
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ ప్రతీ చిన్న వార్త నెట్టింట సంచలనమే సృష్టిస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకొనే నటించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అసలు సందీప్, దీపికా మధ్య ఏం జరిగింది? ఆమెను ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పించారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతూ తాజాగా ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా సంచలన విషయాలు బయటపెట్టారు.
'స్పిరిట్' నుంచి దీపికా పదుకొనేను తీసేయడంపై ఇన్నాళ్లూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ, రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి షాకింగ్ నిజాలు వెల్లడించారు.
సందీప్ రెడ్డి వంగ ఏదైనా ఒక సినిమా అనుకున్నారంటే.. పాత్రల విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'స్పిరిట్' కథ రాసుకుంటున్న సమయంలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆయన మొదట అనుకున్నది దీపికా పదుకొనేనే. సుమారు సంవత్సరంన్నర పాటు సందీప్, దీపికా ఈ సినిమా స్టోరీ డిస్కషన్స్‌లో ట్రావెల్ చేశారు. ఆమె టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే అంత సమయం కేటాయించారు. అయితే, ఆ సమయానికి దీపికా నటించిన రెండు భారీ బాలీవుడ్ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద రికార్డు హిట్లుగా నిలిచాయి. దాంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఆ హిట్ల తర్వాత దీపికా వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని ప్రణయ్ రెడ్డి తెలిపారు. కేవలం భారీ రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా.. సినిమా లాభాల్లో ఏకంగా 10 శాతం ప్రాఫిట్ షేర్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసిందట. దాంతో పాటు షూటింగ్ డేట్స్, రోజువారీ కాల్షీట్ టైమింగ్స్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కానని కండీషన్స్ పెట్టింది.
సరే, ఒక స్టార్ హీరోయిన్ అంత డిమాండ్ చేసినా బిజినెస్ పరంగా ఓకే అనుకోవచ్చు. కానీ, అసలు సమస్య అక్కడ రాలేదు. కథా చర్చల సమయంలో సందీప్ రెడ్డి సీక్రెట్ గా ఉంచాలనుకున్న కొన్ని కీలకమైన ప్రాజెక్ట్ డీటైల్స్‌ను దీపికా కావాలనే బయటకు లీక్ చేయించిందట. ఒక సినిమా విజయంలో ప్రమోషన్ ప్లానింగ్, కంటెంట్ సీక్రెసీ ఎంత కీలకమో సందీప్ రెడ్డికి బాగా తెలుసు. అలాంటిది సినిమా మెయిన్ ప్లాన్స్ అన్నీ ఇలా లీక్ అవ్వడం చూసి వంగ బ్రదర్స్ తీవ్రంగా అప్సెట్ అయ్యారట.
దీపికా ప్రవర్తన వల్ల తమ ప్లాన్స్ అన్నీ తారుమారవుతున్నాయని గ్రహించిన సందీప్ అండ్ ప్రణయ్.. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ సినిమా ప్రొడక్షన్ డిసిప్లిన్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఆమెను ప్రాజెక్ట్ నుంచి పక్కన పెట్టేశారు. ఆ తర్వాతే వేరే ప్రత్యామ్నాయ హీరోయిన్ల వేట మొదలుపెట్టినట్లు ప్రణయ్ రెడ్డి స్పష్టం చేశారు.
Prabhas, Spirit Movie, Sandeep Reddy Vanga, Deepika Padukone, Pranay Reddy Vanga
రవితేజ 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ.. అనుకున్నదే జరిగింది.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.




