
Prithviraj Sukumaran | టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు అభిమానులతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi). ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి మూవీ లవర్స్‌ను ఎక్జయిటింగ్‌కు లోను చేస్తోంది. ఇందులో మాలీవుడ్ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. వారణాసిలో ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ రోల్‌కు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. సాధారణంగా ఎవరైనా లీడ్ యాక్టర్ జక్కన్న సినిమాకు సైన్ చేశాడంటే.. అది పూర్తయ్యే వరకు మరో సినిమా చేసే చాన్స్ ఉండదు.. కానీ ఆసక్తికర విషయమేంటంటే పృథ్విరాజ్ సుకుమారన్ జక్కన్న రూల్‌ను బ్రేక్ చేసి ఏకంగా వారణాసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయినప్పటి నుంచి ఇప్పటివరకు 9 సినిమాలు పూర్తి చేయడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఓ వైపు వారణాసిని బ్యాలెన్స్ చేస్తూ.. మరోవైపు పృథ్విరాజ్ సుకుమారన్ యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా 9 సినిమాలు చేయడం చాలా అరుదైన విషయమని చెప్పాల్సిందే. జక్కన్న టీం ఫైనల్ టచ్ ఇచ్చే పనుల్లో బిజీగా ఉందని సమాచారం. 3 వారాల ప్యాచ్ వర్క్‌తో మొత్తం షూటింగ్ పూర్తి కానుందట. ఈ క్రమంలో జక్కన్న టీం మూవీ లవర్స్‌కు థ్రిల్ అందించే అప్డేట్స్, ప్రమోషనల్ కంటెంట్ కూడా రెడీ చేస్తుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయన్నట్టు ఇప్పటికే ప్రకటించింది టీం. సెకండ్ పార్ట్ 2029లో వస్తుందని వార్తలు రాగా.. రాజమౌళి టీం రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. 🚨 #VARANASI Update 💥🔥 #PrithvirajSukumaran has officially wrapped his portion of the #Varanasi shoot! 🔥 From the beginning of #SSRajamouli ’s pre-production to today, Prithviraj has completed 9 films as an actor & director! 💥🔥 The team is now in the final stretch, with… pic.twitter.com/byE6i7WiwD — Akhil pfwa kollam (@AkhilJa81337536) September 13, 2026 Indonesia | 240 మందితో వెళ్తున్న పడవ ఇండోనేషియా తీరంలో గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ Low-voltage | నిజాంపేటలో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని రైతుల ఆందోళన Grade-1 Fatty Liver | గ్రేడ్-1 ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి, ఏం చేయాలి..?





