
లార్జ్-క్యాప్స్ మెరుపు
23,200 పైన ముగిసిన నిఫ్టీ, 333 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!ముంబై:ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు లార్జ్-క్యాప్ షేర్లలో విలువ కొనుగోళ్లు (Value Buying) పెరగడంతో భారత ఈక్విటీ మార్క

23,200 పైన ముగిసిన నిఫ్టీ, 333 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్!ముంబై:ప్రపంచ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో పాటు లార్జ్-క్యాప్ షేర్లలో విలువ కొనుగోళ్లు (Value Buying) పెరగడంతో భారత ఈక్విటీ మార్క

గ్లోబల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీలో నమోదు కావడం విశేషం. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 2: భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) కొనుగోళ్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు పకడ్బందీ వ్యూహంతో తిరిగి భారత మార్కెట్ వైపు మొగ్గు చూపుతుండటంతో కొత్త ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల్లోనే(జూలై-ఆగస్టు) ఏకంగా 49 కొత్త ఎఫ్‌పీఐలు సెబీ(SEBI)లో నమోదు కావడం విశేషం. పెరిగిన ఎఫ్‌పీఐల సంఖ్య: 2026 మొదటి ఆరు నెలల్లో (జనవరి-జూన్) 52 ఎఫ్‌పీఐలు మాత్రమే నమోదవగా, జులై, ఆగస్టు నెలల్లో ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో భారత మార్కెట్లలో మొత్తం ఎఫ్‌పీఐల సంఖ్య 12,243కి పెరిగింది. మళ్లీ నెట్ బైయర్లు: ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రూ. 2 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పెట్టుబడిదారులు, జులై, ఆగస్టు నెలల్లో భారీగా కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.40,031 కోట్లు, ఆగస్టులో రూ.25,492 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేశారు. నెలవారీ సగటు: ఈ ఏడాది ఆరంభంలో నెలకు సగటున కేవలం 8 కొత్త ఎఫ్‌పీఐలు నమోదు కాగా, గత రెండు నెలల్లో ఆ వేగం పెరిగి నెలకు 25 కొత్త ఫండ్లు నమోదు కావడం గమనార్హం. విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో పలు కీలక సడలింపులు, నిర్ణయాలు ప్రకటించింది. 1. పన్ను మినహాయింపులు(Tax Exemptions): జూన్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సెక్యూరిటీలలో(G-Secs) పెట్టుబడి పెట్టే ఎఫ్‌పీఐలకు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వడ్డీ ఆదాయంపై పూర్తి పన్ను మినహాయింపును ప్రకటించింది. 2. FAR రూట్ విస్తరణ: లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు, గ్లోబల్ పెన్షన్ ఫండ్లు, సోవరిన్ వెల్త్ ఫండ్లను ఆకర్షించడానికి 15, 30, 40 ఏళ్ల జారీలతో

Silver: వెండి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త.. ఈ విషయం తెలుసుకోకపోతే మీకే నష్టం.. చాలామంది ఇది పట్టించుకోరు.. ఈ వార్తకు సంబంధించిన

అరటి పండు రుచిగా ఉండటంతో పాటు తక్కువ ధరకు వస్తుంది. ఈజీగా దొరుకుతుంది కాబట్టి చాలామంది అరటిపండ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే అరటిపండ్లు కొనేటప్పుడు కనిపించిన వెంటనే పసుపురంగు గుత్తిని తీసుకోవడం కంటే కొన్ని విషయాలను గమనించడం మంచిది. చాలామంది తెలియక చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల ఇంటికి తెచ్చిన అరటిపండ్లు త్వరగా పండిపోవడం, మెత్తబడటం లేదా ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం జరుగుతుంది. అందుకే అరటిపండ్లు కొనేటప్పుడు చేయకూడని తప్పులేంటో చూద్దాం. చాలామంది అరటి పండ్లు కొద్దిగా పచ్చగా ఉన్నా.. అవి పండలేదని భావించి పక్కన పెట్టేస్తారు. కానీ మీరు వెంటనే తినడానికి కాకుండా కొన్ని రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి అరటిపండ్లు కొనుగోలు చేస్తుంటే, కొద్దిగా పచ్చగా ఉన్నవి ఎంచుకోవడం మంచిది. పూర్తిగా పసుపు రంగులోకి మారిన అరటిపండ్లు ఇప్పటికే బాగా పండిన దశలో ఉంటాయి. కాబట్టి త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. పండిన అరటిపండ్ల తొక్కపై చిన్న చిన్న నల్ల మచ్చలు కనిపించడం సాధారణమే. అయితే మచ్చలు విస్తృతంగా ఉండటం, తొక్క పగిలిపోవడం, అరటిపండు నుంచి అసహజమైన వాసన రావడం లేదా లోపల భాగం అసాధారణంగా మారినట్లు కనిపించడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని కొనకపోవడం మంచిది. కానీ కేవలం ఒకటి రెండు చిన్న మచ్చలు ఉన్నాయని చాలామంది మంచి అరటిపండును పక్కనపెట్టేస్తుంటారు. పెద్దగా, ఆకర్షణీయంగా కనిపించే అరటిపండే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ పరిమాణం ఒక్కటే నాణ్యతకు ప్రమాణం కాదు. అరటిపండు తాజాగా ఉందా, తొక్క బలంగా ఉందా, ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయా, పండు ఎలా ఉంది అనే విషయాలను కూడా గమనించాలి. చిన్న పరిమాణంలో ఉన్న అరటిపండ్లు కూడా మంచి నాణ్యతతో ఉండవచ్చు. వెంటనే తినాలనుకునేవారు పూర్తిగా మెత్తగా ఉన్న పండ్లను ఎంచుకోవచ్చు. కానీ వాటిని ఇంట్లో కొన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఇది సరైన ఎంపికకాదు. అరటిపండు ఇప్పటికే ఎక్కువగా మెత్తబడి ఉంటే త్వరగా

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీ కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, ఈ వర్షాకాలం మీకు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. సాధారణ రోజుల్లో ఇల్లు చూడటానికి, వర్షాకాలంలో చూడటానికి చాలా తేడా ఉంటుంది. ఏడాది పొడవునా కనిపించని అనేక విషయాలు ఈ సీజన్లో బయటపడతాయి. ప్రాపర్టీ రియల్ క్వాలిటీ తెలుసుకోవడానికి వర్షం ఒక మంచి టెస్టింగ్ టైమ్. దీనికి తోడు ప్రస్తుతం బ్యాంకులు హోమ్ లోన్లపై తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఇల్లు కొనడం ఎంతవరకు బెటర్ అనేది ఈ 4 పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ఇంటి లుక్ ఎంత బాగున్నా, దానికి క్వాలిటీ చాలా ముఖ్యం. వర్షాకాలంలో మాత్రమే బిల్డింగ్ అసలు క్వాలిటీ ఏంటో క్లియర్‌గా తెలుస్తుంది. గోడలు, పై భాగం నుండి నీరు కారడం లేదా తేమ ఉందా అనేది ఈజీగా చెక్ చేయవచ్చు. విండోస్, డోర్స్, బాత్రూమ్లలో తేమ రావడం లాంటి సమస్యలు ఉంటే ఆ ప్రాపర్టీని తీసుకోకపోవడమే మంచిది. అలాగే వర్షం పడినప్పుడు అక్కడ నీరు నిలిచిపోకుండా ప్రాపర్ డ్రైనేజీ సిస్టమ్ ఉందో లేదో సరిచూసుకోవచ్చు. ఇల్లు కొనేటప్పుడు కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్షాకాలంలో చాలా చోట్ల రోడ్లపై నీరు చేరి, విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. బిల్డర్లు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ ఉందంటూ ఎన్నో ప్రామిస్‌లు చేస్తారు. కానీ వర్షం పడితే కానీ ఆ రోడ్ల అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. రహదారులు గుంతలమయంగా ఉన్నాయా, లేదా రాకపోకలకు ప్రమాదకరంగా ఉన్నాయా అనేది ఈ టైమ్‌లోనే సరిగ్గా అంచనా వేయవచ్చు. గతంలో ఆర్బీఐ (RBI) నాలుగు సార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత, చాలా బ్యాంకులు హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను బాగా తగ్గించాయి. దీనివల్ల ఇల్లు కొనాలనుకునే వారికి ఆర్థికంగా

మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు వాటి తాజాదనం, రంగు మాత్రమే చూస్తే సరిపోదు. వాటిపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్ నుంచి కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు అవి తాజాగా, నాణ్యంగా ఉన్నాయా అని మాత్రమే చూస్తాం. కానీ వాటి ఉపరితలంపై దుమ్ము, సూక్ష్మజీవులు, పురుగుమందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది. అందుకే కూరగాయలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడంతో పాటు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. పొలం నుంచి మార్కెట్ వరకు కూరగాయలు అనేక దశల్లో ఇతర పదార్థాలతో సంబంధం కలిగి ఉంటాయి. సాగు సమయంలో ఉపయోగించే పురుగుమందులు, కలుషిత నీరు, రవాణా సమయంలో అపరిశుభ్రత, మార్కెట్లో దుమ్ము, ఈగలు వంటి కారణాల వల్ల వాటిపై కాలుష్యం చేరవచ్చు. కూరగాయలను నేలపై ఉంచడం, శుభ్రత లేని ప్రదేశాల్లో నిల్వ చేయడం, మురికి సంచుల్లో రవాణా చేయడం వంటివి కూడా వాటిపై సూక్ష్మజీవులు చేరడానికి కారణమవుతాయి. సరిగ్గా శుభ్రం చేయని కూరగాయలను తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆహార సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా.. కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నాణ్యమైన వాటిని ఎంచుకోవచ్చు. కుళ్లిన లేదా దెబ్బతిన్న కూరగాయలను కొనకండి. అసహజమైన రంగు ఉన్న వాటిని తీసుకోకపోవడం మంచిది. చాలా ఎక్కువగా మెరుస్తున్న కూరగాయలను జాగ్రత్తగా పరిశీలించండి. కూరగాయలు శుభ్రమైన ప్రదేశంలో ఉంచారా లేదా గమనించండి. కాలువలు, చెత్త కుప్పల దగ్గర విక్రయించే కూరగాయలను వీలైనంత వరకు కొనకండి. ఈగలు ఎక్కువగా వాలుతున్న కూరగాయలను తీసుకోకుండా ఉండటం మంచిది. మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన వెంటనే వాటిని ఒకసారి పరిశీలించి శుభ్రం చేయాలి. శుభ్రమైన ప్రవహించే నీటితో కూరగాయలను బాగా కడగడం ముఖ్యం. ఆకుకూరలను విడదీసి కడగడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము వంటి మలినాలను తొలగించవచ్చు. కూరగాయలను కడగకుండా నేరుగా ఫ్రిజ్‌లో

భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు ఇది పెట్టుబడిగా మారిపోయింది. సంప్రదాయం, భద్రత. పెళ్లిళ్లు, పిల్లల భవిష్యత్తు, పండగల కోసం బంగారు నగలు కొనడం మనకు అలవాటు. కానీ, పెట్టుబడి కోసమే బంగారం కొంటుంటే ఆ బంగారాన్ని నగల రూపంలో కొనవచ్చా? మరి ఇంకెలా కొనాలి? ఇక్కడ తెలుసుకోండి. బంగారాన్ని నగల రూపంలో కొన్నప్పుడు కేవలం బంగారం విలువ మాత్రమే కాదు. దానిలో తరుగు, మజూరీ, డిజైన్ ఛార్జీలు, పన్నులు.. ఇలా చాలా ఖర్చులు కలిసి ఉంటాయి. నగల డిజైన్, కొనే షాపును బట్టి ఈ అదనపు ఖర్చులు భారీగా మారుతాయి. ఉదాహరణకు మీరు కొంత మొత్తానికి బంగారం కొన్నా, మీరు చెల్లించిన పూర్తి మొత్తం బంగారం విలువగా మారదు. తర్వాత ఆ నగలను అమ్మేటప్పుడు, మీరు అప్పుడు చెల్లించిన మజూరీ, ఇతర ఛార్జీలు పూర్తిగా వెనక్కి రాకపోవచ్చు. అందుకే, పెట్టుబడి కోసం కొనే బంగారానికి నగల రూపం అదనపు ఖర్చును తెచ్చిపెడుతుంది. పెట్టుబడి కోసం బంగారం కొనాలనుకునేవారు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు నాణేలు లేదా బిస్కెట్లను కొనడం మంచిది. ముఖ్యంగా నమ్మకమైన అమ్మకందారుల నుంచి నాణ్యతా ధృవీకరణ పత్రంతో (purity certificate) కొనడం చాలా ముఖ్యం. నగల మాదిరిగా డిజైన్ ఖర్చులు ఎక్కువగా ఉండవు కాబట్టి, బంగారం అసలు విలువపై పెట్టుబడి పెట్టడానికి ఇది సహాయపడుతుంది. అయితే, కొనే ధర, అమ్మే ధరకు మధ్య ఉండే తేడాను ముందుగానే గమనించాలి

దోసకాయ చేదుగా ఉందో లేదో కొనేటప్పుడే పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకోవచ్చు. ఇంటర్నెట్ డెస్క్: దోసకాయను సలాడ్, రైతా వంటి వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కొన్ని దోసకాయలు చేదుగా ఉండటం చాలాసార్లు ఇబ్బందిగా మారుతుంది. దోసకాయలో ఉండే కుకుర్బిటాసిన్ అనే సహజ సమ్మేళనం వల్ల చేదు రుచి వస్తుంది. ఇది దోసకాయ రకం, వాతావరణం, సాగు పరిస్థితులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దోసకాయను కోసి రుచి చూడకుండా అది చేదుగా ఉంటుందో లేదో వంద శాతం కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే కొనేటప్పుడు కొన్ని లక్షణాలను గమనిస్తే మంచి దోసకాయను ఎంచుకునే అవకాశం ఉంటుంది. దోసకాయలు కొనేటప్పుడు చాలా పెద్దగా లేదా లావుగా ఉన్న వాటి కంటే మధ్యస్థ పరిమాణంలో ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది. కేవలం పరిమాణాన్ని బట్టి దోసకాయ చేదుగా ఉందని చెప్పలేం. అయితే మరీ పెద్దగా ఉన్న దోసకాయలు ఎక్కువగా పండిపోయి ఉండొచ్చు. వాటిలో గింజలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే సలాడ్ కోసం మధ్యస్థ పరిమాణంలో ఉన్న దోసకాయలను ఎంచుకోవడం మంచిది. తాజా దోసకాయ సాధారణంగా మంచి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. రంగు వెలిసిపోయినట్లు లేదా పసుపు రంగులోకి మారినట్లు కనిపిస్తే అది పాతదై ఉండవచ్చు. కాబట్టి సహజమైన ఆకుపచ్చ రంగులో, తాజాగా కనిపించే దోసకాయలను ఎంచుకోండి. దోసకాయను కొనేటప్పుడు చేతితో మెల్లగా నొక్కి చూడండి. తాజా దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటుంది. నొక్కినప్పుడు చాలా మెత్తగా అనిపిస్తే లేదా సులభంగా లోపలికి వంగిపోతే అది పాతదై ఉండవచ్చు. అలాంటి దోసకాయలను కొనకపోవడం మంచిది. దోసకాయ తొక్కపై నల్లటి మచ్చలు, కోతలు, ముడతలు లేదా ఎక్కువగా ఎండిపోయినట్లు కనిపిస్తే దానిని కొనకపోవడం మంచిది. తాజా

మటన్ షాపుకు వెళ్లి వాళ్లు ఏ మాంసం ఇస్తే అది కొని తెచ్చుకోకండి. మటన్ తాజాదో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. మటన్ కొనేటప్పుడు మాంసం గట్టిగా, మంచి రంగులో ఉందో లేదో చూడాలి. నాణ్యమైన మటన్ ఎర్రగా ఉంటుంది. మాంసం మధ్యలో అక్కడక్కడా తెల్లటి కొవ్వు కణాలు పేరుకుపోయి ఉంటాయి. మాంసం ఉపరితలం గట్టిగా కాకుండా.. జిగురుగా లేదా జారుడుగా అనిపిస్తే దాన్ని కొనకపోవడమే మంచిది. అలాగే, మాంసం నుంచి పుల్లటి వాసన వస్తున్నా వదిలేయండి. రంగు మారడం ఒక్కటే పాడైపోయిందనడానికి గుర్తు కాదు. రంగుతో పాటు చెడు వాసన, జిగురు ఉంటే ఆ మటన్ తినకూడదు. మటన్ షాపులో మాంసం కొంటున్నప్పుడు మటన్‌లోని కొవ్వును గమనించాలి. మంచి మటన్‌లో కొవ్వు తెల్లగా, గట్టిగా ఉంటుంది. మందపాటి కొవ్వు పొర కన్నా, మాంసం మధ్యలో ఉండే కొవ్వు రేణువులు మంచి రుచిని ఇస్తాయి. మంచి మాంసం కొన్నంత మాత్రాన సరిపోదు. దాన్ని ఎలా వండుతున్నారనేది కూడా ముఖ్యమే. కొన్ని లేత భాగాలు త్వరగా ఉడికిపోతాయి. కానీ, గట్టి భాగాలకు (tough cuts) నెమ్మదిగా, ఎక్కువసేపు ఉడికించాలి. అందుకే, 'మంచి మటన్ అయితే వెంటనే ఉడికిపోతుంది' అని అనుకోవద్దు. మటన్ వండడానికి ముందు మారినేట్ చేయడం చాలా ముఖ్యం. మ్యారినేట్ చేయడం వల్ల అది మెత్తగా అవుతుంది. పెరుగు, నిమ్మరసం వేసి మారినేట్ చేయాలి. కొందరు బొప్పాయి తరుగును కూడా వాడతారు. మటన్ ఎప్పుడూ కూడా నమ్మకమైన షాపులో కొనడం, మాంసాన్ని సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేశారా లేదా అని గమనించడం ముఖ్యం