
స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ హీరోగా మరి నటించిన మొదటి మూవీ 'DC'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగష్టు 7న థియేటర్లలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ మూవీ రెండు వారాల్లో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది.
కథలో 'దాస్' పాత్రలో లోకేష్ కనకరాజ్, 'చంద్ర' పాత్రలో వామికా గబ్బి నటించారు. వీరిద్దరి పేర్లలోని మొదటి అక్షరాల కలయికే ఈ 'DC'. లోకేష్ ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేస్తున్నారని తెలిసినప్పుడు మొదట్లో కొందరు అనుమానాలు వ్యక్తం చేసినా, లోకేష్ తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో, రా అండ్ రస్టిక్ యాక్షన్‌తో అందరినీ మైండ్ బ్లాక్ చేశారు,
ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ కావడానికి కారణం కేవలం లోకేష్ క్రేజ్ మాత్రమే కాదు. అరుణ్ మాథేశ్వరన్ మార్క్ కల్ట్ విజువల్స్, వామికా గబ్బి పవర్ఫుల్ యాక్టింగ్, అనిరుధ్ రవిచందర్ అందించిన మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అసలైన ప్రాణం పోశాయి. అనిరుధ్ ఇచ్చిన బిజీఎమ్ థియేటర్లలో సీన్స్ ప్లే అవుతున్నంతసేపు ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది.
ఒక సెన్సేషనల్ ఫిల్మ్‌మేకర్ తన తొలి ప్రాజెక్ట్‌తోనే నటుడిగా ఈ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు. 100 కోట్ల క్లబ్లో చేరి సంచలనం సృష్టించిన 'DC' చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
DC Movie, Lokesh Kanagaraj, Wamiqa Gabbi, Arun Matheswaran, Anirudh Ravichander
'స్పిరిట్' మూవీ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత.!
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com
Disclaimer : All content on this website, including text, images, videos, graphics, and audio, is the intellectual property of ObjectOne Information Systems Ltd. and/or its affiliates. Any unauthorized reproduction, distribution, modification, or publication of this material, in whole or in part, is strictly prohibited without prior written consent from ObjectOne Information Systems Ltd.





