
పెద్దముడియం-జంగాలపల్లె రహదారి పక్కన ఉన్న కేసీ కాలువలో గాంధీజీ బోటు నిలిపిన ప్రాంతమిదే... పెద్దముడియం, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో రాయలసీమకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1921లో బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ పెద్దఎత్తున సాగాయి. ఈ ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, తిలక్‌ స్వరాజ్‌ నిధికి విరాళాలు సేకరించడం, వెనుకబడిన వర్గాల స్థితిగతులు, హక్కుల కోసం చైతన్యం తేవడానికి అప్పట్లో దేశవ్యాప్తంగా గాంధీజీ విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా మహాత్మా గాంధీ కర్నూలు, కడప జిల్లాల్లోని కేసీ కాలువలో బోటు ద్వారా ప్రయాణించారు. గాంధీజీని చూసేందుకు వేలాది మంది ప్రజలు కాలువ గట్టుకు తరలివచ్చారు. పడవ ప్రయాణం సాగుతున్నంత దూరం కాలువకు ఇరువైపులా నిలిచి ‘మహాత్మా గాంధీకీ జై’ అంటూ నినదించారు. చరిత్ర పుటల్లో కేసీ కాలువ ప్రయాణాన్ని ఒక చిరస్మరణీయ అధ్యాయంగా పేర్కొంటారు. గాంధీ ప్రయాణంలో వైఎస్సార్‌ కడప జిల్లా పెద్దముడియం-జంగాలపల్లె రహదారి పక్కన మోరీ వద్ద బోటు నిలిపి అక్కడున్న ఓ గదిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




