
తిరుమలకు వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ‘బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు రోజుకు 15,000 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ఆ తర్వాత వచ్చే వాహనాలను చెక్‌ పాయింట్ల వద్ద నిలిపేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని తిరుమలకు వచ్చే ప్రైవేట్‌ వాహనాల సంఖ్యపై ఈ తరహా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు’ అని పేర్కొంది.




