
కేజీల పనసకాయ
ఈటీవీ భారత్ : పదీ ఇరవై కాదు ఏకంగా 72 కేజీల పనసకాయ ఇది. కర్ణాటకలోని హసన్ జిల్లా సక్లేష్పూర్లో జరిగిన పనస, మామిడి మేళాలో ఈ దీన్ని ప్రదర్శించారు. హెబ్బనహళ్లికి చెందిన ప్రతాప్ కుమార్ దీనిని పండించారు. గిన్నిస్ బుక్ వివరాల ప్రకారం 2024లో అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ రైతు పండించిన 54.43 కిలోల పనసే ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత బరువైనది. దీంతో ఈ పనసకాయను ప్రపంచ రికార్డు కోసం పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. మక్కె రకం పనస చెట్టుకు ఏటా 60 నుంచి 80 కిలోల కాయలు కాస్తున్నాయని ప్రతాప్ వివరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు



