
ఇంటర్నెట్‌ డెస్క్: పాకిస్థాన్‌, చైనా కలిసి ఏర్పాటు చేసిన సరిహద్దు సంయుక్త కమిషన్‌ను భారత్‌ తోసిపుచ్చింది. ఆక్రమణలో ఉన్న భారత భూభాగానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఆ కమిషన్‌కు ఎలాంటి చట్టపరమైన ప్రాతిపదిక లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లో జరిగిన పాకిస్థాన్-చైనా సరిహద్దు సంయుక్త కమిషన్ మొదటి సమావేశం అనంతరం ఈమేరకు స్పందించింది. ‘‘ఈ విషయంలో మా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. పాకిస్థాన్, చైనాల మధ్య సరిహద్దు లేదు. ఈ సంయుక్త కమిషన్‌ను తిరస్కరిస్తున్నాం. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమే. 1963 నాటి చైనా-పాకిస్థాన్‌ సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎన్నడూ గుర్తించలేదు. అది చట్టవిరుద్ధమని, చెల్లదని చెబుతూనే ఉన్నాం’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ స్పష్టం చేశారు. హూతీల దాడి.. ఖండించిన భారత్‌ ‘‘ఆక్రమిత భూభాగాల స్థితిని మార్చేందుకు, చట్టవిరుద్ధమైన ఆక్రమణను క్రమబద్ధీకరించేందుకు చేసే ప్రయత్నాలను ఖండిస్తూనే ఉంటాం. మా భూభాగాలకు సంబంధించి చైనా, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు సహకారం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి చేష్టలకు బదులు.. తన ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను పాకిస్థాన్‌ తక్షణమే ఖాళీ చేయాలి’’ అని రణ్‌ధీర్ జయస్‌వాల్‌ డిమాండ్‌ చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.