
బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘సైమా-2026’ వేడుకల్లో టాలీవుడ్ చిత్రం ‘మిరాయ్’ సత్తా చాటింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ఫాంటసీ మూవీ ఏకంగా నాలుగు ప్రధాన విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం (మిరాయ్)తో పాటు, తేజ సజ్జా ఉత్తమ నటుడిగా, మంచు మనోజ్ ఉత్తమ విలన్‌గా, కార్తీక్ ఘట్టమనేని ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా పురస్కారాలు అందుకున్నారు. తొలిరోజు తెలుగు, కన్నడ విభాగాల్లో విజేతలను ప్రకటించారు.





