
movie
Inside Movie Profile
© 2026 nimisham.in


ThaTha Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పై వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. తాతా మధును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా.. పోలీసులు తాతా మధును అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కోకాపేటలోని తన నివాసంలో నవీన్ రెడ్డి అరెస్టు చేశారు.