
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ నుంచి వచ్చిన ఒకే ఒక్క పోస్టర్ సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠను రేపింది. కొద్ది నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తాజాగా ఒక క్రైప్టిక్ పోస్టర్‌ను వదిలారు. డార్క్ బ్యాక్‌డ్రాప్‌లో కేవలం ‘37’ అనే నంబర్‌ను మాత్రమే చూపిస్తూ విడుదల చేసిన ఈ లుక్, అభిమానుల్లో సరికొత్త చర్చకు తెరతీసింది. ఈ ‘37’ వెనుక ఆంతర్యం ఏమిటనే





