
మజ్జిశ్రీను బాటలోనే మరో వైసీపీ ముఖ్య నేత, కొత్త లెక్కలు ..!?
Majji Srinu exit from YCP has sparked fresh speculation as another key Vizianagaram leader may follow his path. మజ్జి శ్రీను బాటలోనే విజయనగరం కు చెందిన మరో నేత వెళ్తున్నట్లు సమాచారం.

Majji Srinu exit from YCP has sparked fresh speculation as another key Vizianagaram leader may follow his path. మజ్జి శ్రీను బాటలోనే విజయనగరం కు చెందిన మరో నేత వెళ్తున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్ 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో హెడ్ కోచ్ ఎంపికపై సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొత్త కోచ్‌ను నియమించడానికి ఇంకా చాలా సమయం ఉందని, అప్పుడే తొందరెందుకని తెలిపాడు. ‘సీఎస్కే జట్టుకు హెడ్ కోచ్ ఉంటాడు. ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి హెడ్ కోచ్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి తొందరేం లేదు’ అని రుతురాజ్ వెల్లడించాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 2008లో సీఎస్కే ప్లేయర్‌గా జట్టులో చేరాడు. ఆ తర్వాతి ఏడాదే హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్‌లో జట్టు ఐదు ఐపీఎల్ టైటిళ్లు, రెండు ఛాంపియన్స్ లీగ్ టీ20 ట్రోఫీలు గెలుచుకుంది. ధోని నుంచి సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రుతురాజ్.. గతేడాది తన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాడు. ‘ఎంఎస్ ధోని నుంచి కెప్టెన్సీ తీసుకోవడం చాలా పెద్ద బాధ్యత. అతడు సాధించిన విజయాలు ఎంతో గొప్పవి. సహజంగానే అభిమానులు మరిన్ని విజయాలు, టైటిళ్లను ఆశిస్తారు. అయితే ఈ అదనపు బాధ్యతను నేను ఆస్వాదిస్తున్నా. ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం కెప్టెన్‌గా కొనసాగేందుకు సిద్ధంగా ఉన్నా. 2008 నుంచి సీఎస్కే అద్భుతమైన ప్రయాణం సాగించింది. దాదాపు ప్రతి సైకిల్లోనూ ఐపీఎల్

వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. ఇంటర్నెట్ డెస్క్: వీసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని యూఏఈలోని భారతీయులను అక్కడి ఇండియన్ ఎంబసీ అప్రమత్తం చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వవద్దని సూచించింది. వీసా రెగ్యులరైజేషన్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్స్ జారీ, ఎగ్జిట్ పర్మిట్లు, ఎమిరేట్ ఐడీలు, ఉపాధి విషయాల్లో అవగాహనతో ఉండాలని సూచించింది. యూఏఈలో వెలుగు చూస్తున్న స్కామ్స్‌లో పలువురు బ్లూకాలర్ ఉద్యోగులు బాధితులుగా మారుతున్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు ఎంబసీ వెల్లడించింది. మోసపూరితంగా బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్న నిందితులు వాటితో ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పింది. బాధితులకు తెలియకుండానే వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరవడం, లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకోవడం వంటివి చేస్తున్నారని చెప్పింది. ఈ స్కామ్ బారిన పడితే అప్పులు మిగిలడంతో పాటు నిషేధానికి గురయ్యే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండేందుకు భారతీయులు తమ బయోమెట్రిక్, పాస్‌పోర్టు వివరాలను అనధికారిక ఏజెంట్లు, వ్యక్తులతో పంచుకోవద్దని సూచించింది. యూఏఈ ప్రభుత్వ కేంద్రాలు, కౌంటర్లలోనే ఈ వివరాలను ఇవ్వాలని సూచించింది. భారతీయ పాస్‌పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ల జారీ కోసం భారతీయ కాన్సులేట్లు, లేదా ఎంబసీ బయోమెట్రిక్ వివరాలను కోరవని కూడా స్పష్టం చేసింది. బయోమెట్రిక్ వివరాలను ఎవరైనా అడిగితే వెంటనే ఎంబసీకి సమాచారం ఇవ్వాలని కూడా అధికారులు చెప్పారు. రష్యా సైన్యంలోని 51 మంది భారతీయుల మృతి.. విదేశాంగ శాఖ సెక్రటరీ వెల్లడి రైల్వే అభివృద్ధిలో తెలంగాణకు పెద్దపీట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతీ చిన్న వార్త నెట్టింట సంచలనమే సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అసలు సందీప్, దీపికా మధ్య ఏం జరిగింది? ఆమెను ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సంచలన విషయాలు బయటపెట్టారు. 'స్పిరిట్' నుంచి దీపికా పదుకొనేను తీసేయడంపై ఇన్నాళ్లూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు. సందీప్ రెడ్డి వంగ ఏదైనా ఒక సినిమా అనుకున్నారంటే.. పాత్రల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిరిట్' కథ రాసుకుంటున్న సమయంలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆయన మొదట అనుకున్నది దీపికా పదుకొనేనే. సుమారు సంవత్సరంన్నర పాటు సందీప్, దీపికా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో ట్రావెల్ చేశారు. ఆమె టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే అంత సమయం కేటాయించారు. అయితే, ఆ సమయానికి దీపికా నటించిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లుగా నిలిచాయి. దాంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ హిట్ల తర్వాత దీపికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. కేవలం భారీ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా.. సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందట. దాంతో పాటు షూటింగ్ డేట్స్, రోజువారీ కాల్షీట్ టైమింగ్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానని కండీషన్స్ పెట్టింది. సరే, ఒక స్టార్ హీరోయిన్ అంత డిమాండ్ చేసినా బిజినెస్ పరంగా ఓకే అనుకోవచ్చు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీ నుంచి దీపికను తీసేయడానికి గల అసలు కారణం నిర్మాత రివీల్ చేశారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ఈ భారీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందంటూ గతంలో ప్రచారం సాగడం, ఆ తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలు రావడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ సినిమా విషయంలో దీపికా పదుకొణె (Deepika Padukone) చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ కాస్టింగ్ వివాదంపై సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి (Pranay Reddy Vanga) వంగా తాజాగా స్పందించి అసలు నిజాన్ని బయటపెట్టారు. దీపికాతో దాదాపు ఏడాదిన్నర పాటు చర్చలు జరిపినప్పటికీ ప్రాజెక్ట్ ఎందుకు వర్కవుట్ కాలేదో స్పష్టంగా వివరించారు. ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘‘సందీప్ దాదాపు ఏడాదిన్నర పాటు దీపికా పదుకొణెతో ‘స్పిరిట్’ కథ, ఆమె పాత్రకు సంబంధించి చర్చలు జరిపారు. ఆమెకు కథ విపరీతంగా నచ్చినప్పటికీ కొన్ని కఠినమైన వ్యాపార నిబంధనలు, షరతుల వల్లే ఆమెను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకోలేకపోయాం. భారీ రెమ్యూనరేషన్ పెంపుతో పాటు సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా కావాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోజువారీ షూటింగ్ పనివేళలకు సంబంధించి కూడా ఆమె పెట్టిన నిబంధనలు సినిమా మేకింగ్‌కు అనుకూలంగా అనిపించలేదు’’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణానికి ఈ రకమైన షరతులు సమంజసంగా అనిపించకపోవడంతోనే పరస్పర అంగీకారంతో ఆమె
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘స్పిరిట్’. బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ తో కలిసి సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ముందుగా దీపికా పదుకొనేని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ చివరకు త్రిప్తి డిమ్రీని తీసుకున్నారు. ప్రభాస్ మూవీ నుంచి దీపిక తప్పుకుందనే వార్త జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా స్పందించారు.‘స్పిరిట్’ నుంచి దీపిక పదుకునే తప్పుకుందా? తప్పించారా? అని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అదే సమయంలో ‘రోజుకు 8 పని గంటలు’ అంశం తెర మీదకు వచ్చింది. ఈ నియమ నిబంధనల కారణంగానే దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అందరూ అనుకున్నారు. అప్పుడే దీపికాను ఉద్దేశించి సందీప్ వంగా పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే కేవలం పని గంటలు మాత్రమే కాదు, రెమ్యూనరేషన్ విషయంలోనూ దీపిక పెట్టిన కండిషన్ వల్లే ఆమెను తప్పించినట్లు ప్రణయ్ రెడ్డి వెల్లడించారు.ప్రణయ్ వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక పదుకునే తప్పుకోవడం గురించి మాట్లాడారు. “వెబ్ సైట్లలో ఏమి రాశారో అదే రీజన్. ఒకటి రెమ్యునరేషన్, రెండు టైమింగ్. అవి కాకుండా వేరే రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆమెను తీసేయాలనేది సందీప్ తీసుకున్న నిర్ణయమే. ఆమెతో సందీప్ ఒక ఏడాదిన్నరపాటు టచ్ లో ఉన్నాడు. ఆమె పర్ఫార్మెన్స్ నచ్చి, సినిమాలో ఉంటే బెటర్ గా ఉంటుందని ఆలోచించాము. ప్రాజెక్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఆ ఏడాదిన్నరలో చాలా మారాయి. ఆమెవి ఓ రెండు సినిమాలు హిట్టయ్యాయి. దీంతో డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది”“నెట్ ఇన్ కమ్ నుంచి 10 శాతం కావాలని డిమాండ్ చేసింది. అంటే లాభాల్లో పది శాతం అడిగింది. అన్నీ హద్దులు దాటిపోయాయి

విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కష్టపడి సంపాదించిన డబ్బుతో స్వదేశానికి తిరిగి వచ్చే భారతీయ నిపుణులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. తాము పనిచేసిన దేశాల్లో చెల్లించిన సోషల్ సెక్యూరిటీ, పెన్షన్ నిధులు తిరిగి పొందే అవకాశం లేక ఏటా బిలియన్ల డాలర్లను విదేశాల్లోనే వదిలేయాల్సి వస్తోంది.ఈ నష్టాన్ని సాంకేతికంగా ఎగ్జిట్ టాక్స్ అని పిలుస్తున్నప్పటికీ, ఇది మనం విదేశాలు వదిలేటప్పుడు వేసే పన్ను కాదు. ఆయా దేశాల్లో నిర్దేశించిన కనీస వ్యవధి వరకు పనిచేయకముందే భారత్‌కు తిరిగొచ్చేయడం వల్ల తాము దాచుకున్న సొమ్మును శాశ్వతంగా కోల్పోయే ఒక దారుణమైన పరిస్థితి!అమెరికా, బ్రిటన్, జర్మనీల్లో బిలియన్ డాలర్ల నష్టం!అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికాలో భారతీయులు తమ ప్రతి పే-చెక్ నుంచి 7.65 శాతం సొమ్మును సోషల్ సెక్యూరిటీ కింద చెల్లిస్తారు. అయితే, అమెరికాలో వరుసగా 10 ఏళ్ల పాటు పనిచేయకపోతే ఆ డబ్బును క్లెయిమ్ చేయడం కుదరదు. పైగా భారత్-అమెరికా మధ్య టోటలైజేషన్ ఒప్పందం లేకపోవడం వల్ల ఏటా దాదాపు 3.0 నుంచి 3.5 బిలియన్ డాలర్ల భార్య సొమ్మును భారతీయ ఉద్యోగులు నష్టపోతున్నారు.జర్మనీలో 5 ఏళ్లు పూర్తికాకముందే స్వదేశానికి వస్తే మన సొంత కాంట్రిబ్యూషన్ మాత్రమే వెనక్కి ఇస్తారు కానీ, కంపెనీ చెల్లించిన 9.3 శాతం నిధులు పూర్తిగా పోతాయి. బ్రిటన్‌లో కూడా పన్ను మినహాయింపులకు సంబంధించి కఠిన నిబంధనలు మన నిపుణులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!రిటర్న్ అయ్యేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!విదేశాల నుంచి ఇండియాకు ప్యాక్ అయ్యే సమయానికంటే కొన్నేళ్ల ముందే సరైన ప్లానింగ్ చేసుకుంటే ఈ నష్టాన్ని అధిగమించవచ్చు.పన్ను రికార్డులు పక్కాగా ఉండాలి: అమెరికా వంటి దేశాల్లో గత ఐదేళ్ల టాక్స్ ఫైలింగ్ రికార్డులు పక్కాగా ఉండాలి. ఒక్క చిన్న ఎఫ్బీఏఆర్ (FBAR) రికార్డు మిస్ అయినా భారీ జరిమానాలు పడతాయి.ఆస్తులు, నిధుల వర్గీకరణ: జర్మనీ, ఇతర ఐరోపా దేశాల్లో భారీ ఫండ్స్ ఒకే

కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి అమల్లోకి సర్వం సిద్ధం చేసిన ట్రాఫిక్ పోలీసులు 13 చోట్ల ఎగ్జిట్ పాయింట్లు అదనంగా 35 సీసీ కెమెరాల ఏర్పాటు పాదచారుల కోసం ‘సిటిజన్ పెవిలియన్లు’.. ప్రత్యేక జీబ్రా క్రాసింగ్స్ నాలుగు షిఫ్టుల్లో సిబ్బంది పహారా.. ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణ హైదరాబాద్: అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేటినుంచి ‘వన్ వే’ అమలు కానుంది. ఈ మేరకు పోలీస్ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ట్రాఫిక్ కష్టాలకు చరమగీతం పాడేలా అమలు చేయనున్న వన్‌వే ప్రయాణతీరుపై వాహన చోదకులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రోడ్డులో ఎగ్జిట్ పాయింట్స్, లైన్ చేంజింగ్ పై అవగాహన ఉంటే సాఫీగా ప్రయాణం చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. గతంలో నిర్వహించిన ట్రయల్ రన్‌ను పరిగణలోకి తీసుకొని సమస్యలను అధిగమించేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. లేన్ 1.. 2 రోడ్ల వర్గీకరణ హెచ్-సిటీ ప్రణాళికలో భాగంగా వాహనాలు ఎక్కడా నిలవకుండా సాఫీగా సాగేందుకు రహదారులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించారు. లేన్-1 : దూరం వెళ్లే వాహనాలు, నాన్-స్టా్పగా ప్రయాణించే వారి కోసం ప్రత్యేకించారు. లేన్- 2: కాలనీలు, ఉప రహదారుల్లోకి వెళ్లే వారి కోసం నిర్దేశించారు. పది ప్రాంతాల్లో లేన్ చేంజింగ్‌కు అవకాశం కల్పించారు. 13చోట్ల ఎగ్జిట్ పాయింట్లు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు త్వరగా వెళ్లేందుకు వీలుగా కేబీఆర్ చుట్టూ 13చోట్ల ఎగ్జిట్ పాయింట్లను శాస్త్రీయంగా తీర్చిదిద్దారు. కేబీఆర్ పార్కుకు నిత్యం వేలాది మంది వాకర్లు, పర్యాటకులు వస్తుంటారు. వీరికి ఇబ్బందులు రాకుండా భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రోడ్డు దాటాలనుకునే పాదచారులు సురక్షితంగా వేచి ఉండేందుకు పలు కీలక కూడళ్లలో అత్యాధునిక ‘సిటిజన్ పెవిలియన్స్’ నిర్మించారు. అవకాశమున్న చోట్ల స్పష్టమైన జీబ్రాక్రాసింగ్స్, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు బ్లింకర్లు, రేడియం సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అదనంగా 35 సీసీ కెమెరాలు కేబీఆర్
SGB Returns: సార్వభౌమ పసిడి బాండ్ల (Sovereign Gold Bonds)లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్. 5 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన రెండు నిర్దిష్ట ఎస్జీబీ సిరీస్‌లకు సంబంధించి ఆగస్టు 11న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రీ మెచ్యూర్ రిడంప్షన్ (premature Redemption) అవకాశం కల్పించింది. ఈ మేరకు రెండు పసిడి బాండ్లకు సంబంధించిన ముందస్తు ఉపసంహరణ ధరలను తాజాగా ప్రకటించింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.3.72 లక్షల వరకు వస్తాయి. మరి ఆ రెండు బాండ్లు ఏవి? వాటి ధరల వివరాలు తెలుసుకుందాం.ప్రీమెచ్యూర్ రిడంప్షన్‌కు వచ్చిన 2 బాండ్లు2020 ఫిబ్రవరి 11వ తేదీన జారీ చేసిన 2019-20 సిరీస్ IX సార్వభౌమ పసిడి బాండ్లను ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం కల్పించారు. ఈ బాండ్లను సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ.4020కు జారీ చేశారు. ఆఫ్ లైన్లో కొనుగోలు చేస్తే రూ.4070కి లభించాయి. వీటి ముందుస్తు ఉపసంహరమ ధరలను ఆగస్టు 6, ఆగస్టు 7, ఆగస్టు 10, 2026 రోజుల్లోనే బంగారం ధరల సగటు ఆధారంగా గ్రాముకు రూ.14,957గా నిర్ణయించారు. అంటే రూ.14,957- రూ.4020= రూ.10,937 లాభం వచ్చినట్లవుతుంది. అంటే 272.06 శాతం మేర లాభాలు అందించింది. ఇందులో లక్ష రూపాయలు పెట్టిన వారికి ఇప్పుడు రూ.3.72 లక్షలకు పైగా వస్తాయి.అలాగే 2020, జులైలో జారీ చేసిన 2020-21 సిరీస్ V సావెరిన్ గోల్డ్ బాండ్లను ప్రీమెచ్యూర్ రిడంప్షన్ కోసం అవకాశం కలిపిస్తున్నారు. వీటిని జారీ చేసినప్పుడు గ్రాముకు రూ.5284గా ఉంది. ఇక ప్రీమెచ్యూర్ రిడంప్షన్ ధరను ఆగస్టు 6, 7,10, 2026 తేదీల్లోని సగటు ధర ఆధారంగా రూ. 14,957గా నిర్ణయించారు. దీని ప్రకారం రూ.14,957-రూ.5284= రూ.9,673 లాభం వచ్చినట్లయింది. అంటే దాదాపు 183.05 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇందులో లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.2.83 లక్షలు వస్తాయి.ఆపైన వడ్డీ

ఇరాన్ పై భారీ సైనిక చర్యలు చేపడతామని గర్జించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు ఈ వివాదం నుంచి సురక్షితంగా బయటపడేందుకు దారులు వెతుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధిని పూర్తికా తెరిస్తే.. అణు ఒప్పందం కుదరకపోయినా సరే దానినే పెద్ద విజయంగా ప్రదర్శించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. అణు ఒప్పందం లేకుండానే ఇరాన్ ఉద్రిక్తతల నుంచి వైదొలిగేలా డొనాల్డ్ ట్రంప్ తన సీనియర్ సహాయకులతో రహస్యంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.అమెరికాలో జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తాజా షాక్..! ఇక వారందరికీ చెక్..!హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు ప్రపంచ చమురు రవాణాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన హార్ముజ్ జలసంధిని అడ్డుకోగలిగే సామర్థ్యం ఉండటం ఇరాన్ కు బలంగా మారింది. క్షిపణులు, డ్రోన్ దాడులకో వాణిజ్య నౌకలను అడ్డుకోవడం వల్ల అంతర్జాతీయ చమురు మార్కెట్లో తీవ్ర అస్థిరత ఏర్పడింది. నావికా దిగ్బంధనాలు, సుంకాలు విధించడం ద్వారా అమెరికాను డిఫెన్స్ లో పడేసేందుకు ఇరాన్ ప్రయత్నించగా.. దానికి అమెరికా అంగీకరించనప్పటికీ.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది.ఇరాన్ పెట్టిన కఠినమైన షరతులు యుద్ధాన్ని ముగించి హార్ముజ్ జలసంధిని తెరవాలంటే అమెరికా కొన్ని కఠిన నిబంధనలను పాటించాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహమ్మద్ బాకర్ మాట్లాడుతూ.. అమెరికా నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని, ఆ ప్రాంతం నుంచి తమ సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆంక్షలు తొలగించి.. జప్తు చేసిన ఇరాన్ ఆస్తులను తిరిగి ఇవ్వడమే కాకుండా యుద్ధ నష్టపరిహారం కూడా చెల్లించాలని షరతులు విధించారు.రష్యా నుంచి భారత్‌కు నేరుగా రైలు? ఇక హార్ముజ్ ఇబ్బందులకు చెక్!అమెరికాపై పెరిగిన ఒత్తిడి మరోవై డొనాల్డ్ ట్రంప్ పై సొంతం దేశంలోనే తీవ్ర రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా మధ్యంతర ఎన్నికలకు కేవలం 3 నెలల సమయం మాత్రమే ఉండటం

నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీకి (Ali) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది, నటుడు, మాజీ వైసీపీ నాయకుడు అలీకి (Ali) సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 2019లో వైసీపీలో చేరిన ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవి ఇచ్చారు. అయితే చేసిన సేవకు గుర్తింపు లేదని గ్రహించి 2024లో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. పార్టీని వదిలేయడానికి గల కారణాలు చెబుతున్న ఓ వీడియో రెండ్రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. అనుకోని పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్లారు. ఏదీ అశించకుండా వైసీపీలోకి వెళ్లాను. ఏదన్నా ఆశించి ఉంటే ఒకటి, రెండేళ్లల్లో బయటకు వచ్చేసేవాడిని. నా పని మానుకుని వెళ్లి ఎన్నికల సమయంలో ఆ పార్టీకి ఎంతగా ప్రచారం చేశానో జనాలకు తెలుసు. అక్కడ నాకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేస్తే ఏ మనిషికైనా ఎలా ఉంటుంది? బాధగా ఉంటుందా లేదా? నాకు అన్నం పెట్టింది సినిమా! రాజకీయం, ఏ రాజకీయ నాయకుడు కాదు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా నాకు మంచి గుర్తింపే ఉంది. ఇంత పేరున్న నన్ను వాడుకుని, గుర్తింపు లేకుండా కరివేపాకులా తీసి పారేస్తే బాధ కలిగింది. అది అనుభవించాను కాబట్టే నాకెందుకు ఈ రాజకీయం అనుకున్నాను. నా పని నాకుందిగా అనిపించింది. ఈ రాజకీయాలు వద్దు అనుకుని నిర్ణయించుకుని బయటకు వచ్చేశా. అందుకే మళ్లీ నా పనిలోకి నేను వచ్చేశా’ అని అన్నారు