
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Balochistan Independence day Celebrations: పాకిస్థాన్ కు బలూచిస్తాన్ పెద్ద షాక్ ఇచ్చింది. బలూచ్ పాకిస్తాన్లో కలిసినప్పటి నుంచి గత కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక స్వాతంత్య్ర దేశం కోసం అక్కడి వాళ్లు పోరాడుతున్నారు. పాకిస్తాన్లో అరేబియా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం భౌగోళికంగా అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా అపారమైన ఖనిజ నిల్వలు సహా అనేక వనరులకు కీలక స్థానం. అయినా.. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు.. పాక్ పాలకులు.. ఇక్కడ వనరులను వాడుకుంటూ ఇక్కడి అభివృద్ది చేయడాన్ని విస్మరించారు. మొత్తంగా వనరులను పంజాబ్ ప్రాంత అభివృద్ధికే వెచ్చించారు. అంతేకాదు అక్కడి ప్రజలను సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తూ వచ్చింది పాక్. పైగా చైనా పాకిస్తాన్ ఆర్ధిక నడవాకు ఈ ప్రాంతం అత్యంత కీలకం. పైగా అక్కడ నిర్మించే ప్రాజెక్టుల్లో పనిచేయడానికి స్థానికంగా కాకుండా చైనాతో పాటు పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రాంతాల నుంచి పని చేయడానికి మనుషులను తీసుకురావడం వంటి కారణాల్లో అక్కడి ప్రజలు రగిలిపోయారు. దీంతో చైనా పోస్టులపై దాడికి కూడా తెగపడ్డారు.
బలూచ్ పై పాకిస్తాన్ నరమేధం.. మొత్తంగా ఎన్నో యేళ్ల అణచివేత, నరమేధాన్ని తట్టుకోలేక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.. స్వంతంత్రం ప్రకటించుకుంది. బలూచ్ నాయకుడు మీర్ యార్ బలోచ్.. పాకిస్థాన్ నుంచి వేరుగా బలూచిస్థాన్‌ను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. జాతీయ గీతంగా మచుకీన్ బలోచానీ , బలోచీ ఫాలూస్ ను కరెన్సీగా ఖరారు చేశారు. 85శాతం పైగా భూభాగంపై బలూచ్ సైన్యం నియంత్రణ ఉందనేది సమాచారం.
అంతర్జాతీయ సమాజాం మమ్మల్ని గుర్తించాలి.. .
తాజాగా బలూచ్ వేర్పాటువాది సోమవారం స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. తనను "బలూచిస్తాన్ రిపబ్లిక్"గా గుర్తించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. Xలో పెట్టిన ఒక పోస్ట్‌లో, బలూచ్ నాయకుడు మీర్ యార్ బలూచ్, తాము ఇప్పుడు ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడ్డమన్నారు. ఇతర దేశాలత పాటు అంతర్జాతీయ సమాజం తమను పాకిస్తానీ ప్రావిన్స్‌గా పరిగణించవద్దని కోరారు. "మా భూమి నుండి క్యాన్సర్ లాంటి పాకిస్తాన్‌ను తొలగించేందుకు బలూచిస్తాన్ ప్రజలకు నైతిక మద్దతు కొనసాగించాలని ఓ ప్రకటనలో తెలిపారు.
పాక్ కు అండగా అమెరికా, చైనా.. అయితే బలూచ్ నాయకుల ప్రకటనను పాకిస్తాన్ గానీ, అంతర్జాతీయ సమాజం గానీ గుర్తించలేదు. పైగా పాకిస్తాన్‌కు ఓ వైపు అమెరికా, మరోవైపు చైనా అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలూచ్‌ను సెపరేట్‌గా దేశంగా గుర్తించడానికి ఈ దేశాలు అంగీకరిస్తాయా అనేది చూడాలి. బలూచిస్తాన్ అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రావిన్స్‌గా మాత్రమే గుర్తింపు ఉంది. అయితే, గత నెలలో, తిరుగుబాటు బృందాలు ఈ ప్రాంతంలో అధిక భాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
అంతర్జాతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలిపిన బలూచ్ వీరులు..
"బలూచిస్తాన్ గణతంత్ర స్వాతంత్ర్య సందేశం"లో, ఈ బృందం బలూచిస్తాన్ సమస్యను ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చినందుకు అంతర్జాతీయ మీడియా సంస్థలకు, ముఖ్యంగా భారతదేశానికి ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. బలూచిస్తాన్ ప్రజలకు నిరంతర అంతర్జాతీయ నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాంత స్వాతంత్య్రాన్ని గుర్తించాలని ఆయా దేశాలను కోరింది. అంతేకాదు ఈ రోజు నుండి బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ ప్రావిన్స్‌గా పిలవడం, రాయడం లేదా ప్రస్తావించడం మానేయాలని కోరారు. దానిని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించి పత్రికల్లో రాయాలని కోరారు.
కొత్తగా విదేశాంగ..రక్షణ.. ఆర్ధిక వ్యవహారాలు.. ఇక బలూచ్.. విదేశాంగ విధానం, రక్షణ, ఆర్థిక వ్యవహారాలు, రాజకీయాలు, విదేశాలతో దౌత్యానికి బలూచిస్తాన్ బాధ్యత వహిస్తుందని కూడా ఈ బృందం పేర్కొంది. పాస్‌పోర్ట్‌లు, కరెన్సీ, మీడియా సంస్థలు, వాణిజ్య సంస్థలు సహా ఇతత దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాలను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. బలూచ్ రాజకీయ నాయకత్వంలోని వివిధ వర్గాలను ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
బ్రిటిష్ పాలన ముగింపు నాటి సంఘటనలతో తమ స్వాతంత్ర్య వాదన ముడిపడి ఉందని మీర్ యార్ బలూచ్ అన్నారు. ఆ ప్రకటన ప్రకారం, బ్రిటిష్ ఇండియా విభజనకు కొద్ది రోజుల ముందు, 1947 ఆగస్టు 11న బలూచిస్తాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. ఆనాటి సంఘటలనకు గుర్తుగా స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం వరకే పరిమితం కాకుండా, అంతర్జాతీయ గుర్తింపు పొందడంపై దృష్టి సారించామని ఆ బృందం తెలిపింది. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్, ఆఫ్రికన్ యూనియన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, యూరోపియన్ దేశాల వంటి సభ్య దేశాలు తమ దేశానికి మద్దతు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఆ ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిరోధించడానికి పాకిస్తాన్ అధికారులు భద్రతా చర్యలు తీసుకుంటున్నారని బలూచ్ బృందం ఆరోపించింది. బలూచిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో మొబైల్‌తో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా కలత్, క్వెట్టా, ఖుజ్దార్తో సహా పలు ప్రాంతాల్లోని సైనిక కంటోన్మెంట్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ కందకాలు తవ్వారని కూడా వారు తెలిపారు. పాకిస్తాన్ సైనిక విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు ఆ ప్రాంతమంతటా నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్ మాత్రం బలూచ్ తమ ఆధీనంలోనే ఉందని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





