మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర పంచాయతీ కార్యాలయంలో వినూత్న నిరసన జరిగింది. ప్రాంతంలో వీధి కుక్కల బెడదను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు యువసేనా జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రంధావే కొత్తగా నిరసన తెలిపారు. సంచుల్లో తెచ్చిన 4-5 కుక్కపిల్లలను ఏకంగా చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భమ్రే టేబుల్‌పైనే వదిలేశారు. వీధి కుక్కల వల్ల స్థానికులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు కేవలం టెండర్ల ప్రక్రియపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. అధికారుల తీరుకు నిరసనగా నోట్ల దండ కూడా వేశారు. తక్షణమే వీధి కుక్కలకు స్టీరిలైజేషన్ చేపట్టకపోతే మళ్లీ కుక్కలతో ఆఫీస్‌కు వస్తామని హెచ్చరించారు.#Nashik, #Maharashtra, #YuvaSena, #StrayDogMenace, #ViralVideo, #UniqueProtest, #Niphad, #TeluguNews, #TrendingNews, #BreakingNews





