
నడుము చుట్టుకొలత అనేది పొత్తికడుపులోని కొవ్వుకి, ఇన్సులిన్ నిరోధకత, షుగర్, హై కొలెస్ట్రాల్, గుండెజబ్బుల వంటి వాటిని గుర్తించడంలో హెల్ప్ చేస్తుంది. ఓ వ్యక్తి బరువు పెరగగానే బెల్లీ చుట్టూ కొవ్వు పెరుగుతుంది. ఇది మెటబాలిక్ రిస్క్‌ని పెంచుతుంది. సాధారణంగా రోజురోజుకి ఇండియాలో ఊబకాయం పెరిగిపోతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం , నడుము సైజ్ అనేది BMI చెప్పని ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చెబుతుంది. కాబట్టి, వేయింగ్ మెషిన్ కంటే నడుము చుట్టుకొలత చాలా ముఖ్యం. ఈ చుట్టుకొలత వల్ల ఫ్యాట్ ఎంత ఉంది, షుగర్, గుండె సమస్యల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందా అని తెలుసుకోవచ్చు. ఫ్యాట్ అందరి బాడీల్లో ఒకేలా స్టోర్ అవ్వదు. కొంత కొవ్వు చర్మం కింద పేరుకుపోతుంది. అయితే విసెరల్ ఫ్యాట్ అనేది లివర్, ప్రేగులు వంటి అవయవాల చుట్టూ పొత్తికడుపు లోపల లోతుగా పేరుకుపోతుంది. విసెరల్ ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, వాపు, రక్తంలోని లిపిడ్ల అసాధారణతలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో చక్కెరని నియంత్రణలోకి తీసుకురావడానికి శరీరానికి అది మరింత అవసరం అవుతుంది. రోజులు పెరిగేకొద్దీ గ్లూకోజ్ పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్కి హార్ట్ ప్రాబ్లమ్స్‌తో కూడా సంబంధం ఉంది. సాధారణ శరీర బరువు ఉన్న వ్యక్తికి కూడా టైప్ 2 డయాబెటిస్, హై కొలెస్ట్రాల్ , గుండె సమస్యలు ఎందుకు వస్తాయో ఇది వివరిస్తుంది. వైద్యపరంగా BMIకి ఓ స్థానం ఉంది. ఇది బరువుని ఎత్తుతో కంపేర్ చేస్తుంది. కానీ, ఆ బరువులో ఎంత మజిల్, ఫ్యాట్ ఉందో చూపించదు. కొవ్వు ఎక్కడ స్టోర్ అయిందో కూడా చూపించదు. అందుకే, ఓ వ్యక్తి ఎక్కువగా బెల్లీ ఫ్యాట్‌తో ఉన్నప్పటికీ సన్నగానే కనిపించొచ్చు. మన బాడీలో ఎప్పటికీ మార్పులు జరుగుతూనే ఉంటాయి. వయసు పెరగడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాల పరిమాణం తగ్గొచ్చు. అదే సమయంలో బెల్లీ ఫ్యాట్ పెరగొచ్చు. బాడీలోని కొవ్వు నిష్పత్తి మారినప్పటికీ మొత్తం శరీర బరువు దాదాపు స్థిరంగానే ఉండొచ్చు. ఎక్కువసేపు కూర్చుని, తక్కువ వర్కౌట్ చేస్తూ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, చక్కెర, కొవ్వు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకునే వారిలో ఇది కనిపిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం సమస్యని మరింతగా పెంచుతుంది. మనలో చాలా మంది సరైన వర్కౌట్స్ చేయరు . అలానే పోషకాహారం తీసుకోరు. అలా కాకుండా మన ఫుడ్‌లో కేలరీలు మాత్రమే కాకుండా పీచు పదార్థం, ప్రోటీన్, ఇతర అవసరమైన పోషకాలు తక్కువగా ఉండేలా తీసుకోవాలి. ఫ్యాట్, సాల్ట్, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకుపోదు. బరువు దాదాపు స్థిరంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న నడుము చుట్టుకొలత, ముఖ్యంగా రక్తంలో చక్కెర, రక్తపోటు లేదా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదలతో పాటుగా ఉంటే డాక్టర్ సహాయం అవసరం. వెయిస్ట్ లైన్ పెరగడం మొత్తం మెటబాలిజం హెల్త్‌ని పూర్తిగా పరిశీలించడానికి ఓ కారణంగా చూడాలి. ఇది మొత్తంగా షుగర్, గుండె సమస్యల గురించి చెప్పదు. మనం సరైన లైఫ్‌స్టైల్ లీడ్ చేస్తే అంటే రెగ్యులర్ వర్కౌట్, మంచి నిద్ర, కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్, పప్పు ధాన్యాలు, తగినంత ప్రోటీన్, లో ప్రాసెస్డ్ పుడ్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి సాయపడతాయి. అదనపు కొవ్వుని తగ్గిస్తూనే కండరాలని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. తక్కువ తిని వెయిట్ చెక్ చేసుకుంటే సరిపోదు. వయసు పెరిగేకొద్దీ స్ట్రెంథ్ ట్రైనింగ్ ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. ఇప్పటికే షుగర్, ఫ్యాటీ లివర్, హైబీపి, కొలెస్ట్రాల్, స్లీప్ ఆప్నియా ఉన్నవారికి, బెల్లీ ఫ్యాట్ పెరిగితే అలర్ట అవ్వాలి. నిజానికీ బరువు అనేది ఆరోగ్యం విషయంలో ముఖ్యమైన విషయం. కానీ దానిని విడిగా చూడొద్దు. ఒకే బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులు కండరాలు, చర్మం కింద ఉండే కొవ్వు, అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వు చాలా భిన్న పరిమాణాల్లో ఉండొచ్చు. నడుము చుట్టుకొలత అనేది మన బరువు సరిగ్గా ఉన్నా నడుము చుట్టుకొలత పెరుగుతుంటే వారికి అధిక ప్రమాదం ఉంటుంది. ఓ వ్యక్తి బరువు ఎంత అనేది మాత్రమే ఆందోళన కలిగించే విషయం కాదు. కొవ్వు ఎక్కడ నిల్వ ఉంది. శరీర నిర్మాణం ఎలా మారుతోంది అనే విషయాల్ని గమనించాలి. పెరుగుతున్న వెయిస్ట్ లైన్‌తో పాటు రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్‌లో మార్పులు కనిపిస్తే దానిని సీరియస్‌గా తీసుకోవాలి. వేయింగ్ మెషిన్ మీ బరువు ఎంత ఉందో చెబితే ఆ బరువు మెటబాలిక్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో మీ వెయిస్ట్ లైన్ చెబుతుంది. ముఖ్య . కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.