
డిజాస్టర్ కా బాప్ దర్శకుడితో రామ్ చరణ్ కొత్త సినిమా..? ఇంత నమ్మకం ఏంటి అన్నా..?
ramcharan A new movie for Ram Charan with Adipurush director Om Raut?ఆదిపురుష్ దర్శకుడు ఓమ్ రావత్ తో రామ్ చరణ్ కొత్త సినిమా..?
© 2026 nimisham.in

ramcharan A new movie for Ram Charan with Adipurush director Om Raut?ఆదిపురుష్ దర్శకుడు ఓమ్ రావత్ తో రామ్ చరణ్ కొత్త సినిమా..?

anumanapakshi New film from the director of DJ Tillu — Anumana Pakshi trailer impresses — releasing in theaters on September 18డీజే టిల్లు దర్శకుడి కొత్త చిత్రం.. ఆకట్టుకుంటున్న అనుమాన పక్షి ట్రైలర్.. సెప్టెంబర్ 18 న థియేటర్లలో విడుదల

దర్శకుడు తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా రూపాయనమ: మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

మీరు కూడా ఈ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ సాంగ్ చూసేయండి.. (Ajay Arasada)

చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సృష్టించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. (hanuman ansh ) కేవలం రూ.2కోట్లతో మూవీ తీస్తే, ఇప్పటికే రూ.250+ కోట్లు (గ్రాస్) (hanuman ansh collection) వసూలు చేసింది.

దర్శకుడు పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ (Pavithra Puri) బ్లూ డ్రెస్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.

వివాహం అయిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘రణబాలి’.

Director Srikanth Odela: ఏషనాగుల పాట డ్యాన్స్ పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్..

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 7 PM ప్రొడక్షన్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఇ.ఎం.ఐ టైటిల్ తో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఓ కంప్లీట్ ఎంటర్ టైనర్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్, హాస్టల్ డేస్ వంటి పలు వెబ్ సిరీస్ లతో పేరు తెచ్చుకున్న దరహాస్ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి ఫేమ్ అయిన శైలజ ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో "ఇ.ఎం.ఐ" సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, డైరెక్టర్ సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు. బైక్, కారు, మంచి ఫోన్..ఇలా ఏ వస్తువు కొన్నా ఇ.ఎం.ఐ కట్టాల్సిందే. దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంటిలో ఇ.ఎం.ఐ కష్టాలు తప్పవని అనుకోవచ్చు. ఇలా ఇ.ఎం.ఐ మీద వస్తువులు తీసుకున్న యువత ఆ ఇ.ఎం.ఐ లు కట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే కాన్సెప్ట్ తో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో పాటు కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో

భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి పేర్కొన్నారు. భారతీయ సినీ పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు గణనీయంగా మారుతున్నాయని ప్రముఖ నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి (Rana Daggubati) పేర్కొన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి సినిమాలు ఎంచుకునే ప్రేక్షకులు, ఇప్పుడు దర్శకుడి పేరు చూసి థియేటర్లకు వెళ్లే స్థాయికి చేరుకున్నారని అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన రానా.. నేటి ప్రేక్షకులు కేవలం హీరోల అభిమానులుగా కాకుండా, మంచి కథలు చెప్పే దర్శకుల అభిమానులుగా మారుతున్నారని చెప్పారు. రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాల కోసం ప్రేక్షకులు ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. ప్రస్తుతం సినిమా విజయంలో హీరోతో పాటు దర్శకుడి విజన్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని రానా అభిప్రాయపడ్డారు. ఒక దర్శకుడి గత చిత్రాల కంటెంట్‌ను నమ్మి ప్రేక్షకులు కొత్త సినిమాలకు వెళ్లడం పెరిగిందన్నారు. అందుకే దర్శకుల పేర్లు ఇప్పుడు బ్రాండ్లుగా మారుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా సినిమాల విజయాలు కూడా ఈ మార్పుకు ప్రధాన కారణమని అన్నారు. భాషల సరిహద్దులను దాటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త కథలు, ప్రత్యేకమైన మేకింగ్ అవసరమనే అవగాహన పెరిగిందని చెప్పారు
తెలంగాణ వాణిజ్య పన్నుల ఆదాయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో నమోదైన జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 69 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర మొత్తం జీఎస్టీ వసూళ్లలో నగరం ఏకంగా 91.1 శాతం వాటాను నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఆగస్టు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 20.53 శాతం పెరిగి రూ.3,956 కోట్లకు చేరాయి. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో సుమారు 5.8 లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు నమోదై ఉన్నారు. వీరిలో దాదాపు 4 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి 10 మంది నమోదిత జీఎస్టీ చెల్లింపుదారుల్లో ఏడుగురు నగరానికి చెందినవారే. ఆగస్టులో తెలంగాణ మొత్తం రూ.4,341 కోట్ల జీఎస్టీ ఆదాయం సాధించగా.. అందులో హైదరాబాద్ నుంచే రూ.3,956 కోట్లు సమకూరాయి.పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం గణనీయంగా అధికంగా ఉండటానికి నగరంలో అధిక విలువ కలిగిన ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్, ఔషధ, రియల్ ఎస్టేట్ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో పెద్ద మొత్తంలో పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో నమోదిత పన్ను చెల్లింపుదారుపై సగటు జీఎస్టీ వసూళ్లు సుమారు రూ.98,900గా ఉండగా.. రాష్ట్ర సగటు రూ.74,845గా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో తెలంగాణ పరోక్ష పన్నుల ఆదాయం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ, వ్యాట్ కలిపి రూ.36,636 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.31,477 కోట్లతో పోలిస్తే ఇది 16.39 శాతం అధికం. అంటే ఈ ఐదు నెలల్లో అదనంగా రూ.5,159 కోట్ల ఆదాయం సమకూరింది.ఏప్రిల్-ఆగస్టు 2025లో రూ.17,414 కోట్లుగా
Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్‌లను పూర్తిగా నిషేధించారు. విండ్‌షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాల్లో ( toll plaza) వాహనదారుల నుంచి ఫాస్టాగ్ ద్వారా కట్ అవుతున్న డబ్బుల్ని అక్రమ సాఫ్ట్ వేర్లు, యాప్ లు వాడి తమ ఖాతాలకు మళ్లిస్తున్న వైనం వెలుగుచూసింది. టోల్ ప్లాజాల్లో సాగుతున్న ఈ దోపిడీ ద్వారా (Toll Fraud ) మనీలాండరింగ్ సాగుతుందని గుర్తించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) రంగంలోకి దిగింది. ఇవాళ పలు రాష్ట్రాల్లో ఉన్న 14 టోల్ ప్లాజాల్లో తనిఖీలు చేపట్టింది. ఇందులో భారీగా అక్రమాలను గుర్తిస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ సాఫ్ట్ వేర్లను, సామాగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిధిలోని వివిధ టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న భారీ ఆర్థిక అక్రమాలపై ఈడీ ఉక్కుపాదం మోపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇవాళ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈడీ లక్నో జోనల్ కార్యాలయ అధికారులు వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా తో పాటు దేశ రాజధాని ప్రాంతం పరిధిలోని మొత్తం 14 కీలక ప్రదేశాలలో ఈ తనిఖీలు ఏకకాలంలో కొనసాగాయి. సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!మోసపూరిత మార్గాల్లో భారీ ఎత్తున టోల్ వసూళ్లు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగారు. నిందితుల నుంచి దొరికిన కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఈ ఏడాది జనవరి 22 నాటి ఎఫ్ఐఆర్, మే 19 నాటి ఈసీఐఆర్ ఆధారంగా కొనసాగుతున్న ఈ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. కొందరు నిందితులు అనధికారిక సాఫ్ట్వేర్ యాప్స్ ను వినియోగించి నకిలీ

నటి నిత్యామీనన్ ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నటి నిత్యామీనన్ (Nithya Menen) ఇటీవలే తన సొంత నిర్మాణ సంస్థ ‘కేయూరి ప్రొడక్షన్స్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. డీకే, విక్రమ్ కె.కుమార్‌తో కలిసి తొలుత ఆమె ఫాంటసీ డార్క్ కామెడీ మూవీ నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో నిర్మించబోయే మొదటి చిత్రం గురించి అప్డేట్ ఇచ్చారు ఆమె. ఈ సినిమాకు డీకే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు. గతంలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లియో విజన్, హీరోయిన్ నిత్యామేనన్‌కు చెందిన కేయురి ప్రొడక్షన్స్ కలిసి 'ప్రొడక్షన్ నెం.5' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీలో నిత్యామేనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అభిమానులకు విభిన్నమైన సినిమాటిక్ అనుభూతి అందించేలా ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని, త్వరలోనే టైటిల్ టీజర్‌ను విడుదల చేస్తామని అన్నారు. ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాతో అందరూ ప్రేమలో పడతారు’ అని పేర్కొన్నారు. కాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు

ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన ఆత్మకథ ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’పై కీలక ప్రకటన చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ (A. R. Rahman) అభిమానులకు శుభవార్త చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని అన్నారు. రచయిత్రి రూపా చక్రవర్తి (Rupa Chakravarti) తో కలిసి తాను రాయబోయే ఆత్మకథ గురించి ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ‘రెహ్మాన్: ఏ రెనైసాన్స్’ (Rahman A Renaissance) అనే పేరుతో రాయనున్న పుస్తకం కోసం రూపా చక్రవర్తి, తాను రచయితలుగా కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఈ పుస్తకంలో ‘నా ప్రపంచాన్ని తీర్చిదిద్దిన సంగీతం, ఆలోచనలు, సవాళ్లు, ప్రభావాలు, సృజనాత్మక ప్రయాణంపై మీకు పూర్తి అవగాహన కల్పిస్తుంది’ అని పేర్కొన్నారు

ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు సందీప్ పై హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఈ రోజు తెల్లవారుజామున గచ్చిబౌలి ఓఆర్ ఆర్ నుంచి ఖాజాగూడ వైపు వస్తున్న ఒక ఇన్నోవా కారు ఒక వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవా కారు డ్రైవర్ గాయపడిన వ్యక్తిని తన చేతుల మీదుగా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు. సందీప్ కాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ వైపు వెళ్తున్నాడు.ఆ క్రమంలోనే సందీప్ కారు ఆ ఇద్దరి వ్యక్తులని ఢీ కొట్టింది. దీంతో ఇన్నోవా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడగా గాయాలపాలైన వ్యక్తి మాత్రం చనిపోయాడు. ఘటనా సమయంలో సందీప్ సందీప్ కారు నడిపినట్టుగా తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సందీప్ ని మరింతగా విచారిస్తున్నారు. సందీప్ తల్లి ప్రముఖ నటి వాసుకి. తొలిప్రేమలో పవన్ కళ్యాణ్ కి సోదరురాలిగా చేసింది. రీసెంట్ గా ఘట్టమనేని జై కృష్ణ శ్రీనివాస మంగాపురంలో చేసి మెప్పించింది. ఆనంద సాయి అయితే పవన్ కళ్యాణ్ కి బెస్ట్ ఫ్రెండ్ తో పాటు చిన్న నాటి స్నేహితుడు. తెలుగు చిత్ర సీమలో ఎన్నో హిట్ సినిమాలకి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసాడు. ప్రీవియస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఇది కిక్ అంటే: సంక్రాంతి బరిలో విజయ్ సేతుపతి, సాయిపల్లవి

సాక్షి, హైదరాబాద్: రాయదుర్గంలో హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఓఆర్ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఘటన జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న నందులాల్‌ను ఇన్నోవా కార్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. నందులాల్‌ను కారుతో ఢీకొట్టిన సందీప్.. ఆగకుండా వెళ్లిపోయాడు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు) యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు) పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు) యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు) పోలీసుల తీరుపై కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప శ్రీ వాణి పాపం ఆ లీడర్ పరిస్థితి సైలెంట్ గా సైడ్ కు నెట్టేసిన చంద్రబాబు

దేశవ్యాప్తంగా యూపీఐ ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే లక్షలాది మంది చిన్న వ్యాపారులకు త్వరలోనే పెద్ద సమస్య వచ్చిపడేలా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించిన రీ-కేవైసీ (Re-KYC) గడువు సెప్టెంబర్ 15తో ముగియనుండటమే దీనికి కారణం. నిర్ణీత సమయంలోగా కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోతే క్యూఆర్ కోడ్స్ , సౌండ్‌బాక్స్‌ల ద్వారా జరిగే పేమెంట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందనే వార్తలు పేమెంట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.పేమెంట్ రంగ నిపుణుల అంచనా ప్రకారం.. వీధుల్లో, చిన్న చిన్న షాపుల్లో యూపీఐ క్యూఆర్ కోడ్లు వాడే ఆఫ్‌లైన్ చిన్న వ్యాపారుల్లో దాదాపు 30 నుంచి 35 శాతం మంది ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. అంతేకాకుండా, ఆన్లైన్లో చిన్న వ్యాపారాలు చేసుకునే మరో పది లక్షల మంది కూడా తమ అకౌంట్ల వెరిఫికేషన్ పూర్తిచేయడంలో వెనుకబడి ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌లో ఆర్బీఐ జారీ చేసిన నూతన నిబంధనల ప్రకారం ఆన్లైన్, ఆఫ్‌లైన్, విదేశీ పేమెంట్ సేవలు అందించే అన్ని కంపెనీలు సెప్టెంబర్ 15, 2026 నాటికి తమ వ్యాపారుల అందరి రీ-కేవైసీ పూర్తిచేయడం తప్పనిసరి. పొరపాటున వేరేవాళ్లకు డబ్బులు పంపారా? వెంటనే ఇలా చేస్తే మీ సొమ్ము వాపస్!చిల్లర కొట్టు యజమానులకే అసలు కష్టం!ఈ కేవైసీ నిబంధనల వల్ల ప్రధానంగా అసంఘటిత రంగంలో ఉన్న చిన్న చిన్న కిరాణా కొట్టు యజమానులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్బీఐ అడిగే డాక్యుమెంట్స్ వీరిలో చాలామంది దగ్గర లేకపోవడం, అలాగే ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే సౌండ్‌బాక్స్ వాడుతున్న వారిలో 85-90 శాతం మంది కేవైసీ పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, కేవలం క్యూఆర్ కోడ్ బోర్డులు మాత్రమే వాడే చిన్న వ్యాపారులే దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడేలా ఉన్నారు.RBI ఆటాడకపోతే రూపాయి పరిస్థితి ఏంటి? చమురు దెబ్బకు

Kaaka : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కాకా మూవీపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. కాకా మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్లో నటించబోతున్నారని టాక్. ఒక పాత్రలో ప్రస్తుత వయసుకు తగ్గ మెచ్యూర్డ్ లుక్‌లో కనిపిస్తే..మరో పాత్రలో యంగ్ చిరంజీవిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో చిరు రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించడం ఈ టాక్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ముఖ్యంగా యంగ్ చిరంజీవి లుక్, స్టైల్, యాక్షన్ మోడ్‌లో కనిపించే తీరు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. Lirisha Reddy : పట్టులో సరళత, గులాబీ రంగులో అందం.. చీరలో సూపర్ ఉమెన్ సింగారం.. లిరీష క్యూట్ ఫోటోలు.. ఈ యంగ్ చిరు పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్ కోసం మాత్రమే కాకుండా.. కథలో చాలా కీలకంగా ఉంటుందని టాక్. ఇప్పటివరకు మెగాస్టార్‌ను చూడని సరికొత్త గెటప్, స్టైలింగ్‌తో దర్శకుడు బాబీ చిరు రోల్‌ను డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు సింపుల్‌గా కనిపించే పాత్ర..మరోవైపు గతంలో గన్స్ పట్టుకుని మాస్ యాక్షన్‌లో కనిపించే యంగ్ చిరు..ఈ రెండు షేడ్స్ మధ్య వచ్చే కథ, ట్విస్ట్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయని అంటున్నారు. ఇదే నిజమైతే మెగాస్టార్ అభిమానులకు కాకాలో డబుల్ ట్రీట్ ఖాయమనే చెప్పాలి. ముఖ్యంగా యంగ్ చిరంజీవిని కొత్త టెక్నాలజీతో తెరపై ప్రెజెంట్ చేసే విధానం సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది
దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా, వైవిధ్యమైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు జీవీ ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటిస్తూ, తన వ్యక్తిగత జీవితంపై చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గాయని సైంధవితో పెళ్లి బంధం ముగిసినప్పటికీ, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి జీవీ ప్రకాష్ తొలిసారిగా మనసు విప్పి మాట్లాడారు. తమ మధ్య వైవాహిక జీవితం ముగిసినంత మాత్రాన శత్రువులుగా మారాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన స్కూల్ ఫ్రెండ్స్ కావడం వల్ల ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ తగ్గిపోదని తెలిపారు. అందుకే విడాకులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ మంచి మిత్రులుగా రిలేషన్ మెంటైన్ చేస్తున్నామని సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు అన్వి బాధ్యతల గురించి కూడా జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ కూతురు అన్వి తన ప్రాణమని, ఆమె భవిష్యత్తు కోసం ఇద్దరం బాధ్యతగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. జీవితంలో సైంధవి, అన్వి ఇద్దరూ తనకు ఎంతో కీలకమైన వ్యక్తులని, ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించుకుంటూ పాప పెంపకం విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇదివరకు తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆదర్శవంతమైన జంటగా పేరొందిన జీవీ ప్రకాష్, సైంధవిలు ఒకరినొకరు ప్రేమించుకుని 2013లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల దాంపత్య జీవితం తర్వాత మనస్పర్థల కారణంగా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించారు. విడిపోయిన సమయంలో మీడియాలో రకరకాల రూమర్లు వచ్చినప్పటికీ, వారు ఎంతో పరిణతితో వ్యవహరించారు. సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న జీవీ

ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ఓవర్ నైట్ బిజియెస్ట్ కంపోజర్‌గా మారాడు సాయి అభ్యంకర్. డైరీలో మైల్డ్ బ్లోయింగ్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆల్బమ్స్ కంటిన్యూ చేస్తున్నాడు ఈ యంగ్ బాయ్. ఇండిపెండెంట్స్ సాంగ్స్ కోసం రైజింగ్ అండ్ యూత్‌లో అటెన్షన్ పే చేస్తున్న బ్యూటీల్నే గ్రాబ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తమిళంలో క్లికైన భామలే అతడి టార్గెట్. ఆసా కూడాలో ప్రీతి ముకుందన్తో స్టెప్పులేయించిన సాయి.. ఆ తర్వాత సితిరి పుత్తిరిలో మీనాక్షి చౌదరిని పట్టుకొచ్చాడు. వీజీ వీకూరలో శాన్వీ మేఘనతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది పావళ మల్లి సాంగ్ కోసం టాలీవుడ్ అండ్ కోలీవుడ్ యూత్ క్రష్ కయాద్ లోహార్తో కలిసి మాస్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు సాయి అభ్యంకర్. తాజాగా మరో ఇండి ఆల్బమ్ రిలీజ్ చేశాడు నూనుగు మీసాల కుర్రాడు. ఈ సారి భాగ్యశ్రీ బోర్సేతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. రాధిమా బ్రేకప్ సాంగ్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ ఆల్బమ్‌కు తన మాజీ ప్రేయసి పేరైన “రాధిమా” అని పేరు పెట్టాడట 21 ఏళ్ల యంగ్ బాయ్. పేరుకు బ్రేకప్ సాంగ్ కానీ చూసేందుకు రొమాంటిక్ సాంగ్‌ను తలపిస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. డ్యూడ్, కరుప్పు చిత్రాలతోతో ఫ్రూవ్ చేసుకున్న 21 ఇయర్స్ యంగ్ కంపోజర్ సాయి ఖాతాలో దాదాపు పది సినిమాలున్నాయి. అందులో మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిల్మ్ ‘రాకా’ కూడా ఒకటి. ఫస్ట్ కమిటైన ఫిల్మ్ బెంచ్ ఇంకా రిలీజ్ కాకుండా బోలెడు ఆఫర్స్‌తో స్టార్ కంపోజర్స్‌కు స్ట్రాంగ్ కాంపిటీటర్ అవుతున్నాడు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లైవ్ కాన్సర్ట్స్ అని, మ్యూజిక్ ఈవెంట్స్ అంటూ ఫోకస్ పెడితే ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనే ఫేమ్ తెచ్చుకుంటున్నారు స్టార్ కిడ్. తన ఇండివిడ్యువల్స్ సాంగ్స్‌తో క్రేజీ హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని హీరో కావాలన్న కోరికను ఫిల్ చేసుకుంటున్నాడు హరిణీ అండ్ టిప్పుల ముద్దుల కిడ్

తెలంగాణలో సీఆర్ఐఎఫ్ రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. హైదరాబాద్, ఆగస్టు 22: రాష్ట్రంలో సీఆర్ఐఎఫ్ (CRIF) రోడ్లు, సేతుబంధన్, రైలు ఓవర్ బ్రిడ్జ్ (ROB) పనుల్లో వేగం పెంచాలని ఉన్నతాధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. శనివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పనుల పురోగతి మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 3,918 కి.మీ రోడ్లకు రూ.5,159 కోట్లతో 316 పనులు మంజూరు అయ్యాయని వివరించారు. 2025-26లో రూ.868 కోట్లతో 422.36 కి.మీ రోడ్ల పనులు చేపట్టామని తెలిపారు. హై లెవెల్ బ్రిడ్జిలు, ROB పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. మిర్యాలగూడ, నంది పహాడ్ బ్రిడ్జి పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నార్కట్‌పల్లి బ్రిడ్జి పనుల పురోగతిపై ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో మరింత కష్టపడి పని చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. 2026, డిసెంబర్ నాటికి సచివాలయంలో సోలార్ కార్ పార్కింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో సోలార్ కార్ పార్కింగ్ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సోలార్ పార్కింగ్తో సచివాలయానికి 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు. దీంతో నెల వారీ విద్యుత్ బిల్లులో 16 శాతం ఆదా అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల దూసుకొచ్చిన కొండచిలువ.. పర్యాటకులకు షాక్.. వీడియో వైరల్

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. భారతీయ సినిమాను సరికొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌గా సక్సెస్ అయిన ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి డిఫరెంట్ జోనర్ మూవీస్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ.. ‘మహావీర్ కర్ణ’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రమేష్ వర్మ.. ఇప్పుడు సరికొత్త జోనర్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మహాభారతంలోని చిరస్మరణీయమైన కర్ణుడి కథను ఆధారంగా చేసుకుని ‘మహావీర్ కర్ణ’ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ ఓ వినూత్నమైన హైబ్రిడ్ లైవ్ యాక్షన్ ఫార్మాట్లో రూపొందించనున్నారు. లైవ్ పెర్ఫార్మెన్స్‌లోని భావోద్వేగ బలాన్ని, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ అందించే అపారమైన అవకాశాలను కలిపి ఈ చిత్రాన్ని సరికొత్త అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే అంశం కర్ణుడి కథనే ఈ చిత్రానికి భావోద్వేగ కేంద్రంగా ఎంచుకోవడం. కర్ణుడి కథ కేవలం కీర్తి కోసం పోరాడిన ఓ యోధుడి కథ మాత్రమే కాదు.. అన్నింటికంటే ఎక్కువగా తన మాటకే విలువ ఇచ్చిన ఓ మహా వీరుడి కథ. కుంతీ దేవికి జన్మించినప్పటికీ రాజకుటుంబానికి దూరంగా పెరిగిన కర్ణుడు.. జీవితాంతం తిరస్కారం, విధివశాత్తు తన అసలు గుర్తింపును కోల్పోవటం వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ.. తనను నమ్మిక వ్యక్తులు, సిద్ధాంతాల పట్ల మాత్రం ఎప్పుడూ దృఢమైన విధేయతను చూపించాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, తన అపారమైన దానగుణంతో వీరుడైన కర్ణుడు తనలోని ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. తాను ఇచ్చిన మాటను తప్పడం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PM Kisan Fund: రాఖీ పండగ సందర్భంగా పీఎం కిసాన్ నిధుల విడుదలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ పిఐబి స్పష్టతనిచ్చింది. రాఖీ పండగ రోజుల రైతుల అకౌంట్లో 4000వేల రూపాయలను జమ చేస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చి చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్స్ తో వస్తున్న ఆ వీడియోలను పూర్తిగా ఫేక్ అని.. ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోకూడదని హెచ్చరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నట్లు ఓ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో రైతుల అకౌంట్లో ఏకంగా 4000 రూపాయలు జమ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇలాంటి ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాఖీ పౌర్ణమి పండగ కానుకగా ఎలాంటి ప్రత్యేక నిధులు లేదా అదనపు మొత్తాలు విడుదల చేస్తున్నట్లు కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఒక నిర్దిష్ట విడతల విధానాన్ని అనుసరిస్తుంది. ఈ విధానం కింద, కేంద్ర ప్రభుత్వం జూన్ 20న పీఎం కిసాన్ నిధి 23వ విడతను విజయవంతంగా విడుదల చేసింది. ఈ నిధులు డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అప్పటి నుండి, తదుపరి 24వ

ఇండిపెండెంట్ ఆర్టిస్టులను ప్రోత్సహించే తరుణంలో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి గారు ఇటీవల లేథోవిస్ అనే మ్యూజిక్ లేబుల్ ప్రారంభించడం జరిగింది. ఈ లేబుల్ ద్వారా ఇప్పటికే నాలుగు పాటలు ఆ పాటలు మ్యూజిక్ లవర్స్ నుండి అద్భుతమైన ఆదరణను పొందాయి. కొన్ని నెలల క్రితం ఏర్పాటు చేసిన ఈ లేబుల్ ద్వారా వచ్చిన తొలి గీతం ముమ్ముకుస్సు వివిధ భాషలలో రావడంతో ప్రత్యేక ఆదరణ లభించింది. ఆ తర్వాత వచ్చిన రాసింది కీరవాణి కూసింది చంద్రబోస్ అంటూ సాగే పాటకు గాయని లిప్సిక తన గాత్రం అందించారు. ఆ తరువాత వచ్చిన రాహుల్ సిప్లిగన్జ్ సర్పంచ్ కూతురు వైరల్ గా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ లేబుల్ నుండి వచ్చిన నాలుగవ పాట అన్‌ఫైర్ లైఫ్ ఒక వినూత్న విధంగా షార్ట్ ఫిలిం తరహాలో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లేబుల్ నుండి వచ్చిన 5వ పాటను ప్రముఖ మలయాళ సింగర్ సితార కృష్ణకుమార్ గారు పాడటం మరొక సంచలనం. ఆమెతో కలిసి కీరవాణి గారు తొలిసారి వీడియోలో కనిపిస్తూ రానున్న సాంగ్ చాయురంగ్. ఈ నెల 28న విడుదలకు సిద్ధమవుతున్న ఈ పాటకు సంబంధించిన పోస్టర్ విడుదల చేయడంతో ఈ పాట పై ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ నుండి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి వచ్చిన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించడంతో ఈ పాట ఎలా ఉండబోతుందో అంటూ అందరూ ఈ పాటపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఈ పాట గురించి తెలిసిన వారంతా ఈ పాట కీరవాణి గారి మనసులో నుండి పుట్టుకు వచ్చిన పాటగా చెప్తున్నారు. దీనితో ఈ పాట ఏ స్థాయిలో ఉండబోతుందో అంటూ ప్రేక్షకులలో మరింత అంచనాలు పెరిగాయి. అంతేకాక ఈ లేథోవిస్ మ్యూజిక్ లేబుల్ నుండి మరెన్నో పాటలు రానున్నట్లు, రాబోయే కొన్ని

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ హత్య వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం మెరుపు దాడులు చేపట్టారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ప్రధాన నిందితుడు దస్తగిరి ఇళ్లలో, ఆఫీసులలో ఒకేసారి రైడ్స్ నిర్వహించారు. తెలంగాణలోని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కడప ప్రాంతాల్లో ఏకకాలంలో మొత్తం 7 చోట్ల జరిపిన ఈ సోదాల్లో లెక్కింపులోకి రాని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు బ్యాంకు లాకర్ తాళాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ జోనల్ పరిధిలోని ఈడీ అధికారులు నిర్వహించిన ఈ దాడుల్లో భారీగా కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ పరికరాలు లభ్యమయ్యాయి. 2019 మార్చి 15న తన సొంత నివాసంలోనే దారుణ హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసును మొదట హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారించింది. సీబీఐ దాఖలు చేసిన మూడు చార్జ్షీట్ల ఆధారంగా ఈడీ ప్రత్యేకంగా మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. సీబీఐ మోపిన చార్జ్‌షీట్‌లో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, డి.శివశంకర్ రెడ్డి, వై.సునీల్ యాదవ్ తదితరులను ప్రధాన నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఏకిపారేసిన వైఎస్ అవినాష్ రెడ్డిహత్య వెనుక రూ.40 కోట్ల సుపారీ డీల్?ఈడీ ప్రకటన ప్రకారం.. వివేకా హత్య వెనుక భారీ స్థాయిలో సుపారీ డబ్బులు మారినట్లు విచారణలో తేలింది. వైఎస్సార్సీపీలో వివేకానందరెడ్డి తిరిగి క్రియాశీలకం కావడం, రాజకీయంగా ఆయన ప్రభావం పెరుగుతుండటంతోనే హత్యకు ప్లాన్ వేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. డి.శివశంకర్ రెడ్డి రూ.40 కోట్లు ఇస్తామని చెప్పి ఈ కుట్ర పన్నినట్లు ఈ కేసులో అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తేలింది. ఇందులో భాగంగా రూ.5

అయితే మరి వాస్తు ప్రకారం ఇంటి ముందు బంతి మొక్కలు నాటుకోవడం మంచిదేనా? దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. హిందూ మతంలో బంతి పూలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి శుభకార్యంలో వీటిని ఉపయోగిస్తుంటారు. అంతే కాకుండా వీటిని ఇంటి గుమ్మానికి కట్టడం వలన ఇంటిలో సానుకూల వాతావరణం నింపుతుంది అంటారు. అందువలన ఇంటిలో ఈ మొక్కలు నాటుకోవడం కూడా చాలా శుభప్రదమంట. ముఖ్యంగా విష్ణుమూర్తికి , లక్ష్మీదేవికి బంతి పూల మొక్క అంటే చాలా ఇష్టం. బంతి పూలు పూజలో ఉన్నా లేదా మాలగా అమ్మవారికి సమర్పించినా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అంతే కాకుండా బంతి పూల మొక్కలు ఇంటిలో ఉన్నా చాలా మంచిదంట. ఇంటి ముందు బంతి పూల మొక్క ఉండటం వలన ఇంటిలో సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా ఆర్థికంగా , ఆరోగ్య పరంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుందంట. చాలా మంది వాస్తు దోషాలతో అనేక సమస్యలు ఎదుర్కుంటారు. అలాంటి వారు ఇంటి మందు బంతి మొక్క నాటుకోవడం చాలా శుభప్రదంట. అయితే మొక్క నాటుకునే దిశ ఎప్పుడూ కూడా సరైనదిగా ఉండాలి. ఎవరు అయితే తమ ఇంటికి ఈశాన్యంలో బంతి పూల మొక్కు నాటుకుంటారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇది చాలా శుభప్రదం. అలాగే ఇది ఇంటి వద్ద ఉండటం వలన మంచి సువాసన, పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంతోషాన్ని నింపుతుందంట. ఇక ఎవరు అయితే తమ ఇంటి ప్రధాన ద్వారానికి బంతి పూలను అలంకరిస్తారో వారి ఇంటిలో సానుకూలత పెరగడమే కాకుండా, ప్రతి కూలశక్తి ఇంటిలోకి రాకుండా అడ్డుకుంటుంది. ఇక ఎప్పుడూ కూడా బంతి మొక్కలను ఇంటిలో దక్షిణం లేదా పడమర దిశలో నాటకూడదు, ఇది చాలా అశుభకరం. నోట్ : పై సమాచారం కేవలం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సహా దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు అలాస్కాలో కుప్పకూలిన చార్టర్ విమానం.. 8మంది మృతి

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్ర దర్శకుడితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ. మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) ప్రధాన పాత్రలో ప్రతిభావంతుడైన దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘NSR’ స్పెషల్ ఇంటర్వ్యూ (NSR Special Interview)లో శివ నిర్వాణ (Shiva Nirvana) పాల్గొని సినిమా విశేషాలు, తెరవెనుక అనుభవాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో విడుదలైన ‘మల్లెపూల పల్లకి’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో అయ్యప్ప భక్తుల భజనలలో శాశ్వతంగా నిలిచిపోయేలా జీవీ ప్రకాష్ కుమార్‌తో కలిసి ప్రత్యేక శ్రద్ధతో పాటలను డిజైన్ చేశామని శివ తెలిపారు. ఈ సినిమా కథ పుట్టుక గురించి చెబుతూ.. ‘‘41 రోజుల పాటు అయ్యప్ప స్వామి మాలలో ఉండే ఒక వ్యసనపరుడైన వ్యక్తి జీవితంలో జరిగే పరిస్థితులు, సంఘర్షణలే ఈ కథకు మూలం. ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు, ఒక విలన్ లేకుండా పరిస్థితుల చుట్టూ తిరిగే అత్యంత ఇంటెన్స్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. రవితేజ ఇప్పటివరకు చేయని విధంగా చాలా సహజమైన, సెటిల్డ్ నటనతో త్రినాధ్ అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు’’ అని వివరించారు. సీలేరు వంటి మారుమూల అటవీ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ కూడా లేని వాతావరణంలో చిత్రయూనిట్ మొత్తం ఎంతో సహజంగా కలిసిపోయి షూటింగ్ పూర్తి చేసుకున్నామని గుర్తుచేసుకున్నారు. పాప నక్షత్ర పాత్ర సినిమాకు ప్రాణమని, ప్రియా భవానీ శంకర్, శ్వాసిక, సాయికుమార్ తదితరుల పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని శివ నిర్వాణ ధీమా వ్యక్తం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే తెలుగుతో పాటు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. ED Raids On MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి ఉత్కంఠ రేకెత్తించే రీతిలో విస్తృత స్థాయి సోదాలు చేపట్టారు. ఏపీలోని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈడీ దర్యాప్తు ముఖ్యాంశాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన వివిధ ప్రధాన ప్రాంతాలలో ఏకకాలంలో మొత్తం 10 చోట్ల ఈడీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థికపరమైన అక్రమాలపై ఈ విచారణ కొనసాగుతోంది. ఈ తనిఖీల సమయంలో అధికారులు పలు కీలకమైన పత్రాలు, డిజిటల్ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తులకు సంబంధించిన కాగితాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతుండగా ఈ దర్యాప్తునకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీల కోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. వైఎస్సార్సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌లోని కోకాపేట ఓపెన్ స్కైస్లో ఉన్న అవినాశ్ రెడ్డి విల్లాతోపాటు పులివెందుల నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. కడప జిల్లా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో అవినాశ్ రెడ్డి ఈడీ సోదాలు కొనసాగుతున్నట్లు వివరాలు వెలువడ్డాయి. వైఎస్ వివేకానంద రెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టింది. 2020లో కేసు నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ, 2021లో మొదటి అభియోగపత్రంతోపాటు తర్వాత అనుబంధ అభియోగపత్రాలు దాఖలు చేసింది. వాటి ఆధారంగా 2025 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక కేసు నమోదు చేసినట్లు అందుబాటులో ఉన్న సమాచారం చెబుతోంది. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ఈడీ సోదాలు కేసులోని ఆర్థిక కోణాన్ని మరోసారి ప్రధాన చర్చగా మార్చాయి. అవినాశ్ రెడ్డికి సంబంధించిన ప్రాంతాలతోపాటు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, యెర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరికి సంబంధించిన ప్రాంతాల్లోనూ తనిఖీలు సాగినట్లు సమాచారం. దీంతో హత్యకు ముందు, తర్వాత జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలు దర్యాప్తులో కీలకంగా మారాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాల ప్రకారం, వివేకానంద రెడ్డి హత్య వెనుక కుట్ర ఉందని పేర్కొంటూ పలువురి పాత్రపై ఆరోపణలు చేసింది. ఇదిలా ఉండగా, హత్యకు సంబంధించి జరిగినట్లు అనుమానిస్తున్న నగదు లావాదేవీల మూలాలను గుర్తించడంపైనే అవినాశ్ రెడ్డి ఈడీ సోదాల్లో ప్రధానంగా దృష్టి ఉన్నట్లు సమాచారం. కేంద్ర దర్యాప్తు సంస్థ గతంలో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయగా, అవినాశ్ రెడ్డికి న్యాయస్థానాల నుంచి ముందస్తు బెయిల్ లభించింది. ఈ కేసులో

వివేకా హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. ఆకస్మికంగా విచారణ అధికారులు రంగంలోకి దిగారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసం కార్యాలయంతో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి నివాసాల్లో ఏక కాలంలో సోదాలు మొదలయ్యాయి. ఏపీలో నాలుగు చోట్ల, హైదరాబాద్ ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సోదాల వ్యవహారం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. తదనంతర పరిణామాల పైన చర్చ మొదలైంది.వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి పది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నారు. అలాగే అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు, ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లపైనా ఈడీ అధికారులు దాడులకు దిగారు. పులివెందులలోని దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే, పులివెందుల లోని జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల పై పవన్ కీలక ప్రకటన- జనసైనికుల ఏక కాలంలో పది చోట్ల సోదాలుమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారినట్లు అనుమానంతో ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు దస్తగిరి ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ సుదీర్ఘ విచారణ చేసింది. అవినాశ్ రెడ్డి లక్ష్యం గా వివేకా కుమార్తె సునీత కోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలు చేసింది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి, కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌లతో చేయాల్సిన ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయాయో.. తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెల్లడించారు. ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘హీరో’, ‘సర్దార్’, ‘సర్దార్ 2’ వంటి వైవిధ్యమైన థ్రిల్లర్ చిత్రాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పి.ఎస్. మిత్రన్ (PS Mithran). తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు టాప్ స్టార్స్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash)లతో చేయాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఈ ఇద్దరు దిగ్గజ హీరోలతో తాను చేయాల్సిన భారీ చిత్రాలు ఎందుకు కార్యరూపం దాల్చలేదో వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముందుగా ‘కెజియఫ్’ ఫేమ్ యశ్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను యశ్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశాను, కథ విన్న తర్వాత ఆయనకు కూడా కథ విపరీతంగా నచ్చింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. ప్లానింగ్ ప్రకారం యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా పూర్తయిన వెంటనే మా ప్రాజెక్ట్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇద్దరి డేట్స్, టైమ్‌లైన్ మ్యాచ్ కాకపోవడంతో ఈ సినిమా ప్రస్తుతానికి పట్టాలెక్కలేకపోయింది’’ అని మిత్రన్ తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో చర్చల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థతో కలిసే పూర్తి వైవిధ్యమైన కథను సిద్ధం చేసి వినిపించాను. కథ విన్న మెగాస్టార్ కూడా కథపై ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ‘విశ్వంభర’ సినిమా తర్వాత ఆయనతో ఈ ప్రాజెక్ట్ చేయాలని భావించాం. కానీ దురదృష్టవశాత్తూ డేట్స్, షెడ్యూల్స్ టైమ్‌లైన్ కొలాప్స్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వెంటనే ముందుకు తీసుకెళ్లలేకపోయాం. అయితే ఆ కథలు ఇంకా నా

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. కడప: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులకు దిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ (శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు మొదలుపెట్టింది. ఈ మేరకు దాదాపు 10 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. హైదరాబాద్, పులివెందులలోని అవినాశ్ రెడ్డి నివాసాలు సహా ఆయన కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మనీలాండరింగ్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ల కోసం వెతుకుతున్నారు. అలాగే అవినాశ్ రెడ్డి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు, ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు వివేకా హత్య కేసు నిందితుల ఇళ్లపైనా ఈడీ అధికారులు దాడులకు దిగారు. పులివెందులలోని దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఎర్ర గంగిరెడ్డి నివాసంలో తనిఖీలు జరుగుతున్నాయి. అలాగే, పులివెందులలోని జగన్ సమీప బంధు సునీల్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై మేమైతే కోర్టుకు వెళ్లం

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’. ప్రతిభ గల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రంగా ఆగస్టు 14, 2026న థియేటర్లలో అడుగుపెట్టిన ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి, ‘విశ్వనాథ్ & సన్స్’ సాధించిన విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ సినిమా ప్రయాణం వెనుక ఉన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకి ఈ స్థాయి స్పందన రావడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ కథ వినగానే సూర్య గారి రియాక్షన్ ఏంటి? కథ వినగానే సూర్య గారికి చాలా నచ్చేసింది. నిజానికి ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ కోసం చూస్తున్నారు. అదే విషయం నాకు చెప్పారు. ఈ కథ నా దగ్గర అప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఆయనకు వినిపించాను. సూర్య గారికి కథ చాలా నచ్చింది. అయితే ఈ కథకు అనవసరమైన కామెడీ లేదా కమర్షియల్ అంశాలు జోడించకుండా.. నిజాయితీగా చెబుదామని అన్నారు. అందుకే క్లైమాక్స్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాము. ముఖ్యంగా ఏ పాత్ర పడిపోకుండా జాగ్రత్త పడ్డాము. సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు సూర్య గారు చూశారు. తాను ఏదైతే నమ్మారో, అదే తెరమీద కనిపించడంతో ఆయన చాలా సంతోషపడ్డారు

బాహుబలి(bahubali) తర్వాత దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల మార్కెట్, ప్రభావం గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు సౌత్ సినిమాలను తక్కువగా అంచనా వేసిన బాలీవుడ్ వర్గాలు సైతం ఆ తర్వాత తెలుగు సినిమాల సక్సెస్‌లను సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ మార్పుపై కొందరు బాలీవుడ్ ప్రముఖులు తరచూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్(Siddharth Anandh) చేసిన ఓ చిన్న కామెంట్ మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. హైదరాబాద్‌లో జరిగిన యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Animal Pre Release Event)లో మల్లారెడ్డి(Malla Reddy) చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఫ్యూచర్ లో ఇండియన్ సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కీలక కేంద్రంగా మారుతుందని, తెలుగు సినిమాల ఆధిపత్యం పెరుగుతుందని ఆయన కామెంట్స్ ను ఆ వీడియోలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఓ నార్త్ ఇండియన్ నెటిజన్.. గేమ్ ఛేంజర్(Game changer), ది రాజాసాబ్(The Raja Saab), ఓజీ(OG), దేవర(Devara) లాంటి భారీ తెలుగు సినిమాల రిజల్ట్స్ ను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చాడు. ఈ పోస్టుకు సిద్దార్థ్ ఆనంద్ ఊప్స్ అంటూ రియాక్ట్ అవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలోనూ తెలుగు సినిమాలపై ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైన నేపథ్యంలో.. తాజా రిప్లై కూడా అదే యాంగిల్ లో ఉందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సిద్దార్థ్ ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా చెప్పకపోయినా, ఆయన ఒక్క పదం కామెంట్ మాత్రం టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ డిస్కషన్‌కు మరోసారి ఆజ్యం పోసింది

హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'కింగ్డమ్' మురుగన్: విలన్ వద్దు.. హీరో ముద్దు.! ఈ వార్తకు సంబంధించిన

సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెళ్లిపోయి కొత్తనీరు రావడం కామన్.. అచ్చం అలాగే సీనియర్ దర్శకుల ప్లేస్‌ను యంగ్ డైరెక్టర్లు భర్తీ చేస్తూ వాళ్ల మేకింగ్‌కు వారసులుగా మారుతున్నారు. సీనియర్లు మెల్లగా వేరే జోనర్స్‌కు షిఫ్ట్ అవుతుంటే.. ఆ గ్యాప్‌ను ఫిల్ చేస్తూ కుర్రాళ్లు తమదైన స్టైల్‌తో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నారు. మరి టాలీవుడ్లో ఏ సీనియర్ డైరెక్టర్ ప్లేస్‌ను ఏ యంగ్ డైరెక్టర్ రీప్లేస్ చేస్తున్నారో చూద్దామా..? ఫ్యామిలీ ఎమోషన్స్, క్యూట్ పంచ్‌లు అనగానే త్రివిక్రమ్ గుర్తుకొస్తారు.. సింపుల్ కథలతో మ్యాజిక్ చేయాలంటే ఈయనే. ఈ ప్లేస్‌ను వెంకీ అట్లూరి భర్తీ చేస్తున్నారిప్పుడు. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్‌ని త్రివిక్రమ్ గానీ తీశారా అనేంతగా తీసారు వెంకీ. త్రివిక్రమ్ నెక్ట్స్ ఎన్టీఆర్ సినిమాతో ప్యాన్ ఇండియాకు వెళ్తున్నారు.. దాంతో ఆ స్థానానికి సరైన వారసుడిగా వెంకీ అట్లూరి సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల కొంతకాలంగా ఫామ్‌లో లేరు. సరిగ్గా అదే టైమ్‌లో ఆ లోటు భర్తీ చేస్తూ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చారు. తన మార్క్ కామెడీ, యాక్షన్‌తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్తో శ్రీను వైట్ల స్టైల్‌ను కంటిన్యూ చేస్తూ ఆయన సీటును అనిల్ పర్ఫెక్ట్గా సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు విలక్షణ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుకు నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్‌గా కనిపిస్తున్నారు. కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఫాంటసీని జోడించారు నాగీ. తన అద్భుతమైన విజన్‌తో సరికొత్త సినిమాలు తీస్తూ సింగీతం గారికి వారసుడిగా ప్రూవ్ చేసుకుంటున్నారు నాగ్ అశ్విన్. చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్! యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు! వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. విశాఖపట్నం, ఆగస్టు 20: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష పద్ధతిలో జడ్పీ ఎన్నిక జరగాలంటూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ శ్రీభరత్ అభినందించారు. ఈరోజు(గురువారం) విశాఖ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఎంపీ తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేసిన అరాచకాలు నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా రికవరీ అవ్వలేదని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో మంచి ప్రతిపక్షం లేదని... ప్రతిపక్షంలో ఉన్నవారికి వారి పాత్ర అర్ధం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఎల్‌నినో వలన నీటి సమస్య తలెత్తుతోందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని డేటా సెంటర్ల వలన నీటి సమస్య వస్తోందని కొన్ని శక్తులు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డేటా సెంటర్లు రావడానికి ఇంకా రెండు సంవత్సరాలు సమయం పడుతుందని తెలిపారు. వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పోలవరం నీటిని విశాఖకు తీసుకువస్తున్నారని, నదులన్నీ అనుసంధానం అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో నీటి సమస్య తగ్గుతుందని ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు. ఏపీలో మిలాద్-ఉన్-నబి సెలవు తేదీ మార్పు.. ఎస్సీబీఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా రవిశంకర్ ఎన్నిక
మాస్ మహారాజా రవితేజ , విలక్షణ దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఇరుముడి’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమా నేపథ్యం, కథాంశం, అలాగే కథలోని విలనిజం గురించి చెప్పిన ఆసక్తకరమైన సంగతులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.* అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ఇరుముడి’ జోరు.... రవన్న ఈసారి గట్టిగా కొడుతున్నాడ్రోయ్‘ఇరుముడి’ కథకు అయ్యప్ప స్వామి భక్తి, 41 రోజుల మండల దీక్ష ప్రధాన మూలస్తంభాలని శివ నిర్వాణ తెలిపారు. చిన్నప్పటి నుంచే తనకు అయ్యప్ప స్వామిపై అమితమైన భక్తి, ప్రత్యేక అనుబంధం ఉండేవని, ఆ ఆలోచనలే ఈ కథారచనకు ప్రేరణగా నిలిచాయని వెల్లడించారు. 41 రోజుల పాటు అత్యంత నిష్ఠతో పాటించే నియమాలు ఒక సాధారణ వ్యక్తి అంతరంగాన్ని, అతని ఆలోచనా ధోరణిని ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాన్ని భావోద్వేగభరితంగా తెరపైకి తెచ్చినట్లు చెప్పారు. ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా సహజంగా, నేటి సమాజానికి దగ్గరగా ఉంటుందని దర్శకుడు వివరించారు. హీరోకి మద్యపానం అలవాటు ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల అతను అయ్యప్ప స్వామి మాల ధరించాల్సి వస్తుంది. దీక్షా నియమాల ప్రకారం మండల కాలం పాటు పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాలి. ఈ 41 రోజులు ఆ వ్యసనం నుంచి బయటపడటానికి అతను చేసే అంతర్మథనం ఏమిటి?, ఈ క్రమంలో అతని బలం, బలహీనతలు ఏమిటి?, తన ప్రాణమైన కూతురితో అతనికి ఉన్న అనుబంధంలో వచ్చిన మార్పులేంటి? అన్న భావోద్వేగ కోణంలో సినిమా సాగుతుంది’ అని శివ నిర్వాణ తెలిపారు.సాధారణంగా ఫ్యామిలీ సినిమాల్లో నిదానంగా సాగే కథనాలు ఉంటాయి. కానీ ‘ఇరుముడి’లో ఆ 41 రోజుల

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్‌ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్ కనకరాజు’కు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనతో ఇప్పుడు ఎంతో రిలీఫ్‌గా ఉందన్నారు. నటుడిగా ఒకే తరహా జానర్‌కు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని.. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావం పెరిగినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడు వారికి పూర్తిస్థాయి వినోదాన్ని అందించడం చాలా ముఖ్యమని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చిన తర్వాత తమ ఒత్తిళ్లను మరిచిపోయేలా సినిమా ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ గురించి కూడా వరుణ్ తేజ్ మాట్లాడారు. గతంలో తాను నటించిన ‘గని’లో క్రీడలతో పాటు పలు అంశాలను కలపడం వల్ల కథ కొంత గందరగోళంగా అనిపించిందని అంగీకరించారు. అయితే ‘బరి’ మాత్రం పూర్తిగా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా అని, ఇందులో స్టోరీ ఎంతో సహజంగా, వాస్తవికంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని వరుణ్ తేజ్ వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ రొమాంటిక్ చిత్రానికి అంగీకరించినట్లు వరుణ్ తేజ్ తెలిపారు. తన వయసుకు తగ్గ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని, రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నమైన శైలిలో ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. రామ్ చరణ్‌తో కలిసి సినిమా

తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వానికి భారీగా బకాయిపడిన 20 మంది మిల్లర్ల జాబితాను ఈడీకి అందజేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, ఆగస్టు 20: తెలంగాణలో ప్రభుత్వ ధాన్యం బకాయిలను భారీగా ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై సివిల్ సప్లయ్ శాఖ చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి భారీ మొత్తంలో బకాయిపడిన 20 మంది రైస్ మిల్లర్ల జాబితాను సివిల్ సప్లయ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అందజేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం బకాయిలను మిల్లర్లు ఉద్దేశపూర్వకంగా నిలిపివేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా, ధాన్యం లావాదేవీల్లో అక్రమ మార్గాల్లో నిధులు సమీకరించడం.. హవాలా రూపంలో డబ్బులు సంపాదించడం వంటి ఆరోపణలు కూడా మిల్లర్లపై ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా మిల్లర్ల ఆస్తులు, బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, ధాన్యం కొనుగోళ్లు–మిల్లింగ్‌కు సంబంధించిన రికార్డులపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 9 మంది మిల్లర్లపై పీడీ యాక్ట్‌కు రంగం సిద్ధం.. ప్రభుత్వ ధాన్యం బకాయిలను చెల్లించకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లపై కఠిన చర్యలకు పోలీస్ శాఖ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9 మంది రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం, బకాయిలను భారీగా పెండింగ్‌లో ఉంచడం, ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉండటంతో ఈ చర్యలకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది

ఇప్పుడు ఒక్క ఇండియన్ సినిమా మార్కెట్ లోనే కాకుండా ప్రపంచ సినిమా దగ్గరే భారతీయ సినిమాని సగర్వంగా ముందుకి తీసుకెళ్తున్న ఇండస్ట్రీ ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ ఇండస్ట్రీ వేసిన దారి లోనే అని చెప్పాలి. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్టార్ట్ చేసిన ట్రెండ్ తోనే ప్రపంచ వ్యాప్తంగా రీచ్ ని సొంతం చేసుకోవాలని అనేక సినిమాలు, మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో టాలీవుడ్ కొందరిలో టార్గెట్ అయ్యింది అనే మాట కూడా వాస్తవం. ముఖ్యంగా బాలీవుడ్ లో ఓ సెక్షన్ తెలుగు సినిమాలు, ఆడియెన్స్ మరియు దర్శకుల పట్ల సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ ఇంకొక సెక్షన్ మాత్రం తమ అక్కసు బయటపెట్టడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఆ లిస్ట్ లో ఇపుడు బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చేరడం సోషల్ మీడియాలో టాలీవుడ్ యువత నడుమ చర్చగా మారింది. ఆ మధ్య అనిమల్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో బాలీవుడ్ విషయంలో మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్స్ విషయంలో ఎవరో నెటిజన్ టాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు అన్నీ ప్లాప్స్ అయ్యాయని ఓ లిస్ట్ పెడితే దానికి వ్యంగ్యంగా సపోర్ట్ చేస్తూ ‘ఊప్స్’ అంటూ సిద్ధార్థ్ ఆనంద్ రిప్లై ఇచ్చాడు. దీనితో ఇక మన తెలుగు యువత తగులుకున్నారు. వార్, పఠాన్ లాంటి సినిమాలు ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి హీరోతో కింగ్ సినిమా వంటివి చేస్తున్నప్పటికీ సిద్ధార్థ్ ఆనంద్ ఎందుకు ఇలాంటి ఆలోచనా ధోరణితో ఉండిపోయాడు అంటూ సోషల్ మీడియాలో తన రిప్లైకి మరింత పదునైన రిప్లైలు అందిస్తున్నారు. అయితే మన సినిమాలు ప్లాప్ అయ్యాయి అని చెప్పిన వ్యక్తి పోస్ట్ డిలీట్ చేసుకున్నాడు కానీ సిద్ధార్థ్ రిప్లై మాత్రం ఉండిపోయింది. అయితే ఇదేమి సిద్ధార్థ్ సైడ్ నుంచి ఇది మొదటిసారి కాదు. ఆ మధ్య ప్రభాస్ ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ స్పిరిట్

తెలుగు తెరపై కుటుంబ కథాచిత్రాలను తనదైన శైలిలో ఆవిష్కరించిన దర్శకుడు రేలంగి నరసింహారావు. కుటుంబంలోని బంధాలు .. అనుబంధాలను .. తన మార్క్ హాస్యాన్ని జోడిస్తూ ఆయన రూపొందించిన సినిమాలు ఎంతో ఆదరణ పొందేవి. ఆయన దర్శకుడిగా వ్యవహరించిన సినిమాలలో చాలావరకూ విజయాలను అందుకోవడం విశేషం. అలాంటి రేలంగి నరసింహారావు తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "నేను ఎన్టీ రామారావుగారి సినిమాలకు .. అక్కినేని గారి సినిమాలకు పనిచేశాను. వాళ్లతో చాలా సన్నిహితంగా మసలుకున్నాను. సమయపాలన విషయంలో ఇద్దరూ ఇద్దరే అని చెప్పాలి. షూటింగ్ ఎక్కడ పెట్టినా .. ఏ వేళలో పెట్టినా చెప్పిన సమయానికంటే ముందుగానే అక్కడికి చేరుకునేవారు. వాళ్ల వైపు నుంచి ఎప్పుడూ ఎలాంటి ఆలస్యం ఉండేది కాదు. అంతగా వాళ్లు టైమ్ కి ప్రాధాన్యతను ఇచ్చారు. అలాంటి ఓ క్రమశిక్షణ ఈ కాలంలో చూడలేము" అని అన్నారు. "ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, 9 గంటలకు కాల్షీట్ అంటే 10:30 .. 11:00 గంటలకు సెట్ కి వస్తున్నారు. ఇక షాట్ గ్యాప్ లో కారవాన్ లోకి వెళుతున్నారు. అలా వెళ్లడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ అసిస్టెంట్లు వెళ్లి పిలవగానే రావడం లేదు. కారవాన్ లో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చోవడం వలన సమయం వృథా అవుతోంది. ఒకప్పుడు అందరం కలిసి ఒకేచోట కూర్చునే వాళ్లం. ఇక ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పై సరైన కసరత్తు చేయకుండా సెట్ కి వెళ్లడం, అక్కడ టైమ్ వేస్టు చేయడం

తమన్.. సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడితే ప్రేక్షకుడు తనకి తెలియకుండానే సీట్ లో నుంచి లేచి పూనకంతో డాన్స్ చేస్తాడు. హీరోకి గాని, ప్రతినాయకుడుకి గాని ఇచ్చే ఎలివేషన్ అయితే నభూతో నభవిష్యత్. కథ, కథనంకి తగ్గ మూడ్ తో బిజిఎమ్ ఇవ్వడంలో కూడా స్పెషలిస్ట్. తమన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సమాజంలో ఆదరణ కరువై అనాథలుగా మారుతున్న వృద్ధుల కోసం ఒక అత్యాధునిక ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం 12 కోట్లు. ఇప్పటికే 4 కోట్లు ఖర్చు చేశాను. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్ మాత్రమే కాకుండా విదేశీ, స్వదేశీ మ్యూజిక్ కాన్సర్ట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సంపూర్ణంగా ఈ వృద్ధాశ్రమ నిర్మాణానికే కేటాయిస్తున్నానని చెప్పుకొచ్చాడు. చాలా మంది ఈ మంచి కార్యక్రమానికి విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చినప్పటికీ, తమన్ ప్రేమగా తిరస్కరించడం విశేషం. సొంత కష్టార్జితంతోనే ఈ కలల ప్రాజెక్టును పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. కేవలం వృద్ధాశ్రమమే కాకుండా, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేయడం, అత్యవసర వైద్య శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం అందించడం వంటి ఎన్నో గుప్తదానాలను తమన్ ఏళ్ల తరబడి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తోటివారికి సహాయపడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్న తమన్ మానవత్వానికి సినీ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కేవలం తన అద్భుతమైన మ్యూజిక్‌తోనే కాకుండా, తన ఉదార స్వభావంతో కూడా లక్షలాది మంది అభిమానుల హృదయాలని గెలుచుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టనష్టాల నడుమ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే సమాజం నుంచి తాను

మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ (Varun Tej) ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. తెరపై తన నటనతో అభిమానులను అలరిస్తున్న వరుణ్ తేజ్ కు, కెమెరా వెనుక నిలబడి యాక్షన్ చెప్పాలనే బలమైన కోరిక ఉండేదట. అందరిలాగే హీరో కావాలనే కలతో ఇండస్ట్రీకి రాలేదని, ముందుగా ఒక దర్శకుడిగా రాణించాలనే లక్ష్యంతోనే తాను సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆయన స్వయంగా ఒక సందర్భంలో పంచుకున్నాడు. దర్శకత్వంపై ఉన్న అమితమైన ఆసక్తితోనే వరుణ్ తేజ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఒక సినిమాను తెరకెక్కించడం, తెరపై కథను దృశ్య రూపంలో ఆవిష్కరించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అయితే, కుటుంబ వాతావరణం, తోటి నటుల విజయాలు, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన నటన వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అలా దర్శకుడిగా మారాల్సిన వ్యక్తి, హీరోగా మారి తొలి సినిమా ‘ముకుంద’తో ప్రేక్షకులను పలకరించారు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తనలోని డైరెక్టర్ మాత్రం ఎప్పుడూ సజీవుగానే ఉన్నాడని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తన అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి పనిచేయాలనే బలమైన కోరిక తనలో ఉందని వరుణ్ తేజ్ మనసులో మాట బయటపెట్టాడు. ఒకవేళ భవిష్యత్తులో తాను దర్శకత్వం వైపు అడుగులు వేస్తే, రామ్ చరణ్‌ను హీరోగా పెట్టి ఒక అద్భుతమైన సినిమాను తీయాలనే ఆలోచన ఉందంటున్నాడు. రీసెంట్ గా ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో హిట్ కొట్టాడు ఈ మెగా హీరో

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఫౌజి, స్పిరిట్, కల్కి-2.. ఇలా ఆయన లైనప్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో, అలాగే కొన్ని బాలీవుడ్ సైట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. 'ఆదిపురుష్' లాంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపధ్యంలో ఓం రౌత్ ఒక కథ చెప్పారని, ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని బాలీవుడ్లో గట్టిగా ప్రచారం జరిగింది. నిజానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఏ రేంజ్లో ట్రోల్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ నుంచి నటీనటుల లుక్స్ వరకు ప్రతి విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి దర్శకుడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఓం రౌత్‌తో ప్రభాస్ కొత్త సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది. లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే

Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీ ఫిక్స్.. దసరాకు లాంచ్.! డైరెక్టర్ ఎవరంటే.? Mokshagna: నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం ఎట్టకేలకు ఖాయమైనట్లు తెలుస్తోంది. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి తాజా సమాచారం సినీ సర్కిల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ భారీ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే 'బింబిసార' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వశిష్ట ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తిగా ముగిశాయని, స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణకు ఇటీవల స్వల్పంగా గాయం కావడం, ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స జరగడం వల్ల ఈ ప్రకటన కొద్దిగా ఆలస్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్న తరుణంలో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట టేకింగ్ తో పాటు మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందనే అంశంపై టాలీవుడ్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. 2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో