
© 2026 nimisham.in


KTR Reacts To Tata Madhu Arrest : సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. తాతా మధును న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని అతని నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కులం పేరుతో పాటు, అసభ్య పదజాలంతో దూషించారని స్పీకర్ ఓఎస్డీ పొలెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను ఉదయం అరెస్టు చేసి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కీలక కామెంట్స్ చేశారు.







