
అసెంబ్లీలో గత ఐదు రోజులుగా నడిచింది ప్రజాస్వామ్య సభ కాదని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడిన కుమ్మక్కు నాటకమని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్అయ్యారు. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీజేపీ గొంతు నొక్కేందుకు ప్రభుత్వం మైకులు కట్ చేయిస్తూ అసెంబ్లీని తప్పుదోవ పట్టించిందన్నారు.





