
SGB Returns: సార్వభౌమ పసిడి బాండ్ల (Sovereign Gold Bonds)లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్. 5 ఏళ్ల కాలపరిమితి పూర్తయిన రెండు నిర్దిష్ట ఎస్జీబీ సిరీస్లకు సంబంధించి ఆగస్టు 11న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రీ మెచ్యూర్ రిడంప్షన్ (premature Redemption) అవకాశం కల్పించింది. ఈ మేరకు రెండు పసిడి బాండ్లకు సంబంధించిన ముందస్తు ఉపసంహరణ ధరలను తాజాగా ప్రకటించింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.3.72 లక్షల వరకు వస్తాయి. మరి ఆ రెండు బాండ్లు ఏవి? వాటి ధరల వివరాలు తెలుసుకుందాం.ప్రీమెచ్యూర్ రిడంప్షన్కు వచ్చిన 2 బాండ్లు2020 ఫిబ్రవరి 11వ తేదీన జారీ చేసిన 2019-20 సిరీస్ IX సార్వభౌమ పసిడి బాండ్లను ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం కల్పించారు. ఈ బాండ్లను సరిగ్గా ఐదేళ్ల క్రితం ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ.4020కు జారీ చేశారు. ఆఫ్ లైన్లో కొనుగోలు చేస్తే రూ.4070కి లభించాయి. వీటి ముందుస్తు ఉపసంహరమ ధరలను ఆగస్టు 6, ఆగస్టు 7, ఆగస్టు 10, 2026 రోజుల్లోనే బంగారం ధరల సగటు ఆధారంగా గ్రాముకు రూ.14,957గా నిర్ణయించారు. అంటే రూ.14,957- రూ.4020= రూ.10,937 లాభం వచ్చినట్లవుతుంది. అంటే 272.06 శాతం మేర లాభాలు అందించింది. ఇందులో లక్ష రూపాయలు పెట్టిన వారికి ఇప్పుడు రూ.3.72 లక్షలకు పైగా వస్తాయి.అలాగే 2020, జులైలో జారీ చేసిన 2020-21 సిరీస్ V సావెరిన్ గోల్డ్ బాండ్లను ప్రీమెచ్యూర్ రిడంప్షన్ కోసం అవకాశం కలిపిస్తున్నారు. వీటిని జారీ చేసినప్పుడు గ్రాముకు రూ.5284గా ఉంది. ఇక ప్రీమెచ్యూర్ రిడంప్షన్ ధరను ఆగస్టు 6, 7,10, 2026 తేదీల్లోని సగటు ధర ఆధారంగా రూ. 14,957గా నిర్ణయించారు. దీని ప్రకారం రూ.14,957-రూ.5284= రూ.9,673 లాభం వచ్చినట్లయింది. అంటే దాదాపు 183.05 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇందులో లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.2.83 లక్షలు వస్తాయి.ఆపైన వడ్డీ కూడాసావెరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి బంగారం ధరలు పెరగడంతో లాభాలు రావడమే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ సైతం చెల్లిస్తుంది. పెట్టుబడి మొత్తంపై ప్రతి ఏటా 2.50 శాతం చొప్పున వడ్డీ రేటు ఇస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీని లెక్కగట్టి ఇన్వెస్టర్ల ఖాతాలో జమ చేశారు. అలాగే చివరి ఆరు నెలల వడ్డీని అసలుతో కలిసి మొత్తం ఒకేసారి ఇస్తారు.





