
ఇంటర్నెట్‌డెస్క్‌: చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు సృష్టించిన చిత్రం ‘హనుమాన్‌ అంశ్‌’. (hanuman ansh ) కేవలం రూ.2కోట్లతో మూవీ తీస్తే, ఇప్పటికే రూ.250+ కోట్లు (గ్రాస్‌) (hanuman ansh collection) వసూలు చేసింది. ఈ వారంలో తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీకున్న క్రేజ్‌ దృష్ట్యా రూ.300 కోట్లు దాటడం చాలా సులభం. వినాయకచవితిని పురస్కరించుకుని చిత్ర దర్శకుడు విశాల్‌ చతుర్వేది (hanuman ansh Director) కొత్త సినిమాను ప్రకటించారు. ఈసారి ఆయన తులసీదాస్‌ జీవిత కథ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘రామ్‌బోలా: ది ఇమ్మోర్టల్‌ ఆఫ్‌ గోస్వామి తులసీదాస్‌’ (Tulsidas) పేరును ఖరారు చేశారు. మహవీర్‌జైన్‌ ఫిల్మ్స్‌ పతాకంపై మహవీర్‌ జైన్‌, విశాల్‌ చతుర్వేది, అమిత్‌ ఉపాధ్యాయ్‌, రఘువేంద్ర సింగ్‌లు నిర్మిస్తున్నారు. ఆధ్మాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వారిలో తులసీదాసు ఒకరు. 16వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక వేత్త, కవి. శ్రీరామ భక్తుడిగా ఆయన అందరికీ పరిచయమే. రామచరితమానస్‌ను (Ramcharitmanas) ఆయనే రచించారు. పరిస్థితుల కారణంగా చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమయ్యారు. ఎప్పుడూ రామనామ జపం చేస్తుండటంతో ఆయన్ను ‘రామ్‌బోలా’ అని పిలిచేవారు. ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ఆయన ఎన్నో మలుపులు చూశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన రామాయణం కీర్తన చేస్తున్నంత సేపు ప్రజలతో పాటు హనుమంతుడు కూడా ఒక వృద్ధుడి రూపంలో వచ్చి కూర్చుని వినేవారట. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రాగ్‌మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అనుమాన పక్షి’. ‘డీజే టిల్లు’ సినిమాతో పరిచయమైన విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ‘మహాశక్తి’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana).