తిరుమలశ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆరు రోజుల పాటూ SSD టోకెన్లు రద్దు చేశారు, మళ్లీ ఎప్పుడు ఇస్తారంటే!
Ttd Cancelled Issuance Of Ssd Tokens In Tirupati From September 14 To September 19: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేశారు. ఈ నెల 14 నుంచి 19 వరకు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు చేశారు. ఈ నెల 20న మళ్లీ ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తారు.తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం అతిథి సముదాయాల్లో మరుసటి రోజు స్లాట్లకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందేే. తిరుమలలో బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.












