
'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక భారీ మైథలాజికల్ ఫిల్మ్ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దేవతల సైన్యానికి అధిపతి 'కుమారస్వామి' కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. మొదటి నుంచి ఈ మూవీకి 'గాడ్ ఆఫ్ వార్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే తాజాగా మేకర్స్ రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించడం విశేషం.
ఈ భారీ ప్రాజెక్ట్ ను హారిక & హాసిని క్రియేషన్స్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో 'గాడ్ ఆఫ్ వార్', 'దేవసేనాపతి' అనే రెండు టైటిల్స్ ను ఎన్టీఆర్ ఆర్ట్స్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ కోసమే ఈ టైటిల్స్ రిజిస్టర్ చేయించారని అర్థమవుతోంది.
మరి ముందు నుంచి ప్రచారం జరుగుతున్న 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ ను ఫైనల్ చేస్తారా? లేక 'దేవసేనాపతి' వైపు మొగ్గుచూపుతారా? అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. గ్లోబల్ మార్కెట్ టార్గెట్ గా రూపొందనున్న మూవీ కాబట్టి, అన్ని భాషల వారికి ఈజీగా రీచ్ అయ్యేలా 'గాడ్ ఆఫ్ వార్' టైటిల్ వైపే మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది.
Jr NTR, Trivikram, Devasenapathi, God Of War
లక్ష రూపాయలతో తీసిన చెత్త సినిమా, 20 కోట్లు కలెక్ట్ చేసింది.. ఎలాగంటే?
తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ ది హత్యా.. ఆత్మహత్యా!.. ది గ్రేట్ సిబిఐ ఏం చెప్పిందంటే
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.





