండేళ్లుగా ఆ గురుద్వారాలో పనిచేస్తున్నాడు. దాడి అనంతరం బయటకు వచ్చిన వీడియోలో, బాదల్ తన కుడి చేతికి కాషాయ వస్త్రాన్ని చుట్టుకుని నడుస్తూ కనిపించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి సుఖ్బీర్ బాదల్‌ను కడుపులో కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు.. కానీ భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకోవడంతో చేతికి గాయమైంది. బాదల్‌కు ప్రాణాపాయం లేదని అకాలీ దళ్ వర్గాలు తెలిపాయి. నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, బాదల్ చేతికి కుట్లు పడ్డాయని తెలిపారు.దాడి జరిగిన కొద్దిసేపటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. నాందేడ్ ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడి వెనుక ఉద్దేశం ఏంటో దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆయన నిర్దేశించారు. ఇదిలా ఉండగా, దాదాపు రెండేళ్ల కిందట అమృత్‌సర్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి బాదల్ త్రుటిలో తప్పించుకున్నారు. డిసెంబరు 4, 2024లో స్వర్ణదేవాలయం బయట ఆయనపై ఓ యువకుడు కాల్పులకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో బాదల్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. దుండగుడ్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.2007

అకాలీ దళ్ అధినేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. అక్కడి ఒక గురుద్వారాను సందర్శించిన తర్వాత నగర శివార్లలో దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. నాందేడ్, ఆగస్టు 13: శిరోమణి అకాలీదళ్ (SAD) అధినేత, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై మహారాష్ట్రలోని నాందేడ్‌లో దాడి జరిగింది. గురుద్వారాను సందర్శించి వస్తుండగా నగర శివార్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడి అనంతరం బాదల్‌ను నాందేడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘటన సుఖ్బీర్ సింగ్ బాదల్ తన భార్య, అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుటుంబ సభ్యులతో కలిసి నాందేడ్‌లోని ప్రసిద్ధ 'తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్' గురుద్వారాను సందర్శించారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో బాదల్ భద్రతా సిబ్బందిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి. దాడి వెనుక ఉన్న కారణాలు, దాడి చేసిన వారి సమాచారంపై పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. సమాజంలో దళితులకు స్థానం లేదు.. ఖర్గే ఆగ్రహం హఫీజ్ సయీద్‌కు మద్దతు ప్రకటించి.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి

దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్‌గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే.. గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు

ఏపీ రాజధాని అమరావతిలో అభివృద్ది పనులు ఊపందుకున్నాయి. పూర్తి అయిన అభివృద్ది పనులను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతిని కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ-3ని గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాయపూడి – వెంకటపాలెం – పెనుమాక – ఉండవల్లి వరకూ సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం పూర్తి అయింది. మూడో దశలో మణిపాల్ వద్ద జాతీయ రహదారి 16కు అనుసంధానించేలా ప్రణాళికలు రూపొందించారు. మొత్తం రూ.1,519 కోట్ల వ్యయంతో రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం చేపట్టనుండగా.. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంతో రాజధాని నగరానికి మరింత మెరుగైన కనెక్టివిటీ లభించనుంది. ఇవాళ్టి నుంచి కరకట్టకు ప్రత్యామ్నాయంగా సీడ్ యాక్సెస్ రహదారి మార్గంలో పూర్తి స్థాయిలో వాహన రాకపోకలకు మార్గం సుగమం అయింది. రాజధానిని ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండనుందని చెప్పవచ్చు. అమరావతిలో ప్రజా రవాణాకు ఇది పెద్ద వెన్నెముకగా నిలవనుంది. విజయవాడ-మంగళగిరి మార్గానికి సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానం చేశారు. దీంతో రవాణా మరింత వేగవంతం కానుంది. ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా అమరావతికి ఈ మార్గం ద్వారా చేరుకోవచ్చు. మూడు దశల్లో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎన్ -1 నుంచి ఎన్-17 వరకు ఉన్న అన్ని ఎన్-సిరీస్ రహదారులను యాక్సెస్ రోడ్డుతో అనుసంధానించారు. 1.77 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉండనుండగా.. ఇందుకోసం రూ.1519 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మిస్తుండగా.. సర్వీస్ రోడ్లతో పాటు ప్రత్యేక బీఆర్టీఎస్ కారిడార్, 9 లైన్ల రహదారి ఉన్నాయి. ఇక సైకిల్ ట్రాకులు, ఫుట్ పాత్‌లు కూడా ఉన్నాయి. బుకింగ్ హోమ్‌పై నిర్మించి స్టీల్ బ్రిడ్జి 110 మీటర్ల పొడవు, 9+9 మీటర్లు వెడల్పు ఉంటుంది. ఇక కొండవీటి వాగుపై

కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వరకు చేపట్టిన పాదయాత్ర బుధవారం గోదావరిఖనికి చేరుకుంది. మది నిండా కేసీఆర్ అభిమానం, గులాబీ జెండాలతో గోదావరిఖనికి రాగానే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సూచనల మేరకు బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాష్ట్ర మహిళా నాయకురాలు మూల విజయారెడ్డి బొట్టు పెట్టి పాదయాత్ర విజయవంతం కావాలనీ, ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంకు పట్టిన గ్రహణం వీడాలనీ, ప్రజలకు పూర్వ రోజులు రావాలని, కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వాంకిడిలో 350 ఇళ్లకు పట్టాలు ఇచ్చారనీ, ఆ అభిమానంతోనే సాహసమైనా తమ ప్రాణాలు లెక్క చేయక ఎర్రవెల్లి వరకు పాదయాత్రగా వెళ్తున్నామనీ, అడుగడుగునా, ఊరూరా ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నారని పాదయాత్ర చేపట్టిన తిరుపతి, శంకర్ తెలిపారు. అనంతరం వారికి అల్పహారం ఏర్పాట్లు చేసి మళ్లీ పాదయాత్రగా సాగనంపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సమ్మయ్య, మూల విజయారెడ్డి, నాయకులు అచ్చ వేణు, ఋషేంద్రం, దొమ్మెటి వాసు, కొలుగూరి సాయికుమార్, కనకరాజు, ప్రతాప్, ఐలయ్య, హరికృష్ణ, కళ్యాణ్, ఆశిష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Mohan Bhagwat With Youth: రీసెంట్గా దేశ రాజధానిలో విద్యార్ధుల ఉద్యమంతో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారు సింహాసనం కదిలింది. ఆ ఉద్యమం జరిగిన మరుసటిరోజు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు అనాలో.. ఇతర విదేశీ, దేవ వ్యతిరేక శక్తులు అందులో ప్రవేశించినట్టు నివేధికలు అందడటంతో వెంటనే అప్రమత్తమై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేయించింది. ఓ రకంగా ప్రభుత్వం ఈ విషయంలో ఒక అడుగు వెనకడుగు వేసిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై వేదికగా మోహన్ భగవత్ యువతరం మనోగతాన్ని తెలుసుకుని అభినందనలతో ముంచెత్తారు. ఆర్ఎస్ఎస్ ఆపరేషన్ తో పొలికల్ పార్టీలు పరేషానయ్యాయి. ఇంతకీ విద్యార్థుల మనోగతమేంటి? ఆర్ఎస్ఎస్ చీఫ్ విద్యార్దులతో భేటి వెనక ఏమైనా చాణక్యం ఉందా అని అందరు తలల పట్టుకుంటున్నారు. సీజేపీ ఆందోళనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా.. బొద్దింకల జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని బెంబేలెత్తించింది. నీట్ ప్రశ్నా పత్రంలీక్ వ్యవహారంపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కాక్రోచ్ జనతాపార్టీకి ఢిల్లీ వేదికగా యువతరం మద్ధతుగా నిలిచింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. రాజకీయాలపై అవగాహన లేని విద్యార్థులు తమ సమస్యల పరిష్కారంకోసం బొద్ధింకల జనతాపార్టీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. అందులో విదేశీ శక్తులు ప్రవేశంతో అది వేరే మలుపు తిరిగింది. బొద్దింకల ఉద్యమంతో దేశంలో రాజకీయ పరిణామాలు మారిపోతూ

గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా కుమారుడి వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. వివాహ వేడుకలో నూతన వధూవరులను నారా లోకేష్, నారా బ్రాహ్మణి ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. లోకేష్ దంపతులు తమ కుటుంబ వివాహ వేడుకకు హాజరు కావడంతో డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి, బిజీ షెడ్యూల్లోనూ ప్రత్యేకంగా సమయం కేటాయించి అమెరికా వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నందుకు నారా లోకేష్‌కు డాక్టర్ రాజా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావుకు కీలక పదవి లభించనుంది. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం.. పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి తాజాగా కేంద్ర ప్రభుత్వానికి పలు సిఫారసులు పంపింది.కొలీజియం సిఫారసుల ప్రకారం.. జస్టిస్ కామేశ్వరరావుతో పాటు, బాంబే హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర విఠల్‌రావు ఘుగేను కలకత్తా హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠిని బాంబే హైకోర్టుకు, పంజాబ్-హరియాణా హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ అశ్వినీకుమార్ మిశ్రాను అదే హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. ఈ సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపిన తర్వాత, కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది.జస్టిస్ కామేశ్వరరావు 1965లో ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జన్మించారు. ఆయన స్వగ్రామం రాజోలు మండలం పొన్నమండ. తండ్రి ఉద్యోగ రీత్యా ఢిల్లీలో స్థిరపడటంతో, ఆయన విద్యాభ్యాసం, న్యాయవాద వృత్తి అక్కడే కొనసాగింది. 2013లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన, 2015లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. గతంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా సేవలు అందించారు. తెలుగు వ్యక్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం రావడంపై ఆయన స్వస్థలం కోనసీమ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ప్రతిష్ఠాత్మక న్యాయ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌కు ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనపై విద్యార్థుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (NALSAR) చివరి సంవత్సరం విద్యార్థుల బృందం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వర్సిటీ యాజమాన్యాన్ని కోరింది. సీజేఐ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం తమకు ఇష్టం లేదంటూ సుమారు 450 మంది విద్యార్థుల సంతకాలు చేసి కాలేజీ యాజమాన్యానికి సమర్పించారు. తమ అభ్యంతరం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని.. రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, నిరసనలపై న్యాయవ్యవస్థ స్పందన వంటి అంశాలకు సంబంధించినదని వాళ్లు యాజమాన్యానికి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కాన్వొకేషన్ వేదిక తమ విశ్వవిద్యాలయ విలువలను ప్రతిబింబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ‘చలో సంసద్’ నిరసన నేపథ్యంలో.. విద్యార్థుల అభ్యంతరానికి ప్రధాన కారణం.. జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘చలో సంసద్’ నిరసన సందర్భంగా పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్!. నీట్ పరీక్ష నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. ఆ సమయంలో పోలీసులు అతిగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై అత్యవసర విచారణ కోరుతూ జులై 22న సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. న్యాయస్థానం స్పందనపై విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను చూపించేందుకు ప్రయత్నించిన న్యాయవాదులకు తగిన అవకాశం ఇవ్వలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు. 170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారని, ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని విద్యార్థులు ప్రస్తావించారు. పౌరుల హక్కులు, పోలీసు అధికారాల పరిమితులపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేశారు. “మేం నేర్చుకున్న విలువలకు విరుద్ధం”.. NALSAR విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులకు ఇచ్చిన వినతిపత్రంలో.. కాన్వొకేషన్ ముఖ్య అతిథిగా

త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ.. విద్యార్థులపై దాడి వీడియోలు చూసే తీరిక ఆయనకు లేదు స్నాతకోత్సవానికి ఆయనను ఆహ్వానించొద్దంటూ.. నల్సార్ వీసీ, రిజిస్ట్రార్లకు 450 మంది విద్యార్థుల లేఖ ఇప్పటికే సీజేఐని చీఫ్ గెస్ట్‌గా పిలిచి స్నాతకోత్సవాన్ని వాయిదా వేసుకున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హైదరాబాద్, శామీర్‌పేట, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను పిలవొద్దంటూ 450 మంది విద్యార్థులు ఆ వర్సిటీ ఉపకులపతికి, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదని.. ముఖ్య అతిథి ఎంపిక ఇంకా చర్చల దశలోనే ఉందనే విషయం తమకు తెలుసని.. అందుకే అధికారిక నిర్ణయం తీసుకునే ముందే తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ లేఖ రాస్తునట్టు అందులో పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా పోలీసుల దౌర్జన్యంపై దాఖలైన పిటిషన్ విచారణలో.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యవహరించిన తీరుపై తమకు అభ్యంతరాలున్నాయని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. జూలై 20న పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరోపణలు వచ్చాయని, పలువురు నిరసనకారులు గాయపడినట్లు పిటిషన్లో పేర్కొన్నారని.. కానీ, జూలై 23న జరిగిన విచారణ సందర్భంగా.. విద్యార్థులపై పోలీసుల దాడులకు సంబంధించి వీడియోలు చూసేందుకూ ఆయన నిరాకరించారని, అందుకు తనకు సమయం లేదని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. నిరసనలకు గల కారణాలను వివరించడానికి న్యాయవాది ప్రయత్నించినప్పుడు ఆయన మాటలను సీజేఐ మధ్యలోనే అడ్డుకుని ‘థాంక్యూ వెరీమచ్’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. న్యాయవిద్యార్థులుగా.. మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకుని పట్టాలు అందుకోబోతున్న బ్యాచ్‌గా తమ ఆందోళన పరిమితమైనదేనని.. రాజ్యాంగ హక్కులు, న్యాయం పొందే అవకాశం

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Man black magic rituals with chief justice photo in Chhattisgarh: ప్రస్తుతం మనం ఏఐ జనరేషన్ లో ఉన్నాం. రోజు రోజుకు ఏఐతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాం. అందరు దీన్ని ఉపయోగించుకొవాలని, అడాప్ట్ చేసుకొవాలని నిపుణులు చెబుతున్నారు . ఇప్పటికి కూడా అనేక చోట్ల మూఢనమ్మకాలు, చాతబడి, బాణామతి, మంత్రాలు, బాబాలను నమ్ముతూ చాలా మంది తమ డబ్బుల్ని పొగొట్టుకుంటున్నారు. దీనిలో ఎక్కువగా చదువుకున్న వారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కత్తిపోటు కేసులో నిందితులకు బెయిల్ వచ్చేలా చేయాలని ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా ఫోటో పెట్టుకుని కొంత మంది రాత్రి శ్మశానవాటికలోచేతబడి చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర రచ్చగా మారింది. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మర్డర్ కేసులో బెయిల్ కోసం నలుగురు వ్యక్తులు అర్దరాత్రి.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోటోతో తాంత్రిక పూజల్ని నిర్వహించారు. శనివారం అర్ధ రాత్రి ఈ వింత సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు. అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని గ్రామస్తులు గమనించారు. ఆతర్వాత అక్కడకు వెళ్లి చూశారు. అక్కడి ఫోటోల్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారిలో ముగ్గురు పారిపోగా, రిషికేష్ కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిరు. ఘటనా స్థలం నుంచి చేప, నిమ్మకాయలు, కుంకుమతో పాటు ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. ఆదివారం వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. వరంగల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి (Peddi Sudarshan Reddy) కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భరోసా కల్పించారు. ఈరోజు (ఆదివారం) వరంగల్ జిల్లాలోని నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారితో కేసీఆర్ మాట్లాడి ధైర్యం చెప్పారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.5 కోట్ల చెక్కును అందజేశారు. వారికి పార్టీ, తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం నల్లబెల్లి నుంచి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు. అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాగ్రత్త: సీపీ సజ్జనార్ సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు: ఉత్తమ్