
న్యూఢిల్లీ : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఐదో సీజన్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. ఈ సీజన్‌కు సంబంధించిన క్రికెటర్ల వేలాన్ని కొచ్చి వేదికగా అక్టోబర్ 28న నిర్వహిస్తామని తెలిపింది. ఐదు ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్ల జాబితాను సమర్పించేందుకు ఈ నెల 28 వరకు గడువు ఇచ్చింది. మరోవైపు వచ్చే ఏడాది ఐపీఎల్ ఆటగాళ్ల వేలాన్ని భారత్‌లో నిర్వహిస్తామని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. గత మూడేండ్లుగా మెగా లీగ్ వేలానికి విదేశీ (దుబాయ్, జెడ్డా, అబుదాబి) వేదికలు ఆతిథ్యం ఇచ్చాయి. ఈసారి స్వదేశంలోనే వేలం జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు లీగ్‌లో చర్చనీయాంశంగా మారిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై పునరాలోచన చేస్తున్నట్లు చెప్పారు.




